కేవలం సింపతి?!

 

– చైతన్య పింగళి

~

                రోహిత్ మీద రాసిన ఈ కథ కేవలం సింపతి ఉన్న కథ!

సాక్షి కథల పోటీలో వెంకట్‌సిద్ధారెడ్డి రాసిన ‘

’  కథ మొదటి బహుమతి గెలుచుకుంది. అందుకు అభినందనలు. ఈ కథని ఆదివారం ప్రత్యేక సంచిక కవర్‌పేజిగా కూడా వేశారు. అందుకు కూడా అభినందనలు.

రోహిత్‌వేములకి సంబంధించిన కథ అవటం వల్లా, ఆదివారం ప్రత్యేక సంచిక కవర్‌పేజిగా ఈ కథ వేయటం వల్ల,  చాలా మంది అగ్రకులస్థులతో పాటుగా ఒకరిద్దరు ఉద్యమకారులు కూడా దీన్ని గురించి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుల  వల్ల.. ఈ కథ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. కథని నడిపించిన తీరు, శైలికి చాలా ప్రశంసలే వచ్చాయి. ఒక యాక్టివిస్ట్‌గా, రచయితగానీ, వ్యాసకర్తగానీ.. ‘ఇంతకీ ఏం చెబుతున్నారు?’ అని చూస్తాను కాబట్టి–వాటి జోలికి నేను పోవటం లేదు. వ్యక్తిగా వెంకట్‌గారి మీద చేస్తున్న విమర్శ కాదు ఇది. ‘రోహిత్‌’ విషయాన్ని చాలా మంది అర్ధం చేసుకుంటున్న తీరు గురించి.. ఈ కథ నేపధ్యంలో మనం చర్చించాల్సిన అవసరం ఉంది.

రోహిత్‌వేముల కంటే ముందు, ఆ తర్వాత కూడా అగ్రకుల  ఆధిపత్యం కిందా, పెత్తనం కిందా ఎందరో దళితులు¬ దిక్కు మొక్కు లేకుండా నలిగి నాశనమయ్యారు. అవుతున్నారు. చంపబడ్డారు. దళిత వాడలు ఊచకోత కోయబడ్డాయి. ఎందరో దళిత స్త్రీలు రేప్‌కి గురికాబడ్డారు. అదే సెంట్రల్  యూనివర్సిటీ లో చాలా మంది దళితులు ఆత్మహత్య చేసుకున్నారు. మాటల్లో చెప్పలేని పైశాచిక, వికృత హింసని ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటున్నారు.

ఇవి ఏవీ కూడా- అగ్రకులాలని రోహిత్‌వేముల ఆత్మ‘హత్య’ కదిలించినంతగా కదిలించలేదు. కారణం– ఆ ఉత్తరంలో ప్రతిఫలించిన అతని మేథస్సు, అంతకంటే ముఖ్య కారణం– రోహిత్‌తన చివరి లేఖలో ఎవరీనీ తన చావుకు బాధ్యుల్ని చేయకపోవటం. విసి అప్పారావుని కానీ, దత్తాత్రేయను కానీ, స్మృతి ఇరానీని కానీ, చివరికి సుశీల్‌కుమార్‌పేరును అయినా సరే.. అతని ఉత్తరంలో రాసి ఉంటే– రోహిత్‌కి సవర్ణుల నుండి ఏమాత్రం మద్దతు వచ్చేదో మనం ఊహించగలిగేదే.

ఈ కథలో కూడా సరిగ్గా ఇదే ప్రతిధ్వనించింది. ఇందులో నాయకుడు సినిమా హీరోలా డెనిమ్‌జీన్స్,  రౌండ్‌నెక్‌టీ షర్టు వేసుకుని లైబ్రరిలోకి ఉత్సుకతతో వస్తుంటాడు. స్కాలర్‌షిప్‌డబ్బుని ఇల్లు గడపటానికి పంపిన రోహిత్‌ని రొమాంటిసైజ్  చేసి చూపించటంలో ఇబ్బంది ఉన్నా సరే, తప్పేం లేదు కాబట్టి ఏమీ అనలేం. కానీ కథ చివర్లో.. రోహిత్ చనిపోటానికి వెళ్తున్నప్పుడు.. భారతి అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది. వారి మధ్య జరిగిన సంభాషణలో.. మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఆమె అడుగుతుంది.

res

మొదటిది– ‘బర్త్ సర్టిఫికెట్‌నుండి కులం తీసేస్తే..?’ అని. ‘దాని వల్ల ఉపయోగం లేదు, మనుషుల మనసుల్లో నుండి కులం పోవాలి’ అని అతను సమాధానం ఇస్తాడు.

సర్టిఫికెట్ల నుండి కులం తీసేయటం అనేది కథలోనే కాదు.. బయట ఉన్న చాలా మంది ‘మంచి’ సవర్ణులు కుల నిర్మూలన కోసం చెప్పే ఒక చిట్కా. ‘నీకు చొక్కా ఉంది, నాకు చొక్కా లేదు కాబట్టి, మనం ఇక చొక్కా గురించి మాట్లాడుకోవద్దు’ అన్నట్టు ఉంటుంది ఈ మాట.

సర్టిఫికెట్లలో కులం ఉండేదే, కుల నిర్మూలన  దిశగా ఒక అడుగు అనే అవగాహన ఉండదు. ఈ కథలో భారతి కూడా అమాయకంగా అలాగే అడిగింది. ఆమె అలా అడగటం పట్ల నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ భారతి సోకాల్డ్  అగ్రకుల ‘భారతమాత’లా చిత్రీకరించారు కాబట్టి ఆమె అలా అడగటం సహజమే.

కానీ.. రోహిత్‌తో చెప్పించిన సమాధానం.. అసలు సమస్య. నీరు ఆవిరి అయినంత సహజంగా, మనుషుల మనసుల్లో నుండి పోయేదా కులం? దీన్ని అంగీకరిస్తే.. స్త్రీ రిజర్వేషన్లు, సమాన వేతనాలు, నియమిత పనిగంటలు.. అసలు ఒకటేంటి.. దేని గురించి ఎవరు ప్రశ్నించినా.. సరే, రోడ్డు మీదకొచ్చినా సరే.. ముందు మనుషులు  మారాలి అని ఒక తాత్విక స్టేట్‌మెంట్‌ఇస్తే సరిపోతుంది. ఈ మనషులు  మారాలి, మనసు తేటపడాలిలాంటి మాటలు.. వ్యక్తిని కార్యాచరణ నుండి దూరం చేసే మాటలు. హ్యూమన్‌డిగ్నిటి, గౌరవం లేకపోవటం.. అనే రెండు హార్డ్‌రియాలిటిస్‌కి.. ‘మనసుల్లో నుండి పోవాలి’ అనే  ఒక అభౌతికమైన సమాధానం చెప్పటం న్యాయమా? పైగా ఈ మాట అనిపిస్తోంది.. ‘బర్త్ సర్టిఫికెట్‌నుండి కులం తీసేస్తే..?’ అనే భావజలం మీద సంవత్సరాలు పొరాడిన ఒక ఫైటర్‌అయిన రోహిత్‌తో! అదే అసలు సమస్య.

‘మనస్సు నుండి కులం  పోవాలి’ అని సాధారణంగా ఎవరు అంటారు? కుల వ్యవస్థ వల్ల ప్రయోజనాలు, ఆధిపత్యాలు, అవకాశాలు పొందుతున్న అగ్రకులస్థులు అంటారు. కారంచేడులో, చుండూరులో దళితుల్ని నరికేసిన విషయం గుర్తు చేస్తే.. ‘ఈ కులం అనేదే పోవాలండి’ అంటారు. అంతకుదాటి, కార్యాచరణలోకి కానీ, ఆ విషయాల మీద పోరాడుతున్న వారికి సంఫీుభావం తెలపటంలోకానీ.. ముందుండరు. ఎందుకు? సవర్ణులకి  అంతవరకే కన్వీనియంట్‌కాబట్టి. చివరికి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న మనిషిని అడిగి చూడండి.. ‘మనుషుల మనసుల్లో నుండి కులం  పోవాలి’ అని చక్కగా ఒప్పేసుకుంటాడు. కులం  ఎలా పోవాలి? కులనిర్మూలనకి మనం చేయాల్సిన పని ఏంటి? కార్యాచరణ ఏంటి? లాంటి సీరియస్‌ప్రశ్నల  జోలికి వెళ్తే.. ఆ మనిషి ‘గాయబ్‌’. అనుమానం ఉంటే.. ‘మంచి సవర్ణుల’ మీద టెస్ట్ చేసి చూడండి.

మనుషుల మనస్సులో నుండి కులం పోవాలి అని  ఏ పాత్రతో అయినా, చెప్పిచ్చి ఉంటే.. అభ్యంతరం ఉండేది కాదు. కానీ.. ఈ  మాట  చెబుతోంది.. రోహిత్‌! కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన అవసరన్ని.. తెలిసి.. అంబేడ్కర్ పేరు మీద ఉన్న, ‘అంబేడ్కర్ యువజన సంఘం’ లో  పని చేసిన రోహిత్ అంటాడు! వెలివేత అనే అబ్సోల్యూట్  రియాలిటికి గురి అయిన, ఒక కుర్రాడు అంటూన్నాడు! పైగా మామూలు కుర్రాడు కాదు.. కులనిర్మూలనా పోరాటానికి ఇప్పుడు ఒక చిహ్నంగా మారిన కుర్రాడు అంటున్నాడు!!

ఇక భారతి అడిగిన రెండో ప్రశ్న. ‘అంబేద్కర్‌తో ఎనిహిలేషన్‌ఆఫ్‌క్యాస్ట్‌స్పీచ్‌ని మళ్ళీ ఇప్పిస్తే.. అది విని అందరూ మారిపోతే..’ అని. అప్పుడు రోహిత్‌చెప్పే సమాధానం.. ఆయన ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు అని. ఇది రోహిత్‌ సమాధానం!

కుల నిర్మూలన మీద అంబేద్కర్‌ఉపన్యాసాన్ని రద్దు చేసింది.. దానిలో ఉన్న కంటెంట్‌వల్ల. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల మూలాల్లోకి వెళ్ళి, కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించటం వల్ల. ముఖ్యంగా.. కులం  పునాదుల  మీద నిర్మాణం జరిగి, ఆ పునాదులు  లేకపోతే రూపాన్ని కోల్పోయే హిందూ మతాన్ని వదిలేస్తాను అని అంబేద్కర్  తేల్చి చెప్పటం వల్ల. ఆ ఉపన్యాసాన్ని ఇప్పుడు ఇప్పించే పరిస్థితి ఉందా అసలు. ‘దమ్ముందా?’ అని అడగటం నిజానికి సరైన ప్రశ్న. మన విద్యా పీఠాల్లో, సిలబస్‌నిర్దేశించే కమిటీల్లో.. ‘మంచి’ బ్రాహ్మణులు, ‘మంచి’ సవర్ణులు  కాక, కుల వ్యతిరేకత ఉన్న మనుషులు ఉండి ఉంటే.. అంబేద్కర్‌కి మంచి నీళ్ళివ్వని జాలి కధ బదులు.. ‘కుల నిర్మూలన’ పాఠ్యాంశం అయి ఉండేది. ‘ఇది’ కథలోని భారతికి కూడా అవగాహన లేదు కాబట్టి.. పాపం సాదా సీదాగా, ఏం కుట్రకుతంత్రం లేకుండా.. ఈ ప్రశ్న అడిగింది అనుకోవచ్చు.

ఇక్కడ మళ్ళీ సమస్య.. రోహిత్ తో  చెప్పించిన సమాధానం. ‘ఆయన ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చుండేది కాదు’. హమ్‌మ్‌. రోహిత్‌ని దగ్గరగా కాదు, అతని ఫేస్‌బుక్‌పోస్టుని చూసిన వారు కూడా.. ఇటువంటి సమాధానం అతను చెప్పడని చాలా ఈజీగా చెప్పేయగలరు. గాంధీ ఒక్కరి వల్లే స్వతంత్రం రాలేదు అని పోట్లాడే వాళ్ళలాగా.. ‘అంబేద్కర్‌ఒక్కడి వల్లే, కులం మీద అవగాహన రాలేదు. కులం ఎప్పుడు పుట్టిందో, కుల నిర్మూలన  పోరాటం కూడా అప్పటి నుండే పుట్టింది’ అనే ‘లిబరల్స్‌’ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను.

సమసమాజాన్ని సాధించటానికి శాస్త్రీయ పద్థతిలో ఒక దారిని చెప్పింది మార్క్స్‌ఒక్కరే. అలాగే  అంబేద్కర్‌కూడా ఒక్కరే. మశూచి అనే రోగం వచ్చినప్పుడే, కాల్చి వాత పెట్టటం దాని మందు.. అనే విధానం కూడా రోగ నివారణ పద్ధతిగా ఉండేది. ఆ తర్వాత తర్వాతే దానికి వ్యాక్సిన్‌ని కనుగొన్నారు. కులం ఏర్పడినప్పటి నుండే, కుల నిర్మూలనా పద్ధతులు ఉన్నాయి అనేది కూడా.. ఈ నాటు వైద్యం లాంటిదే. కులాన్ని ఒక శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేసి, ఆ రోగానికి మందు కుదర్చటానికి ఏం చేయాలో చెప్పింది.. అంబేద్కర్‌ఒక్కరే. అంబేద్కర్‌ని దేవుడిని చేసి, అయన విమర్శకు అతీతుడు  అని నేను అనటం లేదు. కుల అసమానతలు అనేవి ఎంత లోతుగా వేళ్ళూనాయో, సమాజానికి అవెంత అపాయమో.. శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది.. అంబేద్కర్‌ఒక్కరే అంటున్నాను. ఆయన ఆ పని చేయబట్టి, ‘బండి’ ఇక్కడి దాకా వచ్చింది అంటున్నాను. అంబేద్కర్‌పట్ల అయిష్టత ఉన్న సవర్ణులు, ఆయనకి ధీటుగా చాలా మందే ఉన్నారు అని గుచ్చి గుచ్చి చెబుతుంటారు. అది నిజమే కూడా. కానీ ఒక ఎలాబరేటడ్‌సమాధానంలో ఉండాల్సిన విషయాన్ని, కుదించి ఒక్క మాటలో ఆయన ఒక్కరి వల్లే కాదు అని తేల్చి చెప్పటం అభ్యంతరకరం. కథ బ్రివిటి కోసమయినంత మాత్రాన.. సిద్ధాంత విషయంలో అక్షరం తూలకూడదు.

