వంచన

-కృష్ణ వేణి

~

 

 

 

“సుజాతా, ఇవాళ నీకు డే ఆఫ్ అనుకుంటాను. నేను వండినవి పట్టుకొస్తాను. కలిపి లంచ్ చేద్దాం.” మా అపార్ట్‌మెంట్లలోనే ఉండే కుముద ఫోన్.

“రా, రా, తొందరగా వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు.“- ప్లేట్లూ, వంటకాలూ డైనింగ్ టేబిల్ మీద సర్దాను.

అరగంటలో కాసరోల్స్‌లో తను చేసినవి పట్టుకొచ్చింది. రాగానే, ‘కూర్చోడానికి ఓపిక లేదంటూ’ గెస్టు బెడ్రూమ్‌లోకి వచ్చి మంచంమీద వాలింది.

“ఈ మధ్య నల్లపూసయిపోయావే! కోడల్ని కూడా అభీ దగ్గరికి పంపించేశావు. నీ స్టూడియోలో ఏవో రిపెయిర్లు జరుగుతున్నాయని అక్కడికి కూడా వెళ్ళడం లేదని విన్నాను!”- అడిగాను.

కుముద స్కల్ప్టర్. ఢిల్లీలో ఘడీ అన్న ప్రాంతంలో ఉన్న అనేకమైన స్టూడియోల్లో ఒకదాన్లో తన ఫర్నస్ ఉంది. అక్కడ శిల్పాలు చెక్కి, వాటిని ఎక్జిబిషన్లలో మంచి ధరలకి అమ్ముతుంది. పది నెలల కిందట, సిడ్నీలో ఉండే తన కొడుకు అభిమన్యుకి దీపికతో పెళ్ళి చేసింది. అప్పుడు నాకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకి టెంపరరీ పోస్టింగ్ అయి ఉండటం వల్ల, పెళ్ళి అటెండ్ అవలేకపోయాను.

“ఇంకేం కోడలు! నీకు తెలియదా?” డగ్గుత్తికగా వచ్చాయి మాటలు.

నాకు తెలిసినదల్లా, పెళ్ళవగానే దీపిక రెండు నెలలు టూరిస్ట్ వీసాతో అభీతో పాటు సిడ్నీ వెళ్ళిందనీ, స్పౌస్ వీసా కోసం అప్లై చేయడానికి తిరిగి అత్తగారింటికి వచ్చి… అయిదో ఆరో నెల్లుందనీ, ఆ తరువాత  వీసా దొరికి, సిడ్నీ వెళ్ళిందన్నది మాత్రమే. అదీ ఇరుగూపొరుగూ చెప్పిన మాటల బట్టే.

సగం మాటలు మింగుతూ, కళ్ళనుంచి నీళ్ళు చిప్పిల్లుతుంటే ముక్కు ఎగపీలుస్తూ, టిష్యూ బాక్సుని ఖాళీ చేస్తూ చెప్పడం ప్రారంభించింది సంగతేమిటో. వింటుంటే, నా విస్మయం అంచెలంచెలుగా పెరుగుతోంది. మధ్యమధ్య నేను వ్యక్తపరుస్తున్న సందేహాలకి సమాధానాలు ఎలాగో దక్కలేదు కనుక, ఇది పూర్తిగా కుముద కథనమే.

***

పెళ్ళయిన మూడో రోజే, అభీ దీపికని తనతోపాటు తీసుకెళ్ళాడు. నెల రోజులు కాలేదు, ఫిర్యాదులు మొదలుపెట్టడానికి. “అమ్మా- నువ్వూ, పిన్నీ కలిపి షాదీకాంలో వివరాలు భూతద్దంలో చూసి మరీ పిల్లని చూడటానికి వెళ్ళేరు. అమ్మాయి ఫిసియో థెరపిస్టన్నారు. సరే, మంచిదే. ఈ అమ్మాయికి మొహమంతా జుట్టే. అది మాత్రం కనపడలేదా?“

“వీడికేదో చాదస్థం! దీపిక ఎంత వాక్సింగ్ అవీ చేయించుకున్నాకానీ ఆడవాళ్ళం తెలుసుకోలేకపోతామా ఏమిటీ!”- మనస్సులోనే విసుక్కున్నాను. బయటకనలేదు.
అక్కడ ఆ అమ్మాయి ఉన్నన్నాళ్ళూ రోజుకో ఫిర్యాదు.

“సర్లే, కొత్తగా పెళ్ళయిన జంటలకి సర్దుకుపోయేటందుకు టైమ్ పట్టడం సహజం.”- నాకు నేనే సర్దిచెప్పుకున్నాను.

