సూఫీ- సంత్ సంవాద కేళి

 

 

-అవ్వారి నాగరాజు

~

 

సంత్ ఏక్‍నాథ్ ఒక రోజున స్నానమాచరించడానికి గోదావరీ నదీ తీరానికి వెళ్ళాడట. శుచిగా స్నానం చేసి తిరిగి వస్తుండగా దారి పక్కన ఉన్న ఒక ఫకీరు ఆయన మీద ఉమ్మి ఊస్తాడట. శరీరం మైల పడిపోవడంతో  ఆయన తిరిగి మరోసారి స్నానానికి వెళతాడట. తిరిగి వస్తుండగా ఆ ఫకీరు మరో సారి ఆయన మీద ఉమ్మి ఊస్తాడట.  ఏక్‍నాథ్ ఆ ఫకీరుని ఏమీ అనకుండా సహనం వహించి తిరిగి మరో సారి నదికి వెళతాడట.

స్నానం చేసి తిరిగి రావడం, ఫకీరు ఉమ్మడం – ఇలా అనేక సార్లు జరిగిన తర్వాత కూడా తనని ఏమీ పల్లెత్తు మాట కూడా అనని సంత్‍ సహనానికి ఆ ఫకీరు పశ్చాత్తాపం చెంది తనను క్షమించమని అడుగుతాడట. పైథాన్(ప్రతిష్టాన పురం) నివాసి అయిన ఏక్‍నాథుని గొప్పతనం గురించి జనసామాన్యపు నాలుకల మీద ఉన్న ఈ కథనానికి కొనసాగింపు ఉంది.

తనని క్షమించమని అడిగిన ఫకీరుకు, బదులుగా ఏక్‍నాథ్-  మీరు చేసిన ఈ పని వల్లనే పవిత్రమైన ఈ గోదావరీ నదిలో అనేక మార్లు  స్నానం చేసే భాగ్యం నాకు కలిగిందని అంటాడట. సంత్ ఏక్‍నాథునితో ఫకీరు జరిపిన ఈ సంవాదాన్ని సంత్ అనుచరులు ఇద్దరు మహాత్ములు జరిపిన దివ్య కేళీ కలాపంగా వివరిస్తుంటారు.

సంత్ గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేందుకు ఫకీరుగా తన పాత్రని పండించిన వ్యక్తి సిద్ధి ఆలీబాబా. ప్రముఖ సూఫీ గురువు.  ఆయన అప్పుడు- మీ మీద ఇన్ని సార్లు ఉమిసాను కదా, బదులుగా ప్రాయశ్చిత్తం చెప్పమంటాడట. నా పుట్టిన రోజునాడు నా భక్తులు చేసే ఉత్సాహాల సందోహంలో, వారి కాలికింద రేగిన దుమ్ము నీ దర్గాపై పడుతుంది పో. అదే నీకు ప్రాయశ్చిత్తం అని సంత్,  బాబాని  సముదాయిస్తాడట.

సంత్ పుట్టిన రోజు ఉత్సవాలలో పాల్గొనే భక్తులు, దారిలో ఉన్న సిద్ధి ఆలీ బాబా దర్గాను చూసి ఈ కథనాన్ని  తలుచుకోవడం ఇప్పటికీ వాడుకలో ఉంది.

జనం వాడుకలో ఉన్న ఈ కథనాలు భక్తి ఉద్యమాన్ని గురించి మనకు సంకేత ప్రాయంగా రెండు విషయాలని తెలియజేస్తున్నాయి. పదమూడవ శతాబ్ధి చివరి వరకూ తెర వెనుకగా ఉన్న ఇస్లామ్- సూఫీ ప్రభావాలు ఉత్తర భారత దేశంలో పద్నాలుగ శతాబ్ధం నుండీ ప్రత్యక్షంగా అయిపోయాయి. ఈ రెండూ పరస్పరం జరుపుకున్న ఆదానప్రధానాలు పైన చెప్పిన కథనంలో మాదిరిగా ఎదురెదురుగా  నిలుచున్న సూఫీ, సంత్‍లు జరిపిన సంవాదకేళిలాగా మారిపోయాయి.  అలాగే,  పైన చెప్పిన కథనంలో మాదిరిగా సాధికారికమైన మత తాత్వికతకు ప్రత్యామ్నాయమైన  విశ్వాసాలూ, ఆచరణా కలగలిసిన సాంస్కృతిక ఆవరణాన్ని భారత దేశ మధ్యయుగాలకు ఇవి అందివ్వగలిగాయి.

ఇలాంటి సాంస్కృతిక వాతావరణం నుండే ఉత్తర భారతదేశపు భక్తి ఉద్యమం అభివృద్ధి చెందింది.

ఙ్ఞానేశ్వర్, నామదేవ్, కబీర్, రాయ్‍దాస్, నానక్, దన్నా, దాదూ, ఇంకా ఒరిస్సాలోని పంచసఖులు, తుకారాం, చైతన్యుడు, మీరా- ఇలా వీరందరూ ఉత్కృష్టమైన సాంస్కృతిక పర్యావరణానికి ఉదాహరణలు. వీరు ఇస్లాం, సూఫీల ప్రభావానికి ప్రత్యక్షంగా లోను కావడమే కాకుండా, తమ కాలపు మత ఆచరణలలోని చెడులను తీవ్రంగా విమర్శించారు కూడా. నామదేవ్ విగ్రహాలను పూజించడాన్ని అపహాస్యం చేస్తాడు. హిందూ-ముస్లీంల నడుమ సయోధ్యను ఏర్పర్చడానికి కృషి చేస్తాడు. కబీర్ ఇటు బ్రాహ్మనీయ హిందూ మతంలోనూ,ఇస్లాంలోనూ ఉన్న అతిని ఖండిస్తాడు. నానక్ మరో అడుగు ముందుకు వేసి ఒక విశ్వాసానికి ఎదురుగా మరో విశ్వాసం నిలబడి ఉన్నప్పుడు వాటి మధ్య సయోధ్య కుదరదని అంటాడు. ఈ రెండింటినీ విడిచి సిక్కుమతాన్ని స్థాపిస్తాడు. ఆయన మహ్మద్ ప్రవక్త జీవితం నుండీ ప్రేరణ పొందినట్టుగా చెప్పుకున్నాడు. సూఫీలవలే గురు పరంపరను ఏర్పరచి గురుస్థానాన్ని మార్గదర్శకంగా చేస్తాడు. ఒరిస్సాలోని పంచసఖులు భారత, భాగవత, రామాయణాలను ఒడియాలోకి అనువాదం చేసి భక్తి మార్గాన్ని సుస్థిరం చేసారు. చైతన్యుడు సంకీర్తనామార్గాన్ని అవలంభించాడు. మీరా రాబియా వలే భగవంతునిలో సఖుడిని వెతుక్కుంది.

ఒక భక్తి ఉద్యమ కవినీ లేదా సంత్‌నీ అధ్యయనం చేయడానికి వారి స్థానిక సాంస్కృతిక వాతావరణం, వారి వాఙ్మయ సారస్వతం గొప్ప ఆధారాలుగా ఉపయోగపడతాయి. వాటిని ఆధారంగా వారు తమ కాలపు సామాజిక చలనంలో ఎక్కడ నిలబడి ఉన్నారో, వారు తమ కాలానికి చెందిన లక్షణాలను ఎలా ప్రతి ఫలించగలిగారో మనం అధ్యయనం చేయవచ్చు.

మధ్య యుగాల నాటి ఉత్తర భారత దేశంలో ఉన్న సాంస్కృతిక వాతావరణం మునపటికన్నా మరింత కాంతివంతంగా మారడానికి బయటి నుండీ జరిగిన దండయాత్రలూ,ముస్లీంల రాజ్య స్థాపన దోహద పడ్దాయి. సామాజిక స్థితిగతులలో కుదపూ ఏర్పడింది.ఈ కుదుపుకు అనుగుణంగా సమాజంలో సర్దుబాట్లు జరగాల్సిన అవసరం ఏర్పడింది. గుప్తుల కాలం నాటికి బయటి ప్రాంతాల నుండి వచ్చిన శకులు, హుణులు లాంటివారు ఇక్కడి స్థానిక సమాజంలో భాగమయ్యారు. అలాగే స్థానిక ఆదివాసీ తెగలు ప్రధాన స్రవంతిలో భాగమయ్యి రాజపుత్రులుగా, వివిధ కులాలుగా స్థిరపడ్డారు. సరిగ్గా అలాంటి  సామాజిక మార్పులే ముస్లీం రాజ్య స్థాపనల వల్ల మరోసారి ఏర్పడాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఈ రకమైన సామాజిక మార్పులు వ్యక్తమవడానికి ఇస్లాం-సూఫీ తాత్వికతలు ఈ కాలంలో ఎంతగానో దోహద పడ్డాయి.

సాధికార మత తాత్వికతలు, కొత్తగా తమ చారిత్రక పాత్రని నిర్వహించడానికై ఉబికి వస్తున్న ప్రజా సమూహాలకు గొప్ప అడ్డంకులుగా ఉండడం వల్ల వాటిని తోసివేసే మత విశ్వాసాలూ, ఆచరణలే మధ్య యుగపు తాత్విక భూమికలయ్యాయి. ఇవి అటు బ్రాహ్మణీయ హిందూ మతానికీ, ఇమాంలు ప్రవచించే  ఇస్లాంకూ సవాల్‍గా నిలబడ్డాయి. ఈ చారిత్రక ఘట్టం భక్తి ఉద్యమంగా పిలవబడడానికి బహుళత్వానికి పీట వేసే వివిధ సంప్రదాయాలు, సూఫీల కృషీ పునాదులుగా దోహదపడ్దాయి. సూఫీలు తమను తాము ఇస్లాంలో విడదీయరాని భాగంగా చెప్పుకుంటూ ఈ కృషిలో పాలు పంచుకున్నారు.

ఉత్తర భారతంలో భక్తి ఉద్యమ కాలపు సాంస్కృతిక వాతావరణాన్ని మనం తిరిగి సంత్ ఏక్‍నాథ్ నుండే ఉదహరించవచ్చు. ఏక్‍నాథ్ దక్కన్‍లో భాగమైన మహారాష్ట్ర ప్రాంతపు బ్రాహ్మణుడు. ఆయన పదహారవ శతాభ్ది చివరి అర్థభాగానికి చెందిన వాడు. ఆయన పుట్టిన పైథాన్ పట్టణం ప్రతిష్టానపురం పేరుతో చరిత్రలో శాతవాహనుల ఏలుబడిలో ఉండేది. మహారాష్ట్రలో వర్కారీ సంప్రదాయానికీ ఆలంబనగా ఉన్న విఠోబా విగ్రహాన్ని విజయనగరం నుండీ వెనక్కి తీసుకొని వచ్చి పండరీపురంలో పునఃస్థాపించిన భానుదాసు ఈయన పూర్వీకుడు. దేవగిరి దౌలతాబాద్‍గా మారడానికి పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన యాదవులు మరాఠీ భాషాభిమానులు. నిజాంషాహీల పాలన ఇక్కడికి వచ్చే నాటికి పైథాన్ పట్టణం గొప్ప విద్యా, వాణిజ్యకేంద్రం.

