బాహుబలానికేనా బహుమతి ?

 

 

-ల.లి.త.

~

    ల.లి.త.

ల.లి.త.

‘మొత్తానికి మన తెలుగువాళ్ళకి వందకోట్ల లాటరీ తగిలినట్టు ఏకంగా ఉత్తమ సినిమా జాతీయ పురస్కారం వచ్చేసిందోచ్’ అని సంబరపడాలో లేక మన సినిమాతో ఉత్తమ సినిమా బహుమతి స్థాయి కిందకి దిగిందని విచారించాలో తెలియటం లేదు. పక్కనున్న తమిళ, మళయాళ, కన్నడ, మరాఠీ సినిమాల్లా బుద్ధిబలంతో కాకుండా బాహుబలంతో సాధించిన బహుమతిలాగా ఉందిది.  వేరే సినిమాలేవీ చూడకుండానే తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు రాలేదేమని నూతిలోకప్పల్లా బాధపడేవాళ్ళకి మాత్రమే ఈ గుర్తింపు ఆనందాన్నిస్తుంది.

అందరినీ అలరించే పాపులర్ సినిమా, కొంతమంది మేధావుల సృష్టికే పరిమితమయే ఆర్ట్ హౌస్ సినిమాల మధ్య అవార్డుల పోటీలో ప్రభుత్వం ఇచ్చే సినిమా పురస్కారాలు ఆర్ట్ హౌస్ కే ఇంతవరకూ దక్కుతున్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికయే సినిమాకు ఖచ్చితంగా మంచి ప్రమాణాలను అనుసరిస్తూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉత్తమ నటుడు, నటి బహుమతులు నెమ్మదిగా ఆర్ట్ హౌస్ నుంచి ప్రధాన స్రవంతి సినిమాలకు కూడా రావటం మొదలయింది. ఇప్పుడు బాహుబలికి ఉత్తమచిత్రం పురస్కారం రావటంతో ఈ అత్యున్నత బహుమతి కూడా  ప్రధానస్రవంతి సినిమావైపుకి చూడటం మొదలు పెట్టిందని అనుకోవచ్చు. ఇది ఎలాంటి మార్పుకు ప్రారంభమో చూడాలి.

ఒక చిత్రం గానీ ఒక రచనగానీ ఉత్తమమైనదని నిర్ణయించటానికి దాని జనరంజకత్వాన్ని లెక్కలోకి తీసుకునే పద్ధతి సరైనది కాదు. ఈ ప్రమాణం సాహిత్యంలోకి కూడా వస్తే చేతన్ భగత్ కి  సాహిత్యంలో అత్యున్నత పురస్కారం ఇవ్వాలి.  ప్రపంచంలో ఎక్కడైనాసరే పాపులర్ సినిమా ఏ ప్రశ్నలూ వెయ్యదు.  కొత్త ఆలోచనలకు అవకాశం అక్కడ తక్కువ. ఓ రెండుగంటలు ప్రేక్షకులకు కలల్ని అమ్మటమే దానిపని.  వ్యాపారవిలువల్ని పక్కనపెట్టి, జీవితాన్ని అన్నిరంగుల్లోనూ నిజాయితీగా చూపించే ప్రయత్నం ఆర్ట్ హౌస్ సినిమాల్లో ఎక్కువగా ఉంటుందిగనుక జాతీయ బహుమతులు వాటికే వస్తాయి.  కలల్ని అమ్మి జనాన్ని నిద్రపుచ్చే సినిమాలు కాకుండా నిజాలు చెప్పి జనాన్ని ఆలోచింపజేసే సినిమాలకు బహుమతులు ఇవ్వటం ప్రభుత్వధ్యేయంగా ఉండేది. ఉండాలి కూడా.  సహజంగానూ  కళాత్మకంగానూ సినిమా తీసే పద్ధతిలో నిజానికి ఆర్ట్ హౌస్, పాపులర్ సినిమాల తేడా రానురానూ చెరిగిపోయి  మల్టీప్లెక్స్ సినిమాగా కుదురుకుంది.  కానీ అవి  నగరాల్లోని మధ్యతరగతి జీవితాన్నీ ప్రముఖుల జీవితచరిత్రలనే  ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి.  సారంలో మాత్రం తక్కువ డబ్బుతో తీస్తున్న ప్రాంతీయ సినిమాదే ఇప్పటికీ పైచేయి. సరైన ఆకృతి దిద్దుకోకపోయినా  సారవంతమైన సినిమాకే  ఉత్తమ చిత్రం బహుమతి వచ్చిన సందర్భాలూ లేకపోలేదు.  నేలమీద నిలబడటమే ఉత్తమ చిత్రం బహుమతికి  ప్రధాన అర్హతగా ఉంటూ వస్తోంది ఇప్పటివరకూ. డెబ్భైల్లో ఎక్కువగా వచ్చే ప్రాంతీయ సినిమాల మధ్య ఈ బహుమతి కోసం పోటీలూ వివాదాలూ లేకపోలేదు గానీ బాలీవుడ్ వీటి మధ్యలో ఎప్పుడూ దూరలేకపోయింది.

తెలుగులో తీసిన సినిమాలకు జాతీయ స్థాయిలో ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అందులో అనుమానం లేదు. తెలుగులో మృణాల్ సేన్ తీసిన ‘ఒకవూరి కథ’ ( ప్రేంచంద్ కఫన్ కథ ఆధారంగా తీసిన సినిమా), రవీంద్రన్ తీసిన ‘హరిజన్’, గౌతమ్ ఘోష్ తీసిన ‘మాభూమి’, శ్యాం బెనెగల్ తీసిన ‘అనుగ్రహం’  చాలా బలమైన సినిమాలు. ‘ఒకవూరి కథ’ కనీసం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానైనా ఎన్నికయింది. మిగతా మూడిటికీ ఏ బహుమతీ రాలేదు. ‘హరిజన్’ ప్రింట్ కూడా మిగలకుండా మాయమవటం గొప్ప విషాదం. కానీ ఈ సినిమాలను తెలుగువాళ్ళు కాదు, ఇతర భాషల దర్శకులు తీశారు. బహుమతులు రాకపోయినా ఎంతోమంది మెప్పు పొందిన సినిమాలివి.

సాహిత్యమూ సినిమా చెయ్యాల్సిన పని జీవితపు కిటికీలన్నిటినీ తెరిచి వెలుగు ప్రసరించటం ఒక్కటే కాదు. ఆ వెలుగుల్ని సొగసుగా పట్టి చూపిస్తేనే అది మంచి సాహిత్యమో  సినిమానో అవుతుంది. జీవమున్న చిత్రాలకు బహుమతులు రావటంతోపాటు వాటిని జనం అంతో కొంతో ఆదరించిన మంచిరోజులు ఉండేవి. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రాలను చాలామంది చూసేవాళ్ళు.  రానురానూ ఉత్తమ జాతీయ చిత్రాలుగా ఎన్నికైన ప్రాంతీయ సినిమాల గురించి మీడియాలో పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారు.  నెమ్మదిగా జాతీయ బహుమతులు ప్రధాన స్రవంతి సినిమావైపుకు రావటంతో వీటికి ఆకర్షణ పెరిగినట్టయింది. అంటే ఇవి కూడా  ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లాగా మారుతున్నాయని అనుకోవాలి.  దీని అర్థం .. చివరికి బాలీవుడ్ కే అన్నీ దక్కుతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాంతీయ సినిమా బడుగులు ఈ బహుమతుల ఆశ కూడా వదులుకోవాల్సిందే. బాలీవుడ్ మెరుపుల ముందు ప్రాంతీయ సినిమాల లోచూపూ నిరాడంబరత్వమూ ఎక్కడ ఆనుతుంది? బాహుబలికి వచ్చిన బహుమతి తెలుగువాళ్ళ కళాత్మక దృష్టికి వచ్చిన మెప్పుకోలు కాదు. CGI హంగులతో హిందీలో బాలీవుడ్ నీ, కరణ్ జోహార్నీ, రమేష్ సిప్పీవంటి వ్యాపార సినిమా దర్శకుడినీ మురిపించినందుకు వచ్చిన బహుమతి. జ్యూరీలో ఉన్న సభ్యుల తెలివిమీద కూడా అనుమానాలు వచ్చే సందర్భం ఇది. సాంస్కృతిక సంస్థల సింహాసనాలమీద ఆ రంగాల్లో కనీసార్హతా, విద్యా లేని అనామకులు కూర్చుంటున్న రోజుల్లో రమేష్ సిప్పీ జ్యూరీ విచక్షణకూడా ఏమంత గొప్పగా లేదు.

హాలీవుడ్ లా భారీ సినిమాలు తీయటమే సినిమా కళ అనుకుంటే అస్థిపంజరానికి కిలోలకొద్దీ నగలు తగిలించినట్టే ఉంటుంది. రక్తమాంసాలున్న మనుషులను చూపించే సినిమాలనూ, మనఆలోచనలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళి మానవత్వాన్ని ఆవిష్కరించే సినిమాలనూ  ప్రోత్సహించటం ఒక్కటేకాదు. వాటిని ప్రచారం చేసి జనంలోకి తీసుకెళ్ళే పని కూడా నిజానికి ప్రభుత్వమే చేయాల్సిన రోజులివి. ప్రభుత్వమే ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు వచ్చిన సినిమాలను దేశంలోని అన్నిభాషల్లోకీ డబ్ చేయించి అన్ని ప్రైవేటు టీవీ చానెల్స్ లో వేయటాన్ని తప్పనిసరి చేస్తే ఎంత బాగుంటుందో!  కానీ, అందరికీ కావలసిన చదువునీ వైద్యాన్నే వదిలేసిన ప్రభుత్వాలు కళాపోషణ పనుల్ని  నెత్తిన వేసుకుంటాయనుకోవటం అత్యాశ.  కనీసం ఉన్న అవార్డులు ఇచ్చేటప్పుడైనా బాధ్యత వహించకపోతే  బాలీవుడ్ అన్నిటినీ మింగేస్తుంది. కిందటి సంవత్సరం ఉత్తమ చిత్రంగా బహుమతి పొందిన ‘కోర్ట్’ సినిమా చూద్దామంటే ఎక్కడా దొరకదు. ‘షిప్ ఆఫ్ తిసియస్’ ను కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ లు భుజాన వేసుకున్నారు కాబట్టి నలుగురికీ తెలిసింది. బాలీవుడ్ తారలకు జాతీయ బహుమతి వస్తే ప్రముఖ వార్త అవుతుంది. ట్రాన్స్ జెండర్ గా నటించిన సంచారి విజయ్ కి కిందటి సంవత్సరం ఉత్తమ నటుడి బహుమతి వచ్చింది. ఒక్క కన్నడిగులకు తప్ప అతనెవరో దేశంలో ఎవరికీ తెలియదు.

బాహుబలిని జ్యూరీ “మహోన్నత స్థాయి నిర్మాణ విలువలతో సినిమాటిక్ మెరుపుతో తెరమీద కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించిన ఊహాత్మక చిత్రం” అని మెచ్చుకుంది.  చిన్నపిల్లకి కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ అని తెలిసిపోయే దృశ్యాలు బాహుబలిలో చాలా ఉన్నాయి. శివలింగాన్ని ఎత్తటంలో, వందలమంది లాగలేని విగ్రహాన్ని ఒంటి చేత్తో ఆపటంలో, ఒక్కోటీ కిలోమీటరు దూరానున్న కొండలమీదనుంచి దూకటంలో హీరో దైవ సమానుడిలా ఉంటాడు.  అలసట, కష్టం వంటివి అంటని మానవాతీత హీరోని చూస్తూవుంటే  ఏ ఉద్వేగమూ కలగదు.  కొన్నిచోట్ల చాలాబాగా, చాలాచోట్ల నాసిరకంగా ఉన్న గ్రాఫిక్స్ ని బాహుబలి సినిమాటోగ్రాఫర్  సెందిల్ కుమార్ కూడా సమగ్రంగా ఉన్నాయని అనలేకపోయాడు.  సరిగ్గా అతకని గ్రాఫిక్స్ నీ దేవుళ్ళలాంటి హీరోలనీ పూజించే సినిమాల్లో తెలివైన ప్రేక్షకుల ఊహలు ఎంతదూరం వెళ్ళగలవు? అక్కడే చతికిలబడతాయి. అద్భుతకాల్పనిక ప్రపంచాన్ని సృష్టించిన బాహుబలిలో, విశ్వాసం పేరుతో బానిసత్వాన్ని romanticise చేయటం ఉంది. యుద్ధవిద్య నేర్చిన అమ్మాయిని వొట్టి అందమైన బేలగా మార్చటం ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ లోకాల్లో తిరిగే మూసలు తప్ప మనుషులు లేరు. తెలుగు పాపులర్ సాంఘిక సినిమాలోంచి బాహుబలిలోకి పాకిన మూసలివి.  సుమోలు గాల్లో పేల్చేసి, యాభైమందిని నరికి పారేసే తెలుగుసాంఘికాల హీరో  జానపద బాహుబలిలో గ్రాఫిక్ కొండలమీదా జలపాతాలమీద దూకుతూ తేలుతూ, బాలీవుడ్ చేరి, అవార్డు కొట్టేశాడు. ‘దబాంగ్’ లాంటి మగ దబాయింపు మూస హిందీ చిత్రసీమలో ఎలాగూ ఉండనే ఉంది.  తల్లిస్థానంలో స్త్రీని కీర్తిస్తూ, భార్యగా ప్రియురాలుగా స్త్రీని తనకంటే తక్కువగా చూసే మగవాళ్ళు ఎక్కువగా ఉన్న ఉత్తరాదికి, దాన్నే తెరమీద  చూపించిన బాహుబలి నచ్చటంలో ఆశ్చర్యం లేదు. బాహుబలి అందించినది ఏ కొత్తదనమూ సున్నితత్వమూ లేకుండా ఒట్టి వ్యాపారంగా మారిపోయిన కళ.

