విమానం పద్యాలు  

 

mandira

Art: Mandira Bhaduri

 

 

 

-ఆకెళ్ళ రవి ప్రకాష్ 

~

 

1

ఆకాశంలోకి ఎగురుతూ విమానం

పాటలోకి ఎగురుతూ నేను.

 

2

నను ఇంత దగ్గరగా చూసి

విస్తుపోయిన మేఘాలు

 

3

ఆకాశంలో ఒకడే చంద్రుదు

సముద్రం మీద వేల లక్షల చంద్రుళ్ళు

 

4

వీధి దీపాల్ని మెళ్ళొ వేసుకొని

మాయద్వీపంలా వెలుగుతూ నగరం

తళుకులీనుతూ పైన పాలపుంత

మధ్యలొ తేలుతూ నేను

 

5

ఉచితంగా నాతో

ఫ్రయాణిస్తున్న ఒక సాలీడు

 

6

మహా నగరాన్ని

నిమిషంలో దాటిన విమానం

నా కలల్ని దాటి కూడా పోగలదా?

 

7

వర్షంలోంచి

వర్షంలోకి

కప్పలా దూకిన విమానం

*

మీ మాటలు

 1. Venkata Murali says:

  Sir… Excellent.. Meeru adbhuthamaina kavi..

 2. దాట్ల దేవదానం రాజు says:

  రవిప్రకాష్ విమానంలో ప్రయాణం చేయడం లేదు. ప్రయాణాన్ని కవితామయం చేస్తున్నారు. మేఘాలతో సంభాషిస్తూ కింది నగరాల్ని పలకరిస్తూ సముద్రంలో ఈదులాడుతూ సాంద్రమైన కవిత్వం కోసం మనసులో అక్షరాల్ని నాటుకుంటూ అనుభూతి పొందుతూ ఆనక విమాన పద్యాలుగా మనకి ప్రయాణ అనుభవాన్ని పంచుతున్నట్లుగా ఉంది కవిత

 3. జీవితంలోంచి కవిత్వంలోకి దూకిన అనుభవాలు.

  మంచి కవితావాక్యాలు సర్.

 4. Suseela says:

  Babu, chaala bagundi vimaanam poem, very simple but sweet, inkaa boledu raayali nuvvu, akka

 5. బాబు
  కవిత చాలా బావుంది. ఎన్నో సార్లు విమానంలో ప్రయాణించా గాని ఇంత మంచి ఇమాజినేషన్ హాట్స్ ఆఫ్! ఇందిరక్క

  • akella raviprakash says:

   Thank u Bujji
   Neeku college lo poetry lo first prize ravadam naku rayadaniki ఇన్స్పిరేషన్

 6. M.V.Chakradhar says:

  ఉచితంగా నాతో
  ప్రయాణిస్తున్న సాలీడు…

  రవి ప్రకాష్ గారూ…
  మహాకవి ఇస్మాయిల్ గారు గుర్తుకొచ్చారు… ఎంత హాయిగా రాసారు.. విమాన ప్రయాణంలా…

  ముక్కామల చక్రధర్

 7. Akella Ravi prakash says:

  Chakradhar thank u very much

 8. Akella Surya Padmini says:

  Since childhood u r a surprise to me Babu how come ur poetry be so touching and an easy flowing one God bless u ra

  • Akella Ravi prakash says:

   So much unconditional love given to me by my sister’s and family may be the reason for my poetry to be simple and touching
   As doctor ur helping poor patients is no less than poetry padma

 9. Vijay Koganti says:

  ఆకాశం నుంచి అందమైన ఇమేజెస్ . అభినందనలు

 10. Ratna Pavani says:

  గుడ్ వన్

మీ మాటలు

*