ఎందుకిలా —?

– ప్రసాద్  బోలిమేరు

~

ఈ లోలోపలి నది , ఈ ధ్యానం
అగరుబత్తి పొగలా అటూ  ఇటూ , ఎటో లాక్కెళుతూనే వుంటుందా?
నువ్వేమో వొంపుతిరిగిన మెత్తటి గాలంలా అమూర్తభావంలా-
చిరుతరగనై  కల్లోల తరంగాన్ని భరించాలని ప్రతిబింబించాలని
నేను
అందీఅందక అల్లంత దగ్గరలోనో దూరంలోనో
మనసు రెప్పలమీద వేలాడుతూ ,,
వన్నెలతో  ,వేళ్ళ కుంచెలతో
రాగాలు రంగరిస్తూ వాసనలద్దాలని,
కాంక్షల శిరస్సుపై నిప్పురవ్వలా భ్రాంతిని , మోస్తూ —
నువ్వేమో
ఈ పురాకృత నదీ నడుమన
అవిధేయ ప్రయాణానివి
గడుసైన అలవికాని చిత్రానివి
నా ప్రేరణకు అందని గేయానివి
మొదటి రాత్రిని ముద్దిడిన మొట్టమొదటి చంద్ర కిరణానివి–
ఎందుకు నేనిలా ?
ఒడ్డున ఆకులురాలిన పొదకు కట్టేసిన
లంగరు వేసిన భావాన్ని ,
రంగుల కళలు తాగని రాత్రిని
పురాతన ఇంద్రియ జ్ఞానాన్ని, మోహాన్ని–

మీ మాటలు

 1. Bhavani Phani says:

  ఒడ్డున ఆకులురాలిన పొదకు కట్టేసిన
  లంగరు వేసిన భావాన్ని ,
  రంగుల కళలు తాగని రాత్రిని
  పురాతన ఇంద్రియ జ్ఞానాన్ని, మోహాన్ని– great Poem !!

 2. Suparna mahi says:

  చాలా చాలా బావుంది సర్…😊

 3. prasad bolimeru says:

  థాంక్స్, భవాని ఫణి గారు, మహి గారు.

మీ మాటలు

*