అబ్ కీ బార్.. అగ్లీ బార్..

 

                       -బమ్మిడి జగదీశ్వరరావు

~

గౌరవనీయులైన ప్రధాని మోడీగారికి!

నమస్కారాలతో-

‘నా దేశం మారుతోంది

ముందుకు పురోగమిస్తుంది’ – అని,

“అబ్ కీ బార్” యువతకు అపారమైన అవకాశాలు’ – అని,

మీరు యిచ్చిన ప్రకటన.. మన భారత ప్రభుత్వం తరుపున మీరు యిచ్చిన ప్రకటన.. చాలా బావుంది. అందుకు మీకు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు!

’20 ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం’ అన్నారు. ఢిల్లీ జవహరలాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలను తలదన్నేలా యివాళ మీ పాలనలో దేశమే వొక యూనివర్సిటీగా మారింది అందుకు కూడా మీకు నిజంగా అభినందనలు!

‘ప్రధానమంత్రి “కౌశల్ వికాశ్ యోజన” కింద 20 లక్షలకు పైగా యువకులు శిక్షణ పొందారు’ అన్నారు. యిది నిజం! ముమ్మాటికీ నిజం! అయోధ్యలో నిర్వహించిన, నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రమే అందుకు సాక్ష్యం! స్థానిక యువతకు శిక్షణ యివ్వడం యెంతయినా గొప్ప విషయం! మన ఆరెస్సెస్, విహెచ్పీల పాత్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించతగ్గది! శిలాక్షరాలతో నమోదు చేయతగ్గది! భారత దేశ భవిష్యత్తును యిప్పుడే సందర్శించతగ్గది!

అయ్యా.. మన యువత తుపాకులూ కర్రలూ పట్టుకొని సైన్యంగా కవాతులు చేస్తుంటే – పరుగులు తీస్తుంటే – అగ్గిలోంచి దూకుతూ వుంటే – నిప్పు చక్రాల్లోంచి యెగురుతూ వుంటే – ముస్లింలను పోలిన ఆ వుగ్రమూకలపై తిరగబడుతూ వుంటే – తలలుబద్దలు చేస్తూ వుంటే – రక్తాలు పారిస్తూ వుంటే – కాల్పులు జరుపుతూ మందిని మట్టుబెడుతూ వుంటే – వాళ్ళంతా అలా నేలకు వొరిగిపోతూ వుంటే – శాంతి కపోతం ఆకాశంలోకి యెగరడం చూస్తూ వుంటే – నా వొళ్ళు పులకరించిపోయింది అంటే నమ్మండి! అప్పుడే కొందరి గుండెల్లో చెమటలు పడుతున్నాయి! అందుకే అంతలా యేదో అనర్ధం జరిగిపోతున్నట్టు గగ్గోలు చేస్తున్నారు! మాక్ ప్రదర్శనలా కావవి.. భారత సైన్యం యెక్కడో సరిహద్దుల్లో లేదని.. మన పక్కలో భల్లెంలా దుర్గామాత భల్లెంలా వుందని.. మన మధ్యనే వుందని.. కళ్ళు పట్టని ఆదృశ్యం చూస్తే.. ఆహా అనిపించింది! ఓహో అనిపించింది!

మరి నోయిడాలో? అభం శుభం తెలియని పిల్లలకు అద్భుతమైన శిక్షణ యివ్వడం కూడా మామూలు విషయం కాదు! మొక్కలే వంగుతాయి! మానులు వంగవు! దేశానికి పిల్లలే గాని దేశ భక్తికి పిల్లలు కారు! వొకరా యిద్దరా.. యెందరో వీర శివాజీలు! వీర సావార్కరులు! భవిష్యత్ భగవతీలు! రేపటి మన తొగాడియాలు! పిల్లలలో యిలాగే స్పూర్తిని నింపాలి! రగిలించాలి! రణరంగంలోకి పంపించాలి! చదువుకున్న పాఠాలలో మార్పులతో పాటు యీ విధమైన శిక్షణ ప్రతి పాఠాశాలలో యివ్వాలి! పాఠాశాలలు లేనిచోట అంగన్వాడి కేంద్రాలలోనే శిక్షణని యివ్వాలి! మొదలవ్వాలి! భారతీయతను దర్శించేలా తరించేలా తయారు చేయాలి! ముక్కుపచ్చలారని ముఖాల్లో వెచ్చటి దేశభక్తి టీవీల్లో చూసి యెలా మరిచిపోగలను? అసలుసిసలు “మేక్ యిన్ యిండియా” అంటే యిదే! అర్థం చేసుకోలేని కుహనా లౌకికవాదులు చేస్తున్న పర్ధం లేని ఆరోపణలు అస్సలు పట్టించుకోవలసిన అవసరం లేదు! ప్రతిపక్షాలన్నాక ఆ మాత్రం విమర్శించకపోతే వాటికి వునికి వుండదు! డోంట్ కేర్! కేర్ వోన్లీ కేర్ కేర్ పిల్లలు! కేరింతల పిల్లలు! కరసేవకు పిల్లలు!

యింకా వారణాసిలో? మన వీహెచ్పీకి అనుబంధ సంస్థ.. దుర్గావాహిని సంస్థ యిచ్చిన శిక్షణ భారతీయ మహిళా చరిత్రలోనే మరువలేనిది! మరువరానిది! మరపురానిది! నిజంగా ఆడవాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది! అది మనం వారి మాటల్లోనే వినొచ్చు! కనొచ్చు! ‘లవ్ జీహాది’ పేరుతో జరుగుతున్న అరాచకాలను అడ్డుకుంటామని పిడికిలి బిగించి ముందుకు వచ్చారు యెందరో గృహిణులు.. విద్యార్ధినులు.. అమ్మాయిలు! పెళ్లి కూడా వాళ్లకు ప్రతిబంధకం కాలేదు! ఒక్కొక్కరూ వొక్కో లేడీ బ్రిగ్రేడ్! వీళ్ళంతా దేశానికి గొప్ప సందేశాన్ని యిచ్చారు! ‘ఆత్మరక్షణకే ఆయుధం’ అంటున్నారు! తుపాకులు యెక్కుపెడుతున్నారు! తూటాలు దట్టిస్తున్నారు! సుకుమారము వొదిలి మారాము చేస్తున్నారు! సున్నితమైన వేలిని ట్రిగ్గర్ మీద పెట్టి టార్గెట్ ని టార్గెట్ చేస్తున్నారు! వారి కన్ను మనకి వెన్ను! కాంతలు కత్తులైనారు! కరవాలాలై తిరుగుతున్నారు! తిప్పుతున్నారు! కరసేవకు సిద్ధమంటున్నారు! ఆత్మవిశ్వాసమే మా అడ్రెస్స్ అంటున్నారు! అంతే కాదు, దేశంలో యితర ప్రాంతాలలో కూడా శిక్షణ యిస్తామని కొనసాగిస్తామని యెంతో నమ్మకంగా చెపుతున్నారు! అబ్ కీ బార్.. ప్రపంచ మహిళల్లోనే భారతీయ మహిళ అందరికన్నా ముందున నిలబడ్డది!

