బాధాపుష్పం.

mandira

Art: Mandira Bhaduri

-వాసు 

~

 

కమలం సూర్యుడినీ కలువ చంద్రుడినీ చూసి వికసిస్తాయని కవులు చెబుతారు
ఈ బాధాపుష్పం నన్ను చూసి వికసిస్తోందేంటి
దీని కోసమే నేను పుట్టినట్టు.
స్వచ్ఛమైన కన్నీటిచుక్కని నా పసిబుగ్గలపైనైనా ఎన్నడూ ఎరగను.
ఈ బాధాపుష్పం మాత్రం తన రేకలని నాకు తాకించింది
దానికీ కన్నీటిచుక్కల్ని కోల్పోవడం తెలుసేమో
లేకపోతే నీకోసం నేనున్నానంటూ ఎందుకొస్తుందీ?
పగటి అనుభవాల పోగులన్నీ రాత్రికల్లా పీడకలల్లా మారడం తెలిసినవాడికి
ఈ బాధాపుష్ప సాహచర్యం ఒక దైవదత్త వరం కదూ
ఈ పరిమళాఘ్రాణమే బరువెక్కిన కళ్ళవెనకని కారని కన్నీటిచుక్క చెలి కదూ
ఎన్నేళ్ళని చూస్తున్నాను
ఎన్ని ప్రేమామృతధారల్ని నేను వర్షించినా
విషసర్పాలు వెయ్యినోళ్ళతో తాగేసి వేయిన్నొక్క దంష్ట్రతో నన్ను కాటేస్తాయి
నొప్పి తెలుస్తుంది కేక పెట్టలేను.
ఎంత సహజ హరితాన్ని పూచిచ్చినా
ఏదో మాయాగ్రీష్మం ఎండగట్టేస్తోంది.
నాకు నమ్మకం చావదు కదా!
పునరపి.
ఎడారికి ఒయాసిస్ చెమర్చిన కన్ను
సరిగ్గా ఈ బాధాపుష్పం నాకూ అంతే
ఇదే లేకపొతే
నేనొక మొండిచెట్టుని
దీన్ని భక్తిగా కళ్ళకద్దుకుంటాను ప్రతిరోజూ పూజగదిలో మంగళాశాసనం తదుపరి
అప్పుడు నాకు నేనే ఒయాసిస్‌ని.

*

మీ మాటలు

 1. V.Ch.Veerabhadrudu says:

  వాసు, చాలా కాలం తర్వాత మీ కవిత మీ పూర్తి ముద్రతో. అసలు బాధా పుష్పమనే మాటనే కవిత్వం. బాధపుష్ప సాహచర్యం అనేటప్పటికి అది కావ్యమైపోయింది. మంగళాశాసనం తర్వాత కళ్ళకద్దుకుంటాననడంతో ఒక ఇతిహాసం గా కూడా మారిపోయింది. మీరు ఇంకా ఇంకా రాస్తూఉండాలని కోరుకునే మీ అభిమాని.

 2. Kuppilipadma says:

  ఎన్నేళ్ళని చూస్తున్నాను
  ఎన్ని ప్రేమామృతధారల్ని నేను వర్షించినా
  విషసర్పాలు వెయ్యినోళ్ళతో తాగేసి వేయిన్నొక్క దంష్ట్రతో నన్ను కాటేస్తాయి
  నొప్పి తెలుస్తుంది కేక పెట్టలేను.
  ఎంత సహజ హరితాన్ని పూచిచ్చినా
  ఏదో మాయాగ్రీష్మం ఎండగట్టేస్తోంది.
  నాకు నమ్మకం చావదు కదా!
  పునరపి. – ఆశ గ్రీష్మం దగ్గరే ఆగి పోనంతకాలం యీ బాధా పుష్పాలు వెంటాడుతూనే వుంటాయి. వెంటాడనివ్వనీయండి. బాధా పుష్పం అనటం సరికొత్తగా వుంది. మీ కవితలోని ప్రతి వాక్యం కలిసికట్టుగా వేటాడుతున్నాయి మనసుని. Thank you for the amazing poem vasu garu .

 3. desaraju says:

  బావుంది

 4. వారిజ says:

  ఎక్స్ లెంట్ సర్

 5. రామకృష్ణ బుద్ధవరపు says:

  వాసు కవి!
  ఎప్పటికి అర్థం చేసుకోను ?
  లోతైన ఆలోచనల్ని
  గుండె లోతుల్లోనే
  గూడు కట్టేసుకుంటావా!
  తేలిగ్గా అర్థమైతే
  భావం బోధపడుతుందనా..
  లోతుల్లోంచి తన్నుకొచ్చే
  హృదయ భావం భారం అటే ఎలా ?
  రానీ..ఎప్పుడోప్పుడు
  బాధో, భావమో, భయమో..
  ఏదైనా బయటపడితేనేగా
  ప్రబంధమో, సుగంధమో..
  తెలిసేది..తేటతెల్లమయ్యేది..
  (వాసు కలం కలకాలం కదంతొక్కాలని కోరుతూ…)

  • Vasu (Srinivasa Nyayapati) says:

   Thanks for your poetically rendered words of appreciation and encouragement.

 6. msnaidu says:

  వాసు,మీ అభిమాని అని మీ పుస్తకం ముందుమాటలో రాసిన రచయత మా భద్రుడుగారేనా అని ఆశ్చ్చార్య పోయా. ఎంత హోదా, మీ కవిత్వానికి దక్కింది. మా లాంటి అకవులకి ఈ జన్మకి సార్ ప్రశంస ఎపుడు దక్కేనో. కీర్తి మీ యెడల ఎల్లపుడూ ఉండను. మరి కవిత్వం ఎపుడు ఉండును

  • Vasu (Srinivasa Nyayapati) says:

   Bhadrudu was kind to me as is his wont. You are such a fine poet yourself and I wish I write like you. But then, we all have our own unique styles of self-expression, don’t we? Thanks for your kind words again. Keep writing and keep in touch, Em Es Naidu!

 7. Vasugaru, just now I read your poem “Badha pushpam” Each and every word is like a jasmine flower and made the garland of “Badha pushpam with deep smell and meaning.edariki oadis chemarchina kannu sarigganaaku anthe, roju kalla kaddukontanu pooja gadilo. Very touching vasugaru. Thank you.

 8. Suseela says:

  Vasugaru, I posted comments here. Badha pushpam is like a garland of jasmine flowers with deep fragrance and touching
  words with deep meaning. Edariki oasis chemarchina kannu, sarigga ee badha pushpam naku anthe. Bakthitho kallakaddukontanu roju poojagadilo.chala baga rasarandi casugaru. Thank you.

 9. M l murty says:

  చదదవడం ఆరంభీస్తే……లోపలి అంచులో ప్రకంపన….కవిగొంతుతో ప్రయాణించే కుతూహల ధెర్యం….

మీ మాటలు

*