ఆ తర్వాత మళ్ళీ…

 

 

చిత్రం: ప్రవీణ కొల్లి

పదాలు: సాంత్వన చీమలమర్రి

~

 

ఇదిగో అయిపోయాయి ఇరవై నాలుగు గంటలూ!

అతి కష్టం మీద నీకే సందేశమూ పంపకుండా గడిపినవి. ఊహించగలవా?

ఎన్ని సార్లు వేళ్ళకొనల్లో మాటలు అక్షరాల్లోకి పొంగిపోకుండా అక్కడే కూర్చుని ఏడ్చుకున్నాయో?

అసలు నువ్వెవరివోయ్ నన్ను మాట్లాడకుండా ఉండమంటానికి?

మాటల్లో Immediacy ఎక్కువైపోయిందని ఊర్లో అందరినీ అనొచ్చు. నన్ను కూడానా?

నేనెంత కోప్పడ్డా మాట్లాడకుండా ఉండననేగా నీ తెగింపు. పూర్తయ్యిందిగా నీ ప్రయోగం. ఉక్కిరి బిక్కిరి చేసే పూల పరిమళాల మధ్య తేడా తెలుసుకునేందుకు ఒక్కో సారి కాఫీ గింజలు వాసన చూడాలని చెప్తావా నాకు? ఇప్పుడు తెలుసుకోవాలనిపించాలిగా నాకసలు. కాలం పాడే ఈ తెలుపూ నలుపూ స్వరాల refrain యేమంత మారుతుందట? But for those capricious notes of love our entwined words strew upon it…

నిన్న వేడిగాలికి తూగుతూన్న మధ్యాహ్ననిశ్శబ్దం లోంచి ఎవరిదో సందేశం మోగింది. అదే piano glissando. గుండె కొంచెమాగింది. నువ్వేనేమో అని చూసా. రాక్షసుడా! అంత ప్రేముండీ ఇంత కఠినంగా ఎలా ఉంటావ్? సరేలే పో… నాకూ మళ్ళీ స్పృహ తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. కాలంతో సంబంధం లేదు నాకు అని ప్రేమ అనుకున్నా హృదయం bitter-sweet గా లెక్కేస్తునే ఉంటుందిగా క్షణాల్నీ, గంటల్నీ, రోజుల్నీ…

అప్పుడు ఈ ప్రవాహంలో పాదాలు మాత్రమే మునిగేట్టు కూర్చుని శాంతంగా ఊపిరి పీల్చుకుంటూ చూడగలనేమో నిన్ను.

ఇదిగో ఈ సూర్యోదయంతో క్షణక్షణం మారుతూన్న లోకాన్ని చూస్తున్నట్టు.

ఈ ఆకాశంలో ఉన్నన్ని రంగులు మన ప్రేమకి.

ఇప్పటికి దాని రంగు ఈ కారబ్బంతిపూరేకుల ఎరుపు.

తర్వాత దిగంతాల్లోంచి నిర్మలంగా నవ్వే నీలం. ఆ తర్వాత మళ్ళీ…

మీ మాటలు

 1. సాయి.గోరంట్ల says:

  . రాక్షసుడా! అంత ప్రేముండీ ఇంత కఠినంగా ఎలా ఉంటావ్? సరేలే పో… నాకూ మళ్ళీ స్పృహ తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. కాలంతో సంబంధం లేదు నాకు అని ప్రేమ అనుకున్నా హృదయం bitter-sweet గా లెక్కేస్తునే ఉంటుందిగా క్షణాల్నీ, గంటల్నీ, రోజుల్నీ…చక్కని పదాలతో సరళమైన కవిత్వం..
  స్వాంతన గారికి త్యాంక్యూ

 2. వనజ తాతినేని says:

  చిత్రం బాగుంది . వ్రాత ఇంకా బావుంది .

 3. ప్రక్రుతి, ప్రేమ, విరహం.. వావ్, ఈ పదాల కోసం కాకపొతే ఇంకెందుకు ఈ click అనిపించేలా వున్నాయి మీ పదాలు సాంత్వన గారు.