ఆ తరువాత స్పౌస్ వీసా కోసమని ఇక్కడికి వచ్చిందా! ఎయిర్‌పోర్టులో తనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ట్రాలీ తోసుకుంటూ బయటకి వస్తూ ఉన్న దీపికని చూడగానే, అభీ అతిశయోక్తులేమీ చెప్పలేదనిపించింది. కొత్తగా పెళ్ళయిన గుర్తుగా రెండు చేతులకీ ఎర్రగాజులూ, పాపిట్లో సింధూరం, మంగళసూత్రం, నల్లపూసలూ. వాటన్నిటికీ మించి, కొట్టొస్తున్నట్టు మొహం మీద కనిపిస్తున్న  వెంట్రుకలు. మరి అక్కడ ఈ అమ్మాయికి కొత్త కనుక బ్యూటీ పార్లర్లెక్కడున్నాయో తెలుసుకోలేకపోయిందో, ఏమిటో!

మర్నాడు దీపికని లేసర్ సెంటరుకి తీసుకు వెళ్ళాను పర్మనెంటు హెయిర్ రిమూవల్ కోసం. మూడు సిట్టింగులో ఏవో కావాలంది అక్కడున్న పిల్ల డాక్టర్.

తనిక్కడ ఉన్న ఆరు నెల్లూ ‘కొత్త కోడలు’ కదా అని ఏ పనీ చేయనీయలేదు. కూతుళ్ళు లేని లోటు  తీర్చిందనుకున్నాను. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరితో ఎంత కలివిడిగా ఉండేదో! కానీ ఒకటే ఆశ్చర్యం. అభీ, తనూ నా ఎదురుగా- ఫోన్లో కానీ, ఆన్లైన్లో కానీ మాట్లాడుకోగా, ఒక్కసారీ చూడలేదు.

ట్రీట్మెంటు పూర్తయింది. దీపిక మొహమూ, చెంపలూ నున్నగా అయాయి. మధ్యలో ఒక నెల పుట్టింటికి వెళ్ళొచ్చి, తిరిగి సిడ్నీ ప్రయాణానికి సిద్ధం అయింది.

వెళ్ళి అయిదు నెలలవలేదు. ఒక మధ్యాహ్నం అభీ ఫోన్. “అమ్మా, స్కైప్‌ చాటుకి రా. అర్జెంటు. మంచి నీళ్ళు కూడా పక్కన పెట్టుకో.“ అన్నాడు. మనస్సు కీడు శంకించింది.

మానిటర్ మీద కనబడిన వాడి మొహం చూస్తే భయం వేసింది. చెంపలు పీక్కుపోయి, నిద్రాహారాలు మానేసిన మనిషిలా ఉన్నాడు.

Kadha-Saranga-2-300x268

“అమ్మా, ఇన్నాళ్ళూ నీ మనసెందుకు పాడు చేయాలని ఏదో మామూలుగానే కబుర్లు చెప్తున్నాను కానీ, నీ ముద్దుల కోడలుందే! ఎవడితోనో లేచిపోయింది.” నాకు పొలమారింది.

నా మొహం చూస్తూ కొనసాగించేడు. “ఇక్కడ ఉద్యోగం దొరకాలంటే, ఫిసియోథెరపీ పరీక్షలకి తనెలాగో మళ్ళీ ఆరునెల్లు ప్రిపేర్ అవాలి కదా! అప్పటివరకూ ఇంట్లో బోర్ కొడుతోందంటే, ‘పోనీ బయటకి వెళ్ళి వస్తూంటే, తనకీ కాలక్షేపం అవుతుంది.’ అనుకుని, నాకు తెలిసిన ఒక ఇండియన్ స్టోరులో ఉద్యోగం ఇప్పించాను. అక్కడెవరితోనో పరిచయం పెంచుకుని, అతనితో సంబంధం పెట్టుకున్నట్టుంది. అనుమానం వేసి, ఇక్కడ స్థిరపడిన ఒక ఇండియన్ లాయరుంటే, అతనితో చెప్పి దీపికమీద 12 గంటల సర్వెలెన్స్ పెట్టించాను.

నల్లద్దాలున్న కారులో గంటలకొద్దీ వాళ్ళ తిరుగుళ్ళూ, వాటి గురించి ఆయన నాకు పంపించిన వీడియోలూ చూపిస్తే, నువ్వు తట్టుకోలేవు. నాకు నైట్ షిఫ్టులున్నప్పుడు, ఇద్దరూ కలిపి, నా ఇంట్లోనే చాలాసార్లు గడిపారు.

