‘అరుణ’గ్రస్త సాగరం

 

-సాయి పద్మ

~

 

వైజాగ్లో బీచ్ ని చూసినప్పుడు , చాలా సార్లు నాకు గుర్తొచ్చేది, పైడి తెరేష్ బాబు “హిందూ మహా సముద్రం’ అరుణ్ సాగర్ వాక్యం .. మొదటిది ఆవేదననీ, రెండోది ఊపిరాడని ఉత్తేజాన్నీ కలిగిస్తుంది.

అరుణ్ సాగర్ గారు నాకు తెలియదు, ఆయనకి ఉన్న భీకరమైన ఫాన్స్ తెలుసు. అక్షరాలద్వారా, ఉన్న పరిచయంతోనే వొక కవికి ఎక్కువ దగ్గరవుతాం, నేను కలుసుకోవద్దు అనుకున్న కవుల్లో కూడా ఆయనొకరు. అయినా ఇంక కలవలేం కదా అనుకుంటే ఎలా ఉందంటే …

“ వొక నిర్వాసిత ప్రదేశంలో, ఎటూ కాని మెలాంకలీ, ఇదీ అని చెప్పలేని వొక జీవిత వీరుణ్ణి మాటల్లో, వొక జీవితాన్ని గ్రాటిట్యూడ్ తో బ్రతికి, విలాసంగా మరణ వాంగ్మూలం మీద, తెలుగు వాక్యం మీద టోర్న్ జీన్స్ వేసుకొని సంతకం పెట్టిన ఒక నాన్నని మిస్ అయిన ఫీలింగ్..”

అందరు కవులూ జీవితాన్ని బ్రతికేస్తారు, తడిగా కొందరు, పొడి పొడి మాటల వొంటరితనాల్లో మరికొందరు. కానీ, వొకరో, ఇద్దరో.. జీవితాన్ని, సెలబ్రేట్ చేస్తారు.

ఊపిరాడని సంధ్యల్లో, ఎటూ కాని ఆరోగ్యంతో బ్రతకటం ఏమిటో నాకు తెలుసు, అరుణ్ గారు, మెడికల్ వండర్ గా బ్రతకటానికి కారణం ఆయనలో ఉన్న అర్బన్ disguise లో ఉన్న ట్రైబల్నెస్ అనుకుంటూ ఉంటాను.

మరో విచిత్రం ఏమిటంటే, ఆయన కవిత్వం ఆశువుగా చెప్పలేం .. కనీసం ఆయన వాక్యాలు కూడా..

కానీ.. తెలుగు కవిత్వం మీద ఆయన సంతకపు సిరా ..ఇంకా ఆరనిదే.. ఇప్పటికే కాదు ఎప్పటికీ

కవిగా కంటే , స్నేహశీలి గా బ్రతికి , నాన్నగా ఇంకా బ్రతికుంటే బాగుణ్ణు అని మీ హితుల్నీ, స్నేహితుల్నీ కరడుగట్టిన దుఖం లో ముంచి వెళ్ళిపోయారు అరుణ్ గారూ..

నిజానికి, నాకు బాధ కంటే , గర్వంగా ఉంది .. జీవితంతో, ఆరోగ్యంతో, కూడా .. దుష్ట రాజకీయాలపై పోరాడినంత ధైర్యంగా పోరాడి, నవ్వుతూ మ్యూజికల్గా మేజిక్ లా వెళ్ళిన వొక కవిని చూస్తే..

అయ్యా.. ప్రభూ.. మీ మ్యూజిక్ కి మరణం లేదండీ.. జీవన్మరణాల స్మరణ వదిలి.. heading towards a desired target of utopian humanity.. that lives and marches taking along vulnerable, sick, and underprevilaged along with it.. Its a song of life.. carefully orchestrated by your sentenses like musican arrows..!!

you are an inspiration Arun Ji.. a True Inspiration for mediocre human race drowning in life.. you are an achoring inspiration for all of us..!

మీ మాటలు

  1. గొప్ప నివాళి. అరుణ్ సాగర్ ని కలవలేకపోయిన అభిమానులలో నేనూ ఒకడిని. ఆయనపుస్తకం పై వ్యాసం వ్రాయాలని ప్రయత్నించి నేను రాయలేకపోయాను అన్న విషయాన్ని ఆయన్ను కలిసి చెప్పాలి అనుకొనేవాడిని. ……. …..

    • సాయి పద్మ says:

      థాంక్స్ బాబా గారూ.. నాకు ఆయన కవిత్వం, వాక్యం వాక్యం గుర్తుండదు , దాని వెనుక ఉన్న తడి.. ఉండీ ఉండీ గుర్తొస్తుంది

  2. excellent..నివాళి Padma గారు
    ఉదయెం tv5.. లో వారి అంతిమ యాత్ర చూస్తూ కన్నీళ్ళు కార్చడం తప్ప ??

    ————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  3. Surendra raju ambati says:

    Ninne chadivaanu. Sagarki mee tribute. You made him more nearer and more lovable …

  4. shrutha keerthi says:

    Great tribute..touching words…:(

Leave a Reply to reddy Cancel reply

*