ఓ మై గాడ్!

 

                                                                     -బమ్మిడి జగదీశ్వరరావు

 

దక్షిణాఫ్రికాలో చర్చిలు వున్నట్టే సఫారీ పార్కులు కూడా వున్నాయి! చర్చిలో పాస్టర్లు వున్నట్టే సఫారీ పార్కులో సింహాలు కూడా వున్నాయి! జియాన్ క్రిస్టియన్ చర్చి పాస్టర్లంతా సింహాలు వుండే క్రూగర్ నేషనల్ సఫారి పార్క్ కు వెళ్ళారు! సింహాల తరుపున పాస్టర్లు దేవుణ్ణి ప్రార్థిస్తారేమోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు!

ఇటు చూస్తే పాస్టర్ల గుంపు! అటు చూస్తే సింహాల గుంపు!

పాస్టర్ అలెక్ ఎండివాన్ ను తోటి పాస్టర్లు ఆపినా ఆగకుండా సింహాలవైపు నడిచాడు! దేవుడు తనయందు వున్నాడన్నాడు! సింహాలయందు కూడా దేవుడు వుంటాడని మిగతా పాస్టర్లు చెప్పిచూసారు! నేను దేవుని ప్రతినిధిని అని ఎండివాన్ యెంతో గర్వంగా చూసాడు! దేవుడు నన్ను సింహాల నుండి రక్షిస్తాడు అనికూడా అంతే నమ్మకంగా చెప్పాడు!

పాస్టర్లంతా దేవుణ్ణి ప్రార్ధించడం మాని ఎండిమాన్ ని ప్రార్ధించారు! అవి సింహాలని.. దేవుడు చెప్పినా వినవని.. మొత్తుకున్నారు! దేవుడు చెపితే యెవరన్నా వినవలసిందే.. సింహాల్లారా! మీరయినా వినవలసిందే.. అని సింహాలకు అరిచి మరీ చెప్పాడు ఎండిమాన్! అరుపులు విన్న సింహాలు- మాంసము తినడం మాని- తోకూపుతూ ఎండిమాన్ ను చూసాయి! దేవుని వాక్యము మీరు కాదనగలరా? అని మరోమారు అరిచాడు ఎండిమాన్! సింహాలు లేచి నిలబడ్డాయి! అదీ గౌరమంటే అని మురిసిపోయాడు ఎండిమాన్! దేవుణ్ణి ప్రార్ధిస్తూ సింహాలకు యెదురెళ్ళాడు!

ఎండిమాన్ ని మిగతా పాస్టర్లు వేన్లోకి రమ్మని ప్రాధేయపడ్డారు! దేవుణ్ణి అవమానించొద్దన్నాడు ఎండిమాన్! దేవుడు గొప్పో సింహాలు గొప్పో తేలిపోతుంది అని గంతులువేసాడు! నాది దేవుని త్రోవ అన్నాడు! సింహాలు త్రోవకు దగ్గరగా వచ్చేస్తున్నాయి! దేవుని త్రోవను అనుసరించలేక తోటి పాస్టర్లు వెంటనే వెనక్కి వచ్చి వేనెక్కారు! ఎండిమాన్ కూ సింహాలకూ వున్న మధ్య దూరం క్షణాల్లో తగ్గుతోంది!

దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక.. అని నినదించాడు ఎండిమాన్! సింహాలు జూలుదులుపుకు పరిగెత్తుకువచ్చాయి! అంతవరకూ వున్న సింహాలు సింహాలుగా కాక, వొక్కసారిగా మీదకోస్తున్న సైతానుల్లా కనిపించాయి! అంతే-

దేవుడా.. అని ఎండిమాన్ వెనక్కి తిరిగి పరిగెత్తాడు! సింహాలు ఆగిపోలేదు.. పరిగెత్తుతూ వచ్చేసాయి! సింహాలకన్నా వేగంగా పరిగెత్తలేకపోయాడు! సింహాల పంజా దెబ్బలకు రక్తంతో అతని పిరుదులు వరదలు గట్టాయి! సమయానికి సఫారీ పార్క్  సిబ్బంది వచ్చి సింహాల బారినుండి ఎండిమాన్ ను కాపాడారు!

ఎండిమాన్ ని పరామర్శించడానికి చాలా మంది భక్తులూ తోటి పాస్టర్లు వచ్చారు!

ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎండిమాన్ ‘బహుశా.. జంతువులపై తన ఆధిపత్యాన్ని చాటిచెప్పేందుకే దేవుడు నన్ను వాడుకొని వుంటాడు’ అని తనని తాను సమర్ధించుకున్నాడు! తోటి పాస్టర్లు ఎండిమాన్ కు తలమీద కూడా దెబ్బ తగిలిందేమోనని కలవరపడి డాక్టర్లని చూడమన్నారు! అలాంటిదేమీ లేదని డాక్టర్లు చెప్పారు!

ఈ ఆందోళనలతో సంబంధం లేకుండా- సింహాల ఆధిపత్యానికి అవకాశం లేదు, వాటిని నిలువరించి తన ఆదిపత్యాన్ని దేవుడు నిరూపించుకున్నాడు, అందుకు నన్ను వాడుకోవడం నాకెంతో గర్వంగా కూడా వుంది- అని నొప్పిగా కూడా వుంది అన్నట్టు మూలిగాడు ఎండిమాన్!

అలా దేవుని నిర్ణయము మీదికి మళ్ళాయి మాటలు!

“దేవుడు వచ్చేవాడు.. కానీ ఎండిమాన్ దేవుడికోసం నిరీక్షించలేదు.. సింహాలను చూసి వెనుతిరిగిపోయారు.. దేవుని తోవన నిలువగలిగి వుంటే దేవుడు తప్పక రక్షించేవాడు..!” వణుకుతున్న స్వరంతో అన్నాడు అందర్లోకీ ముదర పాస్టరు!

ఎండిమాన్ ఆమాట విని అవాక్కయాడు! ఆలోచనలో పడ్డాడు! తనను పరామర్శించడానికి వచ్చారో విమర్శించడానికి వచ్చారో అతనికి అర్థం కాకుండా వుంది!

“అసలు ఆ దేవుడే సింహాల రూపములో వొచ్చాడని యెందుకు భావించకూడదు..?” మరో లేత పాస్టరు ప్రశ్నించాడు! “విశ్వ వ్యాప్తమైన దేవుడు సింహాలలో మాత్రం లేడని యెట్లు భావించగలం..?” అని తన మాటకు తనే మద్దతుగా మాట్లాడాడు ఆ పాస్టరు!

“కాదు.. కాదు! ‘దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక..’ అని ఎండిమాన్ అన్నాడు! ఆమాటను పరీక్షించి పరిశీలించండి! ‘దేవుడా నువ్వే గనుక వుంటే’ అంటే అని ప్రేయర్ చేయడం తప్పు! ‘నువ్వున్నావ్.. నన్ను తప్పక రక్షిస్తావ్..’ అనికదా ప్రార్థించాలి! ‘వుంటే’ అనడంలో ‘లేకుంటే’ అనే ధ్వని వున్నది! నాస్తిక ధ్వని వున్నది! యిది అపచారము! పైగా ‘నన్నేమీ చెయ్యబోవుగాక..!’ అని అనుటలో దైవాన్ని ఆదేశించడము అగుపించు చున్నది! పాపవాక్యం.. పరిశుద్ధమగుగాక..!” ఎండిమాన్ కు పోటీదారుగా వున్న మరో పాస్టరు యింకా మాట్లాడేవాడే-

“దేవుడు గొప్పో – సింహాలు గొప్పో తేలిపోతుంది’ అని దేవుడిని సింహాలను నీవు సమానం చేయడం దేవుడికి నచ్చలేదు..!” అని మరో నడివయసు పాస్టరు అంటే- “సింహాలకు కూడా నచ్చలేదు, అందుకే నీ పిరుదులు చీల్చాయి..!” అని మధ్య వయసు పాస్టరు మధ్యలో అన్నాడు! “దేవుడే సింహాలను ఆదేశించి ఆపని చేయించాడు..!” అన్నాడు యింకో పాస్టరు!

“అయితే సింహాలకు ఆ కార్యముతో సంబంధము లేదు.. అవి నిమిత్తమాత్రమైనవి..!” యింకో పాస్టరు అన్నాడు! ఎండిమాన్ కు శరీరం మీది గాయాల నొప్పి తగ్గింది! అంటే మనసులో నొప్పి తీవ్రమైంది! కంట నీరు పెట్టుకున్నాడు!