అయోధ్యా.. నోయిడా.. వారణాసి ప్రాంతాల్లో శిక్షణలను యివాళ మీడియా బూచిని చూపించినట్టు చూపించొచ్చు! కాని మా వూళ్ళో.. వూరు విడిచిపెట్టి వచ్చి వున్న ఈ నగరంలో.. చాలా స్కూళ్ళలో పొద్దున్నే తెల తెలవారక ముందే ఖాకీ నిక్కర్లూ తెల్ల చొక్కాలు వేసుకొని- కర్రలు పట్టుకొని- తలకు ఓం గుర్తుగల కాషాయపు జెండాలు కట్టుకొని- కర్రసాములూ కరాటేలూ చేస్తూ వుంటే.. రేపటి యుద్ధానికి యివాళే సిద్ధమవుతూ వుంటే.. చూడాలంటే కళ్ళు చాలవు! యిది నర సైన్యం కాదు, వానర సైన్యం!

“స్టార్టప్ యిండియా’ – దేశంలోని యువతే మన సంపద. వీరిలో కొత్త కొత్త అన్వేషణలు చేసేవారికి ప్రభుత్వం సాంకేతిక సహకారం, మెంటార్ షిప్ ద్వారా సాయం అందిస్తోంది” అంటూ మీరిచ్చిన ప్రకటన.. ప్రకటన మాత్రమే కాదని, ప్రచారం కానే కాదని, ‘ఆచరణ’ అని అక్షరమక్షరమూ నిరూపిస్తోంది! సాక్ష్యంగా నిలుస్తోంది! దేశంలోని అణువణువూ నినదిస్తోంది!

ప్రతిపక్షాలకు పని లేదు! మేథావులకు పని లేదు! ఆలోచనాపరులు అని చెప్పుకొనే వాళ్ళకి అస్సలు బుద్ది లేదు! యూపీ యెన్నికలలో లబ్ది పొందడానికే యిదంతా చేస్తున్నామని ఆరోపిస్తున్నారు! ఆరోపిస్తారు.. అరుస్తారు.. అంతకంటే యేమి చేస్తారు? ఆరెస్సెస్ ఐయస్ వొకటేనా.. రామ రామ.. దుర్మార్గం కాకపోతే?  ఆరెస్సెస్ ని ఐయస్ తో పోల్చడం మేథో దివాళాకోరుతనం తప్ప యింకోటో మరోటో కాదు! మన వాదాన్ని వాళ్ళు వివాదం చేస్తున్నారు! తప్పనిసరి పరిస్థితుల్లో అయోధ్యలో శిక్షణ పొందుతున్న యువకుల్ని కొద్దిమందినైనా అరెస్టు చేయడాన్ని మేము అర్థం చేసుకోగలము! మళ్ళీ మనం రెట్టింపు వుత్సాహంతో పని చేయాలి! నిజం చెప్పనా.. మీరు అధికారంలోకి వచ్చాకే మాకు అనేక అవకాశాలు వచ్చాయి! మనం విస్తరిస్తున్నాం! అందుకు కూడా మీకు నా కృతజ్ఞతలు!

మన ప్రభుత్వ ప్రతినిధులూ నాయకులూ యెవరి వంతు సహకారం వారు అందిస్తూ మాట్లాడుతున్నారు! వారికి నా కృతజ్ఞతలు! అన్నట్టు చెప్పడం మరిచాను, మన సుబ్రహ్మణ్య స్వామి అయోధ్యలో ఆలయ నిర్మాణం యీ యేడాదే చేస్తామనడం.. దానికి వుమా భారతి గారు ‘సుబ్రహ్మణ్య స్వామే నా హీరో’ అనడం యివన్నీ కూడా మాలో నిద్రాణమై వున్నా ఆత్మా’రాముణ్ణి’ లేపుతున్నాయి! మేల్కొలుపుతున్నాయి!

మనది లౌకిక రాజ్యం! లౌకిక రాజ్యానికి యెప్పుడూ శ్రీరాముడే రక్ష! నాకు తెలుసు మీరు రామ రాజ్యం తెస్తారు! తెచ్చి తీరుతారు!

‘అబ్ కీ బార్’ ప్రకటనలోనే- మీతో మాట్లాడడానికి ఫోను నెంబరు యిచ్చి మిస్సుడు కాల్ యివ్వమన్నారు.. యిచ్చినా యివన్నీ మాట్లాడే అవకాశం వుండదని మీకు యిలా వుత్తరం రాయాల్సి వొచ్చింది!

‘యధారాజా తదా ప్రజ’ తప్పక అవుతారని ఆశిద్దాం..!

మీకు మరోసారి మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేస్తూ..

జై హింద్!

మీ

దేశభక్త అభిమాని

 

 

మీ మాటలు

 1. Thirupalu says:

  యదారాజ తదాప్రజా మారింది దేశం మనమందరం పండగ జేసుకోవాలి.
  మై డియర్ ఆరెస్సస్ అబిమాని మనదే శం రామరాజ్యంగా మారడాన్ని అద్భుతంగా అవిష్కరించారు.

 2. Chandrika says:

  చాలా భయం ఉందే మీకు? చెన్నై లో మీకు వరదలు వచ్చాయి తెల్సా ? మీకు తెలియక పోవచ్చులెండి పాపం. ఎందుకంటే మీరో పెద్ద రచయిత కదా. ఇలాంటి వ్యాసాలు వ్రాయటం లో మునిగి ఉన్న మీకు అవి తెల్సుకోడానికి సమయం చిక్కి ఉండదు. చెన్నై లో వరదల లో చిక్కుకున్న ప్రజలని అడిగిచూడండి ‘ఖాకీ నిక్కర్లూ తెల్ల చొక్కాలు వేసుకొని- కర్రలు పట్టుకొని- తలకు ఓం గుర్తుగల కాషాయపు జెండాలు కట్టుకొని- కర్రసాములూ కరాటేలూ చేస్తూ ‘ RSS వాళ్ళు ఏం చేసారో !!

