అంబేద్కర్‌ విగ్రహానికి వాస్తు పరిశీలన!

 

 

-జి ఎస్‌ రామ్మోహన్‌

~

 

అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వ వాస్తు సలహాదారు స్థల పరిశీలన చేస్తున్న చిత్రం పత్రికల్లో వచ్చింది. వాస్తు హిందూ మతానికున్న అనేక అంగాల్లో ఒకటి. అందులో కూడా మూర్ఖత్వానికి పరాకాష్ట అనదగిన ఆచారం. అంబేద్కర్‌ హిందూ మత ఆచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వాడు. అది మతం కాదు, వ్యాధి అని చెప్పినవాడు. ఎవరికి పట్టింది ఈ విషాదం?

రెండు రాష్ట్రాల్లోనూ పోటాపోటీగా అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అంబేద్కర్‌ని విగ్రహమాత్రుడిని  చేసి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం బలంగా జరుగుతున్నది. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం కన్నా హైస్కూల్‌నుంచి  పీజీదాకా కులనిర్మూలనను పాఠ్యాంశంగా చేరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. విగ్రహాల వల్ల కూడా చైతన్యం వచ్చిన దశ ఉండింది. మనం ఇపుడా దశ దాటాం.

అంతకంటే ముందుకు వెళ్లాలంటే ఆయన రచనలను జనంలోకి తీసికెళ్లడం ముఖ్యం. ఆయన పేరు ప్రచారమైనంతగా ఆయన రచనలు ప్రచారం కాలేదు. కనీసం కులనిర్మూలన అయినా జనంలోకి తీసికెళ్లడం ఇవాల్టి అవసరం. అంబేద్కర్‌ ఏ ఆధునిక మానవీయ విలువల కోసం తపన పడ్డాడో ఆ విలువలకు బద్ద శత్రువైన మనిషిని ఆంధ్రప్రభుత్వం  సలహాదారుగా నియమించుకుంది. భర్త లోదుస్తులు భార్య ఉతికితేనే ఐశ్వర్యం ఆరోగ్యం, తానే ఉతుక్కుంటే దరిద్రం అని ప్రవచించిన భయానకమైన అనాగరికుడిని అక్కడ సలహాదారుగా నియమించి ఉన్నారు. రెండు రాష్ర్టాల్లోనూ రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ ప్రవచించిన ఆధునిక విలువలను అపహాస్యం చేసే పనులు అనేకం సాగుతున్నాయి.

samvedana logo copy(1)

రాజుగారి ఆస్థానాలు, అందులో సలహాదారులు, పురోహితులకు సత్కార సన్మానాలు చాలా ఎన్టీఆర్‌ సినిమాల్లో చూసి ఉన్నాం. ఆ ఎన్టీఆర్‌కు ఒకనాడు వీరాభిమానిగా ఉన్న చంద్రశేఖరుల వారు, అల్లుడు అయినటువంటి చంద్రబాబునాయుడుగారు  తమని తాము రాజులుగానే భావించుకున్నట్టు అర్థమవుతున్నది. తాము ఆధునిక సెక్యులర్‌ సోషలిస్ట్‌ ప్రజాస్వామ్య రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులం అనే సోయి ఉన్నట్టు కనిపించడం లేదు. పట్టాభిషేకం జరిగ్గానే తెలంగాణకు ఒక తిరుమల, ఆంధ్రకు ఒక భద్రాచలం అవసరం అని తీర్మానించేసుకున్నారు. విభజన జరగ్గానే వారికి కనిపించిన ప్రధాన లోటు అది. యాదాద్రి ఒంటిమిట్టలు ఆగమేఘాల మీద ముందుకు తోసుకొచ్చాయి.

యాదగిరి గుట్ట అనే అందమైన తెలుగుపేరు సంస్కృతంలోకి మళ్లి యాదాద్రి అయిపోయింది. వందలకోట్ల ఖర్చుతో ప్రణాళికలు సిద్ధమైపోయాయి. వైష్ణవ పండితులకు రెక్కలొచ్చాయి.  రాజసూయ యాగాలను మించిన యాగాలు మొదలయ్యాయి. మనిషి పొడ తగిలితేనే మలినమైపోయినట్టు మొకం పెట్టే ఒక వైష్ణవ సోములోరు, పాదం మోపడానికి లక్షల్లో ప్రసాదం స్వీకరించే సోములోరు రాజగురువుగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖరుల వారు పదే పదే ఆయన పాదాలపై పడి ప్రణమిల్లడం విమానాల్లో వినయంగా తిప్పుతూ ఆయన సలహాల మేరకు వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. దీన్ని మించి ఐదుకోట్ల రూపాయలతో తిరుమలకు కానుకలు సమర్పించేందుకు  ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అది సొంత సొమ్ము కాదు. ప్రభుత్వ ఖజానా. అంటే ప్రజల సొమ్ము.  ప్రజల్లో విశ్వాసులు ఉంటారు. అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసుల్లో కూడా రకరకాల విశ్వాసాలు ఉన్నవారుంటారు.. వ్యక్తిగతమైన విశ్వాసానికి ప్రజాధనాన్ని ఎలా ఖర్చుపెడతావు అని అడిగేవారేరీ! సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ సంగతి సరేసరి! అంత దూరం పోకపోయినా కనీసం పాలకుడు వ్యక్తిగత మొక్కు కోసం ప్రజాధనం ఖర్చుపెట్టకూడదు అని గట్టిగా అడిగే గొంతులు ఎక్కడ?

ఏమాట కామాటే చెప్పుకోవాలి. రాజుగారి మాటలాగే ఇక్కడంతా ఖుల్లం ఖుల్లా. వైష్ణవాన్ని రాజధర్మంగా అధికారికంగా ప్రకటించడానికి రాజ్యాంగం అంగీకరిస్తుందో లేదో అనే సంశయం ఉండబట్టి కానీ లేకపోతే ఆ పని కూడా బాహాటంగా చేయగలరు. కానీ ఆంధ్రరాజ్యంలో అక్కడి పాలకుడికే తనకి తాను ఏమిటో తెలియని గందరగోళం. నాయుడుగారు విశ్వాసో అవిశ్వాసో తెలీదు. అది విశ్వాసమో ఎత్తుగడో కూడా తెలీదు. మామూలుగా ఆయన మాట్లాడేది భయానకమైన పెట్టుబడిదారీ భాష. అన్ని పాత నమూనాలను విశ్వాసాలను అభివృద్ధి రథచక్రాల కింద నలిపేసుకుంటూ వెళ్లిపోయే భాష అది. దానికి తగ్గట్టే ఆయన సెంటిమెంట్లను ఎగతాళి చేస్తా ఉంటారు. భూమి గురించి ఎవరైనా బెంగ వ్యక్తం చేస్తే అది కమోడిటీగా మారడం వల్ల రైతుకు ఎంత లాభమో చెప్తారు. పాత సెంటిమెంట్లను కడిగేసుకోవాలని చెపుతారు. సెంటిమెంట్లు చాదస్తాలు అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్తారు. వ్యవసాయంలో సాంకేతికత అయినా సెల్‌ టవర్ సిగ్నల్స్‌ అయినా ఏ విషయం ముందుకు వచ్చినా ఆయన పాత విశ్వాసాలను పాతరేసేట్టు మాట్లాడతారు.

