కవిత పూర్తికాలేదు

 

-సుపర్ణ మహి
~

 
చలిగాలేదో పేరు పెట్టి
మరీ పిలిచినట్లనిపించింది…
 

రాస్తున్న పుస్తకంలోంచి
తల వాగువైఫుకు తిప్పి చూసాను…
కొలనులో స్నానిస్తున్న చందమామ
అప్పటికే నావైపు చూస్తుండటం కనిపించింది…
 

ఏరోజున ఏం పోగొట్టుకున్నాయో
పగళ్ళంతా వొదిలేసి ఈ మిణుగురులు రోజూ రాత్రిలో వెతుకుతుంటాయి
 

పొద్దున్న కనిపించిన సీతాకోకచిలుక
ఇప్పుడెక్కడుందో,
ఉదయం సరిగా గమనించలేదు
ఇప్పుడు మళ్ళీ వొస్తే బావుండనిపిస్తుంది
 

దూరంగా ఎక్కడనుంచో విన్నపాటే,
అవును బాగా తెల్సిన పాటే,
 

కాసేపు కొలను దగ్గర్నుంచి నన్ను మాయంచేసింది
 

అదెంత చక్కని పాటో!
‘కాలం’ ఓ పేరు చెప్పని ప్రేయసి,
అనుభవం మిగల్చని అనుభూతి
 

ఆలోచిస్తుండగానే బాగా చీకటి ముసిరేసింది.
ప్చ్…
ఇవ్వాళ కూడా
 
కవిత పూర్తికాలేదు.*

మీ మాటలు

  1. Shrutha keerthi says:

    Beautiful poem

  2. సాయి.గోరంట్ల says:

    ‘కాలం’ఓ పేరు చెప్పని ప్రేయసి
    అనుభవం మిగల్చని అనుభూతి….వండ్రఫుల్ ఫీల్..కదూ మహీ..
    కాలం మిగిల్చే జ్ఞాపకాలను నీ కవితలో వోదిగించి ఇంకా పూర్తవలేదనటం..ఇంకా ఎన్నింటి కోసమో వేచియుండడమనే భావన…
    గుడ్ రైటప్..కీపిటప్👌👌

  3. srinivas sathiraju says:

    థాంక్స్ మహి కవితా విలువల ఇంకా బ్రతికున్నాయి అందుకు యువతర ప్రతినిధి గా నువ్వు నాకిచ్చిన మాటను అంతగా నమ్మలేదు కానీ ఇది చదివాకా నాకు చక్కటి అనుభూతి కలిగింది. కాకినాడలో నా చేతులతో నేను పెంచిన మామిడి చెట్టు కొమ్మలలో మాఘ మాసపు కోయిల కో అన్నట్టుగా ఉంది ఎటో వెళ్ళిపోయింది మనసు. నీ కవిత పరచురించడము ద్వారా ఈ సారంగ తన విలువ పెంచుకుంది

    • Suparna mahi says:

      ధన్యవాదాలు సర్…
      నాలాంటి అతి సామాన్యులందరికో ఓ గుర్తింపునిచ్చిన గొప్పదనం సారంగ వారిది…

  4. వావ్. చాలా బావుంది

  5. mithil kumar says:

    …సూథింగ్ పొయెం అన్న …

    కాలం పేరు చెప్పని ప్రేయసి
    నీ కలం కాలానికి నివాసి

  6. Venkat Tanga says:

    చాలా బావుంది రా మహి .. ఇది నీ రచనా భవిష్యత్తు కి తొలి రోజులని అనిపిస్తుందిరా .. మరెంతో ఎదగాలని మనస్పూర్తిగ కోరుకుంటూ .. నీ ..

