అమ్మ కడుపు చల్లగా..

damayanti

 

 

శనివారం –  ఒకపూట భోజనమే కాబట్టి, పెద్ద వంట పనేమీ లేదులే! ఆయనొక్కడికీ  ఇంత,  – చారెడు పెసరప్పేసి,  ఒక టొమోటా పడేస్తా. రెండు బంగాళ దుంపలు వేయించి జీలకర్ర కారం జల్లి విస్తట్లో వడ్డించానంటేపిచ్చి మా రాజు  సంతొషం గా తిని లేస్తాడు. అక్కడితో అయిపోతుంది.

తనకా? ఆ, తనదేం లెక్కనీ? ఏం తింటే సరిపోదనీ? తనకేమైనా స్పెషల్స్ కావాలా ఏవిటీ?

అయినా! కొత్తగా తిరగమూతేసిన మాగాయి వుందిగా! ఇంకానేమో , గోంగూర – పళ్లమిరపకాయలేసి నూరిన పచ్చడుంది, సున్ని పొడుంది. నిన్నటి పెరుగుంది, ఇవాళ్టిదీ వుంది అబ్బో! చాలు చాలు. ఇంకెందుకూ, కూరలు నారలు?

ఇక రాత్రికంటావా, మిగిలిన ఇడ్లీ పిండి –  నాలుగు ప్లేట్లొస్తాయి. అంటే పదహారు ఇడ్లీలు. పది ఆయనకి, ఆరు నాకు అక్కడితో చెల్లు.   గుల్ల శనగపప్పు,  పచ్చి కొబ్బరి చిప్ప వేసి పచ్చడి నూరుతా.  చక్కరకేళీలున్నాయి గా! తలా ఒకటి నోట్లో వేసుకుని పడుకుంటే తెల్లారుతుంది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు.  ఇహ ఇవాళ్టికి  పెద్ద వంట హడావిడేం లేనట్టేలే..’ అనుకుంటూ జానకి –  పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది.

దీపం వెలిగిస్తూ – ఒకసారి, అష్టోత్తరం  చదువుతూ –  మరోసారి, పాలు, బెల్లం ముక్క నైవేద్యం పెడుతూ ఇంకొక సారి – ఇలా – పూజలో ప్రతి ఘట్టంలోనూ..  ఆ రోజు  చేయఖర్లేని వంట గురించే ఆలోచించింది.

‘యానికానిచ పాపానిచ ..’ కళ్ళు మూసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి..నాలుగు అక్షింతలు తల మీద జల్లుకుని, ‘నాయనా, ఏడుకొండలవాడా! ఎక్కడ్లేని ఆలోచన్లు నీకు పూజ చేసేటప్పుడే వస్తాయెందుకు తండ్రీ?.. క్షమించు క్షమించు..’ అంటూ చెంపలేసుకుంది. ఆ పైన  సాష్టాంగ నమస్కారం చేసుకుని, పూజ గదిలోంచి బయటకొచ్చింది.

మరో సారి ఫిల్టర్ కాఫీ తగిలిద్దామా?, లేక ఆయనొచ్చేదాకా అగుదామా? అని  సందేహపడుతుండగా..అప్పుడు..అప్పుడు వినిపించింది  “అమ్మా” అనే పిలుపు. ఎంత ప్రియమైన స్వరం. ప్రాణాలు కదిలినట్టౌతుంది, ఆ పిలుపెప్పుడు విన్నా ఆమెకి.

ఆ రెండక్షరాలలోనే కదా మరి సృష్టి జనియించబడింది. అందుకే అంత పరవశమేమో మాతృమూర్తికి.

ఆ గొంతు వినీవింటమే –   ఒక్క అంగలో చెంగున వరండాలోకి వచ్చింది.

కొడుకు – వంశీ!  లోపలకొస్తూ కనిపించాడు. “మా నానే, వచ్చావురా కన్నా?!..” అంటూ ఆనందంగా  ఎదురెళ్ళి,  అతన్ని  చేతుల్తో చుట్టేసుకుంది.

చేతిలో బాగ్ కిందపెట్టి, తల్లి బుజాలు చుట్టూ చేతులేస్తూ  ‘ఎలా వున్నావమ్మా? ఆరోగ్యం బావుందా?” అడిగాడు.

“బాగున్నాం రా ! మాకేం? బ్రహ్మాండంగా వున్నాం.”  అంటూ ఏదో గుర్తుకొచ్చినదాన్లా, రెండడుగులు వెనక్కేసి – “ఎప్పుడొచ్చావు, వూళ్ళొకి?” అడిగింది.

“వారమైంది విజయవాడకొచ్చి. పనైపోంగానే ఇటే వస్తున్నా. అమ్మా, ఆకలేస్తోందే..” – పొట్ట మీద అర చేత్తో రాసుకుంటూ గారాలు పోయాడు.

ముఫైఐదేళ్ళ కొడుకు ఆ క్షణం లో ఆ తల్లి కంటికి మూడేళ్ళ వాడిలా కనిపించాడు. దేవుడికి  – మనం కూడా అలానే కనిపిస్తుంటాంట. అమ్మ దేవుని ప్రతినిధి కదా!

ఎంత పెద్దవాడైనా, ‘అమ్మా ఆకలి ‘ అని అడిగే బిడ్డ –  తల్లి కళ్ళకెప్పుడూ పసివాడుగానే కనిపిస్తాడు.

‘అయ్యొ, అయ్యో, నా మతి  మండిపోను.  రా.. రా! ముఖం  కడుక్కుని రా!  చేసిన ఉప్మా  వుంది.  తిని, కాఫీ తాగుదువు గానీ..” అంటూనే, ఒక్క గెంతులో వంటింట్లోకి పరుగు తీసింది.

పెరట్లో బావి దగ్గర బట్టలుతికే నల్ల రాయి మీద కుర్చుని, అమ్మ పెంపుడు బిడ్డైన పెరటి తోటని ఆనందంగా చూస్తూ.. బ్రష్ చేసుకుని వచ్చాడు.

వంటింటి గుమ్మా నికెదురుగా  కుర్చీ పీటేసుకుని కుర్చున్నాడు.  ఎదురుగా – తులసి కోట లో గుచ్చిన    అగరు ధూపం గాల్లోకి మెలిక తిరిగి,  గాల్లో  మాయమౌతూ  చక్కటి పరిమళాల్ని విరజిమ్మి పోతోంది.  మందారాలు తురుముకున్న తులసమ్మ అచ్చు అమ్మంత పవిత్రం గా కనిపిస్తోంది.

” ఇదిగో ముందు  ఉప్మా తిను.”  అంటూ ప్లేట్ చేతికిచ్చింది. వెండి పళ్ళెం లో బొంబాయి రవ్వ ఉప్మా!  దోరగా వేగిన జీడిపప్పులతో, కర్వేపాకు ఘుమాయింపుతో  తెగ నోరూరించేస్తోంది.  కొత్తావకాయ గుజ్జు, దాన్లోంచి ఊరిన వెల్లుల్లి రెబ్బ, వూటా, నూనె కలిసిన చిక్కటి ద్రవం  గుజ్జులోకి కలిపి, చెంచాలోని ఉప్మాకి పట్టించి, నాలుగు నిముషాల్లో  మొత్తం ఉప్మా అంతా  లాగించేసాడు.

తింటున్నంత సేపూ ఎప్పుడూ ఏదో ఒకటి వాగే కొడుకు – కళ్ళు దించుకుని అదే పనిగా ఉప్మా తింటుంటె..చూస్తున్న ఆ తల్లి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి.

‘పిచ్చి వాడు. ఎంత ఆకలి మీదున్నాడు! ఎప్పుడనగా తిన్నాడొ, ఏమిటో! ఈ కాంపుల ఉద్యోగం కాదు కానీ, వాడికి సరైన తిండీ నిద్రా రెండూ కరువైపోయాయి.

‘ ఆ సిటీ వొద్దు, ఆ వుద్యోగమూ వొద్దు.  వచ్చి హాయిగా  మాతో బాటు  వుండరాదురా? ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకు బ్రతుకుదువుగానీ’ అని చెప్పి చూసింది.

ఒక నవ్వు నవ్వి మిన్నకుండిపోతాడు తప్ప, జవాబు చెప్పడు. అయినా కోడలికి ఇష్టముండదని కూడా తెలుసు కానీ, పైకి అనదు. అది ఆమె సంస్కారం.

కళ్ళొత్తుకుంటున్న తల్లిని క్రీగంట గమనిస్తూనే వున్నాడతను.

మనకోసం అలా కంట తడిపెట్టే వాళ్ళు వుంటం చాలా అదృష్టం. కానీ ఆమె అలా కన్నీటిలోనే ఆనందిస్తుందని తెలిసి, చేరువగా నిలవడం ఇక్కడి విచిత్రం.

ఎంత బావుంది. ఉత్తి ఉప్మా.  మెత్తగా, వెన్న విచ్చుకున్నట్టు,  అప్పుడే కాచిన నేతి సువాసనతో, తింటుంటే జీడిపపప్పులు పంటికింద కమ్మటి రుచిని పెంచుతూ..నంజుకున్న ఆవకాయ కారం కారంగా పుల్ల పుల్ల గా..జిమ్హ్వ లూరుతూ రుచినిఊరిస్తూ..గుటక గుటకకీ మధ్య కొత్త రుచులు రేపుతూ..

అబ్బ ఏం కాంబినేషన్లే!