ఇక భారతి అడిగే మూడో మాట.. వేదాలు , పురాణా ల మూలాల్లోకి వెళ్తాను అని. ‘కులనిర్మూలన’ అధ్యయనం చేసి ఉంటే, మూడో మాట వచ్చేదే కాదు. వేదాలు, పురాణాల  విషయాల్ని అంబేద్కర్‌కూలంకషంగా ‘కులనిర్మూన’లో చర్చించాడు.

చివర్లో.. ఈ కథకి ఇది ముగింపు కాదు అని భారతి, చనిపోటానికి వెళ్తున్న రోహిత్‌తో అంటే.. ‘నాది కథ కాదు, జీవితం’ అంటాడు. డెభ్భైు, ఎనభై దశకాల్లో అన్యాయానికి గురి అయిన సినిమా హీరోయిన్‌డైలాగ్‌లా ఉంది ఈ మాట.

ఒక మనిషిని.. తింటానికి తిండి, ఉంటానికి చోటు లేకుండా చేసి.. అనాగరికంగా వెలివేసి.. ఊపిరి ఆడనీయకుండా చేసి.. రక్తం అంటకుండా చేసిన హత్య ఇది. ఆత్మహత్య రూపంలో జరిగిన ఇన్‌స్టిట్యూషనల్‌మర్డర్‌అని అంతర్జాతీయంగా అందరూ మొత్తుకుంటోంది.. ఇందుకే. క్రైమ్‌ని గుర్తించాలని. కానీ.. ఈ కథలో ఆ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అన్యాయాన్ని.. ఎస్టాబ్లిష్‌చేయకుండానే.. రోహిత్‌పేలవంగా, ఏ కులానికి నొప్పి కలిగించని డైలాగులు చెప్పి ‘వెళ్ళిపోయాడు’! కానీ.. వాస్తవంలో రోహిత్‌అలా లేడు. పోరాటం చేశాడు. ఖాళీ కడుపుతో ఆ యూనివర్సిటి నేల మీద పడుకుని.. ఆకాశం చూస్తూ.. ఆ దుర్మార్గాన్ని ఎదుర్కొన్నాడు. అగ్రకుల ఆధిపత్యాన్ని కాలరు పట్టుకుని గుంజి మరీ, అడిగాడు. చివరి అస్త్రంగా, తన శరీరాన్ని వాడాడు.

రోహిత్‌బతికి ఉండి.. ఈ పోరాటాన్ని చేసుంటే.. సవర్ణుల  నుండి ఇంతటి మద్దతు వచ్చేది కాదు. ఈ కథలో కూడా మనసుల్లో నుండి కులం పోవాలి అని కాకుండా, కాస్త గట్టిగా.. కాస్తంత గట్టిగా.. ‘నువ్వు నా సమానత్వం గుర్తించటం లేదు కాబట్టి.. అనో.. నువ్వే నా హత్యకు బాధ్యుడివి అనో.. ’ ఇలాంటి ఫీలింగ్‌ఏమన్నా.. పాఠకునికి తగిలి ఉంటే.. ఈ కథని.. అచ్చొచ్చొ అని అంతమంది అగ్రకులం  వాళ్ళు నెత్తికెత్తుకునే వాళ్ళు కాదు.

కులం అనేది జలగలా ఎలా రక్తాన్ని పీలుస్తుందో తెలిస్తే చాదు.. చందమామ కథల్లో దెయ్యాల  మాదిరి ఎన్ని మారు వేషాల్లో రాగలదో.. ఎంత సోఫిస్టికేటడ్‌లెవల్స్‌లో పని చేయగలదో.. గుర్తించగలగాలి. ఈ సమస్యని గుర్తించకపోటమే పెద్ద సమస్య. కులం మీద పోరాటం ఎంత కన్వీనియంట్‌గా ఉంటే సవర్ణులు అంత ఎక్కువ గుర్తిస్తారు. ఇష్టపడతారు. ఈ కథలో అదే జరిగింది. రోహిత్ మీద కథ వచ్చిన ఆనందం లో .. రోహిత్ నోట  అగ్రకుల భావజాలన్ని చెప్పించటాన్ని.. నిర్లక్ష్యం చేయకుడదు. ఇది రోహిత్‌విషయంలో ఒక సింపతి కలిగిన కథ మాత్రమే. రోహిత్‌మీదా , అతను ఎదుర్కొన్న సవాళ్ళ మీద, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అంశాల మీదా.. ఎంపతి కాని, రెప్రజంటేషన్ కాని కలిగిన కథ కాదు. దళితులు, దళిత సాహిత్యము.. సింపతి కోరుకోటాన్ని దశాబ్దాల  క్రితమె దాటారు.  ఇప్పుడు సమానాత్వాన్ని గుర్తించమని అడగటం అనే  పరిధిని కూడా దాటి సమానాత్వాన్ని అంగీకరించమని చెప్పే  స్థాయికి  వచ్చారని సాహిత్యకారులు అర్ధం చేసుకోవాలి.

– చైతన్య పింగళి

 

 

 

*

(చిత్రాలు: అన్వర్ – సాక్షి సౌజన్యంతో)

మీ మాటలు

  1. చాలా బాగా రాసావు చైతన్య. ఈ కధ చదివినపుడు ఇంత క్లియర్ గా నేను చెప్పలేక పోయాను కానీ, ఈ కధ రోహిత్ కధ కాదు అనిపించింది. అతను చనిపోయిన మూలాలను ఏ మాత్రం తడమకుండా రాసిన కధ ఇది. ఈ కధలో రోహిత్ వెంట్రుక కూడా లేదు. రచయితకు కూడా ఆ మూలాలు తెలిసి ఉండక పోవచ్చు. నువ్వు అన్నట్లు శైలి బాగుంది. రాసిన విధానం బాగుంది.

  2. మీ విశ్లేషణ ఆలోచింపజేసింది. ధన్యవాదాలు.

  3. Mercy Margaret says:

    What you discussed is exactly true chythanya..

  4. సాయి పద్మ says:

    చాలా బాగా రాసేవు చైతన్యా..
    ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ రిజరక్షన్ కూడా వొక అగ్రకుల భావజాలం నుండే వచ్చింది.. రోహిత్ ఏ సమాధానం చెప్పి ఉండేవాడో మనకి తెలీదు కానీ.. మనసుల్లోంచి పోవాలి .. అనే వీక్ సమాధానం మాత్రం చెప్పి ఉండేవాడు కాదు.
    రెండు గ్లాసుల తత్వం కొంతవరకూ పోయినా ..రెండు కాదు పలు విధాలుగా ఆలోచిస్తుంది మనసు..

    నా వరకూ నాకు అనిపిస్తుంది, అందరికీ.. ” లిబరల్ మీటర్ ” ఉంటుంది .. మనకి నెప్పి కలగనంతవరకూ, లేదా ఒక ఎక్సాటిక్ ఇంట్రస్ట్ ఉండేంత వరకూ.. దళితులు కానీ, అసహాయిలు గానీ, ఎంత వరకూ ఎదగాలి , అన్నదాని మీద , వొక లెక్క ఉంటుంది

    అది దాటిన మేధని వోప్పుకోలేరు.. చాలా మీటర్లకి అతీతం అది.. రోహిత్ మేధ కూడా అలాంటిదే.. అర్జంట్ గా వోన్ చేసుకోవాల్సినంత .. అందుకే అతన్నో షిర్డీ సాయి బాగా లా చేస్తున్నారు..!

    ఇకపోతే, కథ ఎండింగ్ తో, నేను డిజప్పాయింట్ అయ్యాను. నాకు తెలీని, అర్ధం కాని, లేదా, వేరే ఏదన్నా సొల్యూషన్ ఉంటుందేమో అనుకున్నాను. అది రాలేదు. ఇక్కడ రచయిత నిస్సహాయాతని కూడా మనం గమనించాలి..

    నిజానికి, ఈ ప్రశ్న మనకే నైవ్ గా ఎదురైతే మనం ఏం సమాధానం చెప్తాం ..?

    కుల నిర్మూలన కి చేయాల్సినవి ఏమిటి? ఇవి చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
    ~~సాయి పద్మ

  5. మా కథలు మేమే చెప్పుకుంటామనే దళిత స్పృహలో ఒక హక్కు. దళితేతరులు దళిత పంధాతో సింపతైజ్ అవ్వడమో, ఎంపతీ తెలపడమో కూడా అంతే హక్కు. ఒక దళితేతరుడు/సవర్ణుడు రోహిత్ అంశాన్ని, ఘటనని తనదైన కోణంలోంచీ అర్థం చేసుకుని సాహిత్యం రూపంలో స్పందించడంలో దళిత కోణం ఎందుకుండాలి? ఉండాలని ఆశించడం ఎంతవరకూ సమంజసం?

    ఒక వేళ ఈ కథ దళిత పంధాను, ఆలోచనను, క్రియాశీలతను న్యూనపరిచేదిగానో లేక లోపాయకారిగా స్టేటస్-కోని అమలుచేసే సవర్ణ కుట్రగానో గుర్తిస్తే చెయ్యాల్సిన వాదన వేరే ఉంది. ఈ వ్యాసం రెంటిలో దేన్నీ ఎత్తి చూపలేకపోయింది. కథకన్నా సింపతీ ఈ వ్యాసంలో నాకు కనిపిస్తోంది. ఒక సందిగ్దమైన అసంబద్దత ప్రతిఫలిస్తూ ఉంది.

  6. THIRUPALU says:

    చాలా మంచి విశ్లేషణ. దీన్నే చాలామంది అర్ధం కాలేదు అన్నారు. ఇది రచయిత అవగాహన పరిధిని మాత్రమే సూచిస్తుంది . ఇలాంటి చర్చలు ఇంకా జరగాలసి ఉంది.
    ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం కొ.కు గారు అంటారు ” సమాజంలో జరిగే అన్యాయాలకు మనిషి ప్రవర్తనే కారణం అని ఎవరైనా అనుకుంటే అంత కంటే అమాయకులు ఎవరూ ఉండర”ని మనిషి ప్రవర్తన మారే పనియితే సమాజం ఇప్పుడు చాలా మారి ఉండాలి మరి. మనిషి ప్రవర్తన ను శాసిస్తున్న బౌతిక పరిస్థితి ల్లో మార్పు లేకుండా అతని ప్రవర్తన మారదు.

  7. ప్రసాద్ చరసాల says:

    కథ చదివినప్పుడు తెలియని వెలితేమిటో ఇప్పుడు తెలిసింది.

  8. కె.కె. రామయ్య says:

    రోహిత్‌ వేముల కధాంశం గా వెంకట్‌ సిద్ధారెడ్డి రాసిన “రెసరెక్సన్” కథపై చైతన్య గారి విశ్లేషణ ఆలోచింపజేసింది. ధన్యవాదాలు.

  9. Buchireddy gangula says:

    ఆర్థిక వత్యాసాలు ఉన్న o త కాలం
    కుల పట్టింపులు యిలాగే. వెంటాడుతాయి
    తోడుగా. చదువు అవసరం
    బ్రహ్మనిక. ఆధిపత్యాన్ని బూస్తపితం చేయాలి
    ——–/———————-
    Buchi రెడ్డి గంగుల

  10. Sujatha Bedadakota says:

    కథ చదివాక పాఠకుల్లో కలిగిన ఒక అస్పష్టమైన వెలితి ని చక్కగా చిక్కులు విడదీసి వివరించిన వ్యాసం!

  11. amarendra dasari says:

    థాంక్స్ …కథ మీద నా అసంతృప్తికి అక్షర రూపం ఇచ్చారు..helped me to క్లియర్ మై మైండ్ ..మెనీ thx

  12. Aparna says:

    థాంక్స్ చైతన్య! కథ చదివాక మీ ఆవేశం నాకు అర్ధంకాలేదు. With all due respect to వెంకట్, నాకుస్టొరీ క్రాఫ్ట్ అండ్ presentation చాలా నచ్చింది. కాని రాసేటప్పుడు అలవరచుకోవలసిన అవగాహన గురించి బాగా చెప్పావు. కథలు రీడర్స్ ని కంఫర్ట్ జోన్ లోకి నేట్టకుండా చూసుకోవాలి. Venkat కథ ను Rohit మీద ఇష్టం, గౌరవం తో రాసాడు. కాని రీడర్స్ convenient గా comfort zone లోకి వోదిగిపోతారు. ఇంకో అడుగు ముందుకు వేస్తూ ఇంకా కాస్త ఎక్కువ అవగాహన తో ఇంకా మంచి కథలు రాయాలి వెంకట్ లాంటివాళ్ళు.

  13. kcube varma says:

    కథ రావడాన్ని తప్పుబట్టాలెం కాని అంతకంటే మంచిగా రావాలని కోరుకోవడం తప్పు కాదు. ఇక్కడ వెంకట్ గారు రాసిన కథ తమ వర్గానికి అనుకూలంగా కావాలని రాసినట్టు చెప్పడం అన్యాయం. ఆయన పరిథి మేరకు రాసి వుండవచ్చు. మీరెట్టి చూపిన అంశాలతో రోహిత్ పోరాట స్ఫూర్తిని ఎత్తిపట్టే కథ రావాలని కోరుకుందాం. మీ విశ్లేషణ అందుకు దోహదపడాలని ఆశిస్తున్నా.

  14. P V Vijay Kumar says:

    This is ansolitely magnificient. We need bold criticism like this in telugu literature. Already we had ” goody goody” things happening here in telugu literature. With all due respect to the story writer, Rohith is romanticosed. Rohith is viewed from a lens of urban middle class comfort. Apart from above, there are several flaws in presentation of the theme of the story too. We dont need Rohit’s stories , if they are digressing from the core focus on grotesque adninistration of ieducational institutions. We do not meed “idealism ” point of view when the problem is clearly material and concrete. Thanks to the story writer for his efforts but a wrong choice to stand first. This reminds me Arundhathi Roy’s book paraphrasing on ” Annihilation of caste “. A book , probanly with good ontebtions , fail to present real issie in complete sense but driven by commercial saleability. Generally, this is the hurried appropriation of issues .

