నీ పర్యాయ పదం నేను…

 

-మిథిల్ కుమార్

~

1.
ఇలా ఓ తప్త ప్రవాహం,

నీలోకి నేను బట్వాడా అవ్వడం
నన్ను నువ్వు అనువదించుకోవడం
పరస్పరంగా గుండె చప్పుళ్ళని పంచుకోవడం,
ఒక రాప్చిక్ క్షణమే  కదూ…

ఒకలాంటి లిప్తకాంతి
ఇరు మనసుల రాపిడిలో వెలిగి,
నీలిమంటొకటి రాజుకుంటుంది.
అదొక వింటేజ్ దృశ్యం.

2.
కొన్ని ఉద్వేగాలు విరహంలో
ఊగిసలాడుతూ,
తడి పలకరింపుల తచ్చాటలో
తనువుల గుసగుసలు.

భావ సంపర్కాల జుగల్బందిలో
రేయింబవళ్ళు క్షణాల్లో ఇమిడిపోయే యుగాలే మరి

అలా
వ్యాప్తమవుతున్న విరహ కంపనాల్ని
పుట్టించే మది లోలకం.

తెలిసమయాన
మంచుదుప్పటి కప్పుకున్న
పత్తిపువ్వులం మనమిప్పుడు

ఆహ..! ఎంత బావుంది ఇలా చెప్పుకోవడం….

3.
నీ ఉనికి,
చిక్కటి మంచు తెరల్లో
నగ్నదేహపు విహారంలాంటిది నాకు.

మబ్బు నురగల్లో
మునిగి తేలుతున్నట్టి
ఒక రప్చర్  ఇది.

ఇక నా పిడికిలిలోనున్న
సింధూరప్పొడిని
నీ నొసటన పూయడానికి ఆయత్తమవుతున్నాను…….

inamorata..!!!

నేను రాసుకునే స్వప్నలిపిలో
సుధీర్ఘ అధ్యాయానివి నువ్వు,
నీకొక పర్యాయపదాన్ని నేను…….

*

మీ మాటలు

  1. సిద్ధూ says:

    మిథ్ ఆసమ్ 👍👍👍 👌👌👌👌 😍😍😍

  2. Shrutha keerthi says:

    Superb Mithil..All the best..keep writing more..(y)

  3. అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
    తినగఁ దినగ వేము తియ్యనుండు
    సాధనమున పనులు సమకూరు ధరలోన
    విశ్వధాభిరామ వినురమేమ

    తాత్పర్యం-
    అనగా అనగా (అనేక మార్లు ప్రయత్నించుటచే) రాగము వ్రుద్ధి చెందును. తినగ తినగ వేపాకు తియ్యగానుండును. కాబట్టి ప్రపంచంలో అన్ని పనులను ప్రయత్నముచే కొనసాగుచున్నవి. ప్రయత్నము చేస్తే ఏ పని అసాధ్యం కాదు…

    నా తమ్ముడు నిరూపించుకుంటున్నాడు ఇంకా నిరూపించుకుంటాడు.

    నీవు మరిన్ని విజయాలు సాదించాలని కోరుకుంటూ ప్రేమతో నీ కిరణ్ అన్న.

  4. వేరి నైస్ మిథిల్

  5. అన్వేషి says:

    మిథిలూ ప్రతీకలు చాలా అందంగా ఉన్నాయి…ప్రతీవాక్యము మళ్ళీ మళ్ళీ చదివించేలా ఉంది…జీతే రాహో తమ్ముడు…

  6. Portiadevi says:

    నీ నొసట నీవు రాసుకుంటున్న నీ సుధీర్గ అధ్యాయానికి
    పర్యాయ పదం ,వీర తిలకం ,ఈ కవిత
    కీప్ గోయింగ్ ..మితిల్ యు రాక్స్

  7. నీలోకి నేను బట్వాడా అవ్వడం
    నన్ను నువ్వు అనువదించుకోవడం…
    రేయింబగళ్ళు క్షణాల్లో ఇమిడిపోయే యుగాలు…నేను రాసుకునే స్వప్నలిపిలో సుదీర్ఘ అధ్యాయానివి నువ్వు….

    వాహ్ 💚 మిథిల్ పదానికోసారి ప్రేమంతా దోసిళ్ళతో తాగుతున్న తియ్యని అనుభూతి.. చాలా చాలా చక్కని కవితకి అభినందనలు….

  8. bhanutenali says:

    అవును నువ్వు నాకు పర్యాయపదానివి అయితే నీగుండెచప్పుడై నీలో నేనుడిపోతాను..
    నిజంగా అద్బుతం మిథీ ……
    I’m proud of u thammudu…

  9. జాస్తి హరి శ్రీనివాస్ says:

    చాలా బాగా రాసావు మిధిల్, కీప్ ఇట్ అప్.
    నాకు ఒక డౌట్ “తెలిసమయాన” అంటే ఏంటి మిధిల్,అర్ధం చెప్పగలవు.

    • mithil kumar says:

      thanku so much anna…. తెలిమంచు సమయాన ,,,తెలవారు జాము కురిసే మంచు సమయాన

  10. Rama Krishna says:

    నీలోకి నేను బట్వాడా అవ్వడం
    నన్ను నువ్వు అనువదించుకోవడం
    పరస్పరంగా గుండె చప్పుళ్ళని పంచుకోవడం,
    ఒక రాప్చిక్ క్షణమే కదూ…

    ఈ ఒక్క స్టాంజా చాలు నీ కవితలో వస్తువు పై నీకున్న పట్టు… చాలా బాగుంది మిథిల్ ఐ విష్ యు అల్ ద బెస్ట్.. <3

  11. అమ్మ అఖిల్ says:

    ఇక నా పిడికిలిలోనున్న
    సింధూరప్పొడిని
    నీ నొసటన పూయడానికి ఆయత్తమవుతున్నాను…….