 3. P V Vijay Kumar says:

  RSS వాళ్ళు ఏం చేసారో తెలుసుకోకుండా ఎలా రాస్తారు బజారా గారు మీరు ? స్వతంత్ర దేశం లో మొదటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొంది నిషేధించబడ్డం అంటే మాటలా ? బాబ్రీ మజీదు కూల గూట్టడం, గుజరాత్ లో ముస్లిములను చంపడం, చర్చులపై రాళ్ళు రువ్వడం, పాస్టర్లను చంపడం, సరస్వతీ విద్యాలయాల్లో సంస్కృతం నేర్పించడం, అన్నిటికంటే ముఖ్యంగా ఆవులను కంటికి రెప్పలా కాప్పాడ్డం….మరేటి…ఇవన్నీ టూ ఇంపార్టెంట్ యు నో ?! RSS లేపొతే చెన్నై ఏమై పోయుండేది…నిట్ట నిలువునా మునిగిపోయుండేది. వాళ్ళున్నారు కాబట్టి జయ లలిత ఊపిరి పీల్చుకోగలిగింది గాని….వామ్మో ! నేపాల్ కూడా RSS పుణ్యమా అని బతికి బట్ట గట్టిందండి. అంతెందుకు, అందర్నీ ‘ పాకిస్తాన్ వెళ్ళిపో, పాకిస్తాన్ కు వెళ్ళిపో ‘ అని గీ పెడతారు గాని రేపు పాకిస్తాన్ లో వరదలొచ్చినా నేపాల్ కు మల్లే వెళ్ళి రక్షిస్తారు అలానే చేస్తారు. బాంగ్లా దేశ్ కూలీలను మన దేశం లోకి రావద్దు అంటారు గాని, రేపు బంగ్లా దేశ్ లో భూకంపమొస్తే బతికించేది ఎవరనుకున్నారు ? RSS నే ! సో, నిజానికి ట్విన్ టవర్స్ తాలిబన్ కూల దోసినప్పుడు వీసాలు దొరకలేదు గాని , అమెరికాను కూడా ఆదుకునే వాళ్ళు. అంతెందుకండి ….ఇళ్ళు వాకిలి లేని వాళ్ళకు ‘ ఘర్ వాప్సీ ‘ ద్వారా ఎన్ని ఇళ్ళు కట్టిస్తున్నారు అనుకున్నారు ? ( నా పక్కనెవరో ఘర్ వాప్సీ అంటే ఇళ్ళు కట్టడం కాదురా బాబు….అని అరుస్తున్నారు ఉండండి వాళ్ళను పాకిస్తాన్ కు వెళ్ళిపోమని కుళ్ళబొడిచి వస్తాను…ఈ RSS అంటే అస్సలు అర్థమవ్వడం లేదు ఎవరికీ !! )

  • ‘సరస్వతీ విద్యాలయాల్లో సంస్కృతం నేర్పించడం, అన్నిటికంటే ముఖ్యంగా ఆవులను కంటికి రెప్పలా కాప్పాడ్డం’ ఈ ఒక్క మాట తో వేల ఏళ్ల తరబడి ఉన్న ఈ సంప్రదాయం అంటే మీకు ఎంత చులకనో, హేళనో అర్ధం అవుతోంది. మీకు బాధ ఏంటి సంస్కృతం నేర్పిస్తే? మిమ్మల్ని నేర్చుకోమని వారేమి అడగలేదే ? ‘స్వతంత్ర దేశం లో మొదటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్’ – అంతర్జాతీయం గా భారత దేశాన్ని తలవంపులు ఎందుకు తెస్తారు ఇటువంటి మాటలతో? అల్లరి మూకలు ఏ మతం లో అయిన ఉంటారు. అది తెల్సుకోండి. మీరు అన్న ఒక విషయాన్నీ మాత్రం ఒప్పుకుంటున్నాను. ఏకీభవిస్తున్నాను ‘నిజానికి ట్విన్ టవర్స్ తాలిబన్ కూల దోసినప్పుడు వీసాలు దొరకలేదు గాని , అమెరికాను కూడా ఆదుకునే వాళ్ళు’. దేశం బాగుపడాలంటే ఎప్పుడు ఏదో విధం గా ప్రతి విషయం మీద నీళ్ళు చల్లాలి అన్న ధోరణి ని మానుకోండి. ఒక మనిషి చేసే పనిని మెచ్చుకోవడానికి ప్రయత్నించండి. హిందూ ధర్మం అంటే అంత చులకన పనికి రాదు. మీరు భారత దేశపు వాసులైతే మీ చుట్టూ ఉండే వంద మంది లో 80 మంది హిందూ ధర్మం వారే. ఎవరో ఒక అల్లరి మూక ఆ విధం గా ఉందని, మీ చుట్టూ ఉన్న 80 మంది పాటించే ధర్మాన్ని అంత ద్వేషించనక్కరలేదేమో.

  • @ విజయ కుమార్,

   ఘర్ వాపసి ఎమి నిన్నమొన్న మొదలైన కొత్త విషయం కాదు. అది చాలా పాతది. ఒక్కొక్క కాలంలో దాని అర్థం ఒక్కక్క విధంగా మారుతూవచ్చిందనిపిస్తుంది. బహుశా మీకు దాని గురించి తెలిసి ఉండక పోవచ్చు.

   బెంగాలి దళితనాయకుడు మా మద్దతు మీకే, మేము మీతోనే కలసి పాకిస్థాన్ నిర్మాణంలో భాగస్వాముల మౌతాం అని జిన్నా ముస్లిం లీగ్ పక్షం వహించిన తొలి న్యాయశాఖా మంత్రి జోగేందర్ నాథ్ మండల్, ఆదేశం లో పట్టుమని మూడేళ్లు కూడా ఉండలేక హిందుస్థాన్ కు తిరుగు ముఖం పట్టారు. ఇది ఒకరకంగా ఆ కాలం నాటి ఘర్ వాపసి నే. ఆయన ఘర్ వాపసి కి దారితీసిన కారణాలు, లియాఖత్ ఆలిఖాన్ కు ఆయన రాసిన రాజీనామ లేక ఒకసారి చదివితే మీకు విషయం భోదపడుతుంది. ఇది రాజీనామ లేఖ అనే కన్నా చిన్న సైజు ఆత్మకథ అనుకోవచ్చు. నేను 10పేజిలు రాసిన రాజీనామను చదవలేదు. పాకిస్థాన్ లో ఆయన పడ్డ కష్టాలను రాజీనామ లేఖలో ఏకరువు పెట్టాడు. తీరిక ఉన్నపుడు చదువండి.

   https://en.wikisource.org/wiki/Resignation_letter_of_Jogendra_Nath_Mandal

   • @విజయ కుమార్, Please read this article also

    Jogendra nath mandal chosen by Jinnah banished by bureaucracy

    Mandal’s support for Muslim League, his sacrifices for Pakistan, and his love for Muslims cannot be discredited. His ill-treatment at the hands of a bureaucrat is a dark chapter in our history.

    http://www.dawn.com/news/1217465

 4. కె.కె. రామయ్య says:

  RSS వాళ్ళు ఏం చేసారో అనే అక్కసు కన్నా మతవాద చాందస వాదాన్ని సమర్ధవంతంగా నిలువరించటం లోని మన సామూహిక వైఫల్యానికే విచారిస్తున్నా విజయ్ కుమార్ గారు.

  నిర్భయంగా ఒంటి చేత్తో కలం పోరుచేస్తున్న బమ్మిడి జగదీశ్వర రావు గారికి వొందనాలు.

