తమకమూ + తాత్వికత = గాలి అద్దం!

 

-నిశీధి

~

కాలం కాసేపు కదలకుండా కవిత్వం అవ్వడం అంటే గాలి అద్దంలో మనల్ని చూసుకోవడం కాబోలు అనిపించేలా , ఎన్ని ఊహాలు  ఎన్ని ఊసులు .

చదువరికి ఒకో పేజి తిప్పుతున్నప్పుడు ఒకో పాదం గుండా పదాల సరిగమల్లో సాహితీకరణ చెందుతున్నప్పుడు ప్రతి అనుభూతి తనదే అనిపించాలి , భవిష్యత్తు వర్తమానం కన్నా కూడా ఎదో జ్ఞాపకాల వీచికలో బలంగా కొట్టుకుపోతున్న భావనలో కాసేపు నలిగి కరగాలి . అపుడది కవిత్వం అవుతుంది ఇంకా  సరిగ్గా చెప్పాలంటే  గాలి అద్దం అవుతుంది .

 

విప్పేసిన జ్ఞాపకాలనే

తిరిగి తిరిగి తొడుక్కుని

మరణ ప్రవాహంలో ఈదుతావు

నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో వింటూ తేలిపోతుంటావు

కవిత్వమేనా  ఇదంతా  కాదేమో ,కవి ఆత్మ కవితాత్మతో ముడిపడి సున్నితంగా గుండెకోత జరిపే క్షణాల అనుభవమేమో . నమ్మకం  కలగలేదా  అయితే

“ ఈ రాత్రినే

దాచిపెట్టు నేలవంకకి తెలియకుండా “

ఈ వాక్యంలో నిన్నోమారయిన పోగొట్టుకున్నావా నేస్తం ? లేదంటే  ఇలా చూడు

“పాడుబడ్డ పదాల పేద గూటిలో

పెంచుకున్న వాక్య పక్షి ఎగరదు

దిగంతాల దుఃఖమేది అందదు .

Hmmm కాసేపో  విషాదం కమ్ముకున్న మేఘంలో ఒంటరి ప్రయాణం .

 

సోషల్ మీడియాలో అక్కడక్కడా సత్యంగా  చెప్పుకోవాలంటే చాలా అరుదుగా  మెరిసే మెరుపులా చమక్కులా మాత్రమే ఎం ఎస్ నాయుడు గారు తెలిసిన నాలాంటి చదువరులు “ గాలి అద్దం”  పుస్తకాన్ని చేతుల్లోకి  తీసుకోగానే ముందు కవర్పేజీల  నలుపు తెలుపు రంగుల్లో రమణజీవి , శంకర్ పామర్తి గారి గీతలలో  మిస్టిక్ వాసనలకి మైమరిచిపోయి కాసేపలా ఆగిపోవడం  ఒక వంతయితే  పేజీలు తిప్పడం  మొదలు పెట్టగానే నెమ్మదిగా  మొదలయ్యే ఉద్వేగం , ప్రాణం ఎక్కడ ఆగుతుందో , కవిత యే జ్ఞాపకాల పరదాలు చీల్చుకొని  ఏ కణంలో సున్నితంగానే  అయినా  కస్సుమని దిగుతుందో  చెప్పడం  అంత  సులువేం కాదు .

నిజానికి  గాలి అద్దంలో ప్రతి కవిత  ఒక రోలర్ కోస్టర్ రైడ్గానే చెప్పుకోవాలి

మనసొక శోకవాయువు అని మొదలు పెట్టి ఇపుడైనా గెంతెయ్యాలి మనసు మట్టి మీద నుంచి అని రాసుకోగలిగే  కవులు  ఎంత మంది  ఉంటారు , ఆ కవితా సముద్రంలో కాసేపు ఉక్కిరిబిక్కిరికాకుండా మనం ఎలా  ఉండగలం .

టాగోర్ ఆరాధన నుండి భయటికి రావడానికి ఇష్టపడని సాహితీప్రియులు “ విసిరేసిన వక్షోజాలు జారుడుబల్లలో ఆగిపోయి కలలు కంటున్నాయి “ లాంటి వాక్యాలకి ఎంతగా ఉలిక్కి పడతారో తెలియదుగాని , ఈ పుస్తకంలో “ డాలీనందుకోలేక “ కవితలాంటివి అలాగే స్థలంకై స్తనంకై లాంటి టైటిల్స్ ,  ఎం ఎస్ గారి పదాల్లో బోల్డ్ నేచర్కి న్యూ ఏజ్ కవులు ఒక సలాం  కొట్టాల్సిందే . పుస్తకం మొదట్లో కంటే కూడా లోలోపలకి చేరేకొద్దీ కవితో పాటు రీడర్ తనలోకి తానూ చేసే ఏకాంత ప్రయాణమొక నిజ అనుభవం . కొన్ని క్షణాల స్టిల్  లైఫ్ . అందుకే అన్నది ప్రాణమెక్కడ  ఆగిందో  పదమెక్కడ గుచ్చుకుందో చెప్పడం అంత సులువేం కాదు .

