ఇది ఆర్ట్ ఆఫ్ డయింగ్!

 

 

-కల్లూరి భాస్కరం

~

 

కల్లూరి భాస్కరం

భారతదేశంలో ఈరోజున జరుగుతున్నది అక్షరాలా యుద్ధం…భావజాలాల మధ్య యుద్ధం. అందులో నాకైతే ఎలాంటి సందేహం లేదు. భావజాలఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడది  యుద్ధ రూపం ధరించి, నానాటికీ తీవ్రమవుతోంది. యుద్ధంలోని ఒక పక్షం వారికి అదనంగా అధికారబలం ఉంది కనుక అది క్రమంగా భౌతికయుద్ధంగా కూడా మారుతోంది. అది దాని సహజపరిణామం. దేశద్రోహి మొదలైన ముద్రలు వేయడం…అరెస్టులు చేయడం…దాడులు చేయడం…న్యాయస్థానాలు సైతం భౌతికయుద్ధ క్షేత్రాలు కావడం…ఇదీ దాని క్రమం.

ఇప్పుడు జరిగే ఏ పరిణామాన్ని చర్చించడానికి పూనుకున్నా ఇది యుద్ధం అన్న స్పృహతోనే పూనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు జరిగే ఏ పరిణామం గురించిన చర్చకైనా ‘యుద్ధం’ అన్నదే విశాల శీర్షిక. ‘రోహిత్ ఆత్మహత్య ఒక సరికొత్త/పాత సందర్భం’(సారంగ/జనవరి 23, 2016)అన్న నా వ్యాసాన్ని జరుగుతున్నది యుద్ధం అన్న ఉద్ఘాటనతోనే ముగించాను. ఇప్పుడు ఏది రాసినా దానికి కొనసాగింపే.

యుద్ధం అన్నప్పుడు సాధారణ నీతి నియమాలు, తర్క వితర్కాలు, హేతు నిర్హేతుకలు పక్కకు తప్పుకుంటాయి. యుద్ధం తనదైన నీతి నియమాలను, తర్కవితర్కాలను, హేతు నిర్హేతుకలను అనుసరిస్తుంది. యుద్ధమనే అసాధారణమైన ఒత్తిడిలో అందులో పాల్గొనే అన్ని పక్షాలలోనూ అదే జరుగుతుంది. ఏ మహాయుద్ధాన్ని తీసుకున్నా ఇందుకు సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనకు బాగా తెలిసిన మహాభారతయుద్ధాన్నే తీసుకుంటే ఎంతో సత్యసంధుడు, ధర్మాత్ముడు అనుకునే ధర్మరాజు కూడా అబద్ధమాడతాడు. విరథుడు, నిరాయుధుడు అయిన సాటివీరుని అర్జునుడివంటి మహావీరుడు కూడా చంపుతాడు. అస్త్రసన్యాసం చేసిన గురువు శిరస్సును శిష్యుడే తెగనరకుతాడు.

యుద్ధమనే ఒత్తిడిలో శత్రువును చంపడమే కాదు, ఒక్కొక్కసారి ఆత్మహత్యలూ జరుగుతూ ఉంటాయి.

అయిదేళ్ళ కోసారి ‘ప్రజాస్వామికంగా’ మనదేశంలో జరిగే ఎన్నికల యుద్ధాలలో మనకు ఇలాంటి యుద్ధ పరిస్థితితో అనుభవం ఉంది. కాకపోతే ఈ యుద్ధపరిస్థితిని ఇప్పుడు అయిదేళ్లపాటూ చూడబోతున్నాం.

యుద్ధ సమయంలో నీతిబద్ధమైన, హేతుబద్ధమైన చర్చకు గల జాగా నానాటికీ తరిగిపోతూ ఉంటుంది. అక్షరక్షేత్రం కూడా సంకుల సమరవేదికగా మారి వాక్యం అర్థాన్ని, అన్వయాన్ని కోల్పోతూ రచన రణగొణ ధ్వనిగా పరిణమిస్తుంది. అక్షరక్షేత్రాన్ని కూడా బండ బలం, కండబలం ఉన్న శక్తులు ఆక్రమించుకుంటాయి. అర్థవంతంగా మాట్లాడాలని కోరుకునే శక్తులు క్రమంగా అస్త్రసన్యాసం చేయవలసివస్తుంది.

నేడు దేశం క్రమంగా ఇలాంటి సన్నివేశం వైపే సాగుతోంది. అర్థవంతమైన, హేతుబద్ధమైన చర్చకు జాగాను ఎంతవరకు కాపాడుకోగలమన్నది ఇప్పుడు మనముందు వేలాడుతున్న ప్రశ్న. అంతే కాదు, సవాలు.

***

అన్నీ ఆశ్చర్యాలే జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన వాదాలే వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానంలోనే, న్యాయమూర్తుల కళ్ళముందే నిందితుడి మీద న్యాయవాదులే దాడి చేసి కొట్టడం ఇటీవలి కాలంలో ఎప్పుడైనా చూసామా? ఒకసారి కాదు రెండుసార్లు! టీవీ తెరమీదికి వచ్చి ఇదే పని మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం చూసామా? ఒకసారి కాదు; పదే పదే! ఇష్రత్ జెహాన్ అనే అమ్మాయి నిజంగా టెర్రరిస్టే అనుకుందాం. యూపీఏ ప్రభుత్వం అఫిడవిట్లను తారుమారు చేయడం ఘోరమనే అనుకుందాం. అందులోని న్యాయబద్ధతపై చర్చ జరగవలసిందే. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిందే. కానీ అది జరుగుతున్నట్టుగా, అందులోని ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ కోణం చర్చలోకి రావలసినంతగా రావడంలేదు. దాని గురించి ప్రశ్నిస్తే, మీ హయాంలో ఎన్ని చోట్ల ఎన్ కౌంటర్లు జరగలేదు, వాటి గురించి మాట్లాడరేమని ప్రభుత్వంలోని వాళ్ళూ ప్రభుత్వపక్షంవాళ్ళూ ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాలను యుద్ధక్షేత్రాలుగా మార్చడం; ఇతర ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ లను అడ్డు పెట్టుకుని ఇంకో ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ ను సమర్థించుకోవడం! ప్రభుత్వ, ప్రభుత్వపక్షాలే స్వయంగా ఆ పని చేయడం! అది చట్టానికీ, రాజ్యాంగానికి పాతర.

***

యుద్ధం అన్నప్పుడు దాని ప్రభావం సమాజం తాలూకు అన్ని అంగాలమీదా పడుతుంది. నీతి న్యాయం ధర్మమే కాదు; సమాజం, సాహిత్యం, మతం, సంస్కృతిసహా అన్నీ వక్రీకరణ చెంది వికృతికి లోనవుతాయి. తరతరాల అనుభవాల మీదా, అవగాహన మీదా, విశ్వాసాల మీదా గొడ్డలి పోట్లు పడతాయి.

యుద్ధం అన్నప్పుడు ‘మహావీరులు’ స్వయంభువులుగా హఠాత్తుగా విశ్వరూపంలో పుట్టుకొచ్చి యుద్ధ వేదికను ఆక్రమించుకుంటారు. గత కొన్ని రోజులలో అలా పుట్టుకొచ్చిన ఒక వ్యక్తి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్!

నేటి దేశవ్యాప్త యుద్ధ ప్రకంపనలకు ఎపి సెంటర్ అయిన ఢిల్లీలో, యమునా తీరంలో కొన్ని వేల ఎకరాల స్థలంలో ఎత్తైన వేదిక మీద, ఈ దేశ ప్రధాని తన పక్కనే నిలబడి ఉండగా, రొమ్ము విరుచుకుని తనను ప్రపంచస్థాయి వ్యక్తిగా ప్రకటించుకుంటూ వసుధైవకుటుంబకం అనే సూక్తిని వినిపిస్తుంటే చూసి అవాక్కయ్యాను. నా దేశంలో నేనే అపరిచితుడినైపోయినట్లు, నా తరతరాల అస్తిత్వాన్ని రూపు మాపే ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టు అనిపించింది. నిన్నటివరకు అనేకమంది అమాంబాపతు సాధు, సన్యాసులలో ఒకరని అనుకుంటున్న ఒక ఆధునిక సన్యాసి కాస్తా; నా ఇష్టాయిష్టాలతో పనిలేకుండా నా ప్రమేయంలేకుండా  ఒక్కసారిగా ఢిల్లీని ఆక్రమించుకుని యావద్దేశ ఆధ్యాత్మిక పురుషుడిగా ఆవిర్భవించినట్టు అనిపించింది. ఆ క్షణంలో ఆయన పక్కనే నిలబడి ఉన్న ప్రధాని స్వయంగా ఆయనను ఆధ్యాత్మిక చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారనిపించింది. ఇంతవరకు మార్జిన్స్ లో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా కేంద్రస్థానానికి వచ్చి ఆక్రమించుకున్నట్టు అనిపించింది.

శ్రీ శ్రీ రవిశంకర్ మీదా, ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీదా నాకు ఇంతవరకు ప్రత్యేకమైన వ్యతిరేకతను ప్రకటించుకోవాల్సిన అవసరం కనిపించలేదు. ఈ దేశంలో అనేక రకాలకు, అనేక పంథాలకు, అనేక శ్రేణులకు చెందిన ఆధ్యాత్మిక లేదా ఆధ్యాత్మిక ఆభాస కలిగిన వ్యక్తులున్నారు. ఎవరికి వారికి అనుచరులు ఉన్నారు. అనేక రంగాలలోలానే ఈ రంగంలో కూడా ఈ వైవిధ్యం ముందునుంచీ ఉన్నదే. సొంత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఈ వైవిధ్యాన్ని ప్రజాస్వామికంగా అర్థం చేసుకుంటున్నాం. శాంతిభద్రతలకు, ప్రజల విజ్ఞాన వివేకాలకు భంగం కలిగే వైపరీత్యాలు సంభవిస్తుంటే ఎత్తి చూపి ఖండిస్తున్నాం. అయితే, ఒకటి మాత్రం ఇంతవరకూ లేదు. వివిధ పంథాలలో ఎవరికి వారు మార్జిన్స్ లోనే ఉన్నారు తప్ప ఒక్కరే వచ్చి కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోలేదు. ఎంతో వివాదాస్పదమైన, ప్రభుత్వ, సైనిక అండదండలున్న విశాల వేదికపై, ప్రధాని సాక్షిగా, వివిధ దేశాలకు చెందిన లక్షలాది జనం సమక్షంలో రవిశంకర్ అనే వ్యక్తి కేంద్రస్థానంలోకి వచ్చినట్టు మొదటిసారి కనిపించారు. సారం సంగతి ఎలా ఉన్నా సాంకేతికంగా చూసినప్పుడు ఎవరికైనా అదే అనిపిస్తుంది.

అదే నన్ను నా దేశంలో అపరిచితునిగా మార్చి దారుణంగా కుంగదీసిన పరిణామం.

అనేక కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్న ఈ వైవిధ్యవంతమైన సమాజంలో సహజంగానే నేను కూడా ఒక కులానికి, మతానికి, సంస్కృతికి చెందినవాడిని. నాలానే ఇంకా కోట్లాదిమంది. నాకు ఈ దేశానికి సంబంధించిన వేల సంవత్సరాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విశ్వాస, జీవన సరళికి చెందిన వారసత్వం ఉంది. స్ఫూర్తిదాయకులైన ఆధ్యాత్మికపురుషుల వారసత్వం ఉంది. నాకు అవసరమనిపిస్తే ఆ వారసత్వాన్ని నేను ఉపయోగించుకుంటాను. ముఖ్యంగా జీవించే కళను నేను ఇప్పుడు కొత్తగా ఎవరి నుంచీ నేర్చుకోవలసిన అవసరంలేదు. నా వారసత్వంలోనే, నా కుటుంబంలోనే అందుకు సంబంధించిన మెళకువలు అందుతాయి. ఇంకా కావాలంటే నాకు భగవద్గీత ఉంది. రామాయణభారతభాగవతాలు ఉన్నాయి.

నేనంటే నేను ఒక్కడినే కాదు. నా సామాజిక నేపథ్యంలాంటి నేపథ్యం ఉన్న అనేకమంది. అలాగే నాకు భిన్నమైన సామాజిక నేపథ్యం ఉన్నవారికీ నాకు ఉన్నట్టే తమవైన వారసత్వాలు, స్ఫూర్తిదాయకాలు ఉన్నాయి. ఈ స్థితిలో నాకే కాదు; తమవైన వారసత్వ సంపద ఉన్న నాలాంటి చాలామందికి రవిశంకర్ అనే వ్యక్తితో కానీ, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో కానీ ఎలాంటి సంబంధమూ, అవసరమూ ఉండదు. ఆయన కానీ, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఉమ్మడిగా ఈ దేశంలోని అందరికీ అవసరమైనవీ, స్ఫూర్తినింపేవీ కానవసరంలేదు. మరి ఆయనతో, ఆయన చెప్పేవాటితో ఎవరు కనెక్టు అవుతారనే ప్రశ్న వస్తుంది. ఆధునికవిద్యవల్ల, ఆధునికతవల్లా సాంప్రదాయిక వారసత్వానికి దూరమైనవారికి ఆయనా, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆకర్షించవచ్చు. అలాగే విదేశీయులకు ఆకర్షించవచ్చు. దానిని వ్యతిరేకించాల్సిన అవసరమూ లేదు. ఎవరి అభిరుచి వారిది.

ఒకవేళ రవిశంకర్ ను కూడా ఈ దేశపు ఆధ్యాత్మికవారసత్వానికి ప్రతినిధిగానూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను ఆ వారసత్వ సారంగానూ ఎవరైనా భావిస్తూ ఉండచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ వ్యక్తి గానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ మహారాజ పోషణలో కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోవడమే ఇక్కడ సమస్య.  వైవిధ్యవంతమైన ఈ దేశపు స్వభావమూ, అస్తిత్వమూ అందుకు అవకాశమివ్వవు. అలా చేయడం ఈ దేశపు మౌలికతనే చెరచడం.

****

ఆశ్చర్యాలకు అంతేలేదు.