  • శ్రీనివాసుడు says:

   ఇది కచ్చితంగా మన వైఫల్యమే రామయ్య గారూ! అయితే ‘‘సామూహిక’’ కాదు, వైయుక్తిక భావజాల భ్రాంతి వైఫల్యం. ఎందుకంటే, ఒక మత ఛాందసవాదాన్ని గురించి వందలాది వ్యాఖ్యలు, వ్యాసాలు వ్రాసేవారు మరొక మత ఉగ్రవాదాన్ని, మత ప్రచార ప్రలోభాలనీ గురించి మాట్లాడరు, ఊసే ఎత్తరు. కారణం తెలియదు. అందరూ అన్ని రకాల మతఛాందస వాదాలని భావజాలాలకి అతీతంగా ఖండించినప్పుడే సామూహిక విజయం సాధించగలిగేది. సమూహంగా నిలబడటానికి ముందుగా అవతలివ్యక్తిని మనిషిగా అంగీకరించగలిగివుండాలి. అది లేకుండా మనువాద అనే పడికట్టుపదాలలో చిక్కుకుపోతే ఎవడికి వాడే గ్రేట్.

 5. satyanarayana says:

  I am one of those scientists who feels that it is no longer enough just to get on and do science. We have to devote a significant proportion of our time and resources to defending it from deliberate attack from organised ignorance. Richard Dawkins

  Religion is capable of driving people to such dangerous folly that faith seems to me to qualify as a kind of mental illness.( Richard దవ్కిన్స్)

  The take-home message is that we should blame religion itself, not religious extremism – as though that were some kind of terrible perversion of real, decent religion. Voltaire got it right long ago: ‘Those who can make you believe absurdities can make you commit atrocities.’ So did Bertrand Russell: ‘Many people would sooner die than think. In fact they do.”
  ― Richard Dawkins,

  “Religion prevents our children from having a rational education; religion prevents us from removing the fundamental causes of war; religion prevents us from teaching the ethic of scientific cooperation in place of the old fierce doctrines of sin and punishment. It is possible that mankind is on the threshold of a golden age; but, if so, it will be necessary first to slay the dragon that guards the door, and this dragon is religion.” Bertrand Russel .Bertrand Russell (1930)

  పైన ఉదహరించినవన్ని ,ఈ ఛాందస వాదానికి సంబంధించినవే ,సువర్ణాక్షరాలతో మన పాఠశాలల్లో ,విశ్వవిద్యాలయాల్లో ,ముఖద్వారాలలో లిఖింపతగినవి .

  కె కె రామయ్యగారు ,చెప్పినట్లు ,మత వాదాన్ని సమూలంగా నిలువరించడం లో “Rationalists ” ,సామూహిక వైఫల్యానికి సిగ్గుపడి ,ఆలశ్యం కాకుండా ఈ విశాల విశ్వంలో( కొన్ని కాంతి సంవత్సరాల పరిధిలో) , మనకు తెలిసి ,ఉన్న ఒకే ఒక “Intelligent ” species (మనిషి) , ని రక్షించుకోవాలి .

  సుమారు ,470-500 కోట్ల సంవత్సరాల కాల గమనం తర్వాత ,CARL SAGAN అన్న ” Pale బ్లూ డాట్ ” the only Home we have ever known ,మనం నివసిస్తున్న భూమి , దాని మీద జీవజాలం ,ఈ స్థాయికి వచ్చింది . దాన్ని మనమే రక్షించుకోవాలి .

 6. దేవరకొండ says:

  హిందువులకోసం నిజంగా ఇంత కృషి జరుగుతోందా! అయితే జీవితాంతం మోడీయే అధికారంలో ఉండవచ్చని అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరేమన్నా ఎంత అవమానకరంగా మాట్లాడినా, సినీమాల్లో రచనల్లో వెటకారాలు చేసినా వెర్రినవ్వొకటి నవ్వి తుడుచుకు పోయే ‘పౌరుషహీన ‘ హిందువులకోసం ఇంత కృషి మోడీగారి అధ్యక్షతన జరుగుతోందా! అంటే ‘ఇతర శక్తుల’ కోసం ఇలాంటి కృషి మోడీగారు అధికారంలో లేనంత కాలమూ జరిగేవుండాలి…..లాజికల్గా! అంటే వాళ్లది ‘కడుపు నిండిన బేరం’. వాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. అమెరికాని కూడా దడదడ లాడించారు కాబట్టి అంత కాకపోయినా బాంబులూ మిస్సైళ్ళూ విమానాలూ లేకపోయినా కనీసం కాకీ నిక్కర్లూ లాఠీ కర్రలతోనైనా మనం రామరాజ్యాన్ని తెచ్చేస్తున్నామ్ అన్న పిచ్చి భ్రమలో బతుకుతున్నారు! వాళ్ల ఆ భ్రమ ను కూడా మనం సహించలేకపోతే ఎలా? ‘ఆ కలలు కూడ దోచుకునే దొరల’ మై పోవాలా ఇలాంటివి రాసి!

  • శ్రీనివాసుడు says:

   బెమ్మాండం దేవరకొండ వారూ! ఇంతకాలానికి ఒక్క స్వరం ఈ హిందూత్వం భ్రాంతిని ధిక్కరిస్తోంది. చెవులకి ఎంత ఇంపుగా వుందో!
   గత 200 ఏళ్ళనుండి మొదలైన కరడుగట్టిన హిందూత్వా ఫాసిజం కేవలం 3000 మందితో దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని కూడా తరమలేకపోయింది. కాశ్మీర్లో సగం దాయాదికి అప్పగించింది.
   చైనాకు గడ్డిపరక కూడా మొలవని అనేక వేల మైళ్ళ భూభాగం అప్పగించింది.
   దేశంలో అక్రమ చొరబాటుదారులు ఎంతమంది వున్నారో లెక్క కూడా తేల్చలేకపోయింది. వారు నిజంగా సమస్యగా మారుతోంది బడుగు వర్గాలకే. కులీనవర్గాలకి ఏ ఢోకాలేదు.
   లెక్కలేనంతమంది దురాక్రమణదారుల దాడిలో వేయి ఏండ్లనుండీ కొల్లగొట్టబడింది.
   ఇప్పుడు మోడీ నాయకత్వాన అఖండ హిందూ సామ్రాజ్యం వైపు పయనిస్తూ ఆ దారిలో 8 x 8 గుడారాల్లో 30 ఏళ్నుండీ బిక్కు బిక్కుమంటూ హీనంగా జమ్మూలోను, ఢిల్లీ బయట జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న 3,20,000 మంది కాశ్మీర పండిట్ల ఉనికినే పరిహస్తోంది.
   ఇంత బలవత్తరమైన మనువాద హిందూత్వ సామ్రాజ్యవాద గాలిమరల ప్రభువుల తాటాకు చప్పళ్ళకి బెదిరే కుందేళ్ళ భ్రాంతిని బాగా ప్రశ్నించారు.