  15. 1994 నుంచి దళిత, బహుజన సాహిత్యంలో భాగమై, ఆ వాద వివాదాలను దగ్గరి నుంచి చూస్తూ.. చర్చోపచర్చలను ఎరిగినవాడిగా నాలుగు మాటలు చెప్పాలనిపించింది…
    వెంక్‌ సిధారెడ్డి కథ స్కెల్టన్‌ బాగుంది. మంచి టెక్నిక్ ఎంచుకున్నారు. కాని కథలో ఆత్మ లేదు. ఇన్నాళ్ళు విప్లవవాదులు మాట్లాడినట్లే, అగ్రవర్ణాలు మాట్లాడినట్లే- చివర్లో రోహిత్‌తో మాట్లాడించిన మాటలు నిజంగానే అన్యాయంగా ఉన్నాయి.
    సరే, ఈ సమయంలో రోహిత్‌ మీద కథ రాసే వెసులుబాటులో బహుజనులు లేరు. వాళ్లు వాళ్ల జీవితంలో ఇలాంటివెన్నో చూసి చూసి బండబారి కొందరుంటే, రోహిత్‌ షాక్‌లోంచి, దేశంలో జరుగుతున్న ఇలాంటి విషయాలలోంచి బైట పడలేకపోతున్నవారు కొందరు. కాబట్టి ఆ అంశంపై ఒక మంచి కథ వచ్చిందనుకున్నవారే అధికం.
    బహుజనవాదం అగ్రవర్ణాలవారిని సెన్సిటైజ్‌ చేస్తూ వచ్చింది. వారు సంఘీభావంగా రాసిన రచనలను కూడా అచ్చేసింది. ‘కాస్త సిగ్గుపడదాం’ అనే పేరుతో మద్దూరి నగేష్‌బాబు, ఖాజా వేసిన సంఘీభావ కవితా సంకలనంలో హెచ్చార్కెతో సహా చాలామంది కవితలు ఉన్నాయి. అగ్రవర్ణాల వారు రాయొద్దని ఏం లేదు. కాని స్త్రీలు, దళితులు, బీసీలు, ముస్లింలు రాసిన దానికి అగ్రవర్ణాలు రాసిన దానికి తేడా ఉంటుంది. ఆ తేడాను అధిగమించేంత స్థాయికి రచన వెళితే మంచిదే కదా!
    కొంతమంది కవులు, రచయితలైన అగ్రవర్ణాల వారు రోహిత్‌ వేముల లాంటి ఇష్యూల్లో ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. కొందరిలో వ్యంగ్యం.. కొందరిలో కపటం.. కొందరిలో సగం సగం ఏకీభావం.. తాము బాగానే అర్థం చేసుకున్నామనుకొనే కొందరి కామెంట్స్లో డొల్లతనం.. ఆఫ్‌ ది రికార్డ్స్ లో కొందరి కామెంట్లయితే మరీ అన్యాయంగా ఉంటున్నాయి. చైతన్య పింగళి అగ్రవర్ణాల విషయంలో చేసిన విశ్లేషణ వీరందరూ తమను తాము చెక్‌ చేసుకోడానికి బాగా ఉపయోగపడుతుంది.
    కొన్నిసార్లు మనం కొన్ని రచనలను ముందు చదవగానే చాలా బాగుంది అనుకుంటాం. కాస్త ఆలోచిస్తే అందులోని లోపాలు తెలిసివస్తుంటాయి. మరొకరెవరైనా విశ్లేషిస్తే కూడా మరింత బాగా తెలుస్తుంది. ముందు బాగుందని అనేశాం, కామెంట్ పేట్టేశాం కాబట్టి చివరి వరకు దానినే పట్టుకొని ఉండాలని లేదు కదా.. చైతన్య విశ్లేషణ తర్వాత ఆ వాస్తవాల్ని గ్రహించి మనం మరింతగా ముందుకు వెళ్లడానికి ఈ చర్చను ఉపయోగించుకోవచ్చు. చైతన్య విశ్లేషణలోనూ కొన్నేమైనా లోపాలు ఉంటె వాటిని మరింత సూక్ష్మంగా మరెవరైనా విశ్లేషిస్తే మరింత మంచిది..
    ‘సవర్ణుల’ను ప్రశ్నించే విశ్లేషణలు ఆవేశంగా కనిపించడం ముందునుంచీ ఉంది. ఆవేశం అనో.. తీవ్రవాదం అనో కొట్టి పడేయడం సవర్ణులు మాత్రమె చేయగలరు.. ఇదే కథ ఒక దళితుడు రాసి ఉంటే దాని స్థానం ఎక్కడ ఉండేదో.. ఎక్కడ అచ్చయ్యేదో కూడా గ్రహించవచ్చు. సవర్ణులు ప్రోగ్రెసివ్‌గా ఉన్నా వారి పేరు చివరి తోకలు వారికి అవకాశాలను ఇట్టే కల్పించేస్తాయి. ఆ అవకాశాలు కల్పించే ప్రచారం అంతా ఇంతా కాదు.. ఇదంతా మనకు తెలియందేమీ కాదు.
    మొత్తంగా చైతన్య విశ్లేషణ చాలా సునిశితంగా ఉంది.. గొప్పగా కూడా ఉంది. ఒక మంచి విమర్శకురాలుగా చైతన్య ఎదిగిరావడం సంతోషం. ఆమె చేసిన మూడు ప్రశ్నల విశ్లేషణ నేటి సమాజానికి చాలా అవసరం. ఆలోచిద్దాం.. చర్చిద్దాం.. మరింత మరింతగా సెన్సిటైజ్‌ అవుదాం…
    చైతన్య విశ్లేషణలో కొన్ని వాక్యాలు మరింత గొప్పగా ఉన్నాయి… ముఖ్యంగా ”ఆయన (అంబేడ్కర్) ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు.” అనే కామెంట్ రోహిత్ చేత చెప్పించడం మరీ అన్యాయం.. ఆ విషయాన్ని బలంగా చెప్పారు చైతన్య.. ఇంకా ఈ కింది వాక్యాలు చూడండి…
    ”… ఇవి ఏవీ కూడా- అగ్రకులాలని రోహిత్‌వేముల ఆత్మ‘హత్య’ కదిలించినంతగా కదిలించలేదు. కారణం– ఆ ఉత్తరంలో ప్రతిఫలించిన అతని మేథస్సు, అంతకంటే ముఖ్య కారణం– రోహిత్‌ తన చివరి లేఖలో ఎవరీనీ తన చావుకు బాధ్యుల్ని చేయకపోవటం.”
    ”ఈ మనషులు మారాలి, మనసు తేటపడాలిలాంటి మాటలు.. వ్యక్తిని కార్యాచరణ నుండి దూరం చేసే మాటలు”
    ‘‘మనస్సు నుండి కులం పోవాలి’ అని సాధారణంగా ఎవరు అంటారు? కుల వ్యవస్థ వల్ల ప్రయోజనాలు, ఆధిపత్యాలు, అవకాశాలు పొందుతున్న అగ్రకులస్థులు అంటారు. కారంచేడులో, చుండూరులో దళితుల్ని నరికేసిన విషయం గుర్తు చేస్తే.. ‘ఈ కులం అనేదే పోవాలండి’ అంటారు. అంతకుదాటి, కార్యాచరణలోకి కానీ, ఆ విషయాల మీద పోరాడుతున్న వారికి సంఫీుభావం తెలపటంలోకానీ.. ముందుండరు. ఎందుకు? సవర్ణులకి అంతవరకే కన్వీనియంట్‌ కాబట్టి.”
    ”రోహిత్‌బతికి ఉండి.. ఈ పోరాటాన్ని చేసుంటే.. సవర్ణుల నుండి ఇంతటి మద్దతు వచ్చేది కాదు. ఈ కథలో కూడా మనసుల్లో నుండి కులం పోవాలి అని కాకుండా, కాస్త గట్టిగా.. కాస్తంత గట్టిగా.. ‘నువ్వు నా సమానత్వం గుర్తించటం లేదు కాబట్టి.. అనో.. నువ్వే నా హత్యకు బాధ్యుడివి అనో.. ’ ఇలాంటి ఫీలింగ్‌ఏమన్నా.. పాఠకునికి తగిలి ఉంటే.. ఈ కథని.. అచ్చొచ్చొ అని అంతమంది అగ్రకులం వాళ్ళు నెత్తికెత్తుకునే వాళ్ళు కాదు.”
    ”కులం మీద పోరాటం ఎంత కన్వీనియంట్‌గా ఉంటే సవర్ణులు అంత ఎక్కువ గుర్తిస్తారు. ఇష్టపడతారు.” … …

    • సాహితీ says:

      బహు జనులు ” సవర్ణులు” అనే మాట వాడకపోతే బాగుంటుంది. ఇది చాలా పాసిటివ్ అర్ధాన్ని సూచిస్తుంది. నెగిటివ్ ప్రవర్తన కలిగిన వారు (లేక దానికి సంబందించిన వారు) పాసిటివ్ గా నెత్తిన పెట్టు కోవడానికి అర్హులా ?

  16. mallikarjuna says:

    కథేమో మేధావులు ఆలోచించేలా మామూలు పాఠకుడు బుర్ర గోక్కునేల వుంది. మీ వివరణతో బుర్ర గోక్కునే పని తగ్గింది చైతన్య గారు …మీరు బాగా రాస్తారు…బాగా రాసారు.అభినందనలు.

  17. కె.కె. రామయ్య says:

    ఇదే కథను (రోహిత్ వేముల కధను) ఒక దళితుడు రాసి ఉంటే అన్న స్కైబాబా గారు … “క్రైస్తవులు లేని చర్చి” కధ రాసిన సునీల్ కుమార్ గారు కాని; “చివరి చర్మకారుడు లేడూ” కథ రాసిన చోరగుడి జాన్‌సన్ గారు కాని; “కతలగంప” కధ రాసిన స.వెం. రమేశ్ గారు కాని, “బుడ్డగిత్త రంకి” కధ రాసిన పుట్టా పెంచాల్దాసు కాని, “నామాలు కధ” రాసిన చైతన్య పింగళి గారు కాని రాసి ఉంటే అనే ఊహలు కలిగాయి.

  18. వై. కరుణాకర్ says:

    కదా శిల్ప సౌందర్య లో పడి గమనించలేకపోయిన అంశాలను ఎత్తిచూపిన చైతన్య కు ధన్యవాదాలు. అప్రమత్తం గా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

  19. Lalitha P says:

    చాలా మంచి విశ్లేషణ. పరిశీలన. “అంబేద్కర్ కి మంచినీల్లివ్వని జాలికథ బదులు కులనిర్మూలన పాఠ్యఅంశం అయివుండేది.”

  20. రోహిత్ జీవితానికి ‘అగ్రకులానికి’ చెందిన వెంకట్ సిద్ధారెడ్డి హక్కుదారుడు కాదు.
    ‘అగ్రకులానికి’ చెందిన చైతన్య పింగళి నిజమైన హక్కుదారు అని ఈ వ్యాసం ద్వారా నాకు అర్థమవుతోంది.
    ఆమె ఆగ్రహం, అవగాహన, నిర్దిష్టత చూస్తుంటే ఈ సమస్యను ఈమెకు వదిలిపెడితే బాగుండు అని కూడా అనిపిస్తోంది.
    ఒక రచయిత ఒక సమస్యను రాస్తే వాడి నెత్తిన ఇంత బరువు బండ పడేస్తున్నారు.
    విత్ డ్యూ రెస్పెక్ట్స్ అట.
    ఇంత అవగాహన ఉన్నవాళ్లు ఆ అవగాహనతో తామూ ఒక కథ రాయవచ్చు. అదే సమస్య మీద ఎన్ని కథలు వస్తే అంత మంచిది.
    ఈ కథ రాసేటప్పుడు రచయితకు తన కులం గుర్తు ఉంటుందా? కులం స్థానంలో హృదయమే ఉందని అనిపిస్తుంది ఈ కథ చదివితే పాఠకుడికి.
    రచయిత ఈ కథలో రోహిత్‌ను పునరుజ్జీవింప చేశాడు. అందుకు మొదట కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ముగింపు సరి కాదు అంటున్నాడు అందుకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఏది సరియైన ముగింపో ‘కార్యచరణ’లో ఉన్నవాళ్లు నిర్థారించి ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాలి. ఆ పని రచయితది కాదు.
    మన సమాజంలో చాలామంది చెడు చేయరు. చెడు నిరోధించరు. కాని మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. మంచి జరిగితే బాగుండు అని కోరుకుంటారు. ఈ ఆలోచనల స్థాయి ఎక్కువగా ఉండటం వల్లే నెగిటివిటీ ఈ మాత్రమైనా తగ్గి ఉంది.
    ఈ కథ కూడా అలాంటి ఒక ఆలోచన.
    ఆలోచన చేయడం కూడా పాపమే అన్నట్టు మాట్లాడటం అత్యుత్సాహ విమర్శ. రేపెవరైనా వెంకట్ సిద్ధారెడ్డి లాంటి రచయిత ఇలాంటి కథ రాయకుండా మనకెందుకులే అని ఊరుకునేలా ఉందిది.
    ఫస్ట్ పాయింట్: ఈ కథను వెంకట్ సిద్ధారెడ్డి రాశాడు.
    దానికి విమర్శ: అసలు రోహిత్ వేములే రాసుంటే ఇలా ఉండేదా?
    దానికి విమర్శ: అసలు అంబేద్కరే రాసుంటే ఇలా ఉండేదా?
    ఏమిటి ఈ లెక్క.
    ‘ఈ సమాజం నుంచి మద్యం పోతే బాగుండు’ అని ఒక ఉపరితల ఆలోచనతో వెంకట్ సిద్ధారెడ్డి ఒక కథ రాశాడని అనుకుందాం.
    విమర్శ: నీకు కల్లు గీత కార్మికుల సంగతి తెలుసా?
    విమర్శ: ఇప్పసారా కాచుకునే గిరిజనుల సంస్కృతిని గురించి నీకు తెలుసా?
    విమర్శ: తీరిక వేళ్లల్లో స్కాచ్ విస్కీ తాగుతూ మద్యాన్ని తెగ ఎంజాయ్ చేసేవాళ్లే ఇలాంటి కథలు రాస్తారు. సాయంత్రమైతే చీప్ లిక్కర్ తాగాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లిన పేదల జీవితాలను అధ్యయనం చేసి వాటి బాగు కొరకు ఆలోచించి ఆ విధంగా వారిని ముందుకు తీసుకురావడం అసలు సమస్యకాగా అందుకు భిన్నంగా దానిని దాచి పెట్టి అవగాహనా లేమితో పైపై దృష్టితో కేవలం మద్యపాన నిషేదమే దీనికి విరుగుడుగా మాట్లాడితే (ఒక స్పందనగా ‘వెంట్రుక కూడా తాకలేదు’ అని అనేసి పోతే) ఇది ఏ విధంగా….
    సారీ!

