అరె!

చిత్రం: రాజశేఖర్

చిత్రం: రాజశేఖర్

 

-ఆర్.దమయంతి

~

 

అతని కోసం ఎదురుచూస్తున్న ఆమనికి విసుగొచ్చింది.  ఆ తర్వాత  – అది అసహనంగా  మారే అవకాశాన్ని రానీకుండా పుస్తకం తీసుకుంది చేతిలోకి. రెండు పేజీలైనా పూర్తి చేయకుండానే అర్ధమైపోయింది ఆ నవలా ఇతివృత్తం.

తనతో కాపురం చేయనంటున్న భర్త మీద తిరుగుబాటు చేసిన ఒక స్త్రీ కథ.

ఆమని కి ఒళ్ళు మంట ఇలాటి కథలన్నా, టీవి ల్లో చూపించే దృశ్యాలన్నా.

కట్టుకున్న వాడు ‘నువొద్దు మొర్రో ఫో’అని తరిమి కొడుతుంటే..  స్పర్శ రహిత శరీరంతో ఆమె మాత్రం.. అతనింట్లోనే పడుంటానండం, అతనితోనే కాపురం చేసి తీరతాననడం..ఎంత హాస్యాస్పదం!  ఎంత వ్యక్తిత్వంలేని తనం? పై పెచ్చు వాదన ఏమిటంటే, – తన హక్కు కోసం పోరాడుతున్నట్టు చెబుతుంది?

నిజమైన మొగుడూ పెళ్ళాల మధ్య హక్కులేమిటీ? శాసనాలేమిటీ? ఆ ఇంటిముందు మూగిన జనాలు,  స్త్రీ వాద సంఘాలు, మరో పక్క విలేకరులు,  కెమెరాలు, పోలీసులు… పెద్దమనుషులు… వీళ్ళంతా కలసి ఆమెని ఆ ఇంట్లోకి నెట్టి పోవచ్చు. కానీ ఆ తర్వాత గదిలో వాళ్ళు స్వచ్చమైన మనసుతో  ఎలా కాపురం చేస్తారని?

ఒక సారి  భార్య పట్ల ఇంత హేయం గా ప్రవర్తించిన వాడు, జనం బుధ్ధి చెప్పడంతో అమాంతం మంచివాడైపోతాడా? భయంతోనో, బెదిరింపులతోనో, కత్తి చూపించో, కక్ష కొద్దో చేసేదీ –  ఒక కాపురమే?!పండంటి కాపురమే?

ఎవరి మనసుని వారు ప్రశ్నించుకోవాలి. పైకి బాగానే వున్నా మేడి పండు చందం లా, ఎవరి ఆత్మ ఘోష ఎంతో ఆ జీవులకే తెలియాలి.

తననెప్పటికీ ఒక  గొప్ప సందేహం వెంటాడుతూ వుంటుంది.

ఎంత తాళి కడితే మాత్రం?! ..అసలంత పచ్చి శత్రువుతో ఆ పెళ్ళాం ఎలా పడుకుంటుంది?

‘నోర్ముయ్. అలాటి పిచ్చిమాటలు మాట్లాడకూడదు. సంసార పక్షమైన ఆలోచన్లు చేయి” – తల్లి కంఠం కంచులా మోగింది. ఆవిడ అక్కడ లేకపోయినా!

నవ్వొచ్చింది ఆమనికి.

అమ్మ ఏవడిగింది? తను – పుట్టింటికి తిరిగొచ్చినప్పుడు?

గదిలోకొచ్చి, తలుపులు మూసి, దగ్గరగా, చెవిలో రహస్యంగా అడగలేదూ? – ‘ఒక మాట అడుగుతాను చెప్పు. మీ ఆయన నీతో ‘కాపురం చేస్తున్నాడా?” ముఖమంతా  ఆందోళన నింపుకున్న  – ఆవిడ్నీ, ఆ అడిగే తీరు నీ చూసి  తను ఫక్కున  నవ్వింది.

ఆవిడకి కోపమొచ్చింది. “పరాచికాలకిది సమయం కాదు. అవతల నీ జీవితం నాశనమైపోతోంది నీకర్ధమౌతోందా ఆ సంగతి? ఇప్పటికైనా నిజం చెప్పు. ఎందుకంటే- నీ కాపురాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నాకుంది.” అంది గంభీరమైన గొంతుతో.

ఆవిడ దృష్టిలో ‘కాపురం’ అంటే సెక్స్.  తామిద్దరూ  కలసి సఖ్యం గా  ‘కాపురం’చేసుకునే కార్యంలో  – ఈవిడ బాధ్యతాయుతమైన పాత్ర పోషించడమేమిటో అర్ధం కాక మళ్ళీ తను నవ్వింది. గట్టిగా,  మరింత గట్టిగా నవ్వేసింది.

‘అడుగు తుంటే సమాధనం చెప్పకుండా ఏమిటా వెర్రి నవ్వూ, నువ్వూను?’ అంటూ అక్కడ్నించి విస్సురుగా  వెళ్ళిపోయింది.

Kadha-Saranga-2-300x268

తల్లి అమాయకత్వం మీద జాలేసింది. ‘భార్యా భర్తల మధ్య శారీరక సంబంధం కొనసాగుతూ వుంటే, ఇక ఆ సంసారానికి ఢోకా వుండదు.’ – అనేది ఆవిడ అభిప్రాయం కావొచ్చు. లేదా, గట్టి నమ్మకవూ కావొచ్చు.

కానీ, పగలు జరిగే యుధ్ధాలను కానీ, లేదా ఇద్దరి మధ్య రగిలే ఘోర విభేదాలను గానీ –  ఈ సెక్స్యుయల్ బంధమేదీ లేవీ అడ్డుకోలేదన్న  సంగతి ఆవిడకి తెలీదు. చెప్పినా అర్ధం కాదు.

ఎందుకంటే – సర్దుకుపోవడానికి, సహనం నశించిపోవడానికి మధ్య వున్న దూరం  చాలా పెద్దదన్న నిజం ఆమె ఒప్పుకోదు.

అది – ఇన్నోసెన్సో, ఇగ్నోరెన్సో ఏదైతే ఏంలే, కొందరి స్త్రీల అమాయకత్వాలే కొంతమంది భర్తలకి శ్రీరామ రక్షలు.

ఇలాటి జంటే ఒకటుంది తనకి తెలిసి.

వాడు పట్టుబడ్డాడు.సాక్షాత్తు భార్యే పట్టిచ్చింది. పేపర్లో కూడా వచ్చింది ఆ వార్త. చుట్టాలందరూ ఏమౌతుందా కథా అని చెవులు కొరుక్కున్నారు. పరుల బాధలు –  మంకి వినోదాలు కదా. అయితే, చివరికి ఏమీ కాలేదు. ఆమె  ఇల్లొదిలి ఎక్కడికీ పోనూ లేదు. అతను తన అలవాట్లను  మానుకోనూ లేదు.

ఇప్పటికీ అతనితోనే..’కాపురం’ చేస్తోంది. పెళ్ళిళ్ళకీ  పేరంటాలకీ   నవ్వుముఖమేసుకుని కనిపిస్తూనే  వుంది. పాపిట్లో ఇంత సిందూరం  పులుముకుని. మొన్ననే  దంపత్ సమేతం గా పీటల మీద కూర్చుని –  సత్యనారాయణ వ్రతం చేసుకుని లేచారు.

ఇలాటి వాళ్ళని చూసి తనెన్ని సార్లు బుర్ర బద్దలు కుంటుందో! ఈ మోసగాడితో, ఎలా ‘కాపురం’ చేస్తోందీ ఈమె అని?