 7. సూరపరాజు రాధాకృష్ణమూర్తి says:

  సైన్సు పరిధీ పరిమితుల గురించి కొందరు గొప్పవిజ్ఞానవేత్తలు చెప్పింది అహేతుకమని కొట్టేస్తారు,చాలామంది విజ్ఞానవేత్తలే. కాని ఈనాటి సైన్స్ ఇంద్రియజ్ఞానపరిధిని దాటి అతీంద్రియజ్ఞానం వైపు చూడవలసిన అవసరం గుర్తించింది. కాని విరోధించే శక్తుల బలం నానాటికి పెరుగుతూనే ఉంటుంది. వేదాలతోనే పుట్టింది అవైదికం. వేదాలను గంగలో కాదు సముద్రాలలో ముంచేసే శక్తులు అనాదిగా ఉంటున్నాయి. ఆ శక్తులకు బలం కాలంతో పెరుగుతూ ఉంటుంది కూడా. శ్రద్ధలేనిచోట శ్రద్ధ కలిగించలేము. చేయగలిగిందల్లా ఉన్న శ్రద్ధను కాపాడుకోడమే. దానికి లోపలి బలమే బలం. బయటి బలం బలహీనతే. రాజకీయానికి దీనికీ ఏ సంబంధమూ లేదు. ఏ రాజకీయమైనా తేడా ఉండదు. రెండే రాజకీయపక్షాలు. అధికారపక్షము,ప్రతిపక్షము. పక్షం పేరు మాత్రమే మారుతుంది.మరేమీ మారదు. అధికారంలోకి రావడం,వచ్చినది నిలుపుకోడం. అందరి భాష ఆచరణ ఒకటే.

  • శ్రీనివాసుడు says:

   చాలా సూటిగా, సూక్ష్మంగా వున్న విషయాన్ని చెప్పేరు రాధాకృష్ణమూర్తిగారూ!
   ఉన్నదంతా రాజకీయమేనన్న ఎఱుక కల్గిననాడు మాత్రమే ఈ ఇజాల గోల, భ్రాంతుల హేలలోనుండి బయటపడతారు.
   మీరన్నట్లు శ్రద్ధ అనే విత్తనాన్ని కాపాడుకోగలిగితే కాలం అనుకూలించినప్పుడు మొలకలెత్తడానికి అవకాశం ఎప్పుడూ వుంటుంది.

 8. కె.కె. రామయ్య says:

  ”మతం మత్తు మందు” లాంటిది అన్న కార్ల్ మర్క్స్ కొటేషన్ కూడా విశ్వవిద్యాలయాల ముఖద్వారాలలో లిఖింపతగినదేనేమో కదా సత్యనారాయణ గారూ.

  ”ఆజాదీ” … అంటే విముక్తి …. పేదరికం నుండి విముక్తి, ఆకలి నుండి విముక్తి, పెట్టుబడిదారీ వ్యవస్థనుండి విముక్తి, హిందూ మతోన్మాదం నుండి విముక్తి, మనుస్మృతి నుండి విముక్తి కావాలని నినాదాలిస్తున్నJNU స్టూడెంట్ యూనియన్ లీడర్ కన్హయ కుమార్ నేటితరం యువత ఆకాంక్షలను ప్రతిద్వనిస్తున్నాడు. మతం కన్నా మానవత్వం, దేశభక్తి నినాదాల కన్నా దేశప్రజల సౌభాగ్యమ్ గురించి ప్రశ్నిస్తున్నారు.

  తమ విశ్లేషణల ద్వారా కలం యోధుడు బమ్మిడి జగదీశ్వర రావు గారికి మద్దతు పలికిన సత్యనారాయణ, దేవరకొండ, రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసుడు గార్లకు కృతజ్ఞతలు.

  • రామయ్య గారు !! సత్యనారాయణ గారు చెప్పినవన్నీ , మీరు చెప్పిన కార్ల్ మాక్స్ ”మతం మత్తు మందు” ఈ వాక్యం అన్నీమతాలకి వర్తిస్తాయి కదా మరి. మీలాంటి వారందరూ మరి హిందూ మతం ఒకటే మతం అన్నట్లు ఎందుకు మాట్లాడుతారు? అసలు హిందూ మతం అనేది లేదు. దీనిని సనాతన ధర్మం అంటారు. It’s a way of living, respecting each other. మతం అన్నది భారత దేశానికీ లేదు. అందుకే ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వారి వలన దాడులకి గురయ్యింది. మీరు, సత్యనారాయణ గారు చాలా కష్టపడి టైపు చేసారు కానీ ఎవరికి చెప్పాలో వారికి చెప్పండి. సనాతన ధర్మం పాటించేవారికి మాత్రం కాదు. ‘హిందూ మతోన్మాదం నుండి విముక్తి, మనుస్మృతి నుండి విముక్తి ‘- ఏ ‘విముక్తి’ లేకుండానే JNU లో చదువుతున్నాడా ఇతను? ఎందుకు ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారో మీకే తెలియాలి. నిజం గా మనుస్మృతి అంటే ఏంటో తెల్సా ఇతనికి ? మొత్తం చదివాడు అంటారా ?సంస్కృతం లో అంత దిట్టా? ‘సరస్వతీ విద్యాలయాల్లో’ నేర్చుకున్నడా సంస్కృతం? ఇలాంటి వాళ్లు ఉండటం ‘దేశప్రజల సౌభాగ్యమ్’ కాదు ‘దేశప్రజల దౌర్భాగ్యం’. ప్రజలు కట్టే పన్నులతో సబ్సిడీ తీసుకుంటూ చదువుకోవడం తప్ప అన్నీ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు . అండమాన్ జైల్లో బ్రిటిష్ వారి చేతిలో మరణించిన అమర వీరులు తెచ్చిఇచ్చిన ‘స్వాతంత్రం’ , ఇటువంటి వారికి ఈ విధం గా వాక్ స్వాతంత్ర్యం ప్రసాదించింది!! అది ‘దేశప్రజల సౌభాగ్యమ్’ లేక ‘దేశప్రజల దౌర్భాగ్యం’ అనేది మీలాంటి పెద్దలకే తెలియాలి. ఏది ఏమయినా అందర్నీ బాగా ప్రోత్సహిస్తున్నారు. చాలా సంతోషం.

 9. దేవరకొండ says:

  It is unfortunate that Mr Ramayya misunderstood those comments which in fact differed with the bajara’s satire on Modi’s so-called Hindutva agenda.