కానీ ఆయన పట్టాభిషేకం దగ్గర్నుంచి రాజధాని శంకుస్థాపనల దాకా అన్నీ ముహూర్తాల ప్రకారం, వాస్తు ప్రకారం నడిపిస్తున్నారు.. మనం చేస్తే సెంటిమెంట్‌, అవతలివారు చేస్తే చాదస్తం అన్నమాట. తరతమ బేధాలు ఎక్కడ పాటించాలో బాగా వంటపట్టిచ్చుకున్న మనిషి నాయుడుగారు.. చాగంటి కోటేశ్వరరావు అనే పురాణ కాలపు మనుధర్మపు పెద్దమనిషి ఉన్నారు. ఆడవాళ్లను మాత్రమే కాదు, అన్ని బాధిత సమూహాలను అవమానించేట్టు మాట్లాడతా ఉంటారు. అమానవీయతను అనాగరికతను ప్రబోధిస్తా ఉంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మానవహక్కులకు విరుద్ధం. ఇంకో నాగరక దేశంలో అయితే కటకటాల వెనక్కు నెట్టేవాళ్లు. ఇక్కడ బారాఖూన్‌ మాఫ్‌. అలాంటి ఒక సామాజిక నేరస్తుడికి పద్మశ్రీ పురస్కారం ఇప్పించి ఆస్థానంలో సలహాదారుగా పెట్టుకుని సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు? మనుధర్మాన్ని విశ్వసించే కులఅహంకార పురుష అహంకార అనాగరక మనిషిని సలహాదారుగా పెట్టుకున్న రాజ్యం ఎలాంటి విలువలకు నిలబడుతుందని  అనుకోవాలి? మళ్లీ వీళ్లు అంబేద్కర్‌ -పూలే జయంతులకు వర్థంతులకు రావడం దళితులకు బిసిలకు ఏమేం చేశారో ఏకరువు పెట్టడం చూస్తే ఏమిటీ అబ్సర్డిటీ అనిపిస్తుంది.

విభజనతో పాటే మధ్యతరగతిలో గొంతున్న వర్గాలకు తక్షణ ప్రయోజనం చేకూరింది. పదవులు పెరిగాయి. గొంతున్న వారిని కోఆప్ట్‌ చేసుకోవడం సులభమైంది. ఇక కులసంఘాల్లో నాయకులు ఎవరైనా మిగిలి ఉంటే వారికోసం అడిగిందే తడవుగా నిధులు ఒక భవంతి వగైరా మంజూరు అవుతున్నాయి. తెలంగాణ పాలకులు అలనాటి విజయభాస్కరుల వారి విధానాన్ని కులసంఘాల విషయంలో పాటిస్తున్నట్టు అర్థం అవుతున్నది.

ఆంధ్రలో లెక్కల ప్రకారం అన్ని కులాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ గొంతున్న నాయకులను తన దగ్గరే పోగేసుకుని ఉండడం వల్ల ఆయనకు ఆ ఇబ్బంది కూడా లేదు. ప్రశ్నించే గొంతులు కరువు. కొందరికి తమ పుట్టలో వేలు పెట్టినపుడు తప్ప ఇతరత్రా చురుకు తగలదు. ప్రజాస్వామ్య లిబరల్‌ గొంతులకోసం దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సిన స్థితి. ఎబిసిడి న్యాయమైన డిమాండే కానీ ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింది. అక్కడా గొంతున్న వారికి సంతర్పణలు  ఏదో రూపంలో ఏర్పాటు చేసి పెట్టారు. ఇవి వ్యక్తిగత విశ్వాసాలు, పట్టించుకోకూడదు,  వదిలేయాలి అని కొందరు లౌక్యంగా కృతజ్ఞతా పూర్వకంగా అనగలరు.

కానీ సాంస్కృతిక రంగం ప్రభావం చిన్నదేమీ కాదు. దానిమీద దృష్టిపెట్టకుండా  దాన్ని ఎదుర్కోకుండా సాధించేదేమీ ఉండదు. అంబేద్కర్‌ అందుకే అంత ప్రాధాన్యమిచ్చారు.. పైగా పాలనలో ఉన్నవాళ్లు అంత బాహాటంగా సమాజాన్ని వెనక్కు తీసికెళ్లే ఆచారాలను ప్రదర్శిస్తూ ఉంటే దాని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటుంది. అంబేద్కర్‌ ఆశించిన ఆధునిక మానవీయ సమాజం సంగతేమో కానీ రెండు రాష్ర్టాల్లోనూ పూర్తిగా దానికి భిన్నమైన రాజరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

పదే పదే చొక్కా విప్పి జంధ్యాన్ని ప్రదర్శించే గవర్నర్‌ కనుసన్నల్లో రెండు రాష్ర్టాల్లోనూ  ఆధునికత వెనక్కు నడుస్తోంది. అనేక ఉద్యమాలకు నెలవైన తెలుగు రాష్ర్టాల్లో ఇంత దుస్థితిఎన్నడూ లేదు. వాస్తు సలహాదారులు, పౌరాణిక సలహాదారుల  రాజ్యం ఇంత నిస్సిగ్గుగా ఎన్నడూ సాగింది లేదు.  రాజ్యాంగం, ఆధునిక ప్రజాస్వామ్య విలువల గురించి  పాలకులకు గుర్తు చేయాలా, వద్దా!

*

మీ మాటలు

  1. Buchireddy Gangula says:

    యిద్దరు రాజులు –ఆంద్ర -తెలంగాణా ల కు —విగ్రహ స్తాపనలు –అంతా రాజకీయం
    జనాన్ని నమ్మించడం కోసం –ఆడుతున్న నాటకాలు
    వీళ్ళకు తోడు బుడుబుక్కల గవెర్నెర్ ??

    రాజులు–మాయ మాటలతో
    ఆధిపత్యం తో –జనం గళం ఎత్త కుండా. కట్టుబాట్లు చేస్తూ — విదిస్తూ ??
    వాళ్ళ. చేతలను ఆపే దేవరు ??
    యిది. మన. ప్రజాసామ్యెం ????
    చక్కగా రాశారు సర్
    ————————-_—————————————
    Buchi రెడ్డి Gangula

  2. Nijame..nijame…chala challaga cheppalsinattu gane chepparu.
    ..kani vine vaaru ? Idena aranya rodana ante?
    Merry annattu Ee chaganti ..and durmargudini TTD, akkadi Bapiraju and chairman konthamandi IAS luu PENCHI POSHINCHEDI prajala sommutho.