బాహుబలి హాలీవుడ్ సినిమాలాగా వచ్చిందని చాలామంది సంతోషపడుతున్నారు. మరి ఏ ఒక్క హాలీవుడ్ చిత్రంలోనైనా ఆ కథ జరిగిన స్థల కాలాలు మనకి అర్థం కాకుండా ఉంటాయా? నాసిరకం హాలీవుడ్ సినిమాల్లో కూడా ఆ మనుషులు తిరిగే చోట్లు, బతికిన కాలం, నివసించే భవనాలు ఎలా ఉండాలో ఆలోచించుకున్నాకే వాళ్ళు సినిమా తియ్యడానికి దిగుతారు.  బాహుబలిలో నయాగరాని మించిన జలపాతాలు, ఆపైన మంచు కొండలు, ఇంకా పైన పచ్చని నేలలో దేవాలయాలలాంటి కోటలూ, యుద్ధం చేసే చోట తాటితోపులూ ఉంటాయి.  ఈ సినిమా కోసం భూగోళాన్ని ఇన్నిరకాలుగా సాగ్గొట్టేరు. మనకి తెల్సిన జాగ్రఫీ మర్చిపోవాల్సిందే. ఎంత చందమామ కథ అనుకున్నా ఇలాంటి రసహీనతని భరించటం కష్టం.  ఇంత అడ్డూ అదుపూ లేని కాల్పనిక ప్రపంచంలో విహరింపజేయటం హాలీవుడ్ కి కూడా చేత కాదు. వాళ్ళ సినిమాల్లో ఎంత పెద్ద హీరో అయినా పాత్రలోకీ ఆ పాత్రకు సంబంధించిన ప్రపంచంలోకీ చుట్టూరా ఉండే మనుషుల మధ్యలోకీ ఒదగాల్సిందే. మన హీరోలు దేవతలు కాబట్టి,  వాళ్ళకోసం పాత్రలనూ ప్రదేశాలనూ దర్శకులు రత్నాలు పొదిగిన దుస్తుల్లా తయారుచేసి తొడుగుతారు. ఆ దేవతావస్త్రాలను మెచ్చుకు తీరాలి కాబోలనే నిరంతర భ్రమలో వున్న జనం చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు.  ఇప్పుడు ప్రభుత్వం కూడా చప్పట్లు కొట్టడానికి తయారయింది.

సున్నితమైన కొత్త ఫాంటసీలా కథ చెప్తూ ‘ఈగ’ తో దేశమంతటినీ ఆకర్షించిన రాజమౌళి మంచి ప్రజారంజక దర్శకుడు. ఇప్పుడు పెద్ద హీరోల అహంకారానికీ దర్జాకూ తగ్గ కథల దుస్తులు అల్లుతూ, హాలీవుడ్ కలలుకంటూ, ఆత్మలోపించిన సినిమాలు తీస్తున్నాడు. ఆయన్ను అందుకు తగ్గట్టే గుర్తించి, బాహుబలికి ఉత్తమ ప్రజారంజక సినిమా కేటగిరీలో బహుమతి ఇచ్చివుంటే బాగుండేది. ఒకప్పటి ప్రమాణాల ప్రకారం శంకరాభరణం ఉత్తమ ప్రజారంజక సినిమాగానే ఎన్నికయింది. ఇప్పటి భారీ ప్రమాణాల ప్రకారం బాహుబలిని ఈ విభాగంలోనే చేర్చొచ్చు.

బాహుబలికి (అదీ ఇంకా సగం సినిమానే) అర్హతలేని బహుమానం దక్కింది. మన సినిమాల ఆరోగ్యానికి ఈ కొత్తధోరణి జాతీయ బహుమతులు మంచి చెయ్యవు.

 

 

 

మీ మాటలు

 1. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డ్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో ఆ ఇచ్చిన వాళ్లకే తెలియాలి. సినిమా చూసిన వాళ్ళంతా గ్రాఫిక్స్ బాగున్నాయనే మాట తప్పితే, ఇంకో విషయమేది చెప్పలేరు.కొన్ని లోపాలున్నా కంచె ఇంతకన్నా మంచి చిత్రం, నిజాయితీతో కూడిన ప్రయత్నం.

 2. వృద్ధుల కల్యాణ రామారావు says:

  చాలా చక్కని వ్యాసం. నూటికి నూరు పాళ్లూ లలిత గారితో ఏకీభవిస్తున్నాను. వచ్చే ఏడాది చేతన్ భగత్ గారికి జ్ఞానపీఠ్ అవార్డు వస్తే నేను ఆశ్చర్య పోను.

 3. భలే వారండీ బాబూ ఈ తెలుగు వాళ్ళు :)

  వస్తే మాకెందుకు వచ్చింది అని వాపోతారు :)

  రాకపోతే మాకెందుకు రాలేదని గునుస్తారు :)

  మొత్తం మీద వాపోవటం , గునవడం తెలుగు వారికి పెన్ను తో బెట్టిన (ఈ కాలం లో ‘కాలం’ టపా ల తో ) విద్య :)

  చీర్స్
  జిలేబి

 4. sadlapalle chidambarareddy says:

  విశ్లేషణ బాగుంది

 5. Bhavani Phani says:

  ఎప్పట్లానే మీ విశ్లేషణ అద్భుతం . ధన్యవాదాలు

 6. rani siva sankara sarma says:

  బుద్ధి బలంతో కాక బాహు బలం తో చెలరేగిపోయే తెలుగు మనస్తత్వాన్ని బాగా పసిగట్టారు. అసలు విషయం ఏమిటంటే వినోదం పేరుతో వీరంగం చేయ్యడమైనా వుంటుంది సందేశం పేరుతో కృతక సంభాషణలతో చావగొట్టడమైనా వుంటుంది తెలుగులో.

 7. దీనికి పరిష్కారం ప్రత్యామ్యాయ జ్యూరీలు రావాలి. నిజమైన కళాత్మక విలువలతో, సామాజిక బాధ్యతతో వచ్చే సినిమాలకు దాని ద్వారా అవాడ్స్ రావాలి. ఆ జ్యూరీలను ప్రజలు ఆదరించాలి. అప్పుడు ప్రభుత్వం ప్రకటించే ఈ అవార్డులకు విలువ తగ్గిపోతుంది. అవార్డు విషయంలో జరిగే రాజకీయాలు తగ్గిపోతాయి.
  ఇక మీ వ్యాసం గురించి చెప్పేదేముంది? ఎప్పటిలాగా చాలా చాలా బాగుంది. ఈ సారి టైమ్లీగా వచ్చింది.

 8. కె.కె. రామయ్య says:

  రమక్కా, ప్రత్యామ్యాయ జ్యూరీలే కాదు. ఆర్ట్ ఫిల్మ్ ను ఆదరించే ఫిల్మ్ క్లబ్ లు కూడా ఉరూరా ఉద్యమ రూపం దాల్చాలి. అప్పుడే సినీరంగ, సినిమా థియేటర్ల వ్యాపార గుత్తాధిపత్యానికి గండి కొట్టవచ్చు.

  -ల.లి.త. గారూ ఎప్పట్లానే మీ విశ్లేషణ అద్భుతం . ధన్యవాదాలు.
  ( పాత విన్నపమే మరోసారి : తెలంగాణా సాయుధ పోరాట నేపధ్యంగా గౌతమ్ ఘోష్. బి నర్సింగ్ రావులు తీసిన ‘మాభూమి’ సినిమాను సారంగలో పరిచయం చెయ్యరూ )

  • సాహిత్యం తో సినేమాని పోల్చటం సరి కాదు. సాహిత్యం వన్ మాన్ షో (రచయిత మేధా శ్రమతో మాత్రమే సృజించేది). సినేమా టిం వర్క్. టైంస్ ఆఫ్ ఇండియా,హిందుస్థాన్ టైంస్ మెట్రొ సిటీలలో మధ్య తరగతి వర్గాన్ని ఆకట్టుకోవటానికి చేతన్ భగత్ ను ప్రొజెక్ట్ చేశారు. చేస్తున్నారు. ఎంతో మంది జ్ణానపీఠ అవార్డ్ రచయితలు ఉంటే వాళ్ల పేర్లు జనానికి తైలియదు. ఈ పేపర్ల పుణ్యమా అని చేతన్ భగత్ జ్ణానపీఠ అవార్డ్ విన్నర్ల కన్నా ఎక్కువ పేరు వచ్చింది.

 9. THIRUPALU says:

  విశ్లేషణ బాగుంది. అయినా దీని సామాజిక కోణాన్ని ఎవరు పట్టించు కుంటారు! బాహుబలి రీలిజ్ రోజున జంతు భళి ఇచ్చి ప్రేక్షక మహశయులు సంతోష పడటం సోషల్ మీడియాలో చూసినపుడే అనుకున్నా దీనికి జాతీయ అవార్డ్ వచ్చి తీరుతుంది అని :)

  • THIRUPALU says:

   ఈ నాడు కావాల్సింది భయానక రసం. దీన్ని భాహుభాలి సాదిమ్చినట్లె !

 10. విజయకుమార్ పొన్నాడ says:

  చాలా బాగా చెప్పారు.
  ఇది చదవండి

  http://www.teluguone.com/tmdb/news/news-tl-57691c1.html

 11. చక్రపాణి ఆనంద says:

  మీ ఆర్టికల్ చాలా బాగుంది. మంచి అవగాహనతో కూడిన అద్భుతమైన విశ్లేషణ. జాతీయ అవార్డుల తీరుతెన్నులు చూస్తుంటే మంచి సినిమా ప్రేమికులు ఆందోళన చెందాల్సిన ఆగత్యం ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా రియాలిటీ కి దగ్గరగా, సామాజిక ప్రయోజనాలతో తీసే సినిమాల గొంతు నొక్కడమే. సమాజంలో అడుగడుగున కల్తీ ఎలా రాజ్యమేలుతుందో, జాతీయ అవార్డుల విషయంలో కూడా కల్తీ రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. అందుకు నిదర్శనం మంచి సినిమా పట్ల అవగాహన లేని జ్యూరీ మెంబర్ల నియామకమే. సినిమాకి సంబంధం లేని వ్యక్తులు సెన్సార్ బోర్డు మెంబర్లుగా చెలామణి అవుతున్నట్లుగానే సినిమా పరిజ్ఞానం, సామాజిక స్పృహ, కళాత్మక పరిశీలన తెలియని వాళ్ళు కేవలం రాజకీయ పరపతితో ఇక్కడ తిష్ట వేయడం అత్యంత ప్రమాదకరంగా భావించాల్సిన అవసరం.

  మీడియా కూడా ఇందుకు తీసిపోనట్టుగా సినిమాల పట్ల ఎటువంటి అవగాహన లేనివాళ్ళు సినిమా జర్నలిస్టులుగా, విమర్శకులుగా తయారవడం ఇంకొక దురదృష్టమైన పరిణామం.

  ఏది ఏమైనా, చాలా రోజుల తర్వాత మంచి అవగాహనతో కూడిన విశ్లేషనాత్మక ఆర్టికల్ చదివాను. కృతఙ్ఞతలు.,

 12. ఎప్పుడూ మీవంటి మేధావులు మెచ్చిన సినిమాలకే కదా పురస్కారాలొచ్చేది. ఏదో ఒకసారి మాబోటి మామూలు జనాలకి నచ్చిన సినిమాకి ఓ అవార్డు పడేస్తే ఇంతగా ఇదై పోవాలా!!

 13. AMBALLA JANARDHAN says:

  ఆర్ట్ సినిమానే మంచిది అని అనుకునేవాళ్ళకు మనం ఎం చెప్పలేం. సామాన్య ప్రేక్షకులకు అర్థమై, వారికి నచ్చిన సినిమాకు జాతీయ స్థాయి బహుమతి వస్తే, సంతోషించాల్సింది పోయి , దానికి ఈకలు తోకలు పీకే వారినే మన దేశంలో మేధావులంటారు. వారు భూమిపై నడవరు. వారి కళ్లు ఎప్పుడూ తలపైనే ఉంటాయి. ఈ విశ్లేషణ కూడా ఆ కోవలోకే చెందుతుందని నా అభిప్రాయం.

  • సామాన్య జనాలకు నచ్చిన షకిలా సినిమాలకు అవార్డులిస్తే మీ మేధావులు ఒప్పుకుంటారేం!?

   సామాన్య జనాలకు నచ్చిన మద్యాన్ని నిషేధిస్తేగానీ నిద్రపోని మేధావులు సినిమాల విషయంలోమాత్రం ఎంతటి ఔదార్యం కనబరుస్తున్నారో కదా!

 14. chandolu chandrasekhar says:

  లలిత గారు ఒక వూరికథ కి అంతర్జాతీయ అవార్డ్స్ చాల
  వచ్చాయి .మీరన్నట్టు దీనిలో పెద్ద విశేసమేమి లేదు అంగ్ల సినిమాల కాపీ ,కాకపొతే సినిమా ట్రేడ్ లో హిందీ తర్వాత తెలుగుసినిమా బిజినెస్ స్తాయి ,మార్కెట్ ఎక్కువ దాని ప్రభావం కూడా ఈ సినిమా మీ విశ్లేషణ ద్వార అది ఎంత ఫేక్ సినిమో అర్ద్దమైతుంది .

 15. Naveen N says:

  మీ విశ్లేషణ సమగ్రంగా, సహేతుకంగా, ఇంకా చెప్పాలంటే సమతూకంగా ఉంది. ఈ సినిమాకు ఏ ప్రాతిపదికన జాతీయ ఉత్తమ చిత్రం అవార్డిచ్చారో గాని, ఆ అవార్డుని ఫిలింఫేర్ స్థాయికి దింపేసారన్నది సినిమాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కాదనలేని అక్షరసత్యం. లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌కి అకాడెమీ అవార్డు ఇచ్చారు కదా అని ఈ సినిమాను అదే గాటన కట్టలేం.

 16. Kabirdas says:

  ఉత్తమచిత్రం గా ఎన్నిక కాని కొన్ని తెలుగు సినిమాల పేర్లను ఉటకిస్తూ విచారం వ్యక్తపరిచారు. ఆ సినిమాలు తెలుగునాట ఎంతమంది చూశారు? ఎంత జనాదరణ పొందాయి?కనీసస్థాయిలో నైనా ప్రేక్షకుల ఆదరణ వీక్షణలకు నోచుకోని చిత్రాలకు మాత్రమే ఉత్తమచిత్రం బహుమతి పొందే అర్హత ఉండాలా?సినిమాలు ప్రజలకోసమా లేక కొద్దిమంది విశ్లేషకుల కోసమా?

 17. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  సినిమాకి వినోదాన్ని పంచడం తప్ప మరో సామాజిక ప్రయోజనం లేదని ప్రభుత్వం కూడా గుర్తించినట్టుంది.

 18. P.S. NARAYANA says:

  సినిమా అనేది కేవలం నిజాలనే చూపించడం కాదు, నవరసభరితంగా మనసులని ఆహ్లాదపరచడం కూడా! అంతర్జాతీయ సినిమాకి హాలీవుడ్ ని ప్రాతిపదికగా తీసుకుంటారు. లలిత గారి విశ్లేషణ ప్రకారమైతే యుద్ధాల నేపథ్యంలో జరిగిన సినిమా “బెన్హర్” (1959), మాఫియా ముఠాల కుతంత్రాల మధ్య జరిగిన కథ “ది గాడ్ ఫాథర్”(1972), అధ్బుతమైన కాల్పినిక చిత్రం “ఇండియానా జోన్స్ అండ్ లాస్ట్ క్రూసేడ్” (1989) ,పిల్లలనీ, పెద్దలనీ కూడా అలరించిన “జురాసిక్ పార్క్” (1993) కూడా ఆస్కార్ అవార్డులకి అనర్హమైనవే! ఈ సినిమాల ప్రకారమైతే “బాహుబలి”కి అంతర్జాతీయ పురస్కారం కూడా దక్కాలి. ప్రప్రధమంగా “అంతర్జాతీయ పురస్కారాన్ని” సొంతం చేసుకుని, తెలుగువారు తలెత్తుకునేలా చేసిన దర్శక – నిర్మాతలనీ, ఆ చిత్ర నిర్మాణం సంవత్సరాల తరబడి జరిగినా – సంపాదనని ప్రక్కనబెట్టి ఆ సినిమా నిర్మాణం మీదే దృష్టి పెట్టిన ముఖ్య తారాగణాన్నీ, తమవంతు కృషిచేసిన సాంకేతిక నిపుణులనీ అభినందించి తీరాలి. కొన్ని సినిమాలు కొందరికే నచ్చుతాయి. అలాగే అందరికీ నచ్చిన సినిమాలు కొందరికి నచ్చకపోవచ్చు.లోకోభిన్నరుచి. మంచికీ, చెడుకీ కూడా విమర్శ తప్పదు.