  21. చంద్రశేఖర్ ఇండ్ల says:

    వెంకట్ అన్న కథపై చైతన్య పింగళి గారు ఇచ్చిన విశ్లేషణలు చదివిన తరువాత, ఒక కథపై ఒక పాటకుడు ఎంత లోతుగా ఆలోచిస్తాడో అన్నది తలచుకుంటే చాల సంతోషం వేసింది. దానితో పాటే భయం కూడా వేసింది(నా కథ ను ఇంత లోతుగా అలోచించి రాసాన? అని(ఆలోచించాను). నేను ఆ కథ చదువుతున్నప్పుడు నాకు ఏ మాత్రం “పైన చైతన్య పింగళి గారు ప్రస్తావించిన విషయాలు” నా మైండ్ లోకి రాలేదు. కానీ ఈ విశ్లేషణ చదివిన తరువాత కథలు రాసే రచయిత ఒక పదం కథ రాయడానికి ఎంతగా రీసెర్చ్ చెయ్యాలో అర్ధం అయ్యింది. అలాగని వెంకట్ అన్న కావాలని పని కట్టుకొని రోహిత్ ని బద్నాం చెయ్యాలని రాసినట్టు నాకైతే అనిపించలేదు. ప్రతి రచయిత తను చెప్పాలనుకున్న విషయాన్ని ఖచ్చితంగా రాస్తున్నాననే నమ్మకం తోనే కథ రాయడం మొదలుపెడతాడు, అతను రాయాలనుకున్నది, రాసింది, ఒక్కటేనా? అంటే కరెక్ట్ గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి విమర్శ ఉపయోగ పడాలి అన్నది నా ఉద్దేశ్యం, అంతేగాని ఆయన కథను కచ్చితంగా ఇందుకే (?) రాసాడు అని మనమే అనుకొని దాన్ని కథకంటే ఎక్కువ అందంగా రాయడం వల్ల అసలు ఆ కథ లో ఏమిలేదు(బాలేదు) అనుకొనే అవకాసం వుంది. ఇలాంటి విశ్లేషణ కింద ఆ రచన తాలూకు రచయిత కూడా తన విశ్లేషణను రాసి విమర్శను ఆరోగ్యవంతం చేసే రోజులు ఎప్పుడు వస్తాయో?

  22. prasad says:

    we can have 360 angles to criticise a writing, does that luxury exist for a writer?
    no art form is perfect.. This applies to the original and critical.Story raised questions and the criticism raised another set. As long as it allows a 360 degree healthy debate everything is welcome.

  23. ప్రసాద్ చరసాల says:

    చాలా బాగుంది చర్చ.
    కె.కె.రామయ్య గారు, అమర్ గారు మంచి పాయింట్లు తీసుకొచ్చారు.
    కథా రచయితకు రచనా సామర్థ్యము వుంటే చాలా, లేక సామాజిక శాస్త్రవేత్త లేదా ఏ విశషం మీద కథ రాస్తూవుంటే ఆవిశషం మీద అపరిమిత అవగాహన కలిగివుండాలా?
    కలిగివున్న వారికి రచనా సామర్థ్యము వుండకపోవచ్చు, రచనా సామర్థ్యము వున్నవారికి సామాజిక సమస్యల మీద అవగాహన, సానుభూతి వుండి లోతు తెలియకపోవచ్చు.
    ఓ కథ సృజించిన సమస్యకు కథకుడు పరిష్కారము చెప్పాలని లేదు.
    చైతన్యగారికి ఖచ్చితంగా ఈ విశయం తెలుసు. చైతన్య లేవనెత్తిన పాయింట్లతో రచయిత కూడా ఏకీభవిస్తాడనే నా అనుకోలు.
    నామట్టుకు నాకు కథా, ఈ కథమీద విశ్లేషణ పరస్పర పూరకాలు. ఒకదానిలో లేనిదాన్ని మరోటి పూరిస్తోంది. రెండూ అవసరమే.
    ఇలాంటి విశ్లేషణలు కథా రచయితలని భయపెడుతున్నాయని నేననుకోను. అలాగయితే వాడివేడి వాఖ్యలు ఇలాంటి విమర్షకులనుకూడా భయపెడతాయనుకోవాలి.

  24. రోహిత్ ఆత్మ ఈ కధలో లేదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం. రచయిత సిన్సియారిటీని శంకించటం ఏమి లేదు.

  25. N. KALINGA says:

    అంబేద్కర్ ఒక్కరే–మార్క్సు ఒక్కరే. చైతన్య పింగళి గారు వీరిద్దరినీ కలిపి ఒక్కటి చెయ్యాలన్న ఆలోచననేదో ఆచరణలో పెట్టేందుకు ఉపక్రమించినట్లుంది. పరయత్నం మంచిదే కాని ఫలితం ఆశించినంతగా ఉండక పోవచ్చు. రాజ్యాదికారమే ధ్యేయంగా సాగుతున్న దళితుల సాహిత్యాన్ని ఇక ఒకరు అంగీకరించాలా? ఎవరు వారు? ఇంకెవరై ఉంటారు …marxians కాక.. ఈ ప్రశలన్నీ మొదలు ప్రశ్నించడం నేర్పిన భావజాలం పైననే కావడం ఒక వైరుధ్యం. కులం గురించి మతం గురించి జాతి గురించి పరిశోధనాత్మక సాహిత్యం ఇండియా లో బండ్ల కొద్దీ ఉంది.అంబేద్కర్ అందులో ఒకరు కావొచ్చు . ఇంకొక 1250 ఏండ్లు పోయినా కుల సిద్దాంతం ఫలితాన్ని ఇవ్వదు గాక ఇవ్వదు. ఈ విషయం రోహిత్ కూ బాగా తెలుసు. దలితులకూ తెలుసు. చైతన్య పింగళి గారికీ తెలుసు.

  26. హరిప్రసాద్ says:

    కధకంటే ముందు చైతన్యగారి చర్చ ఒక్క ఉదుటన చదివేసాను. రచయితపై కోపం వచ్చేసింది. ఎందుకిలా రాస్తారు, ఏమాత్రం అవగాహన లేకుండా, ఇంత దారుణమా అంటూ తిట్టుకున్నాను. తరువాత కధ చదివాక ఇలాంటి కధపై రచయితను అనవసరంగా తిట్టుకున్నానే అనిపించింది. పేదరికం, కులవివక్ష, అంబేద్కర్ భావజాలం, యాకూబ్ పై రోహిత్ సింపతీ, విద్యార్ధి రాజకీయాలు, వారి పోరాటాల్లో రాజకీయ పార్టీలు అత్యుత్సాహం వంటి విషయాల జోలికి పెద్దగా వెళ్లకుండా చాలా సాదా సీదాగా రాసిన కధ. రచయితకు రోహిత్ పై సింపతీ, అగ్రకుల భావజాలంతో కధ నడిపారా అనే అంశాలకంటే కధల పోటీ నియమాలను దృష్టిలో ఉంచుకుని ఏదోఒక సామాజిక అంశాన్ని తీసుకుని తీర్చిదిద్దుకున్నట్టు నాకనిపించింది. బహుమతి వచ్చిందనో, అగ్రకులస్తులో, ఉద్యమకారులో మాట్లాడుకున్నారనో, కవర్ పేజీగా కధ వేసారనో ఆ కధ పాఠకులను ప్రభావితం చేయలేదు. చెప్పడంలో నిజాయితీ ఉంటే పదికాలాలు ఉంటుంది, లేదంటే మరుక్షణమే పక్కనపడేస్తారు.

  27. కథ నాకు నచ్చింది. విమర్శ అతిగా అనిపిస్తోంది
    కథ నాకు నచ్చటానికి కారణాలు

    ఒక సమకాలీన పాత్రతో కథను నడిపించటం సాహసం, దాన్ని బేలన్స్ డ్ గా చేసాడు రచయిత
    శిల్పం, కథనం, శైలి వంటి సాహిత్య అంశాలు చక్కగా అమరాయి.

    ఇలాంటి కథలు ఒపెన్ ఎండెడ్ గానే ఉంటాయి సాధారణంగా….. కావలసినన్ని చోట్ల తోచినవిధంగా పూరించుకొనేట్లు

    రోహిత్ పాత్రను మరింత అస్పష్టంగా/లీలగా చిత్రించి ఉంటే కథకు ఇంకాలోతు వచ్చిఉండేది అని కూడా అనిపించింది.

    విమర్శ అతిగా అనిపించటానికి కారణాలు

    ఈ కథద్వారా కథకుడు సోషియాలజీ సెమినార్ కి ఒక పేపర్ సబ్మిట్ చేయటం లేదు. కంక్లూజన్స్, రిఫరెన్సులు, ఇఫ్ లు బట్ లతో చర్చించటానికి.

    ఇదొక కథ అంతే. అంతవరకే. అదికూడా సమాజంలో, దళితసమాజానికి వెలుపల ఉన్న ఒక వ్యక్తి (ఈ మాటకూడా కథలో ఎక్కడా ఉండదు-విమర్శలో నర్మగర్భంగా ప్రస్తావించబడింది కనుక అంటున్నాను), ఈ ఉదంతాన్ని ఎలాచూసాడో చెప్పే ఒక కథనం.

    అందులో జాలి ఉందా, సహానుభూతి ఉందా, కుట్ర ఉందా అన్నది ప్రశ్న

    ఇందులో కుట్రకోణం నాకైతే కనిపించలేదు. ఏనుక్కు తొండందగ్గర నుంచున్నవారికి అది ఒకలా కనపడితే, తోకదగ్గర నుంచున్న వారికి మరోలా కనిపిస్తుంది. ఈ సమాజంకూడా అంతే.

    రచయిత తనేమనుకొంటున్నాడో అది వ్రాసాడు. సృజన అనేది ఆసమయంలో స్పురించే విషయం పై ఆధారపడి ఉంటుంది. ఏ సృజనకారునికైనా తనకుండే పరిమితులు తనకుంటాయి.

    విమర్శ చేసేటపుడు – ఆ సృజనలో లేనిదానిగురించి ప్రశ్నించటం, డిమాండ్ చేయటం హిట్టింగ్ బిలో ద బెల్ట్ గానే భావించాలి. అది పైవ్యాసంలో పుష్కలంగా జరిగినట్లు నాకనిపిస్తంది.

    కొన్ని కామెంట్లలో, హమ్మో హమ్మో ఇంత కుట్ర ఉందా అనవసరంగా మెచ్చుకొన్నానే, ఇది చదివేదాకా అర్ధం కాలేదే అనటం, ఇకపై జాగ్రత్తగా ఉండాలి అని తీర్మానాలు చేసుకోవటం ఈ క్రీడకు పరాకాష్టగా అనిపిస్తుంది.

    ఇది నా టెరిటరీ, ఎవరైనా ఈపక్క వచ్చారా, ఇదిగో ఇలా తలలు తీసి కోటగుమ్మానికి వేలాడతీస్తాం అంటూ హెచ్చరిక చేస్తుంది ఈ వ్యాసం.

    “కాగితం తెల్లగా ఉన్నప్పుడు ఎక్కడ నక్కారు ఈ విమర్శకులందరూ” అన్నాడట వెనుకటికో విమర్శా బాధితుడు.

    ఒక ఉదంతం జరిగినపుడు భిన్నకోణాల్లో అది దర్శింపబడినపుడే గొప్ప సాహిత్యం పుడుతుంది.

    ఇలా అరాచక విమర్శలు చేసుకొంటూ పోతే ఇక మిగిలేది చెట్టు పిట్ట ల సాహిత్యమే.

    • THIRUPALU says:

      బల్లోజు బాబా గారు,
      సానుబూతికి, సమానత్వానికి తేడా ఉంది సర్, సాను భూతి చూపించే వాళ్ళంతా సమానంగా పరిగినిమ్చాగలరా అన్నదే ఈ విమర్శ సారంశం. అందుకని సానుభూతి కుడా చూపించ వలసిన అవసరం లేదు అని అర్ధం కాదు. అగ్ర వర్ణాల ప్రజా స్వామిక వాదులు సాను భూతి కంటే సమానత్వం చూపించే అంతగా ఎదగాలని ఈ విమర్శ కోరుతున్నది. అందుకని కధ లో లోపాలున్నవని అర్ధం కాదు. తప్పని సరిగా ఈ కధను ప్రోత్స హిమ్చాల్సిందే! స్వాగాతిమ్చాలి. దీన్ని రచయిత కున్న అవగాహనా పరిమితి గానే అర్ధం చేసు కోవాలి. బాల గోపాల్ గారు ‘దళిత’ అనే పేరుతొ వ్యాసాలూ రాసేరు. అందులో ఆయన చూపిస్తున్నది ద్లితులమీద సానుభూతి మాత్రమే కాదు. సమాన స్తాయికి ఎదగాలనే కోరిక కూడా. సానుభూతి నుండే సమానత్వం వస్తుంది.

  28. Vijaya Karra says:

    పైన Bolloju Baba గారు చెప్పినట్లు – సృజన అనేది ఆసమయంలో రచయితకి స్పురించిన విషయం పై ఆధారపడి ఉంటుంది.
    కథా పరిధిలో రచయత తన మనసుని తాకిన విషయానే కథగా చెప్పారు. ఇక రోహిత్ కి సంభందించిన అన్నీ విషయాలు ఇమడాలంటే ఎవరైనా
    ఓ జీవిత చరిత్రే రాయాల్సి వుంటుంది. ఒక్క కులం అన్న అంశమే కాకుండా సైన్స్ పట్ల జీవితం పట్ల అతడి ఆసక్తి , వాటిని క్రమేపీ దూరం చేసిన కారణాలు, సంఘటనలు ఓ పెద్ద నవలే అవుతుంది.