యమునా తీరంలో రవిశంకర్ వేదికను ముస్తాబు చేయడానికి సైన్యాన్ని బరిలోకి దింపడమే చూడండి. వివిధ ప్రభుత్వవిభాగాలు నిధులు సమకూర్చడమే చూడండి. పర్యావరణ సంబంధమైన అభ్యంతరాలు తలెత్తడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రవిశంకర్ కు 5కోట్ల జరిమానా విధించడం, తను జైలుకైనా వెడతాడు కానీ జరిమానా కట్టనని ఆయన ప్రకటించి ఒక తిరుగుబాటువీరుడిగా క్షణాలలో తన మూర్తిమత్వాన్ని పెంచుకోవడం, గ్రీన్ ట్రిబ్యునల్ తోకముడిచి ఆయన కార్యక్రమం నిరాఘాటంగా జరగడానికి అవకాశమివ్వడం… వరసగా చూడండి. ఆశ్చర్యం మీద ఆశ్చర్యం. యమునా తీరంలో గత కొద్దిరోజులలో తలెత్తినవి పర్యావరణవిధ్వంసం తాలూకు భయాలే  కాదు; నియమ నిబంధనలు, విలువలు, ఔచిత్యాలకు చెందిన విధ్వంసాన్ని చూశాం;  ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఒక వ్యక్తిముందు దాసోహమనడం చూశాం; వివాద నేపథ్యంలో ఈ దేశప్రథమపౌరుడైన  రాష్ట్రపతి ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా, ప్రధాని హాజరవడం అనే వింతను చూశాం.

రవిశంకర్ అనే వ్యక్తికి చెందిన కార్యక్రమంలో సైన్యాన్ని వినియోగించడాన్ని సమర్థించుకున్న తీరు ఇంకా దారుణం. కుంభమేళాలతో, ప్రకృతి వైపరీత్యాలతో, ఆసియన్ గేమ్స్ నిర్వహణతో పోలిక తెచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు జాతీయవిపత్తులు. ఆసియన్ గేమ్స్ నిర్వహణ జాతీయ కార్యక్రమం. కుంభమేళాలు సాంప్రదాయికంగా వందల సంవత్సరాలుగా జరుగుతున్న సామూహిక కార్యక్రమాలు. రవిశంకర్ అనే వ్యక్తి కన్నా సహస్రాంశాల చరిత్ర ఉన్న ఘటనలు అవి. రవిశంకర్ కార్యక్రమం ఎంత పెద్దదైనా కుంభమేళాతో పోల్చదగినది కాదు. అలా పోల్చడం అన్నివిధాలా బరితెగించడం. ఈ దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించడం. ఇంకా అవాచ్యం, ప్రధాని నరేంద్ర మోడీ రవిశంకర్ కార్యక్రమాన్ని సాంస్కృతిక కుంభమేళా అనడం. రవిశంకర్ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం హిందుత్వ వతిరేక ప్రతిపక్షాల కుట్రగా చిత్రించే ప్రయత్నంలో విచక్షణా వివేకాలను అజ్ఞానం పూర్తిగా హరించివేసిన ఫలితం ఇది. చివరికి ఆర్.ఎస్.ఎస్. వంటి హిందుత్వ పక్షాలు కూడా ఆధ్యాత్మిక చక్రవర్తిగా రవిశంకర్ పట్టాభిషేకాన్ని హర్షించి ఉంటాయని భావించలేం. కానీ రాజకీయప్రతిపక్షానికి గురిపెట్టే తహతహలో అవి కూడా మౌనం వహించి ఈ అజ్ఞాన వికట తాండవానికి నిశ్శబ్ద తాళం అందించాయి.

యుద్ధం కలిగించే ఒత్తిడిలో శత్రుహననాలే కాదు, ఆత్మహత్యలు కూడా ఉంటాయన్నది అందుకే. శ్రీ శ్రీ రవిశంకర్ అనే అత్యాధునిక సన్యాసి జరిపిన ఢిల్లీ ముట్టడికి, హిందుత్వ మౌన అంగీకారాన్ని తెలిపి ఆత్మహననానికి పాల్పడింది.

****

ఆర్ట్ ఆఫ్ లివింగ్ పట్ల ఇన్నేళ్లలోనూ నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ దేశపు అన్ని రకాల వైవిధ్యాలను, మత సాంస్కృతిక బహుళత్వాన్ని, ప్రభుత్వం తాలూకు నియమ నిబంధనలను, చివరకు ప్రభుత్వ అస్తిత్వాన్నీ, పర్యావరణస్పృహతో సహా అన్నింటినీ మృత్యుముఖంలోకి నడిపించగల ఆర్ట్ ఆఫ్ డయింగ్ గానే అది ఇప్పుడు రూపుగడుతోంది.

-భాస్కరం కల్లూరి

 

 

 

 

 

మీ మాటలు

  1. manjari lakshmi says:

    బాగుందండి బాగా చెప్పారు.

    • భాస్కరం కల్లూరి says:

      చాలా థాంక్స్ మంజరి లక్ష్మిగారూ…మన ఆలోచనలు సక్రమంగానే ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు గమనించుకునే ఒత్తిడి రోజుల్లో ఉన్నాం మనందరం. అలాగే మనం చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పగలుగుతున్నామా అన్న సంశయం కలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితిలో ఇలాంటి స్పందనలు మన ఆలోచనలు గాడి తప్పలేదన్న భరోసాను ఇస్తాయి.

  2. rani siva sankara sarma says:

    సరైన సమయంలో వచ్చిన మంచి వ్యాసం. మచి విశ్లేషణ.

    • నిశ్చిత says:

      ఆ మాట వేరే చెప్పాలా రాణీ శర్మ గారూ. సమయపాలన కు సారంగ పెట్టినది పేరు.

    • భాస్కరం కల్లూరి says:

      ధన్యవాదాలు శర్మగారూ…మనలో ఇతరత్రా కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా ఈ దేశపు అంతస్సత్వమైన(మాట కరెక్టేనా?) వైవిధ్యాన్ని గౌరవించేవారం మనం. దానిని మరింత నొక్కి చెప్పవలసిన రోజులివి.

  3. N Venugopal says:

    భాస్కరం గారూ,

    చాల బాగుంది. కృతజ్ఞతలు.
    నరేంద్ర మోడీ భారత సమాజంలోని బహుళత్వాన్నే కాదు, “హిందూ” మత సమూహంలోని బహుళత్వాన్ని కూడ రద్దు చేసి ఏకాత్మతా యాత్రను సంపూర్ణం చేయదలచుకున్నట్టున్నాడు. అందులో భాగమే రవిశంకర్ కు ప్రోత్సాహం. అది సాధ్యమవుతుందా లేదా అనేది ఎట్లా ఉన్నా, అది మన ప్రస్తుత పాలకుల సంకుచితత్వానికీ, వాతాపి జీర్ణం తత్వానికీ అద్దం పడుతున్నది.
    మీరన్నట్టుగానే రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీద ప్రత్యేకంగా ఏ అభిప్రాయమూ ఉండనక్కరలేని స్థితిలోనే నేనూ ఉన్నాను. కాని అనారోగ్య కారణంతో ఒకసారి, పాత్రికేయ కారణంతో ఒకసారి ఆ ప్రహసనాన్ని (అసహనమూ ప్రహసనమూ ఒక్కలాగ ధ్వనించడం యాదృచ్చికమా, భాషా విలాసమా?) దగ్గరి నుంచి చూసే అవకాశం కలిగింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కన్న మొరటైన, కుత్సితమైన సారానికి చాల ఆకర్షణీయమైన ముసుగు అది.

    • భాస్కరం కల్లూరి says:

      ధన్యవాదాలు వేణుగోపాల్ గారూ…”భారత సమాజంలోని బహుళత్వాన్నే కాదు, “హిందూ” మత సమూహంలోని బహుళత్వాన్ని కూడ రద్దు చేసి ఏకాత్మతా యాత్రను సంపూర్ణం చేయదలచుకున్నట్టున్నాడు.” అన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. భారతదేశం వందలు, వేల సంవత్సరాల తన అస్తిత్వ స్వభావాన్ని రూపుమాపుకుని పూర్తిగా సరికొత్త దేశంగా అవతరిస్తుందనుకుంటే తప్ప మీరన్నట్టు అది సాధ్యం కాదు.

  4. THIRUPALU says:

    చాలా మంచి వ్యాసం!

    • భాస్కరం కల్లూరి says:

      ధన్యవాదాలు తిరుపాలు గారూ…మీ స్పందన సహానుభూతిని వ్యక్తం చేస్తోంది.

  5. chandolu chandrasekhar says:

    k .భాస్కర్ ,గారు
    మీ వ్యాసం చాలా educate గ వుంది .art of living ,ఎవరి కి సంబధం లేని మధ్య మార్గం వుండేది ,దాని centerpoint హిందుత్యంమైన ఏదో మద్య తరగతి జీవులకి మానసికోల్లాసం అనుకునే వాళ్ళం . యమునా తీరం లో జరిగిన సదస్సు , environment , సవాల్ చెయ్యటం , జైలు కి ఐన వెళతాం తలబిరుసు secular state సవాల్ చేయడం మద్య యుగాలలో రాజు ని మతం నియత్రణ చేసేదిగా వుంది .చక్కటి వ్యాసం రాసినందుకు అబివాదాలు .

    • భాస్కరం కల్లూరి says:

      ధన్యవాదాలు చంద్రశేఖర్ గారూ…మీలాంటివారి స్పందన ఇందులో వ్యక్తమైన భావాలకు గీటురాయి వంటివి.

  6. కే. Bhaskar గారు
    యువర్ article ఇస్ తొతల్ల్య్ biased.
    ఇట్ ఇస్fiction యు అరె imagining
    ది ఫచ్త్స్ అరె different
    People లికె యు కాన్ నాట్ తొలెరతె ది గుడ్ happening

    • భాస్కరం కల్లూరి says:

      స్పందించినందుకు ధన్యవాదాలు ఎన్.ఎస్.రావు గారూ…

  7. Lalitha P says:

    రవిశంకర్ glossy spiritualism , అసలే కొనూపిరితో ఉన్న యమునని ఆక్రమించుకుని పైగా జరిమానా కట్టననే అహంకారం ఒక ఎత్తైతే, ఇలాంటి అతిధనవంతులకి సైన్యంతో సహా ప్రభుత్వం మోకరిల్లటం, కొంతమంది కుంభమేళాని ఈ ప్రదర్శనతో పోల్చటం మరో అతి. చూస్తుంటే ఎవరి యుద్ధం ఎవరితోనో సరిగ్గా అర్థం కాకుండా ఉంది. ఆరెస్సెస్ లాంటి సంస్థలు కూడా ఈ సర్కస్ ని వ్యతిరేకించలేకుండా ఆత్మహననానికి పాల్పడ్డాయని మంచి పరిశీలన చేశారు. సాంస్కృతిక బహుళత్వంతో బతికే సామాన్యజనం మీద ఉన్నతమధ్యతరగతి ధన ఘనవిజయోత్సవంలా అనిపిస్తోంది ఇదంతా. వ్యాసంలో ఆఖరిపేరా పదునైన సత్యం. ప్రభుత్వాలు కూడా వేమన చెప్పినట్టు “పసిడికలుగువాని బానిస కొడుకులు” గా మారిపోయాయి.

    • భాస్కరం కల్లూరి says:

      ధన్యవాదాలు లలితగారూ… మీరన్నట్టు రవి శంకర్ కార్యక్రమం “సాంస్కృతిక బహుళత్వంతో బతికే సామాన్యజనం మీద ఉన్నత మధ్యతరగతి ధన ఘనవిజయోత్సవంలా ” కనిపించే మాట నిజం. ప్రజాజీవితంలో ఫాక్ట్స్ తోపాటు, పెర్సెప్షన్ కు సమానమైన విలువ ఉంటుందని గుర్తిస్తే, దాదాపు ఇరవై కోట్ల వ్యయంతో రవిశంకర్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆపైన దానికి ప్రభుత్వం వత్తాసు ఇవ్వడం జనానికి మీరన్న మెసేజ్ నే ఇస్తాయి. వెనకటి ఇండియా షైనింగ్ నినాదం ఈ సందర్భంలో గుర్తొస్తుంది.

  8. శాంతిశ్రీ says:

    భారతదేశంలో ఈరోజున జరుగుతున్నది అక్షరాలా యుద్ధం…భావజాలాల మధ్య యుద్ధం.
    అన్నీ ఆశ్చర్యాలే జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన వాదాలే వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానంలోనే, న్యాయమూర్తుల కళ్ళముందే నిందితుడి మీద న్యాయవాదులే దాడి చేసి కొట్టడం ఇటీవలి కాలంలో ఎప్పుడైనా చూసామా? ఒకసారి కాదు రెండుసార్లు! టీవీ తెరమీదికి వచ్చి ఇదే పని మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం చూసామా? ఒకసారి కాదు; పదే పదే! ఇష్రత్ జెహాన్ అనే అమ్మాయి నిజంగా టెర్రరిస్టే అనుకుందాం. యూపీఏ ప్రభుత్వం అఫిడవిట్లను తారుమారు చేయడం ఘోరమనే అనుకుందాం. అందులోని న్యాయబద్ధతపై చర్చ జరగవలసిందే. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిందే. కానీ అది జరుగుతున్నట్టుగా, అందులోని ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ కోణం చర్చలోకి రావలసినంతగా రావడంలేదు. దాని గురించి ప్రశ్నిస్తే, మీ హయాంలో ఎన్ని చోట్ల ఎన్ కౌంటర్లు జరగలేదు, వాటి గురించి మాట్లాడరేమని ప్రభుత్వంలోని వాళ్ళూ ప్రభుత్వపక్షంవాళ్ళూ ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాలను యుద్ధక్షేత్రాలుగా మార్చడం; ఇతర ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ లను అడ్డు పెట్టుకుని ఇంకో ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ ను సమర్థించుకోవడం! ప్రభుత్వ, ప్రభుత్వపక్షాలే స్వయంగా ఆ పని చేయడం! అది చట్టానికీ, రాజ్యాంగానికి పాతర.

    ఆఫ్ లివింగ్ కానీ మహారాజ పోషణలో కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోవడమే ఇక్కడ సమస్య. వైవిధ్యవంతమైన ఈ దేశపు స్వభావమూ, అస్తిత్వమూ అందుకు అవకాశమివ్వవు. అలా చేయడం ఈ దేశపు మౌలికతనే చెరచడం.

    రవిశంకర్ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం హిందుత్వ వతిరేక ప్రతిపక్షాల కుట్రగా చిత్రించే ప్రయత్నంలో విచక్షణా వివేకాలను అజ్ఞానం పూర్తిగా హరించివేసిన ఫలితం ఇది. చివరికి ఆర్.ఎస్.ఎస్. వంటి హిందుత్వ పక్షాలు కూడా ఆధ్యాత్మిక చక్రవర్తిగా రవిశంకర్ పట్టాభిషేకాన్ని హర్షించి ఉంటాయని భావించలేం. కానీ రాజకీయప్రతిపక్షానికి గురిపెట్టే తహతహలో అవి కూడా మౌనం వహించి ఈ అజ్ఞాన వికట తాండవానికి నిశ్శబ్ద తాళం అందించాయి.