“నిన్ను రక్షించే అవకాశం నీవే దేవునికి యివ్వలేదు..! అక్కడే నీవు నిలిచి వున్నచో పరిగెత్తుకు వచ్చిన సింహాలు ప్రభువు చేత నిమరబడిన గొర్రిపిల్లలు అయ్యేవేమో..?! దేవుని ఆజ్ఞ లేకుండా సింహాలు నీ మీద దాడికి వచ్చునా? ఈ నిజవాక్యమును నీవు విస్మరించినావు..!” వణుకు తోనికే స్వరంతో అన్నాడు ముదర పాస్టరు!

“నీవాక్యముపట్ల నీకు నమ్మకము లేదు..! నీ నమ్మకముపై నీకు విశ్వాసము లేదు..!” ఎండిమాన్ కు పోటీదారుడైన పాస్టరు పలికాడు! “యిది మన పాస్టర్లను అవమానపరచడమే..!” అనికూడా అన్నాడు! అతని వాక్యము ఆప్తవాక్యమైనట్టు అందరూ మౌనం పాటించారు!

“అంతకంటే సింహాలకు ఆకలి తీర్చిన వాడవైతే.. నీ జీవితమూ చరితార్ధమయ్యేది..” పోటీ పాస్టరు మౌనాన్ని భగ్నం చేసాడు!

అవమానంతో తల తిప్పుకున్నాడు ఎండిమాన్! దేవుని పట్ల తన ప్రవర్తన అపచారంగా భావించి విచారంగా కన్నీళ్లు కార్చాడు ఎండిమాన్! కుమిలిపోయాడు!

కాసేపటికి తేరుకొని, కళ్ళు తుడుచుకొని “దేవుని శిక్షకు నేను అర్హుడని..!” వొప్పుకుంటున్నట్టుగా తనలో తాను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు. అని, “మరి దేవునికి అవకాశమీయక మీరెందుకు వెనక్కి పరిగెత్తుకు వెళ్ళి వేనెక్కినట్టు..?” తల యిటు తిప్పి అడిగాడు ఎండిమాన్!

అప్పటికే తోటి పాస్టర్లు అక్కడలేరు! అవతలికి నడిచి డాక్టర్లతో మాట్లాడుతున్నారు!

మధనపడ్డ ఎండిమాన్ మధించి మధించి అనుభవాన్ని శోధించాడు! సత్యాన్ని తెలుసుకున్నాడు! వొక సత్యవాక్య తీర్మానమూ చేసుకున్నాడు! “దేవుని విశ్వసించ వలెను! కాని ఆ విశ్వాసము నెగ్గుట కొరకు బరిలోకి దైవాన్ని దింపరాదు.. మనమూ దిగరాదు.. దిగినచో దేవుడు కూడా రక్షించలేడు..!” అని!

“దేవుడు దయామయుడు.. దయామయుడు అయినచో నన్ను యెందులకు రక్షించలేదు..? అలా రక్షించనిచో దేవుని వునికి యెటుల తెలియును..? దేవుని వునికి విస్తరింప జేయుటయే పాస్టర్ల ప్రాధమిక బాధ్యత కదా? ఆ బాధ్యతకు ప్రభువే ప్రతిబంధకంగా నిలుచుటలోని పరిహాసమేమి? అంతరార్దమేమి? నేను దైవం పక్షం వుండినాను, దైవము నాపక్షము యేల లేదు..? నేను రేపు దైవము అస్తిత్వాన్ని అందించిన జనులు అందుకుంటారా? మీ యెడల లేని దైవము మా యెడల యెటుల వుండును.. అని ప్రశ్నించిన యేమి కర్తవ్యము? మీ అస్తిత్వం లేకుండా నా అస్తిత్వం వుండునా? నా అస్తిత్వం లేకుండా మీ అస్తిత్వం వుండునా..?”

లెంపలేసుకున్నాడు ఎండిమాన్! దేవుని అస్తిత్వం.. తన అస్తిత్వం సమం చేసి ఆలోచిస్తున్ననా? అని మళ్ళీ భయం వేసింది! ఆలోచనలు ఆగడం లేదు.. తెగడం లేదు..

“నా మనసు పాప పంకిలమగుచున్నది.. అయినా పాపులను రక్షించుటకే కదా ప్రభువు పుట్టినాడు.. నన్ను రక్షించలేదు అంటే నేను పాపిని కాను! పరిశుద్దుడను! పరిశుద్దమే దైవము! అటులైన నేనే దైవము! దైవము వేరుగా లేదు! లేదు దైవమే లేదా?..”

