రోహిత్ వొక సాంస్కృతిక ప్రశ్న

 

-రాణీ శివశంకర శర్మ
~

రాణీ శివశంకర శర్మ

ఈనాడు మనం యేది మాట్లాడాలన్నా “రోహిత్” నామస్మరణతో మొదలుపెట్టాల్సివస్తుంది. అతడొక గాఢమైన స్మృతిగా మారిపోయాడు.దళిత సాంస్కృతిక స్మృతిగా మారిపోయాడు.

నిజానికి విద్యార్దుల మరణాలు మన రాష్ట్రంలో మరీ కొత్తేమీ కాదు. అందులో దళిత విద్యార్దుల మరణాలు కూడా సర్వసాధారణమై పోయాయి. సాధారణంగా ఆత్మహత్యలు మౌనంలో ముగుస్తాయి. అవి తీవ్ర పరాజయ రూపంగా ఉంటాయి. కానీ రోహిత్ మరణం వట్టి ఆత్మహత్యేనా?
కానే కాదు. అతడి మరణం చీకట్లోకి మౌన నిష్క్రమణగా కాక, అక్షరాలుగా మార్మోగింది. ఆ అక్షరాలు అశక్తతనీ, వుడుకుమోత్తనాన్నీ, ద్వేషాన్నీ వెదజల్లేవి కావు. యీ వ్యవస్థ బోలుతనాన్ని స్పష్టం చేస్తూనే, వొక ప్రత్యామ్నాయ తత్వాన్ని చెప్పి పోయాయి. అందు వల్ల రోహిత్ మరణానికి ఎంతో మంది బతుకు కంటే ప్రాముఖ్యత ఏర్పడింది. అది రోహిత్ మరణాన్నికాక, చాలా మంది జీవించి వున్నామని భ్రమిస్తున్న వాళ్ళు నిజానికి జీవించి లేరని, యిప్పటికే మరణించారని నిర్ధారించింది. కృత్రిమత్వం, స్వాభావికత లోపించడం, ఆత్మ వంచన, పర వంచనల్ని కవితాత్మకం చేసింది.
యిది అగ్ర వర్ణాలకి పెద్ద తలనొప్పి. యెందుకంటే అధికారం ద్వారా, ధన బలం ద్వారా మాత్రమే అగ్ర వర్ణాలు బతికి బట్టకట్టకలుగుతున్నాయి. అవి సాంస్కృతికంగా మరణించాయి. రోహిత్ చనిపోయి, పూర్తిగా మౌనంలోకి జారిపోకుండా అగ్ర వర్ణాల మరణాన్ని నిర్ధారించే శాసనాన్ని లిఖించి పోయాడు. అందుకే అంత అలజడి. యిప్పుడు అగ్రవర్ణాలు పూర్తిగా ఆత్మ రక్షణలో పడిపోయాయి. తమ నైతిక పతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లుతున్నాయి.
నిజానికి అగ్రవర్ణాలు సాంస్కృతికంగా యెప్పుడో స్తబ్ధతకు గురయ్యాయి. అక్షరం వారి దగ్గర నుంచి యెప్పుడో ఎగిరి పోయింది. “నను వరించిన శారద లేచిపోవునే” , అని జాషువా ప్రశ్నించాడు. యిప్పుడా శారద పూర్తిగా వాడలలోనే నివాసం ఉంటుంది. అగ్రహారం వైపు కన్నెత్తి చూడడం లేదు. పూర్వం బ్రాహ్మణులలో, అగ్రవర్ణాలలో ఉన్న గొప్ప కవులూ, మేధావులూ ఇప్పుడూ కరువయ్యారు. యిందుకు తెలుగు సాహిత్యమే మంచి ఉదాహరణ.
దానికి కారణమేమిటి? ధన సంపాదన, అధికార లాలస యివే ప్రధానం కావడం వల్ల అగ్రవర్ణాలు అక్షరంపై మక్కువ వదిలి వేసాయి. అందుకే అక్షరం కూడా వాళ్ళని వదిలేసింది. అగ్రవర్ణాలు నిరక్షరాశ్యులుగా మారిపోయారు. పుస్తకాల పురుగులుగా కాక కంప్యూటర్ పురుగులుగా మారారు. యంత్రాల్లో యంత్రాలుగా మారిపోయారు. అందుకే శ్రీపాద, చలం, విశ్వనాధ, శ్రీశ్రీ, భైరాగి లాంటి కవులూ, రచయితలూ వారి నుండి ఆవిర్భవించడం మానేశారు. హృదయ స్పందన కలిగించే అక్షరాలు వారి నుంచీ అదృశ్యమయ్యాయి.
దీనికి కారణం, బ్రిటీష్ వారి కాలం నుంచీ ఆధునికత వల్ల వచ్చే ప్రయోజనాల మీద దృష్టి  వారిలో అధికమైంది. యెప్పుడైతే ఆ ప్రయోజనాన్ని వారు అంది పుచ్చుకోవడం మొదలు పెట్టారో, ఆ ప్రయోజనాలే వారికి సర్వస్వమై పోయాయి. వారికి సాంప్రదాయకంగా వస్తున్న కళలూ, శాస్త్రాలూ, కవిత్వమూ, వాఙ్మ్ యాల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. ముఖ్యంగా బ్రాహ్మణుల పరిస్థితి ఇది.
దీనితో బౌద్ధికంగా,  సాంస్కృతికంగా క్షీణించి పోయిన బ్రాహ్మణులలో అగ్రవర్ణ దురహంకారం మాత్రమే మిగిలింది. అక్షరం వలస పోయింది. బ్రాహ్మణులు నిరక్షరాస్యులుగా మారిపోయారు.
నిజానికి ఆధునికత అక్షరాస్యతను పెంచడంలేదు. నిరక్షరాస్యతను పెంచుతోంది. అక్షరం నిజానికి చాలా గాఢమైనది. అది మౌఖికంగా కానీ, లిఖిత రూఫంలో కానీ గాఢమైన ముద్ర వేస్తుంది. అటువంటి ముద్ర వేసే శక్తిని కోల్పోయినప్పుడు అక్షరం మరణించినట్లే. నిరక్షరాస్యత రాజ్యం చేస్తున్నట్లే.
భాష కేవలం సమాచార సాధనం కాదు. అది కమ్యూనికేషన్ స్కిల్ కాదు. భాష కమ్యూనికేషన్ స్కిల్‌గా మిగిలి పోవడం అంటే నిరక్షరాస్యత వ్యాపించినట్లే.  భాష రక్త ప్రవాహం వంటిది. అది సమాజంలో సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
కానీ నేటి కళా రూపాల్ని చూడండి. టీవీలో ప్రోగ్రాములు, సినిమాలు చూడండి. అటువంటి లక్షణమేమీ కనపడదు. యెటువంటి ప్రభావాన్నీ కలిగించకపోవడానికే “వినోదం” అని పేరు. యాంత్రికంగా చూస్తాం, మరచి పోతాం. సినిమాలలో దృశ్యాలూ, పాత్రలూ రిచ్‍గా కనపరచడం రివాజుగా మారిపోయింది. మన దరిద్రపుగొట్టు మొహాల్లో కొద్ది సేపు సంతోషాన్ని పోలిన దాన్ని అది కలుగ జేస్తుంది. మన జీవితంలోని లోపలి బయటి దారిద్ర్యాల్నీ, శూన్యాల్నీ మనం ఈ దృశ్యాల ద్వారా పూరిస్తున్నాం. రోహిత్ ప్రస్తావించిన శూన్యం రోహిత్‍కు మాత్రమే సంబంధించినది కాదు, మొత్తం సమాజానికి సంబంధించింది.
ఈ సమాజం యెటువంటిది? యాంత్రికమైనది, సంపదనీ, అధికారాన్నీ ఆరాధించేదీ, స్పందన శూన్యమైనది, వెరసి నిరక్షరాస్యమైనది.
ఆధునిక యంత్ర నాగరికత విశాల దృక్పథాన్ని పెంచింది అనేది భ్రమ మాత్రమే. నిజానికి అది మనుషులలో సంకుచిత మనస్తత్వాన్ని  పెంచింది. స్థలకాలాలకు సంబంధించిన విశాల దృక్పథాన్ని బలహీనపరిచింది. యిటీవల నోమ్ చాం‍స్కీ అనే అమెరికా మేధావి మాట్లాడ్తూ అమెరికాలో కొన్ని వేల సంవత్సరాల క్రిందట మాత్రమే విశ్వం ఆవిర్భవించిందని విశ్వసిస్తారని అన్నాడు. సుదీర్ఘమైన కాలం గురించి భారతీయ పురాణ గాధలు దిగ్భ్రాంతి కలిగించేట్టుగా ఊహించగలిగాయి. ఉదాహరణకి- బ్రహ్మకాలం. ప్రముఖ సైన్స్ రచయిత కార్ల్ సాగాన్ స్థలకాలాల గురించి భారతీయ పౌరాణిక దృష్టిని కొనియాడారు. రోహిత్ తన చివరి లేఖలో ప్రస్తావించినది యీయన గురించే. అనంత స్థల కాలాల గురించి యీ వైఙ్ఞానిక పౌరాణిక ఊహల వల్లనే తన మరణాన్ని కూడా నక్షత్ర లోకాల్లో అంతులేని గమనంగా ఊహించగలిగాడు. మరణం గురించిన ఆలోచనలు కూడా అతనిలో అంత ఊహాశక్తిని మేల్కొలిపాయి. కానీ ఆధునిక జీవితం సంకుచిత వలయాల్లో తిరుగుతోంది. మానవ అస్తిత్వం యిరుకుగానూ, ఖాళీగానూ తయారుకావడాన్ని రోహిత్ పసిగట్టాడు. అందుకే మనుషులు ప్రకృతిని ప్రేమింఛలేకపోతున్నారనీ, కృత్రిమత్వం పెరిగిపోయిందని బాధపడ్డాడు.
అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్‍తుంబ్డే ఆధునికతలోని మానవ కేంద్రక దృష్టిని విమర్శించాడు. మితిమీరిన సంపద వుత్పత్తి సామ్యవాదానికి దారితీస్తుందన్న మార్క్స్ భావంలోనే ఖాళీ వుందన్నాడు. అధిక వుత్పత్తి అనర్ధదాయకం అన్నాడు. అది ప్రకృతిని నిర్విచక్షణగా కొల్లగొట్టడంగా మారిపోయిందన్నాడు.
పాశ్చాత్య అభివృద్ధి నమూనాపై దళిత బహుజన మేధావుల్లో కూడా సందేహాలు మొదలయ్యాయి. యీ సందేహాలు పురోగతి అనే భావంలోని లోపాన్ని బట్టబయలు చేస్స్తున్నాయి. వెనక్కి తిరిగి దళిత స్మృతులని వెతికి పట్టుకొనవలసిన అవసరాన్ని కర్ణాటక బహుజన మేధావి డి ఆర్ నాగరాజు స్పష్టం చేస్తున్నారు. “పల్లె కన్నీరు పెట్టింది” గేయంలో గోరటి వెంకన్న  కుల వృత్తుల, కుల సంస్కృతుల ప్రాచీన స్మృతుల చప్పుడులో తాను మునిగి, మనని ముంచెత్తాడు.
అగ్ర వర్ణాలు ప్రకృతికీ, సంస్కృతికీ దూరంగా జరిగి పోతుంటే, దళిత బహుజన మేధావుల ప్రయాణం దానికి పూర్తి వ్యతిరేక దిశలో సాగుతోంది. దీన్ని మన అగ్ర వర్ణ మేధావులు కూడా గుర్తించలేక పోతున్నారు. అరిగి పోయిన అభ్యుదయ, నాస్తిక సిద్ధాంతాల్ని వల్లిస్తున్నారు. రోహిత్ సైన్స్ దృక్పథం పరిశీలిస్తే యీ సంగతి స్పష్టమవుతుంది.
రోహిత్ స్టీఫెన్ హాకింగ్‍ని కాక, కార్ల్ సాగాన్‍ని అభిమానించాడు అనే విషయం చాలా ప్రధానమైందని మిత్రుడు నరహరి అన్నాడు. నిజమే, స్టీఫెన్ హాకింగ్ దృక్పథం పూర్తిగా ప్రాగ్మాటిక్. ఐన్‍స్టీన్ నుంచీ కార్ల్ సాగాన్ వరకూ వొక మత పర దృక్పథం కొనసాగుతూ వొస్తుంది. అది స్టీఫెన్ హాకింగ్ దృక్పథానికి పూర్తిగా వ్యతిరేకం. హాకింగ్ యీ ప్రపంచాన్ని సృష్టించిన “గాడ్ ఫ్యాక్టర్” గురించి యిటీవల ప్రస్తావించారు. సైంటిస్టులు వ్యతిరేకించారు, కానీ దాని వల్ల స్టీఫెన్ హాకింగ్‍కి మత పర దృక్పథం ఉందని చెప్పలేం.
