అద్దాలు అనేకం!

 saif
1
కధల పుస్తకాలు ఎంత అందంగా ఉంటాయో బేషరం
కొన్ని ఎర్రని పెదాలుగా కొన్ని నల్లని కాటుక కళ్ళు గా  5 <3
*
2
మనసు అద్దం లాంటిది అంటారు బేషరం 
అద్దాలు చాలా రకాలు ఉంటాయ్ మరి 5 <3
*
3
ఈ రోజు సెలవు తీసుకున్నట్లుంది  బేషరం 
జాబిల్లి ఆకాశం లో కనిపించలేదు 5 <3
*
4
ఊహలకు రెక్కలు తొడిగించారు మనుషులు. బేషరం 
స్తనాలు రవికలు తొడిగించడం ప్రారంభించినప్పటినుంచి 5 <3
*
5
పెద్ద పెద్ద మీసాలుంటేనే మగతనమా ? బేషరం
పిరికి బొద్దింకలకు కూడా ఉంటాయ్ మరీ 5 <3
*
6
మొండితనం ఎవరికెంత ఉందో తెలిసిపోతూనే ఉంటుంది
బేషరం పడగ్గదుల్లో 5 <3
*
7
తీసి పారేసే చెత్తాచెదారం లా మారిపోతాయి
బేషరం పడగ్గదుల్లో ఇష్టమైన దుస్తులు అభరణాలు అన్నీను5 <3
*
8
బాధ్యతలు పంచుకోవడం ఎంత బాగుంటదో బేషరం
ఒకరు హుక్స్ పెట్టుకుంటే మరోకరు తీసే బాధ్యతలా 5 <3
*
9
క్లాసు రూములో వెళ్ళి పడుకుంటారు కొంతమంది
బేషరం అది పడగ్గది అని మర్చిపోతుంటారు 5 <3
*
10
నిన్న ఒక తెలివైన వాడిని చూసాను బేషరం
ఈ రోజు అతను మోసపోయిన విషయం తెలిసింది 5 <3
*

మీ మాటలు

 1. Suparna mahi says:

  అలోచించి ఆగే కొన్ని సందర్భాల్ని అతి సునాయాసంగా అందమైన అక్షరం చేస్తారు భాయ్ మీరు… బ్యూటిఫుల్…💐

 2. saif ali syed says:

  గౌరవ ఎడిటర్లకు బేషరం శుక్రియాజ్ . అనుకోకుండా తో మొదలై ఇప్పుడు అనుకోని నా మీద వెన్నెల కురిపించే సుదూర జాబిల్లికి కూడా Hugs

  • kothapalli ravibabu says:

   స్త్రీలను ఉపమానాలుగా చిత్రించిన కవితలు చదివి చదివి విసుగెత్హి పోయింది. మరలా మీరు కూడానా . సామాజిక సమస్యల పై చక్కని కవితలు రాయగలిగిన సైఫ్ ఇల్లాంటి వాటి పై అభిరుచి చూపించడం బాగులేదు.

 3. satyanarayana says:

  సైఫ్ అలీ సయెద్ గారూ ,
  ఒక మాటేమయినా miss అయిందా ? ( “పడగ్గది కాదని ,మర్చిపోతుంటారు , అని ఉండాలా ?)
  లేక ,మీ దృష్టిలో , తరగతి గదులన్నీ ,”నిద్రపో ” తగినవే ! అనా?
  నాకు సరిగా అర్ధం కాలేదా ?
  9
  క్లాసు రూములో వెళ్ళి పడుకుంటారు కొంతమంది
  బేషరం అది పడగ్గది అని మర్చిపోతుంటారు 5 <3

మీ మాటలు

*