ఒంటరి దీపం

 

హెచ్చార్కె

~

1

 

అద్దం ముందుకు వెళ్లొద్దెప్పుడూ

ఎదురెదురు అద్దాల ముందుకు

అసలే వెళ్లొద్దు

నీ వెనుక ఎవరో వున్నట్టుంటుంది

ఆ వెనుక ఇంకెవరెవరో వున్నారని

అద్దాలు పిచ్చి పిచ్చిగా అరుస్తాయి

ఎవరి వెనుక ఎవరూ వుండరు

ఒక్కరుగా వుండటం ఇష్టం లేక

ఊహల ఎముకలతో మనుషుల్ని

చేసి, కండరాలిచ్చి చర్మం తొడిగి

నెత్తుల్దువ్వి మూతుల్తుడ్చి బట్టలేసి

వాళ్లు నీతో వుండక తప్పదంటూ

అద్దాలబద్దాల కవిత్వం రాస్తుంటావు

ఏదో ఒక రోజు నీ ప్రతిబింబం నిన్ను

కాదనేస్తే అప్పుడు అపుడేం చేస్తావు

రోబో కి ప్రాణమొచ్చి నీ చేతి నుంచి

రిమోట్ లాగేసుకుంటే

మాంత్రికుడి  చేతిలో చేతబడి బొమ్మలా

నీ ఒక్కొక్క కీలూ విరిచేసి నిన్ను

పొయ్యి లోకి విసిరేస్తే ఏం చేస్తావు

అలా ఒక రోజు దగ్ధం కావడం  కన్న

కన్నా, ఒంటరిగా వుంటం మేలు కదా

దేర్ఫోర్ అన్నిటి కన్న ముందు నువ్వు

పగలగొట్టాల్సింది అద్దాల్నే, అబద్ధాల్నే

 

2

ఒంటరి తనం ఒక పొలం వంటిది

ఎవరో వచ్చి ఏవో కొన్ని విత్తనాలు

చల్లిపోతారు, దారిన పోయే మేఘం

నిలిచి లఘు శంక తీర్చుకుంటుంది

వానపాములు చేసిన సేద్యానికి

నిలువెల్ల పులకించి ఆర్గాస్మిక్

ఎక్స్టసీతో మొక్క

పైన పక్షుల పాటల్ని అందుకోవాలని

చేతులు సాచి, పక్షులకు బెయిట్గా

వ్రేళ్ల కొసలపై విత్తానాలు ధరిస్తుంది

 

3

నీ కోసం కాదు, పక్షుల కోసం

నువ్వు కేవలం ఇన్సిడెంటల్రా

బుజ్జిగా, ఒరే, నువ్వు

వస్తావు పోతావు

పక్షులుంటాయి

వృక్షాలుంటాయి

మేఘాలుంటాయి

వానపాములు కూడా వుంటాయి

ఆకాశం గగనం శూన్యం కాదు

నువ్వే, నువ్వొక సున్నా

నీ విలువ కోసం, పెంచుకోరా నయ్నా

నీ ఎడం పక్కన ఒకటి రెండు మూడు

వేలు లక్షలు కోట్లాది చెట్లనీ పిచికలని

 

*

 

 

మీ మాటలు

  1. Indus Martin says:

    A surrealist’s canvas is beautifully translated into a poem. I was lost in that mirror maze until you found me on your farm with your baits of seeds. Lovely poem .

  2. Thanks a lot Indus Martin. Yes. The plant/tree with its bait of seeds for birds is also me. Only thing is, I request readers not to take mirrors for anything but mirrors which, if put one opposite the other, lie to me that I am many. Only trees (out of those seeds), birds would make me one among many, no more lonely. :-)

  3. rambabu thota says:

    వాళ్లు నీతో వుండక తప్పదంటూ – అద్దాలబద్దాల కవిత్వం రాస్తుంటావు . ఇద్దరి వ్యక్తులలో ఉన్న అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మనుషుల గురించి మనుషులే కల్పించుకున్న విలువలను నిజమని నమ్మించుకోవడానికి, ఒకరికొకరు చేసుకొనే స్వీయ-పరవంచనల సమ్మేళనా ఫలితమే ఈ ఇమేజ్లు, ఐడెంటిటీలు. ……… అర్ధం చేసుకోవాలేగానీ “నేను ఒక ఇన్సిడెంట్” అని అర్ధం చేసుకోవడంలో ఎంత స్వేచ్చ. లేని దానిని నిలబెట్టుకొనే ఈ అనవసరపు జంజాటం నుంచి పూర్తి విముక్తి. ………. ప్రతీ మనిషికి కనెక్ట్ అయ్యే మంచి కవిత.

  4. థాంక్సే లాట్ రాంబాబు గారు. ఆ కాస్త తెలిసి పోతె, ఈ కొట్లాటలు ఏవీ ఉండేవి కావేమో. మనుషుల మధ్య ఇన్ని వైరుధ్యాలు ఉండేవి కావేమో అని ఆశ.

  5. Aranya Krishna says:

    భిన్నమైన భావాల్ని అధివాస్తవికంగా అవిభాజ్యం చేసిన కవిత. బాగుంది సర్. ఒక వైవిద్యానుభూతి.

  6. థాంక్ యు అరణ్య కృష్ణ.

  7. కోడూరి విజయకుమార్ says:

    హెచ్చార్కె ‘ అబద్ధం ‘ కవిత్వం – Updated Version … బాగుంది …. ఇమెజరీస్ కొత్తగా వున్నాయి !

Leave a Reply to హెచ్చార్కె Cancel reply

*