 19. P.S. NARAYANA says:

  క్షమించాలి. చివరలో జాతీయ పురస్కారం బదులు “అంతర్జాతీయ పురస్కారం” అని పొరపాటున వ్రాయడం జరిగింది (ఆ పొరపాటు నిజమైతే చాలా బావుంటుంది). తెలుగువాడిగా కొంత ఉద్వేగానికి లోనయ్యాను.మన్నించగలరు.

 20. syed sabir hussain says:

  లలిత గారికి అభినందనలు.బాహుబలికి ప్రభుత్వం అవార్డు ఇచింది.ప్రభుత్వానికి కళలు అమ్మడం అలవాటు కనుక అలాంటి వారికే అవార్డులు ఇస్తారు.ప్రజలు చ్య్తన్యవంతులు కావడం సర్కార్ కు ఇష్టం ఉండదు.సో ప్రజలను నిద్రపుచేచే వారికే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.అమ్మనీ తీయని దెబ్బ అని పాటలు పాడితే బలసుబ్రమన్యానికి అవార్డు ఇస్తుంది..పదండి ముందుకు పదండి త్రోసుకు అని పాటలు పడితే గద్దర్ ను తుపాకులతో కాలుస్తుంది.ప్రభుత్వానికి ప్రజలేప్పుడు నిద్ర పోతుండాలి..లేదా బూతు సినిమాలు చూస్తూ..రంగిల కళలు కంటూ బజ్జోవాలి.ఈ వైఖరి ఇలాగే కొనసాగుతుంది..రేపు బాహుబలి2 కు కూడా జాతీయ అవార్డ్ పార్ట్ 2 అని ఇస్తారు….సయ్యద్ సాబిర్ హుస్సేన్.

 21. srinivas says:

  లోబ్బ్యింగ్ జరిగింది .
  మతి లేని వాళ్ళు కమిటీ లో ఉంటె ఇలాగే ఏడుస్తుంది
  ఇంక పెద్ద జోక్ -ఆంధ్ర ప్రదేశ్ లో నంది అవార్డ్స్ -బెస్ట్ ఆక్టర్ అంటే కేవలం హీరోస్ కి మాత్రా మే ఇస్తున్నారు
  నిజానికి బెస్ట్ ఆక్టర్ అంటే నటించిన ఎవరినా 20నిమిశలు కంటే ఎక్కువగా స్క్రీన్ పయిన కనిపిస్తే వాళ్ళు అందరు కూడా అర్హులే అవార్డ్కి
  అది హాలీవుడ్ సినిమా లో కనిపిస్తుంది
  మన మీడియాకి కళ్ళు చెవులు మతి ఎప్పుడో పోయాయి

 22. Delhi Subrahmanyam says:

  ఇంత మంచి విశ్లేషణ రాసిన లలిత గారు అభినందనీయులు

 23. నీరేటి says:

  ” ప్రేక్షకుల ఆదరణ వీక్షణలకు నోచుకోని చిత్రాలకు మాత్రమే ఉత్తమచిత్రం బహుమతి పొందే అర్హత ఉండాలా?” లాంటి తెలుగు సినిమా పత్రికలను దశాబ్దాలుగా ఏలుతున్న బరక ప్రశ్నలకూ, ప్రావీణ్యం తో పని లేని ఏడుపు బాధలకూ, రచయిత్రి వ్యాసం లో చేసిన తర్కానికీ, లేవనెత్తిన ప్రశ్నలకూ, సవాళ్లకూ ఏమిటి సంబంధం? అవార్డులు పరమ ప్రమాణాలు కావు సరే, కాని అవి దేనికైనా ప్రమాణంగా ఉండాలి కదా? జనాదరణ మాకుంది అని చూపించే బండ కండ బలం లోని లోపాలు చూపడం, మనం చేసేదే ఎందుకు గొప్పది కాకూడదు అని తప్ప మరేదీ చూడనిష్టపడని గొర్రె బుధ్ది తెఛ్చి పెట్టే ప్రమాదాలను ఏకరువు పెట్టడం, మేలైనవి వేరేవి కొన్ని ఉన్నాయొహో , అని అలా ఉన్నప్పుడు చూపించడం, వాటి వల్ల లాభం ఇదీ అని సూచించడం — ఇవి కదా మంచి విమర్శ ఆంటే? విమర్శకులు “భూమిపై నడవరు. వారి కళ్లు ఎప్పుడూ తలపైనే ఉంటాయి” అని ఎంత అలవోకగా హేతువునూ తర్కాన్ని విరిచి మరీ వింగడించారు మరొకరు? ప్రజాదరణ మాకుంది, సరిపెట్టుకో అనే దబాయింపు వాదనలకు సై చెప్పడం కోసం కాదు అధ్యయనం, పరిశీలనలతో కూడిన వ్యాఖ్యలు, విమర్శలు వచ్చేది! తర్కంతో, ఆధారాలు చూపిస్తూ విభేదించే అవకాశం అందరికీ ఉంది, కాని ఆ నిజాయితీ దమ్ముండాలి కదా?

 24. THIRUPALU says:

  సినిమా కు వినియోగ వస్తువు గా (డబ్బు వసూలు చేస్తుంది కనుక )అవార్డ్సు ఇవ్వాలా? కళాత్మక కు అవార్డు ఇవ్వాలా? చూడబోతే కలక్షన్లు బాగా చేసింది గనుక అవార్డు ఇచ్చినట్లుంది.

  • సినేమా అనే దానిని ప్రజలు ఆదరించి పేరు ప్రఖ్యాతులువచ్చాయంటే అది కమ్ర్షియల్ సినేమాలే కారణం. ఇక్కడ రాసిన అవార్డ్ సినేమాలే సినేమా అని మేధావులు భావిస్తే ఆ కళనుప్రజలు ఎప్పుడో తిప్పికొట్టి ఉండేవారు. కమర్షియల్ సినేమా వలననే సినేమా అంటే ప్రజలలో ఒక ఆధరణ, ఆ ఆధరణ కారణంగానే అవార్డ్ సినేమాలకు సైతం గుర్తింపు వచ్చింది. నేడు ఈ రచయిత్రి సినేమా కేటగిరి కింద అవార్డ్ సినేమాలు గురించి రాసిన పాఠకులు స్పందిస్తున్నారు. అచ్చం అవార్డ్ సినేమాలే ఉంటే,సినేమా రంగానికి గ్లామర్ ఉండదు ఇంత చర్చా ఉండదు.

 25. సుధాకర్ ఉణుదుర్తి says:

  కళారంగంలో మెజారిటీ నిర్ణయం తరచూ తప్పుగానే ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మక కళాకారులు సమాజపు సమకాలీనత కన్నానాలుగడుగులు ముందుంటారు, వాళ్ళే మార్గదర్శకులు, వైతాళికులు. సరైన ప్రయోగానికి ఆయా కళాకారులకు అవార్డు ఇస్తేగనక అది నిజానికి నిర్ణేతలకు ప్రశంశాపత్రం.ఈ విషయాన్ని సున్నితంగా తెలియజేసిన, తెలియజేయడానికి తగిన ఓర్పు ప్రదర్శించిన మిత్రులు లలితగారికి అభినందనలు.

 26. సుధాకర్ ఉణుదుర్తి says:

  కళారంగంలో మెజారిటీ నిర్ణయం తరచూ తప్పుగానే ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మక కళాకారులు సమాజపు సమకాలీనత కన్నానాలుగడుగులు ముందుంటారు; వాళ్ళే మార్గదర్శకులు, వైతాళికులు. తప్పీజారీ ఉత్తమ ప్రయోగానికి ఆయా కళాకారులకు ఎప్పుడైనా ఓ అవార్డు ఇస్తేగనక అది నిజానికి నిర్ణేతలు తమకి తాము ఇచ్చుకున్న ప్రశంసాపత్రం. వాళ్ళ లెజిటమసీనీ, ఉనికినీ నిర్దారించుకొనే ఆఖరి ప్రయత్నం. అవార్డులు వ్యవస్థ ఇస్తుంది; నిజాయితీ కలిగిన కళాకారులు వ్యవస్థని నిలదీస్తారు.ఈ మౌలిక విషయాన్ని సున్నితంగా తెలియజేసిన, తెలియజేయడానికి తగిన ఓర్పు ప్రదర్శించిన మిత్రులు లలితగారికి అభినందనలు.

 27. Buchireddy gangula says:

  అదొక cinema ???
  చందమామ Katha
  ప్రైజ్…వేస్ట్..
  ———————————-
  Buchi reddy

 28. rani siva sankara sarma says:

  ఈ సినిమా చందమామ కథ స్థాయికి యెదిగిందా? చందమామ కథలకి బాల సాహిత్యంలో పిల్లల వూహాశక్తినీ సృజనాత్మకతని పెంచడంలో మంచి పాత్ర వుంది.

 29. పవన్ సంతోష్ says:

  //కానీ ఈ సినిమాలను తెలుగువాళ్ళు కాదు, ఇతర భాషల దర్శకులు తీశారు.//
  బెనగళ్ళ శ్యామసుందరరావు అదే శ్యాం బెనగళ్ తెలుగువారు కాదా? మీ మంచి సినిమాల కోవలోకి బి.ఎన్.రెడ్డి గారి బంగారు పాప (సత్యజిత్ రే పథేర్ పాంచాలికి మొదటి ఉత్తమ చిత్రం పురస్కారం రావడంతో దీనికి మిస్సైంది అంటారు) రాలేదు. సరే మీ అభిరుచి మీది కానీ బాహుబలికి అవార్డు రావడం మాత్రం అన్యాయమే.

  • Lalitha P says:

   కెసీఆర్ ఎంత ఉత్తరాంధ్ర వాడో బెనగళ్ళ అంత తెలుగు వాడు. తెలుగు సినిమా చూసి కూడా దానిలో ఉన్న మంచిని గురించి ఎప్పుడూ మాట్లాడని ఆ పెద్ద మనిషిని తెలుగువాడిగా అనుకోలేం. సినిమా భాషనీ ఈస్తటిక్స్ నే మార్చేసిన పథెర్ పాంచాలి తో పోటీ పడినంత మాత్రాన బంగారు పాపకి అన్యాయం జరిగిందని అనుకోవటం సరికాదు. అసలది పోటీ కూడా కాదు. బంగారు పాపది సినిమాకి అలవాటైన భాషే. ఇందులో నా అభిరుచికి పరిమితమైనది ఏమీ లేదు. బంగారు పాప బి ఎన్ రెడ్డి తీసిన ఒక మంచి సినిమా. అంతే. అటువంటి సినిమాల గురించి ఉన్న myth మన తెలుగువారిలో చాలా గట్టిది. తరువాత, నేను పేర్కొన్న సినిమాలు వచ్చిన సంవత్సరాల్లో మంచి సినిమాల మధ్య చాలా పోటీ నడిచింది. మా భూమిని సినిమాటిక్ గా గొప్పదని అనలేం. కానీ తెలంగాణా పోరాటాన్ని అంత నిజాయితీగా చెప్పిన సినిమా ఒక్క చిన్న జాతీయ అవార్డు కూడా పొందలేదు. ‘అనుగ్రహం’ సినిమాటిక్ గానూ వస్తువులో ఉన్న కాంప్లెక్సిటీని బట్టికూడా చాలా మంచి సినిమా. దానికీ ఏమీ లేదు.

   ఇంకో విషయం నిర్మొహమాటంగా చెప్తున్నాను. కొత్తగా సినిమాకి భాష నేర్పే సినిమాలు సినిమా విమర్శకు ప్రధానం. తెలుగులో సాహిత్యం, ముఖ్యంగా కథ ఎంత గొప్పగా ఉంటుందో సినిమా పట్ల మన సాహితీజీవుల అవగాహన, లేదా అలసత్వం అంత అన్యాయంగా ఉంటుందని చెప్పక తప్పటం లేదు. ఎవరినైనా నొప్పిస్తే సారీ. సాహిత్యమైనా సినిమా అయినా sloganeering వాటిని ముందుకి తీసుకెల్లదు. అది కుడి ఎడమల వాళ్ళది ఎవరిదైనా సరే. అలాగే వస్తువు గట్టితనం లేకపోతె కూడా అంతే. రూపం సారం అనేవి సరిగ్గా సమకూడితేనే అందులో జీవితం ప్రతిఫలిస్తుంది. మన ప్రాచీన ఔన్నత్యాన్ని చక్కగా తీసిన జీ వీ అయ్యర్ కీ ఈ అవార్డులు దక్కాయి. ఇదేదో లెఫ్ట్ వింగ్ మాత్రమె ఆక్రమించినచోటని అనుకోనక్కర లేదు.

   అనిల్ రాయల్ గారు ఏదైనా మంచి పట్టున్న కథ కాకపొతే దాన్ని అసలు ఒప్పుకోరు. సినిమా అనేసరికి అంత సులభంగా వ్యాఖ్య చేశారు.

   శ్రీ రామ్ గారు మంచి పాయింట్ లేవనెత్తారు. వ్యాపార సినిమా లేకపోతె వీటి విలువ తెలియదు. వ్యాపార సినిమాని నేనేమీ కాదనటం లేదే. కే వీ రెడ్డి, సింగీతం లాంటివాళ్ళూ, దేశంలో ఎక్కడాలేనంత అందంగా సృష్టించబడిన మన పాత పౌరాణికాలు తీసిన దర్శకులూ వ్యాపారం చెయ్యలేదా? అది కనీస విలువలను అతిక్రమించని వ్యాపారం. బజరంగీ భాయిజాన్ కి wholesome entertainment కి వచ్చిన అవార్డు సరైనది. నేను దాన్ని బాహుబలికి కూడా ఇవ్వొచ్చని అంటున్నాను కొంత ఉదారంగానే. అది రాజమౌళి క్రాఫ్ట్ పట్ల కొంత ఇష్టం. ఇంకా దానికోసం కష్టపడ్డ technicians కూడా గొప్పవాళ్ళు. దాన్ని ఈస్తటిక్ గా ఇంకా బాగా దర్శకుడూ, కళా దర్శకుడూ ఊహించగలిగితే ఈ technicians అది కూడా సాకారం చేయగల సత్తా ఉన్నవాళ్ళు. బాహుబలి రెండుచేతులతో ఆక్రమించినట్టుగా ఎప్పటికైనా చిన్న బడ్జెట్ సినిమా ఒక్క థియేటర్ లో నైనా దూరగలదా? వీటిని ఎంతమంది చూశారని అడుగుతున్నారు. కేరళలో బెంగాల్ లో ఈ అవార్డు సినిమాలు లాభాలు కూడా సంపాదించాయి. మిర్చ్ మసాలా, అర్థ సత్య, మొన్నటి పాన్ సింగ్ తోమార్ .. ఇలాంటి హిట్స్ చాలానే ఉన్నాయి. మా భూమి లాభాలు చేసుకుంది. ఒక ఊరికథ వారం రోజులపాటు ఆంధ్రా అంతటా ఆడింది. చాలామంది చూసేవారు. ఇలాంటి సినిమాలు ఒక్కరోజు కూడా ఎక్కడా కనబడని పరిస్థితి ఇప్పుడు ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అది వేరే పెద్ద చర్చ.

