వెతకాలి

 

 

చిత్రం: ప్రవీణ కొల్లి

పదాలు: బాల సుధాకర్ మౌళి 

~

ఎక్కడో

ఏ మూలనో ప్రవహిస్తున్న నిశ్శబ్దనదిలా

ఆకాశం

 

ఎక్కడో ఏ మూలనో

నెమ్మదిగా కదులుతున్న అలలా ఊరు

 

ఊర్లో ఇళ్లగుమ్మాల మీద

యింత వెలుతురును పరిచే దయామూర్తిలా సూర్యుడు
మా వూరు గుర్తుకొస్తుంది

రెక్కలు కట్టుకుని ఎగిరిన బాల్యం గుర్తుకొస్తుంది
బాల్యం కొమ్మకు వేళ్లాడి

ఎక్కడో పోగొట్టుకున్న పిచుక గూడు కళ్లల్లో కదలాడుతుంది

 

ఈ వూళ్లోనైనా దొరుకుతుందేమో-

వెతకాలి

నిర్మలంగా పసికూనలా వున్న ఈ వూరిని

దేహమ్మీద వేసుకుని జోకొట్టాలి
తూనీగలా

సందు సందూ వూపిరి ఆగేట్టు తిరగాలి
మా వూరిని

మళ్లొక్కసారి దేహం దేహమంతా ధరించాలి నేను –

మా వూరు అవ్వాలి

*

మీ మాటలు

 1. “నిర్మలంగా పసికూనలా వున్న ఈ వూరిని దేహమ్మీద వేసుకుని జోకొట్టాలి తూనీగలా ” చాలా బావున్నాయి పొద్దుటి జ్ఞాపకాలు !! ప్రవీణ గారూ – నిశ్శబ్దనదిలాగానే ఉంది మీ pic ఈ వారం :) బ్యూటిఫుల్ !

 2. balasudhakarmouli says:

  మా వూరు కనిపించింది…

  • ఏ మూలనో ప్రవహిస్తున్న నిశ్శబ్దనదిలా ఆకాశం… బ్యూటిఫుల్.
   ఆకాశంలో వూరు, ఆ ఊరితో పెనవేసుకున్న బాల్యం కనిపిస్తున్నాయి అనే భావన ఇంకా బాగుంది.

 3. mithil kumar says:

  నిశ్శబ్దనదిలా ఆకాశం
  ….ఊరు మీ పదాల్లో ఊటలూరుతుంది మౌళి గారు…ప్రవిణ్ గారు ఆసమ్

 4. Mamata Vegunta Singh says:

  ప్రవీణ, మౌళి గారు, మీ జుగల్బంది చాల బాగుంది ! మమత

Leave a Reply to Mamata Vegunta Singh Cancel reply

*