హద్దుల్లేని అద్దమై …

 

 

చిత్రం: ప్రవీణా కొల్లి

పదాలు: ప్రసాద్ బోలిమేరు

~

 

నువ్వు విచ్చినప్పుడల్లా
గుండె  జ్ఞాపకాలనెందుకు స్రవిస్తుందో
నీ ఆత్మవికాసానికి తెలిసేవుందాలి
ఎవరికైనా రహస్య ప్రణాళిక ఎందుకుండాలి?
అక్షరమై
మనసుగంధాన్నిమోసుకెళ్ళాలనే
ఆరాటం తప్ప.

ముళ్ళపానుపు పై సైతం
స్వప్నసౌకుమార్యాన్ని నిర్మించుకొనే
నీ యోగనిద్ర
సప్తవర్ణాల రెక్కల్ని సాధించిన గొంగళిపురుగు
ఆరాటమే కదా .

అక్షరంలా
నువ్వు పుటలుపుటలుగా విప్పారేది
జీవన ప్రహేళికను పరిష్కరించటానికే కదా .

సుమమే అక్షరమై
అక్షరమే ఆరాటమై
ఆరాటమే అడివై
అడివే హద్దుల్లేని అద్దమై
విచ్చినప్పుడల్లా స్రవిస్తుంది — ఓ ఆశ .

మీ మాటలు

 1. Bhavani Phani says:

  ఎంత అద్భుతమైన వాక్యాలు . రియల్లీ వండర్ ఫుల్ . thank You

 2. Vijay Koganti says:

  అవును – ‘అక్షరమే’!

  చాలా బాగుంది

 3. “సుమమే అక్షరమై అక్షరమే ఆరాటమై ఆరాటమే అడివై అడివే హద్దుల్లేని అద్దమై విచ్చినప్పుడల్లా స్రవిస్తుంది — ఓ ఆశ ” బ్యూటిఫుల్ ఎమోషన్ carried ప్రసాద్ గారూ !! & ప్రవీణ గారు మీ ‘నిత్య మల్లి’ అద్భుతంగా విచ్చుకుంది :) :)

 4. Suparna mahi says:

  చాలా చాలా చక్కని భావన… అద్భుతంగా వుంది…

మీ మాటలు

*