ఆడం అండ్‌ ఈవ్‌

 

-రమా సరస్వతి

~

 

ramaవెదుక్కుంటోంది… ! ఎప్పుడూ చురుగ్గా కదిలే కళ్లు.. ఇప్పుడు బెరుగ్గా.. కాస్త కలవరంగా కదులుతున్నాయి.  నాకిష్టమైన కదలిక.. నా కోసం! చూసింది.

‘హమ్మయ్య. వచ్చాడు. ముందే చెప్పినట్టు నా కన్నా ముందరే! అదే నవ్వు! మీసాల చాటునుంచి కొంటెతనం ఒలకబోసే చిలిపి నవ్వు! నాకు మాత్రమే అన్నట్టుగా ఉంటుంది! చేయి చాచాను!

‘అందుకున్నాను. కుడివైపు నాలుగో వరుసలో విండో సీట్‌ తనకు ఆఫర్‌ చేశా!

‘సీట్‌లో సర్దుకున్నా. ఆఫీస్‌ నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు సిటీబస్‌లోనూ అంతే..  కుడివైపు నాలుగో వరుస విండో సీటే వెదుకుతాడు. దానికోసం  ఎన్ని బస్‌లు మిస్సవుతాయో! ఆ సీటే ఎందుకు?’

‘నవ్వు తప్ప ఆన్సర్‌లేదు నా దగ్గర. కొన్నింటికి జవాబులు ఉండవు. అదో కంఫర్ట్‌ అంతే! అలా ఓరగా వెళ్లే గాలి  ఆమె ఒంటిని తాకుతూ ఆ తాలూకు పరిమళాన్ని మోసుకుంటూ నా చెంపల్ని చేరుతుంది. గుండెలో గిలిగింతలు పెడుతుంది. మాటిమాటికీ నుదుటి మీద పడే ఆమె జుట్టుతో ఆ టైమ్‌లో గాలి ఆడే సయ్యాటలు ఇంకా ఒయ్యారంగా ఉంటాయి. ఏదో చెప్తుంటుంది. అలా చూస్తూ ఉండడం ఇష్టం!’

‘ఆ చిన్ని తేనే కళ్లలోని సమ్మోహనం..  ఆరాధన… తట్టుకోవడం కష్టం. ఏంటలా? మనమేం టీన్స్‌లో లేం. కనీసం థర్టీస్‌లో కూడా లేం’

‘ఆరాధనకు వయసేంటో స్పందించే మనసు  కావాలి కానీ..!   పెదవులు విడివడకుండా నవ్వుతూ మొహాన్ని కిటికీ వైపు తిప్పేస్తుంది!’

ఇప్పుడు ఎక్కడున్నాం…

బస్‌లో పోచంపాడ్‌ ప్రయాణమవుతూ! చలికాలం మొదలు కదా.. ఆరైనా పూర్తిగా వెలుతురు పర్చుకోలేదు. ‘బస్‌ కుదుపులకు మా భూజాలు రాసుకుంటుంటే బాగుంది.. సైడ్‌నుంచి హగ్‌ చేసుకుంటున్నట్టు’

‘అసలు ఆ హగ్‌ కోసమే కదూ ఈ ప్రయాణానికి ప్లాన్‌చేసింది?’

‘కాదు.. అంతకన్నా విలువైనదానికోసమే!

మళ్లీ కళ్లల్లో చురుకైన కదలిక.. చురకలాంటిది!’

‘ఉత్తినే చూశా! నువ్వేం ఆశిస్తున్నావో నాకు తెలుసు!’

ఈసారి కొంటెనవ్వు నాది!

——————————————–

అదృష్టం.. ఎండ లేదు! మబ్బు పట్టి వాతావరణం ఆహ్లాదంగా ఉంది..

‘ఇంత పొద్దున్నే ఎక్కడికి అని అడగలేదా  అపర్ణ?’

‘రాత్రే చెప్పాను. ఆఫీస్‌ వర్క్‌ మీద ఊరెళ్లాలి. రావడానికి రాత్రి పదకొండవచ్చు అని!’

‘పెళ్లాయ్యాక ఇది ఎన్నో అబద్ధం?’