అసలు మతపర దృక్పథం అంటే ఏమిటి ? యిక్కడ నేను ఐన్‍స్టయిన్ ప్రతిపాదించిన కాస్మిక్ రెలిజియన్ గురించి ప్రస్తావిస్తున్నాను. విశ్వాన్నీ, ప్రకృతినీ పరిశీలించడంలో మనిషి తన అహాన్ని అధిగమించడం. అది ఐన్‍స్టీన్ ప్రస్తావించిన మత దృక్పథం. కార్ల్ సాగాన్ కూడా కాస్మిక్ రెలిజియన్ గురించి మాట్లాడాడు. మరింత ముందుకు వెళ్ళి హిందూ పురాణాల్లోని స్థలకాల దృక్పథంలోని విశాలత్వానికి దిగ్భ్రాంతి చెందాడు. యిక్కడ సైన్సూ, పురాణమూ యేకమయ్యాయి. అరలు అరలుగా విడిపోయిన మానవ ఙ్ఞానం వొకచోట సంగమించే నదీ సంగమాన్ని కార్ల్ సాగాన్ కలగన్నాడు. రోహిత్ హృదయం కూడా అక్కడనే విహరించింది. కార్ల్ సాగాన్ సహ రచయిత్రి, సహచరి నుంచి రోహిత్ మరణాంతరం అతనికి మద్ధతుగా లేఖ రావడం విధి వైచిత్రి. ఙ్ఞాన మహా సాగరాన్ని మధించడంలో కార్ల్ సాగాన్ చూపిన విఙ్ఞత ఐన్‍స్టీన్ చూపిన దృక్పథానికి కొనసాగింపే. క్రీస్తూ, బుద్ధుడూ వంటి మత ప్రవక్తలూ, రుషుల అంతర్దృష్టి, ప్రయోగాల మీద ఆధార పడిన సైంటిస్టుల దృక్పథం కన్నా గొప్పది అని ఐన్‍స్టీన్ అంటాడు.
“వాట్ షుడ్ బీ”, ప్రపంచానికి వొక లక్ష్యాన్ని మతమే యిస్తుందని ఆయన భావించాడు. మొత్తంగా మతమంటే మనిషి తన అహాన్ని త్యజించి ప్రకృతి ముందు పసిపిల్లవాడిలా నిలబడడం అనే అర్థాన్ని ఐన్‍స్టీన్ ఆశ్రయించాడు. ఙ్ఞానం ఙ్ఞానం కోసమేనన్నాడు. కార్ల్ సాగాన్ ఐన్‍స్టీన్ దృక్పథాన్ని ప్రశంసించాడు. ఆనంద్ తేల్ తుంబ్డే బౌద్ధాన్ని  మానవకేంద్రక దృష్టి నుంచి విముక్తం చేసే దృక్పథంగా కీర్తించినపుడు మతం అంటే దేవుడు, దెయ్యం అతీంద్రియ శక్తి అనే భావాల కంటే విశాలమైన దృక్పథం కనబడ్తుంది.
కానీ స్టీఫెన్ హాకింగ్ దృక్పథం సంకుచితమైనది. దుందుడుకుతనం, విశ్వంలోకి విస్తరించడం అనేవి ప్రాగ్మాటిక్ దృక్పథంలోని ప్రధానమైన అంశాలు.  గ్రహాంతర జీవుల పట్ల భయాందోళనలు కూడా ఆయనకు యెక్కువ.  కారణం దుందుడుకుతనం.  దురాక్రమణ దృక్పథం నుంచే అమెరికా నాగరికత ఏర్పడింది. నాగరికత ఆవిర్భావంలో భాగంగా అనేక జాతులు అంతరించాయి. అలాగే గ్రహాంతర వాసులవల్ల మానవ జాతి కూడా అంతరించవచ్చునన్న భయం ఆయనకి వుంది. అదే సమయంలో దురాక్రమణ, దుందుడుకుతనంలేనిదే మనిషి మనుగడ అసాధ్యమన్న దృక్పథం ఆయనకు ఉన్నాయి. అహాన్ని జయించడం అనే మత దృక్పథం ఆయనలో శూన్యం. విశ్వాన్ని నడిపే అతీంద్రియ శక్తి గురించి మాట్లాడినా ఆయనది మత దృక్పథం అనలేం. ఆయనది పాశ్చాత్య కేంద్రక దృక్పథం. పాశ్చాత్య విస్తరణ కాంక్షకి ఆయన చెప్పే కాస్మిక్ సిద్ధాంతం అద్దం పడ్తుంది. యింక భూమి నివాస యోగ్యం కాదు. వేరే గ్రహాన్ని వెతుక్కోవాలి అనడంలో యీ విస్తరణ కాంక్ష్యే విస్తృత రూపంలో కనబడ్తుంది.
భూమినే తల్లిగా పూజించడం, భూమిని కేంద్రంగా భావించడం వర్ధిల్లిన ప్రాచీన సమాజాల్లో భూమినీ, మానవ సమాజాన్నీ మెరుగు పరచడం యెలా అనే దృక్పథం ఉండేది. కానీ విశాల విశ్వమంతా ఆక్రమించాలనే భావన మనిషిలో మరింత దుందుడుకుతనాన్ని పెంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనికి భిన్నమైనదే విశాల విశ్వభావన. మనిషిలోని యీగోని తగ్గించి, ప్రకృతిని ఆరాధించే స్థితికి తీసుకు వెళ్తుందనే దృక్పథం . యీ దృక్పథమే రోహిత్ దృక్పథం కూడా. రోహిత్, స్టిఫెన్ హాకింగ్‍లా కాక హేతువునీ, కల్పననీ(ఊహనీ) ఏకం చేసాడు. అతనిలో కలలూ, నక్షత్ర లోకాలూ ఐక్యమయ్యాయి.
యింత విశాలంగా, గాఢంగా పరిశీలించిన వ్యక్తిని గౌరవించే స్థాయిలో మన సమాజం లేదు. ప్రాచీన భారతీయ విశ్వ దృక్పథంలోని విశాలత్వం, యిక్కడి మనుషులలోని యిగోని తగ్గించలేక పోయింది. దానికి కారణమేమిటి?
నిజానికి మన సమాజాలు ప్రాచీన సమాజాల కన్నా సంకుచితంగా మారిపోయాయి. పురాణ కథనాలు మనుషుల మీద గాఢమైన ముద్ర వేయగలిగేవి. కుల పురాణాలు కూడా అటువంటి గొప్ప పాత్రని నిర్వహించేవి. నేటి మన కళలు కానీ, చదువులు కానీ పూర్తిగా కృత్రిమత్వాన్ని సంతరించుకున్నాయి. అవి మన దృక్పథాన్ని విశాలం చేసే అవకాశం సన్నగిల్లింది. దీన్నే ఆధునిక నిరక్షరాశ్యత అంటాను.
ప్రాచీన కాలంలో కంటే మనలో సహనం తగ్గిపోయింది. చిందు ఎల్లమ్మ అంటుంది – బ్రాహ్మణ నింద ఉన్నప్పటికీ పూర్వం బ్రాహ్మణులు జాంబపురాణాన్ని చూసేవాళ్ళు. యిప్పుడు మమ్మల్ని తిడుతున్నారంటూ చూడడానికే నిరాకరిస్తున్నారని చిందు ఎల్లవ్వ చెప్పారు. అంటే విమర్శని సహించే శక్తి ఆధునిక
 యుగంలో సన్నగిల్లింది.
టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది చదువుకి అర్థాన్ని మార్చేసింది. భాషని కుదింపజేసింది. అంతిమంగా సంకుచిత దృక్పథాన్ని పెంచింది. నిజానికి, ఆధునిక పూర్వయుగాల్లోని దళితులు నిరక్షరాస్యులు అనే నిర్ధారణ ఆలోచించకుండా చేసిన నిర్ధారణగా కనిపిస్తుంది. కుల వృత్తులూ, కుల విద్యలూ, కుల పురాణాలూ, పటం కథలూ, యింతేకాక దళిత కళాకారుల్లో మాతృభాషని చదవడం, రాయడం వచ్చేవి. అంతే కాదు కఠినమైన సంస్కృత పదబంధాల్ని వుపయోగించేవారు. మీరు ఎప్పుడైనా తెలంగాణా వెళ్ళి చిందు భాగవతుల్నీ, ఢక్కలి జాంబపురాణ కళాకారుల్నీ కలిస్తే వాళ్ళూ ఏ మాత్రం నిరక్షరాశ్యులని పిలవలేమని తెలుస్తుంది. వొక విధంగా చెప్పాలంటే తెలంగాణా దళిత అంతశ్చేతన అనవచ్చు. శుభ కార్యాలు జరపడానికి  మేము బ్రాహ్మణుల్ని పిలవం. యెందుకంటే  మేం చదువుకున్న వాళ్ళం అంటుంది చిందు ఎల్లవ్వ. దళిత జీవితాన్ని నిరక్షరాశ్యతతో నిండిన చీకటిగా వర్ణించడం కుదరదనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే.
తెలంగాణాలో ఢక్కలి మొగిలిని నేను కలిసాను. అతడు అనేదేమిటంటే  అసలు వేదాలు మా దగ్గరే ఉన్నాయి. వాటిని మీ బ్రాహ్మణులు( వశిష్టుడు) దొంగిలించారు అంటారు. అంటే అసలైన ఙ్ఞానం దళితుల వద్దే వుందన్న మాట.
కానీ ఆధునిక యుగం ప్రాచీన సమాజ కథనాల్నీ పురాణాల్నీ వెర్రి పురాణ గాధలుగా తిరస్కరిస్తుంది. కానీ కార్ల్ సాగాన్ శివతాండవంలో విశ్వరహస్యాన్ని చూసాడు. బ్రహ్మ జీవితంలో కాల విస్తృతిని చూసాడు. అంటే ప్రాచ్య పురాణాల్ని ఙ్ఞాన చరిత్రలో ప్రధాన భాగం చేసాడు. అతడే మన రోహిత్‍కి ఆదర్శప్రాయుడు.
హిందూ వాదులు పాశ్చాత్య నాగరికతా శాపగ్రస్తులు. అందుకే రోహిత్‍కి ఉండే విశాల దృష్టి వారికి లేదు. కార్ల్ సాగాన్ కాదు, స్టిఫెన్ హాకింగ్, అతని పాశ్చాత్య  దుందుడుకు తనం వారికి ఆదర్శం.
రోహిత్ పాశ్చాత్య మానవ కేంద్రిత ఆధునికతని నిరసిస్తూ చివరి లేఖలో కూడా ప్రకృతి ప్రేమని చూపాడు. మార్పు, అభివృద్ధి పేరుతో పెరుగుతున్న కృత్రిమత్వాన్నీ, విధ్వంసాన్నీ నిరసించాడు.
పాశ్చాత్య ఆధునిక నాగరికతకి నిరంతరం వొక  శత్రువు అవసరం. ఎందుకంటే విస్తరణ, దుందుడుకు తనాలే దాని స్వభావం. ప్రస్తుతం దాని శత్రువు ముస్లీంలు (హిందువులు ప్రచ్చన్న క్రైస్తవులు, ప్రచ్చన్న అమెరికన్లు, కనుక విడివిడిగా వారి గురించి చెప్పడం వ్యర్ధం). యీ ఆధునికతనే ఆదర్శంగా తీసుకోవడం వల్ల దళిత ముస్లీం ఐక్యత యింతవరకూ సాధ్యం కాలేదు. దళిత ముస్లీం ఐక్యతతో కూడిన విద్యార్ధి ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా యీ ఆధునిక సామ్రాజ్యవాదానికి ముప్పుగా పరిణమించాడు రోహిత్.
పౌరాణిక యుగంలోనైనా, సైన్స్ యుగంలోనైనా కాస్మిక్ దృక్పథానికీ, సామాజిక దృక్పథానికీ మధ్య తాత్విక సంబంధం ఉంటుంది.
స్థలకాలాల్లో దురుసుగా విస్తరిస్తూ పోవడమే ,మానవ జాతి లక్ష్యం అనేది వొక భావన. యిది ఙ్ఞానాన్ని ఆధిపత్యంగా మారుస్తుంది.
అనంతమైన స్థల కాలాలలో మనిషి స్థానం చాలా స్వల్పమని, అందువల్ల మనిషి ప్రకృతినీ తోటి మనుషుల్నీ జీవుల్నీ ప్రేమించడమే మానవ ఙ్ఞానపు అంతిమ లక్ష్యమనీ మరో దృక్పథం. యీ కాస్మిక్ కల్చరల్ దృక్పథమే రోహిత్ దృక్పథం. యీ దృక్పథాన్ని మొగ్గలోనే తుడిచేయాలని చూస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదపు వికృత శిశువే హిందూయిజం.
రోహిత్ మరణం గ్రహణం మాత్రమే. అతని తాత్విక సందేశం అమరం.
peepal-leaves-2013