  29. కె.కె. రామయ్య says:

    అవును రమక్కా రోహిత్ ఆత్మ ఈ కధలో లేదు.

  30. భాస్కరం కల్లూరి says:

    మనకు హృదయమూ, బుద్ధి ఉన్నట్టే; మన స్పందన కూడా భావోద్వేగం, ఆలోచనాత్మకం అనే రెండు విధాలుగా ఉంటుంది. సాధారణంగా కవులు, కథకులు, ఇతర సృజనకారులు భావోద్వేగంతో స్పందిస్తారు. విమర్శకులు లేదా విశ్లేషకులు ఆలోచనాత్మకంగా స్పందిస్తారు. రెండూ దేనికవే స్వతంత్రవ్యవస్థలు. ఒక కవితపై లేదా కథపై చేసిన విమర్శను, తీసుకుంటే పరస్పర పూరకంగా తీసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. అంతే తప్ప రెండింటినీ పరస్పర శత్రువులుగా తీసుకోనక్కరలేదు.
    ఇక ఈ కథ, దీనిపై చేసిన విశ్లేషణ గురించి చెప్పుకుంటే, కథారచయిత వెంకట్ సిద్ధారెడ్డి రోహిత్ పట్ల భావోద్వేగంతో స్పందిస్తే, అది సహజమే తప్ప అసహజం కాదు. కానీ విచిత్రమేమిటంటే ఈ కథను విశ్లేషించడంలో ఆలోచనాత్మకంగా స్పందించాల్సిన చైతన్య పింగళి కూడా భావోద్వేగంతో స్పందించారు. అంతిమంగా ఈ విశ్లేషణ ఒక న్యాయమైన కథ మీద అన్యాయమైన విమర్శగా మారింది. ఎలాగంటే…
    1. “కేవలం సింపతీ?’ అన్న శీర్షికలోనే అవగాహనా లోపం ఉంది. చారిత్రక రాజకీయ సామాజిక పరిణామగతిపై స్పష్టమైన అవగాహన ఉన్నవారు ఎవరూ, ఒక ‘సవర్ణుడు’ ఒక దళితుడిపై ప్రకటించే సింపతీని ‘కేవలం సింపతీ యేనా?’ అంటూ చులకన చేయరు. అండర్ కరెంట్ గా సింపతీ రాజకీయ, సామాజిక రంగాలలో గొప్ప అద్భుతాలు చేస్తుంది. ఒక ప్రముఖ నాయకుడో, నాయకురాలో చనిపోయినప్పుడు సానుభూతి పవనాలు ఒక ప్రభుత్వాన్ని కూల్చి ఇంకో ప్రభుత్వాన్ని స్థాపించే ఉదాహరణలను పక్కన ఉంచుదాం. దళితులు, ఇతర పీడిత వర్గాలపై ‘సవర్ణుల’ సానుభూతి వారు కూడా భాగస్వాములుగా ఉన్న శాసననిర్మాణ వ్యవస్థలలో వారి అనుకూల శాసనాలు తేవడంలో నిశ్శబ్ద పాత్ర పోషిస్తుంది. రోహిత్ ఆత్మహత్య లాంటి సందర్భాలలో ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయడంలో ‘సవర్ణుల’ సానుభూతి కూడా పాత్ర వహిస్తుంది. అయితే ఆ శాసనాల నిర్మాణంలో, అమలులో ఎంత నిజాయితీ ఉంది, ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్నది వేరే చర్చ. అదొక నిరంతర ప్రక్రియ. ఇక్కడ ‘కేవలం సింపతీ’ అంటూ తీసిపారేయకూడదని చెప్పడమే ఉద్దేశం.
    2. చైతన్యగారి విశ్లేషణలో ఇంకో లోపం- భారతీయసమాజంలో కేవలం సవర్ణులు, దళితులు అన్న రెండు కేటగిరీలు మాత్రమే ఉన్నట్టు చూపించడం. నిజానికి మూడో కేటగిరీ కూడా ఉన్నారు, వారు, ప్రజాస్వామ్యవాదులు. సవర్ణులలో కొందరు కులాధిపత్యవాదులు ఉన్నట్టే, కొందరు ప్రజాస్వామ్యవాదులు కూడా ఉన్నారు. స్వతంత్ర భారత ప్రజాస్వామిక రాజ్యాంగం వెలుగులో గొంతును పెంచుకుంటూ బలోపేతమవుతున్న వర్గం, ఈ ప్రజాస్వామికవాదులు. వీరిలో సవర్ణులూ ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే ఒక level playing field. ఈ level playing fieldను కాపాడడానికి ప్రజాస్వామికవాదులనే కేటగిరీ తన వంతు పాత్రను నిర్వహిస్తుంది. అది కేవలం ఆదర్శంతోనో, ఇంకొకరిపై సానుభూతితోనో కానవసరం లేదు. సొంత అవసరం రీత్యా కూడా. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు కలిగిన ఫ్యూడల్ వ్యవస్థలో కంటే; సమానహక్కులు, అవకాశాల భావన కలిగిన ప్రజాస్వామ్యంలోనే సుస్థిరశాంతి భద్రతలతో అందరం అభివృద్ధి చెందగలుతామన్న ఎరుక కలిగిన వాళ్ళు అందరూ ప్రజాస్వామ్యంవైపు మొగ్గుతారు, ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి తమ వంతు దోహదం అందిస్తారు. ఎందుకంటే, అందులో ఎదుటివారి హక్కులకు హామీయే కాక తన క్షేమమూ ఇమిడి ఉంటుంది కనుక. కనుక సవర్ణులందరినీ ఒకే గాటన కట్టడం factual error మాత్రమే కాకుండా అవగాహనలోపం కూడా. రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయికి చేరి చర్చనీయం కావడంలో మీడియాలో సహా వివిధ సామాజిక రంగాలలో ఉన్న సవర్ణ ప్రజాస్వామిక వాదుల ‘కేవలం సింపతీ’ తో కూడిన క్రియాశీల పాత్ర కూడా ఉంది. ఈ సవర్ణ ప్రజాస్వామిక వాదులు అందరూ ప్రత్యక్షంగా దళితఉద్యమాలలో భాగస్వాములైతేనే వారి దళిత అనుకూలతకు సాక్ష్యమవుతుందని భావించడమూ అవాస్తవిక ధోరణే. కొందరు ప్రత్యక్షంగా పాల్గొంటే కొందరు దళిత అనుకూల భావవ్యాప్తికి ఇతర మార్గాలలో ప్రయత్నిస్తారు. ఎందులోనైనా ఇలాంటి వైవిధ్యం ఉంటూనే ఉంటుంది. ఆమాటకొస్తే దళిత అనుకూల ఉద్యమాల్లో దళితులందరూ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని ఎవరూ అనలేరు.
    3. ఇక ఈ కథ విషయానికి వస్తే, రచయితను ఒక ‘సవర్ణుని’ గా కన్నా సవర్ణ ప్రజాస్వామికవాదిగా విశ్లేషకురాలు గుర్తించి ఉంటే ఆయనకు న్యాయం జరిగేది. నేటికీ ప్రజాస్వామికం కాని సవర్ణులలో సాధారణంగా దళితులు, ఇతర పీడితుల పట్ల ఒక పేట్రొనైజింగ్ స్వరం వినిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, దళితులు దేవాలయానికి వెళ్ళడాన్నే తీసుకుంటే; అగ్రవర్ణాలవారు పుణ్యం సంపాదించాలంటే దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణాలు, పూజలు మొదలిన తంతు చాలా చేయాలని, దళితులు అంత శ్రమ పడనవసరం లేదనీ, వారు దూరం నుంచి ధ్వజస్తంభానికి నమస్కరిస్తే చాలనీ ఇప్పుడూ పౌరాణికులు చెప్పడం వింటూ ఉంటాం. కులపరమైన వ్యత్యాసాలను యుక్తిగా సమర్ధించదమూ కనిపిస్తుంది(‘చేతి అయిదువేళ్లూ ఒకేలా ఉన్నాయా?’ వగైరా ఉదాహరణలతో). ఈ కథలో ఇలాంటి పేట్రొనైజింగ్ స్వరం లేదు. కనుక అంతగా చెప్పుకోవాలనుకుంటే ఈ కథకుని సవర్ణ ప్రజాస్వామికవాదిగా చెప్పుకోవాలి. కాకపోతే వ్యక్తిగతమైన కొన్ని అవగాహనా పరిమితులు ఉంటే ఉండవచ్చు. ఉదాహరణకు కులం అనే భావనను మనసులోంచి తీసేయడం గురించి మాట్లాడడం. ఒక సామాజికాంశాన్ని చర్చిస్తున్నప్పుడు ఇలాంటి మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుందన్న మాట నిజమే. కులం అనేది మనసులోంచి తొలగడం కూడా భౌతిక స్థితిగతుల మీదే ఆధారపడి ఉంటుంది. జనసామాన్యానికి కనెక్టు కావడానికి కొంత ఐడియలిస్టు మాటలూ మాట్లాడవలసివస్తుందేమో. విశేషమేమిటంటే, రోహిత్ ఉత్తరాలలోనూ ఈ ఐడియలిస్టు ధోరణి వ్యక్తమైంది.
    4 ఇలాంటి చర్చల్లో సాధారణంగా ప్రజాస్వామ్యం ఉనికిని విస్మరిస్తూ ఉంటాం. రకరకాల అంతరాలు, అంతస్సంఘర్షణలు కలిగిన ఈ దేశాన్ని ప్రజాస్వామిక రాజ్యాంగం ఒక కొత్త సందర్భంలోకి తీసుకొచ్చింది. ఆ అంతరాలు, అంతస్సంఘర్షణల మధ్య ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరూ కలసి పనిచేసుకునే ఒక ఉమ్మడి వేదికను కల్పిస్తూనే వాటిని చర్చించుకుని పరిష్కరించుకునే వెసులుబాటును కల్పించింది. అంతేకాదు, అందరూ కలసి మాట్లాడుకునే ఒక ప్రజాస్వామిక భాషనూ, భావననూ, ఆనవాయితీలను, విధినిషేధాలనూ కూడా ఇచ్చింది. వెనకటి కాలంతో పోల్చితే, మనం మాట్లాడే బహిరంగ భాష ఎంత మారిందో, ఎంత ప్రజాస్వామికం అయిందో మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు, మనం ఇప్పుడు కులం గురించి(రాజకీయ సందర్భాలు వగైరా తటస్థ సందర్భాలలో మినహా) బహిరంగంగా మాట్లాడం. కనీసం మాట్లాడడానికి జంకుతాం. కులనింద, జెండర్ నిందా చేయం. ఇంతవరకూ మనకు ఉన్నవి ప్రైవేట్ జీవితాలు, ప్రైవేట్ భాషలూ, ప్రైవేట్ భావనలూ. మనం మాట్లాడే పబ్లిక్ భాషకూ, ప్రైవేట్ భాషకూ ఇప్పటికీ తేడా ఉంది. భారతీయ సమాజం ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మారే సంధి దశలో నేడు ఉంది. ప్రయాణ సాధనాలు, కార్యాలయాలు, మార్కెట్లు, సినిమాహాళ్ళు, నివాసప్రాంతాలు మొదలైనవి ప్రైవేట్ నుంచి పబ్లిక్ గా మారిన అనుభవం మనకు ఉంది. ఇవి ఉమ్మడి పబ్లిక్ భాషను నిర్మిస్తున్నాయి. ఈ పబ్లిక్ భాష బలోపేతం అవుతున్న కొద్దీ ప్రైవేట్ భాష న్యూట్రలైజ్ అవుతూ క్రమంగా అంతరిస్తుంది. అందులో సవర్ణ, అవర్ణ తేడాలు లేకుండా ప్రజాస్వామికవాదులందరూ పాత్ర వహిస్తారు.
    5.ఇంకో విషయమేమిటంటే, ప్రజాస్వామ్యంలో దేనినీ ‘నిర్మూలించడం’ జరగదు; అవాంఛనీయమనుకున్నది కాలక్రమంలో న్యూట్రలైజ్ మాత్రమే అవుతుంది. అలా న్యూట్రలైజ్ చేయగలిగిన భాషను, భావనలను, కార్యాచరణను ప్రజాస్వామ్య అనుభవమే అందిస్తుంది. అందులో వర్ణ భేదాలు లేకుండా ప్రజాస్వామికవాదులందరూ పాలు పంచుకుంటారు. దేనినీ నిర్మూలించకపోవడం అన్నది ప్రజాస్వామిక వ్యవస్థ స్వభావంలోనూ, నిర్మాణంలోనే ఉంది. కార్మికవర్గ నియంతృత్వం పేరుతో వర్గనిర్మూలన రూపంలో జరిగిన రష్యన్ విప్లవానికి, చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవానికీ, మనం ఇప్పుడు అమలు చేసుకుంటున్నడానికీ ఇక్కడే తేడా ఉంది. మనం రష్యన్, చైనా నమూనాలకు భిన్నమైన ప్రజాస్వామిక నమూనా వైపు మొగ్గాం. ఏది మంచిది, ఏది చెడ్డది అన్నది వేరే చర్చ. వీటిని భిన్న నమూనాలుగానే చూద్దాం. ప్రజాస్వామ్యంలో దేనినైనా న్యూట్రలైజ్ చేయడం తప్ప నిర్మూలించడం జరగదన్న సూత్రీకరణతో ఏకీభవిస్తే, ‘కులనిర్మూలన’ అన్న లక్ష్యం లేదా భావం లేదా పదబంధం అనవగాహనను సూచిస్తుంది. దీనిని అనవగాహనగానే తీసుకుంటే ఇది చైతన్యగారిలోనే కాక చాలామందిలో ఉంది. ప్రజాస్వామిక భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా అంబేడ్కర్ ప్రజాస్వామికవాది. కనుక ఆయన కులనిర్మూలన అనడంలో, అది క్రమంగా న్యూట్రలైజ్ అయి అంతరించడాన్నే ఆలోచనాత్మక స్థాయిలో లక్షించి ఉండవచ్చు. భావోద్వేగ స్థాయిలో దానిని భిన్నంగా ప్రకటించి ఉండవచ్చు.
    6. కులనిర్మూల అనే మాట వినిపించినంతగా మతనిర్మూలన అనే మాట ఎందుకు వినిపించదో ఆశ్చర్యం. నా ఉద్దేశంలో కులానికీ, మతానికీ తేడా ఉంది. కులం ఒక సెక్యులర్ స్పర్శ కలిగిన మాట. దానికి సామాజిక సెక్యులర్ అస్తిత్వం ఉంది. దాని మూలాలు గణవ్యవస్థలో ఉన్నాయి. మతం ఇందుకు భిన్నంగా పరలోకానికి చెందిన వ్యవస్థ.
    7. “అదే సెంట్రల్ యూనివర్సిటీ లో చాలా మంది దళితులు ఆత్మహత్య చేసుకున్నారు. మాటల్లో చెప్పలేని పైశాచిక, వికృత హింసని ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటున్నారు.ఇవి ఏవీ కూడా- అగ్రకులాలని రోహిత్‌వేముల ఆత్మ‘హత్య’ కదిలించినంతగా కదిలించలేదు. కారణం– ఆ ఉత్తరంలో ప్రతిఫలించిన అతని మేథస్సు, అంతకంటే ముఖ్య కారణం– రోహిత్‌తన చివరి లేఖలో ఎవరీనీ తన చావుకు బాధ్యుల్ని చేయకపోవటం. విసి అప్పారావుని కానీ, దత్తాత్రేయను కానీ, స్మృతి ఇరానీని కానీ, చివరికి సుశీల్‌కుమార్‌పేరును అయినా సరే.. అతని ఉత్తరంలో రాసి ఉంటే– రోహిత్‌కి సవర్ణుల నుండి ఏమాత్రం మద్దతు వచ్చేదో మనం ఊహించగలిగేదే.” అన్న చైతన్యగారి అభిప్రాయమూ నా ఉద్దేశంలో సరికాదు. రోహిత్ ఆత్మహత్య పెద్ద ఎత్తున ఎందుకు చర్చనీయం అయిందో సారంగలోనే రాసిన నా వ్యాసంలో చర్చించాను. దయచేసి చూడగలరు.
    దాని లింకు ఇదీ:
    http://saarangabooks.com/retired/2016/01/23/%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B9%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%92%E0%B0%95-%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A/