నీరజ కూడా ఉప్మా చేస్తుంది. కానీ, వేగని ఆవాలు ఎసట్లో ఉబ్బి, పచ్చిమిరప కాయ వేగకపోవడం వల్ల నాలిక మీద ఒకసారి అలా మండి,  కర్వేపాకు పచ్చి వాసన తేలి,  జీడిపప్పు మెత్తబడిపోయి,  నీళ్లతో రవ్వ – అనుపానం కాకపోవడం వల్ల .. ఉప్మా  ఉండలు కట్టి తింటున్నప్పుడు చెంచా తో అన్నీ తీసి పక్కన పెట్టె వ్యర్ధ పదార్ధాలౌతాయి. అందులో ఉప్మా రుచి తెలిసిన మనసు వెంటనే బుస్సుమంటుంది. -‘ఛ. నీకు ఉప్మా చేయడం కూడా రాకపోతే ఎలా? మా అమ్మ దగ్గర నేర్చుకోరాదూ?’ అని మందలించబోతే, వెంటనే రిటార్ట్. – “ఓహో, ఐతే మీ అమ్మదగ్గరే  వెళ్ళి వుండొచ్చు గా! ఎంచక్కా రోజూ ఉప్మా తినొచ్చు. అమ్మ చేసిన ఉప్మా..” మూతి తో బాటు కనుబొమలు విరుస్తూ ముఖమంతా మొటమొట లాడించుకుంటున్న నీరజ రూపం చటుక్కున కళ్ళ ముందు మెదిలింది.

నిట్టూర్చాడు.

ఇంతలో – సురలకు కూడా దక్కని అమృతపు సువాసన  ముక్కుకి తగలడంతో ఈ లోకంలోకొచ్చి పడ్డాడు.

–   ఫిల్టర్  ఫిల్టర్ పై కప్పులో వేసిన కాఫీ పొడి మీద ప్రెస్సింగ్ డిస్క్ వుంచి, పై నించి మరగ కాగిన నీళ్ళు    దిమ్మరిస్తున్నప్పుడు..అది బుస్సున పొంగి ఆగిపోతున్నప్పుడు..చూసారా?..ఆ కాఫీ డికాషన్ సువాసన!?.. మాటల్లో చెబితే ఫీలింగ్ పోతుంది. ఇదిగో వంశీ లా కళ్ళు మూసుకుని  ఊపిరి పీల్చి, ఆ కాఫీ పరిమళాన్ని గాఢంగా గుండెలకెత్తుకున్నప్పుడు తెలుస్తుంది ‘ ఆహా! ఇలాటి కాఫీ – ఒక్క కప్పు.. కాదు, కాదు.  ఒక్క బొట్టయినా చాలు.   కాలం చేసే జాలాలు తట్టుకుని ముందుకెళ్ళిపోడానికి..’ అని అనుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు కొన్ని క్షణాల సేపు.

“ఆహా.   అమ్మా, మన వంటింట్లో ఇన్నేసి   ఘుమఘుమలెలా సృష్టిస్తావ్?” అన్నాడు తల్లిని ప్రశంసిస్తూ.

నిజానికి ఇల్లాలి సిగ్నేచర్ కి ఒక తెల్ల కాగితం లాంటిది – వంటిల్లు.

అభిరుచికి అమరిక తార్కాణమైతే ,  అద్భుత రుచులకు – లేని ఆకలి రేగడం  ప్రత్యక్ష సాక్ష్యం.

“చాల్లేరా, నీ పొగడ్తలకి పడిపోతాననుకోకు. నువ్వుస్తొన్నావని ఒక్క ఫోన్ కొడితే  నీ సొమ్మేంపోతుందిరా  వంశీ? బిడ్డ వాయిట్లోకొచ్చాడని, నాలుగు రకాల వంటలు చేసి  పెట్టక పోదునా? ఆ?!”

తల్లి ప్రేమని  అర్ధం చేసుకున్న వాడిలా నవ్వి అన్నాడు. “ఇప్పుడు మాత్రం నువ్వు తక్కువ చేస్తావా ఏమిట్లే..’ అంటూ   ఆమె  చేతిలోంచి కాఫీ కప్పుని అబగా అందుకున్నాడు. కప్పులోంచి సొగసుగా చిమ్ముతున్న పొగని  గట్ఠిగా ఆఘ్రాణించి,  మైమరచిపోయాడు.  ఆ తర్వాత – అపురూపం గా ఒక సిప్ తీసుకుని..’ అహా..ఏం రుచి. చక్కటి చిక్కటి కమ్మటి రుచి. అమ్మా! నీకు నువ్వే సాటి. రాలేరెవరూ కాఫీ తయారీలో నీకు పోటీ..’ అంటూ..తన గదిలోకొచ్చి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు-  ఎంతో ఎంతో హాయిగా సేద తీరుతూ.

తెరిచి వున్న కిటికీల్లోంచి పచ్చని తోటని, గాలికి ఊగే పూల రెమ్మల్ని,  బీర తీగకు  పూసిన చామంతుల్ని చూస్తూ… కాఫీ ని పూర్తి చేసాడు.

జానకీ, రామారావు దంపతులకు వంశీ ఒక్కడే కొడుకు. కృష్ణా జిల్లా పామర్రు పక్కన చిన్న గ్రామం. ఆవిడ తెలుగు టీచర్. ఆయన గ్రామ పంచాయితీ లో ఉద్యోగం. కొడుకుని కష్టపడి ఇంజినీరింగ్ చదివించారు.

చాలామంది అనుకున్నట్టు ఇంజినీర్లందరకీ   –  పెద్ద పెద్ద జీతాలుండవు.  వంశీ కూడా ఆ కోవకు చెందినవాడే. హైదరాబద్ లో నీటిమోటార్లు తయారు చేసే ఒక ప్రైవేట్ కంపెనీలో మర్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. వృత్తి రీత్యా, టూర్లు తిరుగుతుంటాడు.  ఆఫీస్ పని మీద  విజయవాడ కి వచ్చినప్పుడు  అక్కడ పనులయ్యాక, వెంటనే తల్లి దగ్గరకొచ్చి వాలి,  ఒక పూటుండి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతుంటాడు.

రిటైరైన తల్లి తండ్రుల్ని తన దగ్గర వుంచుకుని బాధ పెట్టటం అతనికి ఇష్టం వుండదు. ఎందుకంటే, వీళ్ళిప్పుడున్నంత రిచ్ గా వుండదు తనుంటున్న అపార్ట్ మెంట్.  ఈ పచ్చని లోగిలి, స్వచ్చమైన గాలి, వెలుతురు ముందు –  తన ఫ్లాట్  ఏ పాటిది? తమ బాల్కనీ కుండీలో ముళ్ళ మొక్క కూడా ఏపుగా పెరగదు. కొన్ని వాతావరణాలు అలాంటివి.

నీరజ  నీడలో కూడా అంతే. – మరో మనిషి ఆనందం గా వుండలేడు. కారణం ‘ఇది’ అని ఎంచి చూపేంత నేరాలుండవు. అలా అని పట్టించుకోకుండా హాయిగా బ్రతికేంత మంచి తనాలు కనిపించవు.

సమాజం లో చాలామంది తప్పు చేసి  తప్పించుకు తిరుగుతున్న వారిలానే,  కుటుంబం లోనూ  బాధ్యతల నించి తప్పించుకుని, తాము చాలా కరక్ట్ అని చలామణి అయే స్త్రీలూ వున్నారు.

పెళ్ళైన ఈ పదేళ్ళల్లో అమ్మా నాన్నలు  ఏ రెండు సార్లో, మూడు సార్లో తనింటికి వచ్చినట్టు గుర్తు. నెల రోజుల కని వచ్చి వారమైనా కాకముందే..’మేం వెళ్తాం రా కన్నా’అన్నారు. ‘అప్పుడేనా’ అన్నట్టు చూసాడు. ‘ ప్లీజ్ మమ్మల్ని వదిలేయి రా! మా పాలి మేం బ్రతుకుతాం హాయిగా ‘ అని వేడుకుంటున్న భావం చదివాడు వాళ్ళ చూపుల్లో. అప్పుడే అర్ధమైంది తనకి  – తన భార్య వ్యక్తిత్వం ఎలాటిదో అని.

అయినా అమ్మ ఒక్క పొర్లుమాటయినా చెబుతుందా కోడలి మీద!? – ఊహు. చెప్పదు. పైగా తను ఎక్కడ బాధపడతాడోనని.. ‘కొన్నాళ్ళు పోనీరా..అమ్మాయి శుభ్రంగా మనలో కలిసిపోతుంది’ అంటూ ఊరడిస్తుంది తల్లడిల్లుతున్న మనసుని.

కొంతమందిని కలిసినప్పుడు, పోయిన శ్వాస తిరిగొస్తుంది. మరికొంతమందితో కలిసి నడుస్తున్నప్పుడు బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది.

తను చేసినబొమ్మల్లోనే ఇంత  తేడానా ? – అని దేవుడెప్పుడూ విస్తుపోడా?

గంధపు  చెట్టు – తనని చుట్టుకున్న –  పాముకైనా, తన నీడన కుర్చున్న పరమ పురుషునికైనా ఒకేలా పరిమళలాలను పంచుతుంది.

తన ఇంటి కల్పవృక్షం – అమ్మ కూడా  అంతే.

తన నించి అమ్మ ఏమీ కోరుకోదు. ఆ అవసరమే లేదు.  తను కనిపిస్తే చాలు. తను ఈ ఇంట్లో అడుగుపెడితే చాలు..ఇలా గదిలో విశ్రాంతి తీసుకుంటూ..ఇదిగో..ఈ మెత్తని పరుపు మీద నిద్రలోకి జారిపోతుంటే..అమ్మ శబ్దం లేకుండా వచ్చి చూసి, తలుపులు దగ్గరకేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ భోజనం సమయం వరకు తనని నిద్ర లేపదు.’ – నవ్వుకుంటూ మెల్ల మెల్లగా గాఢ నిద్రలోకి జారిపోయాడు.

*****

వీడు చెప్పా పెట్టకుండా వచ్చేస్తాడు తుఫాన్లా. సాయంత్రం చీకటి పడుతుండగా ప్రయాణమై వెళ్ళిపోతాడు. ఈ ఒక్క పూట. ఏం వండాలి ఇప్పుడు. ఏం కూర చేస్తే బావుంటుంది?

కూరల బుట్ట చూసింది. ఒక పెద్ద గట్టి దోసకాయ కనిపించింది. వంటింటి కిటికీ లోంచి ఒక చూపేసి గాలించింది పెరటి తోటని. ఏపుగా నవనవలాడుతూ పెరిగిన  తోటకూర మొక్క – మనిషంత ఎత్తు లో  మంచి ఏపుగా ఎదిగి వుంది.