మీ మాటలు

  1. వృద్ధుల కళ్యాణ రామారావు says:

    ఒక అద్భుతమైన వ్యాసం.ఆఖరు 12వాక్యాలలో వ్యాసం తాలూకా సారాంశం చక్కగా ఇచ్చేరు. బహుశా శర్మగారు రోహిత్ ని ఆర్ధం చేసుకున్న తీరు వేరు, మిగతా దళిత నాయకులు అర్ధం చేసుకున్న తీరు వేరు. ఆయితే అతడి ఆత్మహత్య లేఖలో కొట్టివేసిన భాగాలు కూడా ఆతడి తాత్వికతను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ భాగాలు కూడా శర్మ గారి రోహిత్ మీద అంచనాకు బలం చేస్తాయి . కాని దళిత ముస్లిముల ఐక్యత గురించిన రోహిత్ ప్రయత్నాలు ఒక విధంగా అతడి మీద రుద్దబడ్డాయని నా ఆనుమానం. పాశ్చాత్య నాగరికత మీద శర్మ గారికున్న వ్యతిరేకత సమంజసమే అయినప్పటికీ, శత్రువుకు శత్రువు అయిన కారణంగానే ముస్లిం నాగరికతమీద కొంత soft corner శర్మ గారికి ఉన్నట్టుంది. ఈనాటి ముస్లిం వెనుకబాటుతనానికి ప్రధాన కారణం వాళ్ళ సంస్కృతి, తాత్వికతాను. శర్మ గారితో ఈ విషయంలో నేను విభేదిస్తున్నాను.
    మొత్తంమీద మంచి ఆలోచనలు రేకెత్తించే వ్యాసం.

  2. సందేహ says:

    అయ్యా, తమరేమి సెలవిస్తున్నారో మాబోంట్లకు అవగతమయేది గగనమే. ఒక (తాత్కాలిక?) తీర్థం పుచ్చుకున్న లక్షణాలు మాత్రం స్పష్టం గా ఉన్నాయి. యాకూబ్ మెమన్ గురించి కూడా మాకు వివరించమని ప్రార్థన.

  3. అగ్ర వర్ణాలవారు తిరిగి సాహిత్యసేవలో తమ పూర్వ ప్రాభవాన్ని చాటి , సమాజాన్ని వుధ్ధరించాలి .
    బలహీన వర్గాల ప్రజలు తిరిగి తమ కుల వ్రుత్తులను స్వీకరించి , అగ్ర వర్ణాల సేవలో తరించాలి .
    మితిమీరిన వుత్పత్తి సామ్యవాద భావనను పెంచుతుంది కనుక , వుత్పత్తిని తగ్గించి , ప్రక్రుతిని సం రక్షించుకోవాలి
    .తిరిగి భూస్వామ్య వ్యవస్థని పునహ్ ప్రతిష్టించాలి .
    — ఇలా నాకు కొంతవరకు అర్ధమైంది !