ఏక్‍నాథ్ తండ్రి సుల్తాన్ వద్ద వజీరుగా పని చేసే ఒక బ్రాహణుడికి గురువు. ఆ రకంగా వారి కుటుంబానికి ఇటు పైస్థాయి అధికార వర్గంతోనూ, భక్తి సంప్రదాయంతో మమేకమయ్యే సాధారణ ప్రజానీకంతోనూ దగ్గరి తనం ఉండేది. ఏక్‍నాథ్‍ను విద్యనభ్యసించడానికి దౌలతాబాద్‍లో ఉన్న ఒక బ్రాహ్మణుడి వద్దకు ఆయన తండ్రి పంపుతాడు. ఆయన దౌలతాబాద్ కోటలో పని చేసే ఒక అధికారి(ఖిల్లేదార్). దౌలతాబాద్‍కు  జంటనగరంగా ఉన్న ఖుల్దాబాద్ ఏక్‍నాథ్ కాలం నాటికే  ప్రముఖ సూఫీకేంద్రం. ఏక్‍నాథ్‍కు  విద్యను నేర్పే గురువును ఆశీర్వదించడానికి అప్పుడప్పుడూ ఆయన ఇంటికి ఒక సూఫీ ఫకీర్ వస్తూ ఉండేవాడు. అంటే ఏక్‍నాథ్ గురువుకు గురువు ఒక సూఫీ ఫకీర్ అన్నమాట.

ఊహించడానికి కూడా సంభ్రమాన్ని కలిగించే ఇలాంటి చిత్రమైన సామాజిక వాతావరణం ఏక్‍నాథ్‍ను మహారాష్ట్రలో ఏ విధంగా ప్రముఖమైన సంత్‍గా మార్చి వేసిందో దాదాపుగా అలాంటి సామాజిక పర్యావరణమే ఉత్తర భారత దేశంలోని భక్తి ఉద్యమకారులమీదా భక్తి ఉద్యమం మీదా ప్రభావితమై అంతటా తానై అయి నడిపించింది.

ఇలాంటి చిత్రమైన సామాజిక పర్యావణం ఏర్పడడానికీ, వాటిని అందిపుచ్చుకొనే సామాజిక శక్తులు ఏర్పడడానికి  ప్రధాన కారణాన్ని సామాజిక చరిత్రకారులు పైకి ఎదిగి వస్తున్న కులాల అస్తిత్వ చైతన్యం నుండి వివరిస్తున్నారు. ఈ వివరణను దక్షణాదిన భక్తి ఉద్యమం ప్రారంభమయ్యే నాటి కాలానికి కూడా వీరు వర్తింప చేస్తున్నారు. గుప్తుల పతనానంతరం స్థిరమైన, విశాలమైన రాజ్యాలు దక్షణాదినే ఏర్పడడంతో పాటుగా, చాప కింద నీరులాగా ఇస్లాం- సూఫీల ప్రభావం కూడా పని చేయడం వల్ల ఇక్కడ నూతనంగా ఆవిర్భవిస్తున్న సామాజిక శక్తులకు ఒక దారి దొరికినట్లయింది. నయనార్లతో భక్తి ఉద్యమం స్పష్టమైన రూపం తీసుకున్నదని అనుకున్నట్లయితే, సంగం యుగం కాలం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ కొనసాగిన ఈ సంప్రదాయపు సాహిత్యం పదవ శతాబ్ధానికి గానీ క్రోడీకరింపబడలేదు. పదవ శతాబ్ధంలో క్రోడీకరింపబడిన ఈ సాహిత్యపు ఉనికిలోనూ, ప్రత్యేకించి ఎంపిక చేయబడిన అరవైమూడుమంది నయనార్ల పేర్లలోనూ ఈ అస్తిత్వ చైతన్యమే పని చేసిందని వీరు వివరిస్తున్నారు. ఆళ్వార్లుగా ప్రసిద్ధిపొందిన వారికీ ఇది వర్తిస్తుంది.

భక్తి ఉద్యమం- అది కొనసాగిన కాలం దృష్ట్యా, అది వ్యాపించిన భౌగోళిక ప్రాంతం దృష్ట్యా చాలా విస్తృతమైనది.  నూతనంగా ఎదిగి వస్తున్న సామాజిక శక్తులకు ఉనికికి అది ఒక తాత్విక వ్యక్తీకరణగా ఎట్లా ఉపయోగపడిందో, సమాజంలోని ప్రధాన స్రవంతితో, ఆధిపత్య భావజాలంతో సర్దుబాటు చేసుకోవడానికి కూడా అంతగానే ఉపకరించింది. సాధికారికమైన భావజాలాలతో పేచీ పడడానికి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడానికి అది ఎలా కారణమైందో అలాగే తిరిగి మరో కొత్త సాధికారిక భావజాల కేంద్రాల స్థాపనకు అది దోహదమయింది. ఘర్షణ-ఐక్యతా చరిత్ర చోదక సూత్రాలుగా ఎలా పదేపదే ప్రకటితమవుతూ వచ్చాయో అదే విధంగా సాధారణీకరణ-వైవిధ్యమూ భక్తి ఉద్యమ కాలపు లక్షణాలుగా వ్యక్తమవుతూ వచ్చాయి.

ఇంత సంక్లిష్టత ఈ కాలపు లక్షణంగా ఉన్నందువల్ల భక్తి ఉద్యమం సామాజిక శాస్త్రవేత్తలకు గొప్ప అధ్యయన వనరయింది. సామాజికంగా ఉన్న కుల వివక్షలను స్థూలంగా పక్కకు నెట్టడం, బౌద్ధిక వ్యక్తీకరణలకు కేంద్రంగా ఉన్న సంస్కృత ఆధిపత్యాన్ని తోసివేసి స్థానిక భాషలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, దైవం గురించి, ఆరాధనా సంబంధమైన కర్మకాండలకు సంబంధించి పై కులాలకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఉన్న మత తాత్విక విధానాలను కిందికి దించి జన సామాన్యానికి అర్థమయ్యే ఉద్వేగ సంబంధమైన  ఆచరణలలోనికి తీసుకరావడం, దేవుడిముందు రాజూ-పేదా అందరూ సమానమనే భావనలను తేవడం భక్తి ఉద్యమకాలపు సాధారణ వ్యక్తీకరణలు. భక్తి ఉద్యమ కవులు, యోగులందరిలోనూ ఈ లక్షణాలను మనం చూడవచ్చు.

అయితే సామాజిక శాస్త్రవేత్తలకు ఈ సాధారణించబడిన లక్షణాలకన్నా, భక్తి ఉద్యమంలోని  వైవిధ్యమూ, బహుళత్వమే మరింత ఆసక్తికరమైన అంశాలుగా కనపడుతున్నాయి. సగుణ-నిర్గుణ వంటి విభజనల ఆధారంగా ఉత్తర భారతంలోని భక్తి ఉద్యమం గురించి స్థూలంగా కొన్ని సాధారణీకరణలను చేయడానికి కొందరు చరిత్రకారులు ప్రయత్నించారు. అయితే ఈ విభజనకూడా స్థూలమైనదే కానీ ఏ ఆచరణనూ పూర్తిగా సమగ్రంగా చెప్పడానికి పనికి వచ్చేది కాదు. భక్తి ఉద్యమాన్ని ఇలా సాధారణీకరించడానికి ప్రయత్నించిన ప్రతీ సారీ , దాని లోపలి నుండే పొడ చూపే భిన్నత్వం చరిత్రకారులకు నిరంతర సవాల్‍గా ఉండేది. ఒక ఆచరణ నిర్దిష్టమైమైన స్థల కాలాల పరిమితుల్లో  వివిధ సామాజిక శ్రేణులమధ్య వ్యాప్తిని పొందేటప్పుడు ఆయా ప్రజానీకపు అస్తిత్వ అవసరాలకనుగుణంగా అది నిరంతరంగా మార్పులకు గురికావడమే దీనికి కారణం . ఈ మార్పులు ఎంతగా తీవ్రంగా ఉంటాయంటే,  అవి దాని తొలి రూపానికి ఏమాత్రమూ పొంతనలేని ఒక కొత్త మత ఆచరణలోకి మార్చేసేవి.  బసవుని వీరశైవం నుండీ వివిధ పంథాల వరకూ వీటిని మనం గమనించవచ్చు.

సగుణ భక్తి భగవంతునికొక రూపాన్ని ఇచ్చి స్తుతిస్తుంది. నిర్గుణ భక్తి భగవంతుని నిరాకారునిగా చూస్తుంది. సగుణ భక్తి కన్నా నిర్గుణ భక్తి ప్రగతి శీలమైందనీ, ఇది సాధికారిక మత సంప్రదాయాలను నిర్ద్వంధ్వంగా తోసివేసిందనీ సామాజిక చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా నిర్గుణ భక్తికి కబీర్‍ను, సగుణ భక్తికి తులసీ దాస్‍ని వీరు చెబుతారు.

బసవని తర్వాత కబీర్ అపురూపమైన వ్యక్తిగా మనకు కనపడతాడు. సాధికారికమైన మత ఆచరణలను కబీర్ తన రచనల ద్వారా ఆవలికి నెట్టివేస్తాడు. తన జీవిత కాలమంతటా మగ్గం నేసి జీవిస్తూ, సాధారణ ప్రజానీకానికి సాధ్యంకాని సన్యాసి-ఫకీర్ ఉదాహరణలకు భిన్నమైన పంథాగా ఆయన జనానికి అందుబాటులో ఉంటాడు. ఆయన సారస్వతం పూర్తిగా మౌఖికమైంది. తర్వాత అది గ్రంథస్తమైనా మౌఖిక సంప్రదాయమే ఆయన విధానం. ప్రజలు పాడుకొనే భాషలో, వారికి అర్థవంతంగా ఉండే ఆయన ధోరణి సాధికారికమైన పుస్తక కేంద్రక విధానానికి వ్యతిరేకమైనది. ఆయన చెప్పే రాముడు దశరథకుమారుడూ, సీతాపతీ అయిన రాముడు కాదు. అంతకు మించి దశావతారాలలో ఒకడైన పురాణ పురుషుడూ కాదు. వీటన్నింటికీ విరుద్ధంగా ఆయన నిరాకారి. అనంత ప్రేమా మూర్తి.  రాముడనేది భగవంతుడికి కబీర్ పెట్టిన పేరు మాత్రమే. అందుకే కబీర్ భగవంతుడిని రాముడిగా కీర్తించిన సూఫీగా మనకు కనపడతాడు. దీనివల్లనే కబీర్ శిష్యులలో అసంఖ్యాకంగా కింది కులాలవారూ, ముస్లీంలూ కూడా మనకు కనపడతారు.