ఇంకేం, అనుకుంటూ – గబగబా వెళ్ళి, ఒక మొక్క మొక్క బలంగా పెరికి తీసుకొచ్చింది. ముదురాకు వొలిచి  పంపు ధార కింద కడిగి, నీళ్ళు వోడ్చే బుట్టలో వేసి, గోడకి వారగా వుంచింది.

తోటకూర కాడ  చివర వేరు కట్ చేసి, కత్తి పీట తో నాలుగు ముక్కలు గా తరిగింది. ఆ పై, మందమైన చక్రలు గా  తరిగి,  తరిగిన ముక్కల్ని నీళ్ళల్లో వేసింది.

రెండు కుంపట్లంటించి, ఒక దాని మీద మందపాటి ఇత్తడి గిన్నెలో  రెండు గరిట్ల కంది పప్పు వేసి, దోరగా కమ్మటి  సువాసన వచ్చేదాకా వేయించి,  సరిపడ నీళ్ళు పోసి, మూత పెట్టింది.

మరో కుంపటి మీద గిన్నె లో ఎసరు పోసి, అందులో ఒక చుక్క నూనె బొట్టేసి, చిటికెడు ఉప్పు రాల్చి, బాగా మరిగాక – కడిగి, వార్చిన బియ్యం వేసి, గరిటతో నాలుగు వైపులా తిప్పి, మూతేసింది. అన్నం ఉడుకుపట్టగానే – కుంపటిని అటు ఇటూ కుదిపి, గిన్నె చుట్టూ వున్న బొగ్గుల్ని లాగేసి, సన్నసెగ చేసింది.

కత్తి పీట ముందు కుర్చుని, ముందుగా దోసకాయని నిలువుగా రెండు చెక్కలు చేసింది. ఒక దాని మీద పెచ్చు తొలగించి, గింజ  తీసి లావాటి ముక్కలు తరిగి గిన్నెలోకేసుకుని, పసుపు జల్లింది.

రెండో చెక్క చిన్న చిన్న ముక్కలుగా తరిగి చిన్న జాడిలో వేసి, పసుపుతో బాటు సరిపడ ఉప్పు కారం  వేసి పక్కన పెట్టుకుంది. నానబెట్టుకున్న ఆవాలతో బాటు, ఓ ఎండు మిరపకాయ  జోడించి  రోట్లో వేసి బండ తో నూరింది. మెత్తగా అయిన ఆ మిశ్రమాన్ని దోసకాయ  ముక్కలకి పట్టించి, పచ్చి ఆవ  నూనె వేసి నాలుగువైపులా కలియదిప్పి మూతేసింది.

పప్పు గిన్నె ఒక సారి చెక్ చేసింది.  సగం బద్ద ఉడకగానే, దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాముక్కలు వేసి కలిపి మూతేసింది.

అన్నం వుడికి, అడుగున బంగారు వన్నెలో పొర చుట్టుకుంటున్న సువాసన గుప్పు మంది. క్షణమైనా ఆలస్యం చేయకుండా  గబుక్కున గిన్నె కిందకి దింపి, దాని చుట్టూ నీళ్ళు చిలకరించింది. చుయ్..చుయ్ మంటూ రాగాలు తీసింది అన్నం గినె.  మూత అయినా  తీసి చూడకుండానే తెలిసిపోతుంది ఆమెకి. తడి లేకుండా అన్నం ఉడికిన సంగతి.

వంటలకి స్పర్శ వుంటుంది. అది మనసు పెట్టి చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ భాష చాలా అర్ధమౌతుంది.

ఖాళీ అయిన  కుంపటి మీద  మూకుడు వేసి, నూనె వేడయ్యాక బూడిద గుమ్మడొడియాలు, ఊరినమిరపకాయలు, వేయించి తీసింది.  అదే నూనెలో నాలుగు మెంతి గింజలు, ఆవాలు ఎండుమిరపకాయ ముక్కలు, వేసి, అవి వేగాక – జాస్తి ఇంగువ పొడి జల్లి, బుస్సుమని పొంగగానే..  పప్పు గిన్నెలో తిరగమూత బోర్లించి మూతేసేసింది.

mannem

చిత్రం: మన్నెం శారద

అదే మూకుట్లో – పోపు వేయించి,  అందులో – సన్నగా తరిగి,  బిరుసుగా వుడికించి  వార్చిన తోటకూర ముద్దని వేసి, కలియబెట్టింది. తడి ఇంకగానే అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లెల్లి రెబ్బల ముద్ద చేర్చి, కలియబెట్టి దింపేసింది. చల్లారాక గుమ్మడికాయ వడియాలని చేత్తొ నులిమి  కూరలో కలిపింది.

ఒక రెండు కప్పుల అన్నాని చల్లార్చి, నిమ్మకాయ పిండి, జీడిపప్పు, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాలు, వేయించిన పోపు పెట్టి, సన్నగా తరిగిన కొత్తిమీర జల్లింది.  పుల్లటి పులిహోర సిధ్ధం.

లేత సొరకాయ తెంపుకొచ్చి, మజ్జిగ పులుసు కాచింది.

జాడీలోంచి తీపి ఆవకాయ తీసి వుంచింది.

మట్టి కుండలో తోడేసిన పెరుగు, నీళ్ళలో ముంచిన మామిడి రసాలు, వీట్నన్నిట్నీ –  వేటికవి విస్తట్లోకి వివరంగా  అమర్చేందుకు వీలుగా బౌల్స్ , వడ్డించడానికి  స్పూన్లూ, గరిటెలు, బౌల్స్  సిధ్ధం చేసుకుంది.

అలా బావి గట్టు చివరికల్లా వెళ్ళి, మూడు అరిటాకులు కోసుకొచ్చింది. ఆకుపచ్చటి పత్రాలని తడి బట్టతో శుభ్రం చేస్తుంటే –

భర్త వచ్చాడు. “ ఏవిటీ!!వీడొచ్చాడేమిటీ?” అని,  ముసిముసిగా నవ్వుకుంటూ  అడిగాడు.

“అవును. వచ్చాడు. ముందు గదిలో బాగ్ చూసి అడుగుతున్నారా? ” అని అడిగింది,   మంచి నీళ్ళందిస్తూ.

“కాదు. వంటింట్లోంచి ..వీధి వరకు వంటలు ఘుమాయిస్తుంటే అనుకున్నాలే..” సరసమాడాడు.

వంశీ గదిలోంచి బైటకొచ్చాడు.  తండ్రి తో కాసేపు కుశలమాడి, స్నానం చేసొచ్చాడు.

పొద్దున ఉప్మా కుమ్మేయడం తో – ఇక ఆకలి వేయదనుకున్నాడు. కానీ, వంటింట్లో అలా పరిచిన వంటకాలు చూసే సరికి  ఆవురావురుమంటూ ఎక్కడ్లేని ఆకలి పుట్టుకొచ్చేసింది.

చేసే వంటల రుచిని బట్టి ఆకలేస్తుంది. తినాలని మనసు ఉవ్విళ్లూరుతుంది.

జీవితమైనా అంతే.-  భాగస్వామి ప్రెమానురాగాల అభివ్యక్తీకరణలో జీవితం ఒక సంపూర్ణతని సంతరించుకుంటుంది. అయుష్షు తీరిపోతున్నా, ఇంకా బ్రతుకులోని మాధుర్యాన్ని గ్రోలాలనిపిస్తుంది. కాదూ?

అరిటాకు మధ్యలో అన్నం, చుట్టూ రకరకాల పదార్ధాలు, కొసరి కొసరి వడ్డిస్తూ అమ్మ. పక్కనే కూర్చుని, కబుర్లాడుతూ నాన్న.

ఇలా పీట మీద కుర్చుని, ప్రేమ విందు ఆరగించడానికి ఎంత  పుణ్యం చేసుకు పుట్టాలి?

“అమ్మా! నెయ్యి ఇప్పుడే కాచినట్టున్నావ్? గోగు అట్టిపెట్టావా నాకోసం? అరటి గెలేసిందన్నావ్ మగ్గేసారా? తోటకూర కాడల కూర చాలా బావుంది, ఆవ పెట్టావు కదూ? అబ్బ!  దోసావకాయ ఘాటు అంటింది. మజ్జిగ పులుసు నువ్వు చేసినంత అద్భుతం గా నేనెక్కడా తిన్లేదమ్మా! నిజం. ఒట్ట్టు. ఏవో పప్పులు నానేసి రుబ్బుతావు కదూ. నీరజ కి చెప్పాను. ఉత్తి శనగపిండి మాత్రమే కాదు, అమ్మ ఇంకేవెవో ఇం గ్రీడియంట్స్ కలుపుతుందని. ఒక సారి ఫోన్లో చెప్పకూడదూ? మీ కోడలికి. కుండలో పెరుగు ఎంత తీయగా వుందో..మామిడి రసం తో కలిపి తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరం అని అంటారు చూడు..అలా వుంది..”

భోజనం చేస్తున్నంతసేపూ..తన వంట గురించి మాట్లాడుతున్న కొడుకు మాటలకి, పొగడ్తలకి, అతను పొందుతున్న ఆనందానుభూతులకి ఆమె కడుపు నిండిపోతోంది. అతడిలో బాల్యపు వంశీ  మురిపెంగా చూస్తూ వుండిపోయింది.

ఇంత తక్కువ సమయం లో ఏం వంటలు వండి చేసి పెడతానా, భోజనాల వేళకి అందుతాయా లేదా అనుకుంది కానీ, కొడుకు ఒక్కోపదార్ధాన్ని వర్ణించి వర్ణించి చెబుతుంటే..’హమ్మయ్యా! నాలుగు రకాలు చేసానన్నమాట?’ అనుకుంది తృప్తిగా.

నిజమైన తల్లి చూపెప్పుడూ పిల్లల సంపదల మీద వుండదు. పిల్లల సంక్షేమం మీద వుంటుంది.