మళ్ళీ లెంపలేసుకున్నాడు ఎండిమాన్! దైవాన్ని.. తన్ని సమం చేసి ఆలోచిస్తున్ననా? అని మళ్ళీ భయం వేసింది! ఆలోచనలు ఆగడం లేదు.. తెగడం లేదు..

“డాక్టర్..” పెద్దగా అరిచాడు ఎండిమాన్! భరించలేని తనం గొంతులో కనిపించింది! డాక్టర్లూ సిస్టర్లూ పాస్టర్లూ పరిగెత్తుకు వచ్చారు! ఏమయింది అన్నారు! తనని రక్షించమన్నాడు! ‘దేవుడు నిన్ను రక్షించుగాక’ పాస్టర్లు దీవించి ప్రార్ధించబోయారు! ‘దైవం నుండి రక్షించుగాక..’ అనుకున్నాడు ఎండిమాన్! ఆలోచనల్ని అదుపు చేసుకోలేకపోయాడు! పాప భయంతో మళ్ళీ లెంపలేసుకున్నాడు! భయంతో వణికాడు! ఆ భయం సింహాలు వెంటపడ్డప్పటి భయాన్ని మించిపోయింది!

ఎండిమాన్ చేష్టలన్నీ ప్రాయశ్చిత్తపు వుపసంహారంగా భావించారు పాస్టర్లు! నీవు పరిశుద్దుడవి అన్నారు! కాదన్నట్టు అడ్డంగా తలూపాడు ఎండిమాన్! దేవుడు మన్నించాడు అనుకున్నారు పాస్టర్లు! ఎండిమాన్ లో వొచ్చిన మార్పుకు మురిసిపోయారు!

విలవిలలాడిన ఎండిమాన్ యెటువంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతత కోసం మత్తు యింజక్షన్ యివ్వమన్నాడు! డాక్టరు చేతుల్ని పట్టి వదల్లేదు! దైవం కన్నా ప్రశాంతత, వుపశమనం వుంటుందా? తోటి పాస్టర్లు అనేసరికి తలయెత్తి దబా దబా వెనక్కి కొట్టుకున్నాడు! డాక్టర్లూ సిస్టర్లూ ఎండిమాన్ ఆపుతూ అతని తలని గట్టిగా పట్టుకున్నారు!

దైవ ప్రార్ధనలు చేసారు చుట్టూ చేరిన పాస్టర్లు!

 

మీ మాటలు

  1. శ్రీనివాసుడు says:

    ‘‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’’
    ‘‘నీవే తప్ప ఇతపరంబెఱుగ’’
    ‘‘నేను, నా ప్రయత్నం’’ అన్నది సంపూర్ణంగా విరమించిన వేయేళ్ళు మొసలితో పోరాడిన గజేంద్రుడు, దుశ్శాసనుడు చీర లాగుతుంటే అడ్డుకోడానికి తన ప్రయత్నాలన్నింటినీ ఆపి, చేతులెత్తి కృష్ణుని ప్రార్థించిన ద్రౌపది, ఈ శరీరం ఆయనదే గనక దీన్ని కత్తులతో నరికినా, విషం త్రాగించినా, కొండలపైనుండి త్రోసినా దీని రక్షణ బాధ్యత ఆయనదే అన్న ప్రహ్లాదుడు, తన కుమారుడైన శుకుడిని ‘‘పుత్రా, పుత్రా’’ అని పిలుస్తూ వెంటబడిన వ్యాసునికి ప్రకృతే ’’ఓయ్‘‘ అని సమాధానం చెప్పిన తీరు, ప్రాచ్య ననాతన సంప్రదాయంలో కొన్ని సారూప్య సందర్భాలని నా ఎఱుక.

  2. desaraju says:

    బావుంది

  3. “దేవుని విశ్వసించ వలెను! కాని ఆ విశ్వాసము నెగ్గుట కొరకు బరిలోకి దైవాన్ని దింపరాదు.. మనమూ దిగరాదు.. దిగినచో దేవుడు కూడా రక్షించలేడు..!” కదా నిండుగా బ్రంహాండమైన తర్కం. సరదాగా వుంది. సత్య సాక్షాత్కారం అయినట్టుగానే వుంది. హ హ హ. వెల్ డన్.