    Excellent write up Thammudu.All the best keep writing more…

  12. Md. Ghouse says:

    నీ ఉనికి,
    చిక్కటి మంచు తెరల్లో
    నగ్నదేహపు విహారంలాంటిది నాకు.

    Mithil bhai. పదాలను కసి కసిగా పిండేసి భావా రసాలను ఊరించావు. భలా మిత్రమా!

  13. Jhansi Papudesi says:

    నీ పర్యాయ పదం నేను. ..నైస్ ఎక్స్ప్రెషన్!! కవిత చాలా బావుంది .

  14. ఎప్పటిలానే చిక్కని లాంగ్వేజ్ , చక్కని భావం , నీదైన ముద్ర .. నైస్ మిట్టు

  15. PVGK.Viswanadham says:

    లోతయిన భావావేశం తో మానసిక సంఘర్షణే ఈ నీ ఇ కవిత. మళ్ళి మళ్ళి చదవలని పించే లా సాగింది. మళ్ళి మళ్ళి చదివి నా స్పందనను నీకు
    దృస్యీకరిస్తాను. జనరంజకమయిన నీ కలల రచనలు మరెన్నో నీ కలం నుండి జాలువారాలని ఆశీర్వదిస్తు విశ్వనాధం పాలూరి.

  16. ఒకలాంటి లిప్తకాంతి
    ఇరు మనసుల రాపిడిలో వెలిగి,
    నీలిమంటొకటి రాజుకుంటుంది.
    అదొక వింటేజ్ దృశ్యం – కవిత మొత్తాన్ని ఆస్వాదించి చాలా బాగుందని చెప్పగలను కానీ, ఈ వాక్యాల భావాల్లో అదేపనిగా మునకలు వేస్తున్నానంటే నువు నమ్మగలవా మిథిల్. పై వాక్యాలని పదే పదే చదివే వింత అనుభూతినిచ్చావు థ్యాంక్స్

  17. vani venkat says:

    నీలోకి నేను బట్వాడా అవ్వడం
    నన్ను నువ్వు అనువదించుకోవడం
    పరస్పరంగా గుండె చప్పుళ్ళని పంచుకోవడం,
    ఒక రాప్చిక్ క్షణమే కదూ.. అద్భుతంగా రాశావు ఆల్ ది బెష్ట్ మిథిల్ ….వాణి కొరటమద్ది

  18. మంచుతెరలమాటున చిక్కటి నీ పదాల మంచుదుప్పటి కప్పుకున్న పత్తిపూవునైన అనుభూతి.నీ సుధీర్ఘ కవితాధ్యాయంలో…ఇలా ఒక పర్యాయ పదంగా…అభినందనలతో.

  19. Ivaturi Balatripurasunda says:

    అద్భుత కవితా ఝరి..!

  20. భావాల అభివ్యక్తి లో అద్భుత పరిణతి సాధించారు మిథిల్..
    మరిన్ని మంచి కవితలు ఆశించకుండా ఉండలేకపోతున్నాను.. అభినందనలు..శుభాకాంక్షలు..

  21. శ్రీనీ నందా says:

    గుడ్ lines

  22. WOnderful Mithil
    great going.

  23. lasya priya says:

    ఒకలాంటి లిప్తకాంతి
    ఇరు మనసుల రాపిడిలో వెలిగి,
    నీలిమంటొకటి రాజుకుంటుంది.
    అదొక వింటేజ్ దృశ్యం.
    ఒక్కో పదం అద్భుత సోయగాన్ని హత్తుకున్నాయేమో అనిపించేలా, నిజంగా ఒకలాంటి లిప్తకాంతిలో నిన్ను చదువుతుంటే కవితాకాంతి రాజుకుంది. అదొక అద్భుత దృశ్యమే మరి. సూపర్బ్ మిథిల్

  24. మిథిల్.. కంగ్రాట్స్ .. :) అద్భుతమైన పోయెమ్ ..

  25. వాసుదేవ్ says:

    నేనెప్పుడూ రాసుకునే ఏకైక అమర వాక్యం–“ప్రేమ కవిత్వమెప్పుడూ అమరమె”
    అవును ఎంతమంది ఎలా చెప్పినా ఎలా చెప్పినా ప్రేమకెప్పుడూ దాని స్థానం దానికుంటుంది. పైగా ఎవరైనా ఇలా కొత్తగా చెప్తారనే ఆశతో ఎదురుచూస్తుండే కవితా వస్తువు ప్రేమ. మీరు మళ్ళీ దాన్ని నిజమని నిరూపించారు మీదైన పదాల్లో, వాక్యాల్లో , ముఖ్యంగా శైలిలో! దాదాపు సీనియర్ కవులు కూడా మరో సారి చదివే ఉంటారు ఈ కావ్యాన్ని. ఇక నా బోటీ వాడి లెక్కెక్కడ? అభినందనలు మిథిల్

  26. mithil kumar says:

    thq so much srinivas sir fr ur lovly comnt

Leave a Reply to lasya priya Cancel reply

*