నిజమైన పుత్రులకు కూడా అమ్మ చూపే చాదస్తపు ప్రేమల మీద కోపం వుండకూడదు. దాని వెనక అంతరార్ధం ఏవిటో కనుక్కొని వుండాలి.

ఇది మనసు కు చెందిన ప్రత్యేకమైన లిపి. రహస్యం గా రాసి వుండే ఒక భాష. కన్న తల్లి ఆంతర్యం కన్న కొడుక్కి మాత్రమే అర్ధమౌతుంది. అయితె, అమ్మ అంటె ఏవిటో అర్ధం తెలిసిన పుత్రులకు మాత్రమే.

అలా..వంశీ   తల్లి మనసుని  పూర్తిగ చదివి తెలుసుకున్నాడు.

భోజనాలు చేసి లేచే సరికి, రెండున్నరైంది.

ఆమె వంటిల్లు సర్ది హాల్లోకొచ్చి కుర్చుని, పిచ్చా పాటి మాట్లాడుకుంది కొడుకుతో.

ఏడింటికి బస్ బయల్దేరుతుందని చెప్పడం తో…లేచి లోపలకొచ్చింది జానకి.

భర్తని పిలిచి, యాభై గట్టి అరటి పళ్ళని పాక్ చేయించింది. దొడ్లో పండిన కూరల పంటంతా కలిపి పది కిలోల పొట్లం కట్టిపెట్టింది.

రెండ్రోజుల కిందట చేసి డబ్బాలో పోసిన కారప్పూస జిప్ లాక్ కవర్లో పోసింది. ఓ పాతిక కొబ్బరి లౌజుండల్ని మరో పాకెట్ లో వేసింది.

వీటన్నిట్నీ రెండు పెద్ద సంచుల్లో వేసి, జిప్ వేసి,  కొడుకి చేతికందించింది.

ఇప్పుడివన్నీ ఎందుకమ్మా అంటూనే..’కారప్పూస మంచి వాము  వాసనేస్తున్నాయి.  బావుంది’ అన్నాడు.

జానకి తనలో తాను నవ్వుకుంది. కొడుకు మాటలకి.

మధ్యాహ్నం హెవీ లంచయ్యిందని ఏమీ తిననన్నాడు. కానీ, ఆమె బలవంత చేసి దిబ్బరొట్టె తాజా వెన్న లో అద్ది, వెల్లుల్లి కారప్పొడితో కలిపి తినిపించింది.

అమ్మ చేతి ముద్దు కాదనలేకపోయాడు. బస్సు ప్రయాణం వేడి చేస్తుందంటూ కవ్వంతో చిలికిన చిక్కటి మజ్జిగ లో పంచదార పొడి, ఇలాచి పొడి వేసి, చిటికెడు ఉప్పు రాల్చి కలిపి స్వీట్ లస్సీ చేసి అందించింది.

ఖాళీ గ్లాస్ అక్కడ పెడుతూ..ఇక వెళ్ళేందుకు లేచాడు.

‘రెండు ఆపిల్స్ ఇవ్వనా మధ్య రాత్రి ఆకలేస్తుందేమో..’ అంటున్న తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఏమీ వద్దమ్మా అన్నట్టు తలూపాడు. అమ్మ ముఖం లోకి..కళ్లల్లోకి..చూస్తుండిపోయాడు.

 

ఏదో చెప్పలేని అద్వితీయమైన భావం అతని మూగవాణ్ణి చేస్తోంది. ఇంత గా తనని ప్రేమించే అమ్మ వుండటం ఒక వరం. ఒక దైవానుగ్రహం. కానీ తిరిగి ఏమిస్తున్నాడు?..ఏమివ్వలేడు. తను ఇవ్వగలిగేవన్నీ ఆమెకి తృణ ప్రాయం. ఆశించని లంచం. ఇలా వండి పెట్టుకోవడం లో ఆవిడ పొదుతున్న అపురూపమైన ఆనందం ముందు అవన్నీ బలాదూర్.

అందుకే వస్తుంటాడు..అమ్మని సంతోష పెట్టటం కోసం.

అఫ్కోర్స్. విందు ఎలానూ వుంటుంది. అమ్మని అంత ఆనందంగా చూడటమూ విందే కదూ?

నిన్ననే ఎండీ తో మాట్లాడాడు. కొత్త రాష్ట్రం లో బ్రాంచ్ ఓపెన్ చేస్తే కంపెనీ లాభాలు పుంజుకుంటుందని.  గుంటూరు, విజయవాడకొచ్చేస్తే..అమ్మని చూడ్డానికి తరచూ రావొచ్చు.

“ఏమిట్రా అలా చూస్తున్నావ్? పిచ్చి వాడిలా?” కొడుకుని నవ్వుతూ అడిగింది.

“ఏం లేదమ్మా..మళ్ళీ ఏ రెండు వారాలకో కానీ రాను కదా.. తనివితీరా చూసుకుంటున్నా..నిన్ను, నీ ప్రేమని..” అంటూ వొంగి, ఆ ఇద్దరి పాదాలనూ స్పృశించాడు కళ్ళకద్దుకున్నాడు.

“అమ్మాయిని అడిగానని చెప్పు. పిల్లలు జాగ్రత్త. ఈసారి సెలవులకి అందరూ కలిసి రండి..”

బస్సులో ప్రయాణిస్తున్న వంశీకి ఇంకా తల్లి మాటలు వినిపిస్తూనే వున్నాయి.

వంట చేసి అమ్మ శ్రమ పడుతుందని పూర్తిగా తెలుసు. కానీ అది ఆమె శ్రమ అనుకోదు. పైగా తన కష్టన్నంతా… కొడుక్కి వడ్డిస్తున్నప్పుడు పొందే ఆనందంలో మరచిపోతుంది. ఆమె ఆనందమే తనకి ముఖ్యం.

తను బ్రతికున్నంత వరకు కొడుక్కి కంచంలో అన్నం పెట్టుకోవాల్నఏ చాలా సామాన్యమైన కోరిక ఎంత విలువైనదో…ఎందరికి  తెలుస్తుంది?

**********

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. RaVee Chaitanya says:

  చానా బాగుంది. చదువుతుంటే మా అమ్మే కనపడింది.

  • ఆర్.దమయంతి. says:

   చైతన్య గారు! ధన్యవాదాలండీ!

  • సుజల says:

   కధ బాగుంది ఇది కధ కాదు అమ్మ మనసు. కానీ ఎంత పల్లెటూర్లైనా నలభై ఏళ్ళ క్రితమే గాస్ పొయ్యిలు వచ్చేసాయి.కుంపట్ల్ల మీద వంట అని రాసారు. అమ్మ ఏం వండినా పిల్లలకు అపురూపమే.కొడుకులే కాదు కూతుళ్ళు కూడా అమ్మచేతి వంట ఆనందంగా ఆతృతగా తింటారు. వాళ్ళు తింటున్నప్పుడు ఆ తృప్తి వేరు.కానీ నా మొగ పిల్లలకు ఈ ప్రాబ్లం లేదు.కోడళ్ళు పంజాబీలైనా అన్నీ నేర్చుకుని కమ్మగా నా కొడుకులకు వండి పెడతారు.ఒక్క టమాటా పచ్చడి మాత్రం నేను చేసినట్లు రాదని గొడవ పెడతారు.కోడళ్ళు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు బచ్చలి కూర పులుసు,మజ్జిగ పులుసు చెయ్యమని రొట్టలేసుకుని తింటారు.

 2. Kamma gaa … Haayigaa …kallu tadi tadi gaa…

  • ఆర్.దమయంతి. says:

   అమ్మ మీద మీకెంత ప్రేమ!
   ధన్యవాదాలు అహల్య గారు.

 3. sasikala says:

  కధ అంటే ఇలా అని ఏవో రూల్స్ చెపుతుంటారు . ఇవేవి ఇక్కడ గుర్తుకు రాలేదు నాకు .
  అమ్మ ప్రేమకు ఒక్క బొట్టు నూనెతో తాలింపు వేసి వడియాలతో వడ్డించారు .
  చిత్రం భాష కూడా చక్కగా కుదిరింది . ఒక్క బౌల్స్ అని వ్రాయకుండా గిన్నెలు
  అని వ్రాసి ఉంటె మనసు అక్కడ కూడా కధ ఫ్లో లో ఉండేది . మిధునం లాగా ఇలాటి
  కధలు జీవితాన్ని జీవించాలి అనుకునే వాళ్ళ కోసం ఉండాలి . చాలా బాగుంది

  • ఆర్.దమయంతి. says:

   ‘మిధునం లాగా ఇలాటి
   కధలు జీవితాన్ని జీవించాలి అనుకునే వాళ్ళ కోసం ఉండాలి .’
   ఎంత గొప్ప మాట!
   బహు ధన్యవాదాలు మీకు శశికళ గారు.

 4. satyanarayana says:

  కని,విని ,ఎరిగినవి అంటూ ,మొదటి వారమే అద్భుతంగా రాశారు .
  కథలో చాలా వాక్యాలు ( ఉదాహరించలేనన్ని ) ఇంగ్లీష్ లో “Quotes ” అంటారే అలా ఉన్నాయి .
  తల్లి ప్రేమానురాగాలు , ఎదిగిన పిల్లల బ్రతుకు పోరాటాలు ,వివిధ వ్యక్తిత్వాల వ్యత్యాసం ,అన్నీ
  ఈ చిన్న కథానికలో ప్రతిధ్వనించాయి .
  ప్రత్యేకంగా పాక శాస్త్రంలో మీకు doctorate ఇవ్వాలి .
  మీకు నేనయితే నూటికి నూరు మార్కులిస్తాను .

  • ఆర్.దమయంతి. says:

   “ప్రత్యేకంగా పాక శాస్త్రంలో మీకు doctorate ఇవ్వాలి .”
   ఇక క్షణం కూడా ఆలస్యం చేయదలచుకోలేదు. తీసేసుకున్నా. :-)
   మీ అమూల్యమైన అభిమానానికి ఇవే నా
   హృదయపూర్వక కృతజ్ఞతలు సత్యనారాయణ గారు!