    వెంకట్.. :)

  7. Venkat Tanga says:

    అచ్చు తప్పు .. “రచనా భవిష్యత్తు గుర్తింపుకి తొలిమెట్లు” . నీ రచనా తొలిమెట్లు మన చిన్నప్పటి కొబ్బరిబిల్లలు తినె రొజుల్లొనే ఎక్కేసావ్ కదరా…నువ్వు మరెంతొ ఎదగాలిరా .. 💐😊

  8. ‘దూరంగా ఎక్కడనుంచో విన్నపాటే,
    అవును బాగా తెల్సిన పాటే,
    కాసేపు కొలను దగ్గర్నుంచి నన్ను మాయంచేసింది” ఇలా ఎలా చెప్పగిలిగావు మహీ.ఎంత బాగుందో..

  9. “దూరంగా ఎక్కడనుంచో విన్నపాటే,
    అవును బాగా తెల్సిన పాటే,
    కాసేపు కొలను దగ్గర్నుంచి నన్ను మాయంచేసింది” ఇలా ఎలా చెప్పగలిగావు మహీ..ఎంత బాగుందో

  10. Vijay Koganti says:

    The poem leaves a serene feeling. Congrats Mahi.

  11. వనజ తాతినేని says:

    ఈ కవిత పూర్తీ కాకూడదు. జీవితకాలం వ్రాస్తూనే ఉండాలి . అభినందనలు మహీ !

  12. Bhavani Phani says:

    ఎంత మంచి కవిత! మీలా ఆలోచించడం మరెవరికీ సాధ్యం కాదేమో. ఓకొత్త ఆనందపు అనుభూతినిచ్చే కవిత్వాన్ని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. సారంగలో మరో సారి మెరిసినందుకు అభినందనలు

  13. సురేష్ రావి says:

    ప్రతీ వాక్యం వెంటాడేలా ఉంది మహి. అద్భుతమైన భావన. కీప్ రైటింగ్.

  14. paresh n doshi says:

    పగళ్ళంతా వొదిలేసి ఈ మిణుగురులు రోజూ రాత్రిలో వెతుకుతుంటాయి

    ఆ వెతుకులాటలొనే ఇట్లాంటి మంచి కవితలు దొరుకుతాయి.

    బాగుందండి

  15. bhanuprakash says:

    పూర్తికాని కవిత అని చెప్పి ఎంత అందంగా పూరించావో ………… దొరికి దొరకని అనుభూతుల్ని నీ కవితలో మాకు దొరికిన్చావ్

  16. చలిగాలి పిలిచింది .పక్కకి తిరిగి చూసావు…కొలను లో స్నానిస్తున్న చందమామ.మిణుగురులు రాత్రిళ్ళు పోగొట్టుకున్నదాన్ని వెతుక్కుంటున్నాయి పగలేంచేస్తున్నాయో మనకి తెలియదనుకో…ప్రొద్దున కనిపించిన సీతాకోకచిలక ఇపుడు కనిపిస్తే బాగుండు…కానీ ఎక్కడనుంచో ఎపుడో విన్న పాటే ఆ నిశ్శబ్దంలో నీ ఆత్మ గానం వింటూ….కొలను ..పరిసరాలను నీవు వదిలినా మహీ….మేము అక్కడక్కడే సీతాకోకచిలుకలై తిరుగుతున్నాము….ఆ రాసే కవిత పూర్తి కాకపోతేనేం? ఈ కొలను గీతం…ఆత్మగానం చాలకేమీ!! సారంగ ఆకాశానికి హృదయపూర్వక ధన్యవాదములు…బంగరు వెలుగుల రువ్వే చిన్ని నక్షత్రానికి మొదట జన్మ నిచ్చినందుకు…..ఆ వెలుగులు విరజిమ్మనిచ్చినందుకు

    • Suparnamahi says:

      చాలా చాలా సంతోషం మా… 🌼🌻🌼🌻🌼🌻🌼🌻
      అవును మీ ద్వారా సారంగ వారికి నేనిక్కడ ధన్యవాదాలు తెలుపు కుంటున్నానమ్మా…

  17. Ivaturi Balatripurasundari says:

    చాలా బాగుంది మీ కవిత ..మరి కొన్ని మా కోసం. .