   తెలుగు పెద్ద బడ్జెట్ సినిమా ఈ రోజు చేస్తున్నంత నీతిమాలిన వ్యాపారం ఎప్పుడూ చెయ్యలేదు.

 30. S. Narayanaswamy says:

  బాగా చెప్పారు

 31. చిత్తర్వు మధు says:

  బాహుబలి కి అవార్డు ఇవ్వడం సమంజసమా కాదా అన్న చర్చ లో నేను కూడా కొన్ని విషయాలు చెప్పదల్సుకునాను.ఇది అసంపూర్ణ చిత్రం అంటె లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కూడా మూడు భాగాలు గా తీసారు.టొల్కెన్ మిడ్డిల్ అర్త్ అనే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు.హాబిట్స్ ఆర్క్ లు శక్తులు ఇచ్చే ఉంగరం మోర్డోర్ లో అగ్ని పర్వతం ఎల్ఫ్ లు వారి భాష ఇవన్ని అసందర్భం అని ఆస్కార్ అవార్డ్ ఇవ్వడం మానేసారా? అవతార్ లో ఒక మనిషి ఆత్మ మరి ఒక గ్రహాంతర జీవి లోకి మార్చడం సాధ్యమా?ఆ చిత్రం మల్టీ నేషనల్ కంపనీ లు ఆదిమజాతి వారిని దోచుకోవడం లా అనిపించింది కాబట్టి గొప్ప చిత్రం అనాలా? సాలీడు డీ యెన్ ఏ మనిషి డీఎన్ఏ కలిసి స్పైడర్ మ్యాన్ ,దోమ నోట్లోంచి దినోసార్స్ మళ్ళీ స్రుష్టించి జురాసిక్ పార్క్ పెట్టడం సాధ్యమా? బ్యాట్ మ్యాన్ సూపెర్ మ్యాన్ లాంటి సినిమాల కి అవార్డు లు ఇవ్వ లేదా?మనం ఆహా ఓహో అని మేచ్చుకొలేదా? ఫాంటసీ అంటె ఫాంటసీ నే.అది తెలుగు వాడు తీస్తే ఆత్మ లేదని అసంపూర్ణం అని ఎందుకు అనుకోవాలి?కొత్త ప్రయోగం ప్రపంచ స్థాయి కి తెలుగు సినిమా అని ఎందుకు అనుకొకూడదు.ఫాంటసీ సైన్సు ఫిక్షన్ లో కూడా ఐడియాలజీ ఉండాలా?ఒక మహా ప్రయత్నానికి ప్రోత్సాహం ఎందుకు కాకూడదు?అసలు సినిమా అంటే నే ఫాంటసీ …ఆర్ట్ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ సంగీతం ఫొటొ గ్రాఫి ఉండదా?కళ యెప్పుడు వాస్తవానికి ఎగువ లోనే ఉంటుంది.డాక్యుమెంటరీ తీసినా ఎడిటింగ్ మ్యూజిక్ వివిధ రకాల షాట్స్ తప్పవు.కాబట్టి బాహుబలి అర్ధంతరం గా ముగించినా ఆత్మ లేదని వాదించినా తెలుగు సినిమా లేక భారతీయ సినిమాలో గొప్ప ప్రయోగం అనే చెప్పాలి బహుమతులు ప్రోత్సాహకాలు మాత్రమే .వాటి వల్ల కళ పెంపొందుతుంది.మిగిలిన సినిమాలు బాగులేవని కాదు..

  • Lalitha P says:

   హాలీవుడ్ సినిమా అంతిమం కాదండీ. వాళ్ళ grandeur ని, టెక్నిక్ నీ మాత్రం అనుకరించి సూత్రం వదిలేస్తే ఎలా? బాట్ మాన్ సూపర్ మాన్ లను టెక్నికల్ గా బాగున్నవని అంటారు గానీ గొప్ప సినిమాల కోవలోకి అవి రావు. వాళ్లకి పట్టుగా కథ చెప్పటం వచ్చు. అది మొదట్నుంచీ మన వ్యాపార సినిమా కూడా చేస్తూనే ఉంది. నిజానికి హాలీవుడ్ సినిమా ప్రపంచ సినిమాను మింగేస్తూనే, యూరోపియన్ సినిమా నుంచి cinematographers నీ, దర్శకులనీ దిగుమతి చేసుకుని మంచి aesthetics ని సాధించింది. జురాసిక్ పార్క్, అవతార్ మంచి సినిమాలుగా అవతరించడానికి వాటి వస్తుబలం కారణం. డినోసార్లు ఎలా తయారయ్యేయీ అన్న వివరాలకంటే మనిషి దురాశ, సృష్టికి ప్రతిసృష్టి చేసి అన్నీ నియంత్రించగలనని మనిషి అనుకోవటం ఎలాంటి విపరీతాలకు దారి తీస్తుందీ అన్న చర్చ, చాలా చక్కని సంభాషణలూ ఉన్న ఆలోచింపజేసే ఫాంటసీ అది. హాలీవుడ్ గత కొంత కాలంగా politically correct సినిమాలు తీసే దశలో ఉంది. అవతార్ aesthetics తో చాలామందికి గొడవ ఉంది. అందరూ దాన్ని ఇష్టపడలేదు. అయినా తెల్లవాడు తన జాతివాదాన్ని ఉద్ధరణ వాదాన్ని వదులుకుని మూలవాసిగా ఆకారంతో సహా మారటంలోని పొలిటికల్ correctness గొప్పది. వాళ్ళ ఫాంటసీలన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటాయి.

   లార్డ్ అఫ్ ది రింగ్స్ చాలా చక్కని ఫాంటసీ. అందులో మిడిల్ ఎర్త్ లో ఉన్న మనుషులకి మనిషి లక్షణాలే ఉంటాయి. వాళ్ళు మన హీరోల్లాగా కాకుండా మనుషుల్లా పోరాడతారు. elves లోకం మనకి దేవతాలోకంలో విహరిస్తున్నట్టు చేస్తుంది. మంచి, చెడుల సంఘర్షణ ( ఉంగరం బరువు ) తో హాబిట్ నలుగులాట, అలసట, కష్టం చూస్తే మనమూ నలిగిపోతాం. చెడుపై అతని విజయానికి సంబరపడిపోతాం. gollum దురాశ అతని ఆకారంలో కళ్ళల్లో మూర్తీభవించేలా చేసిన ఆర్ట్ direction మరపురాదు. ఏ లోకానికి ఆ లోకం స్పష్టమైన విభజనతో, నిబంధనలతో ఉంటుంది. పిల్లలనీ పెద్దలనీ ఆకట్టుకునే ఫారిన్ చందమామకథ అది.

   ఈగ ను చక్కటి ఫాంటసీ అన్నానుకదా. అదెలా? ఈ కాలంలో అలాంటి కథ జరుగుతుందా? అయినా ఆ సినిమాకి మనిషి మనిషిలా ఉండటం అనే సూత్రం ఉంది. మనిషికి దివ్య శక్తులు ఎవరైనా ఇచ్చినట్టు చూపిస్తేనే అది చక్కని చందమామ కథ అవుతుంది. ఎన్ని శక్తులున్నా చందమామ కథల్లో చివరికి మనిషి తన బుద్దినీ శరీరశక్తినీ ఉపయోగించే గెలుస్తాడు. బాహుబలి బలమైన కండలు తిరిగిన మనిషి. అతని శరీరశక్తికి ఒక పరిమితి ఉంటుంది. అతనికి ఎవరూ దివ్య శక్తులు ప్రసాదించలేదు. దివ్య శక్తులు లేనిదే ఆ శరీరం భీకరజలపాతాలు అలా దాటలేదని నేనంటాను. బాట్ మాన్ సూపర్ మాన్ లు కూడా ఆ ముసుగుల శక్తి లేనప్పుడు మామూలు మనుషుల్లాగే దెబ్బ తింటారు. ఏ దేవతలూ శక్తిని ప్రదానం చెయ్యకుండానే ప్రక్రుతి సూత్రాలు దాటిన మనవాళ్ళ పధ్ధతిని మీరెలా సమర్దిస్తారో చెప్పండి. మండుతున్న రాతి గుండ్లని చేదించుకుంటూ మామూలు రథం చెక్కుచెదరకుండా పరుగెత్తటంలో హీరో ప్రయత్నం ఏమీ ఉండదు. అక్కడ ఏ దైవం సహాయం చేసిందో అర్థం కాదు. అతి శుభ్రంగా ఎండుటాకు కూడా లేనిచోట ఆమె చితికోసం పుల్లలు ఏరుతూ ఉంటుంది. ఇలాంటి దోషాలు మన పాత సినిమాల్లోనూ ఉండవు. హాలీవుడ్ లో అసలే ఉండవు. ఫాంటసీకి ఐడియాలజీ ఉండనక్కరలేదు. చెడుమీద మంచి గెలుపుని అవి చూపిస్తాయి. కానీ ఫాంటసీ కి ఫాంటసీ లక్షణాలు ఉండాలి. పాతాళ భైరవి మరోసారి చూడండి. అందులో అద్భుత శక్తులూ ఉంటాయి. మనుషులూ ఉంటారు. అయినా కథ seamless గా నడుస్తూ అలరిస్తుంది. ఫాంటసీ సినిమాలు తీసేవాళ్ళకి ఎవరికీ రాని సమస్య రాజమౌళికి మన మానవాతీత సోషల్ హీరోల వల్ల వచ్చింది. హీరో సంకల్పబలంతో మానవ ప్రయత్నం ఎంతో గట్టిగా చేసి జయం సాధిస్తేనే ప్రేక్షకులకు సంతృప్తి కలుగుతుంది. లార్డ్ అఫ్ ది రింగ్స్ లో హాబిట్ కి అది ఉంటుంది. బాహుబలిలో అదిలేక పోవటంతోనే చాలామంది అసంతృప్తి చెందారు.

   • లలిత గారు,

    మీరు చెప్పినవాటిలో చాలావరకు నిజాలే.
    ఈ అవార్డు లను ( గత 10-20 సంవత్సరాలని ) చుస్తే స్తూలంగా కొన్ని విషయాలు అర్థం అవుతాయి
    1) అవార్డు లు ఎంపిక చేసే వారు ఒక స్కూల్ అఫ్ థాట్ నించి మాత్రమే వచ్చారు ( ఆర్ట్ ఫిలిం cindrome)
    నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే చాల మంచి తెలుగు సినిమాలకి అసలు అవార్డు లే రాలేదు .
    ఉత్తమ నటి అవార్డు రావాలంటే హీరోయిన్ రేప్ లేదా molested ayi వుండాలి ( 70-80% అఫ్ receipients )
    Paruthhi Veeran లో ప్రియమణి , Padam oru vilam లో మీరాజాస్మిన్,
    Chivaraku నిమజ్జనం లో శారద , దాసి లో అర్చన . రేప్ Victim లా నటిచడం చాల కష్తం. మన దేశం లో చాల మంది ఎదురుకుంటున్న సమస్య కాబట్టి దాన్ని హైలైట్ చేసే సినిమాలని గౌరవించాలి . కానీ సమస్యల్ల, కేవలం అదే గొప్ప acting అనే మూస దోరణిలో వెళ్ళడం చాల తప్పు. అలాగే ఉత్తమ నటుడు కూడా కొన్ని రకాలుగానే వున్నా పాత్రలు ఇస్తున్నారు . విక్రం ఇన్ పితామగన్, లాంటివి. ఉత్తమనటుడు అంటే పాత్రా మాత్రమే అనే నా ఉద్దేశం అది కమర్షియల్ ఆ లేదా ఆర్ట్ ఫిలిం ఆ అని చూడకూడదు. నేను అమితాబ్ బచ్చన్ నటనకు అభిమాని .నాకు పా లో కన్నా విరుద్ద్ సినిమా లో అయన నటన చాల నచ్చింది. పా సినిమా కూడా మంచిదే కానీ ఈ అవార్డు లు ఎలా ఉంటునాయి అంటే సినిమా రెగ్యులర్ కమర్షియల్ కాబట్టి అది అవార్డు ల కు అనర్హం అని చూస్తున్నారు. ప్రజలకు అవార్డు లను దూరం చేస్తున్నారు ఈ దొరనితో
    2) States lobbying : ఈ అవార్డు జురి అంత వచ్చేది కేరళ, తమిళనాడు , బెంగాల్ నుంచి వారు కావలసినంత పక్షపాతం చూపిస్తున్నారు . Chiranjivi కి అపద్బంధవుడుకి అవార్డు రానీకుండా చేసింది తమిళనాడు వాళ్ళు . ఎన్టీఆర్ కి బడిపంతులు సినిమా కి రావాల్సింది. Erramandaram lo రాజేంద్రప్రసాద్ కి కూడా అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మనకు రైల్వే ప్రాజెక్ట్ లు ఎందుకు రావో ఇది అంతే.
    3) మన సినిమాలకు అవార్డ్లు ఇవ్వక పోవడానికి ఇంకొక కారణం వుంది . హిందూ ద్వేష leftist alochanalu.
    మన క్లాసిక్ సినిమాలు కొంచెం హిందూ కల్చర్ ని సెలెబ్రేట్ చేస్తాయి. షరా మాములుగా లెఫ్ట్ కి ఇది నచ్చదు.
    శంకరాభరణం లో రెండవ సినిమా లోనే శంకర శాస్త్రి గ జీవించన సోమయాజులు గారు స్పెషల్ mention కూడా విలువ చెయ్యర . అంతకు ముందు క్లబ్ డాన్సర్ క్యారెక్టర్ చేసిన మంజుభార్గవి ఎంత గొప్పగా underplay చేసింది. అది పనికి రాలేదు. సాగర సంగం లో ఎంత బాగా నటించన కమల హసన్, జయప్రద, స్వాతిముత్యం లో కమలహాసన్ , రాధిక. వీళ్ళంతా వేస్ట్ అని తేల్చేసిన అవార్డు జురి ల ఎంత గొప్పవో నా అనుమానాలు నాకున్నాయి. ఈవే కాదు స్వాతికిరణం లో అసూయపడే విద్వాసునిగా నటించన మమ్ముట్టి నటన అంతేనా. ఆయనకు వేరే సినిమా లకు అవార్డు లు వచ్చాయి కదా. ఈ సినిమా అన్నిత్నిలోను ఒక common thread హిందూ మ్యూజిక్, త్యాగరాజ కీర్తనులు . బహుశ ఇవి వినగానే ఆ సినిమా లని పక్కన పెడతారు అనుకుంత.
    4) ఓవర్ రిలయన్స్ ఆన్ ట్రాజెడీ.
    అసలు ట్రాజెడీ గొప్పది . మీగత అన్ని ఎమోషన్స్ పనికిరావు అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు .
    సెలబ్రేషన్ అఫ్ లైఫ్ ఇస్ నెవెర్ accepted. ఒక సామాన్య ఇల్లాలిగా నటించిన ఆమనీ ( పెళ్ళిపుస్తకం , Mr.Pellam) వీరికి నచ్చదు. Mr. Pellam Copy అయ్యిన ఆమె నటన ఎంత బావుంది.
    చివరగా చెప్పాలంటే, తల్లి కి కాన్సర్, తండ్రి కి పక్షవాతం, తమ్ముడికి మతిస్తిమితం ఇలా వుంటే తప్ప వాళ్ళ కడుపులు nindavu . ఇదే గొప్ప family.