‘ఇలాంటి అబద్ధం మొదటిదే!’ అని చెప్తున్నప్పుడు నా కళ్లలోకి సూటిగా చూసింది. తర్వాత మెత్తగా చేయి నొక్కింది. ఆ చేయి అలాగే పట్టుకొని ప్రాజెక్ట్‌ బ్రిడ్జ్‌ మీద నడుస్తున్నా…

‘చివరిది కూడా!’ ఈ సారి తను చూశాడు. కళ్లతోనే ఆన్సర్‌చేశాను అవునన్నట్టుగా! మూడ్‌ మారినట్టుంది మొహంలో దిగులు కనిపించింది ఒక్కసారిగా!

‘నేనొకటి అడగనా?’

‘ఒకటి అంటూ స్నేహం గట్టిపడ్డ ఈ మూడు నెలల్లో ఎన్నో అడిగింది. అడుగు అన్నట్టుగా చూశా!’

‘నేనంటే నిజంగా ఇష్టమేనా?’

‘పాత ప్రశ్న, అంతకన్నా పాత ఎక్స్‌ప్రెషన్‌! నిజంగా చాలా ఇష్టం కొత్తగా చెప్పడానికి ట్రై చేశా. కుదర్లేదు.’

‘మరి అపర్ణ అంటే?’

‘ఇష్టమే. అపర్ణ పెద్దవాళ్ల చాయిస్‌!  నువ్వు నా చాయిస్‌’ కన్విన్స్‌ కోసం కాదు నిజమే!

‘తన కన్నా నేను ఏరకంగా ప్రత్యేకం’ నూటొక్కసారి అడిగా!

‘ప్రత్యేకత ఉంటేనే కదా.. ఈ వయసులో నీకు ఎట్రాక్ట్‌ అయింది’ తను ఆశించిన సమాధానం ఇది కాదు.

‘కళ్లలోకి కళ్లు పెట్టి చూశా. ‘ఊ.. అవును.. నిజం’ అన్నట్టుగా తలాడించాడు ఎప్పటిలాగే. నవ్వాను. ‘నీ ఫాంటసీని ఎక్స్‌పీరియెన్స్‌ చేయడం కోసం నన్ను ఇష్టపడుతున్నావా?’

చివ్వున తలెత్తాను. ‘అపర్ణతో నాకు ఎలాంటి అసంతృప్తులు లేవు. స్టిల్‌ వి హావ్‌ దట్‌ రిలేషన్‌..’

‘సారీ.. నాకు మాత్రం ఆ ఎక్స్‌పీరియెన్స్‌  ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. ఐ మీన్‌..’ వివరించలేక ఆగిపోయా!

‘ ఐ గాట్‌ ఇట్‌! పెళ్లయి .. ఇద్దరు పిల్లల తల్లి కోరుకుంటోంది!  ఒక్కసారిగా అపర్ణ మెదిలింది. డజ్‌ షి నో దట్‌? అసలు తను ఎక్స్‌పీరియెన్స్‌ అవుతోందా? ఎప్పుడో పెళ్లయిన కొత్తలో అడిగా.. ఎలా ఉంది అని? ఏ సమాధానమూ చెప్పలేదు. ఎదురుగా తను.. ఆప్యాయంగా హత్తుకోవాలనిపించింది..

టైమ్‌ పన్నెండు

తనకేదో ఎస్‌ఎమ్‌స్‌ వచ్చినట్టుంది బీప్‌ సౌండ్‌ అలర్ట్‌ వినిపించింది.

‘వందన వాళ్లు వెళ్లిపోయారు. వాళ్ల క్వార్టర్‌కి మనం వెళ్లొచ్చు’

raja

Artwork: Raja Sekhar Gudibandi

—————————————

‘పాలకూర పప్పు, వంకాయటమాట కర్రీ చేయనా?’

నవ్వాను…

‘ఓకే. డన్‌. ఫ్రెష్‌ అయి వచ్చేయండి. ఇదిగో ఈ మ్యాగజైన్‌ తిరిగేసే లోపు వంట రెడీ’ అని చెప్తూ వంట గదిలోకి వెళ్లా.

అరగంట గచింది.

‘ఎన్నోసారి తిరగేయడం? వంటింట్లోంచే అరిచా!