  3. Forward to Antiquity ….దట్ ఇస్ ది రియాలిటీ టుడే..మరి రాజులు ..రాజులుగా కాక revolutionaries అవుతారా? సో కాల్డ్ revolutionary స్వానుభూతులంతా సదరు రాజుల వల్లెవాటు మడతలై, వారి అరచేతి భజన చిరతలై ..ఎంతో ..ఎంతో.. సామాజిక చైతన్య విప్లవ సందేశాన్ని జనానికి చేరవేస్తుండగా ….ఒక భావజాలాన్ని నిర్మూలించాలంటే 1) ridicule it, 2) oppose it violently, 3) accept and annihilate ..ఇది సూత్రమ్ ….ఈ సూత్ర రహస్యం అమ్బేడ్కరిస్తులకు తెలియంది కానే కాదు. కానీ వార్నొక మగత కమ్మి ఉంది కదా..
    ఎవరి రాజ్యంలో వారి వారి పద్ధతులుంటాయి….ప్రశ్నించేవాడే వారి పంచన సేదదీర్తుంటే ప్రయోజనాన్నాశించి ఫాయిదా ఉంటుందా ..చేష్టలుడిగిన చైతన్యాన్ని తిరిగి చేవ గలిగిన చైతన్యంగా దిద్దుకోవాలి గాని …..నిన్దారోపనల్తో కాలం గడపడంలో ఏమాత్రం ప్రయోజనం లేదు…
    ఏమైనా ….విశ్లేషనాత్మకంగా సాగిన మీ వ్యాసం బాగుంది రామ్మోహన్ గారు…రెడ్ సెల్యూట్ టు యు ..

  4. దేవరకొండ says:

    ఒక వ్యక్తి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాకా ఆ వ్యక్తి నీడను కూడా సామాన్యుల మీద పడకుండా చేయాలంటే ఆ వ్యక్తికి గుడి కట్టేయడమే అన్నిటినీ మించిన ఎత్తుగడ. ఈ 125 అడుగుల విగ్రహాల బాగోతం కూడా అలాంటిదే! ఇవి కూడా మనం చెల్లించే (విశ్వాసుల, అవిశ్వాసుల) పన్నుల సొమ్ము నుండే రాబోయే సోకులు! అందరి నోళ్ళూ ఇలాంటి తాయిలాలతో మూయిస్తేనే పాలక మారాజుల నోళ్లు ఆడేది! ఈ వ్యవస్థ ఒక ప్యాకేజి. అన్నిటినీ కలిపే దాన్ని అంగీకరించాలి! ఏప్రిల్ 14 ప్రతి ఏడూ ప్రత్యేకంగా శలవు ప్రకటించడం, రామ నవమిని ఐచ్చిక శలవు మాత్రంగా చిన్న చూపు చూడడం కాషాయ ప్రభుత్వానికి కూడా తప్పకపోవడం దళిత విజయమని సంతోషిద్దామా? వ్యాసంలో వాస్తు వగైరాలను వ్యతిరేకిస్తున్నారు కాని, ఈ విగ్రహాల్ని పెట్టడాన్ని బలంగా వ్యతిరేకించడం లేదు! తాజ్ మహల్ కూడా పక్కా వాస్తు ప్రకారమే నిర్మించ బడిందని చెప్తారు!

    • శ్రీనివాసుడు says:

      విగ్రహనిర్మాణాలు, సెలవుదిన నిర్ణయాలూ బలంగా కోరుకున్నదీ, అవే ముఖ్యమని పోరాటాలు జరిపిందీ ఆ వర్గ నాయకులేనేమో ఒక్కసారి ఆలోచించండి. వారు కోరుకున్నది ఇవ్వడం కూడా పాలకవర్గాల తప్పేనా? ఈ వ్యవస్థ అనే ప్యాకేజీని ఇలాంటివన్నింటినీ కలిపే అందరమూ అంగీకరిస్తున్నాం కదండీ? పోరాటాలు, నిరసనలూ, బాధాకవిత్వాలు, ఉద్యమాలూ అన్నీ కేవలం ఒక సోకుగా (ఫ్యాషన్ గా) మారిన ఈ కాలంలో అంబేడ్కరో మరొకరో సూచించిన దిశానిర్దేశాన్ని మరచి ఆయన్ని స్వచర్మ పోషణకోసమే ఉపయోగిస్తున్నారు కదా. విగ్రహారాధనని బలంగా వ్యతిరేకించిన బుద్ధుడికే ప్రపంచంలో ఎత్తయిన విగ్రహాలు పెట్టిన సామాన్య మనస్తత్త్వం ఈ భీరువులైన ప్రజలది. మీరు చెప్పిన విధంగా రాజకీయ ప్రయోజనమే ఎవరికైనా పరమార్థం.

  5. statement1:వాస్తు హిందూ మతానికున్న అనేక అంగాల్లో ఒకటి. అందులో కూడా మూర్ఖత్వానికి పరాకాష్ట అనదగిన ఆచారం. statement2:అంబేద్కర్‌ హిందూ మత ఆచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వాడు. అది మతం కాదు, వ్యాధి అని చెప్పినవాడు. ఎవరికి పట్టింది ఈ విషాదం?
    హరిబాబు
    question1:బౌద్ధమతం ఇవ్వాళ ఫెంగ్ షుఇ వాస్తును అనుసరిస్తున్నది కదా!అందులో అద్దం ఇటు తిప్పితే ఒక ఫలితం,కొంచెం పక్కై జరిపితే మరొక ఫలితం అని చెప్తుంది కదా!అంబేద్కర్ గారు పాటించిన బౌద్ధంలో మూఢనమ్మకాలు ఉంటే ఫర్వాలేదా?తొక్కలో హిందూమతానికి మాత్రమే అక్కర లేదా?
    question2:శ్రీలంక తమిళుల్ని అడిగితే బౌద్దం కూడా భయంకరమిన వ్యాధి అనే అంటారు,దాని సంగతేమిటి?
    P.S:చనిపోవడానికి సరిగ్గా అయీదేళ్ళ ముందు 1951లోనే అంబేద్కర్ వర్షధారాపాతంగా కన్నీరు కార్చిన సన్నివేశం అబద్ధమా?”నా కేప్టెన్లు అన్ను మోసం చేశారు.” అని విమర్శించినది అగ్రవర్ణాల వారి గురించి కాదుగా!ఆత్మవంచన చేసుకోవడం దేనికి?అంబేద్కర్ దుఃఖానికి కారకులైనవారు అంబేద్కర్ గురించి బహజనలు చెయ్యడం లేదా?

    • హైందవాన్ని అంతగా వ్యతిరేకించినాయనకి హిందూపధ్ధతియైన వాస్తు ప్రకారం విగ్రం పెట్టడం అసంబధ్ధం అన్నది రచయిత point. What is your point dude?

