రోహిత్  కోసమే  కాదు…

 

 

 

-అఫ్సర్ 

~

 

1

నొప్పెడుతుందని చెప్పుకోలేని

వొకలాంటి రాత్రిలోంచి  యింకోలాంటి  రాత్రిలోకి వెళ్లిపోయావే తప్ప

రెండు కలల మధ్య  చావుని మాత్రమే అల్లుకుంటూ పోయావే తప్ప

యెవరి చీకట్లోకి నువ్వు

నీ దేహంతో సహా గబుక్కున దూకేశావో,

యెవరి గోడల్ని

పిడిబాకులాంటి  పిడికిళ్ళతో బాదుకుంటూ వుండిపోయావో

ఆ రాత్రికో ఆ వొంటరి తనానికో

యిప్పుడు నీడగా అయినా  కన్పించని నీకో తెలుసా?

 

2

మరణంలో మాత్రమే

నిన్నూ నన్నూ యెవరినైనా పలకరించే

పరమ లౌక్య లౌకిక లౌల్యంలో వున్నవాళ్ళం కదా,

నువ్వున్నంత కాలమూ ప్రతి క్షణమూ  కన్పించని/ కన్పించనివ్వని

తెలియని/ తెలియనివ్వని

లెక్కలేనన్ని గోడలకి మాత్రమే చెప్పుకున్న కథలన్నీ

నిస్సహాయ అంతః శోకంలో పంచుకున్న కేకలన్నీ

యిప్పుడే విన్పిస్తున్నాయా నాకూ నా లోకానికీ?

 

3

అద్దాలు అడ్డం పడుతున్నాయి నిజాలకి,

విదూషకుడి మాయవరణంలో నువ్వొక అబద్దమై రాలిపడుతున్నావ్!

కచ్చితంగా నువ్వు గుర్తు పట్టినట్టే

నీ గుర్తులన్నీటికి మకిలి పట్టించాక

నువ్వేదో అంతుపట్టవు యీ  కళ్ళల్లో!

 

యీ  పూటకి

కాసింత  కాలాన్ని చంపే దృశ్యమై తేలిపోతున్నావ్ నువ్వు

యీ  గుడ్డి చూపుల దర్బారులో!

ఏదో వొక దృశ్యమేగా యీ  కంటి మీద  వాలాలి

ఆ తరవాతి మత్తు నిద్రకి మాత్రలాగా-

 

4

జీవితం యింకాస్త అందంగా

యింకాస్త ప్రశాంతంగా

యింకా కాస్త నిర్మలంగా వుంటే బాగుణ్ణు అనుకొని

నిన్నటి నిద్రలోకి జారిపోతూ యీ  పొద్దుటి కల రాసుకుంటూ వున్నానా

అదే  అరక్షణ శకలంలో  నువ్వు

చివరి పదాల ధిక్కారాన్ని వాక్యాలుగా పేనుతూ వున్నావ్,

కొండని పిండి చేసే ఆగ్రహమై కాసేపూ

అంత ఆగ్రహమంతా నీటి చుక్కయి రాలిపోయే నిట్టూర్పువై ఇంకాసేపూ-

 

5

యీ పొద్దున్న

యింకో సారి అద్దం కూడా నవ్వింది

నీకు నువ్వు తెలుసా అని!

నీలోపల పేరుకుపోతున్న ఆ పెదవి విప్పని  చీకటి పేరేమిటి అని!

 

నీ చూపు చివర

వైఫల్యమనే మాయలాంతరొకటి యింకా  కాచుకునే వుంది, చూశావా? అని-

 

యింకోలాగా  మాట్లాడలేనందుకు నువ్వు క్షమిస్తావో లేదో కాని

యింతకంటే నిజం యింకోలా లేనందుకు

యివాళ

యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను-

 

*

 

 

 

మీ మాటలు

 1. బ్రెయిన్ డెడ్ says:

  ఇంకోలా మాట్లాడే అవకాశమే లేదు . ఈ దేశపు మనువారసుల చేతిలో విషాద మరణాన్ని ఇంతకంటే ” యివాళ యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను ” చెప్పే పరిస్థితే లేదు ఖచ్చితంగా . అవసరమయిన సమయంలో ముడుచుకుపోని మీ కలం నాకెప్పుడు స్పూర్తే .