‘అయిదో సారి’ సీరియస్‌గా చదువుతూనే సమాధానం ఇచ్చా

‘అయితే మూసేసి వచ్చేయ్‌.. ఘుమఘుమలు రావట్లేదా అక్కడిదాకా?

‘మ్యాగజైన్‌ మూసేసి డైనింగ్‌ హాల్లోకి వెళ్లా. ‘ఊ.. వాసన మాత్రం అదిరింది’ అన్నా ముక్కు ఎగబీలుస్తూ!

‘రుచి కూడా అదుర్స్‌ బాస్‌’ అంటూ రెండు పళ్లాల్లో వంట వడ్డించేశా.

మధ్యాహ్నం రెండు

పెరట్లో మామిడి చెట్టుకొమ్మకు కట్టిన జూలాలో నేను.. నాకు దగ్గరగా ఎదురుగ్గా మోడా మీద తను.. ‘అబ్బా.. కదలకమ్మాయ్‌!’

‘ఇదేం కోరిక బాస్‌.. నా పాదాలకు గోళ్లు తీయాలని?’

‘ఏదో పిచ్చి కోరికలే. ఊ.. ఆ పాదం ఇవ్వు’

‘నేను అడిగింది కూడా ఇవ్వాలి మరి’ అని అంటుంటే నా కుడి పాదం తీసి తన మోకాలు మీద పెట్టుకున్నాడు.

‘ఏంటీ..  నువ్వుకోరుకునే ఎక్స్‌పీరియెన్సా?’ నవ్వాను.

‘ఉడుక్కున్నాను’

‘సరదాకన్నాలే అమ్మాయ్‌’

‘ఇవ్వడమేలాగో తెలిస్తేగా’ నేనూ ఉడికించా.

‘కానీ నాకెక్కడో గుచ్చుకుంది. మళ్లీ అపర్ణ మెదిలింది. తనకూ ఆ కోరిక ఉందా? తీరుతోందా? తీరట్లేదా? నెమ్మదిగా తన పాదాన్ని కిందకు దించాను.

‘సారీ బాస్‌ హర్ట్‌ అయ్యావా? ఐ డింట్‌ మీనిట్‌’

‘ఇట్స్‌ ఓకే. ఇప్పుడు నేనొకటి అడగనా ?’

‘రివర్సా? కన్నుగీటుతూ అన్నా చిలిపిగా.

‘నో సీరియస్‌లీ’

‘హేయ్‌…’ తన భుజం నొక్కాను చిన్నగా.

‘నేను సెల్ఫిష్‌లా కనపడుతున్నానా?’ ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి సూటిగా చూస్తూ అన్నా.

‘ప్చ్‌’ తల అడ్డంగా ఊపా. ‘ఎందుకలా అడుగుతున్నావ్‌?’

‘నువ్‌ డైవోర్సి అని తెలిసీ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నానేమో…’

నేనేం మాట్లాడలేదు. జూలాలోంచి లేచి నిలబడ్డాను.

నేనూ లేచాను.

అతనికి దగ్గరగా వెళ్లాను.

నా రెండు చేతుల్లోకి తన గుండ్రటి ముఖాన్ని నా కిష్టమైన ఆ మొహాన్ని తీసుకున్నాను.

ఆ స్పర్శ.. కళ్లలో నిండింది. బయటకెళ్లకుండా రెప్పలు మూసి దాచాను..

ఆ క్షణం మాటలొద్దు అనిపించి ఆమె పెదాలకు తాళం వేశాను నా పెదాలతో!

నా చేతులు అతని వీపుని చుట్టేశాయి.. దగ్గరి తనం.. ఇద్దరం ఒక్కటే అన్నంత దగ్గరి తనం… నాకోసం ఓ తోడు ఉంది అన్న భరోసానిచ్చిన దగ్గరి తనం… ఆర్గజాన్ని మించిన అనుభూతేమో!

ఆ భరోసాలో గాలికి కూడా భాగం ఇవ్వద్దన్న స్వార్థంతో ఆమెను నా బాహువులో బందించేశాను. గువ్వలా ఒదిగిపోయింది. ఆమె మెడ వంపులో నా పెదవుల తడి… సడి.. నా ఫాంటసీని నిజం చేశాయి!

