వెన్నెల రాత్రి

 

   –  రెహానా

~
చీకటంతా ఒక్కచోటే పోగయ్యింది…
వెన్నెల రాత్రుల్లోని
ఆ వెలుగంతా ఎటు వెళ్లిందో…
ఒక దాని పై ఒకటి పేర్చుకుంటూ వెళ్లిన
నా ఆశల సౌధాలన్నీ ఎక్కడ
కుప్పకూలిపోయాయో…

నేను వెదుకుతూనే ఉన్నాను
ఆ చీకట్లో…
నా వేలి కొనలతో చూస్తూ,
తచ్చాడుతూనే ఉన్నాను..

నేను ఇష్టపడే రాత్రి- ఊసులాడే రాత్రి
నేను స్వప్నించే రాత్రి- శ్వాసించే రాత్రి
నేను నేనుగా జీవించే రాత్రి
దోసిలి నిండా తీసుకుని ముద్దాడే రాతిరి

గుమ్మానికి గుత్తులు గుత్తులుగా
వెళ్లాడే కబుర్ల జాజులు
ఎక్కడ రాలిపోయాయో

చీకట్లో వెతుకుతూనే ఉన్నాను.
నా వేలి కొనలతో చూస్తూ,
తచ్చాడుతూనే ఉన్నాను..

*

మీ మాటలు

  1. తిలక్ బొమ్మరాజు says:

    కవిత చాలా బాగుంది రెహానా గారు.

  2. బొమ్మరాజు గారు ధన్యవాదాలు…

  3. Pawan Kishor says:

    Very good poetry.. Rehana

  4. chandolu chandrasekhar says:

    చీకటి ని వెదుకుతూనే వుండండి ,వేలి కొసలకి వెలుగు రేఖ తగలక పోదు .కానీ ,చీకట్లో తచ్చాడ కండి.చీకటి మృత్యు వు కి చిహ్నం .అస్తిత్వ వాద కవులంతా చీకటి ని ప్రేమించిన వాళ్ళే .వెలుతుర్ని చూడలేరు ,ఉషోదయ కిల కిలలు వినలేరు .అంత హోమర్ కవికి వారసులే.

  5. Bhavani Phani says:

    కవిత బావుందండీ

మీ మాటలు

*