సగుణ భక్తుడైన తులసీదాస్ దీనికి భిన్నంగా రాముడిని పురాణ పురుషుడిగా,దశావతారాలలో ఒకనిగా రామచరిత మానస్‍లో రాస్తాడు. గ్రంథానికీ, బ్రాహ్మణాధిక్యతకూ చోటిచ్చి పునరుద్ధరణ వాదానికి దోహదపడతాడు.

ఒక వైపు  మౌఖిక సంప్రదాయంలో భక్తి వ్యాపిస్తూ ఉండగా, ఈ కాలంలోనే  మరొక వైపు సంస్కృత మత గ్రంథాలు, భారత, భాగవత, రామాయణాలు స్థానిక భాషలలోకి అనువాదం అయ్యాయి. ఇవి మూలానికి పూర్తిగా లోబడి ఉండక ఆయా భాషలలో స్వతంత్రమైన వైఖరులను తీసుకున్నాయి.  బ్రాహ్మణీయ విలువలను, ఆధిక్యతనూ స్థాపించడానికే ఇవి ఆయా భాషలలో రాయబడ్డాయని విమర్శకు గురయినా అప్పటి ఆధిపత్య భాష అయిన సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా స్థానిక భాషలను ముందుకు తేవడానికి ఆయా కవులు పెద్ద యుద్ధమే చేసారు.  ఏక్‍నాథ్ మరాఠీలో భాగవతపురాణాన్ని రాయడం కోసం తన కొడుకు నుండే వ్యతిరేకతని ఎదుర్కొన్నాడు. తనకంటే చాలా  ముందుగానే ఙ్ఞానేశ్వర్ మరాఠీలో రాసే సంప్రదాయాన్ని ఆరంభించినప్పటికీ ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా భక్తి ఉద్యమ కవులు స్థానిక భాషలను ముందుకు తెచ్చి పెద్ద తిరుగుబాటునే చేసారు.

ఒక వైపు తిరుగుబాటూ, మరో వైపు పునరుద్ధరణ పక్కపక్కనే, ఒక దాని వెంట ఒకటిగా కొనసాగడం భక్తి ఉద్యమ కాలానికి సంబంధించిన ప్రధాన లక్షణం. ఈ విచిత్రమైన స్వభావాన్ని సామాజిక చరిత్రకారులు గ్రామ్‍స్కీ ప్రతిపాదించిన “హిస్టారికల్ బ్లాక్” (historical block) భావన ద్వారా వివరిస్తున్నారు.

సమాజంలోని వివిధ శ్రేణులు తమ అవసరాల కోసం, అస్తిత్వం కోసం ఉనికిలో ఉన్న సాధికర భావజాలాలతో, నిర్మాణాలతో తిరుగుబాటును ప్రకటించి పోరాడతాయి. ఈ క్రమంలో అవి తమవయిన తాత్విక సామాజిక భావజాలాలను ప్రత్యామ్నాయంగా ముందుకు తెస్తాయి. అయితే అవి తమ గమనంలో ఒక సంతృప్త స్థితికి చేరుకున్న తర్వాత  ఇదివరకటి తిరుగుబాటును పక్కన పెట్టి  ప్రధాన స్రవంతిలో భాగమవుతాయి. సమాజగమనం గురించిన ఈ సత్యాన్ని గ్రామ్‍స్కీ “హిస్టారికల్ బ్లాక్” భావనలో వివరించాడు.

భక్తి ఉద్యమంలోని తిరుగుబాటు-పునరుద్ధరణ లేదా సర్దుబాటులను మాత్రమే కాకుండా సమకాలీన సమాజంలోని వివిధ ఉద్యమాలు, ధోరణుల  గమనాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ భావన బాగా ఉపయోగపడుతుంది.

 

ఆధారం:

1. Sufism, An introduction-Farida Kahanam

2.Rabia As Mystic, Muslim And Woman- Barbara Lois Helms

3.Influence Of Islam ON Indian Culture- Tarachand

4. Vaishnavism, Saivism And MInar Religious Systems- R.G. Bhadarkar

5.Contextualizing The Past, The Saint And His Environment -Dusan Deak

6. Challenging Gender And Sexuality Norms Through Devotion: Bhakti And Sufi Writings- Srishti Nayak

మీ మాటలు

 1. శ్రీనివాసుడు says:

  ‘‘నానక్ మరో అడుగు ముందుకు వేసి ఒక విశ్వాసానికి ఎదురుగా మరో విశ్వాసం నిలబడి ఉన్నప్పుడు వాటి మధ్య సయోధ్య కుదరదని అంటాడు. ఈ రెండింటినీ విడిచి సిక్కుమతాన్ని స్థాపిస్తాడు. ఆయన మహ్మద్ ప్రవక్త జీవితం నుండీ ప్రేరణ పొందినట్టుగా చెప్పుకున్నాడు. **
  ఇది తప్పుడు వ్యాఖ్యానం. ఈ విషయాన్ని ముస్లింలూ నమ్మరు, సిక్కులూ నమ్మరు.
  ముస్లింలు సిక్కులని ఎలా ఊచకోత కోసేరో ఇది చదవండి.
  During the Mughal Empire, Sikh gurus were persecuted along with other non-Muslims. The fifth Guru of Sikhs, Guru Arjan was executed by Jahangir.[63] There were occasional exceptions to the historical persecution. During Mughal Emperor Akbar’s rule, for example, Sikhism and diverse religions were temporarily accepted. Akbar visited the third Sikh Guru, Guru Amardas at Goindwal, ate at the Langar kitchen, and offered donations for Langar.[64][65]

  In other periods, Sikhs were persecuted during the Islamic rule of South Asia. Guru Arjan was tortured and executed by Mughal emperor Jahangir. Guru Hargobind, (sixth Guru of the Sikhs), after the martyrdom of Guru Arjan saw that it would no longer be possible to protect the Sikh community without the aid of arms.[66] He built Akal Takhat the Throne of the Immortal and it is the highest political institution of the Sikhs and he also wore two swords of Miri and Piri.[67]

  Guru Tegh Bahadur (ninth Guru) was tortured and beheaded by Aurangzeb at Chandni Chowk in Delhi,[68] for refusing to convert to Islam and for protecting Kashmiri Hindus who were being forced to convert to Islam.[69][70][71] His fellow devotees Bhai Mati Das, Bhai Sati Das and Bhai Dayala were also tortured and executed, while Guru Tegh Bahadur was forced to watch.[72][73] Tenth Guru Guru Gobind Singh formed Khalsa known as Army of Akal Purakh (Immortal) and Gave 5 Ks to Khalsa. Two of the younger sons of Guru Gobind Singh aged 9 and 7 were bricked up alive by the Muslim governor Wazir Khan in Sarhand (Punjab). When Guru Gobind Singh was in South India, he sent Banda Singh Bahadur to chastise the tyrannical Mughal faiy`dar of Sirhind. Banda Singh captured Sirhind and laid the foundation of Sikh empire.[74][75]
  గురునానక్ మహమ్మద్ ప్రవక్తను ఎలా భావించాడో, ఆయన జీవితం నుండి ఎలా ప్రేరణ పొందలేదో, ఆయనకీ మనిషికుండే పరిమితులున్నాయని ఎలా గ్రహించాడో ఇది చదవండి.
  The Sikh doctrine on the subject is sharp and clear, the born is perishable, and all praise is due to the Timeless. In so far as the Guru perceived excellence in Mohammed, he attributed it exclusively to the grace of God, and whatever was contingent, unenduring in the words and deeds of Mohammeqhe deemed as merely human and impermanent trait.
  గురునానక్ పైన కొరాన్ ప్రభావం ఎంతవరకూ అనేది రాగద్వేషరహితంగా వ్రాసిన ఈ వ్యాసం చదవండి
  http://www.sikhcoalition.org/about-sikhs/sikh-theology/sikhism-and-islam.

 2. శ్రీనివాసుడు says:

  ’’ఏక్‍నాథ్‍ను విద్యనభ్యసించడానికి దౌలతాబాద్‍లో ఉన్న ఒక బ్రాహ్మణుడి వద్దకు ఆయన తండ్రి పంపుతాడు. ఆయన దౌలతాబాద్ కోటలో పని చేసే ఒక అధికారి(ఖిల్లేదార్). దౌలతాబాద్‍కు జంటనగరంగా ఉన్న ఖుల్దాబాద్ ఏక్‍నాథ్ కాలం నాటికే ప్రముఖ సూఫీకేంద్రం. ఏక్‍నాథ్‍కు విద్యను నేర్పే గురువును ఆశీర్వదించడానికి అప్పుడప్పుడూ ఆయన ఇంటికి ఒక సూఫీ ఫకీర్ వస్తూ ఉండేవాడు. అంటే ఏక్‍నాథ్ గురువుకు గురువు ఒక సూఫీ ఫకీర్ అన్నమాట.‘‘
  ఏకనాథ్ గురువు జనార్దన స్వామి. ఆయన గురువు సూఫీ ఫకీర్ కాదు. ఆశీర్వదించడానికి ఒక సూఫీ ఫకీర్ వస్తే అతడే ఆయన గురువు అని నిర్ధారించడం పూర్తిగా బూటకం. సంత్ ఏకనాథ్ చరిత్రను వ్రాసినవాళ్ళల్లో నూటికి నూరుశాతం మందీ ఆయనపైన దత్తాత్రేయుని అనుగ్రహం వుందనే నిర్ధారించారు. ఏ సూఫీని గానీ, ఇస్లాంగానీ ఎవ్వరూ ఉటంకించలేదు.
  రమణమహర్షి ఆశ్రమ జాలగూటిలోని ఈ సమాచారం చదవవచ్చు.
  http://www.arunachala-ramana.org/forum/index.php?action=సెఅర్చ్2

  ఇలా ఒక్కొక్క వాక్యాన్నీ ఖండించడానికి ఒక్కొక్క మహా ప్రయత్నం అవసరం కావచ్చు. అసమగ్ర పరిశీలన, రాగద్వేష సహిత గోబెల్స్ ప్రచారాన్ని ఖండించడానికి చాలా ఓపిక అవసరం కావచ్చు, అయినా ప్రయత్నిస్తాను.

  ఇక్కడ కార్ల్ మార్క్స్ ఒక ఉటంకింపు చదివితే అర్థవంతంగా వుంటుందేమో.
  Read what Karl Marx wrote about Hinduism: ” Barbarian conquerers Arabs, Turks, Mongols when they came to India became Hindudized by coming into contact with a vastly superior culture by the eternal law of civilization” in his book Indias First War of Independence 1857

  గత వ్యాసంలో నేనిచ్చని రీసెర్చ్ పేపర్ చదివిన పాఠకులకు ఈ వ్యాసంలో చెప్పేది కూడా చాలా వరకు వ్రకీకరణలే అని అర్థం అవుతాయి.