‘ఒకే చూరు కింద ఇద్దరం కలిపి ఉంటే విడాకులు దొరకడం కష్టం’ అన్న లాయరు సలహా ప్రకారం, ఆ వీడియోలు దీపికకి చూపించి, డైవొర్స్ కోసం అప్లై చేస్తున్నానని, నేను మెల్బోర్న్ వెళ్తున్నాననీ, తిరిగి వచ్చేలోపల ఇల్లు విడిచిపెట్టమని చెప్పి వెళ్ళిపోయాను.

నేను తిరిగి వచ్చేటప్పటికి నల్లపూసలూ, మంగళ సూత్రం మాత్రం మంచం మీద పడున్నాయి. తన సామానంతా తీసుకుపోయింది. స్పౌస్ వీసా రద్దు చేయమని ఎంబసీలో అప్లికేషన్ పెట్టేను. దేవుడిని ప్రార్థించు- నాకీ పీడ తప్పాలని.“ అన్నాడు.”
కాళ్ళూ చేతులూ ఆడలేదు నాకు.

***

కుముద స్వగతం పూర్తయినట్టుంది.

నాకు కొత్తేమీ కాదు ఈ తల్లీ కొడుకుల బంధం. అయిదో క్లాసులో ఉన్నప్పుడో ఎప్పుడో, ఒకసారి స్కూల్ మానేస్తానని ఒకే ఒక ముక్కన్నాడో లేదో, ఆ పూర్తి సంవత్సరం కొడుకుని ఇంట్లో కూర్చోపెట్టింది.

పిల్లలు ఆటలు ఆడుకుంటున్నప్పుడు కొడుకు ఓడిపోయినా, పిల్లలు తన్ని ఏడిపించినా కానీ కుముద మధ్యలో దూరి, అభీని వెనకేసుకు వచ్చి మిగతా పిల్లలని చెరిగేసేది. వాళ్ళ తల్లులు వచ్చి తమ పిల్లలని ఇంట్లోకి లాక్కోపోయేవారు, తన నోట్లో నోరు పెట్టడం ఇష్టం లేక.
‘ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయేమిటి నాకు!’ నన్ను నేను మందలించుకున్నాను.
“పోనీలెద్దూ, అలాంటి పిల్ల మీ జీవితాల్లోంచి బయట పడటమూ ఒకందుకు మంచిదే. సంతోషించు.” ఊరడింపుగా అన్నాను- పీక్కు పోయిన మొహంతో దిండుకానుకుని కూర్చున్న తనతో.

వంటకాలు వేడిచేసి, డైనింగ్ టేబిల్ మీద పెట్టి కుముదని పిలిచాను.

***

నెలయింది. నా చిన్ననాటి స్నేహితురాలు నీరజనుంచి ఫోన్ వచ్చింది. కొడుకు పెళ్ళిట. తనకీ నాకూ కూడా క్లాస్‌మేటయిన తన భర్త రాజారాం యుఎన్ లో పని చేస్తాడు. సిడ్నీలో ఉన్న Women’s Empowerment సెల్‌కి రిలొకేట్ అయాడు. వధువు కుటుంబం చాలాకాలంగా అక్కడే స్థిరపడినది. ఈ వివరాలన్నీ చెప్పి, “పెళ్ళికి రాకపోయేవంటే చూసుకో మరి.”- బెదిరించింది.

పెళ్ళికీ, మిగతా ఫంక్షన్లకీ వేసుకునే బట్టలూ అవీ సర్ది పెట్టుకున్నాను. ఇలా వెళ్తున్నానని చెప్పి, అభీ నంబర్ అడుగుదామని కుముదకి ఫోన్ చేస్తే, ఆ అవకాశం ఇవ్వకుండానే ‘తన బాబాయి పరిస్థితి బాగాలేదనీ, తను కూడా ఆయనతోపాటు హాస్పిటల్లో ఉంది కాబట్టి మాట్లాడ్డానికి వీలవదనీ’ చెప్పింది. నేనింకా ఆఫీస్‌లో లీవ్ అప్లికేషనూ ఇవ్వలేదు, టికెట్టూ సాంక్షన్ చేయించుకోలేదు. ‘సరే, వెళ్ళిన తరువాత ఫోన్ చేసి కనుక్కుందాంలే’ అనుకుని ఊరుకున్నాను.

***

నేను చేరేప్పటికే పెళ్ళి హడావిడి మొదలయింది. నేను వెళ్ళిన మూడో రోజు- పెళ్ళి జరుగుతుండగా, హాల్ లోపలకి రాబోతూ నన్ను చూసి గభాల్న వెనక్కి తిరిగి కంగారుగా, వడివడిగా వెళ్ళిపోతున్న అభిమన్యుని చూశాను. “అభీ, ఆగు”-గొంతు పెద్దగా చేసి అరుస్తున్న నన్ను వింతగా చూస్తున్నవాళ్ళని పట్టించుకోకుండా లేచి, ఒక్కంగలో ఆ అబ్బాయిని సమీపించేను.