      ప్రతి మతమూ ఒక వ్యాధే. మానసిక వ్యాధి. బహుశా అంబేద్కరుకు తొంభైల్లోని శ్రీలంక తమిళుల బాధ అర్ధంకాలేదేమో. అందుకు మీరు అంబేద్కరును క్షమించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

      P.S. అయ్యుండొచ్చు. హిందువులు వివేకానందుణ్ణీ, రమణమహర్షినీ, గాంధీనీ మోసగించారుకదా.. దాని గురించి (మీ ధోరణిలో) ఆలోచించరేం?

      • శ్రీనివాసుడు says:

        **బహుశా అంబేద్కరుకు తొంభైల్లోని శ్రీలంక తమిళుల బాధ అర్ధంకాలేదేమో.**
        రెండవ ప్రపంచ యుద్ధంలోనూ, అంతకుముందు బౌద్ధం జపాన్ సామ్రాజ్యవాదాన్ని ఎలా వత్తాసు పలికిందో అంబేడ్కర్కి బహుశా తెలిసే వుండవచ్చు.
        Japanese writer, translator and peace activist Kenji Muro యొక్క ముఖాముఖి ఇక్కడ చదవవచ్చు.
        Zen and War: A Dialogue with Kenji munro
        http://www.inquiringmind.com/Articles/ZenandWar.హ్త్మ్ల్

        హిందూ వాస్తు ప్రకారం కట్టడం ఇష్టం లేకపోతే బౌద్ధ వాస్తు ప్రకారం కట్టుకోవచ్చా?
        ‘‘బౌద్ధంలో వాస్తు వుందా, లేదా?’’ అనే విషయం –
        The earliest Japanese architecture was seen in prehistoric times in simple pit-houses and stores that were adapted to a hunter-gatherer population. Influence from Han Dynasty China via Korea saw the introduction of more complex grain stores and ceremonial burial chambers.

        The introduction of Buddhism in Japan during the sixth century was a catalyst for large-scale temple building using complicated techniques in wood. Influence from the Chinese Tang and Sui Dynasties led to the foundation of the first permanent capital in Nara. Its checkerboard street layout used the Chinese capital of Chang’an as a template for its design. A gradual increase in the size of buildings led to standard units of measurement as well as refinements in layout and garden design. The introduction of the tea ceremony emphasised simplicity and modest design as a counterpoint to the excesses of the aristocracy.

        During the Meiji Restoration of 1868 the history of Japanese architecture was radically changed by two important events. The first was the Kami and Buddhas Separation Act of 1868, which formally separated Buddhism from Shinto and Buddhist temples from Shinto shrines, breaking an association between the two which had lasted well over a thousand years and causing, directly and indirectly, immense damage to the nation’s architecture.
        ‘‘ప్రతి మతమూ ఒక వ్యాధే. మానసిక వ్యాధి.’’
        ఈ విషయం అంబేడ్కర్కి తెలియకే థేరావాద బౌద్ధం స్వీకరించారా?
        థేరావాద బౌద్ధం విలసిల్లిన బర్మా, శ్రీలంక దేశాల్లో బౌద్ధమత హింస అస్సలు లేదా?

  6. ఇంకో నాగరక దేశంలో అయితే కటకటాల వెనక్కు నెట్టేవాళ్లు.

    రామ్మోహన్ గారు,

    మీరంట్టున్న నాగరిక దేశాల పేర్లు దయచేసి చెపుతారా? ఆ దేశాలేవో తెలుసుకోవాలని చాలా కుతూహలం గా ఉంది.

    • T.R.M.Rao says:

      విభజనతో పాటే మధ్యతరగతిలో గొంతున్న వర్గాలకు తక్షణ ప్రయోజనం చేకూరింది. పదవులు పెరిగాయి. గొంతున్న వారిని కోఆప్ట్‌ చేసుకోవడం సులభమైంది. ఇక కులసంఘాల్లో నాయకులు ఎవరైనా మిగిలి ఉంటే వారికోసం అడిగిందే తడవుగా నిధులు ఒక భవంతి వగైరా మంజూరు అవుతున్నాయి.ఇదొక్కటి బాగుంది మీ వ్యాసంలో.మనుషులు అవకాశవాదులు.ఇది సత్యం.ఇదే వ్యాసం సారంగలో కాకుండా
      అంతగా ప్రాచుర్యం లేని పత్రికలో వస్తే దీనికంత ప్రాముఖ్యత ఉండక పోవటమే వాస్తు.
      ప్రతి విషయం లోనూ లోటుపాట్లు ఉంటాయి కాదనను.’పురాణమిత్యేవ న సాధు సర్వం’ అలాగని పాత దంతా చెడ్డా కాదు.

  7. ఇంకో నాగరక దేశంలో అయితే కటకటాల వెనక్కు నెట్టేవాళ్లు.

    రామ్మోహన్ గారు, మీరంట్టున్న నాగరిక దేశాల పేర్లు దయచేసి చెపుతారా? ఆ దేశాలేవో తెలుసుకోవాలని చాలా కుతూహలం గా ఉంది.

  8. యాదగిరి గుట్ట అనే అందమైన తెలుగుపేరు సంస్కృతంలోకి మళ్లి యాదాద్రి అయిపోయింది.
    haribaabu
    మీరు యాదగిరి గుట్ట ఆలయ చరిత్ర చదివైనట్టు ఢంకా భజాయించి చెప్తున్నారు.పురాణ ప్రశస్తి లేకుండా ఏ హిందూ దేవాలయమైనా అంత పరముఖమైన ఆలయం ఎట్లా అవుతుంది?అక్కడున్న అసలు పేరు యాదర్షి తపస్సు చేసిన “యాదాద్రి” మాత్రమే!తెలుగులో యాదగిరి గుట్ట అయింది,అంతే!ఇప్పుడు దాని అసలు పేరునే దానికి పెట్టారు.

  9. అజిత్ కుమార్ says:

    మతనమ్మకాలు కలిగియున్నవారు మానసిక వ్యాధి గలవారితో సమానం. అలాంటి వారు చేసే పనులలో తప్పులుండడం సహజం. అలాంటి వారిని ఆరోగ్యవంతులుగా భావించి, వారేదో తప్పుచేసినట్లు విమర్శించడం తప్పుగదా…

  10. ‘….. రాజ్యం ఇంత నిస్సిగ్గుగా ఎన్నడూ సాగింది లేదు. రాజ్యాంగం, ఆధునిక ప్రజాస్వామ్య విలువల గురించి పాలకులకు గుర్తు చేయాలా, వద్దా!’
    వద్దు, రామ్మోహన్! ఎందుకు రిస్కు చెబుదూ.
    నీకు ప్రభుత్వ ప్రైవేటు పదవులు, బహుమతులు వద్దూ? ఆయ్.

