ఓ చిన్న చిరునవ్వు

-గోరంట్ల సాహెబ్ పీరా సాయి 
~
ఓ చిన్న చిరునవ్వు
అసంకల్పితంగా నిన్ను గుర్తు చేస్తుంటుంది.
ఓ విశ్రాంత సాయంకాలం పూట..
పదే పదే గిరికీలు కోడుతున్న నైటింగేల్ గొంతు లా
నీ జ్ఞాపకం తాకుతూ వెలుతుంటుంది…
అప్రస్తుతమైన ప్రసంగపాఠం
బలవంతంగా నాలోకి చోరబడాలని
విశ్వ ప్రయత్నం చేస్తుంటుంది
కనురెప్పలపై పేరుకున్న
ధూళి మేఘాల్లోంచి ఏవో చిరు చినుకులుగా మారి
నను తడపాలని ప్రయత్నిస్తుంటాయి.
ఔను
ఇంతకూ నేనెవర్నని
తడిమిచూసుకున్నాక
నేనెక్కడో స్థిమితంగా వుంటాననుకుంటూ
ఓ దీర్ఘ శ్వాసతో విశ్రాంతికి
బయలు దేరుతుంటాను
దేహంలోంచి
కొత్త లోకంలోకి..

మీ మాటలు

  1. Mallareddy . Desireddy says:

    చాలా చక్కని వర్ణన దేహంలోంచి కొత్త లోకం లోకి,
    అద్భుతమైన పదాల అల్లిక , మీకు అభినందనలు.

    • సాయి.గోరంట్ల says:

      కవిత నచ్చినందుకు
      న్యవాదాలు మల్లారెడ్డి అన్నగారు💖

  2. sreenivas reddy.gopireddy says:

    స్థిమితంగా ఉంటాననుకుంటూ దేహం నుంచి కొత్తలోకానికి బయలుదేరడం……ఇంతకన్నా జీవితసత్యముందా?గ్రేట్ ఎక్సప్రెషన్.

  3. Rajesh J says:

    నైస్ ఫీల్

  4. Suparna mahi says:

    అప్రస్తుతమైన ప్రసంగపాఠం
    బలవంతంగా నాలోకి చొరబడాలని
    విశ్వ ప్రయత్నం చేస్తుంటుంది…

    ఇంతకూ నేనెవర్నని తడిమి చూసుకున్నాక నేనెక్కడో స్థిమితంగా ఉన్నాననుకుంటూ ఓ దీర్ఘశ్వాసతో విశ్రాంతికి బయలుదేరుతుంటాను దేహం లోంచి కొత్తలోకం లోకి…

    ఓ అద్భుతమైన ఫీల్ ఫుల్ఫిల్ల్డ్ ఇమేజినరీ అన్నయ్యా… వాస్తవానికీ ఊహకీ మధ్య ఓ అందమైన వంతెన అక్షరాలతో అల్లారు…
    అభినందనలు & సారంగ వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🌼💚🌼

    • సాయి.గోరంట్ల says:

      మహీ..ముందుగా బోలెడు త్యాంక్యూలు😊
      వాస్తవమేమంటే మనలో కలిగే తాత్విక ఆలోచనల్ని,సందేహాల్ని ఇలా అక్షరాల్లో ఆవిష్కరించుకుని,మనసుని స్వాంతన(సాంత్వన) పోందటం కవిత్వానికున్న లక్షణం.
      అలాగే మనసును ద్రుడపరచుకోవడం కూడా
      నీ కామెంట్ ఎంతో సంతోషం కలిగించింది మహీ💜💖

  5. Thummala Sthanaka Babu says:

    సరళమైన పదాలతో అధ్భుత భావ వ్యక్తీకరణ

    • సాయి.గోరంట్ల says:

      త్యాంక్యూ వెరీ మచ్ బాబూ💜
      మామూలుగా కవితలు చదవని నీకు నా కవితాక్షరాలు నచ్చడం రియల్లీ హ్యాపీ

  6. Suneetha says:

    అద్భుతమైన భావన . . . . . .
    అభినందనలు సాయి గారు .

