యీ టెక్ నాగరికతలో మనం…!

rafi1

Art: Rafi Haque

 

-విజయ్ కోగంటి

~
మనం వెతికి మరీ దాక్కున్న గుహలు
ఆధునిక రూపాల్లో
మనలనే అనుక్షణం మూయడానికే చూస్తున్నాయి
మనం వేటాడేందుకు నూరుకున్న పాత రాతి కత్తులు
మన మాటల్లోనే  క్షణక్షణం
నిశ్శబ్దంగా పదును తేలు తున్నాయి.

అపుడెపుడో ఆకలితో స్వార్ధసమూహాలుగా
విడిపోయిన మనం
కొంగ్రొత్త ఆకళ్ళతో
ఇంకొన్ని సమూహాలుగా
విడి పడుతూనే వున్నాం

అవసరావసరానికీ భయపెట్టి
వాడుకు విసిరేసే నాగరికతలో
ఆరితేరుతూనే వున్నాం

మనలోని కొందరు మృగాలై పోయిన విషయాల్నీ
మననే లక్ష్యంగా బతుకుతున్న నిజాల్నీ
పంచభూతాల్నీ విషంగా మార్చుతున్న రహస్యాల్నీ
మన నీడకు సైతం మనుగడ తుడిచే విషాదాల్నీ
తేలికగా మరుస్తూ నడుస్తూనే వున్నాం.

రెండు కాళ్ళమీద నడవడమే
నాగరికతలో నవీనత్వం అనుకున్నాం కదా!

నాలుగు నుంచీ రెండుకు
కూతల నుంచీ మాటలకు
ఆకులు చుట్టుకోడంనుంచీ
అందాలు అమ్మిందాకా
ఎదుగుతూనే వస్తున్నాం

అసూయను కొలిచే ‘ఆప్’ నో
బాధల్ని సహించే ‘బార్ కోడ్’ నో
మాత్రంసృష్టించలేకున్నాం.
‘మొబైల్’ సుఖాల వరదల్లో
ఆప్యాయతల పలకరింపును
‘డిలిట్’ చేస్తూనే వున్నాం.

నడుద్దాం ఇంకా ముందుకు
మరో జాతి వచ్చి మనల్ని తుడిచేసిందాకా
ఇలాగే హడావుడిగా, కృత్రిమంగా, అసహజంగా…

*

మీ మాటలు

  1. J.V.Ramana says:

    Truths ar always bitter. Excellent థాట్స్ by Dr Vijay Koganti. Everyone has To think a while where we are going . Dr .Vijay ‘s thoughts are heart touching . …regards Ramana jandhyala

  2. చాలా సెటైరికల్ గా యాప్ట్ గా..పదునుగా…తళతళలాడే కత్తి అంచులా…సూటిగా చేరవలసినది చేరవలసిన చోటుకి చేరిపోయింది…అభినందనలు..విజయ్ గారు..😊

  3. V.V.L.N.S.Prasad says:

    సోదరా, మన మనఃస్థితి పట్ల వైరాగ్యం లా అనిపించే నీ ఆవేదన మనసున్న పాఠకుడిని స్థబ్ధత నుంచి బయటకు తెస్తుంది . అభినందనలు. – ప్రసాద్

  4. Akella Ravi prakash says:

    Teesukunna Vastavu chala నూతనమైంది
    Meeru rase saili kuda simple

    Evolution
    Lose of values
    Destruction caused by mobiles and internet
    Ivanni teesukuvachina conflict
    Alienation

    Oka pedda kavyam anta canvas lo
    Rasaru
    Too good

    • Vijay Koganti says:

      రవి ప్రకాష్ గారు
      ధన్యవాదాలు మీ పరిశీలనకు, అభినందనలకు

  5. THIRUPALU says:

    మానవ ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు !

  6. Suparna mahi says:

    సెటైరికెల్ గా అనిపించినా మనసు లోపలి లోతులకి హత్తుకునేలా చెప్పిన మీ చక్కని శైలి అద్భుతం సర్…

Leave a Reply to Sarala Mohan Cancel reply

*