  11. PHOENIX
    APRIL 15, 2016 AT 10:59 AM
    What is your point dude?
    O
    HARIBABU
    అంబేద్కర్ గారు 1956 నాటికే తన సాటి దళిత మేధావుల గురించి పూర్తి నిరాశా నిస్పృహలకి లోనయ్యాడని మీకు తెలుసా?”on 18 March 1956 at Ramlila Ground, Agra he said with a heavy heart that, “The educated people have betrayed me. I was thinking that after education they will serve their society. But I find that a crowd of clerks had gathered around me, who are engaged in filling their belly”. This heart burning is a proof that educated and intellectual class is alienated from the society and is going away from its brotherhood.”స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళ లోపే,అంటే తను ఈ దేశపు విద్యావంతుల విచక్షణా జ్ఞానం మీదా సామాజిక బాధ్యత మీదా ఎన్నో ఆశలు పెట్టుకుని సంతో తెలివిగా పెట్టిన రిజర్వేషన్ల వ్యవస్థ గురించి అంత తొందరగా అంత నిస్పృహకి ఎందుకు గురయ్యాడు?ఎందుకంటే,గాంధీ యొక్క అహింసాయుత పోరాటం అనే వింత సిద్ధాంతం అతడికి తప్ప ఇంకెవరికీ అర్ధం కానట్టు అంబేద్కర్ రిజర్వేషన్ల విధానం ఎందుకు ప్రతిపాదించాడో అటు ప్రభుత్వంలో ఉండి అమలు చెయ్యాల్సిన పెద్దమనుషులకీ ఇటు దాని ఫలితాన్ని అందుకోవలసిన దళిత విద్యావంతులకీ అసలేమాత్రం అర్ధం కాలేదు!
    O
    నిజానికి ఈ ప్రత్యేక రక్షణ(reservation) అనేది ఎవరికీ కవచాలు తొడిగి రక్షించటానికి ఉద్దేశించినది కాదు.అసలు దీని యొక్క ప్రాధమిక లక్ష్యానికి తగిన పదం ప్రత్యేక ప్రాతినిధ్యం!ఇప్పుడు ఎవరైతే ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని కోరుకుంటున్నారో వారు దాని అర్ధాన్నీ పరమార్ధాన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలి.దానికి పరిమితులు కూడా ఉన్నాయనేది గ్రహించాలి.అది ప్లాసిబో లాంటి సర్వరోగనివారిణి ఎన్నటికీ కాదు.అది ఒక వ్యక్తికి కొంత సౌకర్యం ఇస్తున్నా ఆ ఇవ్వడం అతనికి వ్యక్తిగతంగా ఇవ్వడం లేదు,కులపరంగా ఒక వ్యక్తికి మనం ఉద్యోగంలో గానీ శాసనసభ్యత్వంలో గానీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామంటే ఆ వ్యక్తి తను నిలబడిన సమూహంలో తన కులానికి ఒక గొంతునీ,గుర్తింపునీ సాధించి ఆ కులానికి ప్రతినిధిగా నిలబడే అవకాశం కల్పిస్తున్నాము అని అర్ధం!కానీ ఈ దేశపు దళిత విద్యావంతులు ఆ గురుతరమైన బాధ్యతని నిర్వర్తించటంలో దారుణంగా విఫలమయ్యారు – అదే అంబేద్కర్ బాధకి కారణం!
    O
    మొదటిసారి రిజర్వేషన్ వల్ల లాభం పొందినవాళ్ళు ఆ ప్రాతినిధ్యాన్ని ఇంకా పెంచటానికి,అంటే ఏ వెనుకబాటుతనాన్ని గుర్తించి తనకి అవకాశం కల్పించబడిందో అలాంటి మరిన్ని అవకాశాలను తన కులంలోని మిగిలిన వారికి కూడా దక్కే విధంగా కృషి చెయ్యాలి.కానీ వాస్తవంలో ఏమి చేశారు.తమకి ఉద్యోగం రాగానే తను ఎంత తొందరగా ప్రమోషన్ ఎట్లా కొట్టెయ్యాలి, ఎంత తొందరగా బంగ్లా,కారు,హోదా తెచ్చుకోవాలి అనే రంధిలో పడిపోయారు.అంబేద్కర్ వీళ్ళని చూసి బాధపడిన అప్పటికీ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తూ డెబ్భయ్యేళ్ళు గదిచిన ఇప్పటికీ అదే పరిస్థితి.ఇవ్వాళ ఏ కులపరమయిన వెనుకబాటుతనం వల్ల తాము కొత్తగా సౌకర్యం పొందారో ఆ బుద్ధిమంతులకి తమ కులంలోని మిగిలిన వ్యక్తుల పట్ల సానుభూతి లేదు గానీ నిన్నెప్పుడో అగరకులాల వాళ్ళు మమ్మల్ని అణగదొక్కేశారు మొన్నెప్పుడో బ్రాహ్మణులు మమ్మల్ని చదువుకోనివ్వలేదు అని సొల్లుకబుర్లు చెప్పే డొల్లతనం పెరిగింది!కార్య కారణ సంబంధాన్ని బట్టి రాగద్వేషాల కతీతంగా చెప్పవలసి వస్తే రిజర్వేషన్ వ్యవస్థ అంబేద్కర్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడే విఫలమైపోయింది.
    O
    అసలు సమస్య,స్వాతంత్ర్యం వచ్చి డెబ్భయ్యేళ్ళు గడిచాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన స్థానాల్ని రిజర్వేషన్ల ద్వారా పొందినవారిలో ఎంతమంది తమ బుద్ధినీ కాలాన్నీ తమ కులానికి గౌరవమైన స్థానాన్ని కల్పించేటందుకు ఉపయోగించారు అని గనక ప్రశ్నించుకుంటే చాలా దయనీయమైన జవాబు వస్తుంది!దేశంలో ఉన్న సంపదనంతా దోచిపెట్టనక్కర లేదు, ఇప్పటివరకు పై స్థాయిలో తమ సుదీర్ఘమైన ఉద్యోగజీవితకాలంలో తమ కులానికి చెయ్యాల్సిన న్యాయమైన సహాయం చెయ్యడానికి అవసరమైనవన్నీ వారిచెంత ఉన్నాయి,కానీ వారినుండి వారి కులానికి అందినది శూన్యం.అసలైన విషాదం వీరు మెల్లమెల్లగా తమ కులానికి దూరంగా జరుగుతూ “ఉన్నత తరగతి దళితులు” అని పిలవాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు.
    O
    వీరి పతనానికి పరాకాష్ఠ ఖెయిర్లంజి కేసులో స్పష్టంగా తెలుస్తుంది.ఒక్కర్ని విడిచి మొత్తం దళిత కుటుంబాన్ని చంపేసిన ఈ కేసులో దళిత ప్రజాసేవకులు,దళిత అధికారులు తమ స్వకులపు సోదర సోదరీల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించారు,అధికారంలోకి రాగానే పరిపాలక మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు!నిన్నటి రోజున ఏ రకమైన రాజ్యం తమ కులాన్ని వెనకబడేలా చేసిందో ఆ రాజ్యపు ఆదర్శాలని వీరు ఏమాత్రం సంకోచం లేకుండా ఆమోదించేశారు – మరి,గంభీరమైన దళిత భావజాలపుస్పూర్తి ఏమైనట్టు?
    O
    That is my Point Dude!
    O
    P.S:Can you understand?If not keep quiet!