 3. శ్రీనివాసుడు says:

  Differences

  Sikhism does not believe that any Holy Book takes precedence over all others or any religions prophet is the final messenger of God.

  “Say not that the Vedas and Muslim books are false. False is he, who reflects not on them.” (Bhagat Kabir, Parbhati, pg. 1350)

  “The followers of the Vedas, the Bible and the Koran, standing at Your Door, meditate on You. Uncounted are those who fall at Your Door.” (Guru Arjan, pg. 518)

  “And many have been orthodox amongst the Muslims, and men of miracles, and Ashvini Kumaras, and the part-incarnations of Vishnu, all O all went the way of death. And many were the prophets and spiritual guides, yea, countless were they: they sprang from the dust and to dust they returned.” (Guru Gobind Singh, Akal Ustati)

  Purpose of the Holy Book

  “Thus We have revealed the Koran in the Arabic tongue and proclaimed in it warnings and threats so that they may take heed and guard themselves against evil.” (20:114 Quran)

  “Upon this Plate, three things have been placed: Truth, Contentment and Contemplation. The Ambrosial Nectar of the Naam, the Name of our Lord and Master, has been placed upon it as well; it is the Support of all. One who eats it and enjoys it shall be saved. This thing can never be forsaken; keep this always and forever in your mind. The dark world-ocean is crossed over, by grasping the Feet of the Lord; O Nanak, it is all the extension of God.” (Guru Arjan, Mundavanee, pg. 1429)

  Sikhism believes that people of different religions are equally capable of achieving salvation while still following their own religion.

  “Believers, take neither Jews nor Christians for your friends. They are friends with one another. Whoever of you seeks their friendship shall become one of their number. Allah does not guide the wrongdoers.” (5:49, Quran)

  “Mohammed is Allah’s apostle. Those who follow him are ruthless to the unbelievers but merciful to one another.” (48:29, Quran)

  “When the sacred months are over slay the idolaters wherever you find them. Arrest them, besiege them, and lie in ambush everywhere for them. If they repent and take to prayer and pay the alms-tax, let them go their way. Allah is forgiving and merciful.” (9:4, Quran)

  “There is a garden, in which so many plants have grown. They bear the Ambrosial Nectar of the Naam as their fruit. Consider this, O wise one, by which you may attain the state of Nirvaanaa. All around this garden are pools of poison, but within it is the Ambrosial Nectar, O Siblings of Destiny. There is only one gardener who tends it. He takes care of every leaf and branch. He brings all sorts of plants and plants them there. They all bear fruit – none is without fruit.” (Guru Arjan, Asa, pg. 385)

  “The temple or the mosque are the same, the Hindu worship or the Musalman prayer are the same; all men are the same; it is through error they appear different. Deities, demons, Yakshas, heavenly singers, Musalmans and Hindus adopt the customary dress of their different countries. All men have the same eyes, the same ears, the same body, the same build, a compound of earth, air, fire, and water. Allah and Abhekh are the same, the Purans and the Quran are the same; they are all alike; it is the one God who created all. The Hindu God and the Muhammadan God are the same; let no man even by mistake suppose there is a difference.” (Guru Gobind Singh, Akal Ustat, pg. 275)

  Sri Guru Granth Sahib places greater emphasis on love of God as the main motivation for man rather than fear of God.

  “Truly, none will take heed but the wise: those who keep faith with Allah and do not break their pledge; who join together what He has bidden to be united; who fear their Lord and dread the terrors of Judgement-day; who for the sake of Allah endure with fortitude…” (13:18, Quran)

  “Allah’s reward is great. Therefore fear Him with all your hearts and be attentive, obedient, and charitable. That will be best for you.” (64:13, Quran)

  “Within my heart, I sing the Glorious Praises of the Lord, and celebrate the Word of the Lord’s Shabad. The Lord Himself is pervading and permeating the world; so fall in love with Him!” (Guru Nanak, pg. 790)

  “Remembering Him in meditation, one abides in peace; one becomes happy, and suffering is ended. Celebrate, make merry, and sing God’s Glories. Forever and ever, surrender to the True Guru.” (Guru Arjan, Asa, pg. 386)

  Sikhism does not believe in the idea of Gods name being only those authorized in a religious tradition or Holy Book.

  “Many are Thy Names and infinite Thine forms and it cannot be told how many merits Thou hast.” (Guru Nanak, Asa, pg. 358)

  Non-Sikhs are allowed to visit and enter the most sacred shrine of the religion, The Golden Temple.

  “Believers, know that the idolaters are unclean. Let them not approach the Sacred Mosque after this year is ended” (9:26, Quran)

  “Blessed is the place, and blessed are those who dwell there, where God’s Name is meditated upon. The sermons and songs of God’s praises are sung there and there is nothing but peace, poise and tranquillity.” (Guru Arjan, Raga Bilaval, pg. 816)

  “If the Lord Allah lives only in the mosque, then to whom does the rest of the world belong? …The God of the Hindus lives in the southern lands, and the God of the Muslims lives in the west. So search in your heart – look deep into your heart of hearts; this is the home and the place where God lives.” (Bhagat Kabir, pg. 1349)

  Attitude towards women. Sikh women are allowed to lead congregations of men at the temple or administer all religious ceremonies involving either men or women.

  “Man have authority over women because Allah has made the one superior to the other, and because they spend their wealth to maintain them. Good women are obedient. They guard their unseen parts because Allah has guarded them. As for those from whom you fear disobedience, admonish them and send them to beds apart and beat them.” (4:34, Quran)

  “We are born of woman, we are conceived in the womb of woman, we are engaged and married to woman. We make friendship with woman and the lineage continued because of woman. When one woman dies, we take another one, we are bound with the world through woman. Why should we talk ill of her, who gives birth to kings? The woman is born from woman; there is none without her. Only the One True Lord is without woman” (Guru Nanak, Var Asa, pg. 473)

  Sikhism does not believe in women wearing veils.

  “Stay, stay, O daughter-in-law – do not cover your face with a veil. In the end, this shall not bring you even half a shell.” (Bhagat Kabir, Asa, pg. 484)

  Sikhism does not believe in fasting or pilgrimages.

  “The mind is not softened by fasting or austerities. Nothing else is equal to worship of the Lord’s Name.” (Guru Nanak Dev, Ramkali, pg. 905)

  “The pilgrimage to shrines, fasting, cleanliness and self-mortification are not of any avail, nor are the rituals, religious ceremonies and hollow adoration’s. Deliverance, O! Nanak! is in the devotional service of God. Through duality the mortal is engrossed in worldliness. (Guru Nanak, Sri Rag, pg. 75)

  Sikhism rejects the killing of any animal evoking a prayer or by slow death. Muslim Halal meat is forbidden for Sikhs.

  “Yet holding the knife, the world they butcher. Wearing blue the rulers approval they seek; With money derived from mlechhas the Puranas they worship. Goats slaughtered over the unapproved Muslims texts they eat.” (Guru Nanak, Raga Asa, pg. 472)

  Sikhism rejects the idea of circumcision.

  “Because of the love of woman, circumcision is done; I don’t believe in it, O Siblings of Destiny. If God wished me to be a Muslim, it would be cut off by itself. If circumcision makes one a Muslim, then what about a woman?” (Bhagat Kabir, Asa, pg. 477)

 4. శ్రీనివాసుడు says:

  ఇస్లామ్ కంటే సిక్కు మతం ఏ విధంగా భిన్నమయినదో మరొక వివరణ
  http://www.searchsikhism.com/sikhism-and-islam

 5. నాగరాజు గారూ
  యీఅంతర్జాల యుగంలో లింకుల్ యిస్తూ పోయే అవకాశం వుండగా , మీరు కూడా దాన్ని వినియోగించక స్వంతగా వ్యాసాలూ యెందుకు రాస్తున్నారో, ఎందుకంత కష్టపడుతున్నారో వివరించప్రార్థన.

 6. దేవరకొండ says:

  శ్రీనివాసుడు గారు ప్రత్యేకంగా ఒక వ్యాసమే (పై వ్యాసాన్ని ఖండిస్తూ) రాస్తే బాగుంటుందేమో!

 7. శ్రీనివాసుడు says:

  ఆధారాలు చూపించకుండా ఎంత కష్టపడి వ్యాసాలు వ్రాసినా, ఎన్ని సూత్రీకరణలు చేసినా అది చదివేవారికి స్వంతపైత్యంగా గోచరిస్తుందేమో! వ్యాసం చివర చూపించిన ఆధారాలు కూడా లింకులివ్వడంలాగానే పొరబాటు పనా? ’’చరిత్ర అడక్కు, చెప్పింది విను‘‘, అనే తరహా అయితే సారూప్య భావజాల చదువరులకి మాత్రమే సరిపోతుంది. మన స్వంత పైత్యం ప్రదర్శించడంకన్నా మూలాన్ని యథాతథంగా చదువుకోమనడమే క్షేమం.

 8. దేవరకొండ గారూ
  మీ మాటలలో లింకడం కాక , విజ్ఞత వుంది.

 9. దేవరకొండ says:

  ఏకీభవిస్తాను. మొత్తం మీద విషయం మీద తెలుసుకోవాల్సింది చాలా వుందని తెల్సింది. ఇదే గొప్ప ఫలితం!

  • శ్రీనివాసుడు says:

   ధన్యవాదాలు దేవరకొండ వారూ!
   తెలుసుకోవలసింది ఏమీలేదు అన్న భ్రాంతిలో వున్నప్పుడే సూత్రీకరణలు ప్రారంభమవుతాయి. అక్కడ సంభాషణలకి అవకాశమే వుండదు. ఆ రెటమతాలని ఖండించడానికే లింకులు అవసరం అవుతాయి. ఎందుకంటే ప్రతి సూత్రీకరణనీ మన రెటోరిక్ అంటే వాగ్విలాసంతోనే ఖండిస్తే రెటమతాలకీ మనకీ తేడావుండదు. డయాలెక్టిక్ విధానంలో ప్రతిదానికీ ఆధారాలు చూపడానికి లింకులు అవసరమవుతాయి. అంతర్జాలం యుగంలో అధ్యయనానికి సముద్రమంత అవకాశం వుండగా ఒక్క చిన్న బిందువునే పట్టకుని ఇదే తాత్త్విక సత్యసాగరమని, దానిలో మనల్ని ముంచడానికి ప్రయత్నం చేస్తే దాన్ని బిందుభ్రాంతి అంటారు.

 10. దేవరకొండ గారూ
  బాగా చెప్పారు. తెలుసుకోవాల్సింది చాలా వుంది అని తెలుసుకునే విజ్ఞతని పెంచడమే వ్యాసానికైనా సంవాదానికైనా ఫలితం. మీలా భిన్న దృక్పధాలతో కూడిన రచనలని ఆహ్వానించడమే ప్రజాస్వామికం. మేధావులు సొంత గొంతు విప్పాలి .
  ఎవరో పెద్దలు చెప్పారని కాక సొంత బుద్ధితో ఆలోచించమని బుద్ధభగవానుడు చెప్పిన మాటని స్మరించడం సందర్భోచితం అనుకొంటా.