‘చేయక?, మరెక్కడికి పోతుంది పాపం!’అనుకోడానికి ఆమేమైనా చదువూ డబ్బూ లేనిదా అంటే అదీ కాదు.

మరి? – అర్ధం కారంతే. వదిలేద్దాం.

స్త్రీలు ధనం తో కాదు. – వ్యక్తిత్వంతో బ్రతకగలిన రోజే అసలైన స్త్రీ స్వేచ్చకి అర్ధం.

తనకీ సమస్య వొచ్చింది. మొదట్లో – విడాకుల వరకూ వెళ్ళకూడదనుకుంది. రాను రాను  భరించడం కష్టమై, వొద్దనుకుంది. శాశ్వతంగా వొద్దనుకుంది.

లోపమేమిటో చెప్పాలన్నారు.  ఎందుకు చెప్పాలనేది తన పాయింట్.

ఒక మగాడికి దురలవాట్లేమీ లేనంత మాత్రాన, అతగాడు గ్లోబల్ లేబుల్డ్ మొగుడైపోతాడా?

ఆ మాటకొస్తే భర్తలో భార్యకి కనిపించిన వీక్నెస్సులు ప్రపంచంలో మరెవరికీ కనిపించవు.

ఇంట్లో కాసేపు కూర్చుని వెళ్ళిపోయే మనిషినైతే ముక్కు మూసుకుని ఎంతైనా భరించొచ్చు. కానీ, కాలమంతా కలసి బ్రతకాల్సొచ్చినప్పుడే – ఆ లోపం మరింత భయంకరం గా కనిపిస్తుంది. ముఖ్యంగా గదిలో..ఒకే మంచాన్ని పంచుకోవాల్సొచ్చినప్పుడు.. ఉహు. ఇక భరించడం తన వల్ల కాదంటుంది మనసు.

అప్పటి అ పరిస్థితిలో – తననెవరూ  అర్ధం చేసుకోవడం లేదనే చింత మానుకుంది. నిరాశనిస్పృహలనించి – ధైర్యంగా సమస్యనెదుర్కుని ఒడ్డుకొచ్చిపడింది.

నిజమా! నిజంగా  తను ఆ సుడిలోంచి బయటపడిందా? – అవును., కాదు.! దేనికి ఎక్కువ మార్కులేయాలో తెలీడం లేదు.

సెల్ మోతకి ఉలిక్కిపడి, ఆశగా అందుకుంది. అతనేమోనని.  స్క్రీన్ మీద ‘అక్క’ పేరు చూసి నిట్టూర్చింది. నిరాశగా.

“హలో అక్కా..”

“ఏమిటే , అలా వస్తోంది మాట నీరసంగా”

పట్టెసింది తనని. ఎంతైనా అక్క తెలివిగలది. ‘నువ్వెంత చదివి ఏం లాభం? అక్కలా కాపురం చేసుకునే తెలివితేటలు లేనప్పుడు?” తల్లి వేసిన దొబ్బులు చెవిలో మోగాయి.

“లేదక్కా, బాగానే వున్న. చెప్పు. ఏమిటి సంగతులు? ‘ బావగారితో నీ ‘కాపురం’ఎలా సాగుతోంది?”

అడిగింది నవ్వుతూ.

“ఆ. నన్నే అడిగావ్? ఎప్పుడూ వున్న ఖర్మే. నా రాతెప్పుడు మారేను?”

“యాగీ చేసొచ్చానన్నావు కదా? ఏమైంది?”

“దాన్నొదిలేశాడు. కానీ ఇప్పుడు కొత్త రోగం పట్టుకుంది. అది మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నాడు వెధవ.”

“అయ్యో. అలానా! ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడా?” ఆందోళన గా అడిగింది.

చిత్రం: రాజశేఖర్

“కొట్టడమెక్కడా? మాటలే లేవు.” ఎంత నిస్పృహ! బూతులు తిడుతూ, వీర బాదుడు బాదే మొగుడి దురాగతాలకి అలవాటుపడిపోయిన భార్యలకి నిలువెత్తు నిదర్శనం లా..కాదు కాదు ఆదర్శిని లా  కనిపిస్తోంది అక్క – ఆ క్షణంలో.  “పైగా చెప్పా పెట్టకుండా ఎటో పోతాడు. ఎప్పుడో గానీ, ఇంటికి తగలడడు. వున్నాడనుకోనా? పోయాడనుకోనా? పోయినా ఫీడా పొదును. పోనన్నా పోడు.” వింటున్న ఆమని కి ఆశ్చర్యమేసింది. మొగుణ్ణి ‘ఏమండీ ఏమండీ’ అంటూ పిలిచే అక్కేనా ‘వాడూ వీడూ’ అని చీదరిస్తోంది? ఈ విడిగారే గా చారుమతి అవతారమెత్తి  శ్రావణ శుక్రవార నోము నోచుకుని, ఆ తాగుబోతు పాదాలను లాక్కుని మరీ దణ్ణాలు పెట్టింది?! ఔర!

మొగుణ్ణి  వెనక తిట్టుకోవడం లో పెద్ద  తప్పు లేదని అక్క గాఢాభిప్రాయం. హు. ఇదీ –  గౌరవ దంపతుల సిధ్ధాంతం.  ఇంకా వింటోంది అక్క మాటల్ని. “వీడి వల్ల పుట్టిన పిల్లలు లేకపోతే నేనూ..ఎవడోకణ్ణి పట్టుకు పోయేదాన్ని. నీ..లా..గ…   హాయిగా..”

‘ నీ…లా…గ…నీ లా..గా..’ -అక్క మాటలు చెంప మీద చాచి కొట్టినట్టనిపించింది ఆమనికి.

అసలీమెకేం మాట్లాడాలో తెలీదు. ఇంతకు ముందు ఇలానే పరామర్శ పేరుతో నొచ్చుకునేలా మాట్లాడితే కాల్ కట్ చేసింది. కానీ మళ్ళా ఆమే,  పదే పదే ఫోన్ చేయడంతో, క్షమించింది. సర్లే. ఈ మాత్రమైనా తనని పలకరించే వాళ్ళెవరున్నారనిపించి, మాట్లాడుతోంది.

“ఏమనుకోకే ఆమని, నేను నిజం చెబుతున్నా..నువ్వు చేసిన పనే కరెక్ఠ్ అనిపిస్తోంది నాకిప్పుడు. మొగుడికి నీతి నిజాయితీ లేనప్పుడు ..పెళ్లానికి మాత్రం ఎందుకుండాలే? పెళ్ళాన్ని పెళ్ళాం గా చూడని ముండమోపులతో కాపురాలేవిటే చెల్లీ? నాకు మనసు రగిలిపోతోందే!..ఈ శరీరాన్ని డబ్బాడు కిరసనాయిలు పోసి తగలబెట్టాలనుందే..” అక్క ఆవేశం దుఃఖంలోకి మారిపోతుంటే, ఆ నిస్సహాయ స్థితికి జాలేసింది ఆమనికి.

“బాధ పడకు అక్కా. పోనీ నా దగ్గరకొచ్చి వుంటావా,  ఓ నాలుగు రోజులపాటు?” మనస్ఫూర్తిగా పిలిచింది.

రెండు సెకన్ల తర్వాత మాట్లాడింది అక్క. చెంగుతో  కళ్ళు తుడుచుకున్నట్టుంది. “వొద్దులేవే ఆమని! నేనక్కడకొచ్చినప్పుడు ఈయనిక్కడికొస్తే..పెద్ద గోలౌతుంది. మా అత్త పక్షి వుంది గా. అది లేనిపోనివన్నీ వాడికెక్కిస్తుంది. మొగుడు ఊళ్ళో లేనప్పుడు, చెప్పకుండా రహస్యం గా వెళ్ళానని  లేని ‘..తనాలు’ అంట కట్టినా అంటకడ్తుంది. కట్టుకున్నవాడు సవ్యమైనవాడైతే గా, నమ్మకపోడానికి? –  విన్న వాళ్ళు కూడా నిజమనుకుంటారు. అది నే భరించలేను. ఆ తర్వాత బ్రతికేం లాభం చెప్పు? ఇప్పుడొద్దు.  తర్వాతెప్పుడైనా వస్తాలే..”