  12. Praveen Kumar says:

    అల్లాహ్‌కి విగ్రహం పెడితే ఇస్లాంకి ఎంత అపచారం జరుగుతుందో, అంబేడ్కర్‌కి వాస్తుని వర్తింపచేస్తే దళిత అస్తిత్వవాదానికి అంత అవమానం జరుగుతుంది.

  13. PRAVEEN KUMAR
    APRIL 15, 2016 AT 11:36 పం
    అల్లాహ్‌కి విగ్రహం పెడితే ఇస్లాంకి ఎంత అపచారం జరుగుతుందో………
    HARIBABU
    అర్రెర్రెరెడ్డెడ్డెడ్డె!ఎంత ఘోరం జరిగిపోయింది?మరి ప్రతి వీధిలో ఇప్పటికే చాలా కాలం నుంచీ అంబేద్కర్ విగ్రహాల్ని ఆవిష్కరించారు,ఆ విగ్రహాలకి పూలమాలలు వేసి దణ్ణాలు పెడుతున్నారే – ఇప్పుడెష్లా?ఇప్పుడా గుర్తు జేసేది?కూల్చేద్దామా వాటిని!
    O
    సైజు భారీ అయ్యేసరికి అధాట్న కూలితే ఎట్లా అనే డౌటు వచ్చింది గాబోలు:-)దాంతో వాస్తు గుర్తిచ్చి ఉండాలి:-(
    O
    అయినా, ఇప్పుడు పెరిగింది ఎత్తే గదా,చిన్ని సైజులో బోల్డు విగ్రహాలు ఉంటే తప్పు లేదు గానీ కుంఛెం సైజు పెంచేసరికి అంత గొదవ దేనికబ్బా – ఇడ్డూరంగా ఉండాదే?!

  14. samadhanam says:

    అన్ని వాస్తుల కన్న మన వాస్తు గొప్ప
    అన్ని మతముల కన్న మన మతము గోప్ప
    యిది నిరూపించడానికే అంబేద్కర్ అవసరం వచ్చిందా ?
    ఆయన విగ్రహం అక్కరకు వచ్చిందా? ఎందువల్ల?

  15. ఇన్నాళ్ళూ వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారు,వీళ్ళ విగ్రహాలు పెడుతున్నారు,మా అంబేద్కర్ వూసే ఎత్తడం లేదు ఎవరూ అని గోల.”అక్కడ అంబేద్కర్ చిత్రపటం పెట్టటానికి ముప్పయ్యేళ్ళా?ఇక్కడ విగ్రహం పెట్టటానికి యాభయ్యేళ్ళా?” అని ఆడిపోసుకునేదీ మేఎరే!పోనీ గదాని పట్టించుకుంటే “ఆయన విగ్రహం పెట్టటం అవస్రమా” అని రెట్టించేదీ మీరేనా?

    వేలికేస్తే కాలికి,కాలికేస్తే మెడకీ వెయ్యటం తప్ప ఒక మాటం మీద ఉండరా?ఆయన ఏం చెప్పాడో అర్ధం గాక ఎందుకొచ్చిన గోల లెమ్మని గమ్మునుంటే మా అంబెద్కర్ పేరునే తలవట్లేదంటారు.మీ తృప్తి కోసం ఆయన గురించి మాట్లాదబోతే నువ్వెవడివి మా అంబేద్కర్ గురించి మాట్లాడ్డానికీ ఆయన్ని గౌరవించడానికీ అని రెట్టిస్తారు.ఏంటండీ మీ యవ్వారం?!

  16. THIRUPALU says:

    అంబేద్కర్ ఎత్తైన విగ్రహం పెట్టడం వల్ల దళితులని ఉన్నతీకరిమ్చి నట్లేనా ? ఇది కూడా చదవండి!

    http://epaper.andhrajyothy.com/781139/Hyderabad/17.04.2016#page/4/2

  17. THIRUPALU
    APRIL 16, 2016 AT 11:41 పం
    అంబేద్కర్ ఎత్తైన విగ్రహం పెట్టడం వల్ల దళితులని ఉన్నతీకరిమ్చి నట్లేనా ?
    HARIBABU
    “ఓం అంబేడ్కరాయనమ” కాలం గురించియే గదా మీరు ప్రస్తావిస్తున్నది?అది నేను పైన వేసిన కామెంటులోని సారమే కదా?మరోసారి చూస్తారా!
    ————————–
    అంబేద్కర్ గారు 1956 నాటికే తన సాటి దళిత మేధావుల గురించి పూర్తి నిరాశా నిస్పృహలకి లోనయ్యాడని మీకు తెలుసా?”on 18 March 1956 at Ramlila Ground, Agra he said with a heavy heart that, “The educated people have betrayed me. I was thinking that after education they will serve their society. But I find that a crowd of clerks had gathered around me, who are engaged in filling their belly”. This heart burning is a proof that educated and intellectual class is alienated from the society and is going away from its brotherhood.”స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళ లోపే,అంటే తను ఈ దేశపు విద్యావంతుల విచక్షణా జ్ఞానం మీదా సామాజిక బాధ్యత మీదా ఎన్నో ఆశలు పెట్టుకుని సంతో తెలివిగా పెట్టిన రిజర్వేషన్ల వ్యవస్థ గురించి అంత తొందరగా అంత నిస్పృహకి ఎందుకు గురయ్యాడు?ఎందుకంటే,గాంధీ యొక్క అహింసాయుత పోరాటం అనే వింత సిద్ధాంతం అతడికి తప్ప ఇంకెవరికీ అర్ధం కానట్టు అంబేద్కర్ రిజర్వేషన్ల విధానం ఎందుకు ప్రతిపాదించాడో అటు ప్రభుత్వంలో ఉండి అమలు చెయ్యాల్సిన పెద్దమనుషులకీ ఇటు దాని ఫలితాన్ని అందుకోవలసిన దళిత విద్యావంతులకీ అసలేమాత్రం అర్ధం కాలేదు!

    ————————–
    ఇందులోనూ అందులోనూ ఉన్న పాయింటు మీకు అర్ధం కాలేదా?అంబేద్కర్ కన్నీళ్ళు పెట్టుకున్న సన్నివేశం గడిచాక ఇన్నేళ్ళకి కూడా దళిత మేధావులు ఏమీ మారకుండా అలాగే ఉన్నప్పుడు వీరిని ఎవరు ఉన్నతీకరించగలరు?

  18. samadhanam says:

    బుద్ధిస్టు వాస్తు , బుద్ధిస్టు ఆచారాలు సంప్రదాయాల ప్రకారం అంబేద్కర్ విగ్రహం స్థాపించచ్చు కదా/ అక్కడ కూడా పం తిళ్లూ నామాలూ మంత్రాలూ యెందుకు?

