వాన రాత్రి

 

 

-అనిల్ డ్యాని

~

 

కప్పుకున్న ఆకుల చివర్లనుంచి

రాలిన వాన నీటి చెమ్మ

ఇల్లంతా పరుచుకుంది

 

భయం తెలియని పురుగులు

దీపం పైకి దూసుకొస్తున్నాయి

చలి పూసుకున్న దుప్పట్ట్లకి

దేహాల శ్వాశ వేడిని నింపుతుంది

 

చూరు కింద చినుకులకి

రాత్రంతా

చీకటి తడుస్తూనే ఉంది

 

వెలుతురు పెంచుకున్న

దీపం దగ్గర నేల

చలి కాచుకుంటుంది

 

దేహం చుట్టూరా

పరుచుకున్న శూన్యం

కళ్లలో వేడి ప్రవాహం

 

పసి దేహాల మధ్యలో పడుకున్న చాతీపై

రెండు చేతుల ఆలంబన

వాళ్లకి తను తనకి వాళ్ళు

రేపటికి సూర్యుడొస్తే చాలు

 

కిటికీ పక్కన

విరిగి పడిన కొమ్మ గూటి మీద

పక్షుల నోళ్ళు తెరుచుకుంటాయి

కూయడానికి కాదు కూసింత తినడానికి.

*

మీ మాటలు

  1. చందు తులసి says:

    చీకటిని తడిపేశారు……
    అనిల్ గారూ….. కవిత బాగుంది.

  2. SatyaGopi says:

    చీకటి చుట్టూ పరిభ్రమించినట్టు, తనివితీరా తడిసిపోయినట్టు అందంగా వుంది

  3. wilsonrao Kommavarapu says:

    ద్యానీ, ఇంత మంచి కవిత్వం నా ముని వేళ్ళతో తడిమి ఎన్నాళ్ళు అయిందో..?
    మనసు కాస్తంత స్తిమిత పడింది అనుకో

  4. అనిల్ డ్యాని says:

    విల్సన్ రావు అన్నగారు ధన్యుడను

Leave a Reply to wilsonrao Kommavarapu Cancel reply

*