 11. శ్రీనివాసుడు says:

  ‘‘వ్రాసింది భిన్న దృక్పథం కాదు, చరిత్ర అసమగ్ర అధ్యయన అజ్ఞానఫలం’’ అని స్వంతబుద్ధితో ఆలోచించి తెలుసుకుని, వ్యాస రచయితలనే పెద్దలు చెప్పింది కాదనడానికే ఆధారాలుగా లింకులు ఇవ్వడం జరిగింది. తాము పెద్దలని కూడా మించిపోయిన తత్త్వవేత్తలు అనుకునేవాళ్ళతోనే సంవాదాలు సాగవు. ప్రజాస్వామ్యం పేరుతో ‘‘చరిత్ర అడక్కు, చెప్పింది విను’’, అనే తరహా నియంతృత్వ విజ్ఞతతోనే ప్రమాదం.

 12. దేవరకొండ గారి అభిప్రాయం పూర్తి ప్రజాస్వామికం . అవ్వారి నాగరాజు గారు మాత్రమే కాదు. ఆయన్ని వ్యతిరేకించేవారు కూడా స్వతంత్ర రచనకు పూనుకోవాలనడం పూర్తి ప్రజాస్వామిక అభిప్రాయం.
  అన్ని వైపుల నుంచి అభిప్రాయాలని ఆహ్వానించాలని వేదం

 13. శ్రీనివాసుడు says:

  మనం తెలుసుకోలసినదేమంటే ఇలాంటి చారిత్రిక అధ్యయనాలు చేయవలసింది విద్యావేత్తలు, ఆచార్యుల స్థాయిలో వున్నవారు. చారిత్రిక స్వతంత్రరచన అనేది వుండదు. అనేక చారిత్రిక సమాచారాలను అధ్యయనం చేసి, క్రోడీకరించి ఒక విశ్లేషణని అందించడమే వుంటుంది. దానికి అనేక పరిశోధనలు సమ్రగంగా చదవాలి, తెలుసుకోవాలి. తరువాత దాన్ని గురించి వ్రాయాలి. అంతేగానీ, కథలూ, సామాజిక విషయ వ్యాసాలు వ్రాసినట్లుగా స్వతంత్రరచన చేయడమనేది ఇలాంటి అధ్యయనాల్లో నప్పదు.
  అలాగాక, తాము చదివిన ప్రకారమే వ్రాసేమని అన్నా, దానికి విరుద్ధంగా అంతకంటే ప్రామాణికమైన అంశాలని ఎవరైనా పాఠకులు ప్రతిపాదించినప్పడు వాటిని పరిశీలించి, పూర్వపక్షం చేసేట్లుగా మన దగ్గర అధ్యయన ప్రతిభ వుండాలి.
  రెటమతం సీరీస్ లో ఇది దాదాపు అయిదవ వ్యాసం. మొదటి రెటమత వ్యాసంలో అందరూ ఎన్ని విధాలుగా అడిగినా నోరెత్తకుండా ఆ చర్చనుండి పారిపోయిన రచయిత లాగానే ఇప్పటివరకూ నేను సంధించిన ప్రశ్నలకు, చూపించిన భిన్న ఉపపత్తులకు సమాధానమేమీ రాలేదు.
  అన్ని వైపులనుండీ అభిప్రాయాలని ఆహ్వనించడం అంటే పాఠకులు చెప్పిన అభిప్రాయాలను కూడా ఆహ్వానించాలి, పరిశీలించాలి. అంతేగాని పారిపోకూడదు.

 14. సమాచారాన్ని కుప్పపోయడం కాక విశ్లేషణని అందించాలనేదే దేవరకొండ గారి అభిప్రాయం. సమాచారం దానంతట అదే విస్లేషనగా మారిపోదు. అందుకే స్వతంత్ర రచన అనేది. .

 15. సుమ గారు మంచి మాటన్నారు. ఇలా లింకులి్చుకుంటూ పోతే హనుమంతని తోకంత.
  అటు వేపు బోల్డంత సమాచారం ఇటు వేపు బండెడంత సమాచారం. దీనికి అంతే ఉండదు మరి. నేను గమనించి నంతవరకు కొంతమంది దేశభక్తి పరాయణులు ఈ లింకులివ్వడం సారాంగలోనే అను కుంటా-ప్రారంభించారు.మీరేమి దలచుకున్నారు అంటే చూడు వాడేమో చెబుతున్నాడో.అనడం ఈ బాపాతు. తాము చెపుతూ న్నదాని మీద తమకే నమ్మకం లేక అవతలి వారిది తీసుకొచ్చి ముందుపెడతారు. ఇదిఒక ఎత్తుగడ కూడా! చివరికి నిజమేంటో బోదపడనివ్వరు పాఠకులకు.

  • శ్రీనివాసుడు says:

   రాగద్వేషాలతో, మనం భజన చేయదలచుకున్న విషయానికి అనుకూలంగా వుండే సమాచారాన్నే కుప్పబోయడం విశ్లేషణ అనిపించుకోదు. పొలిటికల్ ప్రాపగాండా అనిపించుకుంటుంది. చరిత్ర గురించి, తాత్త్విక క్రమాన్ని వివరించేటప్పడు సమాచార వక్రీకరణ జరిగిదే అది స్వతంత్ర రచన అవుతుందా? వ్యాసంలో వక్రీకరించిన విషయాల సమగ్ర స్వరూపాన్ని మన పైత్యం లేకుండా పాఠకులకు అందించాలంటే మూలాన్ని వారికి చెప్పడమే నిజాయితీ గల చరిత్రకారుడి, మరియు తాత్త్విక విశ్లేషకుడి పని. దేశభక్తి అంటే బూతు పదం, ఫాసిస్టు పదం అని విషంజిమ్మే కుహనా సెక్యులరిస్టులు, మత ఫోబియాతో వ్రాసే తత్త్వవేత్తల, తాము వ్రాసినదానికి ఆధారాలు చూపమంటే అడిగినవారు ఫాసిస్టులని, సమాచారాన్ని కుప్పబోసే వాళ్ళ, కుటిలప్రచారం చేసేవాళ్ళ తాత్త్విక స్థాయి ఎంతో తెలుస్తూనే వుంది.
   నిజమేమిటో బోధపరచదలచుకుంటే మనం చెప్పిన విషయాలకి ఆధారాలు కూడా చూపించగలగాలి. అవే సాధికారికం, పరమం అనికూడా మనం చెప్పగలగాలి. అంతేగాని, తాత్త్విక విశ్లేషణ పేరుతో మనం ఎక్కడో చదివిన చరిత్రను ఉదహరిస్తూ, మధ్య మధ్యలో మన ప్రాపంగాండా వాక్యాలను చేర్చకూడదు.
   సూఫీల ఉనికి విషయానికి వస్తే, ప్రథమంగా రెటమతంలో మొదటి పేరాలో చెప్పిన ‘‘ఇస్లాంకి, భరత ఖండపు సంస్కృతులకి జరిగిన వివాహ ఫలితంగా జన్మించినదే సూఫీయిజం‘‘ అనే ఈ సహస్రాబ్ది అతి గొప్ప తాత్త్విక సూత్రీకరణకు చారిత్రిక ఆధారాలు, తాత్త్విక ఆధారాలు నిజాయితీగా చెప్పగలిగే సత్తా వుంటేనే ఇకపైన వ్యాఖ్యలు వ్రాయాలి. అక్కడినుండి మొదలుపెడదాం. ఎవరి వక్రీకరణ స్థాయి, కుటిల ఎత్తుగడల స్థాయి ఎంతో తెలుస్తుంది.

 16. సూఫీల వలన హిందూమతం లో పెనుమార్పులు వచ్చాయని అంట్టున్నారు గదా! మరదే నిజమైతే దేశ విభజన జరిగిన తరువాత సూఫిల ప్రభావం ఎక్కువగా ఉండే పాకిస్థాన్ సింధ్ ,పంజాబ్ లలో ఇప్పుడు ఎంతమంది సూఫీలు ఉన్నారు? ప్రస్తుతం సూఫీలు లేకపోతే వాళ్ల సంఖ్యతగ్గిపోవటానికి గల కారణాలు చెప్పగలరా?

 17. సుమగారు, ఈ సుఫీల గురించి రాసి శర్మ గారు ఏమి సాధించాలనుకొంట్టున్నారో, చెప్పాలనుకొంట్టున్నారో ఇప్పటికి నాకర్థం కాలేదు. నేను ఎంతో అభిమానించే యు.జి. కృష్ణమూర్తి కి పర్వీన్ బాబి, చలం గారి అల్లుడు వజీర్ రెహ్మాన్, మహేష్ భట్ … ముస్లిం ఫాలోయర్స్ ఉన్నారు అందువలన ఆయన సూఫి అయిపోతాడా?

 18. శ్రీరాం గారూ
  బాగా చెప్పారు . యూ జీ , కంచి పరమాచార్య, క్రీస్తు వీరందరినీ సూఫీలు అనరు.
  సూఫీలు అ ని పిలవబడే వ్యక్తులు వున్నారు. స్థలకాలాల్లో వారికి ప్రత్యేకమైన ఉనికి వుంది . అంటే చరిత్ర వుంది.దాన్ని మరిచి మాట్లాడడమంటే సూఫీయిజాన్ని తిరస్కరించడమే.
  దేన్నైనా మనం స్థలకాలాలనుంచి పూర్తిగా వేరు పరిచి మాట్లాడడానికి కారణం దాన్ని మరుగు పరచాలన్న రాజకీయ వుద్దేశమే.ఎందుకంటే అలా మాట్లాడడం దాని ప్రత్యేకతలతో సహా దాన్ని అంతరింపజేయడమే.

 19. దేవరకొండ says:

  “ఆయన చెప్పే రాముడు దశరథకుమారుడూ, సీతాపతీ అయిన రాముడు కాదు. అంతకు మించి దశావతారాలలో ఒకడైన పురాణ పురుషుడూ కాదు. వీటన్నింటికీ విరుద్ధంగా ఆయన నిరాకారి. అనంత ప్రేమా మూర్తి. రాముడనేది భగవంతుడికి కబీర్ పెట్టిన పేరు మాత్రమే. అందుకే కబీర్ భగవంతుడిని రాముడిగా కీర్తించిన సూఫీగా మనకు కనపడతాడు.” కబీర్ను ఎలాగైనా ‘మనందరికీ తెలిసిన’ రాముని నుండి (సగుణం నుండి) విడదీసి, భగవంతునికి పర్యాయ పదంగా మాత్రమే (నిర్గుణ పరబ్రహ్మంగా) రామ నామాన్ని ఆయన (కబీర్) వాడినట్లు చెప్పారు వ్యాసంలో. మరి కబీర్ రచించిన ‘భజోరె భయ్యా రామ గోవింద హరే’ భజన్ లో గోవింద, హరి కూడా నిర్గుణ బ్రహ్మాన్నే సూచిస్తాయా? నిర్గుణ బ్రహ్మం అఖండం కాదా? వ్యాస రచయిత ఈ కోణంలో స్పష్టతను ఇవ్వగలరు.