అక్క మాటలకి, ఆమె ఆలోచనా విధానానికి గాఢం గా  నిట్టూర్చింది ఆమని.

“అవునే ఆమనీ? ఇప్పుడితను నిన్ను బాగానే చూస్తున్నాడా? ..” ఆ కంఠం లో ఆర్ద్రత కంటెనూ, ఆరా తనమే కొట్టొస్తూ వినిపించింది.

“ఆ! బాగానే వుంటున్నాం అక్కా” అని జవాబిస్తూనే లోపల్లోపల అనుకుంది. ‘ఇక మొదలు. ప్రశ్నల దాడి.’

“పోన్లే. వ్రతం చెడ్డా ఫలం దక్కా లంటారు అందుకే! నువ్వు సుఖం గా వుంటే అంతే చాలే నాకు. కానీ విను.  నీ తోబుట్టువుగా నీ మేలు కోరి  చెబుతున్నా విను. మగాణ్ని నమ్మేందుకు లేదు. ఇవాళున్నట్టు రేపుండాలని రూలేం లేదు. వాడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మన చేతుల్లోంచి జారిపోతాడో చెప్పడం కష్టం. ఇరవై నాలుగ్గంటలూ ఏం కాపలా కాస్తావ్ కానీ, మెల్లగా ఈ మాటా ఆ మాటా చెప్పీ ఆ మూడు ముళ్ళు వేయించుకో. ఏ గుళ్ళోనో పూలదండలు మార్చుకుని, ఒక ఫోటో తీయించుకుని ఇంట్లో పెట్టుకో.. ఎటొచ్చెటు పోయినా పడుంటుంది ఒక ఋజువుగా!..  ఏమిటీ? వింటున్నావా?”

అక్క గారి మాటలకీ, సూచనలకీ – ఆమని మది చెదిరింది.

శ్రేయోభిలాషి పాత్ర పోషిస్తున్న అక్క – ‘ ఏమిటీ మాట్లాడుతోంది? ‘  అనుకుంటూ  విస్తుబోయింది.

కట్నమిచ్చి, పెద్ద మనుషుల మధ్య, నిండు పందిట్లో పెళ్ళి చేసుకుంది కదా! మరి ఇప్పుడెవరొస్తున్నారు ఆమె కాపురాన్ని సరిదిద్దడానికి? రెండు వరసల బంగారు నాంతాడు, వాటికి వ్రేలాడుతూ రెండు సూత్రాలు, నల్లపూసల గొలుసు, కాళ్ళకి మెట్టెలు..హు. మరి ఇవేవీ మొగుడి చేత  ‘కాపురం’చేయించలేకపోతున్నాయి ఎందుక ని?

అతను పరాయి చోట్లకి పారిపోకుండా ఏ కొంగు ముళ్ళూ కట్టి పడేయలేకపోతున్నాయెందుకనీ?  నడిచిన ఏడడుగులు అతన్ని కళ్ళాలేసి కట్టడి చేయలేకపోతున్నాయెందుకనీ?  ఒక మూర దారంతో, నాలుగు పసుపు అక్షింతలతో పవిత్రమై పోయిందనుకున్న వివాహ బంధాలకు గారంటీ కార్డ్ ఏదీ? ఎక్కడుందీ? ఎవరిస్తారు?

అక్కని సూటిగా ప్రశ్నించాలనుకుంది. కాదు. నిలదీయాలనుకుంది. కానీ,  అడగలేదు. ఎందుకంటే, కాలం ఖర్చైపోవడం తప్ప పెద్ద ఉపయోగకరమైన జవాబేమీ రాదు.

సగటు ఇల్లాళ్ళకు –  కష్టాలు చెప్పుకుని సానుభూతి పొందడం లో వున్నంత సుఖం, పరిష్కారాన్ని కనుగొనడం లో వుండదు. వీళ్ళు  – మనశ్శాంతిని పారేసుకున్నంత సులువుగా మనస్తాపానికి కారకుడైన మొగుణ్ని  పారేయలేరు. కట్టుకున్న వాడెలాటి వాడైనా సరే,  వాడితోనే ‘కాపురం’ చేసుకోవడం అలవాటై పోయాక, అదే ప్రాతివ్రత్యమని రూఢీ  చేసుకున్నాక, .. ఇక ఇప్పుడు తను అక్క గారికి కొత్త గా చెప్పాల్సిన సూక్తులు కానీ సందేశాలు కానీ ఏవీ లేవు.  ఆవిడ చెప్పింది విని ‘పాపం’ అని అంటే చాలు. ఆవిడ ఆనందం తో పండిపోతుంది. తను సతీ సుమతికి అచ్చమైన వారసురాల్నని  గట్టిగా ఊపిరి తీసుకుని, రాని మొగుణ్ణి తిట్టుకుంటూ నిద్రపోతుంది.  హు!

‘ఆమనీ! మాట్లాడవేమిటే?” – అక్క మాటలకి ఈ లోకంలోకొచ్చింది.  -“ఆ! అక్కా! వింటున్నా చెప్పు…సరే సరే. అలానే చేస్తాలే.  ఇవాళే  మాట్లాడతా అతనితో!..ఏమంటాడో చూస్తా..” అక్క సంతృప్తి కోసం  చెప్పింది.

“ముందు నువ్వాపనిలో వుండు. సరేనా? జాగ్రత్త. వుంటా మరి…”

సెల్ మూసేసి, సోఫాలో జారగిలబడి దీర్ఘాలోచన్లో మునిగిపోయింది. ఎంత వొద్దనుకున్నా, అక్క మాటలు   ఆమని బుర్రని తొలిచేస్తున్నాయి

గతమంతా ఒక్క సారి కళ్ళ ముందు రీలు చుట్టుకుంది. తను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మరోసారి తీర్పునిచ్చుకుంది. ముఖ్యంగా ఇతనితో.. కలసి బ్రతకడం గురించి!

“అదేం, చీకట్లో కూర్చున్నావ్?”  లైట్ స్విచాన్ చేస్తూ  అడుగుతున్నాడు. – అతను.

చీకటి..చీకటి..తను గమనించనే లేదు!  ..చీకటి… నల్లటి చీకటి..తెరలుతెరలు గా..దట్టమైన చీకటి.. బలమైన అలలు వలయాలు గా  చుట్టుకుంటూ ముంచేసినా తెలీని చీకటి.  తననుకుంటోంది..వెలుగులోకొచ్చానని..తెలివిగా ఆలోచిస్తోందని ..కాలానికి తగిన మార్పులు చేర్పులతో సుఖం గా బ్రతుకుని నిర్దేశించుకుంటోందనీ..మోడర్న్ లేడీ అనీ.కానీ, కాదనుకుంటా? ఒకవేళ అయితే, అప్పుడు ఇప్పుడూ తన దిగులు పరిస్థితి ఒకలానే ఎలా వుంటుంది. ..ఎదురు చూడటం…నమ్ముకున్న అతను నిజమైన వాడేనా? జీవితానికి అతికించుకున్న బంధం – వమ్ము ఔతుందేమోననే అభద్రతా భావం..కాదు అశాంతి సంద్రం ఎందుకనీ?

అటు అక్కది, ఇటు తనదీ అదే పరిస్థితి..ఎందుకనీ? ఇంతటి అనిశ్చిత – తమకు  మాత్రమే ఎందుకనీ?..

