దహించేస్తున్న శీతల పవనంతో

Art: Rafi Haque

Art: Rafi Haque

 

-పఠాన్ మస్తాన్ ఖాన్

~
1.
వొక పూటలోని కొన్ని దేహాల్లో వేలాడే
అసంధర్భాలలోని పురా వాసనలను
మనిషికి పూసిన వొందల అక్షరాలతో
తనను వెతుక్కొంటూనే వేల యేళ్లుగా
ధ్వనీతీత నిశబ్దం ఆవరించిన వెలుగులో
రేపటికి వానకురుస్తుందనే
యేకరహస్యంలో వివృతమై…
2.
గుండెలకు చేరని శ్వాసలో మనసును చంపిన నిశ్చ్వాస లోని హననపు సత్తువ
నిర్మోహనంగానే గతిస్తున్నా వొక రేపటిదాకా
యీ ఆరిపోతున్న రంగుల్లో తేలిపోతున్న
నిర్మాణహీన ముక్కల్లో
గదులను దాటించి కిటికీలను తీయించి
గీసిన వొక వర్ణపటమౌతున్నప్పుడు
వృక్షపు వేర్ల నీడల బిగుతుతనం సడలింది
3.
యింకా మొలవని రెక్కలతో వాలు జారిన
యీ ధార స్వేదంతో కన్నీళ్ళతో కొండలను
లోయలను తాకి వుప్పు సముద్రమైంది
సలపరిస్తున్న గాయాల బరువును చూసి
పచ్చగా వాలిన వొక తడిలేపనం కరిగాక
మొలిచే ప్రాణమేదో మళ్ళీ కళ్ళతో చూడలేక పోతోంది
4.
కొత్త చివుళ్ళలో కాలిపోతున్న దేహానికి
తీరిగ్గా పాఠాలు వల్లెవేసే పురిటి నొప్పులను
వొక నడకలో మరణించిన వొందల దృశ్యాలను
వొకేసారి చూడలేని చేతకానితనపు కళ్ళజోడులతో
పరిధుల అవధులు మాత్రమే గుర్తొచ్చే
సంస్మరణలు కొన్నీ
5.
అన్నీ వర్ణాలను కిందుగా పరుచుకొన్నాకనే
అస్పష్టంగా మెరిసిపోతున్న బంగారు దిగులేదో
కక్కేసిన యెండుటాకులు ఫళఫళ రాలిపోతుంటే
దాచుకోవాలనుకొన్న మృత్యువును వొక చెట్టై నిండుగా మోసి
యెండకూ వెన్నెలకూ చివరి వరకు వేచి చూసి వాటి చివర్లలో
మళ్ళీ మళ్ళీ బధ్ధలైపోతున్న విశ్వపు ముక్కల విలీనం కోసం …వొక ప్రతీక్షలో
యింకా చనిపోతూనే వున్న…

 *

మీ మాటలు

 1. సాయి.గోరంట్ల says:

  మనిషికి,మ్రుత్యువుకి,ప్రక్రుతికి గల అవినాబావసంబంధం గురించి అధ్బుతంగా చెప్పావు తమ్ముడూ…సూపర్బ్

 2. Suparna mahi says:

  చిగురింతల కిందా, ఎదురుచూపు పలవరింతల మాటునా లోపల అంతరావయవం లా ఓ మృత్యువును మోయడం…

  అద్భుతం అన్నయ్యా…💚

 3. మళ్ళీ మళ్ళీ బద్దలవుతున్న విశ్వపుముక్కల వినీలం కోసం ఒక ప్రతీక్ష లో ….ఇంకా చనిపోతూనే ఉన్నా…ప్రతీక్ష…రేపటికి కురిసే వానకోసం…గీసిన వర్ణపటమవటం కోసం ..మొలిచే ప్రాణం కోసం….మృత్యువు లో జీవనం కోసం…

 4. Aruna Thara says:

  బలమైన భావావేశాన్నీ, సుసంపన్నమైన పద సంపదనీ ఉపయోగించి ఇలా ఉధృతమైన ఉద్వేగంతో రాసే కవితలు ఈ కాలంలో చాలా అరుదుగానే కనిపిస్తున్నాయి . చాలా మంచి కవిత సర్ . థాంక్ యూ

 5. dasaraju ramarao says:

  Kota padabandhalu, abhvyaktilo navyatasukumaramaina uhashalityam Verasi mi poem. Nice.

 6. patan masthan khan says:

  స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

మీ మాటలు

*