 20. దేవరకొండ గారూ
  మంచి ప్రశ్న వేసారు. సాధారణంగా పౌరాణిక నామావళికి అంతరార్థాలు బహుళం. కేవలం వాచ్యార్థాన్నే తాత్వికులు గ్రహించరు.
  గోవింద అంటే గోవులని కాపాడే వాడు అనేకాదు. వేదరక్షకుడు కూడా. అంటే జ్ఞానమూర్తి.
  హరి అంటే పాపములని హరించువాడు. గ్రీకులో హరి అనే పదం కరుణ , గొప్ప అనే అర్థాలుకుడా వున్నాయి. యీపదం బౌద్ధ జైన సిక్కు మతాలలో కూడా వుపయోగించపడింది.
  రామ శబ్దానికి యోగుల మనస్సుల్లో రమించు ఆనందంతో నర్తించు అనేఅర్థం వుంది . సంస్కృత పద్దాల్లో యిలా అంతరార్థాలు సహజం. అవి నిర్గుణ బ్రహ్మానికీ సరిపోతాయి[.వికీపీడియానికూడా పరిశీలించవచ్చు.]

  • దేవరకొండ says:

   సుమ గార్కి ధన్యవాదాలు. వ్యాస రచయిత నాగరాజు గారి స్పందన కూడా ఎదురుచూడ దగినదని భావిస్తున్నాను.

 21. a.nagaraju says:

  దేవరకొండ గారూ

  మధ్య యుగాల సామాజిక చలనాలకు మతం ఏ విధంగా ఒక వ్యక్తీకరణగా ఉపయోగపడిందో రాయడమే నా వ్యాసాల ఉద్దేశం. దీనికి గానూ ఇస్లాం/సూఫీల ప్రభావం ఎలా దోహదపడిందన్న సంగతిని నొక్కి చెప్పడం కోసం ఈ వ్యాసాలు రాసాను. కాబట్టీ కబీర్ గురించయినా మరొకదాని గురించయినా నా ఆసక్తి పూర్తిగా సామాజికం.
  దీనికి గానూ ఎక్కువగా తారాచంద్‍కు ఋణపడ్డాను.

  కబీర్ నిర్గుణ భక్తి ఇలా ఉంటుంది

  “Where do you seek me O devout?
  I reside neither in the temple nor in the mosque
  neither in Kashi nor in Kaba
  Neither in rites nor in ceremonies
  Neither in Yoga nor in renunciation……
  the true seeker shall find me in a moments realisation
  for I reside in the very breath of your being….
  (translated from the ‘Bijak’ collection of Kabir sayings)

  గతాన్ని తలపోసుకోవడంలో వర్తమాన ప్రయోజనాలు ఉంటాయి. అందుకే గతం వర్తమానంతో మాట్లాడుతుందని ఇ.ఎచ్. కార్ అంటాడు.
  మత విశ్వాసాలనూ, మతాన్నీ అందులో భాగంగా కబీర్‍నీ- నేను వర్తమానం నుంచీ చూస్తాను.
  ఆయన నిర్గుణ భక్తి మీద నాకున్న ఆసక్తి- ఆయన దేవున్ని విగ్రహాలకూ, కొన్ని పరిమిత స్థలాలకూ కుదించకుండా చూడడం మీద ఉంది. దేవున్నీ, మతాన్నీ మనలోని మరోక ప్రజకు వ్యతిరేకంగా ఎక్కుపెడుతున్న వర్తమానంలో కబీర్ మనకొక ఉపశమనంగా కనిపిస్తాడు.

  చరిత్రని చూడడంలో భిన్న అభిప్రాయాలుంటాయి. అలా ఉండకపోతే అది చరిత్రయే కాదు. పరస్పరం సంఘర్షించే భిన్న ప్రయోజనాలకనుగుణంగా భిన్న చరిత్రలుంటాయి. సంఘ్ భక్తులకు సంఘ్ చరిత్ర, జియోనిస్టు భక్తులకు జియోనిస్టు చరిత్రా ఉంటాయి.

  నిజానికి చదవడంలో భాగంగా రాసిన వ్యాసాలివి.
  చదవడం సమాచారాన్ని సేకరించడం లాంటిదే. కానీ తిరిగి దాని గురించి మాటాడుతున్నప్పుడూ, లేదా రాస్తూ ఉన్నప్పుడూ మనం అప్పటి వరకూ చదివిన దానితో, సేకరించుకున్నదానితో ఒక సంబంధాన్ని ఏర్పరుచుకోవలసి ఉంటుంది. అలా ఏర్పరుచుకునే సంబంధం మన దృక్పథం అవుతుంది. అలాంటి ఒక సంబంధాన్ని ఏర్పరుచుకోవడం కోసం ఈ వ్యాసాలు రాసాను.
  నేను ఈ వ్యాసాల మీద జరుగుతున్న చర్చను గమనిస్తున్నాను. ఇక్కడ వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను నాతో ఎలా తరచి చూసుకున్నానో, మార్క్స్ భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి ఆయన కోరుకున్న విలువలకు వ్యతిరేకంగా గురిపెట్టినపుడూ, నేను అసహ్యించుకునే గోబెల్స్ తో నా రాతలను సరిపోల్చినపుడూ అలాగే నన్ను నేను తరచి చూసుకున్నాను.
  మన వ్యక్తీకరణ మాధ్యమాల్లో ఉన్మాదం అందరి నోళ్ళూ మూసి రాజ్యమేలుతూంది.
  ఏదైనా ఒక వాచకం(text) రాసాక పాఠకులకు చోటిచ్చి, రాసిన వాడు పక్కకు తప్పుకోవాలనే నేను అనుకుంటాను.
  నా వ్యాసాల మీద తొలిసారిగా రాస్తున్న మాటలివి. ఇదే మలి సారి అయితే నా అదృష్టం

 22. శ్రీనివాసుడు says:

  రెటమతం వ్యాసంలో పాలుపంచుకున్న ఇద్దరు వ్యక్తుల్లో రెండవ వ్యక్తి వ్రాసిన కవిత, “సంభాషణలు” లోని ఒక భాగమిది
  ‘‘వొక తెర చాటున నక్కిన మాయోపాయి వేసే
  ఆట్టే తెలియని సహస్ర శిరచ్చేధ చింతామణి ప్రశ్నలలాంటివేవో ముఖాల మీద పెఠిల్లున చిట్లేదాకా
  ముసిరిన సంభాషణలకు
  అటూ ఇటూ తిప్పి చూసుకొనే దిగ్భ్రాంతీ దుఃఖమూ తప్ప’’
  *********************************************
  మనం పాలుపంచుకున్న రెటమత సంభాషణలోని మొదటి పేరాలోని వాక్యమయిన ‘‘‘‘ఇస్లాంకి, భరత ఖండపు సంస్కృతులకి జరిగిన వివాహ ఫలితంగా జన్మించినదే సూఫీయిజం‘‘ అన్న అతి గొప్ప సూత్రీకరణగురించి పాఠకులు అడిగిన ప్రశ్నలు ముఖాల మీద పెఠిల్లున్న చిట్లినప్పుడు అడిగినవారిని ఈ కవితలో ‘‘మాయావి’’ గా సంబోధించినవారు జియోనిస్టులా? సంఘ భక్తులా?
  ఆ మాట వాడటానికి ముందు తమని తాము తరచిచూసుకోలేదా?
  *********************************************************************
  (రాణీ శివశంకర శర్మ అనే బ్రాహ్మణుడు – జంధ్యం వేసుకునే శూద్ర కులపు అవ్వారి నాగరాజు మాటా మంతీ)
  అన్న వాక్యంతో అంతమయిన ఆ వ్యాసంలో పాఠకులు అడిగిన ప్రశ్నలకు వ్యాసరచయిత సమాధానమివ్వకుండా
  ‘‘కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు ‘‘ అని సమాధానమిచ్చినప్పుడు ‘‘శూద్రుడు’’ గా సంబోధించబడిన సంభాషణలో పాల్గొన్న రెండవవ్యక్తి స్పందించకపోవడం విజ్ఞతా, లేక ఉన్మాదమా?
  *****************************************************
  ‘‘శూద్రుడు’’ అని తన పేరు పెట్టి, తనని కూడా సంభాషణలో భాగంచేసి మొదటి వ్యక్తి వ్రాసిన రెటమత వ్యాసంలో ఉటంకించిన సమాచారం తప్పుల తడక అని సాక్ష్యాధారాలతో చూపిస్తుంటే వ్యాసరచయిత స్పందించకపోగా అడిగినవారిపై తిట్ల వర్షం లంకించుకున్నప్పుడు సంభాషణలో పాల్గొన్న రెండవ వ్యక్తిగా రచయితను ఖండించకపోవడం నైతికతా?
  *********************************************************
  ‘‘మాయావి’’ అని అడిగినవారిని ముద్ర వేస్తే కచ్చితంగా అవతలివారు గోబెల్స్‌నీ, మార్క్స్‌నీ తీసుకువస్తారు.
  ***********************************
  ’’మాయావి‘‘ అని సంబోధించిననప్పుడు నన్ను కూడా నేను తరచి చూసుకున్నాను. ఒక తప్పుడు సూత్రీకరణను ఖండించడానికి మాత్రమే ధర్మపోరాటం చేసేనని, నేను సత్యంవైపునే వున్నానని నాకు పూర్తిగా విశ్వాసం కలిగిన మాత్రమే తరువాతి సంభాషణలలో పాల్గొన్నాను.
  ************************
  మనని సహేతుకంగా ఖండించినవారిని మనం ఉన్మాదులుగా చూస్తే ఉన్మాదులుగా కనబడతారు, మాయావులుగా చూస్తే మాయావులుగా కనబడతారు.
  *********************************************
  చదవడంలో ఒక భాగంగా వ్రాసిన వ్యాసాలలో ఇచ్చిన సమాచారానికి భిన్నమైన సమాచారాన్ని తెలిపినప్పుడు, ‘భిన్న అభిప్రాయాలుంటాయి‘ అని సరిపెట్టుకోవడం శాస్త్రీయ దృక్పథమవుతుందా? లేక మన స్వంత దృక్పథమవుతుందా? అధ్యయనం పూర్తి కాకుండానే ఒక దృక్పథాన్ని ఏర్పరచుకోవడం, దానినే పరమంగా భావించి ముందుకు సాగడం ఏ రకమైన శాస్త్రీయత?
  **************************************************
  ‘‘ఏదైనా ఒక వాచకం(text) రాసాక పాఠకులకు చోటిచ్చి, రాసిన వాడు పక్కకు తప్పుకోవాలనే నేను అనుకుంటాను.‘‘
  అంటే, రచయితకు ఆ వాచకం గురించి ఎట్టి బాధ్యతా వుండదా? దానిలో ఇచ్చిన సమాచారం పూర్తిగా పొరబాటయినప్పుడు ఆ సమాచారం ద్వారా ఏర్పరచుకున్న సంబంధమూ, తద్వారా ఏర్పడిన దృక్పథంలో వాస్తవికత వుంటుందా? లేక, అధ్యయనం అనేది తను చదివే పుస్తకాల ద్వారానేగాని పాఠకులతో జరిగే సంభాషణలో అసాధ్యం అన్న నిర్ధారణా?
  *******************************************
  చప్పట్లు మ్రోగాలంటే రెండు చేతులూ అవసరమవుతాయి. అంతేగానీ ఒక్క చేత్తో చప్పట్లు మ్రోగవు. ‘‘జరిగిన సంఘటనలో నా హస్తం ఏమీ లేదు’’ అని సమర్థించుకోబోతే అది కచ్చితంగా వ్యక్తీకరణ మాధ్యమాల్లోని మరొక రాజకీయ ఎత్తుగడే అవుతుంది.
  *************************************************
  దేవరకొండవారు ‘‘మరి కబీర్ రచించిన ‘భజోరె భయ్యా రామ గోవింద హరే’ భజన్ లో గోవింద, హరి కూడా నిర్గుణ బ్రహ్మాన్నే సూచిస్తాయా? నిర్గుణ బ్రహ్మం అఖండం కాదా? వ్యాస రచయిత ఈ కోణంలో స్పష్టతను ఇవ్వగలరు’’ అని అడిగిన ప్రశ్న ఈ వ్యాసంలోని విషయానికి సంబంధించి మాత్రమే.
  దానికీ ఈ వివరణకూ సంబంధమేమిటి?
  ఇదంతా చెప్పడంలో ఉద్దేశం ఎదుటివారిని సంఘభక్తులుగా, జియోనిస్టులుగా, ఉన్మాదులుగా చిత్రీకరించాలనా?
  వారికి రెటమతం వ్యాసం నుండీ జరిగినదంతా తెలియదనా? లేక, నేను వారికి తెలుపలేననా?
  లేక, ఆ వ్యాసాన్ని, తరువాతి సూఫీ వ్యాసాలని వారు చదవలేరనా?
  ******************************************************
  గోబెల్స్, మార్క్స్ ప్రస్తావన వచ్చింది ఈ వ్యాసాల్లోనే. అంటే, అంతకు ముందు వ్యాసాలవరకూ ఉన్మాద వ్యక్తీకరణ లేనట్లేనా?

