కొన్నిసార్లు ఇలా కూడా..!

 

     – రాళ్ళబండి శశిశ్రీ

~

1.రాకపోకలన్నీ
పూర్తిగా అర్ధరహితమేమీ కాదు
ఆమోద తిరస్కారాలలో
అదుపుతప్పే గుండెలయ మాత్రమే
అర్ధరహితమైనది!

2.మోహంగా పరచుకున్న మోహనకి
నిరాశగా అలముకున్న శివరంజనికి
మధ్య ఒక్క గాంధార భేదం –
సంతోష దుఃఖాలను వేరుచేసే
చిన్నగీత మాత్రమేనా?!
అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్య
కదిలే భారమైన సంగీతం!

3.కొనగోటికి తగలని
కన్నీటిబొట్టు మహసముద్రంగా
వ్యాప్తి చెందకముందే
ఆలోచనలను ఆవిరిచేసేయ్యాలి
తడిగుండెకు ప్రవహించడమెక్కువ!

4.విస్ఫోటించిన అనుభూతుల సంలీనం
చెల్ల్లాచెదురైన గుండె శకలాల
మధ్య కూడా చిధ్రం కాని వ్యామోహాలు
సున్నితత్వానికి సమాధి కట్టడం సాధ్యం కాదేమో!?

5.అప్పుడప్పుడూ మనసుగదికి
తాళం వేయాల్సిందే
దృశ్యాలను మరుగుపరచందే
గాయాలకు మందు దొరకదు మరి!

*

మీ మాటలు

 1. Aranya Krishna says:

  తాత్వికతతో సంలీనమైన కవిత్వం. “ఆమోద తిరస్కారాలలో/అదుపుతప్పే గుండెలయ మాత్రమే/
  అర్ధరహితమైనది!” “తడిగుండెకు ప్రవహించడమెక్కువ!” ఇవి నాకు బాగా నచ్చిన వాక్యాలు. మంచి కవిత రాసినందుకు శశి శ్రీ గారూ అభినందనలు.

 2. Sameer Kumar says:

  Truth of life, very nicely expressed @konnisarlu ilakuda, Rallabandi SasiSri

 3. SasiSri says:

  Thank you

 4. lugendra pillai says:

  .కొనగోటికి తగలని కన్నీటిబొట్టు మహసముద్రంగా వ్యాప్తి చెందకముందే ఆలోచనలను ఆవిరిచేసేయ్యాలి
  తడిగుండెకు ప్రవహించడమెక్కువ!

  అధ్బుతమైన వ్యక్తీకరణ.. సాంద్రత నిండిన మీ కవిత్వంలో మునిగితేలాము

 5. SasiSri says:

  ధన్యవాదాలు లుగేంద్ర పిళ్ళై గారు.

మీ మాటలు

*