    • మంజరి లక్ష్మి says:

      ఆయన చెప్పిన డొంక తిరుగుడు మాటలన్నిటినీ అర్ధం చేసుకొని మీరు స్పష్టంగా మూడే ముక్కల్లో చాలా భాగా చెప్పారు. లేకపోతే మా బోటి వాళ్ళకు ఇది అర్ధమయ్యే వ్యాసం కాదు.

  4. 1048 Prabudhandhra 1939 feb nijamu rashtramu 1049 Prabudhandhra 1939 march nijam rashtramlo

  5. 1055 Manakaa Mataabhimaanam_Andhra Silpi 1946_11_01

  6. chandolu chandrasekhar says:

    rs శర్మగారు పాతని బతికించటానికి కొత్తకత్తులు నూరకమ్ది మీ వేయిపడగల విషపుజల్లు మామిడ చిమ్మకండి పన్నిటి రూపము లో మీలాంటి వాళ్ళ కోసమే జాషువా వేల కత్తులు నూరాదు డార్విన్ హాకింగ్ చివరి వరకు బౌతిక వాదుల నిలిచారు తెలియకపోతే స్టడీ చేయండి హాఫ్ క్నౌలెద్గే మోస్ట్ danger

  7. chandolu chandrasekhar says:

    rs శర్మగారు పాతని బతికించటానికి కొత్తకత్తులు నూరకమ్ది మీ వేయిపడగల విషపుజల్లు మామిడ చిమ్మకండి పన్నిటి రూపము లో మీలాంటి వాళ్ళ కోసమే జాషువా వేల కత్తులు నూరాదు డార్విన్ హాకింగ్ చివరి వరకు బౌతిక వాదుల నిలిచారు తెలియకపోతే స్టడీ చేయండి half konwledge most danger

  8. శర్మ గారు,

    తెల్లవారి తెలివికి చెక్క భజన చేసే భట్రాజులు చాలా మంది ఉన్నట్లున్నారు. మన స్కూల్ పుస్తకాలలో సైన్స్ గొప్పదనాన్ని కీర్తించటం, అది మానvaaళికి మహోపకారం చేసిందని ప్రాపగండా చేస్తూంటారు. స్కుల్ పుస్తకాలలో సైన్స్ గురించి చెప్పని ఎన్నో విషయాలు ఉంటాయి. పిల్లలో సైన్స్ పై ఆసక్తి కలగటానికి అప్పుడు అలా చెప్పవచ్చేమోగాని, చిన్నపటి కథలే జీవిత చరమాకం వరకు నమ్మితే ఎలా? దాని వలన కలిగిన నష్టాలు రాస్తే వారిని ఛాందసులు గా కొట్టిపారేయటం ఎంత వరకు సబబు?

    డార్విన్ గారి ప్రయోగ ఫలితాల గురించి ఎన్నో తెలియని విషయాలు ఈ వ్యాసాలు చదివితే తెలుస్తాయి.

    African invasion of the body snatchers

    Imagine a foreign people entering your country and desecrating the graves of your ancestors. They then transport the body parts to their homeland for the purpose of ‘proving’ the inferiority and animal-like nature of your people. As appalling as it may sound, such a practice was common among scientists for many decades after the publication of Darwin’s On the Origin of Species.

    In the early 1990s several articles drew attention to the murder and ‘bodysnatching’ of the Australian Aborigines that occurred in the late 19th and early 20th centuries.1,2,3

    According to one researcher, “…the graves of between 5000 and 10,000 Australian Aborigines were desecrated, their bodies dismembered or parts stolen to support a scientific trade.”4 What many do not realize is this was not a geographically isolated phenomenon, but was occurring simultaneously in the German colonies in Africa, especially at the request of prominent racial scientists in Germany

    http://creation.com/african-invasion-of-the-bodysnatchers

    Museums were not only interested in bones, but in fresh skins as well. These would provide interesting evolutionary displays when stuffed. Pickled Aboriginal brains were also in demand, to try to demonstrate that they were inferior to those of whites.

    Good prices were being offered for such specimens. Monaghan shows, on the basis of written evidence from the time, that there is little doubt that many of the ‘fresh’ specimens were obtained by simply going out and killing the Aboriginal people. The way in which the requests for specimens were announced was often a poorly disguised invitation to do just that.

    http://creation.com/missing-the-link-between-darwin-and-racism

  9. rani siva sankara sarma says:

    కొన్ని అరిగిపోయిన పదాలని పట్టుకొని సులభ విమర్శలు చేసెయ్యడం అలవాటుగా మారింది. జయప్రకాశ్ రాజు గారి దృష్టిలో ప్రక్రుతి ని పరిరక్షించుకోవడం తిరోగమనం భూస్వామ్యం. గ్లోబల్ వార్మింగ్ గురించి పరిశొధించిన సైమ్టిష్టులు అందరూ భూస్వామ్య భావజాలం కలవాళ్లన్నమాట.
    రాలిపడకతప్పవు భూస్వామి తలల గుత్తులు అని ఈయన పాడితే సైమ్టిష్టులు పరిగెత్తాలన్నమాట. యిలామ్టివాళ్ళ వల్లే యింత మేధో వలస.

  10. rani siva sankara sarma says:

    ప్రకృతిని ప్రేమిచడం తెలియని వాళ్లుగా రోహిత్ తన చివరి ఉత్తరంలో నిందించింది మీలాంటి వాళ్ల గురించే

    • నిజమే ! మీకున్న భాషా పరిజ్ఞానం , శాస్త్ర విజ్ఞానం నాకు లేదు . కనీసం రోహిత్ కు తెలిసినంతగా ప్రక్రుతిని ప్రేమించడం కూడా తెలియదు . కాని సమాజం పోకడలు తెలుసు .
      వేల సంవత్సరాలు ఒక వర్గం ప్రజలను బానిసలుగా , అంటరానివారిగా చూసి , వారి జీవితాలను నరకప్రాయం చేశారని , మతం పేరిట , దేవుడి పేరిట కర్మ సిధ్ధాంతం ప్రచారం చేసి , ప్రజల మెదళ్ళకు సంకెళ్ళు వేశారని , ఆరుగాలం శ్రమించినా పెద్దల బొక్కసాలు నిండాయేగాని , పేదలు కనీసం గంజినీళ్ళకు కూడా నోచుకోలేదని , బ్రిటీష్ వాళ్ళు వాళ్ళ అవసరాలకోసం క్రింది వర్గాల ప్రజలకు కొన్ని సౌకర్యాలు కలుగజేసి , సమాజంలో కొంత చోటు కల్పించారని , అంబేద్కర్ మహాశయుడు అణగారిన ప్రజలకు రాజ్యంలో భాగస్వామ్యం కల్పించి , వారి స్వతంత్ర జీవనానికి , ఎదుగుదలకూ దోహదం చేశారని , వుత్పత్తి పెంచకపోతే వుపాధి అవకాశాలు కోల్పోయి ప్రజలు వలస బాట పట్టాల్సి వస్తుందని , మార్క్స్ శ్రమదోపిడి గురించి తెలియజేసి , శ్రామికులు ఎలా దోపిడికి గురవుతున్నారో తెలిపి , సమసమాజ స్థాపన కోసం పోరాటమే మార్గమని చెప్పారని తెలుసుకున్నాము .
      కాని ఇంతకాలం తర్వాత కూడా ఇంకా భూస్వామ్య భావజాలంతో , కుల వ్రుత్తులను తిరిగి స్వీకరించి , పెద్దల సేవలో తరించాలని చెపుతుంటే ఆశ్చర్యం వేస్తుంది .
      సాహిత్యం గురించి , సైన్సు గురించి , ప్రక్రుతిని పరిరక్షించడం గురించి చెప్పేవాళ్ళు ఆర్ధిక సమానత్వం గురించి మాట్లాడక పోవడం ఆశ్చర్యం.
      అగ్రవర్ణాల ఆధిపత్యానికి గండి పడనంతకాలం వారు తిరిగి సాహిత్య స్రుష్టి చేయాల్సిన అవసరం లేదనుకుంటాను .
      సమసమాజం ఏర్పడిన తర్వాత , సహజంగానే అధికోత్పత్తి ఆగిపోయి , ప్రక్రుతి పరిరక్షింపబడుతుంది . ప్రక్రుతిని ప్రేమించడానికి తిరిగి ఆర్ధిక అసమానత్వ సమాజానికి మరలాల్సిన అవసరం లేదనుకుంటా !

      • *ఆర్ధిక సమానత్వం గురించి మాట్లాడక పోవడం ఆశ్చర్యం.*

        భలే వారే మీరు, ఆర్ధిక సమానత్వం గురించి మాట్లాడిన మార్క్స్, ఆయన సిద్దాంతం ఆధారం చేసుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రష్యా,చైనా దేశాల ను అడగాల్సిన ప్రశ్నను శర్మగారి ని అడిగితే ఎలా?

        శర్మ గారు ఆర్ధిక సమానత్వం ప్రామిస్ చేయలేదు గదా! ప్రామిస్ చేసిన మార్క్స్,మావో,లెనిన్,స్టాలిన్ ఎంతవరకు సఫలీక్రుతులయ్యారో తెలెసిందే కదా! వాళ్ళు ఆర్ధిక సమానత్వం ఎమిటి, కోట్ల మంది ప్రజలను సమస్యలనుండే విముక్తులను చేశారు గదా!( భౌతికంగా వారిని హత్యలు చేసి)

        *వేల సంవత్సరాలు …సమసమాజ స్థాపన కోసం పోరాటమే మార్గమని చెప్పారని తెలుసుకున్నాము*

        ఒకప్పటి బ్రిటిష్,కమ్యునిస్ట్ ల ప్రాపగండాను రాశారు. ఈసారి వీలున్నపుడు జవాబిస్తాను.