చిత్రం: రాజశేఖర్

అతనొచ్చి ఆమె పక్కన కుర్చున్నాడు. రెండు చేతుల్తో భుజాలు చుట్టి దగ్గరకి తీసుకుని, ఆమె పెదవుల మీద బలం గా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత..అతని చేతులు అలవాటుగా ఆమె భుజాల మీంచి కిందకి జారుతుంటే , సున్నితంగా నెట్టేస్తూ, పక్కకి జరిగి, అతని ముఖంలోకి సూటిగా చూసింది. ఎలాటి టెన్షనూ కనిపించలేదు.

ఆమె చూపుల్ని మరోలా అర్ధం అయ్యాయి అతనికి. “నీకు తెలుసు కదా ఆమని, నా పరిస్థితి..? ” అన్నాడు. ‘సారీ’ అనే అర్ధం స్ఫురించేలా!

ఆమేం మాట్లాడ్లేదు.

“అవునూ, నేనిక రాననుకున్నావా, అంత దిగాలుగా కూర్చున్నావ్?-ఏమిటీ?,కొంపదీసి  వొదిలేశాననుకోలేదుగా?'” అంటూ నవ్వాడు, ఫెళ్ళున.  పెద్ద జోక్ పేల్చినట్టు.

ఆమని వెంటనే – అతని ముఖంలోకి లోతుగా పరీక్షగా చూసింది – అభావంగా. అతనికేమీ అర్ధం కాలేదు.

కొన్ని సెకన్ల తర్వాత – హఠాత్తుగా – వున్నమనిషి వున్నట్టు ఫక్కున నవ్వింది.

తన జోక్ పేలిందనుకున్నాడతను.

కానీ ఆమె నవ్వు ఆగలేదు. ఇంకా బిగ్గరగా తెరలు తెరలుగా నవ్వడంతో..అతని ముఖం లో నవ్వు వెలిసిపోయింది. తెల్లగా.

“ఎందుకు అంతలా నవ్వుతున్నావ్?” – ఆ పిచ్చి నవ్వుకి బెదిరిపోతూ అడిగాడు.

“నవ్వొ..స్తోం..ది. ఎం..దు..కం..టే.. నీ మాటలకి.  ‘ భయపడ్డావా వదిలేసానని ?’ అని నువ్వంటుంటే.. నవ్వు..నవ్వొస్తోంది..”

“..అవును. తప్పేముంది?” ముఖం చిట్లించుకున్నాడు.

ఒక్కసారిగా మనిషంతా గంభీరమైపోతూ ఒక్కో అక్షరం వొత్తి పలుకుతూ అంది. “మరి నీకు భయమేయలేదా? ఇంటికి రాకుండా పోతే, నేనిన్ను వొదిలేస్తానని? ఆ?.”

అనుకోని ప్రశ్నకి.. విద్యుద్ఘాతం తగిలిన వాడిలా చూస్తుండిపోయాడు. అహం దెబ్బ తిన్న అతన్లోనిమగాడి కేక ఆమెకు మాత్రమే వినిపించింది.

మళ్ళీ నవ్వొచ్చింది. ఇంకా నవ్వుతోంది..తెరలు తెరలు గా..పడీ పడీ నవ్వుతోంది.. మెళ్ళో మంగళ సూత్రాలు లేని గొలుసు కదిలిపోయేలా…అలా  న..వ్వు..తూ..నే వుంది.

******

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. swatee sripada says:

  ఆ రోజులు వచ్చే సాయి దమయంతీ ,ఇప్పుడు భయపడే స్థాయికి యాభై శాతం పురుష ప్రపంచం
  వచ్చి0ది, ఎక్కడ వదిలేసిపోతే తమ పరువుపోతు0దోనని , కధ , కధనం బాగుంది

  • దమయంతి గారు -బహుశా ఆడవాల్లంతా ఇలా అలొచించలేరేమొ–అందుకే– నోములు నొముకుంటూ- సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటు బ్రతికేస్తుంటారు-పైగా పొద్దంత చీదుకుంటువుంటారు-రాత్రి మళ్ళీ మామూలే–

   • ఆర్.దమయంతి. says:

    -పైగా పొద్దంత చీదుకుంటువుంటారు-రాత్రి మళ్ళీ మామూలే–

    *
    పైగా పొద్దంత చీదుకుంటువుంటారు-రాత్రి మళ్ళీ మామూలే–

    * పాపం! వేరే దారి కనిపించదండి. – భరించడం ఒక్కటే తప్ప.
    అదేమిటొ, ఎంత బాధా అలవాటైపోతుంటుంది. అలా..అలా..వున్న సమయంలోనే నవ్వుకోవడం..మళ్ళా ఏడ్వడం.
    మల్లెపూలు తెచ్చాడని పొంగిపోతుందా..తెల్లారి లేచాక నాతో అంటుంది. ‘…కడుపంతా పచ్చి పుండులా వుందండి’
    అని.
    నిజం. నమ్మండి. కళ్ళంట నీళ్ళొచ్చాయి. ఆ దీనవదనం చూసి.
    ధన్యవాదాలు ఉదయరాణి గారు కథ నచ్చినందుకు. మెచ్చినందుకు.

 2. ఆర్.దమయంతి says:

  స్వాతి గారు,
  ముందుగా నా సంతోషాన్ని పంచుకోనీండి మీతో. :-)
  మీకు కథ నచ్చిందంటే నాకదొక అవార్డ్ అన్నమాటే.
  కథ గురించి మీరన్నట్టు – ఆ రోజులు పోయిన మాట వాస్తవమే. ఇంకా ఆ మిగిలిన 50% కూడా రూపు మాసిపోవాలని ఆకాంక్ష.
  మన వారికి మంచి రోజులు వస్తాయన్న ఆశ తోనే ఈ కథ రాసాను స్వాతి గారు.
  మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అందచేసినందుకు నా మనః పూర్వక ధన్యవాదాలు.

 3. B.Prathapkumar Reddy says:

  చాలా చాలా బాగుందండి..మంచి విశ్లేషణ..కొత్త ఆలోచనా విధానం …ఇంతకు ముందే కొంత మంది స్త్రీలలో ఇలాంటి ఆలోచనలే వచ్చి ఉన్నా కూడా వ్యక్త పరిచే వారు కారు…అమలు లో అస్సలు పెట్టేవారు కాదు..ఇప్పుడు కాలం మారడం తో పాటు స్త్రీ ఆలోచనా విధానం మారి ,బయటకి వ్యక్తం చేయడం తో పాటు,కొండొకచో అమలు చేస్తున్నారు కూడా….నాకు ఎప్పుడూ మీ కధల్లో చాలా బాగా నచ్చేది మీ కధనం ..ఈ సారి కూడా మీ కధనానికి 100 కి 100 మార్కులు. (మీకు మార్కులు వెయ్యగాలిగెంత అర్హత నాకు ఉందని కాదు..సరదా గా అన్నాను)..మీ నుంచి మరిన్ని మంచి కధలు రావాలని మనసారా కోరుకుంటూ..

  • ఆర్.దమయంతి. says:

   1. “ఇంతకు ముందే కొంత మంది స్త్రీలలో ఇలాంటి ఆలోచనలే వచ్చి ఉన్నా కూడా వ్యక్త పరిచే వారు కారు.”

