రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

 

-బొల్లోజు బాబా

~

 

ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు.  నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం.  ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం.  ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.

ప్రముఖ కవయిత్రి,  మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం.

అదీ ఈ కవితకు నేపథ్యం.

ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది.  ఆ ‘నువ్వు’  లో ‘నేను’  లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే. చివర్లో  నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.

 

*******

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు.  నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు.  పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పిటిషన్ పై  వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ చిట్టితల్లి UAPA  అంటే ఏమిటో తెలుసుకొంటుంది.  నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి,  లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి.  ఎవరూ మాట్లాడరు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు.  ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నిన్ను హెచ్చరిస్తారు.  నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు-  కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు.  నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు.  మాట్లాడకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది.  మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు

రేపు  ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు.  నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు.  ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.

 

నిశ్శబ్దమా వర్ధిల్లు!

 

 

మూలం: మీనా కందసామి ( The End of Tomorrow)     – తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

మీ మాటలు

  1. Suparna mahi says:

    చాలా చాలా చక్కని అనువాదం, గొప్ప పోయెమ్… ధన్యవాదాలు సర్…

  2. It is an ” Arresting ” Poem . ఇంతకంటే గొప్ప పోయెమ్స్ మన తెలుగులో ఇంతకు ముందు ఎన్నో వచ్చాయి . కాని ఇటీవలే ఇలాంటి పోయెమ్స్ రావడం లేదు. ఈ పొలిటికల్ థాట్ ఇప్పుడు పనికిమాలినదైంది కొందరికి. “ఆస్తిత్య” గొడవలకు “ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు. నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం” కాదు . దీన్ని తిరగేసి చదువుకోవడం ముఖ్యం . రాజ్య స్వరూపం తెలియని వాళ్లకి రాజ్య స్వభావమూ తెలియదు సరి కదా ఇక రాజ్య నైజం గురించెం తెలుస్తుంది ? ఏమైనా – బొల్లోజు బాబా ఒక మంచి పోయెమ్ ని అనువదించి అందించినందుకు ధన్యవాదాలు.

  3. సాయి.గోరంట్ల says:

    మంచి అనువాదం.
    ఈ కాలం పరిస్థితులపై,సమకాలీన పోకడలపై నిజమైన కవిత.
    ఎవరి మెడకు ఏ క్షణాన కనిపించని ముసుగులు తగిలిస్తారో,రాజ్యహింసను ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో రచయిత్రి చక్కగా తెలిపారు

  4. Buchireddy gangula says:

    నేడు. జరుగుతున్న తీరును చక్కగా చెప్పారు–Meena Garu.
    బాగుంది బాబా గారు
    ——————_————
    బుచ్చి రెడ్డి గంగుల

  5. ఇది సత్యం…ఇది తథ్యం…

  6. కె.కె. రామయ్య says:

    ప్రముఖ కవయిత్రి మీనా కందసామి కవిత ( The End of Tomorrow) ను ‘రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు’ గా అనువదించిన బొల్లోజు బాబా గారికి ధన్యవాదాలు.

    దేశ సంపదను కార్పోరేట్లకు దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజా ఉద్యమాన్ని సమర్థించినందుకు … నిర్వాసిత ఆదివాసీలు, దళితులు, శ్రామిక జనం పక్షాన నిలబడినందుకు కేరళ రాష్ట్రంలోని ఉద్యమకారుడు, బ్లాగర్‌ జైసన్‌ కూపర్‌, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది తుషార్‌ నిర్మల్‌ సారథి లను మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ ఊపా UAPA (Unlawful Activities Prevention Act) చట్టం కింద అక్రమ కేసులు బనాయింఛి జనవరి 29, 2015 లో అరెస్టు చేశారు

    ఇది మౌనం వీడాల్సిన సందర్భం. లేదంటే మార్టిన్‌ అన్నట్లు …చివరకు వాళ్లు నీ కోసం కూడా వస్తారు/ అప్పుడు నీ కోసం మాట్లాడ్డానికి ఎవరూ మిగిలి ఉండరు.

    http://lareviewofbooks.org/article/end-of-tomorrow/
    http://ajaath.blogspot.in/2015/03/blog-post.html

  7. ఎర్రబాబులకు మానవ హక్కుల బయ్యాలకు ఇసుంటి తవికలు నచ్చుతాయి.