తన మొహంలో బెదురా! భయమా!- అర్థం అవలేదు.

“రా, లోపలికి. వెళ్ళిపోతున్నావేం? వరుడి తరఫునా? వధువు తరఫునా!” అడిగాను.

“ నా స్నేహితుడు ఇక్కడ కలుసుకుంటానంటే వచ్చానంతే ఆంటీ. అతను కనిపించలేదు. అందుకనే…”-అడిగిన ప్రశ్నకి జవాబివ్వకుండా నసుగుతున్నాడు. దించిన తల ఎత్తలేదు.

“ఇంతకీ దీపిక ఎక్కడుందిప్పుడు? ఇండియా వెళ్ళిపోయిందా?” కూపీ లాగుతున్నానా!

“ఏమో, తెలియదాంటీ. తను ఇంటిని వదిలిపెట్టేక, తన సంగతులేవీ తెలియవు.” పక్కచూపులు చూస్తున్నాడు. ఎక్కడో, ఏదో-సందేహం తొలిచివేస్తోంది నన్ను.

“సరే, నీ ఎడ్రెసివ్వు. ఫోన్ నంబర్ కూడా ఇచ్చి వెళ్ళు. కుదిరితే ఇంటికి వస్తాను. ఫోన్ మాత్రం చేస్తాను. నా లోకల్ నంబర్ సేవ్ చేసుకో.”-చెప్పాను.

“ఇల్లు మారుతున్నాను ఆంటీ.”- తన ఫోన్ నంబర్ మాత్రం ఇచ్చాడు.

story1 (1)పెళ్ళి సందడి పూర్తయింది. కొత్తగా పెళ్ళయిన జంట హనీమూన్‌కి వెళ్ళారు. నాలుగు రోజులుగా అభీ నంబర్‌కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎవరో ఆస్సీ యాసతో “సారీ, రాంగ్ నంబర్ “ అంటూ పెట్టేస్తున్నారు.

మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు, రాజారాంకి చెప్పాను జరిగిన సంగతులన్నీ. “ఇటివ్వు ఆ నంబర్. నేను కనుక్కుంటాను”- నోట్ చేసుకుని, పక్కగదిలోకి వెళ్ళి ఎవరితోనో మాట్లాడి వచ్చాడు.

“సుజాతా, ఆ ఫోన్ నంబర్ ఇక్కడే ఎవరి పేరు మీదో రెజిస్టర్ అయి ఉంది. ముందు నువ్వు వాళ్ళమ్మతో మాట్లాడి, ఆ అబ్బాయి అసలు నంబరూ, చిరునామా కనుక్కోగలిస్తే మంచిదే. ఏదో తిరకాసుగా ఉంది ఈ వ్యవహారమంతా. వాళ్ళమ్మ మొబైలుకి ఫోన్ చేయకు. ఎక్కడినుంచి చేస్తున్నావో తెలుస్తుంది. వాళ్ళ లాండ్ లైన్ నంబరుకి కాలర్ ఐడి కానీ ఉందా? ఉంటే కనుక ఇంకేదైనా ఆలోచిద్దాం.”-హడావిడిగా ప్రశ్నలడుగుతూ, సలహాలిచ్చేస్తున్నాడు.

“ఊహూ, కాలర్ ఐడి లేదు. నాకు తెలుసు.”- గుర్తున్న ఎనిమిదంకెల నంబరూ చెప్పాను.

ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి, కుముద ఫోన్ నంబర్లిచ్చాడు. ఆస్ట్రేలియన్ ఎంబసీకీ, పోలీసులకీ ఫోన్లు చేసి మాట్లాడేడు. అభీ చిరునామా తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు. అరగంటలో ఇద్దరు పోలీసులు- ఒక మగా, ఒక ఆడా… ఆరెంజ్ రంగు చార ఉండి, ‘పోలీస్“ అన్న పెద్దక్షరాలు రాసున్న తెల్లటి కార్లో వచ్చేరు.

“నీరజా, సుజాతా, వెళ్దాం పదండి.” అని రాజారాం అనగానే, మేమిద్దరిమీ కూడా కారెక్కేం. ఆఫీస్ అవర్స్ కనుక ఆ అబ్బాయింట్లో ఉండి ఉండడు. మరక్కడికి వెళ్ళి చేసేదేమిటో అర్థం కాలేదు.