   * నిజమే. ఆ నాటి మూర్ఖపు ఆంక్షలు స్త్రీలని అంతగా
   భయపెట్టేవి మరి.
   స్త్రీకి వున్నంత ఓర్పు కాలానికి వుండదనుకుంటా!
   కాలం మారింది. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటు నైతికంగా కానీండి, అటు చట్టపరంగా కానీండీ.
   ఇప్పుడు జపాన్ లో స్త్రీ విడాకుల చట్టాన్ని సవరించారు. విడాకులనంతరం స్త్రీలు తిరిగి పునః వివాహం చేసుకునే గడువుని ఆర్నెల్ల నించి తక్కువ కాలానికి కుదించారు.
   తమని అమితం గా భయపెట్టే తలాక్ అనే మాట నించి రక్షించాలంటూ ముస్లిం సోదరీమణులు – మత పెద్దలకు వినతి పత్రాన్ని సమర్పించే యత్నంగా సంతకాలను సేకరిస్తున్నారు.
   చదువొక్కటె తమకిక దిక్కని భావిస్తున్నారు, చదువుకోవడం కోసం ఎన్ని హింసల్నైనా భరిస్తా మంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ వనితలు.
   మన చలం కలలు కన్న స్త్రీ – రూపు రేఖలు దిద్దుకోవాలని ఆశిద్దాం.

   2. ‘ – నాకు ఎప్పుడూ మీ కధల్లో చాలా బాగా నచ్చేది మీ కధనం ..ఈ సారి కూడా మీ కధనానికి 100 కి 100 మార్కులు.’

   * చాలు ప్రతాప్ గారు. ఈ ఒక్క మాట చాలు. :-) నేనూ, నాలోని రైటర్ పండగైపోడానికి.

   ఏ రైటర్ కయినా ఇంతకు మించిన సంతృప్తి ఇంకేముంటుంది చెప్పండి!
   తెలుగు కథ పట్ల మీకున్న కొండంత అభిమానం ముందు నేను చెప్పే బుల్లి ‘థాంక్స్’ చాలా చిన్నబోతుందేమో!…
   అనేకానేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ
   హార్దికాభివందనములతో…..

 4. కాకి రాములమ్మ says:

  బావుంది.

  • ఆర్.దమయంతి. says:

   కాకి రాములమ్మ గారు, ధన్యవాదాలు.

  • రాణి రాజ సులోచన says:

   ఈ కాకి రాములమ్మ ఫేస్ బుక్ లో తప్పుడు ప్రొఫైల్ తో…ఎకౌంట్ నడుపుతున్నారు. జర జాగ్రత్త..

   • అవునా? అలా
    ఎందుకు—?

   • ఆర్.దమయంతి. says:

    అవునా!
    మీ సూచనకి థాంక్సండి.

   • ఆర్.దమయంతి. says:

    రాణి రాజసులోచన గారు, కాకి రాములమ్మ గారి ఫేస్ బుక్ కోసం వెదికాను. కనిపించలేదు. మీ సూచన కి ధన్యవాదాలు.

 5. suvarchala chintalacheruvu says:

  chaala chaalaa baagundanDi miiru cheppina tIru!

  • ఆర్.దమయంతి. says:

   చాలా ధన్యవాదాలు సువర్చల గారు.
   :-)

 6. దేవరకొండ says:

  ఇలా బాగున్న కథలకు అరె అనీ అరెరె అనీ కాకుండా ఇంకా సముచితమైన శీర్షిక పెడితే బాగుండుననిపించింది. ‘కాపురం ‘ అనే పదాన్ని బాగా పచ్చడి చేసేశారు కనుక ‘కాపురం’ అని పెట్టినా ఇంకా బాగుండేదేమో! పెద్ద విషయం కాదనుకోండి!

  • ఆర్.దమయంతి. says:

   ‘ఇలా బాగున్నా కథలకు ‘ – అన్న మీ మాట నాకు నచ్చింది.
   :-) ధన్యవాదాలు.

   • దేవరకొండ says:

    ఇలా ఒక వాక్యంలో కొన్ని మాటలు మాత్రమే నచ్చాయని ఇలా చెప్పడం నాకు నచ్చింది. Thank you !

   • ఆర్.దమయంతి. says:

    ‘ఇలా బాగున్న కథలకు…’ అనే మీ మాట ఎందుకు నచ్చిందంటే –
    ఎంతైనా కాంప్లిమెంట్ కదండీ. వెంటనే నచ్చేస్తుంది, ఏ రైటర్ కయినా!
    :-)
    మరో సారి ధన్యవాదాలు దేవరకొండ గారు.

 7. Venkat Suresh says:

  అబ్బా ఎన్ని రోజులకి నా అభిమాన రచయిత్రి కధ చదివాను!!. ముగింపు లాగి చెంప పై కొట్టినట్లే ఉంది. సూపర్

  • ఆర్.దమయంతి. says:

   :-)
   హలోండి.
   అవునండీ చాలా రోజులైపోయింది మిమ్మల్నందర్నీ కలవక.
   కథలో ముగింపు నచ్చినందుకు ఆనందం గా వుంది. ఈ కథకు అలానే వుండాలి అనే రైటర్ నిర్ణయమప్పటి కంటే, అదే ఎండింగ్ ని పాఠకుడు ‘సూపర్’ అని మెచ్చుకున్నపుడు కలిగే సంతోషం మాటలకం దనంత గా వుంటుంది.
   పాఠకుల్ని రీచ్ అవ్వడమే – కథ రాయడం వెనక గల నా ముఖ్యో ద్దేశం. నా కున్న ప్రధాన ఆశయం కూడా అదే.
   మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ…
   శుభాకాంక్షలతో..
   :-)

 8. Vaadhoolasa says:

  ఔదుమ్బరాణి పుష్పాణి శ్వేత వర్ణంచ వాయసం
  మత్స్యపాదం జలే పశ్యేన్ననారీ హృదయ స్థితిం అన్నట్లు
  మనుషులు స్వతహాగా కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు.తమకు అనుకూలమైన కొన్ని కట్టుబాట్లను సమాజం నుండి అలవరచుకుంటారు ఆడవాళ్లు కానీ మొగ వాళ్లు కానీ. కథ లో కొన్ని సున్నితమైన విషయాలు చాలా చక్కగా చర్చించారు.ఈ పోస్ట్ మోడరన్ సమాజానికి తగిన కథ. వృద్ధులైన తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాల సంస్కృతి లాగానే మనసులు కలువని దంపతులు విడిపోయి
  ఐచ్చిక సహజీవన సంస్కృతీ అనివార్యమే అనిపిస్తుంది.ఈ కథనే పుల్లింగంలో కూడా రాయండి.ఏది ఏమైనా చాలాకాలం తరువాత తనను చదివించుకున్న కథ.అభినందనలు.

 9. Vaadhoolasa says:

  అన్నట్లు రెండొ లైన్ చివర తొలగించండి.

  • ఆర్.దమయంతి. says:

   – “చాలాకాలం తరువాత తనను చదివించుకున్న కథ.”

   * నిజమాండీ? అలా అనిపించిందంటే తప్పకుండా కథని మనసుపెట్టి చదివి వుండాలి. లేదా, మనసుని గుంజుకున్న కథైనా అయి వుండాలి.
   ఎక్కువ శాతం స్త్రీల వ్యధలన్నీ అంతే. అంతు తెలీని సుడి గుండాలు.

   – అన్నట్లు రెండొ లైన్ చివర తొలగించ మన్నారు? ఎందుకు, ఏమిటీ వివరం గా చెబుతారా?
   కథ పై మీ కామెంట్ బావుంది.
   ధన్యవాదాలు.

 10. G.S.Lakshmi says:

  మనసు లోపలి పొరలను ఆవిష్కరించిన కథ. చాలా బాగుంది దమయంతీ..