   • Lalitha P says:

    రాఘవ గారు.. తెలుగువారికి అవార్డ్స్ రాలేదన్న మీ ఆవేశం అర్థమైంది. నాకు తెలిసినది వివరించడానికి ప్రయత్నిస్తాను.

    సహజత్వంతో కూడిన సినిమాలకు రావటమే ఈ అవార్డ్స్ ప్రత్యేకత. అంటే ఇవి ఆస్కార్, ఫిలిం ఫేర్ అవార్డ్స్ లాంటివి కాదు. మన దేశానికివి కాన్స్ అవార్డులవంటివి. రిత్విక్ ఘటక్, సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, శ్యాం బెనెగల్, కారంత్, గిరీష్ కర్నాడ్, కాసరవల్లి, అరవిందన్, అదూర్ వంటి వాళ్ళు బలమైన సినిమాలు తీయటం వల్ల ప్రోగ్రెసివ్ గానూ, underdog protagonist గా ఉండే సినిమాలివి. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. పై దర్శకుల్లో మృణాల్ సేన్, శ్యాం బెనెగల్ తప్ప మిగతావాళ్ళంతా centrists . జీవితం అన్ని రంగులతో ప్రదర్శితం అయిన సినిమాలు ఎన్నో. వీటిలో కళాత్మక విలువలకు గట్టి స్థానం ఉంది. పై దర్శకులంతా realism తో సినిమాలు తీస్తూ సంస్కృతీ సంప్రదాయాలు బాగా తెలిసి ఉన్నవాళ్ళు. దీన్ని మీరు ఆర్ట్ ఫిలిం సిండ్రోమ్ అంటున్నారు. ఈ దర్శకులకు తెలిసినంత జీవితం, అంతర్జాతీయ సినిమా, వివిధ కళలపట్ల అవగాహన మన తెలుగు దర్శకులలో ఎంతమందికి ఉందొ మనమే ఆలోచించుకోవాలి.

    సీతాకల్యాణం లో పర్షియన్ కార్పెట్ ఎక్కడినుండి వచ్చిందని సత్యజిత్ రాయ్ అడిగాడు. స్వాతిముత్యం హరికథ ఎంతో పక్కాగా ఉందని చిదానంద్ దాస్ గుప్త అన్నాడు. ఇది బెంగాలీవాడి మాట. మనకి బెంగాలీ కల్చర్ ఎంతవరకూ తెలుసు. మన హరికథె మనం మర్చిపోయాం. వాళ్ళ చదువు ముందు మన దర్శకుల చదువు ఎల్.కె.జీ. సత్యజిత్ రాయ్ అలా అంటే మన సీతాకల్యాణం విలువ తగ్గిపోతుందా అని దబాయిస్తాం మన తెలుగువాళ్ళం. సినిమా చూస్తూ ఆనందించటం వేరు. అది ప్రేక్షకుల పని. ఇవన్నీ తెలుసుకోవటం దర్శకుల పని. వాళ్లకి ఎంతో vision ఉంటె తప్ప గొప్ప సినిమా రాదు. మన దర్శకుల్లో బాపు కి ఈస్తటిక్స్ బాగా తెలుసు. విశ్వనాధ్ కి బ్రాహ్మణ కల్చర్ తెలుసు. మన సినిమాలు మనకి గొప్ప. వీళ్ళిద్దరికీ ఉన్న బలాలతో కొన్ని మంచి సినిమాలు తీశారు. దేశం మొత్తం మీద పోటీకి వెళ్తే … ఎన్ని రాష్ట్రాల సినిమాలు చూశాం మనం? జ్యూరీ అవన్నీ చూస్తుంది.

    ఉత్తమ నటుడు నటి అంటే పాత్ర మాత్రమే. భాషాభేదం కూడా లేదు. ఇది నేషనల్ అవార్డ్స్ లో పదేపదే నిరూపితం అయింది.

    1. సాగరసంగమం వచ్చిన సంవత్సరమే కమల్ హసన్ కు ‘మూండ్రం పిరై’ (తెలుగులో వసంత కోకిల) లో ఉత్తమ నటుడు వచ్చింది. సాగర సంగమం చాలా గొప్ప సినిమా. కానీ బద్దలైన మనసుతో మూద్రం పిరై లో కమల్ నటన .. అదీ వ్యాపార సినిమానే. రెండిటిలో దేనికి ఇవ్వాలంటే వోట్ల మెజారిటీ…. అప్పుడే అర్థ్ లో భర్త చేత నిరాదరించబడి కష్టపడి నిలదొక్కుకున్న గృహిణి పాత్ర వేసిన షబానాకు ఉత్తమ నటి వచ్చింది.

    2. శంకర శాస్త్రి తో పోటీ పడ్డది స్పర్శ్ లో గుడ్డివాడుగా వేసిన నసీరుద్దీన్ షా. అది నటనకు కొత్త భాష్యం. ఆ కదలికలు ఎలా ఉన్నాయో మీరే చూసి చెప్పండి. శంకరశాస్త్రిగా సోమయాజులు subtelity తగ్గిన సందర్భాలు శంకరాభరణంలో లేకపోలేదు. నిజానికి సోమయాజులు నటనాసామర్ధ్యం పూర్తిగా బైట పడ్డది వంశవృక్షంలో.

    3. స్వాతిముత్యంలో కమల్ హసన్ బాగా చేశాడు. కాని ఎంతో subtle గా తబరన కథే లో రిటైర్ అయి పెన్షన్ కోసం నానా పాట్లూ పడే పాత్రలో చేసిన చారుహాసన్ కి వచ్చింది.

    4. ఆపద్బాంధవుడు కి మీరు ఏ నేషనల్ అవార్డు రావాలని అనుకుంటున్నారో తమిళం వాళ్ళు ఏమి చేశారో నాకు సరిగా అర్థం కాలేదు. తెలియదు కూడా. అదే సంవత్సరం మనకి మిస్టర్ పెళ్ళాం బెస్ట్ రీజినల్ ఫిలిం గా నేషనల్ అవార్డు వచ్చింది.

    5. బాపు హీరోయిన్లు అందరూ బాపు చెప్పిన విధంగా ‘stylised acting ‘ చేస్తారు. దానికి అవార్డు వస్తుందా అన్నది ప్రశ్నే. సాధారణంగా ఆస్కార్, కాన్, మన నేషనల్ అవార్డ్స్ లో నటనకు అవార్డు వస్తు ప్రధాన్యత బట్టి, ఎంత రేంజ్ ప్రదర్శించారన్న దాన్ని బట్టి ఉంటుంది.

    సంగీతం విషయంలో ఎప్పుడూ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడ్డవాటిదే పెద్దపీట. శంకరాభరణంకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఫిమేల్ సింగర్ మూడూ వచ్చేశాయి. అంతేకాక wholesome entertainment తో పాటు ఈస్తటిక్స్ బాగున్నాయనీ పేర్కొన్నారు. నిజానికి శంకరాభరణం కంటే క్లాసికల్ టచ్ ఎక్కువున్న పాటలు మలయాళం, కన్నడంలో ఉన్నాయి. అలాంటి అన్ని పాటలకీ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.

    మన ప్రాచీన ఔన్నత్యాన్ని AUTHENTIC గా చూపిస్తే అవార్డు ఎందుకు రాదు? అలా తీసే సమర్ధులు ఎంతమందన్నది ప్రశ్న. తెలుగువాళ్ళు అటుంచి దేశంలోనే అలాంటివి తీసే దర్శకులు లేరు. ‘ఆది శంకరాచార్య’ ‘భగవద్గీత’లకి ఉత్తమ సినిమా అవార్డులు వచ్చాయి. Scholarly pursuits చెయ్యకుండా సంస్కృతి గురించి ఉపన్యాసాలు చెప్పటం మన తెలుగు సినిమా రంగంలోనే ఉంటుంది.

    celebration of life కోసమే కదా wholesome entertainment awards విభాగంలో ఉన్న బహుమతి.

    మనం బెంగాలీ వాళ్ళలా dominate చెయ్యాలంటే మనం చెయ్యాల్సింది చాలా ఉంది. ‘అన్యాయాలు’ చాలా భాషల వాళ్లకి జరిగే ఉంటాయి. చెయ్యాల్సిందేదో చెయ్యగల చదువు ఇప్పుడు మన సినిమా వాళ్లకి లేదు. క్రిష్ మన పరువు కాస్త నిలబెడుతున్నాడు. కనీసం బెస్ట్ రీజినల్ ఫిలిం అవార్డు సరిగ్గా వచ్చింది. సంతోషం.

    దీనితో ఇక నా వివరణలు ఆపేస్తాను.

   • శ్రీనివాసుడు says:

    సాగరసంగమం విడుదల 1983.
    మూండ్రాంపిరైకి ఉత్తమనటుడు బహుమతి వచ్చింది 1982 లో. విడుదల కూడా 1982
    దానికీ దీనికీ ఏం సంబంధం?
    1983 లో సాగరసంగమం కమల్ కు పోటీ వచ్చింది, గెలుచుకున్నదీ ఓమ్ పురి. పాత్ర అనంత వేలంకర్. చిత్రం అర్ధ సత్య.
    **************
    అలాగే అర్థ్ సినిమాలో షబానా ఆజ్మీ పాత్రకు బహుమతి వచ్చింది 1982 లో. ఆ సినిమా విడదల అయింది 1982 లో. సాగరసంగమం విడుదల 1983 లో.
    దానికీ దీనికీ ఏం సంబంధం?
    *****************
    అలాగే స్పర్శ్ సినిమాకుగాను నసీరుద్దీన్ షా పాత్రకు బహుమతి వచ్చింది 1979 లో. కానీ, అది విడదల అయింది 1980 లో. శంకరాభరణం విడుదల 1980 లో.
    దానికీ దీనికీ ఏం సంబంధం?

   • Lalitha P says:

    1980 జనవరిలో స్పర్శ్, శంకరాభరణం సెన్సార్ అయాయి. ముందు సంవత్సరానికి అవార్డుల పోటీలో మరుసటి సంవత్సరం జనవరి 31 వరకూ కూడా తీసుకోవటం అప్పట్లో ఉండేది. 1979 సంవత్సరానికే ఈ రెండింటికీ అవార్డ్స్ వచ్చాయి. ఇవి రెండూ 1979 లో తయారైన సినిమాలే.

    అర్థ్, సాగర సంగమం, మూండ్రం పిరై విషయంలో ఈ సంవత్సరాల విడుదలల విషయంలో నేను తడబాటు పడ్డాను. మీరు సరి చేసినందుకు ధన్యవాదాలు. వేలంకర్ పోటీ పడ్డాడు కాబట్టి మన సాగర సంగమం హీరో రాలేకపోయాడు. దానికదిగా చూస్తె సాగరసంగమంలో కమల్ నటన అద్భుతం. కమల్ తో కమల్ పోటీ పడ్డాడని నేను పొరపాటు పడ్డాను.

 32. sreeram velamuri says:

  నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

 33. సరిగ్గా చెప్పారు. మంచి వ్యాసం. అభినందనలు

 34. కె.కె. రామయ్య says:

  వ్యవస్థ అవార్డులు ఇస్తుంది; నిజాయితీ కలిగిన కళాకారులు వ్యవస్థని నిలదీస్తారు ~ సుధాకర్ ఉణుదుర్తి
  తెలుగు పెద్ద బడ్జెట్ సినిమా ఈ రోజు చేస్తున్నంత నీతిమాలిన వ్యాపారం ఎప్పుడూ చెయ్యలేదు ~ ల.లి.త.
  మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

 35. “రమక్కా, ప్రత్యామ్యాయ జ్యూరీలే కాదు. ఆర్ట్ ఫిల్మ్ ను ఆదరించే ఫిల్మ్ క్లబ్ లు కూడా ఉరూరా ఉద్యమ రూపం దాల్చాలి. అప్పుడే సినీరంగ, సినిమా థియేటర్ల వ్యాపార గుత్తాధిపత్యానికి గండి కొట్టవచ్చు.”
  హరిబాబు
  ప్రత్యామ్నాయ ప్రేక్షకుల్ని కూడా పెంపొందించాలి,ప్రత్యామ్నాయ ఫిల్మ్ క్లబ్బులని నిర్వహించటానికి ప్రత్యామ్నాయ కళాపోషకుల్ని కూడా ఉత్పత్తి చెయ్యాలి,ఇంక అబోల్డు చెయ్యాలి – కానీ ఆ పిల్లిమెడలో గంట్ అకట్టే వీరాధివీరులౌ ఎవ్వరు?

 36. “మండుతున్న రాతి గుండ్లని చేదించుకుంటూ మామూలు రథం చెక్కుచెదరకుండా పరుగెత్తటంలో హీరో ప్రయత్నం ఏమీ ఉండదు. అక్కడ ఏ దైవం సహాయం చేసిందో అర్థం కాదు. అతి శుభ్రంగా ఎండుటాకు కూడా లేనిచోట ఆమె చితికోసం పుల్లలు ఏరుతూ ఉంటుంది.”
  హరిబాబు
  నిజమె,ఇలాంటి తర్కవిరుద్ధమయిన విషయాలు చాలా ఉన్నాయి బాహుబలిలో!