      • మంజరి లక్ష్మి says:

        బాగా రాశారు. ఆర్ధిక సమానత్వం, మనుషుల సమానత్వం వాళ్ళకెందుకు. భూస్వామ్య పునరుద్ధరనే వాళ్ళకు కావాలి. దానికి ప్రకృతి, పర్యావరన పరిరక్షన అని కలరేసి చెపుతున్నారంతే.

      • 1956 నాటికే తన సాటి దళిత మేధావుల గురించి పూర్తి నిరాశా నిస్పృహలకి లోనయ్యాడని మీకు తెలుసా?ఎందుకండీ మాటిమాటికీ అంబేద్కర్ నాంజం,ఎవర్ని బెదిరించటానికి?ఎవర్ని ఉద్ధరించటానికి!

        on 18 March 1956 at Ramlila Ground, Agra he said with a heavy heart that, “The educated people have betrayed me. I was thinking that after education they will serve their society. But I find that a crowd of clerks had gathered around me, who are engaged in filling their belly”. This heart burning is a proof that educated and intellectual class is alienated from the society and is going away from its brotherhood.

      • సమసమాజం ఏర్పడిన తర్వాత , సహజంగానే అధికోత్పత్తి ఆగిపోయి , ప్రక్రుతి పరిరక్షింపబడుతుంది . ప్రక్రుతిని ప్రేమించడానికి తిరిగి ఆర్ధిక అసమానత్వ సమాజానికి మరలాల్సిన అవసరం లేదనుకుంటా !
        హరిబాబు
        ఏర్పడినప్పుడు కదా:-)
        ఎప్పుడు ఏర్పడుతుంది?ఖచ్చితమైన లెక్క చెప్పగలరా?పోనీ ఎప్పుడు ఏర్పడినా అధికోత్పత్తి ఆగిపోతుందని అంత ఘట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు?అంటే సమసమాజం ఏర్పరచటానికి ముందుగా ప్రకృతిని ధ్వంస చహెసి అధికోత్పత్తిని ప్రోర్సహించడం ఒక రాజమార్గమా!
        విశదీకరించగలరు.

  11. rani siva sankara sarma says:

    .జయప్రకాశ్ రాజు గారూ
    మీకు రొహిత్లా ప్రకృతిని ప్రేమించడం ఎలా తెలుస్తుంది? మీరు తెళ్లవాళ్లకీ వాళ్లు తెచ్చిన వలసవాద నాగరికతకి భక్తులు.బ్రిటీషు వాళ్లు రాకపోతే మనం అజ్ఞానంలో అసమానతల్లో మగ్గిపోయేవారమని , యింకొవందేళ్లు వాళ్ళే పరిపాలిస్తే బాగుండేదని మీరు అంటారు. ఆరోజుల్లోనే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకృతిని లాభాలకోసం నిర్విచక్షణగా దొ పి డీ చేస్తోందని మార్క్సు కూడా బాధపడ్డాడు. అప్పటికంటే యిప్పటి పరిస్థితి మరింత దిగజారింది.
    అందుకే నేను కాదు అంబేద్కర్ మనవడు తుంబ్దె గారు అధిక ఉత్పతి పర్యవసానాలు చాలా ప్రమాదకరమని చెప్పారు. అదే నేను వుటంకించాను. అసలు ఆర్థికం అంటే మీవుద్దేస్యంలొ యేమిటి? ప్రక్రుతి విధ్వంసానికి ఆర్ధిక పర్యవసానాలువుండవనా? అంతా బడా పెట్టు బదీదారీ విదేశీ కంపినీల చేతుల్లోకి వెళ్లిపొవాలనా? ఆక్రమంలో చేపలు పట్టడం దగ్గరి నుంచి అన్ని వ్రుత్తులూ గిరిజనులతో సహా అంతరించిపోయి దేశమే వొక కార్పోరేట్ కంపెనీగా మారిపోతే మీరుకోరే సమ సమాజం వస్తుందనా? ఎవరికోసం ఆసమ సమాజం?

    • నేను బ్రిటీష్ వాళ్ళ ప్రసక్తితెచ్చిన కారణం – అప్పటివరకు అనేక అణచివేతలకు గురి కాబడ్డ దళితులను , వాళ్ళ అవసరాల నిమిత్తం వారిని దగ్గరకు తీసి , కొన్ని సౌకర్యాలు కల్పించారని చెప్పడానికే . ఇక్కడ నేను బ్రిటీష్ వాళ్ళ భక్తుణ్ణి అని ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు .
      కారుమంచి దళితుల ధిక్కార చరిత్ర ` తెగి పడ్డ ఆ చెయ్యి ‘ చదివితే బ్రిటీష్ వాళ్ళు దళితుల కోసం ఏమి చేశారో తెలుసుకోవచ్చు . అలాటి రచనలు చదివే నేను ఆ అభిప్రాయానికి వచ్చాను .
      నా వుద్దేశం కూడా పెట్టుబడిదారి వ్యవస్థ అన్ని రకాల దోపిడీలు చేస్తుందని , సమసమాజంలోనే మనిషి మనిషిగా బ్రతకగలడని . అందుకే ఆర్థిక సమానత్వం రావాలని కోరుకున్నది.

  12. rani siva sankara sarma says:

    అధిక ఉత్పత్తిపై ఆధారపడ్డ పెట్టుబడిదారీ వలస టెక్నాలజీ మనిషి ఉనికికే ప్రమాదంగా మారుతోంది . యీరహదారి ప్రళయానికా సామ్యవాదానికా?
    గురజాడ నుంచి అంబేద్కర్ దాకా బ్రిటీష్ వాళ్ళని పొగడందెవరు? ముస్లిం పాలనని తిట్టందెవరు? అదే హిందూ మతతత్వానికి మూలం.

  13. chandolu chandrasekhar says:

    srsarma ఏమి రాస్తునారో ఆయనికి తెలియటం లేదు బ్రిస్తిష్ వారిని ఎవరు భుజాని కి ఎత్తుకోలేదు .గురజాడ అప్పటే సామాజిక మారుపుని తన రచన లలో చెప్పాడు బ్రిటిష్ పెత్తనాన్ని నిలాన్టివాళ్ళు తప్ప ప్రోగ్రేసివే historians మెత్తము ఖండిచారు .ముందు మీరు ప్రపంచ యుద్దాలు అంటే తెలుసుకోడి అవి ఎందుకు జరుగుతాయి తెలుసుకోండి మార్కెట్, camodity ,ఉపయోగిత విలువ ,మారకపువిలువ తెలుసుకోండి భారతియసంస్కుతి తెలుసుకోండి మతసంస్క్రుతి కాదు మతం డ్రెస్ లాంటిది ఎవడైనా విడవ వచ్చు తోడగావాచు ఇండియా ఉత్తప్తి సంభాదాలు తెలుసుకోండి తోలిమానవుడి ఆకలి కేక తరువాత సామాజిక జీవనం తరువాతే మతాలు సకల రోగాలు ఈ రొగాలకి మందు బౌతిక వాదం డార్విన్ కి కూడా దేవుడిని అంట గట్టిన దుర్మార్గము మీది బిబ్లె దైవ గ్రంధం కాదు క్రీస్తు దేవుడుబిడ్డ కాదు అని చెప్పిన ధీశాలి.సైన్స్ ముందు మతం నిలవలేనప్పుడు సైన్స్ బాష మాటలాడుతుమది. దెయ్యాలు వేదాలు వల్లిచినట్టు . మిఆలొచన విధానం మార్చుకొంది ప్రపంచము చాల ముందుకు పోయింది కొత్తబాష నేర్చుకొంది డెమోక్రటిక్ గా ఆలోసిచండి

  14. Johnson choragudi says:

    రచయిత లేవనెత్తిన చర్చను మొదట ఆహ్వానిద్దాము. అతిమంగా అది ఎక్కడికి వెళ్లి ఆగినా వచ్చిన నష్టం లేదు . ఒక రచన ముగింపు లో విధిగా పరిష్కారం ఇవ్వాలి అంటీ కుదరదు, అలా వుండదు కూడా. రచయిత కూడా మనతో మన మధ్య వున్నవాడు. ఇప్పుడు రోహిత్ సందర్భంగా ఒక కొత్త ఆలోచనా ధార తనలో మొదలయినప్పుడు, అది మనమధ్య ముందు ప్రవహించాలి.దాని మీద తగినంత చర్చ జరగాలి. ఈ processes లో రచయిత కూడా మరింత update కావొచ్చు. అందుకు సమయం అవసరం.కేవలం 66 ఇయర్స్ రిపబ్లిక్ ఇది. ఉన్నపాటున ఇంత ‘టేక్ ఆఫ్’ మనకు అక్కరలేదు. అయినా ఒకటి రెండు మొదటి పొరలు అంతా నిర్ణయించడం కుదరదు. క్రింద ఇంక చాల ఓవర్హాల్ జరగాల్సి వుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. కనుక రచయిత తో పాటు మనం కూడా వీలయినంత ఓపెన్ మైండ్ తో వుందాము.