    • సాయి.గోరంట్ల says:

      త్యాంక్యూ వెరీ మచ్ సునీత గారు
      కవిత మీకు నచ్చినందుకు చాలా సంతోషం మై దోస్త్🌼🌼🌼

  7. shrutha keerthi says:

    Very nice feel..short nd cute poem

    • సాయి.గోరంట్ల says:

      త్యాంక్యూ వెరీ మచ్ శ్రుతకీర్తి చెల్లాయ్🌼🌼🌼

  8. Raghav Indra says:

    ఉధ్విఘ్నం తో చిరునవ్వు చేసే యుద్ధం, తమకంతో తన తనువును తానే తాకి చూసుకున్నప్పుడు తానెవరో తెలుసుకున్నాక తమాయించుకునే కారే కన్నీళ్ళకు నచ్చజెప్పి బుజ్జగించే తత్వపు తన్మయత్వం, మాటల్లో చెప్పటానికి కష్టమైనపుడు క్షరం లేని అక్షరాలను అవసరానికి తగ్గట్టు అణుగుణంగా మార్చుకోవటం నీ ఈ నవకవితకు నాంది.. నీ కవిత చదివాక ఏదో చెప్పాలి కాని ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలీక ఉక్కిరిబిక్కిరయ్యి నావి అర్థం పర్థం లేని మాటలని తెలిసినా అభినందించక ఉండలేక చేస్తున్న నా ఈ దుస్సాహసపు అక్షరాభినందనలు

    • సాయి.గోరంట్ల says:

      రాఘవా నీ అక్షరాభిలాష నాకు తెలిసు కదూ
      ఏం చెప్పలేనంటూనే అక్షరంపై నీ ప్రేమను
      ఎంతో హ్రుద్యంగా నీ మనసును ఆవిష్కరించావు
      త్యాంక్యూ వెరీ మచ్ రాఘవా💜💖

  9. sreeni nanda says:

    Beautiful and Excellent

    • సాయి.గోరంట్ల says:

      త్యాంక్యూ వెరీ మచ్ శ్రీని నంద గారూ🌼🌼

  10. suresh emmareddy says:

    “ఇంతకూ నేనెవర్నని తడిమి చూసుకున్నాక నేనెక్కడో స్థిమితంగా ఉన్నాననుకుంటూ ఓ దీర్ఘశ్వాసతో విశ్రాంతికి బయలుదేరుతుంటాను దేహం లోంచి కొత్తలోకం లోకి…” తేజోర్లోకాల్లోకి ప్రయాణాన్ని అద్భుతంగా వ్యక్తీకరించావుపో సూఫీ కవులల్లే.

    • సాయి.గోరంట్ల says:

      Thank you very ముచ్
      సురేష్ అన్నా
      సూఫీ..నాకు తెలీని వయసులోనే వారికి నేను ఆకర్షితుడయ్యానన్నా.
      అందులో నేను ఎంతో స్వాంతన పోందుతాను కూడా
      త్యాంక్యూ అన్నా💜🌼

  11. K K Anand says:

    ఈ కవిత చదివాక
    ఇంతకూ నేనేవరినని తడిమిచూసుకోవలసి వచ్చింది సయిఅన్న
    ఎప్పుడు స్థిమితంగా ఉండని నేను స్థిమితంగా చదివాను అన్నా
    కొత్త లోకం లోకి వచ్చిన అనుబూతి కలిగింది …

    • సాయి.గోరంట్ల says:

      త్యాంక్యూ krupaa..my dear బ్రదర్
      నేను రాసింది ఏమంత గోప్పవిషయం కాదు గాని జీవితం పట్ల నాకున్న ఆలోచనలను ఇలా పంచుకున్నా
      నేనేదైతే అనుభవిస్తున్నానో ఆ స్థితిని
      త్యాంక్యూ నీకు నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది..💜

    • ravikumar says:

      baagumdi tammudu

      • సాయి.గోరంట్ల says:

        త్యాంక్యూ రవన్నా💜
        మీకు నచ్చినందుకు ఆనందంగా వుంది

  12. knmurthy says:

    దేహం లో నుంచి కొత్త లోకం లోకి వెళ్ళిన రజియా చిరునవ్వే గుర్తుకొచ్చింది. శభాష్ సామీ

    • సాయి.గోరంట్ల says:

      ధన్యవాదాలు మూర్తి సామి😄

      రజియాను (సారీ రజియా మనందరిదీ) నా పలుకుల్లో చూసుకున్నందుకు
      బోలెడు సంతోషంతో బోలెడు త్యాంక్యూలు💜

  13. శ్రీనివాస కృష్ణ says:

    కనురెప్పలపై ధూళి మేఘాలేమిటి?
    అవి బరువైన జ్ఞాపకాలే అయ్యుంటాయి.
    కనురెప్పలు తెరవగానే ధూళి రాలి చినుకులు కురిస్తే
    మరలా ఆశల మొలకలు మొలకెత్తవా?
    సాయిజీ, మీ మృదుపదాల అల్లికలో నేను ఆకాశమంత విశాలమైన ఆశావాదాన్ని చూస్తున్నాను!
    A beautiful way of expression!

