మిడ్ నైట్ బ్లూస్

 

 

-బ్రెయిన్ డెడ్ 

~

 

 

ప్రామిస్డ్ ల్యాండ్ రిమోట్లెక్కడో

ప్రాపంచిక భంగిమల మధ్య కోల్పోయి

 

అర్త్ధరాత్రి హౌరబ్రిడ్జ్కింద గుర్రం గజ్జెల్లా

మిడిల్ క్లాస్ ముషాయిరా

పరాకులు పలకరింపులు

జీవితాంతం ఒకరికొకరి ఏడ్పుల గుస్థాకీ

కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే

బుల్షిట్  ప్రేమ లేదంటారేమిటిరా

తూరుపు సింధూరపు ముఖారవిందాన

చెమటల ఉప్పులూరుతూ

నాన్ స్టిక్ ప్యాన్లో రిలేషన్షిప్ స్టిక్ చేసుకోవడానికి

తిరగబడుతున్న  హాఫ్ అండా ఫ్రై

వెలిగారుతున్న వైబ్రేటర్ మసకల్లో

గర్ల్ ఫ్రెండ్కో ముద్దు గ్లాస్ ఫ్రెండ్కో హద్దు పెడుతూ

జ్వరంతో బెంగటిల్లిన బేబీ డైపర్లో బ్రతుకర్ధం వెతుక్కుంటూ

ఎండిపోయిన ఎర్ర మిరపగాయ ముఖాన నిలబడిన

ఏకాకితనాన కానరాలేదా

ఏక్ చుట్కీ సింధూర్కి కీమత్ ఎంతో రమేష్బాబు

 

నిజమేన్రోయి !

సిగరెట్‌ తాగనోడు దున్నపోతై పుట్టున్‌

సిగరెట్బట్లు మారుతూ ఉంటాయి యాష్ ట్రేలలో

బట్లు మారుతూ ఉంటాయి బాంబే డైయింగ్ నేతల నునుపుల్లో

ఒకరికొకరు తోడై ఉండిన అదే స్వర్గపు పానుపుల్లో

పరంతూ ,గాలుల్లో కలుస్తున్న పొగలు

ఉక్కిరిబిక్కిరి చేసే సంభందాలంత స(అ)తీ సహజమేగా

మై డియర్ గిరీశం , మైండ్ యా  రిలేషన్షిప్ స్టేటస్ ఆల్వేస్ కాంప్లికేటెడేనోయి

 

సబ్జెక్టివిటీ కరువైన కథలు డామిట్!  అనేసి అడ్డం తిరిగినప్పుడు

ఆదర్శాల అబ్జేక్టివిటీ  వెతక్కువాయి ముదుర్రాయి

పళ్ళుడగొట్టుకున్న శతకోటి బోడిలింగాలలో నీదో

పగిలిన హృదయం మాత్రమే

ప్రేమెందుకు లేదరాభై

పడకింటి పవళింపు సేవలలో  అనుకోకుండానో ,

అనితరసాధ్యంగానో కారిన

ఆ నాలుగు చుక్కలు  ప్రేమకేగా లైఫోటి క్యారుమన్నది

ఓపెన్ మైండెడ్ బైయాస్డ్ జిందగీలలో చివరకిమిగిలేది అదే సుమీ

 

డార్న్

అటు తిరిగిపడుకోవడంలోను నిరాశేనా

అసహనపు ధర్మయుద్ధం చివరాకరు ఆయుధం కాబోలు

బయటెక్కడో ఎవడో ఫ్రస్త్రేటెడ్ సోల్ కోక్ టిన్ను లాగిపెట్టి తన్నిన శబ్దం

దునియా కా క్యా సునేగారే  భాయ్ జరా ఖుద్కా ధర్డ్ సునో

కోక కోసమో కొకైన్ కోసమో ఫటక్ ఫటక్ మని గుండెపగలగొట్టుకొని బయటికోస్తున్న ఎమోషన్నో క్షణం మోసిన తుది సెకండ్లో

జబ్ కోయి బాత్ బిగడ్జాయే జబ్ కోయి ముష్కిల్ పడ్జాయే

తుం దేనా సాత్ మేరా ఓ హం నవా !