 23. a.nagaraju says:

  శ్రీనివాసుడు గారు
  నా కవిత రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాసినది.
  http://saarangabooks.com/retired/2016/03/25/%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%a3%e0%b0%b2%e0%b1%81/
  “….సందర్భాసందర్భాల నడుమ తమను తాము పేని
  ఊపిరి కదలికలకు చలించే వో సంకేతంలాగా కాకుంటే ఇంకేదో స్ఫురించని సుదూరపు ఊహలాగా
  ఏదో వొక క్షణంలో
  ఎవరొస్తారో తెలియదు కానీ
  ఇదుగో ఇట్టాగే చప్పున చొచ్చుకొని వొచ్చేస్తారు…..”

  -వ్యక్తులను ద్వేషించడానికయితే కవిత్వం రాయనవసరం లేదు.

  • శ్రీనివాసుడు says:

   సూపీ/ ఇస్లాం అని సూఫీని ఇస్లామ్‌కి పర్యాయపదంగా ఉపయోగిస్తున్న నాగరాజు గారూ, ఉగ్రవాద ఇస్లాం వేరకు, సూఫీ వేరు అని గ్రహించండి. అదీ ఇదీ ఎప్పుడూ ఎక్కడా కలవవు.
   ‘వహీబీల ఉగ్రవాదమా లేక సూఫీ సద్గురువుల శాంతి పథమా’ అను పేరుతో ఆధ్యాత్మిక గురువు డా.హెచ్.నూర్ అహ్మద్ షాచే రచించబడిన ఈ పుస్తక పరిచయాన్ని చదివి, ఇస్లాం, సూఫీ వేరువేరని గ్రహించి, నేను మాట్లాడుతున్న ఉగ్రవాదాన్ని గురించి చర్చలోకి రండి. మీ ఇంటి దగ్గరవున్న దర్గాలోని ఖాద్రీలాంటి వారే ఈ పుస్తకం వ్రాసేరు.
   ************************************************
   మహామహిమాన్విత
   ఆపద్బాంధవులు
   జగద్గురు గౌసులాజం దస్తగీర్
   1వ, 2వ సంపుటాలు
   -హజరత్ ఖ్వాజా
   డాక్టర్ నూర్ అహమద్ షాహ్
   రెండు సంపుటముల
   వెల: రూ.580/-
   ప్రతులకు: ఛైర్మన్, డా.షానూర్ బాబా ఆస్తానా (సంస్థానము) ట్రస్టు
   కేంద్ర శాఖ: చేపల కాలనీ వద్ద, కణేకల్లు క్రాస్‌రోడ్
   కణేకల్లు – 515871,
   అనంతపురం జిల్లా.
   9701964955
   **
   సర్వాంగ సంపూర్ణమైన, రెండు సంపుటములలోనున్న ఇస్లాములోన వహబీల అతివాద మరియు ఆధ్యాత్మిక సూఫీ తత్వముల మధ్యగల వ్యతిరేక భావనల అధ్యయనము ‘వహీబీల ఉగ్రవాదమా లేక సూఫీ సద్గురువుల శాంతి పథమా’ అను పేరుతో ఆధ్యాత్మిక గురువు డా.హెచ్.నూర్ అహ్మద్ షాచే సృజించబడిన అధ్యయనము సర్వేశ్వరుడు (అల్లాహ్ మహాప్రభువు) పైని మరియు మానవాళిపైనున్న ప్రేమతో స్పష్టముగా ప్రేరేపితమై యున్నది.
   ఈ కృతి నిస్సందేహముగా ఇస్లాము మేధోసంపద యొక్క సర్వ సంగ్రహ నిఘంటువుగా కీర్తిమంతులైన ప్రముఖ సద్గురువుల పలువురి జీవిత చరిత్రలను పొందుపరుస్తూ మరియు అనేక సూఫీల భవనముల అనేక చిత్తరువులు కలిగి వున్నది. రచయిత డా.నూర్ అహ్మద్, స్వయానా ఖాదరీయ, చిప్తీ నిజామీ, బిందా నవాజీ, షుత్తారీ, సుహరివర్దీ పరంపరలకు చెందిన సూఫీ తత్వవేత్త. సూఫీ తత్వము, వహాబీ తత్వాన్ని (దక్షిణ ఆసియాలోని దాని ప్రతిరూపాలైన తాలిబాన్‌లను ప్రేరేపించిన దేవబందీ (తబ్లీగు జమాత్) తత్వము, వౌదూదీ స్థాపించిన అతివాద జమాతే ఇస్లాములను) వివరిస్తూ, ఇంకా చాలా విషయాలను ప్రస్తావించారు. వీటిలో హిందూ, బౌద్ధ, ఇస్లాము మతముల (వేదాంత) తత్వ విచారములు, సూఫీ తత్వ మరియు సుప్రసిద్ధ సూఫీల ఉపదేశములు సమ్మిళితములై వున్నవి.
   ************************************************************

 24. శ్రీనివాసుడు says:

  మంచిది నాగరాజు గారూ! మీరెందుకు వ్రాసేరో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు పాల్గొన్న ‘‘రెటమతం – ఒక సంభాషణ’’ అనే వ్యాసం తరువాత వచ్చిన ’’సంభాషణలు‘‘ అనే కవితలో ’’మాయావి‘‘ అన్నది నన్ను కాదని మీరు అంత నిజాయితీగా చెబుతున్నప్పడు ఆ విషయాన్ని నేను పొడిగించదలచుకోలేదు.
  ***************************************************************************
  మరి, మిగతా ప్రశ్నలకు సమాధానమేది? సంఘభక్తులు,జియోనిస్టులు., సామాజిక మాధ్యమాల వ్యక్తీకరణలో ఉన్మాదం,.శూద్రులు, ఉచ్చిష్టాలు, నైతికత వగైరా వగైరా?
  *********************************
  రెటమత వ్యాస్యంలో మీ స్పందన ఈ క్రింద ఇస్తున్నాను. ఆ సంభాషణలో పాల్గొన్నందుకు నైతిక బాధ్యతగా వ్యాస రచయిత యొక్క వ్యాఖ్యలని ఖండించాలని ఈ స్పందన చేసేటప్పుడయినా తోచలేదా?
  ************************************************************
  ‘‘అయితే సూఫీయిజం స్థానిక ప్రజల నమ్మకాలకూ, ఆచరణలకూ చాలా పెద్ద పీట వేసింది. అందుకే ఇది ప్రజలలో అంతగా భాగమయ్యింది. దర్గాల సంస్కృతి మన దేశ సూఫీ ఆచరణలో భాగమే.
  ఈ రోజు హిందూమతంగా మనం చెప్పుకుంటున్నది పూర్తిగా దానికి విరుద్ధం. ప్రజల విశ్వాసాలనూ, ఆచరణనూ అది లాఘవంగా ఆక్రమించింది.
  ఇట్టాంటి మతం పుట్టుకకూ, ఆధునికతకూ సంబంధం ఉంది. జాతి, సంస్కృతుల పేరుతో ఫాసిజానికి దారి తీసిన ఉన్మాదపు బీజాలతో దానికి సైద్ధాంతిక చుట్టరికం ఉంది.
  ఈ రోజు సమాజం ఎదుర్కొంటున్న ప్రమాదానికి విరుగుడుగా ప్రజల విశ్వాసాలను గౌరవించే ఆచరణలను ఎత్తిపట్టవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఏకశిలాసదృశమైన కథనాలను తునకలు చేయవలసిన అవసరం చాలా ఉంది.
  చరిత్రను వ్యాఖ్యానించడంలో, సూత్రీకరణలను చేయడంలో శర్మగారిని అంగీకరించలేని అంశాలు నాకు ఈ సంభాషణలో తటస్థపడ్డాయి.’’
  దీనికి సమాధానంగా హరి ఎస్. బాబు దర్గాల గురించి ఇచ్చిన వివరణ సరియైనదా, కాదా?
  ‘‘నేనిప్పుడొక ప్రాజెక్టులో దర్గాల గురించీ,దేవాలయాల గురించీ శ్రద్ధగా చదువుతున్నాను.
  దర్గాలు,ముఖ్యంగా ముస్లింపకీర్లు – జాగ్రత్తగా చదవండి సూఫీలు కాదు,మహమ్మదు ప్రవక్త ప్రవచించిన ఇస్లాము మతాన్ని ప్రచారం చేసే పకీర్లు చనిపోయాక,వారి సమాధి చుటూ కట్టే ఒక భవనం.నేనిప్పుడు దాదాపు ఆంధ్రాలో ఉన్న దర్గాలను గురించి మొత్తం చదివాను.అన్నీ ముస్లింపకీర్లకి సంబంధించినవే.నాకెక్కడా ఈ దర్గాల్లో సూఫీ సన్యాసులకి సంబంధించిన ఆధారాలు కనబడలేదు.‘‘