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ పట్ల ఇన్నేళ్లలోనూ నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ దేశపు అన్ని రకాల వైవిధ్యాలను, మత సాంస్కృతిక బహుళత్వాన్ని, ప్రభుత్వం తాలూకు నియమ నిబంధనలను, చివరకు ప్రభుత్వ అస్తిత్వాన్నీ, పర్యావరణస్పృహతో సహా అన్నింటినీ మృత్యుముఖంలోకి నడిపించగల ఆర్ట్ ఆఫ్ డయింగ్ గానే అది ఇప్పుడు రూపుగడుతోంది.

    భాస్కరం సార్ మీ ఆర్టికల్ ఆసాంతం చదివాను..
    ఇలాంటి భావజాలంలో వ్యక్తులే కీలకం.. అందుకు ఎంతకన్నా తెగిస్తారు. స్వభావం అలాంటిది. మున్ముందు మీరన్న యుద్ధం జరుగుతుంది.. జరగాలి.. ఎప్పటికైనా తేలాల్సిందే.. చరిత్రలో ఇలాంటి పరిణామాల నేపథ్యం చెప్తూనే ఉంది. చివరికి మానవ సమ సమాజం రావాల్సిందే.. అందుకు సమయం.. సందర్భం రావాలి.. కనువిప్పులు కలగాలి..

    • భాస్కరం కల్లూరి says:

      శాంతిశ్రీ గారూ…నా వ్యాసాలు ఫాలో అవుతూ స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.

  9. అజిత్ కుమార్ says:

    ఆర్.యస్.యస్. అనేది గాంధీని చంపకముందునుంచే ఉన్నదిగదా…అది సమయానుకూలంగా తన ఆకారాన్ని మార్చుకుంటుంది. పాత భా.జ.పా. స్థానంలో నూతన రూపంతో ప్రస్తుత పాలకులుగా, పాత బాబాల స్థానాన్ని నూతన బాబాలు ఆక్రమిస్తున్నారు. అయితే వారు ఈ స్థాయిని చేరుకోవడానికి వారు చేసిన కృషిని మీరు గమనించలేదు. వారు అనేక సంవత్సరాలుగా ప్రజలను విజ్ఞాన వంతులుగా మార్చడానికి మత బోధనల ద్వారా అవిరళ కృషి చేశారు. కానీ ప్రధాన ప్రత్యర్ధి అయిన ఇం.కా. పార్టీ తమను తాము బలహీనులమని దేశానికి చూపించుకోవలసివచ్చినందున , మోడీజీకి బలమైన ప్రత్యర్ధి లేకపోయాడు. కనుక వారిని మీరు విమర్శ చేయవద్దు. మీరు చెయ్యాల్సిన పని అది కాదు.

    • భాస్కరం కల్లూరి says:

      అజిత్ కుమార్ గారూ…మీ స్పందనకు ధన్యవాదాలు.

  10. johnson Ch says:

    యుద్ధం వత్తిడిలో జరిగిన – ‘ఆత్మహత్య’ వ్యాసం మొత్తానికి కీలకం. ఒక ప్రామాణికమైన వ్యాసం అందించారు భాస్కరం గారూ ధన్యవాదాలు. ఇప్పుడు – దేన్నయినా సరే ‘బుల్దోజ్’ చేయాలనుకుంటే, ముందుగా ఆపని చేయాలనుకుంటున్న వారు తమ ‘స్కేల్’ ను అసాధారణంగా పెంచుకోవాలి. కృతకంగా సృష్టించబడే ఆ కొత్త వాతావరణం లో క్రమంగా అన్ని ఒక్కటొక్కటిగా పిపీలికాలు అవుతాయి.’ గ్రీన్ ట్రిబ్యునల్’ – ఫేడ్అవుట్ అయింది అలాగే. ఉత్సవాలే కాదు ఈమధ్య ఎన్నికలు కూడా ఇలా జరుగుతున్నాయి!

    • భాస్కరం కల్లూరి says:

      జాన్సన్ గారూ…ధన్యవాదాలు. “ఇప్పుడు – దేన్నయినా సరే ‘బుల్దోజ్’ చేయాలనుకుంటే, ముందుగా ఆపని చేయాలనుకుంటున్న వారు తమ ‘స్కేల్’ ను అసాధారణంగా పెంచుకోవాలి. కృతకంగా సృష్టించబడే ఆ కొత్త వాతావరణం లో క్రమంగా అన్ని ఒక్కటొక్కటిగా పిపీలికాలు అవుతాయి.” అన్న మీ వాక్యం నన్ను మెరుపులా తాకింది. జరుగుతున్న పరిణామాలపై మీ వాక్యం చాలా లోతైన వ్యాఖ్య. ఒక్క వాక్యంలో సింపుల్ గా చెప్పారు. జాతీయస్థాయిలో అనేక రంగాలలో అక్షరాలా అమలు జరుగుతున్న వ్యూహం అదే.

  11. rani siva sankara sarma says:

    ఆస్కేల్ ని పెంచుకోవడంలో ముందున్నానని అ నేకసార్లు నిరుపిం చుకొన్నారు భాస్కర్ గారు. కుహనా చా రిత్రికప్రచారాలని తిప్పికొట్టారు. యిప్పుడు కుహనా ఆధ్యాత్మికత వెనుకగల రహస్యాలని బట్టబయలుచేస్తున్నారు.
    జాన్సన్ గారి సలహా ని నేను కూడా సీరియస్గా పరిగణిస్తున్నాను.

  12. హారతి వాగీశ్ says:

    మీరు రోహిత్ విషయం లో రాసిన వ్యాసం లో ప్రస్తావించిన మాట సాధారనీకరణ (‘నార్మలైజేషన్) .బరితెగించిన శక్తులకు దొరికిన అధికారపు అండ వాళ్ళ ఆ శక్తులు చేస్తున్న ,చేయబోతున్న విషయాలు తెలిపారు.నన్ను అది చాల ఆలోచింప జేసింది .ఆధునిక రాజ్యం లో అధికారాని అందుకున్న తరువాత ప్రభుత్వాలు చేస్తున్న పని ని మీద అది మీ సూటైన వ్యాఖ్య అనిపించింది.ఈ వ్యాసం లోనూ బహులత్వం మీద దాడి అనే యుద్ధ కాల దురాగతాన్ని ప్రస్తావించిన తీరు చాలా ఆలోచింప జేస్తుందీ,భయపెడుతుంది కూడా . నయ ఉదార వాదానికి గట్టి సమర్థకూడుగా నిలబడిన ఈ రవిశంకర్ అనే “ఆధ్యమికాభాసి” ని ఈ దేశ అధ్యత్మికతా ప్రతినిధి అని అనడం ఇటీవలి యుద్ధ కల ఆత్మహత్య నే. మంచి వ్యాసం .ధన్యవాదాలు .

  13. Aranya Krishna says:

    చాలా బాగా రాసారు భాస్కరం గారు! ప్రజాస్వామిక పరిధిలో ఎవరైనా దేన్నైనా నమ్మొచ్చు, ఆచరించొచ్చు. కానీ ఇది ఆధ్యాత్మిక గూండాగిరి! ఎలా అంగీకరించగలం లేదా ఎలా మౌనంగా వుండగలం? నేను చట్టాన్ని ధిక్కరిస్తానని వీరంగమేసినాయన పాదాల చెంతకి సాక్షాత్తు ప్రధానమంత్రే చేరటం విస్మయం కలిగిస్తుంది. రాబోయే కాలం మంచిది కాదన్న సంకేతమే అందుతున్నది.

  14. దేవరకొండ says:

    ఈ బలప్రదర్శనకు ఎలా స్పందించాలో తెలియక మాటలు దొరకని మాలాంటి వాళ్ల మౌనానికీ నిస్సహాయతకూ అక్షర రూపాన్నిచ్చినందుకు ముందుగా భాస్కరం గార్కి కృతజ్ఞతలు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న (వినపడకుండా) నల్ల ధనాన్ని వెనక్కి తెస్తామని, ఆ సొమ్మంతా వుంటే మన (‘దేశం’ చేసిన) అప్పులన్నీ తీరిపోయి మిగులు బడ్జెట్లో మనమంతా పండగలు చేసుకోవచ్చనీ చెప్పి అధికారంలో కి వచ్చిన ప్రభుత్వం కనీసం మాల్యా లాంటి ఎగవేతగాళ్లని కూడా ఏమీ చేయలేదని, ప్రతాపమంతా మనవంటి సామాన్యుల మీదే కాబట్టి అటు అధికార వనరుల దుర్వినియోగము, ఇటు పెనాల్టీ కట్టనన్న ‘జితేన్ద్రియుల్నీ’ ఏమీ చేయలేకపోవడము సహజమేనని అర్ధం చేసుకుందాము. Oh My God (OMG ) సినిమాని మళ్లీ ఓసారి చూసి అందులో మిథున్ చక్రబోర్తి అద్భుతంగా నటించిన పాత్రను పోల్చుకునే ప్రయత్నం చేద్దాం. OMG -2 కి మంచి ముడి సరుకున్నదని కూడా అర్ధం చేసుకుందాము. దేవుడా రక్షించు నా (నా అన్నందుకు చంపేస్తారేమో!) దేశాన్ని! ఎవరెవరి నుంచి చెప్మా…..

    • భాస్కరం కల్లూరి says:

      ఈమధ్య వేరే ఒత్తిడుల వల్ల సారంగ స్పందనలను తీరుబడిగా చూసే అవకాశం కలగలేదు. నా వ్యాసంపట్ల సహానుభూతిని ప్రకటించిన హారతి వాగీశ్, అరణ్య కృష్ణ, దేవరకొండ గార్లకు ఆలస్యంగా ధన్యవాదాలు.

  15. chandrika says:

    ఈ ఆర్ట్ అఫ్ లివింగ్ కాంట్రవర్సీ నాకు తెలీదు కానీ, ‘ అన్నీ ఆశ్చర్యాలే జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన వాదాలే వినిపిస్తున్నాయి’ అన్నది నిజం అన్పిస్తోంది. సుప్రీమ్ కోర్టు ఉగ్రవాదం చేసారు అన్న వారికీ మరణ శిక్ష వేయకూడదు అన్న వాదన( పైగా మానవ హక్కుల కోసం పోరాటం అని దాని పేరు. పోయింది వీళ్ళ కుటుంబ సభ్యులు కాదు కాబట్టి ఏ పేరైన పెట్టుకోవచ్చు!!) , కాశ్మీర్ కోసం పోరాటం తప్పా అని, భారత సైన్యం ని దూషణ చేయటం, కలాం పోయిన రోజునే ఆయన బాబాల దగ్గరికి వెళ్ళాడని ఆయనని దూషించడం, ఆ విధం గా దూషించిన వారిని మంచి పని చేసారు అని పొగడటం చిన్న ఉదాహరణలు. మీరు భావజాల యుద్ధం అంటున్నారు. కొంత మంది మేధావులు భారత దేశం సిరియా లాగా మారి పోతుందని, హిందూ ఉగ్రవాదం అంటూ తెగ బాధ పడ్తున్నారు. భారత దేశం లో ఇంత మంది మేధావులున్నారని తెలీదు ఎవరికీ. భాజపా అవకాశం కల్పించింది. ఇంత తలా తోక లేని వితండ వాదం దేశం లో ఎప్పుడు వినలేదు. ఇటలీ లో పుట్టిన వనిత కేవలం రాజీవ్ గాంధీ భార్య అయినందుకు దేశ ప్రధాని ని ఒక తోలుబొమ్మలా చేసి ఆడించినపుడు కూడా ఇంత విలువైన అభిప్రాయాలూ ఎవరు చెప్పలేదు. నిజమే భాజపా రానప్ప్పుడే బావుంది. హిందువులకి కాస్తో కూస్తో గౌరవం అంటూ ఉండేది. హిందుత్వం, బ్రాహ్మణత్వం అంటూ జుగుప్స కలిగించేలా ఒకటే దూషణ. మన దేశ మేధావులు ఆ బఫూన్ ప్రధాన మంత్రి అయ్యేదాకానిద్రపోయేట్టు లేరు !! అపుడు సారంగ లో రచనలు చేసేవారికి పెద్ద గా వ్రాయటానికి విషయాలు దొరక్కపోవచ్చేమో !!

    • మీరు ఈ రోజు జరిగిన ఆశ్చర్య కరమైన విషయం రాయటం మరచారు. రాహుల్ గాంధి, వాళ్ల అమ్మగారు హిందూ పండుగ హోళిని పదేళ్ల తరువాత జరుపుకొన్నారు.

      భాస్కరం గారు,
      ఎంతో అనుభవం, జ్ణానం ఉన్న మీరు యుద్దం అనటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరితో ఎవరు యుద్దం చేస్తున్నారు? వియ్యానికైనా కయ్యానికైన సమవుజ్జిలు ఉండాలి గదా! . బిజెపి పార్టి పై, ప్రభుత్వం పై యునివర్సిటిలో ఒక వర్గం చేసే గోల యుద్దం అవుతుందా?

      క్రైస్తవ చర్చ్ ల పై దాడులు, ఘర్ వాపసి, ఇంటాలరెన్స్ అన్ని ఫైల్ అయ్యాయి ఇప్పుడు రంగస్థలం యునివర్సిటిలకి మార్చారు. అది త్వరలో ప్రాముఖ్యత కోల్పోతుంది. మీరు భావజాలాల మధ్య యుద్దం అంట్టున్నారు. వాస్తవానికి భావజాల మధ్య యుద్దం దేశ విభజనతో ముగిసిపోయింది. మీరు భావజాల మధ్య యుద్దం జరుగుతున్నాదని భావిస్తే, ఎన్నికలలో గెలుపు ఓటములు తేల్చు కోవాలి కదా! కాంగ్రెస్, లెఫ్ట్ పార్టిలు బిజెపి ని సవాలు చేసే స్థితిలో ఉన్నాయా? రెండు తెలుగురాష్ట్రాలలో గెలిచే పరిస్థితి లో కాంగ్రెస్ లేదు. కేంద్రం లో అధికారంలోకి రాలేదు.