    • manjari lakshmi says:

      జాన్సన్ గారు ముందర ఆయన చెప్తున్నదేమిటో తేలికగా అర్ధమయ్యేటట్లు మీరు pointwise గా చెప్పండి. అప్పుడు చర్చ దేని మీద జరగాలి తెలుసుకోవచ్చు అంతా confuse గ్యా రాస్తున్నారు ఆయన

  15. rani siva sankara sarma says:

    జాన్సన్ గారికి కృతజ్ఞతలు . ఆయన అన్నట్లు కొంత వోపెన్ మైండెడ్ గా వుండడం అలవాటు చేసుకోవాలి మనం. .

  16. johnson choragudi says:

    ఇక్కడే కాదు పలుసార్లు జరుగుతున్నలోపమిది. 2 వేర్వేరు విషయాలు – మనం కలిపి ఒక్కటే అన్నట్టుగా చూస్తాము. హరప్పా – మొహన్జాదోరో మన చరిత్రే, 1947 తర్వాతదీ మన చరిత్రే. అయితే వేలాది ఏళ్ళ చరిత్ర మూలాల్లోని అంశాలకు గడచిన 66 ఏళ్ళు పరిష్కారాలు ఇవ్వలేదు అనేది తరుచూ మన పిర్యాదు. రచయిత చెప్పకపోయినా, ఈ లైన్ మనం గీసుకుని చూడాలి. లేదా రచయిత కూడా కొంచం, మనకూ ఆ సాయం కూడా చేయవచ్చు. అంతకు మించి ఇంకేదో క్లిష్టత ఇందులో వుందని నేను అనుకోవడం లేదు.

  17. chandolu chandrasekhar says:

    నమస్తే , జాన్సన్ గారు .మనము అందరం చర్చకు చోట్టిద్దాం .లోపల ఒకటి మరోటి బయటకి కాకుండా , బట్టలిప్పుకు నిలబడ దాం. శ్రీశ్రీ , అన్నట్టు అచ్చా స్వెచజీవి చర్చ కు చోటిద్దాం .ఇక్కడ ఆంగ్ల మానస పుత్రులు ఎవరులేరు ,రోహిత్ లాంటి వాడికి శివ తత్యాన్ని అంటగట్టటం దుర్మార్గం .ఆషాడ భూతి తత్య్వం వదిలి openmind గావుంటే చర్చ బాగుంటుది .డార్విన్ ,ఐంస్టీన్ లాంటి వాళ్లకి దేవుల్లన్ని దెయ్లని అంట గంటము .అసలు చర్చ అదికాదు .మతాలూ వేరైనా వాటి సారభుతం ఒక్కటే.

  18. rani siva sankara sarma says:

    జాన్సన్ గారు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారత ఖండానికి సుదీర్ఘ గతం వుంది. ఆగతం వివిధరూపాలలొ ప్రజల స్మృతులలో భద్రపరచబడింది. ప్రజల కథనాలని మనం యెందుకు చిన్న చూపు చూడాలి? యీకథనాలు మన జ్ఞాన ప్రక్రియలో భాగం కావా? కార్ల్ సాగాన్ మాత్రమే కాదు శ్రీశ్రీ కూడా యీపురాణ కథనాలని స్వీకరించలేదా? ప్రతీదాన్నీ లిటరల్ గా స్వీకరించి నిందిచె వాళ్ళతో మాట్లాడి ఉపయోగం శూన్యం. డార్విన్ మీద మాత్రం భక్తి యెందుకు? అది మాత్రం జ్ఞానాన్వేశణకి అడ్డం రాదా? మతమే కాదు డార్వినిజంకూడా సోషల్ డార్వినిజం గా మారి జాతి వివక్షకి కారణం కాలేదా? ఆవిషయానికి స్పష్ట ఆధారాలని చూపినందుకు శ్రీరాం గారికి కృతజ్ఞతలు.
    అసలు మనం దళిత కులపురాణాలని ఎలా చూడాలి? ఆధునికతపై అస్త్ర్రాలను ఎక్కు పెడ్తున్న మేధావులుగా నేను పేర్కొన్న మేధావులందరూ దళిత బహుజనులే. మరోపేరు – పైడి తెరేష్ బాబు. చందోలు చంద్ర శేఖర్ గారికి వీరి ఆలోచనలపై చిన్న చూపెందుకు? వారు దళితులైనండువల్లా ? / గురజాడ శ్రీశ్రీ లాంటి బ్రాహ్మణులే ఆయన దృష్టిలో మేధావులా? కాకపొతే వారీ అభిప్రాయాల గురించి చర్చిమ్చకుమ్డా యీగోల ఏమిటి?
    నేను సైమ్టిష్టుల గురించి రాసింది మరోసారి చదివి మాట్లాడండి మీకోసం వ్యాసం మళ్ళీ తిరగారాయలేను కదా?

  19. కాస్త ప్రశాంతంగా వ్యాసాన్ని చదివితే ఎన్నో విషయాలు చర్చకి పెట్టారని అర్ధం అవుతుంది. రచయత బ్రాహ్మణ, దళితులిద్దరి గురించీ ప్రస్థావించడం వల్ల పాఠకులు అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారనిపిస్తున్నా కొన్ని వాస్థవాలను ఒప్పుకోవలసి ఉంది.
    ఒక వ్యాసాన్ని అర్ధం చేసుకోవడంలో విద్యావంతులే తడబడినపుడు సామాజికపరంగా గానీ సాంస్కృతిక పరంగా గానీ వివిధ వర్గాల మధ్యన ఆర్ధిక సమానత్వం ఎలా వస్తుంది ? ఎలా సాధించగలుగుతారు ? విషయ పరిజ్ఞానమే ఆర్ధిక సమానత్వాన్నిస్తుంది కదా ?
    వ్యాసం మొత్తాన్నీ పరిశీలించినా కూడా రోహిత్ లాంటి తాత్వికుడు ఆత్మహత్య చేసుకునేటంతటి పిరికి/ధైర్యవంతుడు ఎందుకయ్యాడు అని గానీ శరీరమంతా చచ్చుబడిపోయినా జీవితంలో ఏదో సాధించాలనే ఆశ మాత్రం చావని స్టీఫెన్ దుందుడుకుతనంగా ఎందుకు తయారయ్యాడన్నదానికి గానీ సమాధానం లభించలేదు.

  20. R .S . శర్మ గారి అభిలాష ఏమిటి అంటే బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టటం. అయితే ఆయన కొన్ని వాస్తవాలను అర్ధం చేసుకుంటున్నారు. కొన్నిటిని కాదు. శ్రీపాద సుబ్రమొన్య శాస్త్రి గారు ప్రభుద్ద ఆంధ్రా పత్రికలో రాసిన వ్యాసాన్ని చదవండి.
    https://vivinamurthy.wordpress.com/2016/02/

    • తిరుపాలు, శర్మ గారిని విమర్శించే అంత స్థాయి మికు లేదు .

  21. chandoluchandra sekhar says:

    తిరుపాలన్న మీరు చెప్పింది వాస్తవం
    మీలాగా నేను విశదం చేయలేక పోయాను

  22. సారంగ వారు మళ్ళీ నా కామెంట్ల మీద శీతకన్నేస్తున్నారు.ఈ క్రింది కామెంటులో ఏమి దోషముందని ప్రచురించటం లేదో!

    రోహిత్ ఆత్మహత్య చెసుకోవడానికి ముందు రాసిన లేఖలో రాసి కొట్టేసిన భాగంలో ఉన్నది ఇది: “ASA,SFI వాటి ఉనికిని చాటుకోవడం కోసమే పనిచేస్తున్నాయి.ఆయా సంస్థల సిద్ధాంతాలు అందులో పనిచేసే వ్యక్తుల ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి.అధికారం చలాయించడం కోసం,ప్రచారంలో ఉండడం కోసం,తమ ప్రాముఖ్యత చాటుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయి.పైగా సమాజంలో మార్పుకోసమే పనిచేస్తున్నామంటూ తమను తాము మభ్యపెట్టుకుంటూ ఉంటున్నాయి” అని రోహిత్ రాసి కొట్టేసి తనే దాన్ని కొట్టేసినట్టు పక్కన నోట్ పెట్టి సంతకం చేశాడు!

    నేను రోహిత్ గురించి ఒక సవివరమిన పోష్టు వేశాను.దాన్ని ఇక్కడ చదవవచ్చు.ముఖ్యమైన విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి రాకముందు,అంటే ముందు చదువుకున్న చోట కేవలం మంచి మార్కులు తెచ్చుకోవటం, బయాలజీ సైంటిస్టుగా అవ్వాలని కలలు గనటం తప్ప రాజకీయాల రంధి పట్టని జీవితం దగ్గిర్నుంచి ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల వరకు రాశాను.ఆసక్తి ఉన్నవారు చదవండి.అతని ఆత్మహత్యకి అతి ముఖ్యమైన కారణం,అతని మీద పడిన కోర్టు కేసు.అది చాలా బలమైనది.అందుకోసమే అతను రాజీకి ప్రయత్నించి ఉందవచ్చు.కానీ ఈ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న పెద్దలు దాన్ని పదనివ్వలేదు.ఆ విషయమే అతనికి ఎక్కువ బాధ కలిగించింది.రాసి కొట్టేసిన భాగంతో సహా అతని లేఖలో ఉన్న నిరాశ అంతా దాని ప్రకంపనయే!

