నను చూడలేని దృశ్యాలేవో నాలో..

 

 

-పఠాన్ మస్తాన్ ఖాన్

~
1.
మండే దీపపు మెత్తని శబ్దంలో
సరసర పాకి పారిపోతున్న సన్నని చీకట్లో
వర్ణాలు వర్షించే రంగుల సవ్వడిలో
రెపరెపలాడే పచ్చని ఆకుల కదలికల్లో
సూర్యతాపం మండుతున్న
వర్ణ రహిత దారిలో …
గబ్బిలపు వింత చర్మపువాపు నేనై…

 

2.
మట్టి పాత్ర నింపుకున్న శూన్యంలో
యింపైన ఆత్మీయ అనుంగత్వంలో
చివరి వరకూ చూసీ తరచిన నృత్తంలో
లోహ నిర్వహణపు నిర్మాణంలో
ముందే ముదుసలౌతున్న గతిలో
జలచుక్కల మబ్బు కణాల
కణతులను తరుముకుంటూ…నేను

 

3.
కఠిన శీతల గోళమేదో
నన్ను కరిగించలేక
అనాత్మిక అంకెలా
ముంపుడు కంచెలలో
ఝంఝాటపు వుచ్చులలో
యే క్రిమియో లోలోనే
తొలిచేసే గుజ్జును …నేనై

 

4.
విసర్జించిన అమలిన జ్ఞానం
ముక్తించలేని సంతోష వదనం
నిర్మోహించే దుఃఖ పటాలాలు
స్వేదజలంలోని యెరుపు ఘాఢత
దహనమూ ఖననమూ కాలేనంత
నిగుడుతనమేదో శిల్పతోరణమై
నెత్తిన మోయలేనంత బరువును మోస్తూ..

 

5.
యిక్కడా…. యెప్పుడూ…
నీలో కురవని తారజువ్వలేవో
కురిపించే వెలుగుల లిపులను లిఖించలేక
పరుగెడుతూ పరుగెడుతూనే
గ్రహాంతరయానంలోకి యెగిరి
వలస వెళుతూ వుంటానూ   ..

*

మీ మాటలు

  1. Suparna mahi says:

    వాహ్… అద్భుతం…
    దీపపు మెత్తని శభ్దమ్ లో…
    జల చుక్కల మబ్బు కణాల కణతులు…
    స్వేదజలం లోని ఎరుపు ఘాడత…
    కురిపించే వెలుగుల లిపులను లిఖించలేక… ఎంత అద్భుతమైన కవితా వాక్యాలూ…హృదయాల్ని తాకే పదాలూ.. టూ గుడ్…
    ఇంత చక్కని పోయెమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నయ్యా… 💚…

  2. సాయి.గోరంట్ల says:

    వావ్…ఓ అవ్యక్తానుభూతినిచ్చే కవిత.
    అంతరంగాన్ని ఆవిష్కరించినట్లు ఓ చక్కని పరిమళం పంచిన కవిత తమ్ముడూ..
    త్యాంక్యూ సారంగ ఎడిటోరియల్ టీం.
    కోత్త వారిని ప్రోత్సహించడం
    నైపుణ్యాన్న్ వెలికి తీయడంలో సారంగ క్రుషి ఎనలేనిది.
    ఉన్నతమైన సాహితీవిలువల కోసం సారంగ పడే తపనకు నా ధన్యవాదాలు

  3. Bhavani Phani says:

    పరుగెడుతూ పరుగెడుతూనే
    గ్రహాంతరయానంలోకి యెగిరి
    వలస వెళుతూ వుంటానూ ..అద్భుతమైన కవిత . ధన్యవాదాలు

  4. lasya priya says:

    చాలా బాగుంది సర్ …అద్భుతమైన పదాల మేళవింపుతో ..సూపర్బ్

  5. patan masthan khan says:

    ధన్యవాదాలూ మీ అభినందనలకు …మహీ, సాయి అన్న , లాస్యలకు …

  6. patan masthan khan says:

    భవానీ ఫణి గారీకీ కృతజ్ఞతలూ

  7. mithil kumar says:

    అధ్బుతమైన ఫీల్ లో నెమ్మదిగా ప్రవహింప జేసారు ….వండర్ఫుల్ స్టాంజాస్ పటాన్ భయ్య

  8. syed sabir hussain says:

    మంచి కవిత…కవి మిత్రుడికి అబినందనలు…

Leave a Reply to mithil kumar Cancel reply

*