    • శ్రీనివాసుడు says:

      అలెక్ ఎన్‌డైవన్ కథనం అంతా పెద్ద బూటకం అని, పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో ప్రచురితమయిన ఫోటోలన్నీ నకిలీవని, ఎన్ డైవన్ సింహాలతో ఉన్న ఫోటోలన్నీ మరొక వ్యక్తివనీ **ఆఫ్రికా చెక్** అనే లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థ తేల్చింది.
      The picture is definitely a hoax. Africa Check used reverse image searching to establish that the man in the photo was South African “lion whisperer” Kevin Richardson.
      %%%%%%%%%%
      **ఆఫ్రికా చెక్** గురించి
      Africa Check is a non-profit organisation set up in 2012 to promote accuracy in public debate and the media in Africa. The goal of our work is to raise the quality of information available to society across the continent.
      As former UN Secretary General Kofi Annan says: “For democracies to function properly, for people to make informed decisions about their lives, the claims made in the public domain must be held up to scrutiny and their veracity checked openly and impartially.
      “I salute the work of Africa Check, as an important initiative engaging with journalists and citizens across the continent to raise the level of public debate.”
      %%%%%%%
      ఈ కథనం బూటకం అని నిరూపించిన వార్తాకథనాల లంకె
      http://www.timeslive.co.za/africa/2016/03/11/Picture-showing-Kruger-lion-fighting-Christian-prophet-is-a-hoax-AfricaCheck

    • శ్రీనివాసుడు says:

      నిజానికది తర్కం కాదండీ, బైబిల్ లో వున్న విషయాన్ని సరిగ్గా అర్థ చేసుకోలేకపోయాడు అలెక్ ఎన్ డైవన్.
      And he brought him to Jerusalem, and set him on a pinnacle of the temple, and said unto him, If thou be the Son of God, cast thyself down from hence: For it is written, He shall give his angels charge over thee, to keep thee: And in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone. And Jesus answering said unto him, It is said, Thou shalt not tempt the Lord thy God.
      Luke 4:9-12
      ‘‘************************
      The devil led him to Jerusalem and had him stand on the highest point of the temple. “If you are the Son of God,” he said, “throw yourself down from here. For it is written: “‘He will command his angels concerning you to guard you carefully; they will lift you up in their hands, so that you will not strike your foot against a stone.'”
      Jesus answered, “It is said: ‘Do not put the Lord your God to the test.'”
      Luke 4, somewhere about

  4. శ్రీనివాసుడు says:

    ఎన్‌డైవన్ కథనంపై పాశ్చాత్య మాధ్యమాల్లో వినిపించిన కొన్ని వినోద వ్యంగ్యాలు
    There was a story about a missionary in Africa who encountered a lion and he closed his eyes and prayed for deliverance. When he didn’t feel any teeth biting into him he opened his eyes and say the lion kneeling in prayer. **I’ve converted the lion ** he exclaimed.
    “Yes” replied the lion. “And now I say Grace before I eat”
    ****************************************************
    I am glad everyone kept their cool (well, aside from the lion fighting idiot) and the lion was not harmed.
    I am also thinking this would be an excellent way to keep our Zoos food bill down. Lions eat a lot of fresh meat.
    ****************************************************
    The lion only attacked because midway through, Alec started doubting Jesus and ran. Obviously.
    ****************************************************
    Lions are apparently atheists. Good to know.
    ****************************************************
    No cat is an atheist – it believes itself exists.
    And every cat is the center of the universe.
    The primary reason for that cats will never develop a system of religion is every cat thinks it is God. (Aham Brahmasmi)
    ****************************************************
    That lion obviously doesn’t believe in Jesus.
    They believe in dinner, if it’s name was Jesus that is of no consequence to them.
    ****************************************************
    Even if the lion suddenly became a believer… “For what we are about to receive, may we be truly grateful. In Jesus’ name, amen.”
    ****************************************************
    A few rational individuals commented about how christianity is bunk, then the armchair apologists come out – it wasn’t Jesus who led the “prophet” to chase a lion but Satan, of course.
    ****************************************************
    Had the Lion gave him a hug, we would be hearing about the “miracle” that happened. But since that didn’t happen, it wasn’t God, it was Satan. Don’t you love how FLEXIBLE the narrative is? Always changing to fit the situation.
    ****************************************************
    The lion only attacked because midway through, Alec started doubting Jesus and ran. Obviously.
    ****************************************************
    A good Christian would turn the other cheek.
    ****************************************************
    My god is stronger than your god – he’s lifted me to ORBIT and I’ve jump off his hand.
    ****************************************************
    There is only one way to settle this: A Pray-off
    ****************************************************
    “I do not know what came over me,” Ndiwane confessed. “I thought the Lord wanted to use me to show his power over animals. Is it not we were given dominion over all creatures of the earth.”
    We are animals! And the lions showed you who has the dominion. I would say sit down but he can’t.
    ****************************************************
    “I do not know what came over me,” Ndiwane confessed.
    Mental illness. A sane reasonable person would dare not to test the helpfulness of their god of choice.
    ****************************************************
    Between “God” and Mother Nature, Mother Nature always wins!
    ****************************************************
    I think this was part of God’s plan, except dude didn’t stick around to be fully eaten. After all, all creatures are God’s creatures and lions need to eat also.