    ఇంతకు ముందు జరిగిన క్రమశిక్షణ సంఘం పెట్టిన నిషేధాలలో ఒక ఇరవై మంది విద్యార్ధులకి విధించిన నిషేధంతో పోలిస్తే రోహిత్ బృందానికి వేసిన శిక్ష తక్కువది. ఇక్కడ నిషేధం విధిస్తే వెంటనే టీసీ తీసుకుని మరో యూనిన్వర్సిటీలో చేరుతారేమోనని ముందు జాగ్రత్తగా ఇంకే యూనివర్సిటీలోనూ వీళ్ళు చేరకుండా జాగ్రత్తలు తీసుకుని వేశారు శిక్షని.ఆ శిక్ష వెసిన ప్రొఫెసర్ వామపక్ష భావజాలం గలవాడే!

    కులవ్యవస్థని బ్రాహ్మణులు ఏర్పాటు చహెశారనీ,అది పై నుంచి ఇతర కులాల మీద రుద్దబడిందనీ అంటున్నవారు సాక్ష్యాలు చూపించగలరా?చాలాకాలం క్రితమే కులవ్యవస్థ పుట్టుక గురించి “దోపిడీ->యుధ్ధం->రాజ్యం->కులం->అణిచివేత?->వైప్లవ్యం!” అనే పోష్టు వేశాను.అందులో ఉన్న ప్రతి విషయానికి చారిత్రకాధారాలు ఉన్నాయి.

    శాస్రీయంగా అధారాలతో చర్చించదలుచుకుంటే నా దగ్గిర ఉన్న మిగిలిన సమాచారాన్ని కూడా మీతో పంచుకోగలను.రోహిత్ ప్రస్తావుంచిన కార్ల్ సగన్ గురించి వ్యాసరచయిత కొన్ని వాస్తవాలు చెప్పేసరికే ఇక్కడ కొందరు మోదర్న్ సైన్సుకి హిందూత్వాన్ని పులుమినట్టు ఉలిక్కి పడుతున్నారు,ఎందుకు?ఎవ్వరూ బలవంత పెట్టకుండా కేవలం సత్యానికి కట్టుబడి భారతదేశంలో ఉన్న నిజమైన గొప్పదనాన్ని విదేశీయులే పొగుడుతుంటే గర్వించటానికి బదులు మన దేశాన్ని పొగిడినందుకు కాబోలు, వాళ్ళకి కూడా దుడుకుతనం అంటగడుతున్నవాళ్లు ఆధారాలు చూపించినా నమంకపోవచ్చు!కానీ ఇక్కడ జాన్సన్ గారు నిజమైన జిజ్ణాసతో ఉన్నట్టు నాకనిపిస్తుంది.కాబ్ట్టి వారి ప్రతిస్పందనని బట్టి మిగిలిన విషయాల్ని ప్రస్తావిస్తాను.

    ఒక విషయం క్లుప్తంగా చెబుతాను.మిగిలిన దేశమంతటి పరిస్థితి నాకు తెలియదు గానీ మన తెలుగునాట ఉన్న ప్రతి కులమూ ఒక వృత్తికి అనుసంధానించబడి ఉండటం గమనించాలి.అలాగే పైన వ్యాసరచయిత స్పర్శించిన కులపురాణాలు కూడా వాస్తవమైనవే కదా!నా పరిశోధనలో తెలిసిన విషయం, మొదటి దశలో వృత్తుల మీదా వాటి ఆదాయం మీదా మోనాపలీ కోసం,అంటే పోటీ లేని రక్షణ కోసం ఎవరికి వారు కులసమూహాలుగా మారారు.దీనివల మిగిలిన ప్రతి కులానికీ ఆదాయంలో గ్యారెంటీ ఉండగా బ్రాహ్మణులకి ఏ వృత్తీ మిగలలేదు.ఆ పరిస్థితి వల్లనే మిగిలిన కులాల మీద ఆధారపడి బతికే పరిస్థితి దాపరించింది.దానివల్ల వాళ్ళు నిజంగా లాభపడిన దాఖలాలు ఉన్నాయా??దాని గురించ్జి కూడా మనం ఆలోచించాలి.

    మనకున్న అక్కసుతో వాదిస్తే నిజం ఎప్పటికీ బయటపడదు. రాగద్వేషాల కతీతంగా జరిగే చర్చలే ప్రయోజనకారులు.అది లేనప్పుడు ఉత్త వాగాడంబరం మిగుల్తుంది.

  23. rani siva sankara sarma says:

    ఆర్ధిక సమానత్వం ముసుగులో హిందూ ఫాసిజం
    రోహిత్ ఆత్మహత్య సందర్భంలో నేను వొక వ్యాసం రాస్తే , ఆర్ధిక సమానత్వం గురించి పదే పడే మాట్లాడడం హిందు ఫాసిస్టులకి మద్దతు పలకడమే. ఈ ఆర్థిక సమానత్వం అనే పదాన్ని కమ్యునిస్టుల నుంచి హిందు వాదులు హైజాక్ చేసారు. యీపదం వెనుక సామాజిక సాంస్కృతిక వివక్షని కప్పిపుచ్చారు. నీహారిక గారు అడిగిన ప్రశ్న కరక్టే. ఆరోగ్యపరంగా దుర్భరజీవితాన్ని గడుపుతున్న స్టీఫెన్ హాకింగ్ కాక, రోహిత్ అనే మేధావి ఐన యువకుడు యెందుకు ఆత్మ హత్య చేసుకొన్నాడు? యింత మంచి ప్రశ్న వేసిన నీహారిక గారు సమాధానానికి తలుపులు మూసేశారు[ అసందర్భంగా ఆర్తిక సమానత్వాన్ని గురించి మాట్లాడడం ద్వారా. ]
    హిందూవాదులు ఏమంటున్నారు? రోహిత్ విషయంలో కాని, రిజర్వేషనుల విషయంలో కాని కులం సంస్క్రుతి ప్రసక్తి తీసుకురావద్దంతున్నారు. అర్థికమే నిర్ణాయకమంటున్నారు.అందుకె యీహిదు ప్రభుత్వ కాలంలోనే జాట్ల పటెళ్ల కుహనా ఉద్యమాలు సామాజిక సాంస్కృతిక అంశాలని మరుగుపరుస్తున్నాయి. యీనేపథ్యంలొనె ప్రకాష్ రాజు గారు తెలివిగా హిందూ వాదాని ముందుకు తెస్తే చంద్రశేఖర్ గారు వంత పాడారు. పైగా చంద్రశేఖర్ గారు యింతకు ముందే నేను పేర్కొన్నట్లు దళిత బహుజన మేధావుల పట్ల వివక్ష కూడా చూపారు. బ్రాహ్మణ పక్షపాతం వహించారు.
    మోకాటికీ బోడు గుండుకి ముడి పెట్టినా పర్వాలేదు, ఫక్తు ఆర్ధిక సమానత్వ వాదమూ హిందు ఫాసిజమూ కలిస్తే సామాజిక సమానత్వానికి వురే. ఆవురితాడువల్లే రోహిత్ చనిపోయాడు.

  24. వేల సంవత్సరాలుగా సమాజంలో అణచివేయబడ్డ దళితులు , బలహీన వర్గాల ప్రజల గురించి , బ్రిటీష్ వాళ్ళ పరిపాలనలో వారికి లభించిన స్వల్ప సౌకర్యాల గురించి , సమసమాజంలోనే మనిషి మనిషిగా బ్రతకగలడనీ , దానికి ఆర్థిక సమానత్వమే పరిష్కారమని వ్రాసిన నన్ను హిందూ వాదాన్ని ముందుకు తెచ్చిన వాడిగా చిత్రించడం శర్మ గారికే చెల్లింది .

  25. వృద్ధుల కల్యాణ రామారావు says:

    హరిబాబు గారు, జయప్రకాష్ గారు, శర్మ గారూ కూడా చాలా వాస్తవాలు చెప్పేరు. అయితే వేరు వేరు భాగాలకు వేరు వేరు weightage లు ఇవ్వడం వల్ల వాళ్ళు కాంట్రాడిక్టరీ గా ఉన్నట్టుగా భ్రమ కలుగుతోంది.