    • big applause , matured analysis

    • ఫి says:

      న్యూట్రలైజేషన్ అనేది సమస్య తీవ్రతను తగ్గంచే ఒక తాత్కాలిక ఉపశమనము. అన్నీ భావజాలాలు ఇక్కడ ఉంటాయి అంటే నే ప్యూడలిజం మళ్లీ తలెత్తడానికి అవకాశం ఉందని అర్థం. అదే ఇప్పుడు జరుతున్నది కూడా. ప్రజాస్వామ్య బావజాలనికి ప్రెంచ్ విప్లవ ప్రభావం అని అందరికి తెలిసిందే! దాని ప్రభావం తో సోషలిస్టు సమాజాలు ఏర్పడి పెట్టుబడి దారుల కుట్ర తో అవి కూలి పోయిన ఫలితం ఈనాటి గ్లోబలైజేషన్ పేరుతో వచ్చిన సామ్రాజ్య వాదం.

      • భాస్కరం కల్లూరి says:

        న్యూట్రలైజేషన్ తాత్కాలిక ఉపశమనం కాదు; కొంత ఓపిక వహించవలసిన నిరంతర నిర్మాణ ప్రక్రియ. దానిని ఒక ఛాయిస్ గా, నమూనాగా చూడాలి. ఆ ఓపిక లేదంటారా, ఇతర నమూనాలు ఉన్నాయి. అయితే విప్లవాలు జరిగిన రష్యా, చైనాలలోనూ భిన్న భావజాలాలు అంతరించలేదు. ప్రజాస్వామ్యానికి లేదా ప్రజాస్వామిక స్ఫూర్తికి అడ్డువచ్చే అవాంఛనీయ భావజాలాలను న్యూట్రలైజ్ చేసి అంతిమంగా అవి సహజమరణం చెందాలంటే, ప్రజాస్వామిక భావజాలం గొంతు పెంచుకొని అన్ని దశల్లోనూ పోరాటం చేయడం; మంచికో, చెడ్డకో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ప్రత్యామ్నాయం. అవాంఛనీయ భావజాల విషసర్పాలను చంపినా, కోరలు తీసినా ఫలితం ఒకలానే ఉంటుంది. కోరలు తీయడమే న్యూట్రలైజేషన్.

  31. శ్రీనివాసుడు says:

    చాలా చక్కగా చెప్పేరు భాస్కరం గారూ! నాదొక చిన్న చేర్పు
    Hatred + Idealization = Negation
    ఇలాంటి అభావం ప్రతి కీలక మలుపు దగ్గరా అభావం చెందితే మిగిలేది శుష్క తర్కమేనని నా అంచనా.

  32. @కల్లూరి గారూ చాలా బాగా చెప్పారు

  33. amarendra dasari says:

    చాలా అవసరమైన చర్చ జరుగుతోంది..రాగద్వేషాలను పక్కన పెట్టగలిగితే ఇది ఒక మౌలిక మైన చర్చ అవగలుగుతుంది..

  34. Y Pradeep says:

    అంబేడ్కరిజం ఒకటి లేనట్లే బ్రాహ్మనిజం కూడా ఒకటి లేదు ..బ్రాహ్మనిజం, అగ్రకులం అనే పదాలు దళితులు తిట్టడానికి వాడుకునే పదాలుగా మారిపోయాయి. దళితులు దారి తప్పుతున్న వైనాన్ని మాత్రం చాలా convenient గా మరచినట్లు నటిస్తున్నారు. కాన్శిరాం రాజకీయాల్ని రంగం మీదకు తెస్తే అంబేద్కర్ ఆత్మ శాంతిస్తుంది అనుకుంటున్నారు. రోహిత్ కుటుంబం బుద్ధిజాన్ని మెడలో వేసుకుంటే ఈ దేశ కుల వ్యవస్థ మారిపోతుందని భ్రమిస్తున్నారు. పింగళి చైతన్య అంబేడ్కర్ని వకాల్తాగా పుచ్చుకుని చచ్చు విమర్శ చేయడం శిచనీయం.రోహిత్ అంత మేధావి ఆత్మ చేసుకోవడమే ఒక వైరుధ్యం. అతని లెటర్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక పోయారన్నది ముమ్మాటికీ నిజం. విరసం కూడా సరిగ్గా విశ్లేషించలేక పోయిందని చెప్పాలి. సెంట్రల్ యూనివర్సిటిలో సునీత ఉదంతం కూడా ఇట్లాగే దుమారం లేపిందని మరచిపోతే ఎట్లా. అసలు వేలివాడని యూనివర్సితీలొ ఏర్పాటు చేయడం ఏమిటి .దానికి విరసం మద్దతు పలకడం ఏమిటి? ఇనన్నీవిప్లవోద్యమ fin de siecle గా భావించాలా లేక కుల్ల వైరుధ్యంలో కొట్టుకుపోతున్నారని
    అనుకోవాలా? కంచ ఐలయ్య వాదిస్తున్నట్లు దళిత పెట్టుబడిదారులు తయారయ్యేమ్తదాకా ఒక ఆవర్తం పూర్తికాదు అని నమ్మి సరిపెట్టుకోవాలా? చైతన్య పింగళి విమర్శ దారుణం అని మరో సారి చెప్పాలా?

  35. ఫి says:

    కంచ ఐలయ్య గారు దళితుల ను ” మీరు ఇంగ్లీషు చదువు చదువుకొనిబ ప్రపంచంలో ఎక్కడ అయినా బ్రతక వచ్చు. గ్లోబలైజేషన్ కాలము లో అదే జరగబోతుంది” అంటున్నారు. సామ్రాజ్య వాద గ్లోబలైజేషన్ మీద ఈదేశంలో పోరడటం కంటే, ప్రపంచంలో ఏమూలో దాక్కొని చీప్ లేబర్ పోర్స్ లో కలిసి పోండి అంటున్నారు.

    • SriRam says:

      @ రాణి శివశంకర శర్మ/ ఫి గారు మీరు ఐలయ్యని మహామేధావిగా ఊహించటం మానేయండి. ఆయనని ఎవ్వరు సీరియస్ గా తీసుకోరు. ఆయన వాదనలోని డొల్ల తనాన్ని విక్టర్ విజయ కుమార్ సారంగలోనే రాశాడు.

      దేశ ప్రజలు సామ్రాజ్యవాద గ్లోబలైజేషన్ మీద పోరాడిన తరువాత ఎమి సాధిస్తారు?వాళ్లకు ఏ లాభాలు ఒనగూడుతాయో స్పష్టంగా చెప్పగలరా?

  36. శ్రీనివాసుడు says:

    భాస్కరం గారూ!
    మంచి విత్తనాలను నిరంతరమూ జల్లుతూ పోతే చెడు కలుపు మొక్కలు వాటంతటవే సహజంగా అంతరించిపోతాయని నేనెక్కడో చదివేను.
    ఈ చర్చకు ఉపయోగపడుతుందేమోనని ఈ వ్యాసం సూచిస్తున్నాను. ఇది 2001 లో వ్రాసిన వ్యాసం. దీనికి పూర్తి ప్రాసంగికత వుందా, లేదా చెప్పలేను.
    అయితే వ్యాసం చివర రచయిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఈ 2016 లోనయినా వచ్చాయా, లేదా అన్నది సందేహం.
    ‘‘The central question here is what the relation will be between the overriding conflicts, by which I mean the global conflicts between the various dominant classes—that is, the states—whose possible geometry I have tried to outline above. Which will carry the day? Will the social struggles be subordinated, contained within the larger global-imperialist context of the conflicts, and therefore mastered by the dominant powers, even mobilized for their purposes, if not always manipulated? Or, on the contrary, will the social struggles win their autonomy and force the powers to adapt to their demands?’’

    Imperialism and Globalization
    by Samir Amin
    లంకె
    http://monthlyreview.org/2001/06/01/imperialism-and-globalization/

    • భాస్కరం కల్లూరి says:

      శ్రీనివాసుడుగారూ…బాగా చెప్పారు. మంచి విత్తనాలను చల్లుకుంటూ పోతే కలుపు మొక్కలు వాటంతట అవే అంతరిస్తాయి. చారిత్రక తటస్థ దృష్టితో చూసినప్పుడు, యుగధర్మాన్ని ప్రతిబింబించని భావజాలాన్ని కలుపుమొక్కలన్న నిందార్థంలో వాడి విషయాన్ని పక్కదారి పట్టించే వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా కాలం చెల్లినవనో, అవాంఛనీయాలనో అనడం కొంతవరకు బాగుంటుందేమో! ఇది నా సూచన మాత్రమే. ప్రజాస్వామ్య యుగధర్మాన్ని ప్రతిబింబించని భావజాలాన్ని ఎత్తి చూపి విమర్శించడంలో చూపుతున్న ఉత్సాహాన్ని ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ భావజాలాన్ని బలోపేతం చేయడంలో చూపడం లేదోమోనని నా అభిప్రాయం. అంటే మీరన్నట్టు అందుకు అనుకూలమైన విత్తనాలు చల్లడంలో వెనకబడుతున్నామన్నమాట. యుగధర్మవ్యతిరేక భావజాలవర్గాలలో ఉన్న ఐక్యత, సంఘీభావం ప్రత్యామ్నాయ భావజాలవర్గాలలో ఉన్నట్టు అనిపించడం లేదు. అప్రజాస్వామిక భావజాలాన్ని పెద్ద ఎత్తున న్యూట్రలైజ్ చేయాలంటే ప్రజాస్వామ్య భావజాలాన్ని సంఘటితంగా ఎలుగెత్తి వినిపించడం నేటి ప్రబల అవసరం. వ్యాసం లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  37. కె.కె. రామయ్య says:

    “రాజ్యం, రాజకీయ పార్టీలు, న్యాయవ్యవస్థల అండదండలతో … సామాజిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాల దురహంకారంతో అగ్రకుల వర్గాలు దళితులపై దాడులకు, అణచివేతకు, దోపిడికీ పాల్పడుతున్నాయి.
    సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో సమానత్వ సాధన ఉద్యమాలు; సామాజిక, ప్రజాస్వామిక, వామపక్ష శక్తుల ఐక్యత మాత్రమే కుల-వర్గ దోపిడీ, పీడనలకు చరమగీతం పాడగలదు.”

    http://www.navatelangana.com/article/saamaajika-nyaayam/59489

  38. కె.కె. రామయ్య says:

    “రోహిత్ వేములది ఆత్మహత్య రూపంలో జరిగిన ఇన్‌స్టిట్యూషనల్‌ మర్డర్‌ అని అంతర్జాతీయంగా అందరూ మొత్తుకుంటోంది. కానీ రెసరెక్సన్ కథలో ఆ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అన్యాయాన్ని.. ఎస్టాబ్లిష్‌ చేయకుండానే.. రోహిత్‌ పేలవంగా, ఏ కులానికి నొప్పి కలిగించని డైలాగులు చెప్పి ‘వెళ్ళిపోయాడు’! కానీ.. వాస్తవంలో రోహిత్‌ అలా లేడు” ఇదీ కధ పట్ల చైతన్య గారికున్న అభ్యంతరం.

    ప్రదీప్ గారు మీ నుంచి ఆశిస్తున్న వివరణలు :

    1) ఎం చేస్తే అంబేద్కర్ ఆత్మ శాంతిస్తుందో వివరించరా
    2) రోహిత్ కుటుంబం బుద్ధిజాన్ని మెడలో వేసుకుంటే ఈ దేశ కుల వ్యవస్థ మారిపోతుందని ఎవరు భ్రమిస్తున్నారు?
    అంబేద్కర్ బుద్ధిజాన్నిఎందుకు స్వీకరించారో, రోహిత్ కుటుంబమూ అందుకే చేసారని ఎందుకు అనుకోకూడదు ?
    3) HCU యూనివర్సితీలొ వేలివాడకి విరసం మద్దతు పలకడం విప్లవోద్యమ fin de siecle ( end of an era ) గా ఎందుకు భావించాలి?
    4) “రెసరెక్సన్” కథపై పింగళి చైతన్య గారి విశ్లేషణ / విమర్శ లోని ఏ విషయాలని దారుణంగా పరిగణించాలి ?