  18. Ivaturi Balatripurasundari says:

    చాలా బాగుంది ..మీ కవిత ..మరి కొన్ని మా కోసం

  19. ఏరోజున ఏం పోగొట్టుకున్నాయో
    పగళ్ళంతా వొదిలేసి ఈ మిణుగురులు రోజూ రాత్రిలో వెతుకుతుంటాయి

    చూడగానే ఆకట్టుకుని వెంటాడుతుంది ఈ expression.

  20. lasya priya says:

    ఈ కవిత పూర్తి కాదు …అద్భుతం ప్రతి పదం వొదిగిపోయింది …సూపర్ మహి గారు

  21. వాసుదేవ్ says:

    అసలు నిజంగా పూర్తికాకపోవడమే మీ అక్షర దాహార్తికి నిదర్శనం. ఐనా కవిత్వమెక్కడ ఆగుతుందని? ఇంతవరకూ కవిత్వవాక్యాల్లో భావజాలాన్నే ఎక్కించడమే చూసాను. కానీ మీ కవిత్వవాక్యాల్లో ఓ ‘మహి’ మాన్వితమైన రక్తాన్ని ఎక్కించి మరీ జీవంపోసి ఆధునిక కవిత్వంపట్ల పాఠకులు తమ అభిప్రాయాల్ని మార్చుకోవాలేమో అన్నంత పని చేసారు. అభినందనలు మహీ

    • Suparna mahi says:

      సర్… మీ ప్రేమతో నాకు మాటలు లేకుండా మనసంతా ఓ ఆనందాన్ని నింపేసారు… ధన్యవాదాలు…🌼💚🌼

    • ధనుంజయ మూర్తి ఎం.కే. says:

      మీ ప్రత్యక్షరమూ నిజం. ఇజం లేని కవిత్వాన్ని, ఈ యువ కవి లో నేనూ అనుభూతి చెందాను సర్.

      • ధనుంజయ మూర్తి ఎం.కే. says:

        సారీ, ఇక్కడ తొందరలో ఒక పొరపాటు దొర్లింది. ఇజం లేని కాదు, ఇజాలకు అతీతమైన కవిత్వాన్ని అని నా భావం.

  22. Raju kotapati says:

    అద్భుతం సోదరా

  23. patan masthan khan says:

    మహీ ప్రకృతి సానిధ్యంలో మనల్నీ మనం కరిగి పోవాలీ…మనల్నీ ఆకర్షించని ఆకర్షించినా వాటిపట్లా కృతజ్ఞతలూ ప్రకతిన్చుకోవాలీ ఇలా మహీలా…చూసినా వారే రాయగాలా వచనమిదీ ….ఇది అనుభూతీ కాదు…నిత్యం మనలో జరుగుతున్నా సుందరయ వీక్షణా దీనినీ ఎప్పుడూ దర్శిం చు కో వచ్చు ….అప్పుడే పూర్తి అయిందీ ….ఇంకా ఉంటె బాఉండూ ……అనిపించిందీ…అచ్చు తప్పులు ఉన్నాఈ …నా commentlo ….

  24. Suparna mahi says:

    ధన్యవాదాలు అన్నయ్యా…
    🌼💚🌼..

  25. m s naidu says:

    సుపర్ణ గారు, ‘అనుభవం మిగల్చని అనుభూతి’ది.

  26. చాలా బాగుంది. Nice expression.

  27. syed sabir hussain says:

    సీతాకోక చిలుక మల్లి కనిపిస్తే బాగుండు….నిన్నటి పాట ….మహి గారు..ఎక్కడికో తీసుకెళ్ళారు…ఇలాంటి కవితలు మనసును ఉల్లాసపరుస్తాయి.ఎండలో తిరిగోచినాక గుడిసెలో కూర్చొని చల్లటి నీళ్ళు తగినట్లున్తుంది.మీ కవితలు…ఇంకా రావాలి..రాయాలి…

    • Suparna mahi says:

      చాలా చాలా సంతోషం సర్… 😊…
      ధన్యవాదాలు…🌼🌻🌼

Leave a Reply to సురేష్ రావి Cancel reply

*