  • ఆర్.దమయంతి. says:

   అక్కా!
   ధన్యవాదాలు.
   నమస్సులతో..
   మీ
   చెల్లెలు.
   :-)

 11. Krishna Veni Chari says:

  అద్భుతమైన నెరేటివ్‍ దమయంతిగారూ.
  నేను ఈ మధ్య గమనిస్తున్న ప్రకారం, ఈ సహజీవన బంధాల్లోనుంచి తప్పుకుపోయేది మగవాళ్ళు మాత్రమే కాదు. అనేకనేక కారణాలవల్ల ఆడవాళ్ళూ తమంతట తామే బయటపడాలనుకుంటున్నారు.

  • ఆర్.దమయంతి. says:

   1. ‘ – అనేకనేక కారణాలవల్ల ఆడవాళ్ళూ తమంతట తామే బయటపడాలనుకుంటున్నారు.’

   * మీ అభిప్రాయం లో నిజముంది కృష్ణవేణి గారు. అటు వివాహంలోనూ ఇటు సహజీవనం లోనూ రెండిట్లోనూ స్త్రీలు నలిగిపోతున్న మాట వాస్తవం.
   నాతి చరామి అంటే ‘నాతిని చెర పట్టడం ‘ అని అనుకుంటున్నారేమో కొందరు పురుషులు! :-)

   చివరికి పరిస్థితి ఎటు తేలుతోందంటే – ‘అరిటాకు – ముల్లు’ దగ్గరే అన్ని కథలొచ్చి ఆగిపోతున్నాయేమో అని అనిపిస్తోంది. కదూ?

   2. ” – అద్భుతమైన నెరేటివ్‍ దమయంతిగారూ.”

   * అలా – మీరనంగానే నేనిలా అయిపోతుంటా.. :-)
   చాలా చాలా థాంక్సండి . మిమ్మల్నిలా కలిసి మాట్లాడుతున్నందుకు ఆనందంగా వుంది.
   మీకు నా హార్దికాభినందనలతో..

 12. దమయంతీ !! చదివాను మీ కథ
  చాలా నచ్చింది ..ఇంకా ఇలాంటి కథలు ఎన్నో రావాలి. ఎంత మందో తమ మనసులో ఉన్నది బయటకి వెళ్ళ కక్క లేక , ఇంక ఈ జన్మ కింతే , మన పిల్లల కోసమైనా ఈ సంసారం హింస భరించాలని ఉంటున్నారు ,అది తెలియని భర్తలు అంతా తమ ప్రతాపం అనుకుని విర్ర వీగుతూ ఉంటారు .. అతకని మనసుల – శరీరాల వివాహం నుంచి బయట పడినా ,ఏదో రూపం లో మగ వారే మళ్ళీ జీవన సహచరులై అదే పాత్ర పోషిస్తున్నట్టు కనిపించి ,వివాహం సంకెళ్ళు వీడి ,సహజీవనం సంకెళ్ళు ధరించామా ? అన్న ఆలోచనలో పడుతున్న మహిళలని చూస్తున్నాం ..అలాంటి వారు ఎలా స్పందిస్తారో , లేదా స్పందించాలో తెలియచెప్పే కథ ..కథనం ..
  మీదైన శైలి లో చక్కగా చెప్పారు .కథ .

  వసంత లక్ష్మి .

  • ఆర్.దమయంతి. says:

   “మన పిల్లల కోసమైనా ఈ సంసారం హింస భరించాలని ఉంటున్నారు ,అది తెలియని భర్తలు అంతా తమ ప్రతాపం అనుకుని విర్ర వీగుతూ ఉంటారు ..”
   * ఈ మాట చాలా వరకు నిజం వసంత. చాలా ఎక్కువ శాతం మంది ఇల్లాళ్ళ నోటి నించి ఇదే మాట వింటుంటాం.
   కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

 13. చందు తులసి says:

  మీ కథ బాగుంది దమయంతి గారూ…
  ముఖ్యంగా మీ కథల్లో నేరేషన్ బావుంటుంది. థాంక్యూ.

  • చందు తులసి says:

   అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మేడమ్… మీ అమ్ములు కథ తర్వాత సారంగలో ఇదే అనుకుంటా మీ కథ రావడం..
   కొంచెం ఎక్కువ రాయండి మేడమ్ గారూ..

   • ఆర్.దమయంతి. says:

    – “కొంచెం ఎక్కువ రాయండి మేడమ్ గారూ..”

    * మీ అభిమానానికి ధన్యవాదాలు చందు తులసి గారు. సారంగలో పబ్లిష్ అయిన ముందు కథ ని గుర్తు పెట్టుకుని మెన్షన్ చేసారంటే నాకెంతో గర్వం గా వుంది – ఎంత గొప్ప జ్ఞాపకం మీకని.
    తప్పకుండా మంచి రచనలు అందించే ప్రయత్నం చేస్తానండి.
    శుభాభినందనలతో…

 14. Jayashree Naidu says:

  డియర్ దమయంతీ…. కథ లోని ప్రతి వాక్యం వెనుక ఒక రచయితగా క్లుప్తత కోసం నువ్వు పడిన శ్రమ కనిపిస్తోంది. ఎపుదూ నువ్వు రాసే ధోరణికి భిన్నం గా వున్నా, శైలి సుకుమారంగానే ఘర్షణని అక్షరాల్లో బంధించింది. మానసికంగా మనుషులెంత అస్థిరమో బంధాలూ అంతే. అది వివాహ వ్యవస్థ విషయమైనా, లివిన్ రిలేషన్ షిప్ విషయమైనా. ముగింపు లోని అసంపూర్ణతే కథకి సరైన సంపూర్ణతని ఇచ్చింది.

  • ఆర్.దమయంతి. says:

   “ముగింపు లోని అసంపూర్ణతే కథకి సరైన సంపూర్ణతని ఇచ్చింది.”

   * నాకున్న అతి కొద్ది మంది స్నేహితుల్లో – మేధావి వర్గానికి చెందిన వారిలో నువ్వూ ఒకరని ఎప్పుడో అనుకుంటూ వుంటాను జయ్. నీ మాటల్లో చమక్ మనే చ ని చమత్కారం వుంటుంది. నిజవూ వుంటుంది. జిగీ వుంటుంది. నీ వ్యాఖ్య లోని ఈ వాక్యం నన్నాకట్టుకుంది సుమీ!
   థాంక్యూ.
   :-)

 15. Sivalakshmi says:

  ఒకరోజు నా స్నేహితురాలు గులాబీ నేనూ కలిసి సిటీ బస్ లో ఆఫీస్ కెళ్తున్నాము.ఇంట్లో పరుగులెత్తుతూ పని చేసి అలిసిపోయి ఉన్నాం.5 నిమిషాల ఆలస్యానికి ముందు రోజు బాస్ తో పడిన చివాట్ల గురించి ఆలోచిస్తూ, ఇవాళ కూడా బస్ ఆలస్యంగా నడుస్తున్నందుకు మనసులో టెన్షన్ పడుతున్నాను.పక్కన కూర్చున్న గులాబీ మావారు అసలు ఏవిషయం లోనూ సహకరించని చెప్తూ, చేసిన ప్రతి పనికీ వంకలు పెడుతూ విసిగిస్తారనే సంగతిని “వారూ,వీరూ,వారంతే” అనుకుంటూ అతి భక్తిగా భర్తను సంబోదిస్తూ ఆయన గురించి ఫిర్యాదులు చేస్తుంది.”ఏయ్,ఆపు, నీ సోది, అంత వినయం అవసరమా? చిరాకుగా ఉంది, నీ మాటలు వింటుంటే” అన్నాన్నేను.వెంటనే ఠక్కున స్వరం మార్చి “అవునే,సచ్చినోడు,తెగ వేధించి చంపుకు తింటున్నాడు ” అని అన్నది.
  బయటి ప్రపంచంలో పుణ్య పురుషులు గా చెలామణీ అయ్యే భర్తల గురించి తిట్టడానికి సంకోచపడతారు స్త్రీలు.
  గొప్ప భర్తల విశ్వరూపాలు వారి భార్యలకు మాత్రమే తెలుస్తాయి.
  ఒకసారి వార్త దిన పత్రిక వాళ్ళు ఎవరు రాశారో వారి పేరు,చిరునామాలను గోప్యంగా ఉంచుతామని తమ భర్తలలో నచ్చని గుణాలను “శ్రీవారూ, ఎందుకిలా మీరు?” అనే శీర్షికకు రాయమన్నారు. తమ అయిష్టాన్ని వ్యక్తపరుస్తూ మాములు గృహిణులందరూ ప్రతిభావంతులైన రచయితల్లాగా నాలుగైదు వాక్యాల్లో తమ భర్తల విపరీత ధోరణుల గురించి తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఎంత అద్భుతంగా రాశారో చెప్పలేను.
  దాదాపు రెండు సంవత్సరాల పాటు నడిచిన ఆ శీర్షిక అంటే అప్పట్లో మా స్నేహితులందరికీ చాలా ఇష్టం.
  లోపల మధన పడుతూ,బయటికి చెప్పలేకపోతున్న స్త్రీలందరూ మీ కథ చదివి ఆలోచిస్తారు.ఆలోచన రాజుకుంటే ఆచరణ మొదలవుతుంది!
  దమయంతి గారూ,మీ కథనం ద్వారా నాకీ విషయాలన్నీ గుర్తు చేసి ఆనందింపజేశారు. బోలెడు ధన్యవాదాలు!