 10. సూరపరాజు రాధాకృష్ణమూర్తి says:

  భజారాగారి ‘అగ్లీ’ రచనకు నేను మద్దతు ఇచ్చినట్టు రామయ్యగారు ఎట్లా అనుకొన్నారో తెలియడం లేదు.
  హేతువాదం గురించి నా స్పందనలో ప్రస్తావించాను. అప్రస్తుతం అనిపించవచ్చు. కాదు. బజారాగారి వ్యాసంలో విషయం మతఛాందసవిజృంభణం. మతం హేతువాదులకు అందదు. కనుక హేతువాద పరిమితులను ఈ నాటి అత్యాధునిక శాస్త్రవేత్తలు,(Heisenberg,Eddington,Fritjof Capra వంటివారు) ఏవిధంగా గుర్తించారో చెప్పడానికి. మతం ‘బుద్ధి’లేనివారి దుర్మతం అన్న హేతువాద పరిమితిని చెప్పడానికి ఆ ప్రసక్తి.
  వేలసంవత్సరాల తరువాత భారతదేశంలో మళ్ళీ సనాతనధర్మధ్వజం ఆకాశమంత ఎత్తులో ఎగురుతోందని పిచ్చి జనాలను నమ్మించే ప్రయత్నం ఆ వ్యాసం : ‘కనబడలేదా ధర్మకిరీటపు ధగధగలు’ అంటూ. మోదీ ప్రభుత్వాన్ని సనాతనధర్మప్రతిష్ఠాపనగా హిందూరాజ్యంగా చిత్రించే విచిత్ర ప్రయత్నం మనదేశంలోని చాలామంది సర్వధర్మపరిత్యాగం చేసిన సెక్యులర్ సన్న్యాసులకు పిచ్చిగా నచ్చుతుంది. కాని నాకు నచ్చదు. ఎందుకంటే అలా సనాతనధర్మం నిలబెట్టడం జరిగితే సంతోషించేవాళ్ళలో నేను ఉంటాను. రాజకీయం వేరు.ధర్మం వేరు. ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నంతకాలం దేనిని వ్యతిరేకించిందో అధికారంలోకి రాగానే దానినే అవలంబిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్లమెంటును స్తంభింపజేయడం దాని ధర్మం. ఎన్ని నెలలైనా అలా చేయవచ్చు. అధికారంలోకి రాగానే అది అప్రజాస్వామికం.కాంగ్రెసైనా భాజపా అయినా లెఫ్ట్ అయినా రైటయినా ప్రతిపక్షభాష ఆచరణ ఒకటే. అధికారభాష ఆచరణ ఒకటే. రేపు లెఫ్ట్ ఫ్రంటు లాంటిదేదైనా అధికారంలోకి వచ్చినా ఫక్తు భాజపా లాగానే ప్రవర్తిస్తుంది. తమ సిద్ధాంతాలను ఆమోదించని పక్షాలపట్ల ఇదేవిధంగా ఇంతకంటే అసహనంతో తీవ్రంగా ప్రవర్తిస్తుంది.అధికారంలో నిలవడం కోసం ఏదైనా నీతే అన్న ఆలోచనలో లక్ష్యంలో పార్టీ భేదాలుండవు.
  ‘ఆరెస్సెస్ ఐయస్ వొకటేనా.. రామ రామ.మనది లౌకిక రాజ్యం! లౌకిక రాజ్యానికి యెప్పుడూ శ్రీరాముడే రక్ష! నాకు తెలుసు మీరు రామ రాజ్యం తెస్తారు! తెచ్చి తీరుతారు!’అని బజారాగారి వ్యంగ్యం. ఆరెస్సెస్స్ ఐఎస్ ఒకటా,కాదా? ఈనాడు ప్రపంచదేశాలన్నిటిలో ప్రవేశించి భయభ్రాంతులను చేస్తున్న ఐ.ఎస్. కూ ఆరెస్సెస్సుకూ తేడా లేదంటారా? ఉన్నదని బజారాగారు అనకపోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో హేతువాదం ఒక్క సనాతంధర్మంలోనే మతమౌఢ్యం హింస చూస్తుంది.
  ప్రజాస్వామ్యవ్యవస్థలో, ప్రభుత్వం సంపూర్ణంగా మతాలను ‘privatise’ చేయాలంటాను. మతం వైయక్తికం. రాజకీయాలలో మతప్రసక్తి ఉండరాదు.సమూహాలలో ప్రదర్శనకు ప్రోత్సాహం ఉండరాదు.గణేష్ ఉత్సవకమిటీలు రాజకీయాలకు మొదటిమెట్టు కారాదు. ముస్లిం క్రైస్తవ మరి ఏ మత constituencies ఉండరాదు. కాకుండా రాజకీయం నడుస్తుందా? నడవగలదు అని నమ్మడం నమ్మించే ప్రయత్నం చేయడం భ్రమ కాదా? రాజకీయంతో ముడివడని ధర్మవ్యవస్థను కలగంటూ ఉండడమే నావంటివారు చేయగలిగినది.

 11. కె.కె. రామయ్య says:

  “మతం వైయక్తికం. రాజకీయాలలో మతప్రసక్తి ఉండరాదు.సమూహాలలో ప్రదర్శనకు ప్రోత్సాహం ఉండరాదు.
  రాజకీయంతో ముడివడని ధర్మవ్యవస్థను కలగంటూ ఉండడమే నావంటివారు చేయగలిగినది ” అంటున్న రాధాకృష్ణమూర్తి గారూ బమ్మిడి జగదీశ్వర రావు గారి వ్యాసంలో అలాంటి సందేశం ఉన్నట్లుగా అర్ధం చేసుకున్నాను. ( ఆరెస్సెస్, ఐయస్ వొకటేనా అనే వాదనలోకి వెళ్లకుండా )

 12. దేవరకొండ says:

  నేనను కున్న దంతా రాసే ఓపిక లేక ఒక్క ‘unfortunate ” అనేసి సరిపెట్టేస్తే రాధా కృష్ణ మూర్తి గారు ఎందఱో నాలాంటి వాళ్ల హృదయాల్ని అక్షరాల్లో ఆవిష్కరించారు. 100% వారితో ఏకీభవిస్తూ…

 13. satyanarayana says:

  అర్ధం లేనిది కాబట్టే “మతం “, హేతువాదులకు అందదు ,

  REASON ,హేతువు సగం లో ఆగిపోతే , పరిమితి ప్రసక్తి వస్తుంది .

  The universe we observe has precisely the properties we should expect if there is, at bottom, no design, no purpose, no evil and no good, nothing but blind pitiless indifference.
  — Richard Dawkins,

  సూరపనేని రాధాకృష్ణ ,గారి హేతువాద పరిమితుల సంశయానికి సంబంధించి, Richard Dawkins అన్న మాటలు
  After Darwin and after all the knowledge that the scientific fraternity has acquired and put together,” IT IS WITHOUT A DOUBT ASCERTAINED THAT THERE IS NO SUPERNATURAL FORCE ACTING ON THE UNIVERSE ”

  ఒక పక్కన ,ఒక్కో ప్రాంతం లో ఒక్కో సమూహం ,పూర్తిగా నిరుపయోగమే కాదు ,ప్రమాదకరం కూడా అయిన “మత” భావనలని ,పసితనం నుంచే బోధించి ,రోజు రోజుకీ ,విష సంస్కృతులని పోషించి , ప్రపంచాన్ని నేడు ఈ స్థాయికి ( ఆఫ్గనిస్తాన్ ,సిరియా,పాకిస్తాన్, etc ) తెచ్చిన తరుణంలో , నేటి జుగుప్సాకరమయిన రాజకీయాలకి తోడు ,మరో పక్క ఎలాటి ధర్మ వ్యవస్థ కావాలి ?
  ఆ ధర్మ వ్యవస్థలు ,ఇంతకాలం చేసిన ప్రబోధాలు ఏమయ్యాయి ? రేపేంచే స్తాయి ?

