మిత్రస్పర్శ

తేలిక కాదు –  ఎద లోపలి ఎదను స్పృశించటం … ఆ సుకుమారమైన చోట్లను ఈ కథ తాకటమే కాదు , నెమ్మదినీ ఇస్తుంది.  బహుశా అందుకనే – ఫ్రెంచ్ లో తీసిన Intouchables సినిమా , సబ్ టైటిల్స్ తో 32 దేశాలలో విజయవంతమైంది.

‘ ఇచ్చుట లో ఉన్న హాయి ‘ ని పల్లకీ ఎక్కించినందువలన. మొట్టమొదట కొడవటిగంటి (కొ.కు.) చెబితే తెలిసొచ్చింది – ఇంకొకరికి సహాయం చేయాలనిపించటమూ ఒక instinct వంటిదేనని. అడ్డం పడకండి-  మన కడుపు ఎంతోకొంత  నిండాకనే, పోనీ.

ఏముంది ఇందులో ? చాలా  predictable కథ. చాలా సంపన్నుడైన పరాధీనుడు ఒకరు, తన పైన తనకు అదుపు లేని బీద మనిషి ఒకరు.   ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆప్తులవుతారు.

అవునవును, స్నేహం సమానుల మధ్యనే ఉంటుందని అంటారు నిజమే , కాని అవసరార్థం మొదలైన సంబంధాలు కూడా ఎత్తుకి ఎదగటమూ జరుగుతుంటుంది. చమత్కారం ఇది – ఈ కథ ఇంచుమించుగా ఇలాగే నిజంగా జరిగింది.

వాస్తవాధీనమైనంత మాత్రాన ఒక కళారూపానికి విలువ హెచ్చదని నా నమ్మకం – అలా చూస్తే ఇది యాదృచ్ఛికమంతే.   మంచం లో పడిఉండి, నిరంతరమూ సేవలు చేసేవారిని చీదరించుకోగలవారు లేరా ? ఉన్నారు, నా కళ్ళతో చూసి ఉన్నాను.  ఇక్కడొస్తుంది – వ్యక్తిగతమైన ఔన్నత్యాల ప్రాముఖ్యం

జాలి పడే సేవకుడు నాకు వొద్దని డబ్బుగలాయన Philippe కి పంతం. బీదవాడు Driss కి జాలీ గీలీ ఏం ఉండవు –  నీ కాళ్ళూ చేతులూ పనిచెయ్యవు గదూ  అని చిన్న పిల్లాడిలాగా వేళాకోళం చేస్తాడు, వేడి వేడి నీళ్ళు పోస్తే నీకు కాలదు గదా అని ఆడుకుంటుంటాడు. అదొక అపచారం అనిపించదు, మనకీ నవ్వొచ్చేస్తుంది.

Ludovico Einaudi సంగీతం – ఊరట, విడుదల. ఒక్కడే సింగపూర్ నాన్ యాంగ్ లో చదువుకుంటూ మా అబ్బాయి ఈ సినిమా చూసి ఆ దివ్య ధ్వనులలో  తల్లకిందులుగా మునిగిపోయాడు. ఒక సినిమా నేపథ్యసంగీతం లోంచి ఆ విద్వాంసుడిని కనుగొనటం దృశ్య మాధ్యమానికి గొప్ప గౌరవం. Ludovico పద్ధతిని alternate classical  లేదా classical crossover అని అంటుంటారు.  కదా, శాస్త్రీయమైనదాన్ని కాస్త అటూ ఇటూ మార్చుకుంటే జీవనం లో అన్నన్ని సందర్భాలకూ పాడుకోగల వీలు. అలా అని , తక్షణ ఉత్సాహాన్ని తెచ్చి పెట్టగల సంగీతాన్ని ఇందులో మెచ్చుకోకపోయింది లేదు. ఒకానొక ఉత్సవం లో Driss  అందరినీ ఆ లయకి నాట్యం చేయించేస్తాడు.

