ఆమె ముందడుగు!

 

రచన: శివి సింగ్
అనువాదం: ఇంద్రప్రసాద్
 

నేను ఇవాళా , రేపూ కూడా సంతోషంగానే ఉంటాను ‘ సింక్ మీద వేళ్లతో చప్పుడు చేస్తూ నెమ్మదిగా అనుకొంది.

‘ఇదంతా యీ ప్రక్రియలో  భాగమే. నీ మనసుకెక్కేటట్లు ధైర్యం చెప్పుకోవాలి. గతాన్ని మర్చిపోతూ వర్తమానంలోకి రావడానికి వేసేచిన్న అడుగిది.’ ఎన్నిసార్లు వినలేదు? ప్రతీ అరకొర డాక్టరూ ఇదే మాట చెప్పేవారు. రంగులేని ఆస్పత్రులలో  ఎన్నిసార్లువిన్నట్లు నటించలేదు?

కాటన్ చొక్కా వేసుకొని, బాగ్ నిండా కాఫీ పొట్లాలతో కూర్చున్నావిడ ముందర ఎన్ని శనివారం మధ్యాహ్నాలు గడపలేదు? ఆవిడేమిటి అందరూ అంతే.  మానవమస్తిష్కంలో చెలరేగే శబ్దంలేని అలజడులన్నీ ఫైనలియర్ మెడిసిన్ పుస్తకాల్లో చదివేసేంఅని ఎంత ప్రదర్శన?

వాళ్లు చెప్పిందంతా నమ్మినట్లు నటించాలనీ, ఆకుపచ్చని చీటీలన్నీ ఎగిరిపోతూంటే చూడాలనీ….

 బట్టలు సవరించుకొని ముఖానికి నవ్వు పులుముకొని ఆలోచనల్నించి బయటకొచ్చి అద్దంలో చూసికొంది .  ఆద్దం తననిజాన్నెప్పుడూ బయటపెట్టదు. చుట్టూరా ఒక్కసారి దృష్టి సారించింది. లేడీస్ రూము నించి వరండా కొసదాకా నడిచింది.

‘గతం అందరికీ ఉండేదే. తలుచుకొన్నప్పుడు తెలుస్తుంది దాని అందమేమిటో. గతంలో జీవిద్దామనుకొంటున్నమా, తొంగిచూసి వస్తున్నామా అన్నదాన్నిబట్టి ఉంటుంది దాని అందం.’

1997 వేసవిలో అంతర్రాష్ట్ర పోటీల్లో మా జట్టు (ఈగిల్స్) గెలుపు అందరూ చెప్పుకున్నదే. మెచ్చుకున్నదే. ఒక చిన్న పట్టణంనించి వచ్చిన జట్టు గెలుపొందడం నిజంగా గొప్ప విశేషమే.

17 ఏళ్ల వయసులో పల్లెటూరి అమాయకత్వంతో ఎంత మెరుస్తూ ఉండేది? జుట్టు ముడి వేసుకొని సరదాగా అమ్మ చీర కట్టుకొన్న రోజు ఎంత అందంగా కనిపించేది . అందరి కాలేజి పిల్లల్లా జీను పాంటు వేసుకొని పాటలు వినే పిల్లని హుషారుగా తుళ్ళింత లాడే  చిన్న పిల్లలా అనిపించేది కాదు ఆ సౌందర్యమే వేరు.

Akkadi MeghamFeatured

ఆ వేసవి లోనే, అంత ఉల్లాసంగా ఉన్న రొజుల్లోనే జరిగింది.  ట్రాక్టర్  వెనుకభాగంలొ నిశ్చేతనంగా కాళ్లు రెండు తెరుచుకొనికనిపించింది , ఎవరికీ ఎలా జరిగిందో తెలియలేదు , ఎవరికీ తెలుసుకోవాలని శ్రద్ధ కూడా లేకపొయింది ,  ఆట జరిగిన రోజురాత్రి. ఎప్పుడు దూరమయ్యిందో, ఎలా అందరి నించీ విడిపోయిందో ఎవరు ఏం చేసేరో … తనని తానే కోల్పోయింది.

నగరంలో అందరినోటా తన కథే, తన గుణగణాల గురించే. వేరే ఎవరు దోషులు? ఎవరికీ తెలియదే.. ఎవర్ని తప్పు పడతారు.