      • భాస్కరం కల్లూరి says:

        శ్రీరామ్ గారూ…
        1. నా వ్యాసాన్ని మీరు కాంగ్రెస్, బీజేపీల రోజువారీ రాజకీయాల స్థాయికి, ఎన్నికల గెలుపు ఓటముల స్థాయికి దింపడం ఆశ్చర్యం కలిగించింది. ఇందులో చర్చించినది నేటి రోజువారీ రాజకీయాల కంటే ఎన్నో రెట్ల లోతు, విస్తృతీ, చరిత్ర, తాత్వికత, సంస్కృతులకు చెందిన విషయం. ఈ పార్టీ వర్సెస్ ఈ పార్టీ అన్న కోణంలోంచి నేను రాయలేదు. ఇందులో ఏ పార్టీ పేరూ ప్రస్తావించలేదు. ఇది దైనందిన రాజకీయాల విశ్లేషణ కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారతదేశపు వైవిధ్యం వర్సెస్ ప్రభుత్వం గురించి మాత్రమే నేను ఇందులో చర్చించాను. ఈ దేశపు వైవిధ్యవంతమైన అస్తిత్వం నేటి రాజకీయపక్షాలకన్నా, అయిదేళ్లకు మాత్రమే అధికారం పొందిన ప్రభుత్వాల కన్నా సహస్రాబ్దాల ప్రాచీనత కలిగినది, శాశ్వత స్వభావం కలిగినది. అలాంటి అస్తిత్వం ప్రభుత్వంతో జరుపుతున్న యుద్ధం గురించి నేను మాట్లాడాను. అలాంటిది, నా వ్యాస ప్రధాన ఇతివృత్తానికి దూరంగా జరిగి మీరు దానికి సంబంధం లేని ఉపరితల వ్యాఖ్యలు చేయడం విచిత్రం.
        2. మీరు రాహుల్, సోనియాలు హోలీ జరుపుకోవడం గురించి ప్రస్తావించారు కనుక అంటున్నాను…అందులో విశేషం కానీ, కొత్తదనం కానీ ఏమీ లేదు. రాజకీయప్రముఖులు హోలీ జరుపుకోవడం, మీడియా మొక్కుబడిగా దానిని ఫోకస్ చేయడం మామూలే. ‘హిందుత్వను పులుముకోవడం’ అన్న మీ అర్థంలోనే దానిని తీసుకున్నా అందులోనూ కొత్త ఏమీలేదు. కాంగ్రెస్ సాఫ్ట్ హిందుత్వ వైఖరి ఇప్పటిది కాదు. రాజీవ్ గాందీ అయోధ్యలో మందిరం తాళాలు తెరిపించడంతో సహా దీనికి బోలెడంత చరిత్ర ఉంది. రాజకీయ అవసరాలు, ఎత్తుగడలలో భాగంగా అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా సాఫ్ట్ ముస్లిం వైఖరిని అనుసరించే ఉదాహరణలూ ఉంటూనే ఉంటాయి.
        3. ఇక దేశవిభజనతో భావజాలాల యుద్ధం ముగిసిపోయిందని మీరు అనడం కూడా విస్మయం కలిగించింది. వ్యక్తులలో ఆలోచనావైవిధ్యం, తాత్విక వైవిధ్యం ఉన్నంతకాలం భావజాలాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని మాత్రమే సగటు అవగాహన.

    • శ్రీనివాసుడు says:

      నిజమే చంద్రిక గారూ!
      హిందూత్వం, బ్రాహ్మణత్వం అనే భూతాలు ఎక్కడున్నాయో, అవి ఏం చేస్తున్నాయో, ప్రభుత్వంలో అవి మాత్రమే ఎలా వున్నాయో, ఇప్పటి ప్రతి ప్రభుత్వ విధానాన్నీ అవే ఎలా నిర్దేశిస్తున్నాయో, ఈ వేలయేళ్ళ దేశ దౌర్భాగ్యానికి అవి మాత్రమే, అవొక్కటే ఎలా కారణమో వివరంగా సంభాషిస్తే సముచితంగానే వుంటుంది. తమ భావాలను స్వేచ్ఛగా పంచుకోడానికి సారంగ యాజమాన్యం ఇంత చక్కటి అవకాశం ఇచ్చినప్పుడు ఆయా భావజాలాల సిద్ధాంతాలను గురించి వివరంగా సంభాషించవలసిన అవసరం వుంది. అయితే, జరుగుతున్నది సంభాషణ కాదు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం మాత్రమే. వారు ఎవరితో పోరాడుతున్నామని నీడలతో యుద్ధం చేస్తున్నారో వారిని కూడా తమ శైలిని అనుకరించేలా ఉద్రేకపరచి పలచన చేయడమే లక్ష్యం కాబోలు. ఇలాంటి దుమ్మెత్తిపోసుకోవడంగాక నిజమైన సంభాషణ ద్వారానే మాత్రమే ఏకాభిప్రాయం సాధ్యం.
      అయితే, హెచ్. ఎమ్. టి.వి, టి.వి.5 లలో సాయంత్రం 7 గంటలకు ఆయా భావజాలాలకు ప్రతినిధులుగా చెప్పబడేవారు, ఇంతకన్నా భావజాలాలని కాచివడపోసినవారు, నిజంగా ప్రజాశ్రేయస్సునే కోరుకునేవారు అనుదినం దేశంలోని ప్రతి సమస్య గురించీ హోరాహోరీ పోట్లాడుకుంటుంటారు. ఎవ్వరూ తగ్గరు, ఎవ్వరూ తీసిపోరు. హిందూత్వ, బ్రాహ్మణత్వాల గురించి వీరు చేసే ప్రతి ఆరోపణనూ వైరిపక్షం వాళ్ళు తార్కికంగా ప్రతిరోజూ ఖండిస్తూనే వుంటారు.
      అంతేగాక, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రభూమి తదితర పత్రికలలో ఇలాంటి వాదనని ఖండించే వ్యాసాలు శరపరంపరగా వస్తూనే వుంటాయి.
      నాకయితే మాత్రం ఇద్దరు చెప్పిందీ తార్కికంగా సరియైన వాదనలే అనిపిస్తుంటాయి. కానీ, అది మన అవగాహనకి అది చాలడంలేదు కదా.
      అయితే, తార్కిక విశ్లేషణ మాత్రమే పరిష్కారం సూచించదు. ముందుగా అవతలి పక్షం వారిని అధములుగానో, ఫాసిస్టులుగానో, లేదా, ఇంకొకటేదైనా ముద్ర వేసే, నీచంగా పరిగణించక, వారితో సంభాషణ జరిపి కలసి ముందుకు పోయే ఆలోచన చేస్తేనే పురోగతి సాధ్యం, లేకపోతే అధోగతే.

  16. మహా మానవతావాదీ మరో బుద్ధుడూ ప్రప్ంచీక్రుత శమ్కరాచార్యులూ రవిశంకర్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు నన్ను కలిచివేసాయి. శ్రీనివాసుడు గారి వంటి జ్ఞానుల మాటలు నాకు వుపశమనాన్ని యచ్చాయి
    అసలు సంగతి మనం ఫ్యూ డలిజమ్ నుంచి బయటపడాలి. యిది పెట్టు బడిదారీ గ్లోబలైజేషన్ యుగం. పాతకాలం శంకరాచార్యుల్ లోకల్ బాబాలూ సాధువులూ వీళ్ళ కాలం చెల్లిపోయింది. మన రవిశంకర్ గారికి హద్దులు లేవు. విశాల విశ్వమే అవధి. పర్యావరణం మొత్తం ధంసమైనా వ్యాపారం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆధ్యాత్మికత వల్ల శాంతి లభిస్తుంది.
    ఫాసిజం హిట్లరులని యెందుకు ఆడిపోసుకోవడం? ప్రపంచయుద్ధంలో పూర్తిగా దెబ్బ తిన్న జర్మనీని ముందుకు నడపడానికి పాటు పడ్డాడు హిట్లర్. అభివృద్ధి రేటు కూదా పెరిగింది. య్యుదులని చంపడమ్లాంటి చెడు విషయాలే మనం మాట్లాడుతాం. మనం అన్ని కోనాలనుంచి విశయాలని పరిశీలించాలి అనేది నిజం.
    నేను సాధారణ గృహిణిని. నా అభిప్రాయాలల్లో తప్పులు వుంటే పెద్దవాళ్ళు సవరించగలరు. భాస్కర్ గారు ఫ్యూడల్ భావాలు వదిలించుకోవాలి.

  17. ashok tankasla says:

    వెన్ ఇత్ ఇస్ అ వార్ నొబొద్య్ షౌల్ద్ లీవ్ హిం/హెర్సెల్ఫ్ బెహింద్. అల్ షౌల్ద్ పార్టిసిపేట్. కరెంటు లెవెల్స్ అఫ్ పర్తిచిపతిఒన్ ఇస్ నాట్ ఎనఫ్.

    అశోక్ tankasala

  18. శ్రీనివాసుడు says:

    వెన్నెలగారూ, ఎదుటివారిని రెండోసారి జ్ఞానులుగా గుర్తించిన మీ జ్ఞానతృష్ణకు నా వందనాలు. తమతో ఏకీభవించనివారిని జ్ఞానులుగా ముద్రవేయడం సరిక్రొత్త ఎత్తుగడ. దీనిని విజయవంతంగా ఆవిష్కరించినందుకు నా అభినందనలు. ఎదుటివారి అభిప్రాయాన్ని ఫ్యూడలిజం పట్ల వ్యతిరేకతగా మాత్రమే భావించడం మీలోని నిజమైన మేధాసంపత్తికి నిదర్శనం.
    మీరు భయపడుతున్న భావజాలాలని ఇక్కడెవరూ సుతరామూ సమర్థించడంలేదు.
    అదే సమయంలో రవిశంకర్ పర్యావరణ విధ్వంసాన్ని, కూడా ఇక్కడెవరూ సమర్థించడంలేదు. అదే సమయంలో భీకర బల ప్రదర్శనగా మీలో కొందరు భయపడుతున్న రవిశంకర్ గురించి భారతీయులలో ఎంతమందికి తెలుసు? అతడి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎంతమందికి తెలుసు? భారత ప్రజలలో 0.00000001% కు కూడా తెలియని ఒక సాధారణ కార్పొరేట్ గురువుని చూచి భయపడడం ఎంత అవివేకం! అతడికి భారతీయ ప్రజలందరినీ ఏకత్వం గాటన కట్టేసే సత్తాగానీ, భావపటిమగానీ, ప్రజాబాహుళ్య మద్ధతుగానీ, లేదా అతడిని ప్రోత్సహిస్తున్న శక్తులకిగానీ నిజంగా వున్నాయా? పోనీ, అతడి లక్ష్యం నిజంగా అదేనా? అతడి గురించి తెలిసిన, అతడిని సమర్థిస్తున్నవాళ్ళల్లో ప్రజలందరిపై ప్రభావం చూపగల ప్రభుత్వ విధానాలను రూపకల్పన చేసేవారెంతమంది? తన భావజాలాన్ని బుల్డోజ్ చేయడం కాదు కదా, ఎదుటివారి రాజకీయ ఆసక్తులను వెంట్రుకవాసి కూడా కదపగల సత్తా కూడా రవిశంకర్ కు లేవు.
    ఎక్కడ ఏ భారీఉత్సవం, వేడుక జరిగినా దానిలో పాల్గొని తమ మైలేజీని పెంచుకోవడం పాలక పక్షాల పని. దానికి సహాయసహకారాలు అందించడం కూడా రాజకీయ ఎత్తుగడలలో భాగం. రవిశంకర్కి పాలక పక్షాలు, పాలక పక్షాలకి రవిశంకర్ పరస్పరం అలాగే ఉపయోగపడుతూ వుంటారు.
    ఇజాల జోలికో, మనకున్న తీవ్రమైన భావజాల అభినివేశంతోనో విషయాన్ని చూడకుండా ఎదుటివారు చెప్పేది ప్రశాంతచిత్తంతో వినండి. మీరు వ్యతిరేకిస్తున్న భావజాలాలతో పోరాడవలసింది ఇలా కాదని నా సూచన.
    ఈ దేశంలోని ప్రతి దౌర్భాగ్యానికీ మీ దృష్టిలోని బ్రాహ్మణులు, మనువాదం, హిందూఫాసిజమే కారణమని మీకు నిజంగా స్పష్టమైన అవగాహన వుంటే నాలాంటి సామాన్యస్థాయివారికి అర్థమయ్యేటట్లుగా విశదీకరించవలసినదిగా మనవి. ( అది అవసరమని మీరు భావిస్తేనే సుమా!)
    సంభాషణ ద్వారానే మీరు సత్యాన్ని చేరుకోగలరు. అలాగాక, ‘‘నేను క్రొత్తగా తెలుసుకోవలసినదేదీ లేదు. నేను జ్ఞానాన్ని చేరుకున్నాను. మీ బోటి అజ్ఞానుల భరతం పట్టడమే నా పని’’, అని మీరు అనుకుంటే అది మీ విచక్షణకే వదిలేసేను.
    కలామ్ విషయంలో కూడా మీరిలాగే స్పందించారు. నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నాని చెప్పినట్లయితే అది వ్రాసినవారు భావజాల ప్రచారానికి కలామ్‌ని ఎలా ఉపయోగించుకుంటున్నారో నాకు చేతనయినంతలో విశదీకరించేవాడిని.
    నేను కూడా మీలాగా ఒక సాధారణ వ్యక్తిని. అందుకే, నేనేమైనా మీకు ఇబ్బంది కలిగించేటట్లు మాట్లాడితే క్షమించండి.

  19. శ్రీనివాసుడు గారూ
    మీరు అంత ఆగ్రహంగా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలీదు .
    మానవతా వాది కలాం గారు స్వయంగా వాజపేయి ప్రభుత్వం తనని గుజరాత్ మత కలహాల విశయం లో దారి తప్పిమ్చిమ్దని చెప్పారు. కొందరు కలాం గారిని అలా మాట్లాడడం పై విమర్సించారు కూడా> నేను కలాం గారి తీవ్ర అబిమానిని. అందువల్ల నేను మీలా ఆయన్ని కూడా విమర్సిమ్చలేను. క్షమించండి.ఆవేదనతో నేను రాసిన మాటలకి పెడర్థాలు తీయవద్దు.
    నేను హిట్లర్ అభిమానిని. ఆయన జర్మన్ జాతీయవాదిగా ప్రజలలో ఆత్మాభిమానాన్ని పెంచాడు. భాస్కర్ గారిలాంటి కమ్యూనిశ్టుల వూసు లేకుండా చేసాడు. తనని తానూ ఆర్యుడనని ప్రకటించుకొన్నాడు. పవి త్ర స్వస్తిక్ చిహ్నం ఆయనది.
    అమెరికా ముస్లిం టె ర్రరిష్టులతొ పోరాడుతున్నట్లే ఆయన యూదులని కుడా ప్రమాదం గా భావించాడు. ఆయన కోణం అది . మనం ఆకోణం పైన కూడా పరిశోధన చెయ్యాలి .
    మహా ఆధ్యాత్మిక వేత్త రవిశమ్కర్ ఏమాత్రం ప్రభావశీలి కాదని మీరు చెప్పడం నాకు బాధ కలిగించింది. కొంపముంచి మీరు కూడా భాస్కరం గారిలా నాస్తిక కమ్యూనిశ్టా కర్మ.

