వెతుకులాట

may4

 

 

చిత్రం: ప్రవీణ కొల్లి 

పదాలు: స్వేచ్ఛ

~
వెతుకులాట
మనుషుల కోసం
కొండల చివరా ..
చెట్ల పొదల్లో
చిక్కుకుపోయి
అడవి దొండ తీగలకు
వేలాడుతూ

అడివంతా సవ్వడి చేస్తున్నట్టు
గలగలా నవ్వే
పసిపిల్లలకోసం …

గుట్టలెక్కుతూ
లోయల్లోకి జారుతూ
మెరిసే
స్వచ్చమైన
నీటి బిందువుల కోసం

వెతుకుతూ ఉంటే
ఒక్కో చేయికి మరో చేయి తగిలి …
కలిసి
జతకూడి

ఆకాశం వంపిన చినుకులై
పసితనపు సంద్రంలోకి
జలజలా
ప్రయాణం.

మీ మాటలు

  1. నైస్ శ్వెచ… కీప్ అప్ ది గుడ్ వర్క్.

  2. D Subrahmanyam says:

    చాలా బాగారాసారు అభినందనలు స్వేచ్చ గారు . ముఖ్యంగా

    వెతుకుతూ ఉంటే
    ఒక్కో చేయికి మరో చేయి తగిలి …
    కలిసి
    జతకూడి

    ఆకాశం వంపిన చినుకులై
    పసితనపు సంద్రంలోకి
    జలజలా
    ప్రయాణం

  3. Bagundhandi

  4. Anil battula says:

    Good poem.keep it up

  5. శ్రీచ‌మ‌న్‌ says:

    స్వేచ్ఛా ప్ర‌యాణం ఇలాగే ఉంటుంది. ఇల‌లో క‌ల‌గా, క‌ల‌లో క‌ళ‌లా క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. బాగుంది మీ ప‌ద ప్ర‌యోగ ప్ర‌యాణం.

  6. SatyaGopi says:

    పదే పదే చదువుకోవడం, మళ్ళీ మళ్ళీ ఆ అడవిలోకి వెళ్లి ఇష్టంగా రెక్కలతో కొమ్మలపై కూర్చొని రావడం. ఎంత హాయి

Leave a Reply to D Subrahmanyam Cancel reply

*