What can a poem do?

Art: Rafi Haque

Art: Rafi Haque

 

-లాలస

~

 

ఏదో నకలు లాంటి రాత్రి తన నక్షతాలతో మెప్పించనూ లేదు

కళ్లెదుటే ఉంటుంది

కానీ జీవితం గింగిరాలు తిరుగుతుంటుంది

ఎవరి నీడనైనా వారి నుంచి కత్తిరించే సాధనమెక్కడ

నిర్వేదాల. నిర్విరామాల, అలసటల ప్రతిబింబాల నడుమ

పగటితో మాత్రం ఏం లాభం

 

లేదా? సరే

 

ఒక విరహ వేదన పలుకుదామని గొంతు సవరించుకుంటుంటే పాట గబుక్కున పెదాల నుంచి అమాంతం కిందకు జారిపోయింది. ఏమనుకోవాలి ప్రియా.. ఇవాళ రాత్రి ఇక్కడ వాన కురిస్తే. ఒక్క వాన చుక్క నా కణంగా మారదూ? మధ్నాహ్నం దాటింది. ఆకాశంలో నీరెండను దాటి మళ్ళీ మరో తోటలోకి వాన ఒకటి నెమ్మదిగా బయలు దేరింది పెత్తనానికి. ఉత్తినేగా..  ఈ సారైనా వేనవేల సంవత్సరాల జ్ఞాపకాల జడివానై చుట్టుముట్టేస్తుందా లేదా?.

జీవితానికి ప్రేమలేఖ రాసిన సంబరం చేయడానికి మహా కవులున్నారా.. ఉత్తరంతో పంపేందుకు  తోటలో సరిపోయినన్ని పూలూ ఉండవు. ఇంకా చెప్పాలంటే..

హృదయమొక పరాయి గడ్డ

అక్కడేమో

దీర్ఘరాత్రి పున్నమి చంద్రుడు రకరకాలుగా ఉంటాడు.

నగరానికి కనిపించని సిరివెన్నెల కనిపించని పర్వతాల మీద పడుతుందేమో.

ముభావ వెన్నెల చిగురు గాయం మీద

సొగసైన వెన్నెల పూల మీద

అధునాతన వెన్నెల ఆలోచనల మీద పడుతుందేమో

 

కానీ

తనకు తానే పరిచయం కాలేని పరాయి గడ్డ హృదయం మీద

పడేది వేదనల వెన్నలే

 

అపుడెలా ఉంటుందంటే

మధుర గళాలు మరణిస్తే నెమరువేసే జ్ఞాపకమైన సంగీతంలా.ఆ సంగీతం విగతజీవులైన గులాబీ పూవులే మృతుల కంఠమాలలుగా మారినట్లే ధ్వనిస్తుంది.  కళ తడారిపోయినపుడు ఆత్మలు మగత నిద్ర పోతాయి. పూలూ, వానలూ, కడలీ, గాలీ ఏమున్నా అవి పుడమి గీతాలను శ్వాసించలేవు.

 

మధ్యలో సగం చందమామలను వదిలేస్తూ తెల్లకాగితం మీద నడుస్తుంటుంది కవిత. దానిని నదిలోకి ఒలకబోసి గుర్తుంచుకుంటానని చెప్పాలి.

ps

లైఫ్ .. నీ టచ్ స్ర్కీన్ నా రింగ్ టోన్ హృదయం

Because i am writing you my dear  poem will you go to life to bring back LIFE?

*

మీ మాటలు

  1. sadlapalle chidambarareddy says:

    అద్భుత అభివ్యక్తన

  2. mohan.ravipati says:

    సూపర్బ్ ఎక్స్ప్రెషన్

  3. బ్రెయిన్ డెడ్ says:

    వండర్ఫుల్ లాస్ట్ లైన్స్ . మొత్తం కవిత నిండిన కొత్తదనం . బాగుంది

  4. vaageesahn says:

    మంచి కవిత . చిక్కని కవిత్వం

  5. Bhavani Phani says:

    మంచి కవిత

  6. Suparna mahi says:

    అద్భుతం….

  7. కూకట్ల తిరుపతి says:

    అభివ్యక్తి బాగుంది

  8. శ్రీనివాస్ ప్రసాద్ says:

    హృదయమొక పరాయిగడ్డ….వేదనలా వెన్నెల..ముభావ వెన్నెల..కొత్త పదాలు భాషకి

Leave a Reply to vaageesahn Cancel reply

*