  20. హిట్లర్ గారి గురించి వొక లింకు.
    http://europeanhistory.about.com/od/germanyandprussia/fl/Who-Supported-Hitler-and-Why.htm

  21. THIRUPALU says:

    శ్రీనివాసుడు గారు,
    పుంఖాను పుంఖాలుగా రాస్తున్న మీ వ్యాఖ్యానాలు చూస్తుంటే మీ పాండిత్యం ఆపుర్వం. అద్బుతం. కానీ ఏ భావ జాలానికి కట్టుపడని మీ చర్చ ఎవరి కొరకు ? ఎందుకొరకు? మేధావులు ఎవరి పక్షం వహీంచ కూడదు. ఇక్కడ బాధితుడు, బాధించు వాడు అంటు ఎవడు లేడు. మేధావికి అందరు సమానమే అంటున్న మీరు ఎవరికీ ఏమి చెప్ప దలచుకున్నారు ? ఏమి లేనపుడు ఎందుకు వ్యాఖ్యానాలు. అది ఏమీ రాయక పోవటంతో సమానం కాదా? మీ పిలాసపి తో ఎవరి పక్షం లేదంటూనే ఒక పక్షానికి మీరు కొమ్ము కాస్తున్నారని అర్ధమవటము లేదా !

    • శ్రీనివాసుడు says:

      తిరుపాలుగారూ!
      సారంగలోని దాదాపు అన్నివ్యాసాలను చదివి వ్యాఖ్యానాలు చేస్తున్నవారిలో తమరు ప్రథమశ్రేణిలో వుంటారని ప్రతి వ్యాసంలోనూ కనబడే మీ వ్యాఖ్యలు చెబుతుంటాయి. అ పుంఖానుపుంఖాలా, శరపరంపరలా, వాటివల్ల మీకుగాని, సమాజానికిగానీ, ఏదైనా ప్రయోజనం వుంటుందా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
      పాండిత్యం ఎందుకు పనికివస్తుందో ఏమీ తెలియని పడవవాడు, పండితుడి కథ ద్వారా మనకి బాగా తెలుసు.
      మనం తెలుసుకున్న జ్ఞానం వివేకంతో ప్రవర్తించడానికి వాడుకోకుండా, కేవలం ఒక భావజాలానికి మాత్రమే కట్టుబడివుండేట్లుగా చేస్తే అది నిరర్థకమని నా భావన.
      భావజాలం కాదు, వివేకం మాత్రమే బాధితుడి పక్షానే నిలబడుతుంది. ఏదో ఒక భావజాలానికి మాత్రమే పరిమితమవడం మనం గిడసబారడానికి మాత్రమే పనికివస్తుంది.
      ఏ పక్షానికీ ఉపయోగపడే ఉద్దేశం నాకు లేదు. అలా భ్రమిస్తే నేను చేయగలిగిందేమీ లేదు.

    • ఏ భావ జాలానికి కట్టుపడని మీ చర్చ ఎవరి కొరకు ?

      ఏ భావజాలం మకిలి అంటని మధ్య తరగతి వారికి, స్కూల్ పిల్లల కొరకు. దేశంలో వారి సంఖ్యే ఎక్కువ. శ్రీనివాసుడు గారిలాంటి అవసరం వాళ్లకి చాలా ఉంది. ఆయన రాసినది చదివితే భావజాలం మకిలి అంటనివారికి వివేకం, విచక్షణ పెరుగుతుంది. సరైన దశలో ఆలోచించటం అలవాటు అవుతుంది.

      • THIRUPALU says:

        నా వ్యాక్యలో చివరి లైన్ గమనించిన ట్లు లేదు. 😁

  22. శ్రీనివాసుడు says:

    మీరు అంత ఆవేదనతో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడంలేదు. మానవతావాది కలాంగారి పట్ల మీకున్నంత తీవ్రమైన, విమర్శకతీతమైన అభిమానం నాకు లేదు. అదే సమయంలో అతడిని సామాన్యమైన ఉదారవాది, తన స్వంత ఉన్నతికి మాత్రమే పాటుపడే వ్యక్తిగా చూడడాన్నీ నేను సమ్మతించను.
    మీరు హిట్లర్ ని అభిమానిస్తే నాకెట్టి అభ్యంతరమూ లేదు. అయితే, హిట్లర్‌నీ, కలామ్ నీ ఏకకాలంలో అభిమానించే మీ బహుళత్వ దృష్టికి నా అభినందనలు.
    జాతీయతావాదం అంటే కేవలం హిట్లర్ చెప్పిందే అని, ఇంకొకటి కాదనే మీ పరిశీలన అద్భుతం. ఏ దేశంలోనయినా అంతర్గత, బాహ్య శత్రువులో పోరాడడానికి ఏకమయ్యే వాదాన్ని హిట్లర్ జాతీయవాదంతో ముడిపెట్టే మీ మేధస్సుకు నా వందనాలు.
    చెప్పిన విషయంలో మనకు కావలసిన ముక్క మాత్రమే తీసుకుని, దానినే పీకి, లాగి, 200 కామెంట్ల వరకూ దేకించిన మహాజ్ఞాని ఒకాయన తనని అడిగేవారికి, తనకి చెప్పేవారికి మీలాగే ముందుగా హిట్లర్, నాస్తిక కమ్యూనిస్టులాంటి ముద్రలు వేసి చివరకి మహామౌనరూపం దాల్చిన వైనం ఇదే సారంగలోని ఇంకొక వ్యాసంలో చూడగలరు.
    కొంపదీసి మీరు ఆయన మారుపేరుతో వున్న ప్రచ్ఛన్నరూపం కాదు కదా! ఖర్మ…………..

  23. శ్రీనివాసుదుగారూ
    జాతీయ వాదం అంటే హిట్లరు జాతీయ వాదం కుడా. యీకొణాన్ని కూడా మీలాంటి పండితులు పరిశీలించాలి. తిరుపాల్ గారిలా మరోకరిలా మీరు దేని పట్లా కమిట్ మెంటు లేకుండా వుండాలి కదా? నేను హిట్లర్ని అభిమానిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? మొత్తం హిట్లరు గురించి ప్రపంచంలో వున్న పుస్తకాలన్నీ లింకులన్నీ మీరు పరిశీలించారా? నేనొక లింకు యిచ్చాను చూసారా/ మీరు అన్నీ చదివేశారు. కాని నాలాంటి సాధారణ స్తీని ఫేక్ అని అవమానిస్తున్నారు . ఎవడితోనో మీలాంటి వాడితో పోలుస్తున్నారు. ముందు స్త్రీలని గౌరవించడం నేర్చుకోండి . హిట్లర్ మీలాంటి వాడు కాదు.

  24. ప్రేమ మూర్తి హిట్లర్ మాతృప్రేమ గురించి రాసిన కవిత చదవండి. స్త్రీల పట్ల ఆయనకి వున్నా గౌరవం తెలుస్తుంది.శ్రీనివాసుడు గా రూ
    https://lifetutors.wordpress.com/2011/07/02/the-mother-a-poem-written-by-hitler/

  25. chandolu chandrasekhar says:

    హిట్లర్ ,పై అభిమాన మేమిటి ? ఫాసిస్ట్ , రేసిస్ట్ ఐన వాళ్లకి అభిమానులు వుంటారా? నా ఇచ్చాయే గాక , నాకేటి వెరపు అంటే చేసేది ఏమిలేదు . కాన్సె ట్రేషన్ క్యాంపు లో స్త్రీల పై జరిగిన అకృత్యాలు మనిషి అనే పదానికే మచ్చ అటువంటి మానవ మృగానికి అభిమానులా ? జాతీయవాదం వేరు , ఫాసిసం వేరు వలస వ్యతిరేక పోరాటాలలో ,జాతీయవాదం పుడుతుంది .హిట్లర్ ,ముసోలిన్ ,వీళ్ళుకుడా జాతియవాదులైతె లోకం ఎం బతికి బట్ట కడుతుంది .

  26. శ్రీనివాసుడు says:

    చంద్రశేఖర్ గారూ!
    మీరు కూడా పొరబడ్డారే! ఇదివరలో మీరు ‘‘ముసుగు తీసేయ్’’ అని బుద్దిచెప్పిన నయా హిట్లరే మళ్ళీ వేరే పేరుతో వస్తున్నాడు. చంద్రశేఖర్ గారూ, హరిబాబు గారూ ’’రెటమతం‘‘ వ్యాసంలో హెచ్చరించి వదిలిన తరువాత ఆ వ్యాసంలో మొఖం చెల్లక, ఇక్కడ హిట్లర్ అభిమాని ముసుగులో మనల్నందరినీ పరోక్షంగా హిట్లర్ అనుయాయులని ధ్వనిస్తున్నాడు.
    ఈ వ్యాఖ్య చూడండి.
    భాస్కరం కల్లూరి
    March 22, 2016 at 9:57 pm
    ‘‘జాన్సన్ గారూ…ధన్యవాదాలు. “ఇప్పుడు – దేన్నయినా సరే ‘బుల్దోజ్’ చేయాలనుకుంటే, ముందుగా ఆపని చేయాలనుకుంటున్న వారు తమ ‘స్కేల్’ ను అసాధారణంగా పెంచుకోవాలి. కృతకంగా సృష్టించబడే ఆ కొత్త వాతావరణం లో క్రమంగా అన్ని ఒక్కటొక్కటిగా పిపీలికాలు అవుతాయి.” అన్న మీ వాక్యం నన్ను మెరుపులా తాకింది‘‘.
    దీనికి సమాధానంగా అతడి వ్యాఖ్య చూడండి.
    rani siva sankara sarma
    March 22, 2016 at 11:00 pm
    ‘‘ఆ స్కేల్ ని పెంచుకోవడంలో ముందున్నానని అ నేకసార్లు నిరుపించుకొన్నారు భాస్కర్ గారు. కుహనా చారిత్రికప్రచారాలని తిప్పికొట్టారు. యిప్పుడు కుహనా ఆధ్యాత్మికత వెనుకగల రహస్యాలని బట్టబయలుచేస్తున్నారు.
    జాన్సన్ గారి సలహా ని నేను కూడా సీరియస్గా పరిగణిస్తున్నాను‘‘.

    అంటే, ఎంత వ్యంగ్యమో చూసేరా? అతగాడికి ఏ మనిషీ లెక్కలేదు. ఎవ్వరినీ దూషించక వదలిపెట్టడు. చివరికి పెద్దమనుష్యులైన భాస్కర్ గారిని, జాన్సన్ గారిని గేలి చేయకుండా వదలలేదు.
    పాండిత్యానికి కుటిలత్వం జోడయితే బుద్ధి కుక్కమూతిపిందెలు వేస్తుందో మీకు స్పష్టమయిందనుకుంటాను.

    **వెనుకటిగుణమేల మాను కదరా సుమతీ!** అన్న శతకకారుడు ఎంత దార్శనికుడో కదా!

  27. rani siva sankara sarma says:

    నేను జాన్సన్ గారి గురించి భాస్కర్ గారిగురించి గౌరవం గానే రాశాను. నన్ను యెందుకు ప్రస్తావిస్తున్నారో నాకు తెలియదు. అనవసరమైన నిందలు వెయ్యడం మ ర్యాదకా దు. నాకు భాస్కర్ గారి వ్యాసంతో ఏకాభిప్రాయం వుంది. అలాగే జాన్సన్ గారు చెప్పినట్లు ప్రమాణాలు పెరగాలి కూడా.,ఆక్రమ క్రమాభివృద్ధి భాస్కర్ గారిలో కనబడుతోంది అనే నా అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాను.
    నేను రాసిన మరోవ్యాసం విషయంలో కుడా జాన్సన్ గారి అభిప్రాయాన్ని స్వీకరించాను. యిటువంటి దురుద్దేస పూర్వక ఆరోపణలు మామధ్య దురాన్ని పెమ్చలేవు.అభిప్రాయ భేదాలు వచ్చినపుడు మేము డైరెక్టు గానే మాట్లాడుకొన్నాము. . ఆవిషయాన్ని సూచన ప్రాయంగా భాస్కర్ గారు ప్రస్తావిస్తూ మా భావ ఐక్యతన్ని కుడా చాటి చెప్పారు యింతకు ముందే.
    నా ప్రసక్తి వచ్చింది కనుక వివరణ యిచ్చాను.

  28. శ్రీనివాసుడు says:

    rani siva sankara sarma
    March 17, 2016 at 8:02 am
    ‘‘ధ్వని సిద్ధాంతం లో జీవం వుందని గుర్తించారు. అది నా ప్రయోగమని నా అంతస్సారమని గుర్తించారు.’’
    ఈ వ్యాఖ్య చేసిన వారెవరు? అంటే, నా వ్యాఖ్యలలోని వాచ్యాన్ని చూడకూడదు, ధ్వనే చూడాలని కదా?
    మర్యాద గురించి తమ దగ్గర నేర్చుకోవాల్సిన స్థితిలో నేనే కాదు, **రెటమతం** వ్యాసంలోని తమ మర్యాదాపూర్వక స్పందన, వ్యాఖ్యలను గమనించిన వారెవ్వరూ లేరు. జాన్సన్ గారు చెప్పింది కృతకంగా అసాధారణంగా పెరిగిన వాటి గురించి గానీ సహజమైన క్రమక్రమాభివృద్ధి చెందే ప్రమాణాల గురించా? అంటే, భాస్కర్ గారు అలా కృతకంగా స్కేలు పెంచుకుంటున్నారని మీ ధ్వనే కదా? పైగా మీ సలహాని సీరియస్ గా పరిగణిస్తానని జాన్సన్ గారిని ఎద్దేవా చేయడమా?
    ఇంతకన్నా కుటిలత్వం వేరే వుందా?
    నిందలు వేయడం ఎవరికి అంతస్సారమో రెటమతం వ్యాసంలోని తమ స్పందనలే చెబుతాయి. దానిని తూర్పారబట్టిన వ్యాఖ్యాతలే చెబుతారు.