 5. దమయంతి గారు..
  మీ కధ చదివాను అనటం తప్పు…జానకి గారి ఇల్లు చూసాను…తన శనివారంప్రొద్దున తన స్వగతం విని నవ్వుకున్నాను..అంతేగా ఎవరైనా తను తన భర్త కి వండేదానిలో కూడా భర్తకి రెండు కూరలు తనకేమీ లేకపోయినా. ఉన్నది కొంచెమైనా ..ఎంతైనా సరిపోతుంది.అదే జానకమ్మ గారు పూజ చేసినపద్దతిత చాలా మంది చేసేదే..😊కానీ తన బాబు వచ్చాక ఆమె చేసిన వంటల గురించి మీరు రాసారనలేను…..మా ముందుకొచ్తి విస్తర్ల ముందు నోరూరించాయి…ప్రతి పనిలోనూ తన ప్రేమ శ్రద్ద కనబడ్డాయి. కోడలి గురించి కూడా కంప్లైంట్ లేని చల్లని తల్లి జానకమ్మ. ..కొడుకుకి చేసిపెట్టుకోడం ఆమెకెంతానందం ఇస్తుందో ప్రతి అక్షరం లో చూడగలిగాను. కొడుకు నిస్సహాయత…తల్లి మీద..తను ప్రేమతో చేసినవి ఎంతో ఆనందిస్తూ తినడం ద్వారా తల్లికి ఆనందం కలుగచేయడం కన్నా వేరేమీ చేయలేని కొడుకు…వెళ్లేపుడు పాకింగ్ ఇవన్నీ నాకు కనిపించిన మా కుటుంబాలలో కొందరు అమ్మల్ని గుర్తుకుతెచ్చింది..వంటల గురించి వివరణ కొంచెం ఎక్కువైనా అసలామాటే గుర్తురానంత కమ్మగా నోట్లో నీరూరించేలా. కధ చదువుతుంటే కనులలో నీరుబికేలా మీ కధకాని ప్రేమకధ ఉంది…చాలా ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందీ కధ…ధన్యవాదాలు..దమయంతి గారు ..

  • ఆర్.దమయంతి. says:

   “చాలా ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందీ కధ…”
   – చాలా థాంక్స్ రా సరళా.
   సమీక్షలు రాసిన అనుభవం ఇక్కడ ప్రస్ఫుటం గా కనిపిస్తోంది.
   పెద్ద కామెంట్ – ఎంత బాగా నచ్చిందో తెలుసా !
   :-)

 6. తల్లి మనసు ని అరిటాకు లో పెట్టి వడ్డించారు. వంశి కి పొట్ట నిండింది. మాకు మనసు నిండింది

  • ఆర్.దమయంతి. says:

   నా గుండె నిండిపోయిందండీ, మీ ప్రశంసలతో.
   :-)
   నెనరులు.

 7. స్వాతీ శ్రీపాద says:

  దమయంతీ

  ఒకసారి ఎవరి మనసును వాళ్ళ ము౦దుకు తెచ్చినట్టుగా ఉంది కధ కానికధ. నిజమే ఏవా రోజులు? నాలుగు వంటలు వండుదామన్నా తినేవారు ఏరీ?
  తల్లీ బిడ్డల అనుబంధం చక్కగా చూపారు.
  ఐ లవ్ యూ , ఈ లవ్ యూ టూ అని మాటల్లో కాకుండా మన జీవన సరళిలో ఉన్న ప్రేమ ఈ తరానికి తెలియజెప్పేలా ఉంది మీ కధా, కధనం కూడా

  లవ్ యువర్ స్టొరీ

  • B.Prathapkumar Reddy says:

   దమయంతి గారూ!
   మీ కధని ఇప్పుడే చదివాను..అమ్మ మీద రాసే కధలెప్పుడూ బాగుంటాయి,,ఎవరు రాసినా కూడా… అమ్మ మనసు లాగా … మీరు రాస్తే మరింత బాగుంటుంది … అమ్మ మనసుకి,అమ్మ ప్రేమకి ప్రత్యామ్న్యాయం ఎలా లేదో…మీ రచనా శైలి కి కూడా అంతే..నేను ప్రతి సారీ ఇదే చెప్తుంటాను..మరలా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ..మీ కధనం అంత బాగుంటుంది…మీ శైలి లోని ప్రత్యేకత ఏమిటంటే చాలా వాక్యాలు కొటేషన్స్ లానే ఉంటాయి..”ఎంత పెద్దవాడైనా, ‘అమ్మా ఆకలి ‘ అని అడిగే బిడ్డ – తల్లి కళ్ళకెప్పుడూ పసివాడుగానే కనిపిస్తాడు.”….”మందారాలు తురుముకున్న తులసమ్మ అచ్చు అమ్మంత పవిత్రం గా కనిపిస్తోంది.”….”నిజానికి ఇల్లాలి సిగ్నేచర్ కి ఒక తెల్ల కాగితం లాంటిది – వంటిల్లు.”…”కొంతమందిని కలిసినప్పుడు, పోయిన శ్వాస తిరిగొస్తుంది. మరికొంతమందితో కలిసి నడుస్తున్నప్పుడు బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది.”…మచ్చుకి మాత్రమే వీటిని ఉదహరించాను….ఇలాంటి వాక్యాలు చాలా కనిపిస్తాయి మీ కధల్లో…ఈ సారి ఈ కధలో వంటింటి ఘుమఘుమల్ని కూడా బాగా దట్టించారు…అప్పుడే భోజనం చేసిన మనిషికి కూడా,వెంటనే మరొక సారి భోజనం చేస్తే బాగుండును అని అనిపించేంతగా… చిన్న కధ అయినా ‘అమ్మమనసు’ని చాలా బాగా ఆవిష్కరించారు..మీ నుంచి మరెన్నో మంచి మంచి కధలు రావాలని మనసారా కోరుకుంటూ…

   • ఆర్.దమయంతి. says:

    “అమ్మ ప్రేమకి ప్రత్యామ్న్యాయం ఎలా లేదో…మీ రచనా శైలి కి కూడా అంతే..నేను ప్రతి సారీ ఇదే చెప్తుంటాను..మరలా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ”
    – ప్రతాప్ గారు! అద్భుతమైన ప్రశంసల జల్లు కురిపించారు!
    మీ అభిమానానికివే నా జోహార్లు.
    ఈ శీర్షిక లో – నా రాబోయే కథలు కూడా చదివి మీ విలువైన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియ చేయాల్సిందిగా కోరుతున్నాను.
    శుభాభినందనలతో..

 8. G.S.Lakshmi says:

  అద్భుతం..

  • ఆర్.దమయంతి. says:

   ధన్యోస్మి అక్కా!
   :-)
   అభివందనములు.

 9. అణువణువునా తల్లి ఆరాటం కనిపించింది .ఆమె కొడుకుకి మంచి భోజనం పెట్టాలని నానా హైరానా పడటం లో ఆమె హృదయం కనబడుతోంది .మొత్తానికి మాకు మస్టాన్నభోజనం పెట్టారు .ఆకలేసింది తెలుసా .చాలా బాగారాసారు దమయంతీ

  • ఆర్.దమయంతి. says:

   శారద గారూ!

   వేయి కథలు రాసిన సీనియర్ రచయిత్రి అయిన మీచే ఈ కథ ప్రశంసలనందుకోవడం ఎంతైనా ముదావహం.
   చాలా చాలా ధన్యవాదాలు.
   :-)

 10. Nandoori Sundari Nagamani says:

  దాము అక్కా, ఏమి చెప్పను,ఎలా చెప్పను? మీ కథ చదువుతూ ఉంటే సప్తసముద్రాల అవతల ఉన్న నా కొడుకు కళ్ళలో తారట్లాడాడు… మనసు మూగవోయింది…

  తల్లి మనసును ఆవిష్కరించిన మీ కథ అనన్య సామాన్యం… చాలా చాలా ధన్యవాదాలు అక్కా… చాలా బాగా రాసారు. థాంక్స్… థాంక్స్ అ లాట్…

  మీ సుమన.

  • ఆర్.దమయంతి. says:

   సుమన!
   .. నీ బాధ అర్ధమైంది రా.
   తల్లి మనసు అంతే. పిల్లలకోసం కొట్టుకుపోతుంటుంది.
   పిల్లలు ఉద్యోగ రీత్యా దూరమై వెళ్ళినప్పుడు ..ఆ బాధ వర్ణనాతీతమే.
   మా స్నేహితురాలు ఒకామె, ఎంత పండగొచ్చినా సరే బొబ్బట్టు మాత్రం వండదు.
   కొడుక్కి మహా ఇష్టమని వాడు లేకుండా తను తింటమేమిటనీ బాధపడుతుంది.
   అతను అమెరికాలో వుంటాడు.
   ఇండియా కొచ్చినప్పుడు ఇక ఇంట్లో బొబ్బట్ల పండగే అనుకో.
   :-)

   తల్లి ప్రేమ ఏమని పొగడగలం.
   త్వరలో అబ్బాయిని చూసి, పండగ చేసుకుందువులే!
   శుభాశీస్సులు రా చెల్లీ.

 11. P Sunitha says:

  కధ కాని కధ – చాలా బాగు౦ది.అమ్మ కమ్మగా వ౦డి తే ఎవరికైనా బానే ఉ౦టు౦ది. కు౦పటి మీద అ౦త వ౦టా,ప౦డగైనా పబ్బమైనా పి౦డి వ్౦టలతో సహా చేసేవాళ్ళు ఆ రోజుల్లో​. కానీ చిన్న సజెషన్. కోడలికి నేర్పమనక పోతే తనే నేర్ఛుకోవచ్చుగా! అమ్మలాగే వ౦డుకోవచ్చు. అమ్మకీ చేసి పెటొచ్చు.అమ్మకి ఓపిక ఎల్లకాల​౦ ఉ౦డదుగా!

