ప్రపంచం బతికున్నంత కాలం

 

-నందిని సిధారెడ్డి

~

 

పడి ఉండడానికి
కాసులా?
పెంకాసులా?

అక్షరాలవి.
ఎగసిపడే మంటలు,
విరిగిపడే ఆకాశాలు.

మూసుకొమ్మంటే మూసుకోవడానికి
లాలి పాపా?
లాప్ టాపా?

కవి ప్రపంచ జీవనాడి.
ప్రకృతి లెక్క పలుకుతనే ఉంటడు,
పరిమళిస్తనే ఉంటడు.
నువ్వేమిటి?
డబ్బులు పోసి
మాటలు పోగేసి
గెలిచిన పార్లమెంటు సీటువు

జీవితం పణం పెట్టి
హృదయాలు గెలిచిన
ప్రపంచసభ నేను.

కవిని కాల్చగలవు
కవిత్వాన్ని కాల్చగలవా?

అధికారముందనేనా?
చట్టం చేయగలవనేనా?

చూపు జిగేల్ మనిపించే
మెరుపును శాసించు!
పువ్వు పరిమళం మోసుకెళ్ళే గాలిని
ఆపు జరసేపు!!

కలం మూయించగలవా?
ఎందరు నియంతలను చూసిందీ కలం,
జమాన జమానాల అఖండజ్వాల కలం.
ఫత్వాలకు వెరవని
నిరంతర స్వరం కవి.

నువ్వెంత?

అధికారం ‌‌—— ఎన్నుకున్నంత కాలం,
అక్షరం    —— ప్రపంచం బతికున్నంత కాలం.

*

మీ మాటలు

  1. మీ కవిత రాజకీయాలు మాట్లాడింది రాజకీయాలంటేనే భయపడి చస్తున్న కాలంలో
    రాజకీయాల గురించి మాట్లాడడం అంటే వర్తమానంలో బతకడం. నోస్టాల్జియా ఇప్పటి కవిత్వానికి కొత్త జబ్బు.

  2. సిధారెడ్డి గారు కవిత బాగుంది.కవి ఆవేదన కనిపించింది.

  3. dasari nagabhushanam says:

    రూపం మారనిది, మాసిపోనిది, మరణం లేనిది అక్షరం. కవికి ప్రాణం అక్షరం. సమాజ విశ్లేషణ రూపమాలిక అక్షరం. నందిని సిధారెడ్డి గారు తన అబిప్రాయాల కవితా రూపానికి అక్షరాల ద్వారా ప్రాణం పొసుకున్నారు. వారికి నా అభినందనలు

  4. Avari Ashok says:

    కవనం బాగుంది సర్ …!

  5. కూకట్ల తిరుపతి says:

    బాగుంది సర్

  6. *కవిని బంధించ వచ్చు..కవి ఆలోచనని బంధించ లేరు” లాంటిదే …’కవిని కాల్చవచ్చు..కవిత్వాన్ని కాల్చ గలవా?’ వ్యక్తీకరణ కూడా. ఇది అరిగిపోయిన ప్రయోగమే . అధికారం లేకపోయినా కట్టబెట్టే “కవులున్న” కాలం ఇది. ప్రభుత్వపు బంగారు సంకెళ్ళలో పరవశించి పొంగిపోతున్నఒక ‘కవి తరం’ రాజకీయ కవిత్వాన్ని కవిత్వ రాజకీయంగా మార్చి రాజ్యం చెంగు పట్టుకుని రాజ కీర్తనం చేస్తున్న విపరిణామం సందర్భ ఇది. ‘ఎన్నుకున్నంత వరకు’ అనేది ఒక రాజకీయ ప్రక్రియ.. అది సూడో ప్రజాస్వామ్యం అయినప్పటికీ. అధికారాన్ని దఖలు పరచుకుని రాజ్యం దమన నీతిని సాగించడం అదీ సోకాల్డ్ నయా కవి తరం స్వహస్త స్వరాలతోనే కావడం గర్హనీయం.

  7. Buchi reddy gangula says:

    అన్న– చాల లేట్. అయినా. నిజాలు. రాశారు
    2 Telugu రాష్ట్రాల రాజకీయాలు చూస్తే చాలు —రాజుల పాలన
    కనిపిస్తున్నాయి –మారింది. ఎక్కడ ???ఎంత?/

    యీ. రోజు. ప్రతి దొంగ వెధవ. జై తెలంగాణా పాట. పాడుతూ—
    మార్పులు– చేరిపోవడాలు—మల్లి గెలుపుకోసం —డబ్బు సంపాదన కోసం
    అవకాశవాదులు
    ఎన్నిగేయాలు రాసిన –మార్పు రాదూ –వ్యవస్థ లో
    మరొక. స్వాతంత్రా పోరాటం రావాలి –చేయాలి
    ———–
    బుచ్చి రెడ్డి గంగుల

  8. చాలా బావుంది

  9. V. SATHI REDDY says:

    ‘కవి ప్రపంచ జీవనాడి’..కొత్తగా, భిన్నంగా ఉంది కదూ .పార్లమెంటు సీటు మాత్రమే కాదు పంచాయతి సర్పంచి సీటు కూడా రాజకీయ మైనదే .కలాల్ని ఒకరు మూయించ నవసరం లేదిప్పుడు..కవులు తమకు తామే క్యాపులు బిగించుకుని స్వచ్చందంగా సమర్పించుకుంటున్న సందర్భం నడుస్తోందిప్పుడు ..

  10. Buchireddy gangula says:

    Excellent one
    రాతలతో ఏ. మార్పు రాదూ —
    విప్లవం
    పోరాటం
    తిరుగుబాటు —మన మాటలు–బాటలు కావాలి
    =======================

Leave a Reply to RAJANI Cancel reply

*