intouchables

Break the rules, Out of box thinking  అని రెండు స్థాయిల అరాచకపు ధోరణులున్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులకి గరళం వాడేవారు గుర్తుందా – అలాగ, అంతకన్న చెడేదేమీ లేనప్పుడు -ఏం చేస్తేనేం ? ఆ సమర్థనే తోచకపోతే ఆ మితిమీరిన వాహనవేగాన్ని చూసి ఊరుకోబుద్ధి అవునా ! అయితే – కేవలమొక ఉద్వేగపు చెల్లింపు కోసం తలపెట్టుకునే paragliding, car racing లాంటి ప్రాణాంతక క్రీడ లని  మాత్రం నేను శాపనార్థాలు పెట్టుకుంటాను.

ధనికుడు తెల్లవాడూ సేవకుడు నల్లవాడూ అయారని అమెరికా లో దీనికి రేసిస్ట్ ముద్ర వేసి కొందరు అభిశంసించారు. ఏదీ కాని మనలాంటి వారికి వాళ్ళు ఇదీ అదీ వీళ్ళు అదీ  అయినా పట్టింపు ఉండదు- న్యాయంగా హక్కులు కొని తెలుగు లో తీసిన ‘ ఊపిరి ‘ కి ఆ దోషం పట్టనూ లేదు.

పునర్నిర్మాణం లో – రెండు యుగళ గీతాల జోడింపు తప్పించి రసాభాస ఏమీ జరగలేదు . చాలా సంతోషం.

” ఆ తిండి తినీ తినీ నోరు చవి చచ్చిపోయింది. కొంచెం చారు చేసి పెడతావా ” అని  తెలుగు రుచిని  తెచ్చి నింపారు.

నిజం చెప్పాలంటే , తెలుగు [ తమిళం లో కూడా ఒకేసారి తీశారు ] లో కొన్ని సంఘటన లు ఇంకా ఎక్కువ నిండుగా ఉన్నాయి – చెల్లి పెళ్ళి, తమ్ముడి రక్షణా లాంటివి , మనకి అలాగే well rounded గా  నచ్చుతాయి- తప్పేమిటట ?  డబ్బూ పరపతీ ఉన్నాయి – మనసు పుట్టి,  ఉపయోగించి  ఆదుకున్నాడు – లేకపోతే ఏమయిఉండేదీ అనటం లో ఏమీ అర్థం ఉండదు.

కార్తి ఇంత బాగా చేస్తాడని నాకు తెలీనే తెలీదు , ఊపిరి అతను నిజంగా. నాగార్జున చక్కగా తూగాడు [ ఈయన గురించి ఈ మాట అనుకోగలనని ‘ మనం ‘ చూసేదాకా ఊహించాను కాను ]

voppiri

కార్తి తమ్ముడి వేషం వేసిన అబ్బాయి ఫ్రెంచ్ సినిమా లో మెత్తగా గొప్పగా కనిపించిన పక్క ఎక్కి తొక్కుతుంటాడు , ఒక పక్కన హత్యా నేరం మీద పడి ఉండి. తెలుగు లో అది తీసేశారు. లాలాజలం తుడవటమూ  మరింకొన్ని శరీరధర్మాల ప్రసక్తీ కూడా పరిహరించబడింది తెలుగులో – మన sensibilities వేరు. కార్తి పెయింటింగ్ ని ప్రకాష్ రాజ్ చేత కొనిపించటం, దాన్ని ప్రకాష్ రాజ్ వైన వైనాలుగా కార్తి కే వివరించటం- తట్టుకోలేక ఇతను ఉన్నమాట చెప్పేయటం – తెలుగు లో ఎక్కువ ఆహ్లాదకరం గా ఉంది.

ఫ్రెంచ్ లో తమన్నా పాత్ర lesbian  . తెలుగు లో-  మరొక సందర్భం లోgay  విషయాల్లోంచి హాస్యాన్ని ఉద్దేశించారు. మా అమ్మాయి అంది – 90 ల వరకూ అక్కడా దాన్ని కామెడీ చేసేవారని. No comments.