  29. ఆ రాణి శివ శంకర శర్మ గారో పే ద్ద పండితుడుట ఆయన్ని యీశ్రీనివాసుడు భీమసేనుడిలా తొక్కేశాద ట. యీశ్రీనివాసుడు గారికి స్వంత ఆలోచన వుందని భ్రమ పడ్డాను.
    యింకా మీరు పాత ఆలోచనలలోనే వున్నారు. గాంధీ గురించి కాదు గాడ్సే గురించి పునరాలోచించాలని పెద్దలు చెపుతున్నారు. ఆయన్ని మహాత్ముడు అనే వాళ్ళు రాజకీయ నాయకులలోనే వున్నారు.
    ఫాసిజం అనే పదం మొదట తిట్టు కాదు. జాతీయ ఐక్యత కిపర్యాయపడంగావుమ్డేది.మొదటి తరానికి చెందిన గొప్ప జాతీయవాది వొకరు ఈమాట అన్నారు కూడా. హిందు జాతీయవాదులు ఫాసి స్టు భావాలనుంచి ప్రేరణ పొందారు. సమాజంలొ మిలటరీ డిసిప్లిను అవసరమని భావించారు
    http://www.sabrang.com/cc/comold/mar00/document.హతంhttp://www.sabrang.com/cc/comold/mar00/document.htm

    .

  30. శ్రీనివాసుడు says:

    కనకపు సింహాసనమున శునకము గూర్చుండఁబెట్టి శుభలగ్నమునం దొనరఁగఁ బట్టముఁ గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

    ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు.

    మేడిపండుచూడ మేలిమై యుండును
    పొట్టవిప్పిచూడఁ బురుగులుండు
    పిరికివాని మదిని బింకమీలాగురా

    కడివెడైననేల ఖరముపాలు.
    —-
    హిట్లర్, గాడ్సే ఫాసిజ అభిమానిగారూ! తమకి తెలియదేమో, సారంగవారు ఈ స్థలాన్ని, కాలాన్ని తమ హిట్లర్, గాడ్సే, ఫాసిజ ప్రచారంకోసం అందుబాటులో ఉంచలేదు.

    ఇప్పటికే చంద్రశేఖర్ గారు అసహనం వ్యక్తం చేసేరు. ఇలాగే తమ ఫాసిజ ఫోిబియాని కొససాగించి, పాఠకులమీద కురిస్తే అందరూ ఏకమై రెటమతంలోలా తిట్టే సమయం రాబోతుంది. ఇకనైనా మీ ముసుగు తొలగించి, పలాయనం చిత్తగిస్తే పరువు దక్కుతుంది.

  31. Kumar Sarat says:

    సారంగ అంటేనే ఒక రంగం – ఒక యుద్ధ శిబిరం. ఇక్కడందరూ అక్షర యోదులే! ఇష్టంలేని అన్ని భావజాలాల మీదా కత్తులు దూస్తుంటారు. అందులో సమయాభావం రానీయరు. ప్రతి కీలక ఘట్టంపై ‘ముద్ర’ వేయనిదే నిద్ర కూడా పోరు. పోరు యోధులకు నేపథ్య వాద్యం సారంగ. తాము చెప్పేదే సారం. తాము నడిపేదే రంగం. ఇది సరిహద్దులలో రంగం కాదు; ఇది విశ్వ విద్యాలయాలలో, అంతర్జాలాలలో, జనం మధ్యే నడిపే రంగం; కానీ, ఈ సారంగం మరో ప్రపంచం కోసం అంటూ సాగుతున్న మహారణ రంగానికి అక్షర సేన! ఇతరేతర భావజాలాలపై ఎక్కుపెట్టిన అక్షరాస్త్రం ఇది. దానికి అడ్డు వచ్చిన దేనినీ సహించేదే లేదు. ఇంకో భావజాలం కనిపిస్తే చాలు; ఉక్కు జాగిలాలై తుక్కు రేగగొట్టేస్తారు.

    సారంగ సమరాంగణంలో బైటుబైటునా యుద్ధ కాముకత ఉట్టి పడుతుంది; ప్రతి రచనా ఒక సంరచనే! అక్కడ భీషణ ఘోషతో నగారాలు, భేరీలు, కాహళాలు కదన కుతూహలంతో చెలరేగిపోతుంటాయి.

    కానీ … కాల గర్భంలో ఇట్లాంటి ఎన్ని సారంగలు ఒక వెలుగు వెలిగి పోలేదు? ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహాలు? ఏవి తల్లీ! నాడు కర్ణ భేరులను బద్దలు చేసిన యుద్ధ భేరీలు?

    • chandrika says:

      సారంగమో యుద్ధ రంగమో ఏ పేరైతే ఏంటి చర్చావేదిక పేరు తో దూషణ చేయిస్తూ మనుషుల్నివిడకొట్టడం వీరి ధ్యేయం !! వెన్నల గారి వ్యాఖ్య ‘యీపద్యాలు మంత్రాలు చదివే బాపన్స్ దగ్గర చదవండి నాదగ్గర కాదు’ !! దీనిని చర్చ అంటారా ఎవరైనా ? బ్రాహ్మలని తిడ్తూ ఎన్ని కథలో ఈ పత్రిక లో !! బ్రాహ్మలు ఏం చేసారో వీళ్ళ ని అర్ధం కాదు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు అంటారు. అమెరికా వెళ్ళినా అంతరిక్షం వెళ్ళినా ధోరణి మార్చుకోరు కొంత మంది. పత్రిక అమెరికా నుంచే వస్తుంది. అమెరికా లోని సమస్యలు – మిషిగన్ లో కలుషిత నీటి గురించి కానీ, అమెరికా లో తెలుగు వారు చేసే మంచి పనుల గురించి కానీ ఒక చర్చా వేదిక ఉండదు. కానీ భారతం లో భాజపా ప్రభుత్వం లో ఏమి జరిగినా భూమి తలక్రిందులైనట్లు కవిత్వాల వెల్లువ వచ్చేస్తుంది. పైగా కొందరు రచయితలు ముఖ పుస్తకం లో కవిత్వాలు వ్రాయండి అని వ్యాసాలు వ్రాస్తుంటారు. ఏదో ఉద్యమం చేయాలి మనుషుల్ని విడగొట్టాలి అని తప్పితే మనుషుల్ని ఒక్కటి చేద్దాం అన్న ఆలోచనాధోరణి వీరి లో కన్పించదు. Malda అల్లర్ల గురించో, lokmat గురించో అడగండి . ఒక్కరి దగ్గర జవాబు ఉండదు. నిజంగా పర్యావరణం మరియు దాని రక్షణ గురించి అందరికీ అంత దిగులు అయితే కార్లల్లో, ఇళ్ళల్లో ఏసీ లు వేసుకోకుండా ఉన్నారా ? ప్లాస్టిక్ బాటిల్ లో మంచి నీరు తాగటం మానేసారా ? రూపాయ కి వచ్చే షాంపూ సాచేట్ కాకుండా కుంకుడు కాయలు కొనుక్కుని గిరిజనులని ఉద్ధరిస్తున్నారా ? కథలు/కవిత్వాలు వ్రాసి సమాజ సేవ అనుకునే వీరికి ఎవరు చెప్తారు ?

  32. యేమీ తెలియని వొక బ్రాహ్మడి తో ముస్లింలు అంటే టెర్రరిష్టులు అనేవిషయం తెలియని అజ్ఞాని రెట్టమతం గిట్టమతం అని ఏదో రాస్తే దాని మీద విరుచుకు పడి గొప్పలు చెప్పుకోడంలో అర్థంలేదు.పద్యాలు పిల్లలు కూడా వల్లిస్తారు. వొకప్పుడు ముస్లిం ప్రభువుల దగ్గర కొలువు చేసిన బ్రాహ్మలు విశ్వాసంతొ యేదో రాస్తారు. దాని ఖండిస్తే మీరు హిట్లర్ ముస్సోలినీ స్థాయికి ఎదిగిపోయినట్లేనా బడాయి
    మీరు అలాగే శర్మలతో శాస్త్రులతో కుమ్ముకోమ్డి .మాకు ఆసక్తి లేదు.
    మామీద కాదు మీప్రతాపం.
    ఐక్య అఖండ భారత్ నిర్మాణమే మాద్యేయమ్. జై హింద్

    • శ్రీనివాసుడు says:

      నాజీ హిట్లర్ కి వీరాభిమానిగారూ! ఆయన అనుచరుడైన గోబెల్స్ గారూ, తమ ప్రచార స్వకుచ మర్ధనకే సారంగ స్థలం చాలేట్లు లేదు. రెటమతంలో పిచ్చతిట్లు తిట్టినా తమ ప్రచారం ఆపలేకపోతున్నరు. దట్స్ ది నాజీ స్పిరిట్. (స్పిరిట్ అంటే ఇక్కడ స్పూర్తి, తమరు ఆవాహన చేసే భూతం కాదు.)

  33. CHANDOLU CHANDRASEKHAR says:

    తన భావ ప్రకటన స్వేచ్చని వినియోగించుకో లేనివాళ్ళు ఫాసిస్ట్ కంటే హీనులు .నాజీజం ,ఫాసిసం క్రమ శిక్షణ ! స్త్రీలని రేప్ చేయటం క్రమ శిక్షణ .చార్లిచాప్లిన్ తెలుసా ? హిట్లర్ జాతకం అతనికి బాగా తెలుసు .నాకు తెలిసి HUMAN BEAST అనే పదం హిల్టర్ కోసమే కనిపెట్టి వుంటారు .వెన్నలంత మేసి యేరు నేమరేసినట్టు , ఆఖండ భారత్ దగ్గరికి వచ్చింది యవారం .ఇందిరగాది ,నేషనల్ ఇంటిగ్రాట్ కి పెద్దతేడా లేదు .రాష్ట్రాలని దోచు కునే నేషనల్ మొనోపలీ అందుకే ఇందిరా టైం లో ప్రాంతీయ పార్టిలు గెలిచై.మార్కెట్ ఎకానమీ ,పొలిటికల్ ఎకానమీ తెలిస్తే ,హిట్లర్ సోసిలిస్ట్ ముసుగు తెలుస్తుంది .ఆఖండ భారత్ అంటే ఒకప్పుడు .ఇప్పుడు వరల్డ్ ఎకానమీ ,ఇది ప్రపంచ కుగ్రామం , గ్లోబల్ సామ్రాజ్యం .

  34. సావర్కార్ కంటె మనం గొప్ప వాళ్ళమా?

    http://www.sacw.net/DC/CommunalismCollection/ArticlesArchive/casolari.pdf

    • శ్రీనివాసుడు says:

      కొంత వ్యవధినిచ్చి తిరిగి మొదలైన గోబెల్స్ ముద్రారాక్షస ప్రహారం. మన బోడిగుండుకూ. ఎదుటివాడి మోకాలుకీ ముడిపెట్టి రెండూ వైరుధ్యాలే అని చెప్పగల శాడిత్వం.

  35. యిప్పుడు వరల్డ్ ఎకానమీ. యిది ప్రపంచ కుగ్రామం .గ్లోబల్ సామ్రాజ్యం
    యిప్పుడు మనకి గ్లోబల్ స్వాములు కావాలి . అనేక శ్రీల రవిశంకర్ లు కావాలి. విశ్వ మార్కెట్ కి ప్రభుత్వం అండ రాయితీలూ ఎలా అవసరమో ఈ గ్లోబల్ స్వాములకి కూడా ప్రభుత్వ అండ అవసరం . అలాగే స్వాములు కుడా విశ్వ విపణిలో దూసుకు పోతున్న యీరోజుల్లో యింకా బహులత్వమూ మా మామ్మగారి భోశానప్పెట్టె లాంటి రాతలు వల్ల ఉపయోగమేమిటి?

    స్వామి వారిగురించి మీరాతలు నన్ను కలచి వేశాయి . యింకా మీరు సోషియాలజీ అధ్యయనం చెయ్యాలి
    శ్రీ శ్రీ రాసిన నగరంల్లో వృషభం కవిత చదవండి.

    • శ్రీనివాసుడు says:

      మము వీడని వృషభము నీవే
      సొనగా మొరిగే శ్వానము నీవే
      వృషభం మిథ్య – పలాయనం మిథ్య కూడా మిథ్య అని తేల్చేసిన అద్వైతాద్వైత మాయాయుద్ధ ప్రవీణా, నీ వేయి విషపు పడగలలో ఒక పడగని మాత్రమే చితక్కొట్టేమని ఇప్పుడిప్పుడే అర్థమవుతూవుంది.

  36. CHANDOLU CHANDRASEKHAR says:

    ఇంగ్లీష్ వాడి పాదాలు కడిగి నెత్తి మిద చల్లు కున్న సావర్కర్ గొప్పవాడా ? హాతవిది ! మీతో వాదించే ఖర్మ పట్టింది మాకు , కాని మాకు ని విషపు నీడ ఎవరి మిద పడకుండా చూడాల్సిన భాద్యత మాది , భారత దేశ పునాది లో చార్వాక , లోకాయత తాత్వికతని బ్రస్టు పట్టించిన శంకరుడు ,హిందుఫాసిసం మూలవిరాట్టు సావర్కర్ . మేము అతనిని చదివి బ్రష్టు పట్టేకంటే వచ్చిన చదువు మర్చి పోవటం మంచిది .

  37. మీరు సావర్కార్ ని పైకి నిందించ వచ్చు మీహృదయంలో ఆయన వున్నాడు. మహమ్మద్ ప్రవక్త అజ్ఞాని అని మీరు పదే పదే వాదించారు. ఆ వాదనాశక్తి మీకు ఎక్కడినుంచి వచ్చింది. మీదృష్టిలో చార్వాకుడు ఆకర్షణీయమైన వాక్కు కలవాడు అంటే కరుడు కట్టిన హిందూవాది సావర్కారే. ఆయనకీ హిందూ జాతీయ వాదం, మీలాగే ముస్లిం వ్యతిరేకత తప్ప వేరే విశ్వాసాలు ఏవీ లేవు. మీ వెనకే శ్రీనివాసుడు గారు కూడా. మిమ్మల్ని ఆయన ఖండించలేదు కదా? మీహిందూ ఫాసిష్టు చార్వాక్కు ఫలించుగాక. మీకు నేనూ అభిమానిని.
    కమ్యూనిజం లాంటి పదాల వెనిక కమ్యూనలిజాన్ని కొందరు దాచిపెడతారు.

  38. శ్రీనివాసుడు says:

    మాయాయుద్ధ ధురీణులవారికి,
    వీరసావర్కార్ గురించో, హిట్లరో గురించో లింకుల అరణ్యంలో తిరిగి, ఆ లింకు సర్పాలని మా మీదకి వదిలే బదులు రెటమతంలో తమరు నుడివిన మహా తాత్త్వికరహస్యాలకు లింకులు వెదికితే సారంగ స్థలం కాపాడబడుతుంది. ప్రశ్నించినవాళ్ళను వీరసావర్కర్లుగా, హిట్లర్ అనుయాయులుగా చూసే గోబెల్స్ సలహాలు మాకెందుకు?