  • ఆర్.దమయంతి. says:

   మా ఫ్రెండ్ కొడుకు పంజాబీ ఆమెని వివాహమాడాడు. ప్రేమ పెళ్ళిలేండి. హైదరాబాద్ కొచ్చినప్పుడు మా ఫ్రెండ్ కి చీమత టెన్షన్ అయినా వుండదు – వంట గురించి.
   ‘నా వంటలన్నీ మా కోడలు నేర్చుకుంది. నా కంటే కూడా ఘుమఘుమలాడించేస్తుంది. మా వాడి కోసం ఇది చేయలేదు అది చేయలేదన్న దిగులు లేదు నాకు. ఈ జన్మకి ధన్యురాల్నయ్యాను చాలు. అంటుంది.
   ఎలా నేర్చుకుందంటే..కొత్తల్లో రోజూ ఫోన్ చేసి అడిగి తెలుసుకునేదిట. దగ్గరున్నప్పుడు చూసి నేర్చుకునేదిట. ఇప్పటికీ సందేహాలుంటే అడుగుతూనే వుంటుందిట.

   ఎందుకంత తిప్పలు ఆమెకి. పాపం ఆ కోడలు గుర్తొచ్చింది మీరన్న పాయింట్ చదువుతుంటే.
   ఒక సినిమాలో ఆమని అన్నట్టు..’ఏవిటో’! కదూ?
   ధన్యవాదాలండి.

 12. ఆర్.దమయంతి. says:

  “లవ్ యువర్ స్టొరీ”

  – స్వాతి గారూ!..
  :-)
  కథకి కిరీటమై మెరిసిన మీ ఈ ఒక్క మాట చాలు.
  బహు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
  అభివందనాలతో..

 13. Venkat Suresh says:

  మా అమ్మ మనసు చదువుతున్నట్లుంది కధ చదువుతుంటే. ఎప్పుడు ఊరు నించి వచ్చినా, పాపం ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని రక రకాల వంటలు థానే స్వయంగా చేసేస్తోంది…ఎవరి సహాయమూ లేకుండా….పైన ఎవరో అన్నట్లు … మనసు మూగబోయింది మామ్

  • ఆర్.దమయంతి. says:

   ఈ కథ చదివిన అందరకీ అమ్మ గుర్తుకు రావడం ఎంతైనా ముదావహం సురేష్.
   ఆ తల్లి ప్రేమ అమృతం.
   ఆ జగన్మాత అన్నపూర్ణ కృప అంశం అమ్మ ప్రేమ పాశం.
   అందుకే అంత మధురం గా వుంటుంది.
   ఇలా ఆ పరమేశ్వరిని స్మరించుకునే అవకాశం రావడం నా మహద్భాగ్యం గా భావిస్తున్నా సురేష్.
   శుభాభినందనలు మీకు.

 14. renuka ayola says:

  Damanathi గారు
  Maro midhunam vanaentloki vacchesindi bhojnam cheyaalnanta bagundi…

  • ఆర్.దమయంతి. says:

   కథ మీద ఒక విందైన మాట చెప్పారు రేణుక గారు!
   మనః పూర్వక ధన్యవాదాలు.
   :-)

 15. Ramachandra Murty vithala says:

  అమ్మ, మీ కథ ,కధనం చాలా బాగున్నాయి. అభినందనలు .

  • ఆర్.దమయంతి. says:

   అభినందనాలందచేసినందుకు చాలా ధన్యవాదాలండి రామచంద్ర మూర్తి గారు.
   నమస్సులతో..

 16. నా ఇలస్త్రేషన్ ని వాడుకున్నందుకు మీకు సారంగకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

  • ఆర్.దమయంతి. says:

   ఒక రాత్రం తా కూర్చుని అప్పటికప్పుడు బొమ్మ వేసి వేసి ఇచ్చినందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలండి శారద గారు!
   సారంగ సంపాదకులు శ్రీ అఫ్సర్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఈ సందర్భంగా!

 17. దమయంతీ !

  ముందుగా క్షమాఫణలు ..ఇంత ఆలశ్యంగా మీ అమ్మ కథని పలకరించినందుకు ..ఇప్పటికి తీరుబడి అయింది మరి ..అమ్మ మనసు ని అలఓకగా ఒడ్డొంచారు మీ కథ లో ..తృప్తిగా అమ్మ పెట్టిన భోజనం తిని చేయి కడుక్కున్నట్టు అనిపించింది ..నాకు కూడా ..వంశీ ఎంత అదృష్ట వంతుడు .అనుకోగానే మా అమ్మ గుర్తు వచ్చేసారు ..అవును ..నేనూ ఎంత అదృష్ట వంతురాలిని అనుకుంటూ అమ్మ దగ్గరకి పరుగులు తీసాయి .ఊహలు ..మీ నుంచి ఇంకా ఎన్నో కథలు చదవాలని ఉవ్విళ్ళూరుతూ

  వసంత లక్ష్మి

  • ఆర్.దమయంతి. says:

   ముందుగా ధన్యవాదాలు వసంత.
   కథ కాని కథ లో నాకు తెలిసిన పాత్రలను ఆధారం గా చేసుకుని కథగా చెప్పడం జరుగుతుంది వసంత.
   సహజమైన మనస్తత్వాలకు మనం దూరం జరగలేదు అనడానికి ఈ కథ ఒక రుజువుగా నిలుస్తోంది.
   మంచి విశ్లేషణనందచేసినందుకు మరో సారి ధన్యవాదాలు.
   మీకు మీ అమ్మ గారు గుర్తొచ్చినందుకు సంతోషం. నమస్కారాలందచేయండి.
   ఇందులో జానకి పాత్ర – మా అమ్మగారే స్ఫూర్తి.

 18. Krishna Veni Chari says:

  అద్భుతంగా రాశారు దమయంతిగారూ.
  వంటల పేర్లు చదువుతుంటేనే నోరూరిపోయింది.

  • ఆర్.దమయంతి. says:

   ధన్యవాదాలు కృష్ణ వేణి గారు.
   మా అమ్మ చేతి వంటలు ఇవి.
   :-)

 19. B.Prathapkumar Reddy says:

  దమయంతి గారూ!
  మీ కధని ఇప్పుడే చదివాను..అమ్మ మీద రాసే కధలెప్పుడూ బాగుంటాయి,,ఎవరు రాసినా కూడా… అమ్మ మనసు లాగా … మీరు రాస్తే మరింత బాగుంటుంది … అమ్మ మనసుకి,అమ్మ ప్రేమకి ప్రత్యామ్న్యాయం ఎలా లేదో…మీ రచనా శైలి కి కూడా అంతే..నేను ప్రతి సారీ ఇదే చెప్తుంటాను..మరలా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ..మీ కధనం అంత బాగుంటుంది…మీ శైలి లోని ప్రత్యేకత ఏమిటంటే చాలా వాక్యాలు కొటేషన్స్ లానే ఉంటాయి..”ఎంత పెద్దవాడైనా, ‘అమ్మా ఆకలి ‘ అని అడిగే బిడ్డ – తల్లి కళ్ళకెప్పుడూ పసివాడుగానే కనిపిస్తాడు.”….”మందారాలు తురుముకున్న తులసమ్మ అచ్చు అమ్మంత పవిత్రం గా కనిపిస్తోంది.”….”నిజానికి ఇల్లాలి సిగ్నేచర్ కి ఒక తెల్ల కాగితం లాంటిది – వంటిల్లు.”…”కొంతమందిని కలిసినప్పుడు, పోయిన శ్వాస తిరిగొస్తుంది. మరికొంతమందితో కలిసి నడుస్తున్నప్పుడు బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది.”…మచ్చుకి మాత్రమే వీటిని ఉదహరించాను….ఇలాంటి వాక్యాలు చాలా కనిపిస్తాయి మీ కధల్లో…ఈ సారి ఈ కధలో వంటింటి ఘుమఘుమల్ని కూడా బాగా దట్టించారు…అప్పుడే భోజనం చేసిన మనిషికి కూడా,వెంటనే మరొక సారి భోజనం చేస్తే బాగుండును అని అనిపించేంతగా… చిన్న కధ అయినా ‘అమ్మమనసు’ని చాలా బాగా ఆవిష్కరించారు..మీ నుంచి మరెన్నో మంచి మంచి కధలు రావాలని మనసారా కోరుకుంటూ…

  • ఆర్.దమయంతి. says:

   ధన్యవాదాలు ప్రతాప్ గారు.
   మీ వ్యాఖ్యలెప్పుడూ రచయిత్రిగా నన్నెంతగానో ఆలోచింపచేస్తాయి. ఆనందాన్ని కలుగచేస్తాయి.
   తప్పకుండా మంచి కథలు రాసేందుకే ప్రయత్నం చేస్తాను.
   కాని , ఈ కథ కానీ కథ శీర్షికలో విభిన్నమైన పాత్రలు ఉంటాయి. అన్నీ చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని ఆశిస్తున్నాను.
   హ్రదయపూర్వక ధన్యవాదాలతో..

 20. కె.కె. రామయ్య says:

  బందరు వారు దమయంతి గారూ! మీ ‘ఈ కధ కానిదీ ~ అమ్మ కడుపు చల్లగా..’ మాకో దైవానుగ్రహం … కాదు, కాదు ఇది మీ దయానుగ్రహం. బ్రతుకులోని మాధుర్యాన్ని ఆత్మీయంగా అలఓకగా వొడ్డించారు. ఆనందానుభూతులతో గుండె నిండిపోయింది.

  సత్యం శంకరమంచి గారి అమరావతి కధల్లోని ‘భోజనచక్రవర్తి’, శ్రీరమణ గారి ‘మిధునం’ సరసన మీ ‘అమ్మ కడుపు చల్లగా..’ కు ఒక పీట వేస్తున్నాము.

  ఎన్నో రోజులుగా జంక్ ఫుడ్స్ తిన్న పాపాలన్నీ మీ అమ్మ చేతి వంటల వర్ణల ఆచమనం చేయగా నశింపబడు గాక!

  యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
  తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే

  ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడు గాక!