ఎవరో వస్తున్నారు. బాగా డబ్బున్న మనిషిలా ఉంది

నెమ్మదిగా వచ్చి కూర్చొంది ముందు కుర్చీలో కాగితాలు సర్దుకొంటూ సంశయంగా చూస్తూ.

“గుడ్ మార్నింగ్. నేనే డాక్టర్ని. చెప్పండి.”

(19ఏళ్ల శివి సింగ్  ప్రస్తుతం  పూనె ఫెర్గుసన్ కాలేజి లో సొషియాలజి మేజర్తొ రెండొ సంవత్సరం డిగ్రీ  చదువుతున్నారు. 8 ఏళ్లవయసునించీ రచనలు చేస్తున్నా రు. కథ 2002లో viewspaper.netలో ప్రచురితం.)

మీ మాటలు

  1. Radha Manduva says:

    అద్భుతం ప్రసాద్ గారూ… ఇంత గాఢత కలిగిన కథని ఇన్ని తక్కువ మాటలతో రాయడం – నిజంగా అద్భుతం. గతంలో జీవిద్దామనుకొంటున్నామా, తొంగిచూసి వస్తున్నామా అన్నదాన్నిబట్టి ఉంటుంది దాని అందం …. వావ్. అభినందనలు.
    “గతంలో జీవిద్దామనుకుంటున్నామా… ” – ఈ ఒక్క లైన్లోనే ఉంది కథంతా… చాలా చాలా బావుంది. ఆయన రాసిన మిగతా కథలనీ చదవాలనిపిస్తోంది. :) :ద

  2. indraprasad says:

    థాంక్స్ రాధ గారూ

  3. ఇలాంటి కథలు బాధ పెడతాయి.. మనసుని పిండేస్తాయి. ఇంకేమీ అనటానికి ఉండదు.

  4. indraprasad says:

    మీరన్నది నిజం.

  5. చొప్ప వీరభధ్రప్ప says:

    ఇంద్రప్రసాద్ గారి ఆమె ముందడుగు అర్థవంతమైంది. నా గుండె లోతుల్లో ఎక్కడో గా ఢంగా కు చ్చు కున్నట్లైంది.మనస్సు పొరల్లో చెప్పలేని అలజడి గమ్మింది.ఇట్లాంటి సంఘటనలు పునరావృతమౌతూనేవున్నాయి.గుర్తు గుర్తులో కన్నీటి ఝరులే.నిశ్శబ్దమౌనమావహించింది. ఆమె వలె కన్నీటి చుక్క కన్ను ల్లోనే యింకిపోయింది.తప్పలేదు తప్పదు. గతంగడచింది. వర్తమానముంది. భవిష్యత్తూవుంది.ఈ రోజు సంతోషం గా గడచినప్పుడు . రేపటికి దిగులెందుకు.అందుకే నేమో మనస్సు ను కష్టపెట్దడ మెందు కని ఆనందంగా నవ్వేసింది. మనోనిబ్బరతతో గతాన్ని తపుక్కున మూసేసి ముందుకు అడుగేయాల్సిందే .ఎవరికీ పట్టనప్పుడు,ఎవరికీ ఎలా జరిగిందో తెలియనప్పుడు,తనదితప్పు కానప్పుడు ,భయపడాల్సిన పనిలేదు.మసిబట్టింది మనస్సనుకుంటే బలహీనత అనే సర్పం చుట్టుకుంటుంది. దాని తో చుట్టించుకోవడమెందుకు .ఆ అలజడిని జాడించి తన్నేయాల్సిందే .దీనికి మనోనిబ్బరత కావాలి తప్పదు. ఓర్పు మరపు అన్నిగాయాలకు మందు. గిలివదలితే .అన్నీ కాలమే గా యాల్ని మాన్చేస్తుంది..మూల రచయితను తెలియదు.సున్నితమైన విషయాన్ని సుందర ంగా చెప్పారు. మరి కొన్ని మీ కలం నుండీ జాలువారాలని మనసారా . ఆకాంక్ష..

  6. indraprasad says:

    థాంక్స్ వీరభద్రప్ప గారూ . మీ మెచ్చుకోలుకు నెనర్లు

Leave a Reply to Radha Manduva Cancel reply

*