    • సాయి.గోరంట్ల says:

      శీనన్నా…త్యాంక్యూ వెరీ మచ్💜
      కవిత లోని ఆత్మను మీరు పట్టేశారు
      మీ సంస్క్రుతాభిలాష మాకు తెలుసు కదా
      మరి చెప్పాలా😄
      వన్స్ ఎగైన్ త్యాంక్యూ అన్నా

    • సాయి.గోరంట్ల says:

      త్యాంక్యూ శీనన్నా
      చాలా సంతోషం అన్నా
      కవిత ఆత్మను సరిగ్గా పట్టుకున్నారు😄
      Once again thank you Anna

  14. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

    వొక అనుభవంతో వ్యక్తీకరించిన ప్రతీకలు వొక నవ్వు,వొక కోయిల గొంతు వొక వర్షం అందులోనే వెదుకులాట. లోన నుంచి బయటకు..
    యిలా వెళ్ళాక పొందిన అనుభవం మరో అనుభూతి ని యిచ్చి వుండొచ్చు
    దానిని మరో కవితగా యెప్పడైన రావచ్చు…భొో….సాయి అన్నగారి కవిత ఆహ్లాదంగా వుందివొక అందమైన ప్రకృతి లో వొక మెరుపు మెరిసి మాయమైనట్టు ఆ మెరుపులో కనిపించిన సౌందర్యమే యీ కవిత…

    • సాయి.గోరంట్ల says:

      త్యాంక్యూ తమ్ముడూ
      నీ వ్యాఖ్య చాలా ఆనందాన్నిచ్చింది
      ఐనా ఈ ఆనందం చూశావూ.కవిత లాగా సత్యమూ కాదు.నా కామెంట్ లాగా అబద్ధమూ కాదు.
      ఎనీవే….త్యాంక్యూ తమ్ముడూ💜

  15. wonderful Imegery very good poem sir

  16. ఓ చిన్ని చిరునవ్వు..గిరికీలు కొడుతున్న నైటింగేల్..అప్రస్తుత ప్రసంగ పాఠం..ధూళిమేఘం నుంచి రాలుతున్న చిరు చినుకులు మమ్మల్ని హాయిగా పలుకరించి..స్వాంతన పరచి తడిపి ఆహ్లాదాన్నిచ్చాయి…ఓ దీర్ఘ శ్వాస తో మీరు విశ్రాంతికి బయలుదేరి..దేహం లోంచి కొత్త లోకం లోకి బయలుదేరింది మేమూ చూసినంత హాయిగా ఆహ్లాదంగా ఉంది మీ కవిత సాయి గారు…అభినందనలు…

    • సాయి.గోరంట్ల says:

      Thank you very
      సరళ గారు.
      కవిత లోని భావాన్ని ఆకళింపు చేసుకుని మీరు రాసిన వ్యాఖ్య ఎంతో ఆనందం కలిగించింది.
      మీ సహ్రుదయతకు వందనాలు🌼🌻🌼

  17. Bhavani Phani says:

    చాలా బాగా రాసారు . అభినందనలు

    • సాయి.గోరంట్ల says:

      ధన్యవాదాలు భవాణి ఫణి గారు
      మీకు నచ్చినందుకు కవితాభివందనాలు

  18. చక్కని కవిత !

    • సాయి.గోరంట్ల says:

      ధన్యవాదాలు ఆచార్యా
      మీకు కవిత నచ్చినందుకు సంతోషం

  19. SRINIVAS SATHIRAJU says:

    సాయన్న నువ్వేం చేసినా ఒక ప్రత్యేకం అని చెప్పక్కర్లేదు కానీ ఇప్పుడే గా మొదలు పెట్టావు అప్పుడే విశ్రాంతి ఏమిటి? మొదటి కవితతో శ్రీకారం చుట్టావు ఇంకా విశ్వరూపం చూపిస్తావు అనుకుంటున్నాము మౌనమునివయ్యి విశ్రాంతికి వెళ్ళకు. సువర్ణంగా మహిమాన్వితంగా వివిధరూపాల్లోగా కవిత్వాల కథనం తొక్కి కధల్లోకి కూడా రావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు

Leave a Reply to సాయి.గోరంట్ల Cancel reply

*