శ్రీ శ్రీ 1960 ల్లో ‘ వెలుగునీడలు ‘ లో ఒక పాట రాసి తర్వాత నాలుక కరుచుకున్నారు . ” ఉన్నవారు లేని వారి కష్టాలను తీర్చు దారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ” అని.

ఆ అక్కరే లేని రోజులు వస్తే ఎంతో ఆనందం – ఇప్పటికింతే, తప్పులు వెతకొద్దు. ఇదంతా fantasy  అంటారా , మీ ఇష్టం!

*

మీ మాటలు

 1. సిమ్ప్లీ బ్యూటిఫుల్ ఫ్లో … Mam :) :) Tqq

 2. Venu udugula says:

  Very good writ up andi

 3. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. మీ రచనలో కూడా మిత్ర స్పర్శ అమిరింది……………………………………………………………. “”స్నేహం సమానుల మధ్యనే ఉంటుందని అంటారు నిజమే , కాని అవసరార్థం మొదలైన సంబంధాలు కూడా ఎత్తుకి ఎదగటమూ జరుగుతుంటుంది. చమత్కారం ఇది – ఈ కథ ఇంచుమించుగా ఇలాగే నిజంగా జరిగింది.
  వాస్తవాధీనమైనంత మాత్రాన ఒక కళారూపానికి విలువ హెచ్చదని నా నమ్మకం – అలా చూస్తే ఇది యాదృచ్ఛికమంతే. మంచం లో పడిఉండి, నిరంతరమూ సేవలు చేసేవారిని చీదరించుకోగలవారు లేరా ? ఉన్నారు, నా కళ్ళతో చూసి ఉన్నాను. ఇక్కడొస్తుంది – వ్యక్తిగతమైన ఔన్నత్యాల ప్రాముఖ్యం.
  నీ కాళ్ళూ చేతులూ పనిచెయ్యవు గదూ అని చిన్న పిల్లాడిలాగా వేళాకోళం చేస్తాడు, వేడి వేడి నీళ్ళు పోస్తే నీకు కాలదు గదా అని ఆడుకుంటుంటాడు. అదొక అపచారం అనిపించదు, మనకీ నవ్వొచ్చేస్తుంది.
  ఆ దివ్య ధ్వనులలో తల్లకిందులుగా మునిగిపోయాడు. ఒక సినిమా నేపథ్యసంగీతం లోంచి ఆ విద్వాంసుడిని కనుగొనటం దృశ్య మాధ్యమానికి గొప్ప గౌరవం.
  Break the rules, Out of box thinking అని రెండు స్థాయిల అరాచకపు ధోరణులున్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులకి గరళం వాడేవారు గుర్తుందా – అలాగ, అంతకన్న చెడేదేమీ లేనప్పుడు -ఏం చేస్తేనేం ? ఆ సమర్థనే తోచకపోతే ఆ మితిమీరిన వాహనవేగాన్ని చూసి ఊరుకోబుద్ధి అవునా ! అయితే – కేవలమొక ఉద్వేగపు చెల్లింపు కోసం తలపెట్టుకునే paragliding, car racing లాంటి ప్రాణాంతక క్రీడ లని మాత్రం నేను శాపనార్థాలు పెట్టుకుంటాను.