  39. Y Pradeep says:

    రామయ్య గారూ, చిత్తగించండి ఈ చిరు వివరణని ..
    1) క్లాస్ స్థానంలో క్యాస్ట్ ని ప్రధానం చెయ్యడంతో ….ఒక అసంబద్దతని సంబద్ధతగా భావించడంతో..ఇంకా చెప్పాలంటే మాయావతిని ప్రధాన మంత్రిని చెయ్యడంతో..

    2) అంబేద్కర్ చేసారని అందరు చెయ్యలా ..అసలు అంబేద్కర్ చేసిందే తప్పు అని ఎందుకు అనుకో కూడదు?

    3) దేన్నయితే నిర్మూలించాలని నడుం కట్టారో దాన్నే పటిష్టంగా నిర్మించే పనిలో నిమగ్నం కావడం, దానికి మద్దతు ఇవ్వడం .. ఒక ఐరనీ కాదా?

    4) విమర్శ ..వ్రాసిన రచన గురించే ఉండాలి. రచనలో పాత్రలు ఏం మాట్లాడాలో ..ఎలా ప్రవర్తిన్చేవో …రచయిత ఎలా వ్రాసి ఉండాల్చిందో చెప్పడం దారుణ విమర్శ కాదా. ఇదొక సాహిత్య విమర్శా? సూడో ఉద్వేగంతో వ్రాసిన ఈ సూడో విమర్శలో ఆత్మ పరాత్మ ప్రతిఫలనాల గురించిన చర్చ సూడో ఫలితాలనే ఇవ్వకేం చేస్తుంది?

  40. జూటూరు చంద్రశేఖర్ says:

    ఒక కథ గురించి ఇంత చర్చ జరగడం చూసి ఆనందంగా ఉంది. ఈ కథ గురించి మూడు రకాలైన చర్చలు జరుగుతున్నాయి. ఒకటి: అసలు ఈ కథ యాభై వేల ప్రైజ్ మనీ కి అర్హమైనదేనా అనేది ఒక చర్చ. ఇక్కడ సారంగలో కాకపోయినా ఇలాంటి చర్చలు ఫేస్ బుక్ లోనూ, బ్లాగుల్లోనూ జరిగాయి. ఇప్పటికే ప్రైజ్ వచ్చిన మూడు కథలు చదివాక వాటిల్లో రిసరెక్షన్ బెస్ట్ కథ అని ఒప్పుకోక తప్పదు. ఇక మిగిలిన కథలు (కన్సోలేషన్, సాధారణ ప్రచురణలు) చూశాక పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఒక పోటీ నిర్వహించినప్పుడు అందులో బెస్ట్ కథ కి ప్రైజ్ ఇస్తారు. కాబట్టి ఇది ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన బెస్ట్ కథా కాదా అనే చర్చకు అవకాశం లేదు. వాటిల్లో ఇదే బెస్ట్ కథ అయ్యుంటుందని నా అభిప్రాయం. కాకపోతే ఈ సోషల్ మీడియాలోనే జరిగే చర్చల్లో మరొక పాయింట్ లేవనెత్తారు. అదేంటంటే…అసలు ఈ కథ అర్థం కాలేదని చాలా మంది బాధ. వారి బాధను అర్థం చేసుకోవాలా? లేక కొన్ని నెలలుగా దేశం మొత్తాన్ని ఊపేసిన ఒక ఇష్యూ గురించి రాసిన కథ తమకి అర్థం కాలేదని నవ్వుకోవాలి. కాబట్టి దాని గురించి కూడా పెద్ద చర్చ అవసరం లేదు. ఇక పోతే రెండో రకమైన చర్చ. ఇక్కడ సారంగలో జరుగుతున్నది.

    చైతన్య పింగళి చాలా ఆవేశంగా రాసిన ఈ వ్యాసం లో ఏ మాత్రం వ్యాలిడిటీ లేదు. అది ఎందుకో నా కనిపించింది చెప్తాను.

    మొదట ఇక్కడ ఈ కథ గురించి విమర్శించిన చాలా మందికి ఈ కథ పూర్తిగా అర్థం కాలేదని అనుకుంటున్నాను. అసలు రచయిత రాసిన పెర్స్పెక్టివ్ ఏంటి? ఒక అమ్మాయి. బహుశా మిడిల్ క్లాస్, లేదా బిలో మిడిల్ క్లాస్ కి చెందిన ఒక అప్పర్ కాస్ట్ కి చెందిన ఈ అమ్మాయి, అత్మహత్య చేసుకుని చనిపోయిన ఒక దళితుని ఆత్మకథ చదివి అతని గురించి తెలుసుకుని, అతని సమస్యలు, జీవితంతో ఎంపథైజ్ అవడం ఈ కథ ముఖ్య సారాంశం.

    ఈ కోణంలో చూస్తే ఇది చాలా ముఖ్యమైన కథ. ఇవాళ కస్తూరి మురళి కృష్ణ లాంటి వాళ్లు ఈ కథ ని పేరడీ చేస్తూ కథ రాయడం, లేదా బాగా పేరుగాంచిన రచయితలు, రచయిత్రులు – ఈ కథ లో ఉన్న అంశాన్ని వదిలేసి, అర్థం కాకుండా రాస్తే ప్రైజ్ లు వస్తాయని అనడం – చూస్తుంటే, తెలిసొచ్చే విషయం ఏంటంటే రోహిత్ గురించి వీళ్లకి ఏ మాత్రం తెలియకపోగా, ఎంపతీ కాదు కదా సింపతీ కూడా లేకపోవడం గమనించవచ్చు. మేము గొప్ప, మా కులం గొప్ప అని కరుడు గట్టిన వారి హృదయాల్లో ఈ కథ కాస్తంతైనా కరుణ నింపుతుందేమో కదా!

    భారతి అని పేరు పెట్టడంలోనే రచయిత తన ఉద్దేశాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. అంతే కాకుండా ఏదో తన చదువు తన జీవితం అని అనుకునే ఎంతో మంది భారతీయులకు ఆమె రిప్రెజెంటేటివ్. అలాంటి ఆమె జీవితంలోకి రోహిత్ రావడం, ఆమె అతని గురించి తెలుసుకుని అతనితో ట్రావెల్ చెయ్యడమే ఇప్పుడు మనకి కావాలి అంటే, పింగళి కి మళ్లీ కోపం రావొచ్చు. మీ సానుభూతి ఎవడిక్కావాలి అని నన్నూ అంటుందేమో!

    కానీ వీలైతే మీ ఉద్యమ కళ్లజోళ్లు తీసేసి, మరో సారి అంబేద్కర్ ని చదవండి.

    How to bring about the reform of the Hindu social order ? How to abolish caste ? అనే విషయం గురించి అంబేద్కర్ ఏమంటారు?

    I am convinced that the real remedy is inter-marriage. Fusion of blood can alone create the feeling of being kith and kin and unless this feeling of kinship, of being kindred, becomes paramount the separatist feeling—the feeling of being aliens—created by Caste will not vanish. Among the Hindus inter-marriage must necessarily be a factor of greater force in social life than it need be in the life of the non-Hindus. Where society is already well-knit by other ties, marriage is an ordinary incident of life. But where society cut asunder, marriage as a binding force becomes a matter of urgent necessity. The real remedy for breaking Caste is inter-marriage. Nothing else will serve as the solvent of Caste.

    కథ లో రచయిత ఏమన్నాడు. మనుషుల మనసుల్లోంచి కులం పోవాలి, అన్నాడు. అంబేద్కర్ కూడా హిందువుల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లే క్యాస్ట్ సిస్టం పోవడానికి రియల్ రిమెడీ అన్నాడు. అది ఎలా జరుగుతుంది? దీనికి ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని రాజ్యాంగపరమైన మార్పులు చేర్పులు చేసినా జరగదు. ఒక్కొక్కరిగా మన మనసుల్లోని కులమనే కుల్లు ని తీసేస్తే పోతుంది. అది పోవడానికి ఇంటర్ క్యాస్ మ్యారేజ్ అనే ఉపాయం చెప్పారు అంబేద్కర్. ఆ విధంగా మనసుల్లోంచి కులం పోవాలి అనేది రెటోరిక్ గా అనిపించినా, అంబేద్కరే అన్నట్టు అసలు జరగాల్సిందే అది.

    ఇక అంబేద్కర్ యువజన సంఘంలో పని చేసిన రోహిత్ ఇలా అనడం బాగోలేదనే చైతన్య ఆవేదన అర్థం చేసుకోదగ్గది. కానీ అదే రోహిత్ తన సూసైడ్ నోట్ లో రాసి కొట్టేసిన వాక్యాలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలేమో. కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన అవసరన్ని – అని చైతన్య, బ్రాహ్మనిక ఆధిపత్యాన్ని భూస్తాప్తితం చెయ్యాలని ఒకరు, రోహిత్ ఈజ్ రొమాంటిసైజ్డ్ అని ఒకరు, రోహిత్ చివర్లో మాట్లాడిన మాటలు అన్యాయంగా ఉన్నాయని ఒకరు, రోహిత్ ఆత్మ ఈ కథలో లేదు అని ఒకరు, సామాజిక, ప్రజాస్వామిక, వామపక్ష శక్తుల ఐక్యత మాత్రమే కుల-వర్గ దోపిడీ, పీడనలకు చరమగీతం పాడగలదు అని ఇంకొకరు – ఇలా చాలా మంది తమ అభిప్రాయాలు, క్రిటిసిజమ్ తెలియచేశారు. అయితే వీరు చెప్పిన దానికి రోహిత్ కొట్టివేసిన వాక్యాల్లోనుంచి ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది.

    ASA, SFI, anything and everything exist for their own sake. Seldom the interest of a person and this organisation match. To get power, to become famous or to be important in between boundaries and to think we are up to changing the system. Very often we overestimate the acts and find solace in traits. Of course I must give my credit to both groups for making, introducing me to wonderful literature.

    రోహిత్ కొట్టి వేసిన ఈ వాక్యాలను మనం కాదనగలమా? మీరు చెప్తున్న సో కాల్డ్ పోరాటాలు, ఐక్యత, భూస్తాపితాలు – ఇవన్నీ జరగడం లేదని కూడా రోహిత్ ఆవేదన. కాదా? అందుకే నా వరకూ అనిపించేదేంటంటే – ఈ పోరాటాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందరికీ తెలియనిది కాదు, ఈ పోరాటాల్లో ఎన్ని లీడర్లు తమ స్వంతలాభాల కోసం చేస్తున్నారో. కాబట్టి రచయిత రెటోరిక్ గా అన్న మాటల కంటే, కింద కామెంట్స్ లో చెప్తున్న మాటలు కూడా అంతే రెటోరిక్ గా ఉన్నాయి. ఆ మాటకొస్తే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అసలు సమాధానం అని అంబేద్కర్ అనడం కూడా రెటోరికల్ స్టేట్మెంటే! కాబట్టి రచయిత రోహిత్ చేత చెప్పించిన మాటలో ఏం తప్పుందో అర్థం కాలేదు.

    ఇక అంబేద్కర్ ఒక్కడి వల్ల కాలేదు అన్నంత మాత్రాన అంబేద్కర్ ని తక్కువ చేయడమయిందా? పోనీ అంబేద్కర్ ఒక్కడి వల్ల సాధ్యమైందా? కాలేదు కదా!

    ఇక వేదాలు, పురాణాల్లోకి వెళ్ళాల్సిన విషయం గురించి. అంబేద్కర్ ఏమన్నారు?

    Make every man and woman free from the thraldom of theShastras ,cleanse their minds of the pernicious notions founded on the Shastras,and he or she will inter-dine and inter-marry, without your telling him or her to do so.

    శాస్త్రాలు, అవి చెప్తున్న నేతి బీరకాయలాంటి నీతులను క్యాష్ చేసుకుంటూ బతుకుతున్న చాగంటి లాంటి వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో, అంబేద్కర్ చెప్పిందే చెయ్యాలి కదా. వాటి లోతుల్లోకి వెళ్లాలనే కదా కథలో రోహిత్ అన్నది. ఆ లోతుల్లోకి వెళ్ళి వాటి డొల్ల తనాన్ని ప్రజలకి తెలియచేయమనే కదా అంబేద్కర్ చెప్పింది. అందులో కూడా రచయిత చేసిన తప్పు నాకర్థం కాలేదు.

    సరే ఇక చివరి విషయం. రోహిత్ నాది కథ కాదు జీవితం అని పాత సినిమా హీరోలా చెప్పడం నచ్చలేదనడం గురించి.

    చివరి అస్త్రంగా రోహిత్ శరీరంగా వాడాడు అని చైతన్య కి ఎలా తెలుసు? నువ్వు నా సమానత్వం గుర్తించటం లేదు కాబట్టి.. అనో.. నువ్వే నా హత్యకు బాధ్యుడివి అనో – అని అతని చేత అనిపించి ఉంటే బావుండేదని చైతన్య చెప్పడం ఆమె ఆవేశాన్ని తెలియచేస్తుందే తప్ప, ఆమె ఆలోచనని తెలియచెయ్యడం లేదు.

    తెలుగులో సాహిత్యం అంటేనే ఏదో ఒక ఉద్యమానికి ఆసరాగానో ఆయిధంగానో ఉండాల్సిన పరిస్థితికి తెచ్చేశాం. అలా పనికి రాని సాహిత్యం అసలు సాహిత్యమే కాదని తేల్చేస్తున్నాం. బహుశా తమ ఉద్యమానికి ఆయుధంగా ఈ కథ ఉపయోగపడలేదనే బాధ చైతన్య వ్యాసంలో ఎక్కువ కనిపిస్తోంది. కానీ వీటన్నింటికీ మించి సాహిత్యానికీ ఒక పర్పస్ ఉందిగా.