  ఈ సమాచారం సరియైనదే అయితే దర్గాల గురించి మీకు తెలిసిన సమాచారం మీదే ఆధారపడి ‘‘సూఫీయిజం స్థానిక ప్రజల నమ్మకాలకూ, ఆచరణలకూ చాలా పెద్ద పీట వేసింది. అందుకే ఇది ప్రజలలో అంతగా భాగమయ్యింది. దర్గాల సంస్కృతి మన దేశ సూఫీ ఆచరణలో భాగమే‘‘ అని సూత్రీికరించినప్పడు అది తప్పుడు సమాచారమని తేలిన తరువాతనయినా మీరు స్పందించలేదెందుకుని?
  ఆ వ్యాఖ్యలో రెండవ భాగమయిన
  ‘‘ఈ రోజు హిందూమతంగా మనం చెప్పుకుంటున్నది పూర్తిగా దానికి విరుద్ధం. ప్రజల విశ్వాసాలనూ, ఆచరణనూ అది లాఘవంగా ఆక్రమించింది. ఇట్టాంటి మతం పుట్టుకకూ, ఆధునికతకూ సంబంధం ఉంది. జాతి, సంస్కృతుల పేరుతో ఫాసిజానికి దారి తీసిన ఉన్మాదపు బీజాలతో దానికి సైద్ధాంతిక చుట్టరికం ఉంది.‘‘ అన్న సూత్రీకరణకు మీకున్న ఆధారాలేమిటో తెలియజేయగలరా?
  **********************************************
  కుండబ్రద్దలు కొట్టినట్లు ఒక్క విషయం సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క హిందూమతంలోనే మీకెందుక ఫాసిజ ఉన్మాదం కనిపించింది? ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రస్తుతం ప్రపంచంలోని వివిధదేశాలలో రక్తపుటేర్లు పాలిస్తున్న మతాలలో మీకెందుకు ఫాసిజ ఉన్మాదాలు కనిపించలేదు? నేటి భారతావనిలో ఆ ఉగ్రవాద ముప్పు యొక్క ప్రాసంగికతను గురించి మీ వ్యాసాలలో ఒక్క పదమైనా ఎప్పుడూ ఎందుకు రాలేదు?

 25. a.nagaraju says:

  శ్రీనివాసుడుగారు నన్ను అంగీకరించినందుకు ధన్యవాదాలు

  అయ్యా,

  1. మాఊరిలో మీరు చెప్పే ముస్లీం ఫకీరుకు చెందిన సమాధి ఉన్న (రజా హుస్సేన్) దర్గా ఉంది. దాని పక్కనే ఒక నేల మాలిగ ఉన్న కట్టడం కూడా ఉంది. ఆ నేల మాలిగలో ఆ ఫకీరు తపస్సు చే్సుకునేవాడని జనం చెప్పుకుంటారు. కుల, మత విచక్షణ లేకుండా ఆయన ఉర్సులో పాల్గొంటారు. ఆ దర్గామీద ఆ ఫకీరు పేరు ఉంటుంది. ఆ పేరు చివర “ఖాద్రి” అనే విశేష నామం ఉంది. ఖాద్రీ అనేది మన దక్షణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఒకానొక సూఫీ సంప్రదాయం. ఈరాక్ నుండీ ఇక్కడకు వచ్చిన ఒక గురు పరంపరగా ఇది ఇక్కడ వర్దిల్లింది. ప్రస్తుతం దీనికి కేంద్రం బీజాపూర్ గా చెబుతున్నారు.

  ఈ వివరణ ముస్లీం ఫకీర్లు, సూఫీలే అని చెప్పడానికి సరిపోతుందనుకుంటాను.

  2. నేను ఇక్కడి స్థల కాలాలకు చెండిన వాడిని కాబట్టీ ఇప్పుడు మనం మోడీత్వగా పిలుచుకుంటూన్న “హిందూత్వ”ని ద్వేషిస్తాను. ఇది ముస్లీంలను”ఇతర”గా చాటుతుంది కాబట్టీ, నేను పని కట్టుకొని, తెలిసిన విషయాలే అయినా నా వ్యాసాలలో- ఇస్లాం/ సూఫీల కాంట్రిబ్యూషన్ గురించి రాసాను.

  వివిధ ప్రపంచ దేశాలలో ఉన్న ఉగ్ర వాదం -అంటే ఐసిస్, ఇత్యాది వంటి పేర్లతో ఉన్న “ఇస్లాం ఉగ్రవాదం ” గురించి మీరు నన్ను అడగదలిచినట్లయితే అది అమెరికన్ సామ్రాజ్యవాదం బై ప్రోడక్ట్ అని అంటాను. అమెరికన్ సామ్రాజ్యవాదం “శత్రువు బూచి”ని చూపకుండా క్షణ కాలం కూడా మనలేదు. ముందు అమెరికన్ సామ్రాజ్యవాదం గురించి మాటాడకుండా మీరు చెబుతున్న ఇస్లాం సామ్రాజ్యవాదం గురించి ఒక్క మాట కూడా మాటాడబోను.

  భారతావనిలో ఉగ్రవాద ముప్పు గురించి తలుచుకున్నప్పుడు, కశ్మీర్ ప్రజల దీన స్థితి గురించి కూడా మాటాడవలసి వస్తుంది.

  ఈ మధ్య చాలా మంది మేధావులు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అమాయకుల ప్రాణాల గురించి వ్యాకుల పడుతున్నారు. వీరి సహానుభూతి నిజాయితీతో కూడినదే కానీ, ఈ కారణంగా బలవంతుల దౌర్జన్యాలనీ, దానికి ప్రతిగా ఉత్పన్నమయ్యే పరిణామాలనీ త్రాసులో సమానంగా చూడడం నాకు ఇంకా అలవడలేదు. జియోనిస్టు దురాక్రమణల్లో నా హృదయం పాలస్తీనియన్ ల వైపు ఎలా మొగ్గుచూపుతుందో అలానే బలవంతుల, అత్యధికుల అరాచకాలకు వ్యతిరేకంగా నా దుఃఖార్తి బలహీనులు, అల్ప సంఖ్యాకుల వైపు పొరలుతుంది.

  మీరు నాకు అనవసరంగా అతి ప్రాచుర్యం కలిగిస్తున్నారు.

 26. నాగరాజు గారు, శ్రీ నివాసుడు గారిది అచ్చం అగ్రరాజ్యా ఫిలాసఫీ నే! అమెరికా కు దొరకని న్యాయం -ధర్మమనాలేమో- మరొ దేశానికి ఉండగూడదు అంటారు. అది అప్రజాస్వామికమట! తాము ఎన్ని అణుబాంబు లైనా సృష్టించుకోవచ్చు ఇతరులకు ఆ హక్కులు ఉండనేకూడదట! అలాఉంటే ఆదేశాలమీద తాము కన్నెర్ర చేయక తప్పదట! అలా చేయటం లోనే ప్రజాస్వామ్య పరి రక్షణ ఉందట! అయినా తనలాంటి ధర్మ ప్రభువు ఉండరట! తమ వంటి ధర్మ ప్రభువుల ను ఎదిరించడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఎదిరిఙడమేనట!

 27. నాగరాజు గారూ
  కేవలం ఇంటర్నెట్ సమాచారాన్నే వేదంగా భావించక, మీవూరి ఫకీరు గురించి, హృదయం గమమైన వివరాలు మాట్లాడడం మీలోని సృజనాత్మకతకి, సజీవతకి అద్దం పడుతోంది . యాంత్రికతని దూరం చేస్తోంది.

 28. నాగరాజు గారూ
  ప్రపంచంలోని దర్గాలన్నీ తిరిగి , సంప్రదించి రాయగలిగితే మంచిదేకాని అది కష్ట సాధ్యం కనుక , దొరుకుతున్న అన్ని లింకులూ యిక్కడ పోస్టు చెయ్యండి. పాఠకులె విశ్లేషించుకొంటారు అన్ని కోణాల్లొనూ .

 29. manjari lakshmi says:

  ఏమీ అనుకోకపోతే మీరు రోజు రోజుకు ఇంప్రూవ్ అయిపోతున్నారండీ. ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా బాలన్స్ గా మాట్లాడటం, pointwise గా అడగటం చేస్తున్నారు. ఇలా చెపితే, అడిగితే మా బోటి తక్కువ జ్ఞానం ఉన్న వాళ్లకు కూడా చెప్పేది ఏమిటో ముందర అర్ధం చేసుకోవటానికి వీలవుతుంది. చేట భారతాలంత లింకులు అవీ ఇంగ్లిష్లో ఇస్తుంటే ఫాలో అవటం మా వల్ల కావటం లేదు.

 30. శ్రీనివాసుడు says:

  నాగరాజు గారూ!
  ’’The Ideology of Exodus – The Fleeing of Hindus from Kairana‘‘
  http://www.newageislam.com/radical-islamism-and-jihad/tufail-ahmad,-new-age-islam/the-ideology-of-exodus-%E2%80%93-the-fleeing-of-hindus-from-kairana/d/107606
  ***************************************************************
  Tufail Ahmad is author of “Jihadist Threat to India – The Case for Islamic Reformation by an Indian Muslim.”
  తుఫైల్ అహ్మద్ బీహార్ లో జన్మించాడు. ప్రస్తుతం బ్రిటన్ పౌరుడు. అతని వెబ్ సైట్ ‘‘న్యూ ఏజ్ ఇస్లామ్‘‘
  ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
  He is currently the Director of the `South Asia Studies Project’ at the Middle East Media Research Institute (MEMRI) in Washington, D.C. His research is focused on jihadist movements in Afghanistan, Pakistan, India and Bangladesh as well as the counter-terrorism policies of the countries. He also carries out research on issues of cultural and religious freedom in these countries.[2]
  ***********************************************************************
  Speaking at the launch of his book in New Delhi on March 31, 2016, Ahmad accused the Indian state of handing over its responsibility of teaching Muslim children to madrassas (Islamic seminaries) which he described as counter-liberty movements; and while stressing the need for Islamic Reformation, he called for teaching mathematics, economics and physics to Muslim girls from Grade 1 through Grade 12.[12] In a review of his book, American Indologist Dr. David Frawley described the author in these words: “Tufail Ahmad is a powerful and provocative voice for reform in Islamic society and in India in particular. He is also a key expert on national security issues in India, which is under siege by jihad.”[13]

మీ మాటలు

*