  39. హిందుత్వ వాదం , హిందుత్వని వ్యతిరేకించే వాళ్ల వాదం రెండూ సమాన ము గా తనకి నచ్చుతున్నాయని శ్రీనివాసుడు గారు అన్నారు. అంటే గాంధీ గాడ్సే యిద్దరూ మంచోళ్లే అన్నట్లు వుంది ఈ తర్కం. హిట్లరూ[ సావర్కార్ ] లెనినూ యిద్దరూ యిష్టమే అన్నట్లు వుంది . యీవిచిత్ర వాదాన్ని చూసె తిరుపాలు గారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
    చంద్ర శేఖర్ గారూ మీమైత్రీ బంధం ఎటువంటిది? అంటే కొంప ముంచి మీరు హిమ్దూత్వ చార్వాకాన్ని కనుగొన్నారా ? అలాగే ఫాసిష్టు కమ్యూనిజాన్ని.యిద్దరు మిత్రులూ కల్సి కొత్తసిద్ధాంతాన్ని కనుగొన్నారా?

    • శ్రీనివాసుడు says:

      మాకు కావలసింది మీ పిడివాదాలు కాదు పండితపుత్రులు గారూ! అసలు ఏ వాదాలూ పనికిరావు. కోడిగ్రుడ్డుకు ఈకలు పీకడం, బోడిగుండుకూ మోకాలుకూ ముడిపెట్టడం, తమ విశేష రచనా వైదుష్యాన్ని ప్రదర్శిస్తూ ఆత్మనింద రూపంలో పరనింద చేయడం, ‘‘విభజించి పాలించు’’ అనే తమ కొలోనియలిజ అనుకరణా పాండిత్యం సంభాషణకి పనికిరాదు.
      చాలా వ్యాఖ్యల క్రితమే ఒక వ్యాఖ్యాత,
      ‘‘కుల.మత భేదాలు పోయి అందరూ ఒక్కటవ్వాలనడం కూడా ఫాసిజమే అయినప్పుడు మీరు దేని గురించి ఆందోళన పడుతున్నారు?
      ప్రస్తుతానికి ఈ ఫాసిజం ప్రభావం లేకుండా జనం ఒకరితో ఒకరు పోట్లాదుకుంటూ శోభాయమానంగానే ఉన్నప్పుడు పరిస్థితి మీకు నచ్చినట్టుగానే ఉందిగా!ఇంకెందుకీ ఆవేశం?బహుశా దీన్నంతా ఇలాగే ఉంచెయ్యకుండా అందర్నీ కలిపేస్తారేమోనని భయమా అందరూ కలసిపోతారని మీకు భయమా?’’
      మీకు గ్రాసభోజనం పెట్టింది నెమరువేయలేదా?
      *****
      ‘‘మనం నిండామునిగిన, మన లోపల నరనరాలా జీర్ణించుకుపోయిన తాత్త్వికభావజాలాన్నంతా కొన్ని ఘడియలైనా ప్రక్కనబెట్టి, ఏ అభినివేశంలేకుండా సంభాషణలని క్రొత్తగా ప్రారంభించవలసివుందన్న మీ గమనింపు బాగుంది’’, అన్న నా వ్యాఖ్య చదవలేదా?
      ఇంకా, మీకు అర్థమయ్యే తాత్త్వికభాషలోనే చెప్పాలంటే, తెలుపు, నలుపే కాదు, అనేక ఛాయలు కూడా వుంటాయి. వాటన్నింటినీ త్రోసిరాజని ’’జగమంతా శ్యామలం… శ్యామలం… శ్యామలం‘‘ అని జపం చేస్తూ, అయితే మా వైపు, కాకపోతే శత్రుపక్షమనే తమ అమెరికనిజాన్ని ఇక్కడ చిమ్మమద్దు.
      వాళ్ళు గాంధీలు, గాడ్సేలకంటే ముందుగా మనుష్యులు. అది మరచిపోయి, వారిని ఏదో ఒక భావజాలానికి సర్వాత్మనా ప్రతినిధులుగా పరిగణిస్తూ, వారిలోని మనిషిత్వాన్ని మరచిపోతే వచ్చే సజ్జలే ఇవి.
      తమరి గాంధీ మహాత్ముల గొప్పతనంలో వారు అంబేడ్కర్నీ, బోస్‌నీ ఆదరించిన తీరు, ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించిన తీరు, సత్యంతో తన ప్రయోగాలలో తన మానసిక వైక్లబ్యాన్ని ప్రదర్శించుకున్న తీరు కూడా వుంది.

  40. నిజమే అనేక చాయలు కూడా వుంటాయి. హరి హరపుత్రుడిలా ఫాసిస్టు కమ్యూనిజం.
    గొప్ప తార్కికతో నిర్ధారించినందుకు కృతజ్ఞతలు.
    జై గాడ్సే జై హిట్లర్ జై హింద్

  41. శ్రీనివాసుడు says:

    వావ్! నూతన ముద్ర ఫాసిస్టు కమ్యూనిజం, శాఙ్కర కు కళ్ళు పచ్చబడితే లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది. ఇలాంటి ముక్కస్యముక్క సంకర వాచ్యాలకే రెటమతంలో ఉమిసింది. గాంధీలాగా తమ మేనకోడళ్ళతో ‘‘ఎక్స్‌పెరిమెంట్స్ విత్ మోరల్ ప్యూరిటీ’’ జరపుతారేమోనని భయం వేస్తుంది.

  42. బహుశా చందోలు చంద్ర శేఖర్ గారు, శ్రీనివాసుడు గార కలిసి వివిధ చాయలని కలిపి సృష్టించిన’ హిందు ఫాసిస్టు కమ్యూనిజమ్ ‘ సిద్దాంతం హిట్లరుగారి నేషనల్ సోషలిజం నుంచి స్ఫూర్తిని పొమ్దివుండవచ్చు. ఫాసిస్టు జాతీయవాదాన్ని[దీన్నిసైంటిఫిక్ రేసిజం అనికూడా అనేవారు] మార్క్సు ప్రచారంలోకి తె చ్చిన సోషలిజాన్ని కలిపి వండిన వంటకం యిది. పేరులోనే భిన్న చాయలూ, వివిధ రంగులూ .https://en.wikipedia.org/wiki/Nazism

  43. శ్రీనివాసుడు says:

    వీరినే ఆదర్శంగా తీసుకున్న వృషభాలకు ఈ లంకె సరియైనదే.
    http://www.minoritiesofindia.org/gandhis-sexual-abuse-of-grandnieces/

  44. నేను గాడ్సే సావర్కార్ హిట్లర్ల అభిమానిని .

  45. శ్రీనివాసుడు says:

    గాంధీని నెత్తికెత్తుకునే శాఙ్కరకే ఆ టపా. ఆయన్ని అభిమానించివారు కాబట్టి అలాగే నగ్నశయనాలు చేస్తారట.

  46. చందోలు చంద్ర శేఖర్ గారు నాజీ కాన్సంట్రేషన్ కేమ్పుల్లో స్త్రీలపై జరిగిన తీవ్ర అత్యాచారాలని ఖండించారు. శ్రీనివాసుడు గారికి అలా ఖండించడం కూడా యిష్టం లేదు. అందుకే గాంధీ ఉదాహరణ తెచ్చి, పరోక్షంగా నాజీ అత్యాచారాలు కూడా గౌరవిమ్చదగినవి అని సందేశం ఇస్తున్నారు శ్రీనివాసుడు గారు.
    దానికి కారణం గోల్వాల్కర్ గారితో సహా అందరూ హిందూ వాదులూ హిట్లర్ భక్తులే.శ్రీనివాసు గారి నాజీ స్పిరిట్ మెచ్చదగినది.
    http://www.countercurrents.org/comm-puniyani100306.htm

  47. నాజీ కాన్సంట్రేషన్ కేమ్పులలొ స్త్రీలపై అత్యాచారాలు. యివన్నీ ఫాసిస్టు జాతీయవాదంలో భాగమే.
    http://www.spiegel.de/international/germany/rape-murder-and-genocide-nazi-war-crimes-as-described-by-german-soldiers-a-755385-4.html

  48. శ్రీనివాసుడు says:

    గాంధీగారి అభిమానిగా వారు చేసే పనులే చేయమంటే అంత ఉలుకెందుకు? బాగా గుచ్చుకుందా?
    మరి, సందర్భానికి తగినట్లుగా అమెరికా పేరు ఉదహరిస్తే మేం సామ్రాజ్యవాదులం, జాతీయవాదులం అని మొరగడం గుర్తులేదా?
    గాంధీగారిని తు.చ. తప్పక అనుసరించే ఫాసిస్టు వృషభం సంభాషణలలో తన నాజీయిజాన్ని ఎలా బయటపెట్టుకుందో చూసేం.
    తన ఆచరణనే అందరికీ పులుముదామని ప్రయత్నం చేస్తే మిగిలేది ఎండుగడ్డే.
    తమరు నాజీ అభిమానా? లేక నాజీ వ్యతిరేకా?
    అసలు హిట్లర్ ప్రస్తావన తెచ్చినదెవరు? వాడి అభిమానులైన తమరేగా? తమ గురువిందగింజ రంగు తమకి తెలియదా?
    వెన్నెలగా మాయాయుద్ధం మొదలుపెట్టినప్పుడు ఉన్న అభిమానం కాస్తా ఫాసిస్టు జాతీయవాదంగా మారిందే?
    ఆహాహా, ఎన్నెన్ని వర్ణ మురుగు ఛాయలు, గ్రేట్… కీపిటప్.
    విషయం జాతీయవాదమా? ఫాసిజమా? సూఫీతత్త్వమా? గాడ్సేనా? వీరసావర్కారా? ప్రొటెస్టంట్ యూదు సామ్రాజ్యవాదమా?
    అన్నీ బోడిగుండ్లే, ఎదుటివారి మోకాలును పట్టుకుని దానికి ముడిపెట్టడమే!!!
    అన్నీ కలగలసిన శ్యామలం… శ్యామలం… శ్యామలం…!!!
    అసలిదంతా ఎక్కడ మొదలైంది? – పాఠకులు మరచిపోతారేమోనని చెప్ప సాహసిస్తున్నాను.
    అనగనగా ఒక మహాజ్ఞాని ఒకాయన తత్త్వసారాన్నంతా రెటమతంగా నుడివేరు. అప్పుడు అమాయక పాఠకులు కొందరు తమ సందేహాలను వెలిబుచ్చారు. అంతే, ఫాసిజం జడల పురివిప్పి, అడిగినవారిని హిందూఫాసిస్టులుగా మార్చి, అక్కడ రెండువందల వ్యాఖ్యలదాకా దేకి, చివరకిక్కడ వారి అభిమాన నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపులలో తేలింది.
    ఇదే నేటి మహాతత్త్వవేత్త మానసిక వైక్లబ్యం. ఫాసిజం మిథ్య….మాయావృషభం మిథ్య…. అద్వైతాద్వైత శిరోమణీ బహుపరాక్….

  49. శ్రీని వాసుడుగారూ
    మీలోని నాజీ స్పిరిట్ని గుర్తించి మెచ్చుకోన్నాను. మిత్రులు చందోలు చంద్రశేఖర్ గారు హిట్లర్నీ హిట్లర్ అనుయాయి సా వర్కార్ని ఫాసి స్టులని నిందించారు. కాని మీరు వారిపైన చిన్న కామెంటు కూడా చెయ్యలేదు. కారణం మీలో ఉజ్వలంగా వెలుగొందుతున్న ఫాసిస్టు స్పిరిటే
    అలాగే గాడ్సే ఆయన వెనుక గల హిందూ ఫాసిస్టు భావజాలం గురించి కూడా వొక్క మాట మాట్లాడలేదు మీరు. పోనీ చంద్రశేఖర్ గారు మాట్లాడినా సమర్థనగా వొక్క మాట మాట్లాడలేదు. చంద్రశేఖర్ గారు సావర్కార్ని హిందూఫాసిస్టు అని ప్రకటించేశారు. ఆసందర్భంలోనూ మీరు మౌనంగానే వున్నారు. ఈలోగా గాంధీగారి సెక్సు కార్య కలాపాలని మాత్రం పదేపదే ఆసక్తిగా వర్ణించడం మొదలు పెట్టారు. తద్వారా చర్చని మీదారికి సమర్థవంతంగా తిప్పుకోవడానికి ప్రయత్నించారు.
    మీనాజీ తత్వాన్ని యింకో వెయ్యిసార్లు కొనియాడడానికైనా నేను సిద్ధం. .

  50. శ్రీనివాసుడు says:

    ముసుగువీర లేవరా! ఫాసిజంబూని సాగరా! దేశమాత స్వేచ్ఛకోరి ఒక్క భూతాన్ని సృష్టించరా!
    ముసుగు వీర శాఞ్కర గారూ! ఆ ముసుగు తీసేస్తే తమ ద్వంద్వ ప్రమాణాల గురించి చర్చిండానికి సిద్ధం.

  51. ఫాసిజమే నాఫిలాసఫీ . శ్రీ శ్రీ రవి శంకర్ గారు నాగురువు.

  52. శ్రీనివాసుడు says:

    నిజం ధైర్యంగా ఒప్పుకున్నందుకు ఆనందంగావుంది ఫాసిజ మహాత్మా గారూ!