 4. చదువుతుంటే ఊపిరాడలేదు .., ఈ వాక్యాలు రాసేటప్పుడు మారే ఆ ముఖం మీది అందమైన రంగులు ఊహించుకున్నాను !! గుక్కతిప్పుకోనివ్వని ప్రియమైన అక్షరాలు … !! ప్రవీణ గారికి అభినందనలు … :) :)

  • Santwana says:

   “గుక్కతిప్పుకోనివ్వని ప్రియమైన అక్షరాలు” __/\__ __/\__ చాలా చాలా సంతోషం!!!

 5. “<>”______ పదప్రయోగం చాలా బాగున్నది.

  యస్ రాక్షసులకే అంత ప్రేముంటుంది…. అందుకే వారంత కఠినంగా వుండగలుగుతారు.

  • ” రాక్షసుడా! అంత ప్రేముండీ ఇంత కఠినంగా ఎలా ఉంటావ్? “_____ ప్రప్రయోగం చాలా బాగున్నది.

   యస్…. రాక్షసులకే అంత ప్రేముంటుంది….. అందుకే వారంత కఠినంగా వుండగలుగుతారు.

 6. Bhavani Phani says:

  బ్యూటిఫుల్ కేప్చర్
  “అప్పుడు ఈ ప్రవాహంలో పాదాలు మాత్రమే మునిగేట్టు కూర్చుని శాంతంగా ఊపిరి పీల్చుకుంటూ చూడగలనేమో నిన్ను.

  ఇదిగో ఈ సూర్యోదయంతో క్షణక్షణం మారుతూన్న లోకాన్ని చూస్తున్నట్టు” ఈ వాక్యాల్లోని భావం కూడా అతే అద్భుతంగా ఉంది .

 7. Venkat Suresh says:

  There’s so much love pouring from each and every letter …beautiful !!

 8. ప్రవీణ గారు….అఫ్సర్ గారి పరిచయం పనసతొనలైతే వాటిని తేనెతో మాగించి పాలమీగడనద్ది….పంచదార గులాబీ రేకులు చల్లి క్రిస్టల్ బౌల్ లో మా ముందుంచినట్లుంది….మీ రాక్షసుడిని నేనైపోతే బాగుండనుకున్నాను …కాసేపు…..హహహ….రోజుకొకటి ఇలాటి లేఖని అందుకోవచ్చు… లేఖంటారా దీనిని….నేనైతే అనలేను….

 9. సారీ స్వాంతన గారు…మీకే నా మాటలన్నీ….ప్రవీణ గారి చిత్రం అనబోయి అలా..

 10. వాసుదేవ్ says:

  “నిన్న వేడిగాలికి తూగుతూన్న మధ్యాహ్ననిశ్శబ్దం లోంచి ఎవరిదో సందేశం మోగింది. అదే piano glissando. గుండె కొంచెమాగింది. నువ్వేనేమో అని చూసా. రాక్షసుడా! అంత ప్రేముండీ ఇంత కఠినంగా ఎలా ఉంటావ్? సరేలే పో… నాకూ మళ్ళీ స్పృహ తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. కాలంతో సంబంధం లేదు నాకు అని ప్రేమ అనుకున్నా హృదయం bitter-sweet గా లెక్కేస్తునే ఉంటుందిగా క్షణాల్నీ, గంటల్నీ, రోజుల్నీ…” నన్ను నేను కనెక్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడే ఆగిపోయాను…మరీ కొత్త స్వరం ఆవిష్కారాన్ని చూస్తున్నా. ఆల్ ద బెస్ట్

 11. ఇది ఎవరు రచించారు? పైన చిత్రం ప్రవీణ కొల్లి అన్నారు…పదాలు స్వాంతన అన్నారు…రచన క్రింద రచన ప్రవీణ గారు అన్నారు….ఎవరు ఇంతకీ రచన…అర్ధం కాలేదండీ..

  • రచన స్వాంతన గారివి, నాది కేవలం ఫోటో మాత్రమే. ప్రతీ వారం నేను తీసిన ఫోటో అనేమో రచనలో నా పేరు!! పదాలన్ని స్వాంతన గారి కలానివే. మీ మేచ్చుకోలన్ని వారివే.

 12. Coffee ginjala vaasana baundi :)

మీ మాటలు

*