 37. గొరుసు says:

  లలిత గారూ … కరుడు గట్టిన తీవ్ర వాదులనైనా మీ అక్షరాలు మైనం ముద్దలా మార్చేస్తా యని, అంత వరకూ ఉన్న అభిప్రాయాలను గాలికి వదిలి మీకు వత్తాసు పలుకుతారని ఈ సమీక్ష చదివాక తెలిసింది :)
  మీ ఆవేశం, ఆవేదన అర్థమయ్యింది –
  మీరన్నది పచ్చి నిజం. ” బాహుబలి “కి ఉత్తమ ప్రజారంజక చిత్రం గా అవార్డ్ ఇస్తే ఏ పేచీ లేదు. ఉత్తమ చిత్రం అవడం నాకూ కొరుకుడు పడని విషయమే ( అర్థం అయ్యింది కదా – ఆవార్డులను ఎన్నిక చేసే టీంకు ఓనమాలు తెలియవని )
  అయితే “ఈగ ” దర్శకుడిగా మాత్రం రాజమౌళిని నెత్తిన పెట్టుకుంటాను :)
  ఇక “ఒక ఊరి కథ ” (1977 ) చిత్రం బాగున్నా యండమూరి వీరేంద్రనాథ్ మాటలు ఘోరమైన “సంకరం” – అటు తెలంగాణ , ఇటు కోస్తా మాండలీకాలు కలిపేసి కంగాళీ గా రాసాడు. ఆయనకు మాండలీకాల మీద పట్టు లేదు.
  “అనుగ్రహం ” సినిమాకు అవార్డు రాకపోవడం ఇప్పటికీ నాకు బాధే! ఏవిధంగా చూసినా అదొక గొప్ప సినిమా – మళ్ళీ ఈమధ్యనే చూశాను.
  మీది సందర్భోచిత వ్యాసం – అభినందనలు.

  • Lalitha P says:

   ఒక వూరి కథ కృత్రిమ సంభాషణల గురించి బాగా గుర్తు చేశారు. చాలా పెద్ద లోపం అది…

 38. మాధవి says:

  లలిత గారూ,
  ఉన్నతసాంకేతిక విలువలతో తీసి అత్యధిక ప్రజాదరణ పొందిన తెలుగు ఫాంటసీ మూవీకి జాతీయ అవార్డు ఎందుకివ్వకూడదూ అని సగటు ప్రేక్షకురాలిగా ఆలోచించాను కానీ, మీ వ్యాసం, చిత్తర్వు మధుగారి కామెంటుకు మీ స్పందన చదివాక ఈ సినిమాలో లోపాలు స్పష్టంగా తెలిసాయి. మంచి విశ్లేషణ అందించారు.

 39. భాస్కరం కల్లూరి says:

  లలితగారూ…ఎప్పటిలానే మీ విశ్లేషణ మీదైన మార్క్ తో బాగుంది. బాహుబలి పై 22-7-2015 న నేను రాసిన బ్లాగును మీతోపాటు సారంగ పాఠకులతో పంచుకోవాలనిపించింది:

  బాహుబలి!…అయ్యో రాజమౌళి!!

  రాజమౌళి సినిమాల్లో మర్యాద రామన్న ఒకటే చూశాను. అది కూడా టీవీలో! ఉన్నత స్థాయికి చెందిన సృజనాత్మకత, జనరంజకత, విలక్షణత కలిగిన మంచి దర్శకు డనిపించింది. ఒకవిధంగా నేను రాజమౌళి అభిమానిని అయ్యాను. ఆయన నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయని ఆశపెట్టుకున్నాను.

  బాహుబలి విషయానికి వస్తే, విడుదలకు ముందు దానికి ఇచ్చిన హైప్ ను రొటీన్ పబ్లిసిటీలో భాగంగా తీసుకుని పక్కన పెడితే, రాజమౌళి మీద నమ్మకంతో ఆ సినిమా అన్నివిధాలా గొప్పగానే ఉంటుందనుకున్నాను. తీరా చూశాక చాలా నిరాశ చెందాను. “అయ్యో, రాజమౌళి” అనిపించింది.

  బాహుబలి కొన్ని విషయాల్లో గొప్ప సినిమాయే. ఉన్నత శ్రేణి సాంకేతిక విలువలతో, కెమెరా పనితనంతో, సెట్టింగ్ లతో అది హాలీవుడ్ సినిమాలను తలపించేలానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే 300 కోట్లు రాబట్టిందని వింటున్నాం. బాలీవుడ్ లో కూడా తన ఉనికిని చాటుకుని దేశవ్యాప్త ఆదరణను చూరగొందని కూడా సమాచారం. మంచిదే. అన్ని తరగతుల ప్రేక్షకులను ఔరా అనిపింపజేసే లక్షణాలు ఈ సినిమాకు ఉన్న మాట నిజమే. అయినాసరే నేను ఎందుకు నిరాశ చెందానంటారా? నా కారాణాలు ఇవీ:

  1. బాహుబలి పైన చెప్పిన విషయాలలో గొప్ప సినిమాయే కానీ, కథాబలిమి ఏదీ? అది సీరియెల్ సినిమా కావడంలో నాకు ఎలాంటి అభ్యంతరం కనిపించలేదు. కానీ దానిని సీరియెల్ గా తీయదగినంత కథ ఏదీ? కథాబలం ఏదీ?

  2. అది కూడా కల్పిత కథ కావడం నన్ను నిరాశ పరచడమే కాక, చాలా ఉసూరు మనిపింపజేసింది. ఓ చందమామ తరహా కల్పిత కథ తీయడానికి అంత గొప్ప సాంకేతిక విలువలతో,అన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి హాలీవుడ్ తరహాలో సినిమా తీయాలా? అదే ఏ చారిత్రక కథనో, ఇతిహాసకథనో తీయడానికి ఇన్ని వనరులూ వెచ్చిస్తే ఇది చిరకాలం నిలిచిపోయే చిత్రం అయుండేది. జనం ఆ కథతో ఐడెంటిఫై అయ్యే వారు. రాజమౌళి పేరు చిరస్థాయి అయ్యేది. హాలీవుడ్ లో వచ్చిన అలాంటి సినిమాలను గుర్తుచేసుకుని చూడండి…నా అభిప్రాయంతో మీరు కూడా తప్పకుండా ఏకీభవిస్తారు. మనకు ఆ స్థాయి కలిగిన చారిత్రక/ఐతిహాసిక సినిమా లేని లోటు తీరేది. అలాంటి మరిన్ని సినిమాలకు గొప్ప ఒరవడి అయ్యేది.

  3. రాజమౌళి మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు కనుక సినిమా అంతటా అది కనిపిస్తుందని ఆశ పడ్డాను. అక్కడా నిరాశే ఎదురైంది. నాకు సినిమా అంతటా పెద్ద పెద్ద శబ్దాలతో సౌండ్ ట్రాకే కొట్టొచ్చినట్టు వినిపించింది. మంచి ఒడ్డూ పొడవూ ఉన్న ప్రభాస్, రాణాల విగ్రహాలే కనిపించాయి. వాళ్ళ మెలితిరిగిన కండలే కనిపించాయి. ప్రభాస్ వేసిన గెంతులే కనిపించాయి. కత్తి శబ్దాలే వినిపించాయి. అన్నీ వినిపించి కనిపించాయి కానీ రాజమౌళి కనిపించలేదు. రాజమౌళి ఎక్కడ పొరపాటు పడ్డారో అర్థం కాలేదు. నా ఉద్దేశంలో రాజమౌళి కాసులు కురిస్తే చాలని సరిపెట్టుకునే దర్శకుడు కాదు. ఒక సృజనశీలిగా తనకు, తన లాంటి వారికి కూడా సినిమా సంతృప్తి కలిగించాలని భావించే దర్శకుడు. కానీ ఈ సినిమా ఆ అవగాహనకు తులతూగేలా లేదు. ఎక్కడో ఎందుకో ఆయన దారి తప్పారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇలా దారి తప్పకూడదు.

  4. ఆర్థికంగా సాంకేతికంగా సాధించిన ఈ సక్సెస్ ను అడ్డుపెట్టుకుని రాజమౌళి ఈసారి చారిత్రక లేదా ఇతిహాస కథా వస్తువుతో ముందుకు రావాలి. మహాభారతం సినిమాగా తీద్దామని తన కోరిక అన్నట్టు ఆయన చెప్పారు. తప్ప కుండా తీయాలి. రాజమౌళి ముద్రతో అది తప్పకుండా విలక్షణంగా ఉంటుంది. బాహుబలి రికార్డ్ ను బద్దలు కొడుతుంది.

 40. భాస్కరం కల్లూరి says:

  అన్నట్టు ఇంకో విషయం. బాహుబలి చూసిన రెండు మూడు రోజులకే టీవీలో ఒక హాలీవుడ్ సినిమా చూశాను. యుద్ధం సన్నివేశాలు మక్కికి మక్కిగా కనిపించాయి. ఆ సినిమా పేరు మరిచిపోయాను.

  మీరన్నట్టు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలను నిర్ణయించే ప్రమాణాలలో సమూలమైన మార్పు కనిపిస్తోంది. మనదేశాన్ని ఆర్తికంగా, సాంకేతికంగా, సైనికంగా, ఇతరత్రా ప్రపంచానికి అత్యంత బాహుబలోపేతంగా చూపించాలన్న ఆకాంక్షను కూడా ఈ అవార్డు ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

 41. * అవతార్ aesthetics తో చాలామందికి గొడవ ఉంది. అందరూ దాన్ని ఇష్టపడలేదు. అయినా తెల్లవాడు తన జాతివాదాన్ని ఉద్ధరణ వాదాన్ని వదులుకుని మూలవాసిగా ఆకారంతో సహా మారటంలోని పొలిటికల్ correctness గొప్పది. *

  అవతర్ సినేమాపేరు,సినేమాకథ హిందూయిజం నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొన్నాను అని చెప్పాడు. బహుశా అది మనదేశ మేధావి వర్గానికి, అన్యమతస్థులకు అభ్యంతరం అయి ఉండవచ్చు.

  Pls search google

  1) Hindu beliefs are fascinating – James Cameron

  2 ) ‘Avatar’ may be subconsciously linked to India: James Cameron

  అవతర్ లా హిందూయిజం పేరు ప్రస్థావించకుండా తీసిన సినేమాలపై ఎక్కడ అభ్యంతరం వచ్చినట్లు లేదు.
  3) How movies embraced Hinduism (without you even noticing)
  http://www.theguardian.com/film/2014/dec/25/movies-embraced-hinduism

  • శ్రీనివాసుడు says:

   శ్రీరామ్ గారూ!
   మీరిలాంటి దృష్టాంతాలు కొన్ని వేలు, లక్షలు ఇచ్చినా ప్రయోజనం శూన్యం. ‘‘హిందూ’’ అనే పదం ఎక్కడ, ఎలా వినబడినా, ఉటంకించినా, దానిని అతి ఘోరమైన మనువాదానికి మాత్రమే ప్రతీకగానో, హిందూ జాతీయవాదానికి నవకేతనంగానో, భారతీయ సమాజంలోని బహుళత్వాన్ని చాపచుట్టగా సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న బుల్‌డోజింగ్ ప్రక్రియకు వనరుగానో మాత్రమే చూస్తారు. ‘‘భారతీయత’’ అనే భావనకు సమానార్థకంగా మీరు ‘‘హిందూ’’ అనే భావనను చూపినా దానిని హిట్లర్ జాతీయవాదానికి మరోరూపంగా భావించేవాళ్ళకు మనం ఏమి చెప్పగలం?
   ‘‘హిందూ’’ అని సందర్భోచితంగా ఏదైనా విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు, దాన్ని గుర్తించవలసివచ్చినప్పుడు అది ఎంత విశిష్టమయినా దాన్ని చాలా లౌక్యంగా విస్మరించడం ఒక ఎత్తుగడ…అంతే.
   ద్వేషంలో నుండి వివేచన జనించదు.
   మీరు క్షీరనీరన్యాయాన్ని అనుసరించడం అలవరచుకోని కరుడుగట్టిన మేధావివర్గం ముందు చెప్పి మరీ శంఖం ఊదుతున్నారేమో!

  • Lalitha P says:

   అవతార్ ఈస్తటిక్స్ అంటే ఆ గాడీ రంగులూ వేషాలవంటివి. అవేమీ మనదేశపు ఈస్తటిక్స్ కావు. నిజానికి మన ఈస్తటిక్స్ చాలా బాగుంటాయి. మణి కౌల్ సినిమాల్లో భారతీయ ఆత్మ ప్రతిఫలిస్తుంది. matrix లో ఓరియంటల్ ఫిలాసఫీని ఎంతో బాగా అందుకుంటాడు. ప్రాచ్య తత్వవిజ్ఞానం, యోగా ఇప్పుడు పాశ్చాత్య సినిమాల్లో దర్శకుల్లో చాలా ఫాషన్. అవతార్ పర్యావరణవాదులకీ anti capitalists కీ ఎంతో ఇష్టమైన సినిమా. దాన్ని కాదన్న మతవాదులు ఎవరో నాకైతే తెలియదు. కళలు ఎల్లలు లేకుండా మనుషుల్ని కలుపుతాయంటే ఇదే.

   • ప్రాచ్య తత్వవిజ్ఞానం, యోగా ఫాషన్ గా మారటానికి వెనకాల వందఏళ్ల పైగా చరిత్ర ఉంది. వివేకా నందుడు నుంచి జిడ్డు,యు.జి. కృష్ణమూర్తి వరకు ఎంతో మంది ప్రభావం, పాశ్చ్యాత్య సైంటిస్ట్ ల పై ఉంది..ముఖ్యంగా క్వాంట ఫిజిక్స్ వారిని హిందూ ఫిలాసఫి ని అర్థం చేసుకోవటానికి పురికొల్పాయి.