  53. మీదారే నారహదారి ఫాసిస్టు మహోపాధ్యాయా . మీ ఆశీర్వాదం వుంటే నేను మిమ్మల్ని మీంచిపోలేనా

  54. భాస్కరం కల్లూరి says:

    శ్రీనివాసుడు గారూ…
    1.వివిధభావజాలాల మధ్య సంభాషణ అవసరం గురించి సరిగ్గా ఇవే అభిప్రాయాలను ఇదే సారంగలో నేను కూడా వ్యక్తం చేశాను.
    లింకు: ‘సంభాషణ’ అవసరాన్ని గుర్తిద్దామా? http://saarangabooks.com/retired/2015/09/10/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%A3-%E0%B0%85%E0%B0%B5%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D/
    భిన్న భావజాలాల సహజీవనం ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. భిన్న భావజాలాలు కలిగిన వ్యక్తులు ఇరుగుపొరుగున జీవిస్తూ ఉంటారు. భిన్నత్వంలోనే సహజీవనం జరగాలంటే సామరస్యం తప్పనిసరి. ఆ ఎరుక అన్ని పక్షాలలోనూ ఉంటూనే ఉంటుంది కనుకనే ఘర్షణ-సంధి, సామరస్యం-ఘర్షణ అన్న చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. సంధి, సామరస్యం అన్నవి సంభాషణ ద్వారానే సాధ్యమవుతూ ఉంటాయి. జనంలోనే అలాంటి సంభాషణవైపు మొగ్గు చూపి సామరస్యానికి కృషి చేసే ఒక వర్గం ఎప్పటికప్పుడు రూపొంది ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయం ఉండనవసరం లేదు.
    కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. భిన్నభావజాలాల మధ్య సమదూరం పాటించవలసిన ప్రభుత్వం తను సైతం ఒకానొక భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తూ దానిని జనంలోకి చొప్పించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వానికి అదనంగా అధికారబలం, పోలీస్ బలం ఉన్నాయి.అవి లేని భావజాలేతరులతో అది యుద్ధం చేస్తోంది. ఎలాగైనాసరే తన భావజాలాన్ని జనంలోకి చొప్పించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు ఎంత దూరమైనా వెళ్లడానికి నిశ్చయించుకుంది. అందుకు సంబంధించిన వివిధ ఉదాహరణలను నేను ఆయా సారంగ వ్యాసాలలో ఇచ్చాను.
    ఉదాహరణకు, రోహిత్ ఆత్మహత్య: ఒక సరికొత్త/పాత సందర్భం http://saarangabooks.com/retired/2016/01/23/%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B9%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%92%E0%B0%95-%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A/
    ఈ పరిస్థితిలో మీరన్న సంభాషణ ఎవరితో చేయాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. భిన్న భావజాల వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణ-సంభాషణ లాంటి సన్నివేశం కాదు ఇది. ఇది నిర్దిష్ట భావజాలంవైపు మొగ్గు చూపుతూ, అధికార, పోలీస్ బలం ఉన్న ప్రభుత్వంతో, అవి లేని జనం చేసే పెనుగులాట. అంతిమంగా అది వైవిధ్యవంతమైన భారతదేశపు అస్తిత్వానికీ, ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న యుద్ధంగా పరిణమిస్తోంది. ఇంకొకటి కూడా గమనించాలి. నేను యుద్ధం జరగాలని ఆకాంక్షించడంలేదు. జరుగుతున్నది యుద్ధమని మాత్రమే అంటున్నాను. ఒక స్థాయిలో ఇది ఆబ్జెక్టివ్ గా తీసుకోవలసిన విశ్లేషణ. భిన్నభావజాలాల మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక భావజాలప్రతినిధి అయిన ప్రభుత్వానికి అదనంగా అధికారబలం, పోలీస్ బలం ఉన్నాయి కనుక అది భౌతికయుద్ధంగా మారుతోందని నేను అన్నాను.
    చాలామంది దృష్టిలో ఉంచుకొని విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఒక నిర్దిష్ట భావజాలానికి ప్రాతినిధ్యం వహించడం నేటి ప్రజాస్వామిక అనుభవం రీత్యానే కాక, ప్రభుత్వం గురించిన మన సాంప్రదాయిక కల్పన రీత్యా కూడా ఒక పెద్ద distortion. ఒక అసహజపరిస్థితి. భావజాలం వ్యక్తులకు ఉంటుంది. పార్టీలకు ఉంటుంది. ప్రభుత్వంలోని వ్యక్తులకు ఉంటుంది. కానీ ప్రభుత్వానికి ఉండదు. ఉండకూడదు. అది భిన్న భావజాలాల మధ్య సమదూరం పాటించాలి. సమవర్తి పాత్ర నిర్వహించాలి. భిన్నాభావజాలాల మధ్య సంభాషణకు సామరస్యానికి వెసులుబాటు కల్పించడం ప్రభుత్వం బాధ్యతలలో ఒకటి. ఇతరేతర ప్రజల అవసరాలను నెరవేర్చడంకోసం శాంతిభద్రతల పరిరక్షణ అనే లక్ష్యంతో ఏ ప్రభుత్వమైనా నిర్వర్తించవలసిన అతి సహజమైన బాధ్యత అది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఒక భావజాల ప్రతినిధిగా వ్యక్తుల సరసన చేరుతోంది. భావజాలాల ఘర్షణలో తను సైతం భాగస్వామి అవుతోంది. ఈ పరిస్థితిలో ఎవరు ఎవరితో సంభాషణ జరపాలన్న ప్రశ్న తలెత్తుతుంది.
    2.రవిశంకర్ ను ఒక వ్యక్తిగా మాత్రమే తీసుకుంటే, మీరన్నట్టు ఆయన గురించి, ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి భారతీయులు చాలామందికి తెలియదు. అలాంటి ఒక సాధారణ కార్పొరేట్ గురువు గురించి భయపడడం అవివేకమే. ఒక వ్యక్తిగా మీరన్న శక్తులేవీ ఆయనకు లేవు, ఉండవు.
    అయితే…ఢిల్లీలో యమునా తీరంలో మనం చూసింది ఏమిటంటే, సాక్షాత్తూ అపారబలోపేతమైన ఒక ప్రభుత్వం ఆయనకు వత్తాసుగా నిలబడడం. పర్యావరణ విధ్వంసం గురించి, సైనిక దుర్వినియోగం గురించి వచ్చిన ఆరోపణలను కూడా పక్కన పెట్టి ఆ వ్యక్తికి వెన్నుదన్నుగా నిలబడడం. దాంతో ఆ వ్యక్తి బలం సహస్రాధికంగా పెరిగిపోతుంది. ప్రభుత్వం తలచుకుంటే గడ్డిపరకను కూడా గునపంగా మార్చగలదనడానికి మీకు ఎక్కువ ఉదాహరణలు ఇవ్వనవసరం లేదు. అదీగాక, రవిశంకర్ కు ప్రభుత్వం ఇచ్చిన వత్తాసును ఒక isolated ఘటనగా చూడకూడదు. దాని ముందూ వెనకా గల అనేక ఘటనలతో కలిపి దానిని చూడాలి. దాని వెనుక ఒక కచ్చితమైన ప్లాను ఉంది. అది ఎలాగైనా తనదైన నిర్దిష్ట భావజాలాన్ని యుద్ధస్థాయిలో జనంలోకి తీసుకువెళ్లాలన్న ప్రభుత్వ సంకల్పం.
    నా వ్యాసంలో రవిశంకర్ ను మాత్రమే చూస్తే, అది వ్యాసాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారని అర్థం. రవిశంకర్ ను కాదు, రవిశంకర్ కు వత్తాసుగా నిలబడిన ప్రభుత్వం గురించి మాట్లాడడం నా వ్యాసంలోని ప్రధాన ఇతివృత్తం.

  55. భాస్కరం కల్లూరి says:

    :కొన్ని రోజుల క్రితం ఈ కామెంట్ పంపితే క్యారీ కాలేదు. మళ్ళీ పంపుతున్నాను:
    “కొంపముంచి మీరు కూడా భాస్కరంగారిలా నాస్తిక కమ్యూనిష్టా కర్మ?”
    వెన్నెల గారూ…
    మీరు ఉద్దేశంతో ఈ మాట అన్నా, మీకోసం కాక, ఇతరుల కోసమైనా ఈ వివరణ ఇవ్వాలనిపించింది.
    మనలో చాలామంది తొందరపాటుతో ఇలా వ్యక్తుల్ని బ్రాండ్ చేయడం చూస్తుంటాం. ఇందులో చాలా చిక్కులు ఉన్నాయి. ఈ విషయంలో నాకే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఇక్కడ ఏకరవు పెట్టను.
    అసలు విషయానికి వస్తే, నేను కమ్యూనిష్టునంటే కమ్యూనిష్టులు ఒప్పుకోరు. నాస్తికుణ్ణి అంటే నాస్తికులు ఒప్పుకోరు. గీత గీసినట్టు చెప్పాలంటే, నేను రెండూ కాదు కనుక.
    స్థూలంగా చెబితే, హిందుత్వను వ్యతిరేకించేవారంతా వామపక్షవాదులో, కాంగ్రెస్ వారో, నాస్తికులో అనే అభిప్రాయం ఉంది. ఇది అనాలోచితంగా కలిగే అభిప్రాయం. హిందుత్వను రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది, సనాతనవాదం వగైరాలతో కూడిన సాంప్రదాయిక హిందూత్వం. వామపక్ష, కాంగ్రెస్ వగైరా పార్టీ భేదాలు లేకుండా హిందువు అనబడే ప్రతివ్యక్తీ తనవైన ప్రాధాన్యాలతో, వివేచనలతో హిందూ సమాజంలో భాగం అవుతాడు. హిందూకు చెందిన పూజాపునస్కారాలలో, తంతులలో పాల్గొంటూ ఉంటాడు. నమ్మకాలను అనుసరిస్తూ ఉంటాడు. నాస్తికుడైనా హిందూ సమాజంలో భాగంగానే ఉండి తన భావాల ఆమోదానికి పోరాడుతూ ఉంటాడు. హిందువు అనేది హిందూ సమాజానికి చెందిన ఏ వ్యక్తి అయినా తప్పించుకోలేని, తప్పించుకోనవసరంలేని ఒక ఐడెంటిటీ.
    రెండవది, రాజకీయ, లేదా మిలిటెంట్ హిందుత్వ. ఆధునిక కాలానికి వస్తే, ఆయా వర్తమాన రాజకీయ సన్నివేశాల రీత్యా హిందూమహాసభ, ఆర్.ఎస్.ఎస్. వగైరాల ఆవిర్భావం తర్వాత అడుగుపెట్టిన ధోరణి ఇది. మొదటి రకం హిందుత్వకు చెందినవారు అందరూ ఈ రాజకీయ, మిలిటెంట్ హిందుత్వను ఆమోదించాలనేమీ లేదు. ఆమోదించలేదు కూడా. రాజకీయ/మిలిటెంట్ హిందుత్వకు ప్రాతినిధ్యం వహించే బీజేపీ లోక్ సభలో అత్యధిక స్థానాలు గెల్చుకున్న ఈ రోజున కూడా దానికి లభించిన మద్దతు 31 శాతమే కావడం అందుకు నిదర్శనం.
    ‘హిందుత్వను వ్యతిరేకిస్తున్నారు’ అన్నప్పుడు, ఈ రెండు రకాల హిందూత్వాల ఉనికిని కన్వీనియంట్ గా పక్కన పెట్టేస్తున్నారు. హిందుత్వ వ్యతిరేకులుగా వామపక్షాలను, కాంగ్రెస్ తదితర పార్టీలను చూపిస్తున్నారు. మొదటే చెప్పినట్టు, హిందుత్వ వ్యతిరేకులుగా చిత్రించబడుతున్న వీరందరూ నిజానికి వ్యతిరేకిస్తున్నది రాజకీయ/మిలిటెంట్ హిందుత్వను మాత్రమే. రాజకీయ/మిలిటెంట్ హిందుత్వను వ్యతిరేకించేవారిలో వీరు మాత్రమే లేరు. సాంప్రదాయిక హిందుత్వతో ఐడెంటిఫై అయిన అసంఖ్యాక హిందువులు ఉన్నారు. మిలిటెంట్ హిందుత్వతో జనంలో చీలికలు తేవడం వల్ల నష్టపోయే వర్గాలు అన్నీ దానిని వ్యతిరేకిస్తాయి. ఉదాహరణకు, కార్పొరేట్లతో సహా వాణిజ్యవర్గాలు.
    ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, హిందూమహాసభ, 1925లో ఆర్.ఎస్.ఎస్. పుట్టుకలకు ముందు జన్మించిన హిందువులకు రాజకీయ/మిలిటెంట్ హిందుత్వ తెలియదు. వారు దానిని ఆమోదించారని కానీ, దానితో ఐడెంటిఫై అయ్యారని కానీ చెప్పలేం. ఉదాహరణకు, మన విశ్వనాథ సత్యనారాయణ గారినే తీసుకుంటే, ఆయన రాజకీయ/మిలిటెంట్ హిందుత్వ పుట్టక ముందు జన్మించిన వ్యక్తి. ఆయన మొగ్గు చూపినది సనాతనవాదం వైపు. ఆయన లాంటి వ్యక్తులు ఇంకా అనేకులు. అలాగే, మరో రెండు ఉదాహరణలు, కంచి పరమాచార్య, రమణమహర్షి. అబ్దుల్ కలాం తన పుస్తకం ఒకదానిలో ఒక విషయం రాశారు. కంచిలోని కామకోటి పీఠానికి ఎదురుగా ఉన్న ఒక మసీదులో తెల్లవారు జామున జరిగే నమాజు పరమాచార్యగారి నిద్రకు, ధ్యానానికి భంగం కలిగిస్తోందనే ఉద్దేశంతో దానిని అక్కడినుంచి తొలగిస్తే బాగుండునని ఎవరో అన్నారు. దానికి పరమాచార్య జవాబిస్తూ, ఆ మసీదు వల్ల తనకు ఎలాంటి ఇబ్బందీ లేదనీ, అందులో జరిగే నమాజు వల్లనే తను మేలుకొని కాలకృత్యాలు చేసుకుంటున్నాననీ అన్నారు. రాజకీయ/మిలిటెంట్ హిందుత్వ అవతరణకు ముందున్న భావన అలాంటిది. అలాగే, రమణమహర్షికి కూడా ఇలాంటి హిందుత్వతో పరిచయంలేదు. ఆయన ఆశ్రమానికి వచ్చేవారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉండేవారు.
    రాజకీయ/మిలిటెంట్ హిందుత్వ ఎలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చిందంటే; కొంతకాలం క్రితం ఒక ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు నాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు. ముంబైలో ముస్లింలు ఒకచోట రోడ్డు మీదే నమాజు చేసుకునేవారట. అది ఇతరులకు అసౌకర్యంగా ఉందన్న ఉద్దేశంతో శివసేన ప్రాబల్యంలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ అలా బహిరంగంగా నమాజు చేయడాన్ని నిషేధించిందట. దాంతో ముస్లింలు దానిని ప్రతిఘటించారట. “రాకపోకలకు ఇబ్బందిని నివారించడం కోసం తీసుకున్న ఆ చర్యకు ఎలా మతం రంగు పులిమారో చూడండి” అన్నాడాయన. దానిపై నేను, “గణేశ ఉత్సవాల రోజుల్లో, నిమజ్జనం రోజున జనానికి జరిగే అసౌకర్యం మాటేమిటి, దానినీ నిషేధిస్తారా?” అని అడిగాను. దానికి ఆయన దగ్గర సమాధానం లేదు.
    సారాంశం ఏమిటంటే, రెండు రకాల హిందూత్వాల ఉనికిని మరుగుపుచ్చి స్థూలంగా వామపక్షాలను, కాంగ్రెస్ లను హిందుత్వ వ్యతిరేకులుగా చిత్రించడం రాజకీయమైన దబాయింపుకు పనికొస్తుంది కానీ సత్యాన్ని ప్రతిబింబించదు.

మీ మాటలు

*