  19. పేరులో సమాధానం పెట్టుకుని ఎంత అమాయకమైన పెశ్న అడిగినారు సార్:-)
    అటువారు గానీ ఇటువారు గానీ ఎంత చించుకున్నాను ఈ ప్రశ్నకి బదులేది:-(

  20. Devika rani.p says:

    వ్యాసంలో హిందూధర్మం, ఆచారాలపై విషం చిమ్మడం కాస్త తగ్గించి..అంబేడ్కర్ గురించి నాలుగు మంచిమాటలు చెబితే పోయేది. 100 ఏళ్ల జయంతి అప్పుడు గుర్తురాలేదా…అంతకుముందు ఆ తరువాత గుర్తురాలేదా అని నిలదీసిన మీలాంటోళ్లే ఇప్పుడు విగ్రహం అవసరమా అనడం…ప్చ్..అర్థంకాలేదు. మీ ఉద్దేశం, అభిప్రాయం కొంచెం స్పష్టీకరిస్తే బాగుంటది. మానవీయ విలువలకోసం తపన పడ్డ అంబేడ్కర్ బౌద్ధాన్ని ఆచరించారు కదా. యాదాద్రికి కోట్లు ఇస్తూ…కోట్లతో తిరుమలకు నగలు సమర్పిస్తున్న ఆ చంద్రశేఖరుడే ఇమామ్‌లకూ వేతనాలిస్తున్నాడు. సాములోరికి పదే పదే ప్రణమిల్లుతున్నాడని పదే పదే చెప్పారు కదా… మనకన్నా పెద్దవాళ్లకు, మనకన్నా నాలుగు ముక్కలు ఎక్కువ తెలిసినోడిని గౌరవించడం తప్పంటారా? వ్యక్తిగత మొక్కుకోసం అంత ఖర్చు పెట్టొద్దని అడిగే గొంతులు లేవన్నారు…అవును మక్కా యాత్రకు వేలల్లో జనాన్ని ఫ్రీగా పంపిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నా అడిగే గొంతుల్లేవు . సామాజిక చైతన్యం కోసం నడుంకట్టిన మీలాంటి వాళ్లు గొంతు సవరించండి మరి. మేమూ మీ వెంట వస్తాం. కానీ కేవలం పనిగట్టుకుని హిందూ ధర్మంపైనే విమర్శలు చేయడం , తప్పుబట్టడంసరికాదు. ‘ఇంకో నాగరక దేశంలో అయితే కటకటాల వెనక్కు నెట్టేవాళ్లు’ అన్నారు…హహ ఇదో పెద్ద జోక్…నవ్వాగడం లేదు . ఇక చాగంటి కోటేశ్వర్రావు గారికి పద్మశ్రీ ఇచ్చినట్టు ఎక్కడా వినలేదు. బహుశా వ్యాసకర్త గౌరవంతో సత్కరించారా ఏమో!. రాష్ట్ర ప్రథమ పౌరుడిని…రాజ్యాంగ బద్ధంగా ఎంపికైన వ్యక్తిని ఉద్దేశిస్తూ’పదే పదే చొక్కా విప్పి జంధ్యాన్ని ప్రదర్శించే’ లాంటి వాక్యాలు ఓ వర్గాన్ని చాలా చాలా కించపర్చేలా ఉన్నాయి.

  21. ఆంబేద్కర్ హిందు మతం లో ని చెడు సంప్రదయాలని వ్యతిరేఖించారే కాని హిందు మతాన్ని
    దాని నమ్మకాలని కాదు..ఒక వ్యక్తి తన జీవన కాలం లో ఏనాడు అనని వాటిని కూడ
    మీ వ్యక్తిగత అజెండా కోసం వాళ్ళకి ఆపాదించి ఆ మహానుభావులని తక్కువ చేయకండి.
    చాగంటి వారు సామాజిక ద్రోహులా ?? కుల అహంకార పురుష అహంకారా ??
    వారి ప్రవచనాల్లో మీకు ఒక్కదాని లో కుడా ఇసుమంతైనా మంచి కనపడలేదా ??
    నరసిమ్హన్ గారి విషయానికి వస్తే ఆయన రెండు రాష్ట్రాలకు ప్రధమ పౌరుడు అని
    కాక ఆయన వ్యక్తిగత ఆచారాలు విశ్వాసాలే మీకు కనపడుతుంటే చూసే మీ ద్రుష్టిలోనే లోపం ఉందియేమో

  22. THIRUPALU says:
    • THIRUPALU
      APRIL 20, 2016 AT 11:15 PM
      The novelty and the idealism of these mass protests were clear for all to see; but as a participant in many of these events in Delhi, I can testify that they were also marked by uncertainty and a lack of direction: Who is leading this inchoate Indian Spring? Does it have a clear agenda? Will it develop into a real political alternative in the future?

      HARIBABU
      నిజమే, పిచ్చి కుదిరితే గానీ పెళ్ళీ కుదరదు పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదన్నట్టు ముప్పాళ రంగనాయకమ్మ ఏమో “బుద్ధుడూ చాలడు, అంబేద్కరుడూ పనికిరాడు, మార్క్సు మాత్రమే సమర్ధుడు” అంటుంది,కంచె ఐలయ్య గారేమో “కమ్యునిష్టులు గొప్పకి పోకుండా అంబేద్కర్ ప్రవచనాల్ని ఒప్పుకుని ఎన్నికల్ని సీరియస్సుగా తీసుకుని సిగ్గు పడకుండా కులసమీకరణల్ని వాడుకుని ఎట్లాగోట్లా ముందు జాతీయ స్థాయిలో అధికారం తెచ్చుకుని అప్పుడు పైనుంచి కమ్యునిజాన్ని రుద్దవచ్చు కదా” అని ఉభయచర కమ్యునిష్టులకి ఉబోస లిస్తున్నాడు.వర్గాన్ని వదిలేస్తే ఆ సిద్ధాంతం పిడకలేరుకోవటానికి కూడా పనికిరాదాయె మరి!సాయుధ పోరాటం కాన్సెప్టు వదిలేస్తే పిల్లులు కూడా భౌ భౌ మని మొరుగుతాయి వాళ్ళని చూస్తే,ఇంకెష్లా:-)వాళ్ళు వర్గాన్ని వదిలేసి కులాన్ని కావిలించుకోరు వీళ్ళు కులాన్ని వదిలేసి వర్గాన్ని కావిలించుకోరు.ఇద్దరిలో ఎవరో ఒకరు తమ మూర్ఖత్వాన్ని తగ్గించుకుని ఇద్దరూ కలిసి ప్రయత్నించనంత కాలం కులదోపిడీ,వర్గదోపిడీ రెంటిలో ఏదీ పోదు – మీకు నమ్మకం లేకపోతే నేను స్టాంపు పేపరు మీద రాసిమ్మన్నా రాసిస్తా!