  • ఆర్.దమయంతి. says:

   ” – లోపల మధన పడుతూ,బయటికి చెప్పలేకపోతున్న స్త్రీలందరూ మీ కథ చదివి ఆలోచిస్తారు.
   ఆలోచన రాజుకుంటే ఆచరణ మొదలవుతుంది!”

   * శివ లక్ష్మి గారు, మీ స్నేహితురాలి సంభాషణ చాలా చక్కగా వివరించారు. కళ్ళక్కట్టినట్టుంది ఆ సన్నివేశమంతా!…ప్రపంచ వ్యాప్తం గా స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదన్న మాట మాత్రం వాస్తవం. మీరన్నట్టు మనకు తెలుస్తున్న వ్యధలు కేవలం కొన్ని మాత్రమే. ఇప్పుడిప్పుడే అతివలు పెదవి విప్పి మాట్లాడటం నేరుస్తున్నారు.
   కథ నచ్చినందుకు, మీ విలువైన అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు ధన్యవాదాలండి.

 16. S V R Jogarao says:

  శ్రీమతి దమయంతి గారికి,
  నమస్కారములు..
  మీ కథ ” అరె ! ” చదివాను.
  ఎప్పటి లా, మీ ఈ కథలో కూడా , భావనా స్రవంతికి పెద్ద పీట వేసేరు.
  కథనము మీ కథలలో విశేషత.
  ముఖ్యమైనవి పాత్రలు ఆమని, ఆమని అక్కల సంభాషణల ద్వారా పురుషాహంకారమును, ఆమని సహజీవన భాగస్వామి ( అనవచ్చునా ? ) ద్వారా అవకాశవాదమును ప్రకటించిన తీరు బాగున్నది.
  ఐతే,
  నా దృష్టిలో రెండు చోట్ల సవరణలు అవసరమేమో?
  మనకి బదులు మంకి అని చదివేను. బహుశః అది ముద్రణా దోషమేమో?
  మరొక చోట అశ్లీలమునకు బదులు తిట్లు అనే పదము ఉపయోగిస్తే బాగుండేదేమో!
  జోగారావు.

  • ఆర్.దమయంతి. says:

   చక్కని విశ్లేషణనంద చేసారు జోగారావు గారు!
   మీ సూచనలు అన్నీ నాకు నచ్చాయి. ఎంత జాగ్రత్త గా చూసినా ప్రూఫ్ రీడింగ్ లో తప్పులుంటున్నాయి. ఇందుకు పూర్తిగా నేనే బాధ్యురాలని అని ఒప్పుకోడానికి చాలా సంతోషం గా వుంది. :-)
   కథా కథనం నచ్చిందన్న మీ కాంప్లిమెంట్ కి నా ధన్యవాదాలండి.
   శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ..
   నమస్సులతో..

 17. అరె కధ ఇప్పుడే చదివాను .కేవలం ఒక కధలా కాక మనసుని ఒక ఎండ్రకాయలా గట్టిగా పట్టేసింది .చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను .ఒక హృదయం లేని భర్తతో జీవితాన్ని సరి పెట్టుకోలేని స్త్రీ అతని నుండి విడిపోవడం సమంజసమే .క్షణ క్షణం నరకాన్ని చూస్తూ జీవితమంతా దుఃఖ మయం చేసుకోమని ఈ నాటి సమాజం చెప్పక పోవచ్చు .కానీ ఆ మరో వ్యక్తి స్థిరంగా వుండి ఆమెను ఆదరించగల డా! ఆమె చివరగా అడిగిన మాటలు చదువుకోవడానికి బాగున్నాయి కానీ లోపల ప్రేమని ఆశించే స్త్రీ హృదయం గాయపడదంటారా .మరోసారి కోలుకోవడం ఎంత కష్టం !సున్నితమైన స్త్రీలకి ఈ సమస్య ఎదురయినప్పుడు క్రుంగి పోక ఆర్ధికంగా నిలదొక్కు కోవడం ముందుగా కావాల్సింది . మంచి కధనే ఎత్తుకున్నారు .కధనం కూడా బాగుంది .కలంలో కసి కనిపించింది . నాదొక్కటే వేదన !మళ్ళీ మరో మగవాడి చేతికి ఆట వస్తువుగా చిక్కి బలికావడానికేనా స్త్రీ జన్మ! మీనుండి మరిన్ని మంచి రచనలు రావాలని …కోరుకుంటున్నాను

  • ఆర్.దమయంతి. says:

   – “మళ్ళీ మరో మగవాడి చేతికి ఆట వస్తువుగా చిక్కి బలికావడానికేనా స్త్రీ జన్మ?”

   * మంచి ప్రశ్న వేశారు శారద గారు. ఎన్ని సార్లు మోసపోయినా స్త్రీ మళ్ళీ అదే మాయలో పడటం.. బలమైన బలహీనత కావచ్చు. తను గాఢం గా నమ్మినప్పుడు – ‘ఇతను అందరిలా కాదు. ప్రత్యేకం.’ అనే గట్టి నమ్మకం వల్ల ఇలా మోసపోవడం జరుగుతోందని నేననుకుంటున్నా. ఏదేని పదార్ధం తింటే నే రుచి తెలుస్తుంది. ఎలాటి వాడన్నది – కట్టుకున్నాకే తెలుస్తుంది.
   ఒక తోడు కోసం స్త్రీ పడుతున్న యాతన ఇదంతా. కానీ, చివరి దశలో నిజం గా తోడై నిలుస్తారా అనేది పెద్ద ప్రశ్నే.

   ముఖ్యం గా మీ వంటి ప్రముఖ సీనియర్ మోస్ట్ రచయిత్రి నించి ప్రశంసల నందుకోవడం నాకెంతో ఆనందం గా వుంది.
   ధన్యదాలు.

