అక్షరమే అష్రఫ్ పోరాటం!

 

తెలుగు సేత : జగద్ధాత్రి

 

సమాన అవకాశాలు

ఒక కొడుకు , ఒక కూతురు

తల్లి కూతురికంటే కొడుకే కావాలని కోరుకుంది

జీవితపు ఒడిదుడుకులన్నింటా కొడుకు తల్లికి తోడుగా ఉంటాడు

కూతురు తనో కొడుకును కంటుంది తనకు దన్నుగా నిలబడేందుకు.

 

ఓ ప్రహేళిక

ప్రేమలో పడటం అంటే నువ్వు ప్రేమించిన ఒకడి చేతిలో పక్షిలా ఉండటం కాదు

పొదలో ఉన్న పది ఇంతకంటే పదిలం

పొదలో ఉన్న ఒక్క పక్షి, చేతిలో ఉన్న పది పక్షులకంటే మెరుగు

పక్షి దృష్టి కోణం నుండి

 

ముగింపులు

కొన్ని సార్లు ప్రేమ, ఉపవాసం ఉన్న వాడికి భోజనం లాంటిది

మరి కొన్ని మార్లు అంగవైకల్యం గల పిల్లవాడికి

సరి కొత్త జత బూట్స్ జత ఇవ్వడం లాంటిది

ప్రేమ, సాధారణంగా , పెద్ద మొత్తం లో

అన్ని వైపులా అందరికి నష్టం కలిగించే బేరం

 

తర్కం

ఆ పాత తలుపులు చప్పట్లు కొట్టాయి

చెట్లతో కలిసి గాలి ప్రదర్శించిన నృత్యానికి మెచ్చుకోలుగా

ఆ పాత తలుపులకి చేతులు లేవు

ఆ చెట్లు ఏ నర్తన శాలకూ వెళ్ళి ఉండలేదు

చెట్లతో కలిసి నృత్యం చేస్తున్నా సరే

అగుపించని జీవి గాలి

 

(అష్రఫ్ ఫయాధ్ సౌదీ అరేబియా లోని యువ కవి. మతానికి వ్యతిరేక కవిత్వం రాశాడన్న నేరం పై మరణ శిక్ష విధించబడిన వాడు. ఇప్పుడు మరణ శిక్షని తగ్గిస్తూ 8 సంవత్సరాలు జైలు శిక్ష , 800 కొరడా దెబ్బలు గా శిక్ష ఖరారు చేసేరు. మనం ఉన్నది మనుషుల లోకమేనా ఒక యువ మేధావికి, కవికి ఇలాంటి శిక్షా అని ప్రపంచం మొత్తం ఈ శిక్షని వ్యతిరేకిస్తోంది. )

నాలుగు చిన్న కవితలు అష్రఫ్ ఫయాధ్ వి: Equal opportunities , An aphorism, Conclusions, Logic   అరబిక్ నుండి ఆంగ్ల సేత జొనాథన్ రైట్

*

 

 

మీ మాటలు

 1. చందు తులసి says:

  ఏ రాజ్యమైనా…తనను ప్రశ్నించే గొంతుకను నులిమేయాలనే చూస్తుంది.
  అది ఏ మత మైనా కావచ్చు. వాస్తవానికి రాజ్యానికి మతముండదు. మతం రాజ్యం వేసుకునే ముసుగు. దాని అసలు ముఖం… దోపిడీ.
  అష్రఫ్ లాంటి వాళ్ల త్యాగాలతోనైనా…అక్కడి జనం కళ్లు తెరిస్తే బాగుండు.
  జగద్ధాత్రి గారూ….మీకు ధన్యవాదాలు

 2. వాసుదేవ్ says:

  “ఆ పాత తలుపులు చప్పట్లు కొట్టాయి

  చెట్లతో కలిసి గాలి ప్రదర్శించిన నృత్యానికి మెచ్చుకోలుగా”
  చిన్నవైనా గొప్ప వాక్యాలు కదా జగతీ. కొత్త గొంతు”కలని” నొక్కేయటం చరిత్రలో ఇది మొదటిసారి కాదులే.

 3. అష్రాఫ్కి అభినందనలు. చక్కటి కవిత్వం !

మీ మాటలు

*