  ధనికుడు తెల్లవాడూ సేవకుడు నల్లవాడూ అయారని అమెరికా లో దీనికి రేసిస్ట్ ముద్ర వేసి కొందరు అభిశంసించారు. ఏదీ కాని మనలాంటి వారికి వాళ్ళు ఇదీ అదీ వీళ్ళు అదీ అయినా పట్టింపు ఉండదు- న్యాయంగా హక్కులు కొని తెలుగు లో తీసిన ‘ ఊపిరి ‘ కి ఆ దోషం పట్టనూ లేదు.
  లాలాజలం తుడవటమూ మరింకొన్ని శరీరధర్మాల ప్రసక్తీ కూడా పరిహరించబడింది తెలుగులో – మన sensibilities వేరు. కార్తి పెయింటింగ్ ని ప్రకాష్ రాజ్ చేత కొనిపించటం, దాన్ని ప్రకాష్ రాజ్ వైన వైనాలుగా కార్తి కే వివరించటం- తట్టుకోలేక ఇతను ఉన్నమాట చెప్పేయటం – తెలుగు లో ఎక్కువ ఆహ్లాదకరం గా ఉంది.
  ” ఆ తిండి తినీ తినీ నోరు చవి చచ్చిపోయింది. కొంచెం చారు చేసి పెడతావా ” అని తెలుగు రుచిని తెచ్చి నింపారు.

  నిజం చెప్పాలంటే , తెలుగు [ తమిళం లో కూడా ఒకేసారి తీశారు ] లో కొన్ని సంఘటన లు ఇంకా ఎక్కువ నిండుగా ఉన్నాయి – చెల్లి పెళ్ళి, తమ్ముడి రక్షణా లాంటివి , మనకి అలాగే well rounded గా నచ్చుతాయి- తప్పేమిటట ? డబ్బూ పరపతీ ఉన్నాయి – మనసు పుట్టి, ఉపయోగించి ఆదుకున్నాడు – లేకపోతే ఏమయిఉండేదీ అనటం లో ఏమీ అర్థం ఉండదు.
  కార్తి ఇంత బాగా చేస్తాడని నాకు తెలీనే తెలీదు , ఊపిరి అతను నిజంగా. నాగార్జున చక్కగా తూగాడు
  శ్రీ శ్రీ 1960 ల్లో ‘ వెలుగునీడలు ‘ లో ఒక పాట రాసి తర్వాత నాలుక కరుచుకున్నారు . ” ఉన్నవారు లేని వారి కష్టాలను తీర్చు దారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ” అని.

  ఆ అక్కరే లేని రోజులు వస్తే ఎంతో ఆనందం “”

 4. suvarchala chintalacheruvu says:

  మైథిలిగారూ!
  చాలా చాలా బాగుంది. చదివాక ఊరట. సరైన విశ్లేషణ అనేకన్నా, సరీగ్గా పట్టేసుకున్నారు కథని అనిపించింది. మరిక నాబోటివారికి ఆలోచనా విసృతిని పెంచేలా ఉండదూమరి?
  పై కామెంట్ మురళిగారిది.

  • suvarchala chintalacheruvu says:

   ఐ మీన్ ఈ కామెంట్ నాదేనండి. మురళిగారి కూడా పైన కామెంట్ చేశారు అని అన్నాను…చూసే ఉంటారు!

  • Mythili Abbaraju says:

   ధన్యవాదాలు అనేందుకు మొహమాటం….:)

 5. పరాధీనపు బతుకు బతుకుతున్న శ్రీమంతుడికీ, తెగిన గాలిపటం లాంటి బతుకీడుస్తున్న మామూలు వ్యక్తికీ ఉభయుల అవసరార్థం ఏర్పడ్డ బంధాన్ని మూలంలోకంటే తెలుగులోనే చక్కగా (మనకి నచ్చేలా కూడా) చూపించగలిగారు ‘ఊపిరి’ లో.
  ‘ఊపిరి’ సినిమాకి ఊపిరులూదిన అన్ని విషయాలను చక్కగా విశ్లేషించారు మైథిలి గారూ. అభినందనలు.

 6. Mythili Abbaraju says:

  ధన్యవాదాలండీ :)

 7. మైథిలి గారు,

  ‘అన్నే అఫ్ గ్రీన్ గబ్లేస్’ సగం లో ఆగిపాయిందా లేదా నేను మిస్ అయ్యానా తెలియడం లేదు. ప్లీజ్ క్లారిఫయ్ చేయగలరు.

 8. మైథిలి గారు,

  థంక్ యు వెరీ మచ్.. :-)

మీ మాటలు

*