  • ఆర్.దమయంతి. says:

   రామయ్య గారూ!
   ….మీ ప్రశంస చదవంగానే పట్టరాని ఆనందం అర్ణవమైంది.
   తెలుగు కథా సాహిత్యం లొ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ఆ పండితుల సరసన నా పేరు చేర్చిన మీ సహృదయానికి, సాహిత్యాభిమానానికి ఇవే నా నమస్కృతులు.
   అయితే, ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న గొప్పతనమంతా అమ్మ ప్రేమ ప్రభావం.
   ఆ వాగ్దేవి కృపాకటాక్షాలే – మీ చేత నాకీ ప్రశంసా పత్రాన్ని అందచేసిందని మనఃస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ తల్లి పాదాల పై శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను.
   చాలా సంతోషమండీ! కథ కాని కథ శీర్షిక లో – రాబోయే కథ లు కూడా చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను రామయ్య గారు!
   శుభాభినందనలతో..

 21. Phanindra kuppili says:

  అమ్మా నాకళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.నిజంగా నా కళ్ల ముందు భౌతికంగా ఈ లోకంలో లేని మా అమ్న మెదలాడుతోంది..నేను మీకథని చదివాను అనడం కంటే చూశాను అనడం కరక్టేమో..ఆద్యంతం కట్టిపడేశాలా ఉంది మీ కధనం..నిజంగా ఇన్నాళ్లు మీరచనల్ని మిస్స్ అయ్నందుకు చాలా బాధగా ఉంది..నిజంగా దీన్ని ఒక కధ అనటం కంటే ఒక వచన కావ్యం అనడం సబబేమో..

  ” ఏదో చెప్పలేని అద్వితీయమైన భావం అతని మూగవాణ్ణి చేస్తోంది. ఇంత గా తనని ప్రేమించే అమ్మ వుండటం ఒక వరం. ఒక దైవానుగ్రహం. కానీ తిరిగి ఏమిస్తున్నాడు?..ఏమివ్వలేడు. తను ఇవ్వగలిగేవన్నీ ఆమెకి తృణ ప్రాయం. ఆశించని లంచం. ఇలా వండి పెట్టుకోవడం లో ఆవిడ పొదుతున్న అపురూపమైన ఆనందం ముందు అవన్నీ బలాదూర్”..
  తల్లి, కొడుకుల మధ్య గల ఒక అనిర్వచనీయమైన, అవ్యాజమైన ప్రేమానురాగాల్ని అద్భుతంగా ఆవిష్కరించారు అమ్మా..
  నాకు ఇంతమంచి కధని చదవమని తెలిపినందుకు కృతజ్ఞతలు అమ్మా..

  • ఆర్.దమయంతి. says:

   ఒక మంచి మాట గుర్తు చేసావు ఫణి.
   అమ్మంటే ఒక కమ్మని కావ్యమని.
   కథ నచ్చినందుకు ధన్యవాదాలు.
   శుభాశీస్సులతో..

 22. ఆంటీ! నాకు ఎప్పుడు వండి పెడతారో చెప్పండి :)

  • ఆర్.దమయంతి. says:

   తప్పకుండా నరేష్. అంతకంటేనా?!..
   :-)
   ఎప్పుడొస్తున్నారు మరి?
   ఎదురుచూస్తుంటా..సరేనా?
   :-)

 23. Jayaramakrishna Pyla says:

  కొడుకుల్ని కంటిపాపలా చూసుకునే మా అమ్మ లాంటి ఎందరో మాతృమూర్తుల వాత్సల్యానికి భావనని సువాసనగా వెదజల్లి, మాటలు పోపులుగా వేయించి, అక్షరాలు అరిటాకుగా విస్తరించి షడ్రషోపేతంగా వడ్డించినందుకు ధన్యవాదాలు. పేదరాశి పెద్దమ్మ కథలలో చెప్పుకున్నట్లు కన్నవారికి పుట్టిన ఊరికీ దూరంగా సప్త సముద్రాలూ దాటి పాలసముద్రం లాంటి పసిఫిక్ మహాసముద్రం ఒడిలోనున్న అమెరికాలో ఉన్న నాకు మా అమ్మని ప్రత్యక్షం చేసింది మీ కరములనుండి జాలువారిన కథ కానిది.
  అమ్మ ప్రేమ ఎప్పటికీ అద్భుతంగానే ఉంటుంది.
  సృష్టికి ముగింపు లేని వారధి అమ్మ……..//…….//…..//…..//

  మీ
  పైల జయరామకృష్ణ

  • ఆర్.దమయంతి. says:

   అమ్మకి దూరంగా వున్నప్పుడు ఆమె మరింత గుర్తొస్తుంది నిజమే జయరామకృష్ణ గారు.
   కథ పై చక్కని అభిప్రాయాన్ని తెలియచేసినందుకు నా ధన్యవాదాలు.

 24. ” కారణం ‘ఇది’ అని ఎంచి చూపేంత నేరాలుండవు. అలా అని పట్టించుకోకుండా హాయిగా బ్రతికేంత మంచి తనాలు కనిపించవు.”

  “కొంతమందిని కలిసినప్పుడు, పోయిన శ్వాస తిరిగొస్తుంది. మరికొంతమందితో కలిసి నడుస్తున్నప్పుడు బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది.”

  ఇటు మంటి మనిషి జీవిత బాగస్వామిగా వస్తే ఇక వేరే నరకం ఉండదు. వాళ్ళు చచ్చినా కూడాఎదటి మనిషిని నమ్మరు.తాము ఎంతో సుపీరియర్ అన్న భావన వాళ్ళలో వేళ్ళు పాతుకు పోయి ఉంటుంది. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ వాళ్ళతోనే కడదాకా కొనసాగించే భార్యను/ భర్తను నిజ జీవితంలో చూసి ఉన్నాను.
  మనుష్యుల స్వభావాలను మాటల్లో బాగా పట్టుకొన్నారు రచయిత్రి. అభినందనలు.

  • ఆర్.దమయంతి. says:

   శ్రీమతి GOWRI KIRUBANANDAN గారు!
   చాలా సంతోషమైంది, మీ కామెంట్ చూసి.
   పాత్రల స్వభావాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
   ‘కథ కాని కథ’ – అనే ఈ శీర్షిక లో నేను నిజ జీవితం లో చూసిన కొన్ని పాత్రలను, స్వభావాలను ఆధారం గా చేసుకుని కథలు రాయాలని సంకల్పం.
   ఈ కథ పై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ,
   గౌరవాభివందనములతో..

 25. S V R Jogarao says:

  శ్రీమతి దమయంతి గారికి,
  సంధ్యా సమయ వందనములు.
  తమరి కథ ” అమ్మ కడుపు చల్లగ ” ఇప్పుడే చదివేను.
  కథ చదివేను అనడము కన్నా, మీ కథ నన్ను ఆసాంతము చదివించింది అనడము సబబుగా ఉంటుంది.
  కథా సారమును తమ చిత్రము లో ప్రతిబింబించిన సోదరి శ్రీమతి మన్నెం శారద గారు అభినందనీయులు.
  కథ లో అమ్మ ప్రేమను అమ్మ కడుపు చల్లగా లో చెప్పడానికి, మీరు భోజ్యేషు మాతా అనే శ్లోకమును గుర్తు చేస్తున్నట్లుగా, వంటలు, పిండి వంటలు, భోజ్య శాక పాకములను ఆలంబనగా చేసుకుని కథను అల్లడము బాగున్నది.
  మాతృ ప్రేమను అనుభూతులలో స్పందింప చేస్తూ రచన సాగడము ప్రశంసనీయము.
  చివరలో ,
  మంచి కథను అందించిన మీకు ధన్యవాదములు.
  అభివాదములు.
  జోగారావు
  బెంగుళూరు

  • ఆర్.దమయంతి. says:

   మీ మంచి వ్యాఖ్య ని చదివి ఆనందించాను జోగారావు గారు. మీకివే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,
   నమస్సులతో..

 26. Jayashree Naidu says:

  డియర్ దమయంతీ…
  లవ్ యువర్ అయిస్ ఫార్ డీటెయిల్స్ ఇన్ వర్డ్స్ . మామూలుగా అనిపించే దృశ్య వర్ణన లోంచి హఠాత్తు గా ఆణీముత్యాల్లాంటి లైన్లు రాస్తుంటావు. అవి నీ రచనల్లో ప్రత్యేక ఆకర్షణ.
  .”ఎంత పెద్దవాడైనా, ‘అమ్మా ఆకలి ‘ అని అడిగే బిడ్డ – తల్లి కళ్ళకెప్పుడూ పసివాడుగానే కనిపిస్తాడు.”….”మందారాలు తురుముకున్న తులసమ్మ అచ్చు అమ్మంత పవిత్రం గా కనిపిస్తోంది.”….”నిజానికి ఇల్లాలి సిగ్నేచర్ కి ఒక తెల్ల కాగితం లాంటిది – వంటిల్లు.”…”కొంతమందిని కలిసినప్పుడు, పోయిన శ్వాస తిరిగొస్తుంది. మరికొంతమందితో కలిసి నడుస్తున్నప్పుడు బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది.”… ఇవన్నీ నాకూడా నచ్చిన లైన్లు.
  * నిజమైన తల్లి చూపెప్పుడూ పిల్లల సంపదల మీద వుండదు. పిల్లల సంక్షేమం మీద వుంటుంది.

  నిజమైన పుత్రులకు కూడా అమ్మ చూపే చాదస్తపు ప్రేమల మీద కోపం వుండకూడదు. దాని వెనక అంతరార్ధం ఏవిటో కనుక్కొని వుండాలి.
  అన్నిటికన్నా చాలా నచ్చిన లైన్ ఇదీ — వంటలకి స్పర్శ వుంటుంది. అది మనసు పెట్టి చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ భాష చాలా అర్ధమౌతుంది. — ఇక్కడ నాకు అనిపించేదీ కలిపి చెప్తాను. స్పర్శతో పాటూ వాసనా రుచీ వుంటాయి. ఆ సువాసనలు ముక్కుకి తాకగానే, సరైన తాలింపు వేశామా, చూపులకి ఆ వంటకం కనిపించే తీరు కూడా ఆ వంటకం భష అనుకోవొచ్చు. ఇది జస్ట్ నీ వాక్యాలకి అడిషన్ మాంత్రమే. నీ లైన్ మాత్రం జయహో..