 2. Kcube Varma says:

  యివాళ

  యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను-

  చావు వెనుక దాగిన సత్యాన్ని చీకటి వెనక దాగిన వెలుగుని చూపారు. చస్తే తప్ప గొంతు దాటి రాని మూలుగు. రోహిత్ కు అశ్రు నివాళి..

 3. కన్నీటి చుక్కల్నీ , ఆగ్రహ జ్వాలల్నీ ఒకేసారి అక్షరాల పంచలో నిలబెట్టారు . మనసుతో రాసిన కవిత, నిలువరించి, నిగ్గదీసి నిజాల్ని వివరిస్తూ . అద్భుతంగా ఉంది సర్

 4. రాధ మండువ says:

  ఈ శరీరమంతా బాధతో సలుపుతోంది… అమ్మ గుర్తుకు రాలేదా? ఎంత నిర్దయ? అని అడగాలని ఉంది.

 5. Rammohanrao says:

  అఫ్సర్ గారు దేహం లోని అణువులన్నీకదిలించే పోయెం.ఇంత కంటే ఎక్కువ రాయలేను.

 6. balasudhakarmouli says:

  ఉన్నట్టుండి రోహిత్ లాంటివాళ్లు కవిత్వంలోకి తర్జుమా కావడం నచ్చుతుంది – నచ్చట్లేదు.

 7. అఫ్సర్ గారు దేహం లోని అణువణువునూ కదిలించే పోయెం.

 8. Delhi Subrahmanyam says:

  ” యివాళ యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను ” చాలా సరిగ్గా చెప్పారండి అఫ్సర్ గారూ. నిజానికి ఇవాళ మనలాంటి వాళ్ళ అందరి శరీరాలు వురితాడై సలుపుతున్నాయి.

 9. Narayanaswamy says:

  చాలా బాగుంది అఫ్సర్

 10. Jhansi Papudesi says:

  యీ పూటకి

  కాసింత కాలాన్ని చంపే దృశ్యమై తేలిపోతున్నావ్ నువ్వు

  యీ గుడ్డి చూపుల దర్బారులో!

  ఏదో వొక దృశ్యమేగా యీ కంటి మీద వాలాలి

  ఆ తరవాతి మత్తు నిద్రకి మాత్రలాగా-

  Very true and very sad 😦

 11. indra Prasad says:

  వైఫల్యమనే మాయలాంతరొకటి యింకా కాచుకునే వుంది, చూశావా? బ్రిలియంట్

 12. “ఈ పొద్దున ఇంకోసారి
  అద్దం కూడా నవ్వింది
  నీకు నువ్వు తెలుసా అని
  నీలోపల పేరుకుపోతున్న
  ఆ పెదవి విప్పని చీకటి పేరేమిటి అని”

  అఫ్సర్ గారు, చీకటి వెలుగుల సంగమంలో మరణానికి ముందు అతనిలోని, అతని మరణం తరవాత మనలోని అంతర్గత సంఘర్శణ మీ వాక్యాల్లో…

 13. SRINIVASU GADDAPATI says:

  నువ్వు క్షమిస్తావో లేదో కాని

  యింతకంటే నిజం యింకోలా లేనందుకు

  యివాళ

  యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను-

 14. chandrika says:

  పఠాన్ కోట్ లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కి ఒక్క నివాళి లేదు ఈ పత్రిక లో.
  చదువుకొమ్మని తల్లి తండ్రులు కాలేజికి పంపుతుంటే , ప్రభుత్వం ఉచితం గా అన్ని సౌకర్యాలు కలిగిస్తుంటే ఆ విలువ తెలియ కుండా ఆ ఇజం ఈ ఇజం అంటూ ఒక టెర్రరిస్ట్ కోసం ధర్నా లు చేసి బలవంతపు మరణం చెందిన ఇతనికి ఇంత కవిత అవసరమా ? ఈ కవిత ద్వారా మీరు యువతరానికి ఏం సందేశం ఇస్తున్నారు ?

  • వెల్ said

  • ఎ కె ప్రభాకర్ says:

   ” మీ ఆధిపత్యాలు కాపాడుకోడానికి ఉరి తాళ్ళు పేని మా మెడలకి తగిలించకండి” – కాషాయం కషాయం తాగి దేశ భక్తి మత్తులో తూగుతున్న యువతరానికి ఇదీ సందేశం . వినే సహృదయత వుంటే స్వీకరించండి.

