చెప్పొద్దులే..!

 

-సాంత్వన చీమలమర్రి

~

ఉహూ నువ్వయ్యుండవులే. ఎర్రటి సాయంకాలాల్ని చల్లార్చే ఆ పొడుగాటి నీడల్లో యేదీ నీది కాదని నచ్చజెప్పుకునే అవసరం పడట్లేదిప్పుడు.

చెవులు రిక్కించటమూ మానేశాను… కొమ్మలు రాసుకున్న అరక్షణం తర్వాత నీ ఇంకొక పాదం చేసే శబ్దం కోసం.

సెలయేరు మోగని చీకటికి అలవాటుపడి బూడిదరంగులో బాగానే ఉంది ఇప్పుడంతా. ఆ మలుపు చివర్నించి ఎగిరొస్తూ ఓ నారింజ జలతారు రెక్కల పక్షి ఎదురైతే అది నువ్వెందుకవుతావూ?

ఒక మాట చెప్పెయ్యనా? వయోలా తీగల్లోంచి వగరు తేనె తెచ్చి, నీ టీకప్పులో కలిపేసి, పొద్దుటికి పారబోస్తూనే ఉంటాను ఇంకా.

నీ పాటనొకదాన్ని సన్నగా చుట్టేసి, అప్పుడు వాడిపోయిన కొన్ని పూలతో కలిపి వాసన చూసుకోవటమూ మానలేకపోయా. ప్రశ్నలు గుచ్చి తెస్తే తెంపేశావుగా. యే పాటో గుర్తుందా అని ఎలా అడగటం?

అడవిలో దారి తప్పి ఎడారిలోకొచ్చి పడ్డాను. ఇపుడక్కడ యే ఋతువో చెప్పొద్దులే నాకు.

నా గాజుపూసలు మాత్రం మొక్కలయ్యాయో లేదో నీ రెక్కల్లో గాలినడిగి ఏం చెప్తుందో వినకుండానే వెళ్ళిపోతానిప్పటికి.

*

మీ మాటలు

  1. ఈ చిట్టి సీతాకోకచిలుక ‘కవిత్వం’లోకి రెక్కలు విప్పుకోవడం చూస్తుంటే చెప్పలేని ఆనందానికి లోనవుతున్నాను!! రాబోయే కాలానికి నువ్వద్దబోయే రంగులు అద్భుతంగా ఊహించుకుంటున్నాను సంతూ !! సూపర్బ్ ఫీల్ ఇన్ పోయం…

  2. Suparna mahi says:

    ఎంత చక్కని పదాలయ్యాయీ ఎదురుచూపులు… అద్భుతం…
    చాలా చాలా బావుందమ్మా…

    • Santwana says:

      ధన్యవాదాలండీ! మీ స్పందన తెలిపినందుకు ఎంతో సంతోషం! :)

  3. చాల బాగుంది…..అభినందనలు

  4. Bhavani Phani says:

    ప్రతీ వాక్యమూ ఎంతో సౌందర్యభరితంగా ఉంది . అద్భుతమైన భావ ప్రకటన . రియల్లీ వండర్ఫుల్

  5. వనం వేంకట వరప్రసాదరావు says:

    బాగుంది.. కొద్దిగా రొమాంటిక్ గా.. కొద్దిగా ‘మిస్టిక్’గా.. కొంత విరహంగా..ఏదో దాహంగా.. కొత్త విస్మ్రుతిలా..కొంత స్మృతిలా! వాక్యాలను పొట్టిగా చేయకూడదూ, చదువుతున్న కొసనుండి ఆనందం కచ్చితంగా పెరుగుతుంది!
    శుభాకాంక్షలు!

  6. Venkat Suresh says:

    వరప్రసాద్ రావు సర్ చెప్పినట్లు … కొద్దిగా రొమాంటిక్ గా, కొద్దిగా మిస్టిక్ గా …ఏదో దాహంగా …. అద్బుతం!!

  7. నైస్

  8. K SIVANAGESWARARAO says:

    GOOD

  9. “Nee inkoka paadam chese sabdham”.. Modati paadam chese sabdham vina padindi..Thank you.

  10. కె.కె. రామయ్య says:

    కవిత చాలా బాగుంది….అభినందనలు సాంత్వన గారు. ( ‘త్రిపుర కధలు’ పుస్తకం చదువుతానన్నారు గుర్తుందా అని ఎలా అడగటం? )

    http://kinige.com/book/tripura+kathalu+print+బుక్
    http://www.telugubooks.in/products/thripura-kathalu

    • Santwana says:

      ధన్యవాదాలు సర్! గుర్తుంది.. తప్పక చదువుతాను.. :) లింకులు అందించినందుకు కృతఙ్ఞతలు.

  11. సో బ్యూటీఫుల్..

  12. బాగున్నదమ్మా!కానీ ఏదైనా మితి మించనీయకండి. మీ కవిత చక్కని సౌందర్యభరితమైన భావుకత తో కూడి పద ప్రయోగమమున్న కవిత.కానీ దానికి మించి దానిని మనలో అనుభవించగల్గేట్లు చేసే కవిత ఇంకా ఎక్కువగా హృదయంలో స్ధిరపడిపోతుంది…

Leave a Reply to Santwana Cancel reply

*