ఇలా రువ్వుదామా రంగులు?

holi

-విజయ్ కోగంటి 

 

 

***

 

రంగులు మారడమే

లక్ష్యమైన దానికన్నా

యీ రంగులు పూసుకోడం

తప్పేమీ కాదు.

 

ఒక వెలుగవు దామనుకున్న దీపాన్ని

తొలగించేందుకు పులుముకున్న

చీకటి నవ్వుల తెల్లబరిచేందుకు,

గుండె సాక్షిగా జారే

కన్నీటికి ఆసరాగా

తోడై నిలవగలిగేందుకు

రువ్వుదామా రంగులు?

 

దుర్మార్గపు గుండెలవిసేలా

అజ్ఞానపు రంగు

వెలిసి రూపు మారిందాకా

రువ్వు దామా రంగులు?

 

కనిపించని తెరలు నిలిపి

పరాభవాల వలలు పన్నే

కుహనాల తలలు తిరిగేలా

రువ్వుదామా రంగులు?

 

జలపాతమంత వడిగా

లోని చీకట్లు తొలగిపోయేంతగా,

భేదమెరుగని మనసులు

ఆనందాన తుళ్ళి,తేలి

తడిసి ముద్దయేట్లుగా,

చూపులో,మాటలో,నవ్వులో

రువ్వుదామా, మనుషులమై

ప్రతి ఘడియా,

కల్తీలేని సంతోషపు రంగులు ?

 

– విజయ్, కోగంటి

మీ మాటలు

 1. సుపర్ణ మహి says:

  రంగులు మారడమే లక్ష్యమైన దానికన్నా ఈ రంగులు పూసుకోడం తప్పేమీ కాదు…

  ఎంత అద్భుతమైన మాటలు సర్…
  పోయెమ్ ఆసాంతం సూపర్బ్ సర్… థాంక్యూ…☺

 2. Vijay Koganti says:

  డియర్ మహి
  మీ అభిమానానికి కృతజ్ఞతలు.

 3. కే. నరసింహా రావు says:

  పొడిబారని సున్నితత్వం, మేలి వన్నెల మాటల పదును, నాగరికత ముసుగున దన్నుకున్న వేషధారణ పై విసురు – మీ కవిత. చాలా బాగుంది సర్.
  నరసింహా రావు.

 4. చాలా బాగుంది …. సర్

మీ మాటలు

*