Thomas Gray ప్రఖ్యాత వాక్యం చెప్పినట్లు Poetry is thought that breathe and words that burn అని సెగలు , శ్వాసలు , శ్వాసల సెగలలో సగం సగం కాలిపోయి నిలబడటం గాలి అద్దం స్పెషాలిటీ ఖచ్చితంగా . జీవితపు తమకానికి తాత్వికత అద్దితే అదే ఎం ఎస్ నాయుడి గారి గాలి అద్దం . సాహితీవ్రణాలకో అవసరమైన మలాం .

*

 

మీ మాటలు

  1. Suparna mahi says:

    థాంక్యూ మా… సో ఇంటరెస్టింగ్ రివ్యూ…
    నాయుడు గారికి అభినందనలు…

  2. కె.కె. రామయ్య says:

    ” జీవితపు తమకానికి తాత్వికత అద్దితే అదే ఎం.ఎస్. నాయుడి గారి ‘గాలి అద్దం’. నలుపు తెలుపు రంగుల మిస్టిక్ వాసనల కవరు పేజి ( రమణజీవి గారు వేసిన ) నుండి గాలి అద్దం కవితా సముద్రంలో ఉక్కిరిబిక్కిరవుతూ విషాద ఏకాంత ప్రయాణ మైమరిచిపోవటానికే “. గొప్ప అనుభూతితో కూడిన విశ్లేషణ చేసిన నిశీధి గారికి ధన్యవాదాలు.

    లొంగిపోగలమా

    లొంగిపోతాం కొన్ని మాటలకే
    మనకే తెలియని మనవే అయినా

    అవి

    చైత్రమాసపు కారు మబ్బుల్లోంచి వాలొచ్చు
    నిరాశాజనకమైన కిటికీలోంచి రావొచ్చు
    దాహార్తి నశించని ఆసుపత్రి గదుల్లోంచి వినవచ్చు
    నిర్లజ్జ ధుఃఖశరీరాల్లోంచి బైటపడొచ్చు
    పిల్లల కలవరింతల్లోంచి ఎగరొచ్చు
    అప్రియమైన శాంతివాక్యాల్లోంచి పాకొచ్చు
    ఏ ఆఖరి నిద్రో సమీపించే అసందర్భంలో దూరొచ్చు
    అన్ని అక్షరబంధనాల్నీ తిరస్కరించి చేరొచ్చు
    ఓ నిరాశ్రయుడి పలవరింతల్లోంచి తప్పిగెంతొచ్చు
    ఏదో ఒక నేత్ర రత్యానంతర జుగుప్సతో జారిపోవొచ్చు

    కొన్ని మాటలు మనకీ కనిపించవు
    ఇంకొన్ని మనల్ని ఉరితీస్తుంటాయి
    ఎల్లప్పుడూ

  3. కె.కె. రామయ్య says:

    ” నాకెంతో ఎంతో ఎంతో చెప్పలేనెంతో ఇష్టమైన అపురూపమైన కవి ఎం.ఎస్. నాయుడు గారి ‘గాలి అద్దం’ పుస్తకం పేజీలు తిప్పుతుంటే కవిత్వంపై మహాసాగరమంత ప్రేమ పుట్టుకొచ్చింది. గాలి అద్దం ఒక భావుకుని అంతరంగావిష్కరణ. ఈ వేసంగి ఉక్కపోతలో నాయుడిగాలి గాలి అద్దపు వట్టివేళ్ల నీడలో సేదదీరుతున్నా.. ~ పి. మోహన్ ( వోల్టైర్ కాండిడ్ ను అనువదించి మనకిచ్చిన పి. మోహన్ )

  4. కె.కె. రామయ్య says:

    వాడో అమూర్త, అసాంఘిక, అభావ కవి. ట్రిమ్ చేసిన గార్డెన్ లో అస్తవ్యస్తంగా అత్యంత సహజంగా పెరిగే మొక్కలు ఈ ఎం.ఎస్. నాయుడు లాంటి వాళ్లు. అసలు సిసలైన నిజమేవిటంటే భాషా విధ్వంసానికి పర్యాయపదం కదా నాయుడు ~ ” గాలి అద్దం ” కవితల పుస్తకానికి ప్రముఖ కవి, రచయిత కాశీభట్ల వేణుగోపాల్ గారి ఆప్తవాక్యం

    http://epaper.sakshi.com/775098/Andhra-Pradesh/11-04-2016#page/4/3

  5. Vilasagaram Ravinder says:

    సింపుల్, స్వీట్ నిశీది గారు

  6. “గాలి అద్దం” నిశీధి గారి కవిత చాలా అద్భుతంగా ఉంది!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Leave a Reply to ఏ. యస్వీ. రమణారావు. Cancel reply

*