లవ్‌ యూ  లేడీ.. లవ్‌ యు టూ మ్యాన్‌

ఈ జ్ఞాపకం చాలు కొత్తగా జీవించడానికి!

—————————-

rajaమళ్లీ ఎప్పుడు? అడిగా బస్‌ దిగి వెళ్లిపోతూ..

తెలీదు అన్నాను..

ఇంక సెలవా? బేలగా అడిగా.

సెలవు లేదు, నాందీ లేదు. అన్నిటినీ కాలానికి వదిలేద్దాం. అదెలా చెప్తే అలా చేద్దాం! అన్నా.

ఈ సారి భరోసా నాకొచ్చింది!

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. Bindu Madhuri says:

    Rama garu, very new writing style! Ardham chesukovataniki time pattindi, but chala bagundi..

  2. థ చదివాను ..చాల మందికి ఇది షాకింగ్ గా ,ఇదేదో ఫాషన్‌ అయిపోయింది , వైవాహిక జీవితం బయట సంబంధాలు అనైతికం కదా ! అనిపి్స్తుంది ..ఇది ఒక మగ ఒక ఆడ ..ఒక ఆడం , ఒక ఈవ్ మధ్య కలిగే ఆకర్షణల ఫలితంగా సంభవించిన ఓ దినం ..లేదా కొన్ని క్షణాలు ..ఆడ మగ మధ్య ఆకర్షణ ఎవరూ కాదనలేని నిజం ..ఎందుకు ,ఎలా , ఎప్పుడు కలుగుతుందో ఎవరూ ఊహించలేరు .. ఇందులొ ఇద్దరూ ఇంటి బయట బస్సుల్లో నో ,రోడ్డు మీదో ఓ క్షణం చూపులు కలిపి ఉంటారు .. ఆ చూపుల కలయిక ఆ మనసుల ఆకర్ష ణ , ఇష్టం ,వెర్రి ప్రేమ ఇలాంటివన్నీ కలగలిపితే , తమ తమ స్వీయ నిబంధనలూ ,రక్ష ణా ఇచ్చే తమ ఇళ్ళూ వాకిళూ , భాగస్వాములూ ,పిల్లలూ ..అందరినీ మరిచిపోయి , కొన్ని గంటలు తమకు తాము జీవిస్తే అన్న ఊహకి రూపం ఈ కథానిక ..ఎవరు వంట చెస్తున్నారో ,ఎవరు పుస్తకాలు తిరగేస్తున్నారో అందుకే ,ఇక్కడ చెప్పలేదు , మన సమాజం నిర్దేశించన పాత్రలు నుంచి బయట పడితే ,మన మనస్సుకి బాగా నచ్చిన ఒక పని చేయగలిగితే ,ఎవరి బల్వంతమూ లేదూ ,ఎవరి ప్రోద్భలమూ లేదు , జస్ట్ ఆడం అండ్ ఈవ్ మధ్య ఉండే తహతహ , గాలిని కూడా చొరబడనీయని ఒక్క కౌగలింత ..అంతే ,మర్నాటి నుంచి ఎవరి పాత్రలు వారు పోషిస్తారు , సమాజం గీసిన గీతల మధ్య జీవిస్తారు ..ఎవరికీ హాని కలిగించని ,ఈ ఒక్క రాత్రి ..లేదా పగలు , వారికి నచ్చిన విధంగా జీవించే క్షణాలు కోసం ఓ సాహసం చేసారు ..మరి మానందం ఇలా చెస్తే అని అంటారా ! ఈ సంకెళ్ళూ చాలా బలమైనవి ..అందరం తెంచుకోగలిగేవి కావు ..ఈ సామాజిక సంకెల్ళు .. మీద పడి , అరిచేసి , ఏమిటీ కథ ? అంటూ ..మనం అరిచినా ,కొంత మందిని తమ కి నచ్చిన దారిలో నడవకుండా ఆపలేం ..ఇది అందరూ ఇలా చేయాలని సూచించే కథ కాదు ..ఇది ఒక జంట కథ అంతే ..ఆడం ..ఈవ్ ల తొలి తప్పు ని వర్ణించే కథ .అంతే ..
    వసంత లక్ష్మి ,పి .

