ఆ రహస్యం…?

drusyam

ఫోటో: ప్రవీణ కొల్లి 

పదాలు:కోడూరి  విజయ కుమార్ 

~

దయగా ఇంత చల్ల గాలిని పంచే పచ్చని చెట్లు

భయం లేదు లెమ్మని భరోసానిచ్చే నీలి కొండలు

పశు పక్షాదులతో పాటు తలదాచుకోను

చిన్ని తాటాకుల గుడిసె ఒకటి

ఈ సరళ సుందర లోకానికి నేను

కేవల యాత్రికుడిగా ఎప్పుడు మారిపోయానో

నా లోలోపలి లోపలి పురా మానవుడా

ఆ రహస్యం నీవైనా విప్పగలవా ?

*

మీ మాటలు

  1. శ్రీనివాసుడు says:

    మనుగడలో స్వీయరక్షణ సమస్య తలెత్తిననప్పుడు మార్పు సహజం.

మీ మాటలు

*