అపార్టుమెంటు రెండో అంతస్థులో ఉంది. మగ పోలీస్ పైకెక్కి డోర్ బెల్ నొక్కి, కిందకొచ్చి ‘ఎవరూ తలుపు తీయలేదని’ చెప్పాడు. పైనున్న ఒక కిటికీ వైపు వేలుపెట్టి చూపించింది ఆడ పోలీస్. దానికి అద్దానికి బదులుగా ఇనపరేకో, ఏదో బిగించి ఉంది. స్పష్టంగా కనిపించలేదు. రోడ్డువైపు కనిపిస్తున్న మిగతా రెండు కిటికీలకీ కర్టెన్లు వేళ్ళాడుతున్నాయి.

అందరం పైకెళ్ళేం. “పోలీసులమి. తలుపు తెరవండి.“ గట్టిగా అరిచారు. తన పెదాలమీద వేలు పెట్టి ‘శబ్దం చేయొద్దు’ అన్న సౌంజ్ఞ చేశాడు పోలీసు.
“మేము తలుపు బద్దలు కొడుతున్నాం” బిగ్గరగా చెప్తూ, మూడు వరకూ లెక్కపెట్టి కీహోల్ మీద పేల్చాడు.

గుండె దడదడలాడుతుంటే, దేవుడిని స్మరించుకుని నేనూ వాళ్ళ వెంట లోపలికి వెళ్ళాను. ఇల్లంతా ఖాళీ. ఒక గది తలుపు మీద మాత్రం డెడ్ బోల్ట్& లాచ్ మీద పెద్ద ఇండియన్ తాళం కప్ప వేళ్ళాడుతోంది. లోపలనుంచి లీలగా ఏదో చప్పుడు. దాన్నీ తెరిచి లోపలకి ప్రవేశించారు పోలీసులూ, వాళ్ళతోపాటుగా రాజారామూ.

వాళ్ళ వెనక ఉన్న నేను, గదిలో ఉన్న దీపికని చూసి నిశ్చేష్టురాలినయాను. తన నోటికి ప్లాస్టర్ వేసుంది. నైటీ వేసుకుని, మంచంమీద వెనక్కి వాలి కూర్చునుంది. కాళ్ళకీ, చేతులకీ ఇనుప గొలుసులు తగిలించి ఉన్నాయి. వాష్‌రూముకి వెళ్ళగలిసేటంత పొడుగు మాత్రమే ఉన్నాయవి. వినబడినది వాటి చప్పుడే అని అర్థం అయింది. అవి మంచం చుట్టూ చుట్టి ఉండి, వాటికో తాళం వేసుంది. దీపిక నుదిటిమీదా, చెంపలమీదా పెరిగి ఉన్న వెంట్రుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆడ పోలీసు అమ్మాయిని గొలుసులనుంచి విడిపించింది.
“ఈ కుర్రాడు మనిషా, రాక్షసుడా! వదలను వీడిని.”- రాజారాం పళ్ళు పటపటలాడిస్తున్నాడు.

వెతికితే, దీపిక పాస్‌పోర్ట్ వార్డ్‌రోబ్ పైనున్న సూట్‌కేసులో కనిపించింది. అది తీసుకుని, తనని నీరజ వాళ్ళింటికి తీసుకువచ్చాం. “ఇంత జరిగాక ఇంకేం జాగత్త!”- అనుకుంటూ, కుముదకి ఫోన్ చేశాను. “ఈ నంబర్ పని చేయడం లేదు” అన్న రికార్డెడ్ మెసేజి తప్ప, ఎవరూ ఫోనెత్తలేదు.

డాక్టర్ని పిలిపించింది నీరజ. డాక్టర్ వచ్చి గది తలుపులు మూసింది. కొంతసేపటి తరువాత తలుపులు తెరిచి, నీరజనీ నన్నూ లోపలికి పిలిచింది. దీపిక వేసుకుని ఉన్న బట్టలు పైకెత్తి, చూడమన్నట్టుగా జాలి నిండిన కళ్లతో సైగ చేసింది. చూస్తే సోడొమీ జరుగుతున్న సూచనలు. చూడలేక కళ్ళు పక్కకి తిప్పుకున్నాను. శారీరికంగా అయితే, దీపిక వారంలో కోలుకుంది.

***

ఇంకో వారం తరువాత, నేను వెళ్ళే ఫ్లైటుకే తనకీ టికెట్టు కొంటున్నానని రాజారాంకి చెప్తే, “తను అభీమీద కేసు పెట్టాననీ, దీపిక ఇక్కడే ఉండటం అవసరమనీ” వాదించాడు. పిచ్చి చూపులు చూస్తూ, ‘వద్దు వద్దంటూ’ భయభయంగా తల అడ్డంగా ఆడించిందా అమ్మాయి. నాతోపాటే ఫ్లైటెక్కింది.

“పెళ్ళయిన కొత్తల్లో కూడా సిడ్నీ వెళ్ళి, రెండునెల్లున్నావుగా? అభీ సెక్సువల్ ప్రెఫెరెన్స్ గురించి తెలిసీ, తిరిగి వెనక్కెందుకు వెళ్ళావు?”- తను నిమ్మళంగా ఉన్న సమయం చూసి అడిగాను.