  ఒక విషయం ,” మతం “,అది ఇస్లాం అయినా,Christianity అయినా,Buddhism అయినా అన్నీ వందల సంవత్సరాలుగా చెప్పబడుతున్న అబద్ధాలు .

 14. satyanarayana says:

  సారీ ,సురపరాజు గా సరిదిద్దుకోవాలని విజ్ఞప్తి

 15. సూరపరాజు రాధాకృష్ణమూర్తి says:

  ధన్యవాదాలు దేవరకొండగారూ.సత్యనారాయనగారూ,మీరు డాకిన్సును ఉదాహరిన్చినట్లే నేను ఇంద్రియజ్ఞానపరిమితులపై అనేక ఉదాహరణలను శాస్త్రవేత్తలవే పేజీలకొద్దీ ఇవ్వగలను.’సైన్స్ ఇస్ అ స్టడీ అఫ్ షాడోస్.’ అన్నాడొక ప్రముఖ పార్టిక్కిల్ ఫిజిక్స్ శాస్త్రవేత్త. పాఠకులను ఇబ్బందిపెట్టడం తప్ప ప్రయోజనం ఉండదు. దన్యవాదాలు.

  • బాగ చెప్పారు. రిచర్డ్ డాకిన్స్ ను ఎవరు సీరియస్ గా తీసుకోరు, హేతువాదులు తప్పించి. అవుట్ డేటేడ్ అయిపోయాడు.

   • శ్రీనివాసుడు says:

    శ్రీరామ్ గారూ!
    మీరు యూజీ కృష్ణమూర్తి అనుయాయి అని నా అవగాహన. ’’ది బయాలజీ ఆఫ్ ఎన్ లైటెన్‌మెంట్‘‘ అనే పుస్తక తెలుగు అనువాదం ‘‘జీవం – జ్ఞానం’’ అని పాలడుగు చంద్రశేఖర్ గారు చేసినదాన్ని ఈ మధ్యనే చదివేను. యూజీ పుస్తకాలతో కొంత పరిచయం నాకు గతంలో వుండేది.
    ఆ పుస్తకంలో 51 వ పుటలో ‘‘నిజానికి, కృష్ణమూర్తిగారి బోధనల కోెణంలో పతంజలి యోగసూత్రాల గురించి నేనొక పుస్తకం వ్రాసేను’’, అని యూజీ చెప్పుకున్నారు.
    మీ ఎఱుకలో యోగసూత్రాల గురించి వ్రాసిన ఆ పుస్తకం లభ్యమయ్యే స్థానంగానీ, అంతర్జాల లంకెగాని వుంటే చెప్పవలసినదిగా మనవి.
    చాలాకాలం క్రితం గతంలో ’’సైన్స్ అండ్ యూజీ‘‘ అని ఒక వ్యాసం చదివిన గుర్తు.
    అలాగే, సైన్స్ పరిమితుల గురించి యూజీ చెప్పినదాన్ని మీరిక్కడ తెలుగులో ఉదహరిస్తే సముచితంగా వుండగలదని సూచన.
    ముందస్తు నెనరులతో

   • జీవం – జ్ఞానం పుస్తకం గురించి వినలేదు. ఒకసారి యు.జి. మిత్రుల నడిగి ఆపుస్తక వివరాలు కనుకొంట్టాను. అబ్బూరి ఛాయాదేవి గారు తెలుగు జాతి రత్నాలు సీరిస్ లో భాగం గా యు.జి. గురించి పుస్తకం రాసింది. యు.జి. మిత్రులద్వారా ఒక కాపి నాకు చేరింది. ఆవిడకు యు.జి.గారు దూరపుబంధువట.

    * ‘‘నిజానికి, కృష్ణమూర్తిగారి బోధనల కోెణంలో పతంజలి యోగసూత్రాల గురించి నేనొక పుస్తకం వ్రాసేను’’, అని యూజీ చెప్పుకున్నారు.*

    యు.జి. గారు ఏ పుస్తకాలు రాయలేదు. ఇంకాచెప్పాలి అంటే కుష్వంత్ సింగ్ వంటి ప్రముఖుల నుంచి మాములు వారి వరకు ఆటొ గ్రాఫ్ అడిగినా ఇవ్వలేదు. ఐ. యం. ఇలిటరేట్ అని చెప్పేవాడు. యు.జి. గారు ఏ పుస్తకాలు రాయలేదు.
    ఆయన చేసిన సంతకం పాస్పోర్ట్ రెన్యువల్ అప్లికేషన్ కొరకు. అంతే!

   • శ్రీనివాసుడు says:

    శ్రీరామ్ గారూ!
    The biology of Enlightenment, Talks with U.G. అని ముకుందరావు గారు ఎడిట్ చేసిన ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి విశాఖపట్టణం వాస్తవ్యులు రాజశేఖర్ పాలడుగు గారు ‘‘జీవం – జ్ఞానం, యూజీ కృష్ణమూర్తితో సంభాషణలు’’ అనే పేరుతో అనువదించారు.
    వారికి డా. వావిలాల సుబ్బారావుగారు, సి.హెచ్. హనుమంతరెడ్డి రారు, కె. చంద్రశేఖర్ గారు, బి. రాజేశ్వరరావు గారు పుస్తక అనువాదంలో సహకరించారు.
    ఆ అనువాదంలో ఒకచోట యూజీ అన్నట్లుగా ఆ సంభాషణ వున్నది. ఆ పుస్తకం నా దగ్గర వున్నది.

   • శ్రీనివాసుడు says:

    శ్రీరామ్ గారూ!
    SCIENCE AND U.G.
    AN EXPOSITION OF THE SCIENTIFIC BASIS OF U.G.’S PHILOSOPHY
    By Dr. O. S. Reddy
    లంకె : http://www.well.com/user/jct/reddi.htm
    ఈ లంకెలో యూజీ కృష్ణమూర్తి పుస్తకాలన్నీ ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
    1947 నుండి 1953 వరకు మద్రాసులో క్రమం తప్పకుండా జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాలకు యూజీ హాజరయ్యేవారు. ఇరువురి మధ్యనా ముఖాముఖి సంభాషణలు చాలా నడిచాయి.
    పతంజలి యోగసూత్రాలను గురించి తాను ఆ దశలో వ్రాసిన పుస్తకం కావచ్చు,
    ప్రాజ్ఞులెవరయినా ఆ వ్యాసాన్ని తెలుగులోకి తర్జుమా చేసి సారంగ లో ప్రచురిస్తే బాగుండు.