    The Influence of Vedic Philosophy on Nikola Tesla’s Understanding of Free Energy
    An Article by Toby Grotz

    Nikola Tesla and Swami Vivekananda
    http://www.teslasociety.com/tesla_and_swami.htm
    ________________________________________________
    How does quantum physics work, you may ask, what is it, and where does it come from?

    http://www.krishnapath.org/quantum-physics-came-from-the-vedas-schrodinger-einstein-and-tesla-were-all-vedantists/

    వెస్ట్రన్ ఆర్ట్ కి భారతీయ కళకి భేదాలు ఉన్నాయి. మరిన్న్ని వివరాలకు

    Search & watch below video in youtube

    Aesthetic Universals and the Neurology of Hindu Art – Vilayanur S. Ramachandran

 42. rani siva sankara sarma says:

  లలిత గారూ
  చందమామ కథ లలోనూ జానపద కథలలొనూ కనబడే కార్యకారణ సంబంధం ఈ సినిమాలో లోపించిందని బాగా వివరించారు. [మాయలూ మంత్రాలు ]
  ఈ సినిమాలో హీరో హీరోయిన్ పట్ల వొక సన్నివేశం లో ని ప్రవర్తన అత్యాచారాన్ని పోలివుందని విమర్శ వచ్చింది. మీరేమంటారు? దర్శకుడు అటువంటి వి మర్శకు అవకాశం యెందుకు యిచ్చాడు?
  http://www.thehindubusinessline.com/blink/watch/the-rape-of-avanthika/article7433603.ece

  • Lalitha P says:

   ఆమె ఫెమినిస్ట్ దృష్టికోణంలో నుంచి రాసింది. నాకిది అంత సులభంగా తేల్చేయగల విషయం అనిపించదు. సోషల్ కల్చరల్ అండ్ విజువల్ ఆంథ్రోపాలజీతో ముడిపెట్టి చూడాల్సిన విషయం. ఈ కాలంలో స్వేచ్చగా ఆలోచిస్తూ బతికే స్త్రీగా నేను కూడా బాహుబలి అవంతిక మీద తీసుకున్న అతి చనువుని సమర్ధించలేను. యుద్ధవిద్య నేర్చిన అమ్మాయితో శృంగారం ఆమె తెలివినీ బలాన్నీ గౌరవిస్తూ సమానస్థాయిలోనే ఉంటేనే బాగుండేది. ఈ సీన్ ను పగతో రగిలిపోతున్న అమ్మాయిలో స్త్రీత్వాన్ని తట్టి లేపటంలా దర్శకుడు భావించి ఉండొచ్చు. మళ్ళీ మనం సోషల్ సినిమా వైపే చూడాలి. మహేష్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి మగధీరహీరోలు అమ్మాయిలను వేధించటం ఉంటుంది. ఆ అమ్మాయిలు కూడా మూర్ఖంగా తెలివి లేకుండా రక్షణకోసం వీళ్ళ కండబలం మీద ఆధారపడుతూ ఉంటారు. (పోకిరి, ఖలేజా, దేశముదురు వగైరా). (రాజమౌళి విక్రమార్కుడులో అమ్మాయి కూడా హీరోమీద కోర్కెని తీవ్రంగా చూపిస్తుంది). దీన్నంతా హీరోగారి చిలిపితనం అనుకునేలా జనానికి అలవాటు చేసేశారు సినిమావాళ్ళు. బాహుబలిదీ ఇదే ధోరణి. erotica ను చూపించే తీరులో వ్యాపార సినిమా స్త్రీల లైన్గికతకు సంబంధించిన ఏ విషయాన్నీ కళాత్మకంగా చూపించదు. తెలివిలేని అందమైన హీరోయిన్ల మీద మూవీ కామెరా అత్యాచారం చేస్తుంది. సినిమా చూసే మగవాళ్ళకు కనువిందు చేయటం, డబ్బులు కురవటం ముఖ్యం..

   లైంగిక ప్రవర్తనను సాధారణీకరించటం వీలవదు. ఆలోచిస్తే శృంగారంలో హింస కూడా భాగమే. ఆడజంతువుల వెనక మగజంతువులు పడే లక్షణం జన్యుపరంగా మనిషిలో కూడా కొనసాగుతూ వస్తుండవచ్చు. చాలా విషయాల్లో మనిషి పరిణతి చెందుతున్నట్టే కోరికల్ని సంస్కారం మాటున దాచటం, క్రమంగా ఆ సంస్కారం వ్యక్తిత్వంతో భాగం కావటం కూడా జరిగిపోతున్నాయి.

   మగవాళ్ళ వేధింపు ఇంచుమించు ప్రతి స్త్రీ ఎదుర్కొనే సమస్య. సరైన పెంపకంలేక, మానసిక దౌర్బల్యాలతో పెరిగిన మగపిల్లలు సినిమాలను అనుకరించే ప్రమాదం తప్పకుండా ఉంది. సమాజం, సినిమా రెండూ ఒకదాన్నొకటి ప్రతిఫలిస్తాయి. ఇదో విషవలయం. అందుకే బాధ్యత ఉన్న దర్శకులు ఇలాంటి సీన్లు తీయాలన్న చాపల్యానికి లొంగరు. వ్యాపార చిత్రం ‘రాంఝ్ నా’ లో తీవ్రమైన ఈ సమస్యను తీసుకున్నాడు ఆనంద్ ఎల్. రాయ్. అమ్మాయిని అబ్బాయి వెంటాడి వేధించటం వల్ల వాళ్ళిద్దరి చుట్టూ ఉన్న అందరి జీవితాలూ కూడా ఎలా దెబ్బ తింటాయో బుర్రకెక్కేలా చూపిస్తాడు. వేధింపుల సరదా ఉన్న అబ్బాయిలకి ‘బాబోయ్ ఇంత బాధ పడాలా, పరిణామాలు ఇలా ఉంటాయా’ అని భయం వేసేలా చేస్తుంది రాంఝ్ నా.

 43. చింతా రవీంద్రన్ తీసిన హరిజన్ వివరాలు ఎవరైనా చెప్పగలరా ప్లీజ్

 44. నీరేటి says:

  విఖ్యాత మళయాళీ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు షజీ నీలకంఠన్ కరుణ్ గోస గమనించండి. కళ్లు చెమర్చాల్సింది దీనికి :

  http://www.deccanchronicle.com/opinion/op-ed/030416/360-degree-the-rs-500-crore-conundrum.html

 45. ప్రాచ్య తత్వవిజ్ఞానం, యోగా ఫాషన్ గా మారటానికి వెనకాల వందఏళ్ల పైగా చరిత్ర ఉంది. వివేకా నందుడు నుంచి జిడ్డు,యు.జి. కృష్ణమూర్తి వరకు ఎంతో మంది ప్రభావం, పాశ్చ్యాత్య సైంటిస్ట్ ల పై ఉంది..ముఖ్యంగా క్వాంట ఫిజిక్స్ వారిని హిందూ ఫిలాసఫి ని అర్థం చేసుకోవటానికి పురికొల్పాయి.

  http://www.krishnapath.org/quantum-physics-came-from-the-vedas-schrodinger-einstein-and-tesla-were-all-వేదంతిస్త్స్

  వెస్ట్రన్ ఆర్ట్ కి భారతీయ కళకి భేదాలు ఉన్నాయి. మరిన్న్ని వివరాలకు

  Search & watch below video in youtube

  Aesthetic Universals and the Neurology of Hindu Art – Vilayanur S. Ramachandran

  • శ్రీనివాసుడు says:

   మీరుస్తున్న సమాచారాన్ని చూస్తే ‘‘హిందూ’’ అనే తత్త్వాన్ని, పదాన్ని ద్వేషిస్తున్న వారందరూ అధ్యయనం చేయవలసింది ఎంతో వుందని తెలుస్తోంది. విద్వేషాన్ని పెంచే, క్రక్కే వ్రాతలకు కేటాయించే సమయాన్ని తత్త్వ అవగాహనకై నియోగిస్తే వారికీ, సమాజానికీ మేలు జరగవచ్చు.
   ఎవరూ సర్వజ్ఞులు కారు, ప్రకృతిని అర్థంచేసుకునే క్రమంలో నిరంతర పయనమే జరగవలసింది.
   మన సనాతన తత్త్వాన్ని కూలంకషంగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని, శాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలు, కవులు, కళాకారులు జమిలిగా చేయడం ముదావహమని నా భావన.
   మా అవగాహనలోని సంకుచితత్వం మీ సమాచారంతో క్రమంగా తొలగిపోతూవుందని తెలపడానికి సంతసిస్తున్నాను.

 46. rani siva sankara sarma says:

  లలిత గారూ
  మన సినిమాలు భగవద్గీత , శంకరాచార్య లాంటి పాండిత్యపూర్వకమైన సినిమాలకి జాతీయ అవార్డులని గెల్చుకొని గర్వించే స్థాయినుంచి బాహుబలిలో సంస్కృతిని వెతికే స్థాయికి వెళ్లాయి. బాహుబలిలో దేవతల ప్రసక్తి ,మొ గలులకి ముందటిదిగా భావించబడే ప్రాచీన వాస్తు నిర్మాణ శైలిని కొందరు ఆకాశానికి ఎత్తారు. కొందరు రాజకీయ పెద్దలు కూడా గంగాజలంలా స్వీకరించారు.
  బాగుంది కాని [ మాటి మాటికీ గాయపడే మనోభావాలు] స్త్రీలపై అత్యాచారాలని అందంగా చిత్రిస్తూ, మధ్యలో శివవిష్ణు ప్రార్తనలని పొదిగే యిటువంటి బాహుబలులపట్ల యెందుకు ఈ గొప్పమనోభావాలు మిన్నకుం టా యి? దేవీ దేవతల గౌరవాన్ని పట్టించుకోవడమే సంస్కృతా? స్త్రీల గౌరవం కేవలం ఫెమినిస్టులకే చెందినదా?
  బాహుబలం. మగటిమి, దానికి విదేశీ మేక్ ఇన్ యిండియా హాలీవుడ్ హంగులూ కలిస్తే అదే మనం పూజించే సంస్కృతి ?

 47. rani siva sankara sarma says:

  మరిచిపోయాను ఈసినిమాలో కాషాయం జండాల రెపరెపలు కూడా అనేకమందిని ఆకర్షించాయి.

 48. rani siva sankara sarma says:
 49. శ్రీనివాసుడు says:

  ఒక సాధారణ జనరంజక సినిమా అయిన బాహుబలిలో మన సంస్కృతి ఘనతను చాటడాన్ని, హిందూ ఫాసిజాన్ని, స్త్రీలపట్ల అగౌరవాన్ని వెతికే హిందూ ఫోబియా వారు ఉదహరించిన యాంటీ హిందూ వెబ్సైట్ ఫస్ట్ పోస్ట్ లోని వ్యాసానికి క్రింద వున్న వ్యాఖ్యలనుకూడా చదివితే పాక్షిక వృత్తం సంపూర్ణమవుతుంది.
  ఆ వ్యాసాన్ని, వ్యాస రచయితని కూడా ఎలా చితగ్గొట్టారో కూడా అర్థమవుతుంది.
  http://www.firstpost.com/india/ss-rajamoulis-baahubali-now-has-a-religion-and-its-decidedly-hindu-2343938.html

 50. rani siva sankara sarma says:

  జనరంజక సినిమాలలో స్త్రీల పట్ల అగౌరవాన్ని అనుమతించడం సబబేననే సోకాల్డ్ పెద్ద మనుషుల వుద్దేశ్యం. నేనన్నది కూడా అదే. గొడవ చెయ్యాల్సిన విషయాలు వేరే.

 51. శ్రీనివాసుడు says:

  సుమతీ శతకం, వేమన శతకం మాత్రమే సినిమాలుగా తీయవలసిన ఖర్మ ఇంకా సినీ కళాకారులకు పట్టలేదేమో! సినిమాలోని ప్రతి ఒక్కరూ ధీరోదాత్తులుగా వుండాలనేదే నేటి నిర్దుష్ట పెద్దమనుష్యలు అభిరుచి.

 52. rani siva sankara sarma says:

  యింతకీ ఈసినిమాలో స్త్రీ ల పట్ల తీవ్రావమానం జరిగింది అన్నది నేను కాదు, వొక ఫెమినిస్టు మేధావి. జనరంజకసినిమాలో ని అత్యాచార సమ ర్థనని వ్యతిరేకించద్దని ఆవిడకి హితబోధ చెయ్యండి , అలావ్యతిరెకించడం హిందూ వ్యతిరేకత అవుతుందని ఆవిడకి బోధించండి దమ్ముంటే.

 53. rani siva sankara sarma says:

  వేమన శతకం తీసే దమ్ము ఎవరికీ లేదు. వెంటనే దియేటర్ల మీద దాడులు జరుగుతాయి. పీకే సినిమాని ఎన్నోరెట్లు [సంస్కృతీ సంప్రదాయాలపై ]మించిపొయినవిమర్శలు అందులో వుంటాయి.
  యింతకీ ప్రభాస్ ప్రతినాయకుడా?

  • శ్రీనివాసుడు says:

   వేమనంటే మీకు భయమయితే సుమతీ శతకాన్ని సినిమాగా తీయడానికి ప్రయత్నించండి. మహిళా శరీరాన్ని ఒక గిరాకీ వున్న వ్యాపారవస్తువుగా, చర్మప్రదర్శనగా, మాంసపుముద్దగా మార్చిన ఈ కార్పొరేట్ అడ్డర్టయిజ్‌మెంట్లలో, విదేశీ సంస్కృతిని నిట్టనిలువుగా అనుకరించే మాధ్యమాలలో, ఫ్యాషన్లలో, మేల్ లిబిడోపై వ్యాపారం చేస్తున్న మార్కెట్ వికృత చేష్టలలో అనుక్షణమూ తీవ్రమైన అవమానానికి, దోపిడీకి స్త్రీ గురి అవుతూనేవుంది. ముందుగా ఏనుగులు పోయే దారిని మూయాలిగానీ ఆవాలు పోయే సందులని కాదు.

 54. మీకు తెలుసో లేదో వి.రామచంద్రన్ ను మార్కో పోలో ఆఫ్ న్యురోసైన్స్ అని హేతువాది రిచర్డ్ డాకిన్స్ కితాబిచాడు. ఆయన రాసిన పుస్తకాలలో ఆది శంకరాచార్య,భగవద్గీత కోట్ చేశాడు.

  హిందూ మతం గురించి అర్థం చేసుకోవటనికి ఈ క్రింది సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను.

  Samkhya : The arithmetic of nature’s evolution

  http://the-redpill.blogspot.in/2010/04/samkhya-arithmetic-of-natures-evolution.html

 55. A Conversation between David Bohm and U.G. Krishnamurti
  https://sulochanosho.wordpress.com/2011/01/31/bohm-and-ug/

 56. ఒక వ్యాఖ్యలో రెండు, అంతకంటే ఎక్కువ లింక్ లను పెట్టి ప్రచూరిస్తే “Your comment is awaiting moderation”. అనే మేసేజ్ చూపించి, ఆ వ్యాఖ్య ప్రచూరింప బడటం లేదు. ఈ విషయాన్ని మూడు నాలుగు సార్లు టెస్ట్ చేసి కనుకొన్నాను. అందువలన చాలా ఒక్కొక్క లింక్ ఒక్కొక్క సారి కామెంట్ గా ప్రచూరించవలసి వచ్చింది. గమనించగలరు.

  Pls read this article
  మేరు పర్వతం – మనిషి అంతరంగం

  http://tinyurl.com/o8csfal

 57. rani siva sankara sarma says:

  జనరంజక సినిమా పేరుతో చెలరేగే అత్యా చారపరులని నేను చంకనెత్తుకోను.యిలాంటి జనరంజకుల మధ్య వేమనకి దిక్కు యేది?

 58. శ్రీనివాసుడు says:

  ఒక జనరంజక సినిమాని కూడా హిందూ వ్యతిరేకతకు, హిందూత్వ మీద దుమ్మెత్తి పోయడానికి వాడుకునే వారిని నేను ఉపేక్షించను. **నడుమ బట్ట కట్ట నగుబాటు కాదొకో’’, అనేవారి గురించే వేమన చెప్పింది.