  3. Dhanikonda Ravi Prasad says:

    ఈ కథని సామాజికదృష్టితో నేను విమర్శించ దలుచుకో లేదు. వివాహవ్యవస్థని గౌరవించే కథలు, వివాహవ్యవస్థలోని అసంతృప్తిని తెలియజేసే కథలు, వివాహం లో అసంతృప్తి లేకున్నా అదనపు ఆనందాన్ని కోరుకొనే కథలు ఏవైనా వ్రాయవచ్చు.అన్ని రకాల మనుషులు సమాజంలో ఉన్నప్పుడు అన్ని రకాల కథలు ఉంటాయి. సామాన్యంగా ఒక వివాహేతరశృంగారకథ వ్రాసే సందర్భం లో రచయితలు ఒక పాత్రని భార్యాబాధితునిగానో, భర్తృబాధితురాలిగానో చిత్రించి అందువల్లనే వారు పక్కదారి పట్టరని సమర్ధించి వివాహ వ్యవస్థకి ఒక సంజాయిషీ తయారు చేస్కొంటారు. కానీ ఈ కథలో అలాంటిదేమీ లేదు. ఉండితీరాలి అనేది నాఉద్దేశమూ కాదు. కానీ అలాంటిదేమీ లేనప్పుడు రచయిత్రి చెప్ప దలచిందేమిటి ? స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ప్రకృతి సహజమే కానీ దానికి కారణాలు అక్కర్లేదని , ఆడం ఈవ్ ల వలే అది అతిసహజమే అని. ఇంతకు మించి చెప్పవలసింది ఏమీ లేనప్పుడు చక్కగా స్వాతి సరసమైన కథ లాగా సరసాన్ని వర్ణించి కథలో ఒక ప్రత్యేకతని చూపినా సరిపోయేది. అదీ లేదు. ఇక స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ సహజం అనే ఒక ముక్క చెపటానికి కథ అవసరమా ? అనేదే ప్రశ్న. అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకున్నారు అన్నట్లు ఉంది కథ. అయితే ఈమాత్రం కథలో కూడా రచయిత్రి కథనాన్ని గందరగోళం చేశారు. ఆ కథ పురుషిని స్వగతంగానూ లేదు. స్త్రీ స్వగతం గానూ లేదు. ఒక డైలాగ్ అతడి స్వగతం, ఒక డైలాగ్ ఆమె స్వగతం. రచయిత్రి యొక్క ఇతరకథలు నాకు తెలియవు కానీ ఈ కథ చూస్తే రచయిత్రి కథారచన పట్ల అవగాహనని, అనుభవాన్ని పెంచుకోవాలని అనిపించింది.

  4. వనజ తాతినేని says:

    ఈ రచయిత ఇంతక్రితం ఒక కథ వ్రాసారు “బాలామణి ” ఆ కథ పేరు . సరొగసీ పై వ్రాసిన మంచి కథ. ఆ అంచనాతోనే ఈ కథ చదవాలనే ఆసక్తి కల్గింది. ఇదొక నిరాశ కల్గించిన కథ.

  5. ఇలాంటి కథలు అర్థం కాకపోవడం అర్థం చేసుకోలేకపోవడం అంటూ ఏమి ఉండదు కాని ఎవరెవరు ఏమి చేస్తున్నారో కూడా స్పృష్టంగా రాయలేని అస్పృష్టమయిన ఈ కథలాగే ఉంటాయి ఈ బంధాలు… తెగిన గాలిపటాల్లా… ఏది శాశ్వతం కానివి, శాశ్వతం చేసుకోలేనివి..
    నచ్చలేదు అని చెప్పను కాని నచ్చిందో లేదో కూడా చెప్పలేని అస్పృష్టత ఉంది ఈ కథలో