  ఇంకొక విషయం ఏమిటంటే, వంశీ బహుశా ఇప్పుడు యే ముప్ఫై – ముప్ఫై ఐదు సంవత్సరాల వయసు అనుకోవొచ్చేమో. ఆ జెనరేషన్ కొంత మన వంటకాలే అలవాటైన తరం. ఇప్పటి నా పిల్లల వయసు వాళ్ళ పరిస్థితి – స్వాతి శ్రీపాద చెప్పినట్టు, మనం ఓపికగా వండి పెట్టినా తినేందుకు సుముఖం గా లేరు. గిన్నె నిండా పప్పుచారు చేసినా, జంతికలు చేసినా, సున్నుండలు చేసినా, అవి అలా మురిగి పోతూనే వుంటాయి తప్ప వాటి జోలికి వెళ్ళనైనా వెళ్ళరు. అక్కడ పిజ్జాలూ, బర్గర్లూ, కోక్ బాటిల్సూ, థంసప్ లూ ఖాళీ అయిపోతుంటాయి. విసుగేసి వండటం విషయంలో వాళ్ళకి అనుగుణంగా నా పద్ధతులు మార్చేసుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ లైఫ్ స్టైల్ ఇంకా గ్లోబల్ కల్చర్ మన జీవితాల్ని ఆకరమిస్తున్న రోజులైపోయాయి. ఈ కథ ఒక నోస్టాల్జిక్ పాయింట్ అనుకో.

  • ఆర్.దమయంతి. says:

   థాంక్స్ జయా!
   ఎంత లోతైన విశ్లేషణ అనిపించింది చదవగానే.
   పిల్లలకి ఏదిష్టమైతే అదే వండి పెట్టాలి. నువ్వన్నట్టు రోజులు మారాయి. పిల్లల అభిరుచులూ మారాయి. మునపటి కాలంలోలా మాగాయి పెరుగు పచ్చడి, అన్నం, పప్పు లంచ్ బాక్స్ లో కలిపి తీసుకెళ్లే రోజులు పోయాయి.
   :-)
   మరోసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను జై.
   శుభాకాంక్షలతో..

 27. Subhash Vanga says:

  Damayanti gaaru,
  Very simple yet touching story, presented in a beautiful, sweet manner. You have a gift of writing in a way that is gratifying to all the senses. I could smell the aroma in your food, relish the taste and sense of satisfaction of the son in the story. And I love the quotes like sentences in the story – especially about the spouse’s expression of love creating an urge to live longer and enjoy the togetherness. Thank you and keep writing..

  • ఆర్.దమయంతి. says:

   చాలా చాలా థాంక్స్ సుభాష్!
   కథ మీద చక్కని కామెంట్ ఇచ్చినందుకు, ప్రశంసలందచేసినందుకు
   మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 28. B S Moorty says:

  మాతృ దేవో భావ !బిడ్డ ఆకలి తీరితే అమ్మ కడుపు నిజంగానే చల్లగా ఉంటుందని తేలిక మాటలతో కళ్ళకు కట్టించారు ! ఎంత ఆర్ద్రత ! అద్భుతం !

  • ఆర్.దమయంతి. says:

   ధన్యవాదాలు బి.ఎస్. మూర్తి గారు.
   నమస్సులతో..

 29. కూతురిగా అమ్మ చేతివంట, అమ్మగా నాన్నకి, అమ్మకి, కూతురికి వండి పెట్టిన గురుతులు, అక్కగా చిన్నారి తమ్ముడికి అమ్మలా వండి పెట్టిన రోజులు ఒక్కసారి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి దమయంతి ….ఇక ఆ రోజులు మళ్ళీ రావు కదా ….అమ్మ మనసును అక్షరాల అరిటాకు పై వడ్డించావమ్మా అభినందనలు ….ప్రేమతో జగద్ధాత్రి

  • ఆర్.దమయంతి. says:

   మీ ప్రేమను అలా అందరకీ పంచే మహా భాగ్యం దొరకడం ఎంత అదృష్టం కదండీ.
   ధన్యవాదాలండీ, మీ స్పందన తెలియచేసినందుకు.
   శుభాకాంక్షలతో..

 30. అనేక ధన్యవాదాలు దమయంతి గారు. కళ్ళు చెమర్చి మనస్సు మూగవోయి అమ్మ గుర్తుకొచ్చింది. మీరు కధలో వాడిన ఉపమానాలన్నీ చాలా హృద్యంగా ఉన్నాయి. మీ శైలి బాగుంది.

  • ఆర్.దమయంతి. says:

   శారదా గారు, మీకు థాంక్స్ చెప్పడం ఆలస్యం అయింది. అందుకు నన్ను మన్నించండి.
   అమ్మ గుర్తొస్తే మనసు జ్ఞాపకాలతో కళ్ళు కన్నీటితో నిండిపోతాయి. అంత ప్రేమ మళ్ళీ మనకు దొరుకుతుందా..!
   చక్కని స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలండి!

 31. ఏమి చెప్పాలి ! కళ్ళు చెమర్చాయి . మా అమ్మను గుర్తు చేశారు . ఇంట్లో అందుబాటులో ఏమీ లేకపోయినా క్షణాల్లో చేసిన పచ్చిపులుసు , చింతకాయ పచ్చడి ఎంతో మధురంగా వుండేవి . ఆ రోజులు వేరు , ఆ ప్రేమలు వేరు . మంచి కథ . మీకు అభినందనలు.

  • ఆర్.దమయంతి. says:

   నిజమే రాజు గారు. ఆ రోజులు బంగారు రోజులు. ఆ మనుషులు మణి దీపాల వంటి వారు. కళ్ళ నిండా కరుణా, గుండెనిండా ప్రేమా! నిరంతరం పిల్లల ధ్యాస తప్ప మరొకటి ఎరుగని తల్లులున్న కాలం అది. అమ్మ ఎం వండి పెట్టినా అది మధురం గానే ఉండేది అంటే అతిశయోక్తి కాదు. ఆ మాధుర్యం పేరే మాతృ ప్రేమ!
   ధన్యవాదాలండీ, మీ విలువైన స్పందన తెలియచేసినందుకు.

 32. Lalitha Rayaprolu says:

  Generations may pass but Amma kadupu chustundi Anna Nanudi Matuku ever green.people may say the same comment given by a gentleman on Midhunam story that the story belongs to a particular community.never mind.I enjoyed your story.God bless you with more and more stories.

 33. Lalitha Rayaprolu says:

  కంగ్రాట్యులేషన్స్.చాలా బాగుంది
  .మిధునం కథ గుర్తుకొచ్చింది.అమ్మ కడుపు చూస్తుంది కదా!

  • ఆర్.దమయంతి. says:

   లలితా గారు, మీ ప్రశంసని మరువలేను. ఈ కథ చదువుతుంటే మిధునం గుర్తుకొచ్చింది చెబుతుంటే చాలా ఆనందమేస్తోంది. ఒక గొప్ప అవార్డు అందుకున్నంత గర్వంగా ఉంది.
   :-)
   మరో సారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ,
   శుభాకాంక్షలతో..

 34. నిజంగా ఏ అమ్మ-కొడుకైన ఇలానే వుంటారు -నిజంగా చదువుతుంటే నా కొడుకు నేనే ఇందులొ ప్రత్యక్షంగా వున్నట్లుంది — వేల మైళ్ళ దూరము లొ వున్న నా బిడ్డ ని మళ్ళీ గుర్తు చేసి నన్ను ఏడ్పించారు

  • ఆర్.దమయంతి. says:

   “వేల మైళ్ళ దూరము లొ వున్న నా బిడ్డ ని మళ్ళీ గుర్తు చేసి నన్ను ఏడ్పించారు.”
   * సారీ ఉదయరాణి గారు.
   మీ కళ్ళల్లో ఉబికినది – కన్నీరు కాదు. మీ బిడ్డ పై ప్రేమగా కురిసిన పన్నీరు.
   ఎంత దూరం లో వున్నా అమ్మకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు కదండీ, కన్నబిడ్డలు!
   కడుపు తీపి అనే పదానికి అద్దం పట్టి చూపారు మీ కమ్మని మాటల ద్వారా!
   అమ్మ అంటే ఆర్ద్రత కదూ?
   ధన్యవాదాలండి.
   :-)

 35. కమ్మగా పిల్లలకి వండి వడ్డించి కడుపారా తినిపించే తల్లులకు,అలా తినిపెరిగి తన పిల్లలకి అమ్మ కాబోతున్న అమ్మాయి వంటలో అమ్మతనంలోని కమ్మతనం వెతుక్కుని,దొరక్క మూతి కూడా ముడుచుకోలేక లోలోపల పిసుక్కుంటూ విసుక్కుంటూ తినే అబ్బాయిలకి తెలియని దేమిటంటే రేపు తన పిల్లలు ఇవాళ వాళ్ళ అమ్మతనపు కమ్మతనం రేపు వాళ్ళ పెళ్ళాల వంటలో వెతికి లేదని బాధపడతారని
  ప్రతీ పిల్లాడికి తల్లిపాల తర్వాత నాలిక్కి తగిలేది అమ్మ వంటకనక అది అలా కట్టి పడేస్తుందని. పెళ్ళాం వంటకి అలవాటుపడిన పెద్దైనవాళ్లు మరోవంటకీ మొహం మాడ్చుకుంటారని.
  ఈవంట రుచులకన్నా అంతా నడిచేకాలం చేసే గారడీ అని గుర్తెరిగితే వెల్లివిరిసే ఆనందం అత్తా కోడళ్ల మధ్య ఏర్పడే సఖ్యత ఇంకా రుచి గా ఉంటుంది అబ్బాయి బతుకు అమ్మా ఆలీ మధ్య నలగకుంటుంది

 36. ఆర్.దమయంతి. says:

  ధన్యవాదాలండీ, శాస్త్రి గారు.
  నమస్సులు.

మీ మాటలు

*