    ఇక మూడో రకమైన చర్చ. సవర్ణుడైన రచయిత ఇలాంటి అంశాల గురించి కథ రాయొచ్చా అని. రేసిజమ్ గురించి ప్రజలని సెన్సిటైజ్ చెయ్యడంలో టు కిల్ ఏ మోకింగ్ బర్డ్ అనే పుస్తకం పాత్ర చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అది రాసింది ఒక నల్ల జాతీయుడేం కాదు. ఒక నల్లజాతీయుడికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ఒక తెల్లవాడైన లాయర్ కథ గా రాసిన హార్పర్ లీ కూడా తెల్ల జాతి ఆమే!

    సో ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే – ఈ కథ చదివి చాలామంది మనసులైతే కదిలాయి. ఈ కథ పర్పస్ కూడా బహుశా అదే అయ్యుంటుంది. దాన్ని ఇలా అర్థం పర్థం లేని విమర్శతో చంపేసి – ఓ, అవునా ఈ కథ అంత గొప్పది కాదా! అయ్యో మేము గొప్పదనుకుని పొరబడ్డామే అని – వారి మనసుల్లో మరో గోడ కట్టకండి.

  41. Y Pradeep says:

    “కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన అవసరన్ని.. తెలిసి..”(రోహిత్ కి )….ఇది వైరుధ్యం కాదు కాబోలు. కులానికో సంఘం , గోత్రానికో సంఘం పెట్టుకుని ఏ కులాన్ని, ఎక్కడ కులాన్ని నిర్మూలిద్దామని గాలిలో కత్తి తిప్పుతున్నారు. కులాంతర మతాంతర వివాహాల వల్ల ఒరిగేదేం లేదు. సమానత్వం సాధ్య పడదు. వర్గ దృక్పధాన్ని ఇపుడెంత తూలనాడినా త్రునీకరించినా తిరిగి మళ్ళీ తాము చేరుకోవాల్సిన, చేరాల్సిన మజిలీ వర్గ దృక్పధమే. రోహిత్ ఆత్మ హత్యతో విప్లవమెమీ ఊడి పడదు. ఏదో సమాజమంతా కదిలిపోయిందని చైతన్య పింగళి భ్రమించడం తప్పు.

  42. కె.కె. రామయ్య says:

    ప్రదీప్ గారు, ఒక వాదనలోని లోపాలని ప్రతివాదనలో వివరించండి. దయచేసి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ( ముఖ్యంగా చైతన్య పింగళి గారి పట్ల ) చెయ్యకండి.

    1) ‘రోహిత్ ఆత్మ హత్యతో’ …. రోహిత్ డి కేవలం ఆత్మహత్య గా చూడాలా లేక ఆత్మహత్య రూపంలో జరిగిన ఇన్‌స్టిట్యూషనల్‌ మర్డర్‌ గా గుర్తించాలా?

    2) ‘విప్లవమెమీ ఊడి పడదు’ ~ మరి ఇప్పటివరకూ వెల్లువెత్తిన నిరసనలు, నివాళుల భావ స్వారూప్య ఐకీకరణ విప్లవం మాటేవిటి?

    3) ‘సమాజమంతా కదిలిపోయిందని చైతన్య పింగళి భ్రమించడం’ ~ రోహిత్ HCU వెలివాడల నుండి, దేశ చట్ట సభల వరకూ చర్చించ బడ్డాడు. ప్రధానమంత్రి తో సహా పలువురు స్పందించాల్సి వచ్చింది. రోహిత్ మాకు ఆదర్శం అని JNU స్టూడెంట్స్ నాయకుడు కన్హయ్యా కుమార్ సగర్వంగా ప్రకటించారు. విద్యార్ధుల, ముఖ్యంగా దళిత విద్యార్ధుల పోరాటానికి స్పూర్తిగా రోహిత్ నిలిచిపోయాడు.

    4) ‘కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన’ ~ ఇదీ ఓ చారిత్రిక వాస్తవం. ఒకప్పుడు ఒకటో రెండో కులాల ఆధిపత్యాన్ని, చైతన్యవంతమై తరవాత వచ్చిన కుల సంఘాలు తగ్గించవెయ్యగలిగాయి. అంతిమ విజయానికి కాకున్నా ఆమేర లక్ష్య సాధనకు అణగారిన, దళిత కులాల సంఘటితం అవసరం కాదా.

    • ari sitaramayya says:

      ఈ వ్యాసం మీద చర్చ ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం చైతన్య గారి ఓర్పు, నిగ్రహం. వ్యాఖ్యలమీద వ్యాఖ్యానం చెయ్యకుండా దూరంగా ఉన్నందుకు వారికి అభినందనలు.

      “కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన అవసరన్ని.. తెలిసి..”(రోహిత్ కి )….ఇది వైరుధ్యం కాదు కాబోలు.” అన్న ప్రదీప్ గారి మాటలకు “కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన’ ~ ఇదీ ఓ చారిత్రిక వాస్తవం. ఒకప్పుడు ఒకటో రెండో కులాల ఆధిపత్యాన్ని, చైతన్యవంతమై తరవాత వచ్చిన కుల సంఘాలు తగ్గించవెయ్యగలిగాయి.” అని రామయ్య గారు సమాధానం రాశారు.

      ఒకటోరెండో కులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కులప్రాతిపదిక మీద సంఘటితం అయి పోరాడటం వేరు, కుల నిర్మూలన వేరు. ఆధిపత్యం మీద పోరాడటానికి ఇతర కులాలు సంఘటితం అవడమే తగిన మార్గం. కాని అలాంటిపోరాటం వలన సమాజంలో కులాల పాత్రా, కులభావనా పెరుగుతాయి. కుల నిర్మూలన జరిగే ఆవకాశం లేదు. లక్ష్యం కులనిర్మూలన అయితే కార్యాచరణ వేరుగా ఉండాలి.

  43. ఈ వ్యాస రచయిత ఈ విశ్లేషణ ద్వారా సాధించదలుచుకున్నది ఏమిటి?ఆ కధ నేను చదివాను.కవిత్వానికి,కధలకూ పరిమితులు ఉంటాయి.శ్రీశ్రీ కవిత్వానికి కూడా పరిమితులు ఉన్నాయి.కదహలో రచహయిత చెప్పకుండానే ఇదంత సులభంగా తేల్చి చెప్పదగిన విషయం కాదు అని సూచించినప్పుడు ఇంక అసమగ్రంగా ఉంది అనడంలో అర్ధం ఉందా?
    *
    మీరు “దళిత ప్రభుత్వం”,”కుల నిర్మూలన” అనేవాటిని యెట్లా సాధించదల్చుకున్నారు?పోరాటం ద్వారా అయితే శత్రువు మీద అంతిమయుద్ధం చెయ్యబోయేముందు చెయ్యాల్సిన పని తటస్థుల్ని గెలవడం!ఈ తటస్థుల్ని మీవైపుకి తిప్పుకోకపోతే వీళ్ళు ఎదిరిపక్షంలో చేరితే బలాబలాలు ఖచ్చితంగా శత్రువుకే అనుకూలంగా తయారవుతాయి.సవర్ణుల్లో ఓక రచయిత రోహిత్ పాత్రని ఉదాత్తంగా చిత్రీకరించి మీతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంటే అతన్ని ఎంకరేజ్ చెయ్యాల్సింది పోయి విమర్శిస్తూ రాళ్ళు వేస్తే ఎవరికి నష్టం?
    *
    యుద్ధం చెయ్యాలంటే యుద్ధవ్యూహాలు తెలిసి ఉండాలి,ఈ విమర్శతో మీలో అది లేదని తేలిపోయింది!సామరస్యంగా సాధించాలనుకుంటే పాజిటివ్ యాటిటూడ్ ఉండాలి,అది మొదలే లేదు!

  44. Y Pradeep says:

    రామయ్య గారూ..
    మళ్ళీ చెబుతున్నాను .. విత్ డ్యూ రెస్పెక్ట్ .. పింగళి చైతన్య గారు స్పందిచిన విధానం మీదనే నా స్పందన + మీరు కోరిన వివరణ ఇవ్వడం తప్పా ఇతరమేమీ కాదు..

    1) రైతు ఆత్మ హత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే….అనడం వంటిదే ఈ “institutional murder ” మాట… ఇంకా పెద్ద పెద్ద మాటలే వాడ వచ్చు.. ప్రపంచమంతా మొత్తుకోవచ్చు కూడా. ఫలితమే శూన్యం..శూన్యం

    2) ఇప్పటి వరకు వచ్చిన నిరసనలు భావ సారూప్య ఐక్యతలు క్షణభంగురాలే ..ఇవే విప్లవమని గుర్తించడమే fin de siecle కి చిహ్నం .

    3) గల్లీ నుండి డిల్లీ వరకు రోహిత్ ఉదంతం చర్చించి ఉండొచ్చు..కాని అది చర్చకే పరిమితమై పోయిందనీ , పోతుందనీ తెలియకపోతేనే అమాయకత్వం అవుతుంది. కన్హాయ కుమార్ రోహిత్ ని ఆదర్శంగా తీసుకుంటే..అదొక ప్రామాణికమా? నీలి .. లాల్ కలవాలనుకుంటున్న ఒక యువ అమాయకుదతడు. దళితులంతా కోరుకుంటున్న రోహిత్ చట్టం వచ్చినా ఒరిగేదేం లేదు. నిర్భయ చట్టం లాగే అదీ కూడా.

    4) దళితులు సంఘటితం కావడాన్ని ఎవరు కాదన్నారు.మంచిదే కదా ..అలా కావాలనే కదా కోరుకునేది. కాని మళ్ళీ చెబుతున్నాను.. కులానికో సంఘం గోత్రానికో సంఘం.., దళితుల ఐక్యతనటుంచి శత్రు ఐక్యతకీ వారి బల సమీకరణకీ దోహదపడతాయని గుర్తించకపోవడం ఒక తప్పిదమే అవుతుంది.

  45. Sreeivas Chandragiri says:

    అసలు రచయిత రాసిన పెర్స్పెక్టివ్ ఏంటి? ఒక అమ్మాయి. బహుశా మిడిల్ క్లాస్, లేదా బిలో మిడిల్ క్లాస్ కి చెందిన ఒక అప్పర్ కాస్ట్ కి చెందిన ఈ అమ్మాయి, అత్మహత్య చేసుకుని చనిపోయిన ఒక దళితుని ఆత్మకథ చదివి అతని గురించి తెలుసుకుని, అతని సమస్యలు, జీవితంతో ఎంపథైజ్ అవడం ఈ కథ ముఖ్య సారాంశం.
    ఈ కోణంలో చూస్తే ఇది చాలా ముఖ్యమైన కథ. ఇవాళ కస్తూరి మురళి కృష్ణ లాంటి వాళ్లు ఈ కథ ని పేరడీ చేస్తూ కథ రాయడం, లేదా బాగా పేరుగాంచిన రచయితలు, రచయిత్రులు – ఈ కథ లో ఉన్న అంశాన్ని వదిలేసి, అర్థం కాకుండా రాస్తే ప్రైజ్ లు వస్తాయని అనడం – చూస్తుంటే, తెలిసొచ్చే విషయం ఏంటంటే రోహిత్ గురించి వీళ్లకి ఏ మాత్రం తెలియకపోగా, ఎంపతీ కాదు కదా సింపతీ కూడా లేకపోవడం గమనించవచ్చు. మేము గొప్ప, మా కులం గొప్ప అని కరుడు గట్టిన వారి హృదయాల్లో ఈ కథ కాస్తంతైనా కరుణ నింపుతుందేమో కదా!
    భారతి అని పేరు పెట్టడంలోనే రచయిత తన ఉద్దేశాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. అంతే కాకుండా ఏదో తన చదువు తన జీవితం అని అనుకునే ఎంతో మంది భారతీయులకు ఆమె రిప్రెజెంటేటివ్. అలాంటి ఆమె జీవితంలోకి రోహిత్ రావడం, ఆమె అతని గురించి తెలుసుకుని అతనితో ట్రావెల్ చెయ్యడమే ఇప్పుడు మనకి కావాలి

  46. కె.కె. రామయ్య says:

    “వ్యాఖ్యల మీద వ్యాఖ్యానం చెయ్యకుండా ఈ వ్యాసం మీద చర్చ జరగడానికి ఓర్పు, నిగ్రహం చూపిన చైతన్య గారిని అభినందిస్తున్నాను” అన్న ఆరి సీతారామయ్య గారికి కృతజ్ఞతలు. కులనిర్మూలనే లక్ష్యం, అందుకవసరమైన కార్యాచరణ ఉండాలి అన్నందుకూ. చైతన్య గారు కేవలం ఈ వ్యాస రచయిత మాత్రమే కాదు, రోహిత్‌ వేముల న్యాయపోరాటం, కార్యాచరణలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు.

    “రోహిత్‌ విషాదం గురించి ప్రపంచమంతా మొత్తుకున్నా ఫలితం శూన్యం; భావ సారూప్య ఐక్యతలు క్షణభంగురాలు; రోహిత్ చట్టం వచ్చినా ఒరిగేదేం లేదు” అని అంటున్న ప్రదీప్ గారూ ఈ విషయంలో మీతో విభేదిస్తున్నాను. వాటి ప్రయోజనాలు వాటికున్నాయని నాకనిపిస్తున్నది.
    చేరాల్సిన మజిలీ వర్గ దృక్పధమే, మార్గం విప్లవమే అయినా వాటిని విపులంగా చెప్పలేదు మీరు.

  47. Y Pradeep says:

    కదా మరి! వేటి ప్రయోజనాలు వాటికుంటాయి . ఎవరి ప్రయోజనాలు వారికున్నట్టు . ఎవరి equations వారికున్నట్టు. విభేదించడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. ధన్యవాదాలు.

  48. కె.కె. రామయ్య says:

    రోహిత్‌ వేముల కధాంశం గా వెంకట్‌ సిద్ధారెడ్డి రాసిన “రెసరెక్సన్” కథపై చైతన్య గారి విశ్లేషణ, దరిమిలా జరిగిన చర్చల ప్రింటు కాపీని చదివిన పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. కధా రచన, సాహితీ విమర్శల నుండి వాల్యూస్ బేస్డ్ యాక్టివిస్ట్ గా రూపుదిద్దుకుంటున్న చైతన్య పింగళి గారి పట్ల తన అభిమానాన్ని, ఆత్మీయతను తెలియజేయ్యమన్నారు.

Leave a Reply to భాస్కరం కల్లూరి Cancel reply

*