“లేదాంటీ, అప్పుడంతా సరిగ్గానే ఉండేది. అప్పుడప్పుడూ మాత్రం తన స్నేహితుడెవరింటికో వెళ్ళి రాత్రికక్కడే ఉంటాననీ, తన కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి నిద్రపొమ్మని చెప్పేవాడు. నేను తిరిగి వచ్చే రెండ్రోజుల ముందు షాపింగ్ చేసుకోడానికి వెళ్తూ, పర్స్ తీసుకువెళ్ళడం మరచిపోయాను. వెనక్కి వెళ్తే, ఒకతనెవరో మా ఇంట్లో షార్ట్స్ వేసుకుని ఛాతీ మీదేదీ లేకుండా సోఫాలో అభీమీద ఆనుకుని కూర్చుని, అభీ వేళ్ళతో  ఆడుకుంటూ, జుత్తు చెరుపుతూ అల్లరి చేస్తున్నాడు. మురిపెంగా నవ్వుతున్న అభీ నన్ను చూసి తత్తర పడ్డాడు. సందేహంగా చూస్తే, ‘నా దగ్గిర స్నేహితుడేలే‘ అంటూ కొట్టిపారేశాడు.
అప్పుడే అర్థం అవాల్సింది నాకు.

రెండోసారి వచ్చిన మొదటి వారంలోనే, ఈ నరకం మొదలయినది.” అంది బేలగా.

ఏమనడానికీ నోరు రాలేదు నాకు.

***
టాక్సీలో దీపికని వాళ్ళమ్మ ఇంటి బయటే దించి, ఆవిడని పలకరించడానికి కూడా మొహం చెల్లక, ఇంటిదారి పట్టాను.

మా ఇంటి మెట్లెక్కకుండా, గేటువద్దే సామాను వదిలి అక్కడున్న ఇంటర్‌కామ్లోనుంచి కుముద ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తలేదు.

“కుముదకేనా? లక్నోలో పెద్ద అసైన్‌మెంటేదో దొరికిందిటగా! ట్రక్కులో సామానేసుకుని వెళ్ళి పదిరోజుల పైనయింది. తెలియదా నీకూ?” గేటు పక్కనే ఇల్లున్న శారదా ఆంటీ బయట వరాండాలో కూర్చుని, తన కీళ్ళ నొప్పులకని పనిపిల్ల చేత కాళ్ళు పట్టించుకుంటూ, దీర్ఘాలు తీసింది.

ఆశ్చర్యం ఎందుకు వేయలేదా అన్న ఆశ్చర్యం మాత్రం కలిగిందంతే.

ఎదురుగా వస్తున్న మా వంటబ్బాయికి, “ సామానింట్లోకి పట్రా”- చెప్తూ మా మెట్లెక్కేను.

*

 

 

 

 

 

 

 

 

 

 

peepal-leaves-2013

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. Venkata S Addanki says:

  నిజమండి, తల్లి తండ్రులకి తెలిసి కొంత తెలియక కొంత ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే కడుపుమండిపోతుంది.మొన్న జరిగిన డెల్లీ వ్యవహారం ఇలాగే జరిగింది ఆ పిల్ల ఆత్మహత్యకి వడిగట్టింది. మళ్ళీ ఈ వెధవలకి తోడు సైకో మెంటాలిటీ ఒకటి. అది అన్నిట్లోకీ మరీ దరిద్రం. నిజంగా చదువుతుంటే చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా బాగా రాసారు.

 2. Krishna Veni Chari says:

  వెంకట్‍ ఎస్‍ అద్దంకిగారూ,
  బోల్డు కృతజ్ఞతలు-కామెంటుకీ మెప్పుకీ కూడా. :)

 3. వనజ తాతినేని says:

  అమ్మో ! భయమేస్తుంది .. జీవితాలలో ఇలాంటి వికృతాలెన్నో ,రాక్షస క్రీడలెన్నెన్నో ! క్లుప్తంగా బాగా వ్రాసారు కృష్ణవేణి గారు . అభినందనలు.

 4. Krishna Veni Chari says:

  కృతజ్ఞతలు వనజగారూ.

 5. lమహేశ్వర says:

  విదేశీ విశేషాలు బాగా చెప్పారు.

 6. Horrible plight of Deepika. I hoped she fought back with the help she very luckily got.

  • Krishna Veni Chari says:

   I am sure Rajaram would have taken care of that Sujatagaru. Thank for for reading and commenting.

