ప‌గిలిన దేహ‌పు ముక్క‌

 

 

శ్రీచ‌మ‌న్

~

ముఖం నిండా నీరింకిన‌
వాగులు వంక‌లు.
లాక్మే లుక్‌లోంచి
ఓ నిర్జీవ సౌంద‌ర్యం.

ముఖాల‌ ముక్క‌లు
అద్దానికి అతుక్కుపోయి
నెత్తురోడుతున్నాయి.
న‌రాల బంధం తెగినా
ఆశ అర్రులు చాస్తోంది.

విరిగిన గాజు ముక్క చివ‌ర‌
ప‌గిలిన  దేహ‌పు ముక్క‌
బొట్టుగా బొట్టుగా జారుతూ
కాన్వాస్‌పై ఓ విషాదచిత్రం

గ్రూపులు గ్రూపులుగా ర‌క్తం
అమ్మ‌కానికి, దానానికి.
నెత్తురులో కులాలు ఏబీసీడీ..
ఓ పాజిటివ్..మ‌రి ఓ నెగిటివ్ దృశ్యం

కొన్ని భ‌గ్నక‌ల‌ల
న‌గ్న‌రూపం
దృశ్యాఅదృశ్య గోచ‌రం
త్రీడీ యానిమేష‌న్ డైమెన్ష‌న్

*

మీ మాటలు

  1. రవి బడుగు says:

    ఏబీసీడీ యానిమేషన్ డైమెన్షన్.. బాగుంది

మీ మాటలు

*