  8. బ్రెయిన్ డెడ్ says:

    ఒరిజినల్ ఎంతబాగుందో , ఎంత నిజంగా సభ్యసమాజాన్ని ప్రశ్నిస్తుందో . ఇదుగో మీ మాటలు అంతే పవర్ఫుల్ గా ఉన్నాయి . కుడోస్ సర్

  9. Vadrevu China Veerabhadrudu says:

    చాలా బావుంది.

  10. అజిత్ కుమార్ says:

    భయభక్తులు కలిగివుండవలసిన అవసరాన్ని భయానకంగా చెప్పారు.

  11. ఎర్ర బాబులంటే బొర్రబాబులకీ బుర్రమీసాలకీ జడుపు ….”ఎరుపంటే కొందరికి భయం భయం….పసిపిల్లలు వారికన్నా నయం నయం”…. ANON కి కలిగిన దడ వల్లే కవిత తవికైంది….ఇక్కడే ఈ కవిత సక్సెస్ ఐంది.

  12. A K Prabhakar says:

    Good poem. True reflection of contemporary political scenario. It may be Dr. Kasim in Telangana , Prof. Saibaba in Delhi / Maharashtra UAPA or some other act is readily available for the Government backed by that corporate houses or MNCs…. It happens in Bastar , it happens in Jarkhand it happens from Kerala to Kashmir. And we are all mute spectators.Thy name is democracy.

  13. paresh n doshi says:

    చాలా బాగుంది

  14. కె.కె. రామయ్య says:

    ” In the name of patriotism, do not demand my complicity for your endless crimes. I want to secede from this sickness ” – Meena Kandasamy

    http://www.outlookindia.com/website/story/i-am-an-anti-nationalcount-me-out/29665

    ప్రముఖ కవయిత్రి మీనా కందసామి గారి కవితల బ్లాగుకి లింకు :
    https://meenakandasamy.wordpress.com/

  15. Mr Prabhakar..it is an open secrecy that now the State has become a corporate entity..But only we do not know or understand the role of modern State in the present society which is highly fragmented. It encourages the so called identity protest movements and suppress all the voices that rise against it..No one will come forward to rescue of the Dr. and the Prof. But lastly the so called Identitarians will have to face the situation that Mr Martin Niemoller (German) has expressed. More over “we’re known for a long time that it was no longer possible to overturn the world, nor reshape it, nor head off its dangerous headlong rush. There’s been only one possible resistance: to not take it seriously” -Milan Kundera (The Festival of Insignificance). This is the reality today. Now no one wants to fight with the State rather wants to become stooge of it because one can get the benefits from the State. So..it’s..

  16. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. It is a great poem in simple sentences, but drills heart and mind of the reader.
    All appreciation goes to Meena Kandasamy, a great poetess.

    KN Rau gaaru మీ ” దీన్ని తిరగేసి చదువుకోవడం ముఖ్యం ” అన్న వాక్యం ఎన్నోరకాలుగా ఆలోచింపచేస్తున్నది. థాంక్యూ సర్. for such a great perspective.

  17. బాబా గారూ.. మీనా గారి కవిత బాగుంది. అందులోని అంశాలు చాలా కాలం నుంచీ భయంకర వాస్తవాలు. వాటిని మీ అనువాదం ప్రతిభావంతంగా ప్రతిఫలించింది. అభినందనలు.

  18. Sivalakshmi says:

    “నిశ్శబ్దమా వర్ధిల్లు!” – మన స్పందనా రాహిత్యాన్ని గుర్తుకి తెచ్చి భయపెడుతోంది!!
    అవసరమైన సమయంలో సరైన పోయెమ్ అందించిన గారికి బొల్లోజు బాబా గారికి కృతజ్ఞతలు!
    ఇంత గొప్పగా స్పందించి రాసిన Meena కందసామి గారికి వందనాలు!

Leave a Reply to బ్రెయిన్ డెడ్ Cancel reply

*