 7. Sunitha Ramesh says:

  అబ్బా ఇలాంటి జీవితాలెన్నో కదా!!. ఇటువంటి సబ్జెక్టు ఎంచుకొని, సున్నితమైన కథనంతో ఎక్కడా ఇబ్బంది కలగకుండా రాసారు. చాలా బాగుందండి.

 8. Krishna Veni Chari says:

  >ఎక్కడా ఇబ్బంది కలగకుండా<
  హమ్మయ్యా సునీత రమేశ్‍ గారూ. ఈ మాట చెప్పి బతికించారు. అసభ్యంగా అనిపించకుండా, " ఎలా రాయాలా" అనుకుంటూ మూడు సార్లు కథనాన్ని మార్చాను.
  థేంక్యూ :)

 9. neelima says:

  డిఫరెంట్ స్టొరీ ….పాపం ఆ పిల్ల పెళ్లి పేరుతొ నరకం చూసింది

 10. Krishna Veni Chari says:

  >డిఫరెంట్ స్టొరీ<
  ఏవిఏషన్‍ /ఢిల్లీ వాతావరణం లేదనేనా?
  "పెళ్లి పేరుతొ నరకం"- నిజం నీలిమగారూ. ఓపికగా చదివి కామెంటు పెట్టినందుకు కృతజ్ఞతలు.

 11. amarendra says:

  బావుంది

 12. బావుందండి కథ

 13. Sasikala Volety says:

  చాలా దారుణమయిన యదార్ధాలు ఇవన్నీ. చిన్నప్పటి నుండి ఆడింది ఆటగా పెంచి, ఇంకోంత perverted చేసింది తల్లి. భయం వేస్తోందండి ఆడ పిల్లలకి బయట దేశాల సంబంధాలు చెయ్యాలంటే. Almost ఇలాగే ఒకమ్మాయ architect ఆస్ట్రేలియా లో citizenship తెచ్చుకున్న అబ్బాయిని చేసుకుంది. నాలుగేళ్ళు, ఆ అబ్బాయి.ఉద్యోగాలు మారుతూ సింగపూర్, ఆస్ట్రేలియా మధ్యలో తిరిగారు. One fine day, ఆ అమ్మాయికి job ఒచ్చి ఎవరితోనో వెళ్ళిపోయిందని చెప్పాడుట. Brother marriage కి ఒక్కడూ ఒచ్చాడు. గంటలో అమ్మాయి తండ్రి పోలీస్లతో ఒచ్చి ఆ అబ్బాయని arrest చేసి తీసుకు పోయారు. ఆఖరికి 50 lakks అమ్మాయికిచ్చి డివోర్స్తీ తీసుకున్నారు. మళ్ళీ.అబ్బాయి mother కాకమ్మ కధలు చెప్పి. పెద్ద పెద్ద rich divorced alliances చూస్తోంది. Definite ga abbaayi తప్పు ఏదో ఉంది. వీళ్ళు facts దాచేస్తున్నారు.
  Krishna Veni! the stories you.write are very contemporary and carry very useful message to present day society. Straight and clear nerration.and i liked the story very much. అభినందనలు.

  • Krishna Veni Chari says:

   Thank you so very much Shashikala Voletigaru,for such elaborate and positive feedback.
   I did not know that this is quite common. If I did, I may perhaps not have written this.

 14. కథనం బాగా రాశారు! ఇలాంటి సమస్యలపై ఎన్నో కథలు రావాలి! మీ నుంచి ఇంకా ఎన్నో కథలు ఆశిస్తూ!
  అభినందనలు
  మానస

 15. Bindusree Kollikonda says:

  చాలా బాగా రాసారు.

 16. Krishna Veni Chari says:

  >చాలా బాగా రాసారు.<
  బిందుశ్రీ కొల్లికొండగారూ, బోల్డు కృతజ్ఞతలు మీకు నచ్చినందుకు.

 17. ఎదురుగా వస్తున్న మా వంటబ్బాయికి, “ సామానింట్లోకి పట్రా”- చెప్తూ మా మెట్లెక్కేను.

  *
  Story ends here?

 18. Venkat Suresh says:

  ఇలాంటి contemporary issues పైన కథలు రాసే వారు చాలా అరుదై పోయారు. మీరు ఎంచుకొంటున్న subjectlu చాలా అవసరమైనవి. చాలా బాగుందండి కథ.

 19. Krishna Veni Chari says:

  >మీరు ఎంచుకొంటున్న subjectlu చాలా అవసరమైనవి.<
  ఈ సబ్జెక్టు మీద చాలా తెలుగు కథలు వచ్చాయని ఇప్పుడు తెలిసింది సురేశ్‍ గారూ.
  "కథ బాగుంది " అన్నందుకు కృతజ్ఞతలు.