  6. B.Prathapkumar reddy says:

    దీన్ని పూర్తి గా ‘కధ’అని అనడానికి వీలు లేదు..ఒక సంఘటన అనొచ్చునేమో..మొదట దీన్ని ప్రధమ పురుష లో రాస్తున్నారేమో అనిపించింది….4 లైన్లు చదివాక ‘ఏ పురుష ‘అనే విషయం రాసిన రచయిత్రి కూడా చెప్పలేదేమో…నేను అనుకుంటాను – రచయిత్రి ముందు రాయాలనుకున్న ఇతివృత్తం ఒకటైతే రాసేప్పుడు మార్చుకున్నట్లుగా అనిపించింది…బహుశా ధైర్యం చెయ్యలేక పోయారేమో రచయిత్రి….ఇద్దరూ పెళ్ళయిన వాళ్ళు ..ప్రౌడ వయస్కులు కూడానూ..అతనికి భార్య ఉంది…ఆమెకి భర్త ఉన్నాడు ..ఇద్దరికీ ఏదో లోటు అనిపించి ‘ఒక వెరైటీ’ కోసం ఒక అడ్వెంచర్ చేద్దామనుకున్నారు..కాని రచయిత్రి కి ఇలా రాసే ధైర్యం లేక ఆమెని ‘డైవోర్సీ’ గా మార్చి చూపించింది…. చదివిన పాటకులకు ఆ స్త్రీ మీద కోపం రాకుండా,జాలి కలిగించేందుకు..(పాపం మగతోడు లేక ….కోరికలు చంపుకోలేక …లేదా అతని ఆకర్షణ లో పడి అని అనుకోవాలని)..ఇలాంటి సంఘటనలు ‘కొద్ది’ మాత్రమే ఏమి కావు ..చాల ఎక్కువే..ఇంకా చెప్పాలంటే ఇలాంటి సంఘటనల వృద్ధి రేటు పెరుగుతూనే ఉంది… ఒక ‘పెద్దాయన’ఎప్పుడో అన్న మాటలు తరచూ గుర్తు చేసుకోవాలేమో..”చాల మంది స్త్రీలు అవకాశాలు రాక మాత్రమే పతివ్రతలు గా మిగిలిపోతున్నారు” అని…ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు పచ్చి నిజాలు,కోకొల్లలు అని తెలిసినా కూడా ‘ఇలాంటి రచనలు’ చేయడం అనుసరణీయం కాదు.. ఇలాంటి ‘అడ్వెంచర్’ చెయ్యాలని కోరిక ఉండి కూడా…సమాజానికో,సంసారానికో,అంతరాత్మకో మరింక దేనికో భయపడి చేద్దామా/వద్దా అని సందిగ్ధావస్థ లో ఉన్న స్త్రీ,పురుషులకి 100 కి ఒకరికయినా మార్గం చూపించినట్లే అవుతుంది….కధలోని పాత్రల లాంటి వారి జాబితాలో మరొక జంటని కలుపుతుందే తప్ప ఇక ఏ ఇతర ఉపయోగమూ లేదు…. భాష పాలిష్డ్ గా ఉండొచ్చేమో కాని..ఒక రకం గా బూతు కధకి దీనికి తేడా ఏమి లేదు..

  7. శ్రీనివాసుడు says:

    ‘‘మొనాటనీ’’ అంటే ‘‘ఏకస్వనము’’ లేదా ‘‘రొడ్డకొట్టుడు’’ జీవితం అనేది మనిషి మనస్సు (మెదడు???) యొక్క ప్రధాన సమస్య. దాన్నుండి తప్పించుకోడానికి చేసే ప్రయత్నాలే మనం చేసే పనులన్నీ.

  8. చొప్ప వీరభధ్రప్ప says:

    క్షణికోద్రేకంగానే కథ నిలుస్తుంది.తీపీలేదు . వెంటబడి గుర్తొస్తుంది….నమ్మకం. వుంచుకోవాలా తెంచు కోవాలా.నా అనే దానికర్థం.తుడిపేయాలా.‌నడక నేర్చుకుంటున్నమా మరచిపోతున్నామా.పిడికిట భయం చుట్టుకుంటుంది.

  9. devika rani says:

    కథ అంతా గందరగోళంగా ఉంది. ప్రతాపరెడ్డి గారన్నట్టు ఇలాంటి కథలు అనుసరణీయం కాదు అని నా అభిప్రాయం కూడా. రమా సరస్వతి ఇంతకుముందటి కథ బాలామణి నాకు నచ్చింది.

Leave a Reply to ramani Cancel reply

*