  23. syed sabir hussain says:

    ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందుతున్న అతిపెద్ద అబద్దం మతం..అసలు మతం అనేదే లేదు. మనిషి ఉన్నాడు. మనిషిని వదిలి మతాల్ని పట్టుకొని వేలడడం మూర్ఖత్వం.మనం మనిషి గురించి మాట్లాడుదాం. మనం మనుషుల గురించి..వారి వెతల గురించి మాట్లాడకుండా పలక వర్గాల్య్న దోపిడిదారులు మతాన్ని తెస్తున్నారు. విగ్రహాలు పెడుతున్నారు.ఈ కుట్రల్ని మనం బట్టబయలు చేయాలి.సమాజంలో వివక్షకు గురవుతున్న వర్గాలను…దళితులను..మైనారిటీలను..మహిళలను…ఆదరించి వారికి భరోసా కల్పించాలి…రండి…

  24. chandolu chandrasekhar says:

    నిజమే ,ముందు మన మతం నుండి మొదలు పెడితే బావుంటుంది ,తలాక్ కి వ్యతిరేకంగా ఒకామె పోరాడుతుంది ,ఆమెకి సంఘీభావం తెలిపితే మంచిదే

  25. chandolu chandrasekhar says:

    విగ్రహాలు ,ఓట్లకి అవసరం ,దళిత అవకాశవాదులకి అవసరం ,పాలకుల కి అవసరం .అంబేద్కర్ తాత్విక సిద్దాంతం నాలాంటి వాడికి అవసరం

  26. Chandra Sekhar says:

    మంచి నీళ్ళ కటకట, ఆకలి, రేపటిరోజు కోసం ఆరాటం – ఇవీ దరిద్ర ఓటరు ఆందోళనలు. వీటిని తీర్చలేని ప్రభుత్వాలు, మేధావుల చర్చలు వృధా. మతమా, థూ! గుక్కెడు గంజికి భరోసా ఇవ్వలేని రామనవములూ, హనుమజ్జయంతులూ, కుంభమేలాలూ, క్రిస్మస్లూ, రంజాన్లూ, బుద్ధజయంతులూ, వృధా, వృధా, వృధా! థూ! థూ! థూ!

  27. @సయ్యద్ సాబిర్ హుస్సేన్ గారూ! సరిగ్గా చెప్పారు. చందోలు గార్కి ఉలికిపాటు ఎందుకు? ఇంత చర్చించీ మళ్లీ మన మతం అంటారేగానీ, మనం, మానవత్వం అనలేరేమి? రిజర్వేషన్లు, శ్రీలంక ఎత్తులు, పొట్టి పొడుగులు — ఇవన్నీ ఎందుకు? ప్రజల సొమ్ముతో, సర్వ సత్తాక గణతంత్ర ప్రజాస్వామ్యం లో వర్గాలకు, కులాలకు, మతాలకూ వాటి తాలూకు మూఢనమ్మకాలకు ధారాళంగా ఖర్చు పెట్టేస్తుంటే, జనాన్ని మందలుగా అటే నెట్టేస్తుంటే అడిగే దిక్కే లేదా అన్నది అసలు వ్యాసం ఉద్దేశ్యం. అలా అడిగేటప్పుడు రాచలాంఛనాలతో వారం వారం తిరిగే జంఝ్యాలు కనబడడం సబబే. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలలో పెట్టిన విగ్రహాలెన్ని? వాటిలో అనుమతులు ఉన్నవి ఎన్ని.? జనానికి అడ్డం రానివి ఎన్ని? అవి తేల్చండి. వాటిని కూల్చండి. తరువాత కడుదురుగాని వాస్తులతో కొత్త విగ్రహాలు!

  28. chandolu chandrasekhar says:

    రాజ గారు ,హిందూ ఇతిహాసాలను ,పురాణాలను ,వేదాలను వేదాంతాలను కూడా విమర్శ చేశాను .హుస్సన్ గారు కొరాన్ మిద విమర్శ చేయగలరా ?

    • రామ్మోహన్ గారూ! మనల్ని మనం, లేదా మన మతాన్ని మనం నిందించుకోవడం నిజాయితీ కి నిదర్శనం కాదు. ఇస్లాంలో లోపం మీరు గమనించగలిగితే మీరే ఎత్తి చూపచ్చు. అన్ని మతాలు లోపభూయిష్టమే. ఇస్లాం ఏమాత్రం మినహాయింపు కాదు. మీరు మంచి విషయాన్ని లేవనెత్తారు. దానినుండి అందరూ తలోవైపుకీ చర్చను లాక్కెళ్తూ ద్వేషాన్ని రేపుతున్నారని బాధ. అణగారిన వర్గాలకు అధికారాన్ని అందకుండా చేసే కుట్రలో భాగంగానే చంద్రులిద్దరూ పోటీపడి మరీ ఎత్తులు వేస్తూ ఎత్తులు (విగ్రహాల) పెంచడం, మూఢత్వాల పరాకాష్ఠగా వాటికి వాస్తులు చూడడం, జనానికి నిలువుగా, అడ్డంగా నామాలు పెట్టడం అందరూ ఖండించాలి. ఇక్కడ మతాల ప్రసక్తి అనవసరం. మానవత్వం గురించి ప్రస్తావించినందుకు హుస్సేన్ గారిని ఉటంకించాను. ఆయన పేరు శ్రీరామ్ అయినా నా స్పందన ఇలాగే ఉంటుంది. ప్రజలు తమ సొమ్ముకు జవాబుదారీ వహించని, మతాలకతీతంగా సమన్యాయాన్ని పాటించని ప్రభుత్వాలను నిలదీయడమే మనందరి సమైక్య ఎజెండా అవ్వాలి. మీరు ఇటువంటి టాపిక్స్ మాత్రం లేవనెత్తుతూనే ఉండాలి. వాటిపై నిజాయితీ తో కూడిన ఆరోగ్యవంతమయిన చర్చ జరుగుతుండాలి. నమస్తే.

  29. క్షమించండి. చంద్రశేఖర్ గారి కామెంట్ ను రామ్మోహన్ గారి కామెంట్ గా పొరబడ్డాను. అయినా విషయం, నా అభిప్రాయం అంతే.

  30. g b sastry says:

    అన్ని మతాలకు ఇజాలకు పరిమితులుంటాయని అవేవీ కాలంకన్నా గొప్పవికావని కాలేవని,ఎప్పటికప్పుడు కాలానుగునంగా మార్పులుచెందాలన్న దృష్టి తో అందరమూ ఉండగలిగితే మనకు మనవారనుకోన్నవారికి కొంతైనా మేలుచేయగలమ్,మనువాదమైన మార్కువాదమైన పిడివాదంగా చేసుకుని సమస్యనుండి అందరం పారిపోజోస్తున్నామన్నది నిజమని గుర్తిస్తే బాగుంటుంది

మీ మాటలు

*