 18. ఆర్.దమయంతి. says:

  ఈ కథపై మరి కొందరి అమూల్యమైన అభిప్రాయాలను మీరిక్కడ చదివి తెలుసుకోవచ్చును.
  https://www.facebook.com/photo.php?fbid=494906770717078&set=a.215983085276116.1073741826.100005932773825&type=3&theater&notif_t=like_tagged&notif_id=1465793537050677

 19. ఆర్.దమయంతి. says:

  కృతజ్ఞతలు:

  ఈ కథని పబ్లిష్ చేసిన సంపాదకులు శ్రీ అఫ్సర్, కల్పన గారికి నా ధన్యవాదాలు.
  ఆలానే – కథకి చక్కని చిత్రాన్ని అందచేసిన శ్రీ రాజశేఖర్ గారికి నా థాంక్స్.
  నా కథ చదివి మెచ్చుకోవడమే కాకుండా, తన వాల్ మీద కెక్కించి, దానికొక సెన్సేషనల్ రైటప్ ఇచ్చి, అందులో ఒక ఫోటో అతికించి, నన్ను తన మిత్రులకి పరిచయం చేసి, కథపై చక్కని చర్చని సాగించిన సోదరి – శ్రీమతి సంధ్య గొల్లమూడి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలతో బాటు ప్రత్యేక శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను.
  తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చిన – గౌరవనీయ పాఠకులు, పెద్దలు, నా స్నేహితులు అందరకీ పేరు పేరున – నా వందనాలు తెలియచేసుకుంటున్నాను.
  శుభాకాంక్షలతో..
  మీ
  దమయంతి.

 20. Let us look into the other side of the coin. In-spite of male supremacy and woman oppression there are two more important factors that make the couple co-exist under one roof with reasonable harmony. One is an indomitable biological need that is called sex. Sexual urge tend to make the couple slaves to each other and throw away all other complaints to the wind. Second factor, is also an indomitable biological expression, is children. These two factors are missing in the story. Unless, you take these factors into consideration the story inconclusive. What ultimately I am suggesting is,that co-existence of a couple in a reasonable harmonious environment, under a tag of marriage, not only a societal function but also a biological function.

 21. దేవరకొండ says:

  రమణ గారు, అందుకే కావచ్చు ఆ టైటిల్!

 22. lakshmi says:

  వివాహ వ్యవస్థ మరియు సంసారాన్ని గురించిన ఒక స్త్రీ ఆలోచనా సరళిని, ఆమె మథనాన్ని ,బాగా వ్యక్తపరిచారు . వ్రాసిన మీకు నా అభినందనలు

 23. చాలా ప్రశ్నలు రేకెత్తించిన ఆలోచనాత్మక కధ…సుపర్బ్ ఎండింగ్…అమ్మా

 24. SRINIVAS SATHIRAJU says:

  నేను అమెరికాలో గత 19 సంవత్సరాలుగా ఉంటున్నా. నేను 2005 లో మా చుట్టాల అమ్మాయి పెళ్లి అవుతుంటే రాలేక పోయా..మూడో రోజు శుభాకాంక్షలు చెపుదామని ఫోను చేస్తే ఆ అమ్మాయి మొగుడిని వదిలిసి పుట్టింటికి వచ్చి విడాకులకు దరఖాస్తు చేసుకుందని నివ్వెర పోయాను. నువ్వెంటి బాబు మేము హైదరాబాదు నుంచి మధ్యలో పనులు చూసుకుని ఇంటికి వచ్చినంత సేపు కూడా నిలబడ లేదు పెళ్లి మరి ముహూర్త బలం అని సాగదీశారు. కారణం ఏమిటి అన్నా..అత్తగారు మరుసటి రోజు పొద్దుట ఇంటికి వెళ్ళగానే వచ్చిన బంధువులకి కాస్త కాఫీ కలుపమ్మా అలసి పోయాను అందిట. పిల్లకి కోపం వచ్చింది పెళ్లి అయ్యి 24 గంటలు కూడా కాలేదు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ఎలా ఉంటుందో అని ముందు చూపుతో వచ్చేసింది. బాంకు ఆఫీసరు పిల్ల మరి కాఫీలు టీలు పెడుతుందా..కనీసం 2 రోజులు వంటమనిషిని పెట్టుకోడానికి గతి లేని వాడితోనా కాపురం అందిట. ఆలోచన ప్రకరాం పిల్ల ముందు చూపు చాలా బావుంది అనిపించింది నాకు. ఇది జరిగిన 11 సంవత్సరాలకి ఇంకా ఎప్పుడో 1980 వ దశకం కధలు చదువుతున్నానా అనే ఆలోచన మెదిలింది ఈ కధ చదివాక..చెప్పడం మరిచా ఆమె ఇంకో పెళ్లి చేసుకుని 2 ఇద్దరు పిల్లలతో నోములు వ్రతాలు నోచుకుంటూ హాయిగా ఉంది ఈ మధ్యనే ఏజి ఎం అయ్యింది ఎస్ బి హెచ్ లో …తరాలు మారినప్పుడు కథకుల ఆలోచనా ధోరణి ఇంకా మారక పోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు.. ఇలాంటి భాధా తప్త హృదయాలు ఇంకా ఉండటం శోచనీయం. ఎవరి జీవితం వారిది కుటుంబ విలువలు చాలా వేంగంగా మారిపోయిన ఈ తరం పిల్లలకి ఇలాంటి కధలు ఎందుకు పనికి రావు. ఓ తరం వారికి వారు ఇప్పుడు మారారు. అమరావతి నుంచి ఒకపరిచయస్తురాలు వాళ్ళ ఆయన తాగుబోతు అని బాధ పడింది..నేను కూడా బాధ పది నాకు నువ్వు నచ్చావు వచ్చెయ్యి ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నా. హాయిగా నువ్వు కోరుకున్న స్వేచ్ఛా జీవనం ఈ దేశంలో నీకు దొరుకుతుంది వచ్చెయ్యి అని బ్రతిమిలాడా. కానీ రాను పో మా ఆయన ఆత్మ హత్య చేసుకుంటాడు నేను వదిలేస్తే అంది. అని నాతో పరిచయం మానేసి ఇంకోకరితో పరిచయం పెంచుకుంది ఎందుకలా అనడిగితే…నువ్వు మూర్ఖుడివి నన్ను పెళ్లి పేరిట నీ ఒక్కడికే సొంతం చేసుకుందామనుకుంటున్నావు..నేను కోరుకున్న స్వేచ్ఛ నాకు ఉంది నీకే లేదు నేను ముఖ చిత్ర పుస్తకంలో అందరికి ప్రేమ పంచుతా చలం రాజేశ్వరి లాంటి దాన్ని అని నన్ను వెక్కిరించింది. నేను చెప్పినవన్నీ అక్షర సత్యాలు. కాబట్టి మీ కధనం తిరోగమన వాదంగా నేను భావిస్తున్నా..మీరు చెప్పిన పరిస్థితులు ఎక్కడా కూడా ఇప్పటి కాలంలో లేవని మహా ఉంటే పల్లెటూరి వాతావరణంలో ఉంటాయేమో అనిపిస్తోంది. క్షమించండి నాకు మీకు ఇవ్వన్నీ చెప్పాలనిపించింది. అంతులేనికదా ఇది కధ కాదు సినిమారోజులు కలియుగ సీత గుప్పెడు మనసు సినిమా ల తరువాత మారిపోయాయి. బొమ్మరిల్లు లాంటి సినిమాలు మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు లాంటి అద్భుత కధనాలు వచ్చాక.. ఇంకా ఇలాంటి గుండెలు పిండే శాడిస్టు కధలు ఎవరు తట్టుకోలేరు. మగ వారిని అంత దారుణంగా చూపించకండి కుంచెం మంచితనం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాలాటి స్వార్ధ పరులు ఎక్కువ శాతం ఉన్నా.. ఒక్క సారి ఆలోచించండి..ఆలోచనా ధోరణి మార్చండి.. ఇంతే మీలాంటి రచయిత్రుల నుంచి మగ వాడిగా కాదు ఒక పాఠకునిగా.

Leave a Reply to udayarani Cancel reply

*