 20. రాధ మండువ says:

  మరో వ్యథ. ఇలాంటివి ఎన్ని కథలు వస్తే అంత మంచిదని నా ఉద్దేశం కృష్ణవేణి గారూ… అభినందనలు

  • Krishna Veni Chari says:

   నిజమే అనుకోండి రాధగారూ కానీ అరిగిపోయిన సబ్జెక్టు తీసుకుని రాశానని తెలుసుకోలేదు. :(
   “అభినందనల”కి థేంక్యూ.

 21. Naku enging ardam kaledandi.kumuda ki mottam telusa? Teleda?

  • Krishna Veni Chari says:

   ప్రియగారూ,
   “kumuda ki mottam telusa? Teleda?”
   ———-
   అంటే బహుశా నేనే సరిగ్గా కన్వే చేసి ఉండను-ఇంకా సందేహం ఉందంటే. :(
   తీరిక చేసుకుని చదివి, కలిగిన అనుమానాన్ని వ్యక్తపరిచినందుకు.

 22. Jayashree Naidu says:

  తన కొడుకు సంసార విషయం లో కుముద కి అసలు వివరాలు తెలిసే వుందన్న విషయం ఇంకొంచెం కన్విన్సింగ్ గా కన్వే చేసి వుంటే బాగుండేది. ఆ ఒక్క విషయం తప్ప, కథంతా వేగంగా సాగింది. ఫారిన్ సంబంధాల మోజుల్లో జీవితాలు బలయ్యే తీరు బాగా రాశారు.

 23. Krishna Veni Chari says:

  >విషయం ఇంకొంచెం కన్విన్సింగ్ గా కన్వే చేసి వుంటే బాగుండేది. <
  జయశ్రీ నాయుడు గారూ,అదే అనుకుంటాను కొంతమందికి కలిగిన కన్ఫ్యూసన్‍‌కి కారణం.
  "కథంతా వేగంగా సాగింది." ఓపికగా చదివి, కామెంటు పెట్టినందుకు థేంక్యూ.

 24. Aranya Krishna says:

  కాలానికి అవసరమైన కథ. నిజానికి ఇదో క్రైమ్ రిపోర్ట్. కానీ కథా రూపంలో చక్కగా మలిచారు. కానీ మీరు కుముద స్వభావం మాత్రమే చెప్పి ఆమె రోల్ ఏమిటో చదువరులకే వదిలేసారు. అభి ఫోన్ నంబర్ ఇవ్వకపోవటం నేరంలో ఆమె భాగస్వామ్యం సూచిస్తున్ది. కానీ, ఆతను తల్లిని కూడా మోసం చేసివుండొచ్చు. తల్లిదండ్రుల పిల్లల పట్ల ధృతరాశ్ట్ర ప్రేమ వారిని నేరస్తులుగా మార్చే అవకాసం వుంటుంది. అందువల్ల తల్లిదండ్రులు కూడా ముద్దాయిలే. ఐ కోణం నుండి చూసినప్పుడు కుముద పాత్ర మీద కేవలం అనుమానపు చాయలు మాత్రమే ప్రసరింప చేస్తే ఎలా?

  • Krishna Veni Chari says:

   “కాలానికి అవసరమైన కథ…. కథా రూపంలో చక్కగా మలిచారు.”
   కృతజ్ఞతలు అరణ్యక్రిష్ణగారూ.
   “ఆతను తల్లిని కూడా మోసం చేసివుండొచ్చు”
   కుముద వచ్చి సుజాతతో కోడలికి లాసర్ ట్రీట్మెంటిప్పించానని చెప్పిన తరువాత, సిడ్నీలో ఇంట్లో బందీగా ఉన్న దీపిక మొహంమీద ఉన్న వెంట్రుకలు స్పష్టంగా కనిపించాయన్నప్పుడు, కుముద అబద్ధం చెప్పిందన్న సంగతి చదివేవాళ్ళకి అర్థం అవుతుందనుకున్నాను.
   “కుముద పాత్ర మీద కేవలం అనుమానపు చాయలు మాత్రమే ప్రసరింప చేస్తే ఎలా?”
   సిడ్నీనుంచి చేసినా కుముద ఫోన్ ఎత్తకపోవడమూ… ట్రక్కులో సామానేసుకుని వేరే ఊరు వెళ్ళిపోవడమూ గురించి చెప్పాను కదా, దానితోనే అర్థం అవుతుందనుకున్నానేమో అనుకుంటాను-తల్లీ కొడుకూ కలిసి ప్లాన్‍ చేసిందేనని.
   నా ఊహ తప్పని ఇప్పుడు అర్థం అవుతోంది.
   ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీ కామెంటు వల్ల తెలుస్తోంది. థేంక్స్ ఎగైన్

మీ మాటలు

*