  26. H.Vageeshan says:

    శర్మ గారు రోహిత్ నిష్క్రమణ ను ఒక భిన్నమైన విమర్శ దృష్టితో చూస్తున్నారు . కుల వివక్షల , ఆర్ధిక కష్టాల , పురష అహంకారాల సమష్టి దుర్మార్గాన్ని పుట్టినప్పటి నుండి ఎదుర్కొని క్రమ క్రమంగా తన ఆలోచనా పరధినీ ,జీవన లక్ష్యాన్నీ ఎంచుకొని సాగిన , వికసిస్తున్న నవ యువ మేధస్సు రోహిత్. ఒక రకంగా అలాంటి సమష్టి దుర్మాగాలను ఎదురుకొంటూ సాహసమూ ,సహనమూ ,శక్తీ చూపుతూ ముందుకు వస్తున్న పీడిత కులాల చదువరులకు రోహిత్ ప్రతినిధి. బడులలో వేలసంఖ్యలో మొదలై పదుల సంఖ్యకంటే తక్కువగా ఉన్నత విద్య లోకి అటువంటి వారు వస్తున్నారు . ఏంతో భవిష్యత్తును కలిగిఉన్న నమ్మకాని పంచిన అటువంటి మేధస్సు అర్ధాంతర నిష్క్రమణ లో కుల వివక్ష , గిడుస బారిన బ్రాహ్మనీయ మేధా ,వాటితో పేగు బంధమున్న కుహనా జాతీయవాదము ,మూడూ కూడి ఒకపక్క . తన వారు అని భావించిన వాళ్ళ నుండి తానూ తన తోటి వాళ్ళు ఎదుర్కుంటున్న ఇనిస్టిట్యూశనల్ వెలివేత కు తగిననత వ్యతిరేక స్పందన ఆత ను ఆశించిన స్థాయిలో లేకపోవడం మరోపక్కా , అసమాన యుద్ధంలో ఎటువంటి వ్యూహాలూ ,ఎత్తుగడలూ అవుసరమో తెలియ చెప్పని స్వంత సీనియర్ అంబేద్కర్ సంఘస్తుల నిర్మాణ,నిర్వహణా రాహిత్యం ఇంకొక పక్క.తమ వ్యతిరేక శక్తులను చిన్నపామునైనా పెద్దకర్ర తో కొట్టమని చెప్పే అధికార ,కుల ,రాజకీయ బలం గలిగిన , హిదుత్వ జాతీయ వాదుల, వారి తాబేదార్ల చర్యలు ఇంకోపక్క ఇట్లా అనేక వైపులనుండి జరిగిన దాడి లో ,ఇక అర్ధాంతర నిష్క్రమణ మాత్రమే ఒక పరిష్కారమై నట్టున్నది రోహిత్ కు. ఒక శూన్యం తనను ఆవరించింది అని చెప్పుకున్న రోహిత్ ఆ శూన్యం లోకి ఎట్లా నెట్ట బాడినాడు ? అన్నదే కలిచివేసే ప్రశ్న . అది కచ్చితంగా ఒక సాంస్కృతిక ప్రశ్ననే . రోహితూ అతని మిత్రులూ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయాల పట్ల ,లేవనెత్తుతున్న ప్రశ్నల పట్ల ఒక అసహ్యమూ, కోపమూ ,ఉదాసీనతా కలిసిన వాతావరణం హైదరాబాద్ సెట్రల్ యూనివర్సిటీ లోనా ( అటువంటి ఇతర ప్రతిభా కేంద్రాలని చెప్పబడుతున్న చోటా ) ఉన్నది . ఆధునికత, అది తయారు చేసే వ్యతిరేక ద్వంద్వాల మద్య విపరీత మైన ద్వేష భావమూ ఈ అసహ్యమూ, కొపము, ఉదాసీనత క్రూరంగా మారెట్టు చేస్తున్నది . అందుకే ఆదునిక పూర్వ సమాజాల లో కనీసం టోకెన్ గా ( శర్మ గారు ప్రస్తావించే జాంబవ పురాణం బ్రాహ్మలు కూడా చూసే వారన్న ఉదాహరణ ) నైనా చూపే సహనం ఇక్కడ కనిపించదు .అందుకే కరుడుగట్టిన ఆదునిక హిందూజతీయ వాదులకు రోహిత్ వంటి వారు క్షమించరాని ,శత్రువులు అవుతున్నారు . ఇంకా ముందుకు పొతే తాము అసహ్యించుకునే ముస్లిం లను పౌరులుగా చూడాలని రోహిత్ మాట్లాడటం హిందూ వాదులకు మరింత కోపం తెప్పించింది . ఇదీ ఆధునికత సృష్టించిన విద్వేషా జాతీయత విష ఫలం. ఇంకా రోహిత్ కు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లూ , అతనికి రిసర్చి సూపెర్వైసరుగా ఉన్న మనిషీ ఒక వేల రోహిత్ తమ సమీప కులస్తుడో ? స్వకులస్తుడో ? లేక బాగా కనెక్టివిటీ గల వాడు అయివుంటే ?పరస్థితి ఎలా ఉండేది అన్నవి కీలక సాంస్కృతిక ప్రశ్నలు . ఇక్కడ సంప్రదాయ కుల వివక్ష ఆధునిక రూపం కనిపిస్తుంది . కనీసం రోహిత్ కు చదువు చెప్పిన ప్రోఫెసర్లో ,సూపర్వైసారో ,ఇతర ప్రోఫెసర్లో ‘బాబూ నీ రాజకీయాలు నీ జీవిత కాలం ఉంటాయి ,నీవు విద్యార్ధి రాజకీయాలో ఉన్నావు .చదువు కాల పరిమితికి కి చెందినా విషయం , చదువునూ రాజకీయాలను బాలెన్స్ చెయ్యడం నేర్చుకో ” అని ప్రేమతో చేరదీసి చెప్పక పోవడం లో కులవివక్ష చిన్నచోపూ ,ద్వేషమూ ఉన్నాయని అనిపిస్తుంది . సంప్రదాయిక వివక్ష అది తీసుకున్న ఆదునిక రూపమూ ,అదునికత పుట్టించిన హిదుత్వ జాతీయ వాదము కల్సి రోహిత్ ను శూన్యం లోకి నెట్టి వేసినాయి . అదుకే మనలను సాంస్కృతిక దుర్మార్గం నుండి హెచ్చరిస్తూ అనత దిగంతం లోకి కాలమై కలిసి పోయినాడు రోహిత్. జాషువా మహానుభావుదు “నను వరించిన శారద లేచిపోవునే ” అని “ఆవేశించి రసాది దేవి వరమీయన్ విద్యలే మాత్రముల్ ” అని తన చుట్టూ ఉన్న వివక్షను సంప్రదాయ సరళి లో తన్ని తగలేశారు . చెళ్ళపిళ్ళ తో గండ పెండేరం తొడిగించుకున్నాడు .ప్రతిభావతుడు ,కేవలం 15 లేక 16 ఏండ్ల లోకానుభవం గల ( 25 సవత్సరాల లో మొదటి పది సంవత్సరాలు తేసేస్తే ఉడే వయసు ) రోహిత్ మాత్రం ఆధునిక వివక్ష ద్వార వొంటరి తనలోకి ,నిర్లిప్త తలోకి ,నిష్క్రమంలోకి తోయ బడ్డాడు . ఇది సంగతి ఆరకంగా ఇది ఆధునిక సంస్కృతీ చేసిన హనన ప్రక్రియ .

  27. rahul.varanasi says:

    శివ శంకర శర్మ గారు..!! మీకు వీలైతే ఒక్కసారి రోహిత్ a b v p వాళ్ళ తో మాట్లాడడిన వీడియో ని వినండి. తను ఎక్కడ కషాయం కనిపిస్తే దానిని చించి వేస్తానని చెప్పాడు. కేవలం 26 సంవత్సరాల కుర్రాడి మనసులో ఈ విష బీజాలు నాటింది ఎవరు..?? గుంటూరు AC కళాశాల లో జరిగిన గుర్రం జాషువా గారి జయంతి ఊత్సవాల్లలో జాషువా గారి గొప్పతనం గురించి చెప్పడం మరచి, కేవలం అగ్ర వర్ణాల ను అవమానించడమే లక్ష్యం గా వక్తలన్డురు మాట్లాడారు. మనిషి కి మనిషి కి మధ్య విభేదాలు శత్రుత్వాలు పెంచేది ఎవరు..!!! ??అంబేద్కర్ గారు భారతమంత దళితులే ఉండాలి అని ఎప్పుడు చెప్పలేదనుకుంటాను. అందరు కలసి సమానంగా ఉండాలి అని అన్నారు. ఒక మనిషి (దళితుడు ) ఆత్మహత్య చేసుకుని తన మరణానికి ఎవరు బాధ్యులు కారు..!! నా ఒంటరితనం నుండి చిన్నపటినించి బయట పడలేకపోయనని రాసాడు..!! మానసికంగా కలిగే కుంగుబాటు కు కులం రంగు పులిమి విపక్ష నేతలన్డురు తమ ఉనికిని కాపాడు కుంటున్నారు. మానసిక సమస్యలు కులమో మతమో చూసుకొని రావు..!! వాటికీ మనిషితే చాలు ..!! దయ చేసి ఒకరి ఆత్మ హత్య ని రాజకియ్యం చేసి ఇంకా మనుషులని విడదీయ కండి…!!! ప్లీజ్ …!!!

  28. కె.కె. రామయ్య says:

    “సంప్రదాయిక వివక్షత, అది తీసుకున్న ఆదునిక రూపమూ ,అదునికత పుట్టించిన హిందూత్వ జాతీయ వాదము కల్సి రోహిత్ ను శూన్యం లోకి నెట్టి వేసినాయి ” అంటూ వాగీశన్ గారిచ్చిన వివరణను సహృదయమ్ తో చదవరా వారణాసి రాహుల్ గారూ. చదివి రోహిత్ స్థానంలో మీరో నేనో ఉన్నట్లుగానో, మన ఇంటి బిడ్డ ఉన్నట్లుగానో ఊహించుకుని చూడండి.

    మన మాతృభూమి బిడ్డలైనా దేశ అభివృద్ది ఫలాలలో సరైన భాగానికి నోచుకోని దళితులు, ముస్లింలు, ఇతర అణగారిన వర్గాల పట్ల చిన్న చూపు కాని, ఓ రకమైన శత్రుభావన కాని మనమెందుకు కలిగి ఉండాలి? “ఆధునికత సృష్టించిన విద్వేషా జాతీయత విష ఫలం” గురించి ఇంత గొప్పగా వివరించిన వాగీశన్ గారికి, రాణీ శివ శంకర శర్మ గారికి వినయపూర్వక వొందనాలు.

    రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయిందో అనుమానించండి అంటూ సులువుగా, హేళనగా ప్రశ్నిస్తున్న హరిబాబు గారు, రోహిత్ ఊపిరి ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయిండి అనే మౌలిక ప్రశ్న కూడా ఈ దేశాన్ని అత్యున్నత స్థానం నుండి అణగారిన వెలివాడల వరకూ ప్రశ్నిస్తూనే ఉంది.

  29. సాహితీ says:

Leave a Reply to rani siva sankara sarma Cancel reply

*