   • శ్రీనివాసుడు గారు, 2012లో యు.జి.మిత్రులనుంచి ఒక అహ్వాన పత్రిక వచ్చింది. అందులో చలసాని ప్రసాద్ గారు, జగద్దాత్రి గారు, మీరు రాసిన రచయితలు విశాఖపట్టణంలో స్నేహ కుటి & చలం ట్రస్ట్ ఆధ్వర్యం లో ఒక పుస్తకావిష్కరణ సభను నిర్వహించారు. “జీవం – జ్ఞానం’’ పుస్తకం పాలడుగు రాజశేఖర్ గారు ఆ తరువాత రాసిన పుస్తకం లా ఉంది. దీనిని నేను చదువలేదు. ఇంగ్లీష్ వర్షన్ చదివాను.

    *పతంజలి యోగసూత్రాలను గురించి తాను ఆ దశలో వ్రాసిన పుస్తకం కావచ్చు*

    ఆ పుస్తకం ఉండక పోవచ్చు. యు.జి.గారి కెలామిటి తరువాత ఒక సారి ప్రయాణం లో ఆయన గతానికి సంబందిచిన వస్తువులన్ని పోయాయి. ఆయన మిత్రులెవ్వరు ఈ పుస్తకం గురించి చర్చించినట్లు నేను ఎప్పుడు వినలేదు.

 16. సూరపరాజు రాధాకృష్ణమూర్తి says:

  శ్రీనివాసుడుగారూ,నా కామెంటుకు మీరిచ్చిన స్పందనకు ధన్యవాదాలు. మీస్పందనలు నేను ఆసక్తితో చదువుతాను. చాలాకాలం నుండి పత్రికలకు దూరంగా ఉంటూ వచ్చాను.కొద్ది రోజుల క్రితం సా’రంగ’ప్రవేశం చేయడం అనుకోకుండా జరిగింది. ఒకదానిలో అడుగు పెట్టిన తరువాత మరొకటి. మనభావస్వామ్యం గుర్తించాను.
  ‘అందరూ అన్ని రకాల మతఛాందస వాదాలని భావజాలాలకి అతీతంగా ఖండించినప్పుడే సామూహిక విజయం సాధించగలిగేది. సమూహంగా నిలబడటానికి ముందుగా అవతలివ్యక్తిని మనిషిగా అంగీకరించగలిగివుండాలి’,అన్నారు. వినిపొంచు కొనేవారు తక్కువవుతున్నారు. అయినా చెబుతూ ఉందాం. నా వయసు మీరు ఊహించేఉంటారు. ఎనభయ్ దాటినవాడిని. మీ లాంటి వారు కొనసాగించవలె.

  • శ్రీనివాసుడు says:

   నెనర్లు రాధాకృష్ణమూర్తి గారూ!
   అనావృతంగా వివేచించమనే విత్తనాలు జల్లడమే మన పని.
   కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
   మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి || 2-47 ||

  • శ్రినివాసుడు గారు, బ్లాగులో న్యుటన్, ఐన్ స్టిన్, కారల్ సగాన్ ల కాలం నాటి సైన్స్ ను చర్చిస్తూంటారు. కాని అది పాతబడి చాలా కాలమైంది. ఇప్పుడు సైన్స్ ఇండస్ట్రి అంతా హెల్త్ కేర్ , హ్యుమన్ కాన్షియస్ నెస్ ల పై బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. యం.డి. చదివిన డాక్టర్ ఫిజిషియన్ గా కాకుండా కాస్మెటిక్ ట్రీట్ మెంట్ ప్రాక్టిస్ క్లింక్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకొంట్టున్నాడు. భారతసంతతి చెందిన శివ అయ్యాదొరై వంటి వారు గ్లొబల్ కంపెనిలకు తలనొప్పిగా తయారయ్యారు. ఆయన మొనసాంటో ను చాలెంజ్ విసిరుతూ రోజు ట్వీట్లు చేస్తున్నా, ఆ కంపెని వాళ్ళు జవాబు లివ్వటం లేదు.
   Shiv అయ్యాదురై నూతన ఆవిష్కరణ ఈ మైల్ అంశంలో వివాదం చెలరేగితే ఆయనకు మద్దతుగా నోం చోంస్కి అండగా నిలచాడు.

   సైన్స్ పరిమితులపై,యునివర్సిటిలలో సైంటిస్ట్ లు చేసే ఫ్రాడ్ పై యుట్యుబ్ లో ఈ విడీయోలు చుడండి.

   1. Rupert Sheldrake – The Science Delusion
   2. Professor Rustum Roy on Whole Person Healing
   3. V.A. Shiva Ayyadurai’s Independence Day Message for August 15

   http://patch.com/new-jersey/montclair/scientist-challenges-monsanto-10-million-if-you-can-prove-me-wrong-0

 17. satyanarayana says:

  భలే వాళ్ళు ,మానవులు ,
  ఎదుట ప్రతి క్షణం కనిపిస్తున్న లోకాన్నీ ,జరిగిన చరిత్రనీ ,అనుభవిస్తున్న సౌఖ్యాలనీ ,అన్నిటినీ వదిలి ,
  కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాన్నీ ,సమాచారాన్నీ సరిగా క్రోడీకరించుకోక ,…..
  నీడలలో ,భ్రమలో కాలం వెళ్ళబుచ్చుతూ ,ఈ జీవితం ఇంతటితో పరిసమాప్తి ,మన ఉనికి ,మనతోనే ఆఖరు అనుకుంటే ,తట్టుకోలేక
  Before The Big Bang, The Beginning Of Time , ఇలాటి పెద్ద పెద్ద సందేహాలకి సమాధానాలు తెలియవు
  ఏదో ఉంది ,Harry Potter వరల్డ్ లో “ఒక గోడలోనుంచి విచిత్రంగా మరో ప్రపంచం లోకి ప్రవేశించే విధంగా” ,,,ఈ లోకంలో కూడా ! అనుకుంటారు .

  Carl Sagan “COSMOS “, చాలా వివరంగా వివరిస్తుంది మన విశ్వాన్ని ,ఇంకా సందేహాలు మిగలకుండా .
  ధన్యవాదాలందరికి .

 18. సూరపరాజు రాధాకృష్ణమూర్తి says:

  సత్యనారాయణగారూ,మన జీవితదృక్పథాలు విరుద్ధధృవాలు. వివాదం తప్ప సంవాదం ఉండదు. ‘ఈ జీవితం ఇంతటితో పరిసమాప్తి .,అన ఉనికి ,అనతోనే ఆళరు, అనుకొంటేతట్టుకోలేక…’అన్నారు. మీరన్న మాట సత్యమైతే చింత లేదు. సత్యం కాదు కనుకనే ‘తట్టుకోలేక’పోవడం.
  మీకొరకు కాకపోయినా మరికొందరికొరకైనా ఆధునిక విజ్ఞానశాస్త్రవేత్తలు హేతువాదపరిమితులవిషయంలో ఏం చెప్పారో చెప్పవలె. నా జూన్ 16 తపాలో చెప్పిన శాస్త్రవేత్తలను చదివే తీరిక లేనివారికి,స్వామి రంగనాథానంద గారి ‘The Message of the Upanishads ‘Bhartiya Vidya Bhavan చూడతగినది .అన్ని సందేహాలను నివర్తించగలదు.

మీ మాటలు

*