 

ఒకేమారు ఇటు తిరిగి హత్తుకోవా ప్రియా

మరెప్పుడు మౌనాన్నే కాదు మరణాన్ని సైతం మన మధ్యకి రానివ్వనని మాటిస్తాను

 

 

ప్రామిస్డ్ ల్యాండ్ రిమోట్లెక్కడో

ప్రాపంచిక భంగిమల మధ్య కోల్పోయి

 

నిశీ !! 23 /02/ 16

 

మీ మాటలు

  1. వాసుదేవ్ says:

    ప్రతీ మనిషి కవి కాలేడు కానీ ప్రతీ కవీ మనిషే అన్న ఓ నిజాన్ని మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. మనిషితనాన్ని ఇలా చెప్పటం కొద్దిమంది మాత్రమే చెయ్యగలరు….అందులో మీకు ఇది అక్షరంతో పెట్టిన విద్య!
    చెప్పదల్చుకున్న విషయాన్ని సాగదీయకుండా హ్యాపీగా మీదైన భాషలో చెప్పేసాక ఇక పాఠకులని వారి విజ్ఞతకే వదిలేసే పని మీరెప్పుడూ మానరు. కానీ
    “సబ్జెక్టివిటీ కరువైన కథలు డామిట్! అనేసి అడ్డం తిరిగినప్పుడు

    ఆదర్శాల అబ్జేక్టివిటీ వెతక్కువాయి ముదుర్రాయి

    పళ్ళుడగొట్టుకున్న శతకోటి బోడిలింగాలలో నీదో

    పగిలిన హృదయం మాత్రమే

    ప్రేమెందుకు లేదరాభై”
    ఇలాంటి చోట్ల మాత్రం కొహెరన్స్ లోపించి ఏదో ఫ్లో మాత్రమే వెళ్ళినట్లుగా ఉండింది. అంటే ఇంకొంచెం కుదురుగా సీరియస్ గా రాసుంటే బావుండేదనే ఫీల్ ప్రతీపాఠకుడికి కలుగుతుందనే నమ్మకం నాకూ ఉందనే చెప్పటమ్ మాత్రమే ఉద్దేశ్యం.
    ఎనీవే మరో మంచి కవితకి అభినందనలు.

  2. సాదక్ షేక్ says:

    ఎలా వ్రాయగలుగుతున్నారు?
    ఇంకా
    ఎలా మనిషిగా బతికి వున్నారు?

  3. mithil kumar says:

    పడకింటి పవళింపు సేవలలో అనుకోకుండానో ,

    అనితరసాధ్యంగానో కారిన

    ఆ నాలుగు చుక్కలు ప్రేమకేగా లైఫోటి క్యారుమన్నది

    ఓపెన్ మైండెడ్ బైయాస్డ్ జిందగీలలో చివరకిమిగిలేది అదే సుమీ

    …..oka samudram meeru…..

  4. టి. చంద్రశేఖర రెడ్డి says:

    కవిత పేరు ఇంగ్లీషులో. కవి పేరు ఇంగ్లీషులో. కవితలో ఉన్న మొత్తం 230 పదాల్లో, పదబంధాల్లో; తెలుగువి 145, ఇంగ్లీషువి 50, హిందీ లేక ఉర్దూకు చెందినవి 35.
    తెలుగులో కవిత్వం చదవాలనుకునే వాళ్లకి, పరభాషా వాడకం; అవసరం మేరకు అనభిలషణీయం కాదు. కాని, మరీ ఈ మేరకా? బహుభాషాకవిత్వం అనిపించేంతవరకా?
    ఇతర భారతభాషల్లో కవిత్వం రాసేవాళ్లు కూడా ఇంత విస్తృతంగా, పరభాషావినియోగానికి పాల్పడుతున్నారా? ఆ కవిత్వం కూడా చదువుతున్నవాళ్లు ఎవరైనా ఈ ధోరణి అంతటా ఉంది అని నిర్ధారిస్తే, ఇది తెలుగుకొక్కదానికే పరిమితం కాదని తెలుసుకొని; ఆ చేదునిజాన్ని మ్రింగుతూ బలవంతాన చదివి పూర్తిగా అర్థం చేసుకోవటానికో, కుదరకపోతే అసలు చదవకుండా ఉండటానికో, లేదూ అర్థమైనంతవరకు తృప్తిపడటానికో ఎవరి అభిరుచికి అనుగుణంగా వారు ప్రయత్నించొచ్చు.
    ఇది చాలదన్నట్లు; అర్త్ధరాత్రి, సింధూరపు, బ్రతుకర్ధం, సంభందాలంత, పళ్ళుడగొట్టుకున్న లాంటి అక్షరదోషసహిత పదప్రయోగాలు.
    కవిత్వం ప్రవాహమైతే దాంతో పాటు పరిగిడటానికి కవిత్వాన్ని అభిమానించే నేనెపుడూ సిద్ధమే.
    అదృష్టవశాత్తూ, కవి తాను సృష్టించిన కవిత ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నదో; ఒడ్డున ఉండి తిలకిస్తూ ఉంటాడు. ఆ సౌలభ్యం లేని పాఠకుడు తీరం చేరాలంటే, మధ్యమధ్యలో ఈ కవితలోలా అడుగడుగునా అడ్డం పడుతున్న శిలలు తగిలి, అతడి తల శకలాలు కాకుండా ఉండాలిగా?

మీ మాటలు

*