 59. rani siva sankara sarma says:

  అత్యాచారం జనరంజకం అనివాదించే వాళ్ళతో నేను మాట్లాడను సెలవు

 60. బాహుబలి ఒక ఫాంటసీ సినిమా!ఫాంటసీలో లోపాలు వెతకదల్చుకుంటే హాలీవుడ్ ఫాంతసీలు కూడా నిలబడవు.
  O
  ఇలలే జరగనిది కలలో జరుగుతుంది.అన్ని కలలూ సర్రియలిస్టిక్ జర్నీలే!అన్ని సినిమాలలోనూ లోపాలు ఉంటాయి.క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ అని గ్రీకు పురాణాలను ఆధారం చహెసుకున్న సినిమా ఒకటి చూశాను టీవీలో.అందులో జ్యూస్ అనే వాళ్ళ దేవాధిదేవ్వుణ్ణీ ఆ దేవుడికే పుట్టిన నెగటివ్ ధోరణూలున్న కొడుకు ఒక అండర్వరల్డ్ లాంటి లోకంలో గొలుసులకి కట్టేసి ఆ చెంపా ఈ చెంపా వాయితూ ముతక తిట్లు తిడుతూ ఉంటాడు!తనే సృష్టించిన ఈ బ్రహ్మాణదంలో తన శక్తులు పనిచెయ్యని స్థలమట అది,ఇందులో ఏమి హేతువు ంది?
  O
  అసలు ఈ కధ మొదలయ్యేది దేవుళ్ళలో కొందరికి ప్రజలు మనని మర్చిపోయారు,వాళ్ళకి మనం గుర్తు రావాలంటే కష్టాలు పెట్టాలి అనీనుకుని మానవులకి సమస్యల్ని సృష్టించహ్డం అనే మెలికతో,ఇందులోని సంభావ్యత ఏమిటి?మళ్ళీ ఈ అదెవుళ్ళ మీఅద్ పోరాడేది ద్జ్యూస్ గారికి మనవ్కాంత ద్వార పుట్టీఅన్ పోసీడాన్ అనే దైవపుత్ర్డు,క్రీస్తు కన్నా ముందరే కొందరు దైవపుత్రులు ఉన్నారని అనుకోవాలా?
  O
  బొక్కలు వెదకాలనుకుంటే మహా మహా టెంకమండుమెంట్లూ బెణర్ లాంటి చిత్రరాజాలు కొడా నిలవ్వు!ఫాంటసీకి లాజిక్ వెదకటం గడ్డివామిలో సూదిని వెదకటం,ఎందుకొచ్చిన గోల?
  O
  ఒక తెలుగు సినిమాకి అవార్డు అవ్స్తే ఎందుకొచ్చింది అని తెలుగువాళ్ళు మాత్రమే ఏడవగలరు.హ్యాట్సాఫ్ తెలుగుదనం!!

 61. నీరేటి says:

  ” ఒక తెలుగు సినిమాకు అవార్డు అవ్స్తే ఎందుకొచ్చింది అని తెలుగువాళ్ళు మాత్రమే ఏడవగలరు.” : వేరే వాళ్లు కూడా యేడుస్తున్నారు! తెలుగువాళ్ళు కూడా ఏడవగలుగుతున్నారు! శ్లా ఘించండి!

 62. chandolu chandrasekhar says:

  పురాణాలలో మాదిరి జానపద కథలో పితృ స్వామ్యం భావనలు తక్కువ .జనపదంలో
  స్ర్తీ,పురుష సంభాదాలు పురాణ పాత్రలకి భిన్నం గా ఉంటాయి .అవంతిక ఇక్కడ తనను తానూ ఇష్టపడి సంగమం అయింది .జానపద లక్షణం అది .జనపదం లో స్ర్తీ ,పురుషులు ,వేట,ఆటపాట ,లో సాంగత్యం ఎక్కువ .రేప్ కి వేరే అర్దం వుంటుంది .వరూధిని ప్రవరాఖ్ డిని కోర్కె తిర్చ మని అడుగుతుంది . నువ్వు ఎన్ని గుళ్ళు ,గోపురాలు తిరిగి స్వర్గాని కి చేరిన ఈ సుఖం కోసమేగా , అదేదో ఇక్కడే కాని అంటుంది .సురతం మోక్ష్ సాధనం అంటుంది .విశిష్ట అద్వెతమ్ ప్రకారం స్త్రీ కి ఆ స్వేఛ్చ వుంది
  ..ప్రతి దానికి స్తల ,కాలాలు వుంటై .feminism కూడా కొన్ని స్తల ,కాల లక్షణాలు ఉనాయి ,

 63. rani siva sankara sarma says:

  చందోలు చంద్ర శేఖర్ గారి అభిప్రాయాలు ప్రత్యేకంగా పరిశీలించదగినవి . ఆలోచన రేకెత్తించేవిగా వున్నాయి. ముఖ్యంగా జానపద సంస్కృతి గురించి.
  [ ఐతే లలిత గారు జానపదకత లక్షణాలు ఈ సినిమా లో లోపించాయని సుదీర్ఘవివరణ యిచ్చారు.]
  కేవలం జనరంజక సినిమా అనే మూసపద్ధతి సమర్థనని బద్దలు కొట్టి సాంస్కృతిక పరిశీలనకి ద్వారాలు తెరిచారు చందోలు చంద్రశేఖర్ గారు. సినిమా పై పరిజ్ఞానం వున్న లలిత గారివంటి వారు దీనిపై మాట్లాడగల సమర్థులు.

  • Lalitha P says:

   నేను చంద్రశేఖర్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నా. అంత తేలిగ్గా స్త్రీవాదాన్ని అన్వయించే విషయం కాదిక్కడ. కానీ తీసిన విధానం వల్ల నేను ఆ సీన్ ని సోషల్ సినిమాతో పోల్చాను. మీకు ఒక ఉదాహరణ కావాలంటే గిరీష్ కర్నాడ్ తీసిన ‘ఒందానందు కాలదల్లి’ లో శృంగారం. రెండు పులుల సంగమం లా ఉంటుంది. అచ్చం అలాగే రాజమౌళి తీయాలని కూడా నా ఉద్దేశ్యం కాదు. ఇది దర్శకుడి ఊహ, అభిరుచికి సంబంధించినది. జనపదాల్లో శృంగారాన్ని ఊహించి తియ్యగలగాలి. Raw passion ని ధైర్యంగా ఆసక్తికరంగా తియ్యటం సులువుకాదు. మనం ఇప్పుడు తెచ్చుకున్న విక్టోరియన్ విలువలవల్ల ఊహలు ఎండిపోతున్నాయి.

 64. gbsastry says:

  శ్రీమతి లలితా గారు,
  అనుగ్రహం సినిమా తీసిన శ్రీ బెనెగళ్ళ శ్యామ్ సుందర్ (శ్యాం బెనెగల్ ) పదహారణాల తెలుగు వాడు తెలంగాణావాడు వాణిజ్య ప్రకటనచిత్రాలనించి కళా చిత్రాల వైపు మరలి తెలుగువారు ఆలోచించే సినిమాలు తీస్తారన్న పేరు తెచ్చినవాడు.
  ఆయన తీసిన అనుగ్రహంలో శ్రీమతి వాణిశ్రీ అత్యుత్తమ మైన నటనచూపి అభిమానుల అలరించారు
  కొంచెం తెలుగు వాడినన్న గర్వంతో మీ ద్రష్టికి తెస్తున్నాను తప్పులెంచడానికి కాదు
  జీ బీ శాస్త్రి

 65. “అనుగ్రహం సినిమా తీసిన శ్రీ బెనెగళ్ళ శ్యామ్ సుందర్ (శ్యాం బెనెగల్ ) పదహారణాల తెలుగు వాడు”.
  శ్యాం బెనెగల్ తెలుగు వాడు కాదు.
  అతడు మంగుళూరు వాడు. కొంకిని/కన్నడ మాతృబాష అతనిది.
  హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు ,అంతే.

 66. శ్రీనివాసుడు says:

  Shyam Benegal, (born December 14, 1934, Trimulgherry, Secunderabad, British India [now part of Hyderabad, Andhra Pradesh, India]),
  Benegal’s father was a professional photographer originally from Karnataka, and, as a result, Benegal grew up speaking mostly Konkani and English and with an appreciation of the visual. He was a cousin of filmmaker Guru Dutt and an early admirer of Bengali filmmaker Satyajit Ray. Benegal graduated with a degree in economics from Nizam College—a constituent college of Osmania University in Hyderabad—where he started a film society.

 67. Bhavani Phani says:

  లలిత గారూ,ఇక్కడ మీ కామెంట్స్ చదివితే చాలు . ప్రపంచ చలన చిత్రం రంగపు చరిత్ర మొత్తం ఒకేసారి అర్థమైన అనుభూతి , ఆనందం కలిగాయి. ఎంతుందో కదా తెలుసుకోవాల్సింది!! ధన్యవాదాలు

 68. Devarakonda says:

  The so-called great Telugu movie ‘Bahubali’ does not deserve the national best film award for the same reasons why a James Bond movie is not selected for Oscar award.

 69. Devarakonda says:

  ఏ కారణాలకైతే జేమ్స్ బాండ్ సినిమాలకి ఆస్కార్ అవార్డులు రాకూడదో, రావో, అవే కారణాలకు బాహుబలికి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందే అర్హత ఉండదు. జరక్కూడనిది జరిగింది కాబట్టి బుద్ది జీవులు విశ్లేషణకు ప్రయత్నిస్తారు. అర్హతలేని అవార్డులు వస్తే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఆహ్వానించాలనడం అవివేకం. దురభిమానం!

 70. భారత ప్రభుత్వం సినేమాలకి అవార్డ్ లు ఇవ్వవలసిన అవసరమేమిటి? వస్తువుల మీద ఐ.యస్.ఐ. మార్క్ వేసినట్లు, ప్రభుత్వం అవార్డ్ వస్తేనే గొప్ప సినేమానా అవుతుందా?

  ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా, అవార్డ్ కమీటీ ఏర్పాటు మొదలు కొని నటినటులు,టెక్నిషన్ల వరకు వర్గాలు, రాజకీయాల ప్రమేయం ఉంట్టుంది. ఒకప్పుడు ఆర్ట్ ఫిల్మ్ లకు ఇచ్చారు, ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్ లకు ఇస్తున్నారు, ప్రభుత్వ వైఖరి మారింది అని ఆక్షేపణలు ఎదుర్కొనే బదులు. ఇటువంటి వివాదాలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం వీటీని రద్దు చేస్తే సరిపోతుంది..

 71. rani siva sankara sarma says:
 72. Sriram M says:

  6 పర్యాయాలు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు, పద్మశ్రీ మరియు పద్మభూషణ్ అవార్డులు పొందిన తమిళ మహాకవి వైరముత్తు బాహుబలి చూసిన తరువాత ఆయనకు కలిగిన అనుభూతులను వివరిస్తూ దర్శకుడు రాజమౌళికి రాసిన లేఖ ను ఇక్కడ పొందుపరిచాను.

  Dear Mr. Rajamouli.

  I watched Baahubali, haven’t come out of amazement, yet. The images of the film still flutter as butterflies few centimeters above my brows.
  Is it another epic written on celluloid? Is it omnipresent sized poetry? Is it celebration of images? I wonder.
  The first viewer of ‘Baahubali’ is you.
  The first viewer of Baahubali’ is you. Before the world watched the movie you were the first to see it with your mind. You haven’t missed even a millimeter of your vision while translating it to the art form through your hard work – your technical knowledge – your mastery over medium – your pain – your creative tension – your penance – I stand in wonderment because I understood all these and more.
  Cinema is nothing hut suspending disbelief – a lie invented through technology. Only the Director creates the belief system. The waterfalls and the mist hit your face: the body and soul get drenched.
  I saw a poet hiding inside Rajmouli when butterflies encircled dream girl disperse as butterflies flew away.
  I saw a painter when imagery of drilling lotus caught in the hands of a sculpture.
  I saw the consummation of an artiste when the celebration of musicians, dancers and the people to announce the arrival of Baahubali reflected in the eyes of an elephant.
  I saw imagination comparable to Mahakavi Kambar when Kattapa drew the sword and nextly a headless trunk wobbling away.
  No one has ever staged a battle scene with so many details of war craft and magnificence. You have deployed all the aspects of new technologies to the fullest without a drop of leakage.
  Tomorrow your name will be inscribed as the Indian cinema’s address to the world.
  l’m feeling proud of you while my lips murmur ‘here comes one among us to compete with the rest of the world’.
  I extend all my good wishes, Mr. Rajamouli.

  Yours loving
  Vairamuthu

 73. rani siva sankara sarma says:

  బాహుబలిలో పవిత్ర భారత ఖండంలోని అతిప్రాచీన సంస్కృతికి అవమానం జరిగింది అంటున్నారు గిరీష్ కాసరవల్లి. నిజమేనా?

 74. వైరముత్తు గారు మెచ్చారు గనుక ఇక తిరుగు లేదా? నోరున్నవారిదే ఊరు అని రుజువు చేస్తూ న్నారు గదా! భట్రాజులు బావదారిద్యం లో కొట్టుకొని పోకపోతే సరి!

 75. శ్రీనివాసుడు says:

  Mahishmati
  Mahishmati was an ancient city mentioned in the epic Mahabharata. It was the capital of the kingdom named Heheya. Kartavirya Arjuna, a Yadava king, was the foremost ruler of Mahismati and Haiheya (Mbh 13:52). He was killed by Bhargava Rama. Epic Ramayana mentions about the attack of Rakshasa king Ravana on Mahishmati. Pandava general Sahadeva also has attacked Mahishmati, when King Nila was its ruler (2:30). King Nila of Mahishmati is mentioned as a leader in the Kurukshetra War, rated by Bhishma as a Rathi. His coat of mail had blue colour (Mbh 5:19,167).It was a major trade centre in Mauryan and post Mauryan period.Mahishmati was terminus of Dakshinapath trade route which was extended to Amravati in Andhra Pradesh.Mahishmati is identified to be modern day Maheshwar, a town in the Khargone District in Madhya Pradesh state of India.
  History

  During the 6th and 7th centuries, Mahishmati may have served as the capital of the Kalachuri kingdom.[1] The Kalachuris were the builders of the famous cave temples on Elephanta Island in Mumbai harbor and also of several caves at the well-known site of Ellora, including the famous Rameshwara cave (Cave 21). Both Elephanta and Ellora are World Heritage Sites.

 76. rani siva sankara sarma says:

  ఎవరా మూలవాసులు? వారికి ప్రత్యేక సంస్కృతీ దేవతలూ లేరా? వారిలో శివ పూజ వుందా? బలులని మొత్తంగా వ్యతిరేకిస్తారా? వారు శాకాహారులా? తెల్లగా వున్న అమ్మాయిని ప్రేమించడం దేన్ని తెలియజేస్తుంది? తెలుపే అందమని ఎవరు నిర్ధారించారు? యిది మూలవాసుల భావాలా/ ఎవరా మూలవాసులు? యెక్కడి ప్రాంతంవాళ్ళు? యింతకీ బాహుబలి అనే పేరు యేగిరిజన సంస్కృతికి చెందినది?యీసినిమాలోని మూలవాసులు యెవరో వారి సంస్క్రుతి ఏమిటో ఎవరైనా తెలియజేస్తే saMtOShistaanu.

 77. బాహుబలి మీద OPEN MAGAZINE లో వచ్చిన రివ్యూ చదవండి;
  http://www.openthemagazine.com/article/open-essay/baahubali-an-epic-for-the-right-టైమ్స్

మీ మాటలు

*