  5. నిజానికది తర్కం కాదండీ, బైబిల్ లో వున్న విషయాన్ని సరిగ్గా అర్థ చేసుకోలేకపోయాడు అలెక్ ఎన్ డైవన్.—బాగు బాగు. ఎ విషయాన్నైనా ఒక్కోరూ ఒక్కోలా అర్ధం చేసుకుంటారు కాదా? వీటిలో ఇదే సరైనది అని ఎవరు తేల్చగలరు? మీరిచ్చిన విస్తృత సంమాచారం స్పష్టత ఇచ్చేవిధంగానే వుంది. కానీ భూమ్మీద ఇప్పుడైతే అలెక్ లే నిండా వున్నారు అని నా ఉద్దేశ్యం.

  6. శ్రీనివాసుడు says:

    ఎన్ డైవన్ ఈ బైబిల్ వాక్యాన్ని కూడా మరచిపోయి వుండవచ్చు.
    Isaiah 56:9 Come, wild animals of the field! Come, wild animals of the forest! Come and devour my people!
    Alec has apparently not read the New Living Translation which makes it pretty clear that we were not given dominion over all creatures of the earth.
    **********
    Iaiah 56:9
    New International Version
    Come, all you beasts of the field, come and devour, all you beasts of the forest!

    New Living Translation
    Come, wild animals of the field! Come, wild animals of the forest! Come and devour my people!

    English Standard Version
    All you beasts of the field, come to devour— all you beasts in the forest.

    New American Standard Bible
    All you beasts of the field, All you beasts in the forest, Come to eat.

    King James Bible
    All ye beasts of the field, come to devour, yea, all ye beasts in the forest.

    Holman Christian Standard Bible
    All you animals of the field and forest, come and eat!

    International Standard Version
    “All you wild animals, come and devour— even all of you wild animals.

    NET Bible
    All you wild animals in the fields, come and devour, all you wild animals in the forest!

    GOD’S WORD® Translation
    All you animals in the field, all you animals in the forest, come and eat.

    JPS Tanakh 1917
    All ye beasts of the field, come to devour, Yea, all ye beasts in the forest.

    New American Standard 1977
    All you beasts of the field,
    All you beasts in the forest,
    Come to eat.

    Jubilee Bible 2000
    All ye beasts of the field, all ye beasts of the forest; come to devour.

    King James 2000 Bible
    All you beasts of the field, come to devour, yea, all you beasts in the forest.

    American King James Version
    All you beasts of the field, come to devour, yes, all you beasts in the forest.

    American Standard Version
    All ye beasts of the field, come to devour, yea , all ye beasts in the forest.

    Douay-Rheims Bible
    All ye beasts of the field come to devour, all ye beasts of the forest.

    Darby Bible Translation
    All ye beasts of the field, come to devour, all ye beasts in the forest.

    English Revised Version
    All ye beasts of the field, come to devour, yea, all ye beasts in the forest.

    Webster’s Bible Translation
    All ye beasts of the field, come to devour, yes, all ye beasts in the forest.

    World English Bible
    All you animals of the field, come to devour, [yes], all you animals in the forest.

    Young’s Literal Translation
    Every beast of the field, Come to devour, every beast in the forest.
    *****************

  7. మను says:

    we were not given dominion over all creatures of the ఎర్త్—మనసుకి చాలా సంతోషం కలిగిందండీ

Leave a Reply to desaraju Cancel reply

*