   • కషాయం వంటికి మంచిదే కదా !! అంటే టెర్రరిస్ట్ ల కోసం సమయం వృదా చేసుకుంటూ, ఉచితం గా ఇచ్చే సౌకర్యాలు వృధా చేస్తూ దేశానికీ ఏ contribution ఇవ్వలేని వారి కోసం కవిత వినే సహృదయత నాకు లేదు. స్వీకరించలేను. అది అవకాశం ఉంది కాబట్టే చెప్పాను.

  • @చద్రిక

   మీరు రాసి పంపించకపోయారు, వేసుకొనే వాళ్ళు.

   పటాన్కోట్ గురించి బోలెడంత coverage వచ్చింది, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, visual మీడియా లొనూ. ఇందులో వచ్చిందో రాలేదో ఎవరిక్కావాలి? ఇది ఒక చిన్న వెబ్ పత్రిక. ఉద్యోగాలు చేసుకుంటూ, ఖాళీ టైం ని. వెచ్చించి నడుపుతున్న పత్రిక. సమగ్ర వార్తా పత్రిక కాదు.

   పబ్లిష్ ఐన విషయం గురించి మాట్లాడండి. అదీ, పూర్తి వివరాలు తెలుసుకొని.

 15. Prof P C Narasimha Reddy says:

  Is it mandatory that one should respond to all the happenings in the country ? Prosaic minds may not feel as the poetic hearts do ! The anguish that engulfs the whole has to seek a proper ventilation !!! – Prof PCNReddy

  • Chandrika says:

   That is what I don’t understand why these poetic hearts don’t feel so much major incidents happen? Is Pathankot incident a small ignoring incident? What kind of inspiration is this guy for the youth? Why everyone media/FB are giving so much attention to this incident?

 16. బ్రిలియంట్ పొయెటిక్ ట్రిబ్యూట్ సర్

 17. చంద్రిక గారు, నిజమే ఆ ఇజం, ఈ ఇజం ఎందుకు; పుట్టుక నుండి చావు దాక బ్రాహ్మనిజాన్ని మోస్తూ ఎందుకు పుట్టామో ఎందుకు చచ్చామో తెలువకుండ పోతే ఎంత సౌకర్యం! ప్రేమిస్తూ బతికితేనే కదా బాద, నొప్పి. ద్వేషమే బతుకయితే ఏ బాదా వుండదు. అమ్మో అంబేడ్కర్ ను చదువుతారా? అతనో తీవ్రవాద సిద్దాంతకర్త. బతికుండగ చంపలేదు కాబట్టి. చచ్చాకైనా చంపాల్సిందే. మెడకు ఉరితాడు వేయ్యాల్సిందే. మనం బాగా బతకాలంటె, ఈ ఇజాలన్ని చావాల్సిందే. తెలివి నేర్చుకుంటారా? నాలుకలు తెగిపడుతవి. నిజమే, రోహితులు (ఇప్పుడు రోహిత్ ఒక సర్వనామం కాదు, ఏకవచనం అంతకన్నా కాదు) చస్తే, నీవు మనిషివే అయితే, కండ్లు పీకేసుకోని, చెవులో ఇంత శీసం పోసుకోని, నాలుక తెగకోసుకోని, చేతులు నరుక్కోని బతకాలి కాని, ఇంత కవిత రాస్తారా? “దేశభక్తులు” ఏది చెప్తే అది రాయండి. తలలను, జాతి “తలరాతను” తాకట్టు పెట్టండి.

  చివరగా, అఫ్సర్ తొ ఒక మాట: దేహం మాత్రమే కాదు, దేశమే ఉరితాడై సలుపుతుంది.

  • ఒక కరెక్షన్: (ఇప్పుడు రోహిత్ ఒక నామవాచకం కాదు, ఏకవచనం అంతకన్నా కాదు)

  • Chandrika says:

   ఎందుకండీ అంత ఆవేశం మీకు? నెలకి 25000 stipend, దేశం లో మంచి విశ్వవిద్యాలయం లో చదువు అతనికి అంబేద్కర్ కి గారు పెట్టిన బిక్ష. ఆ అవకాశం ఎంత మందికి ఉంటుంది ? భారతదేశం లో ఏ ‘ఇజం’ వంద కి 70 మార్కులు వచ్చే general category వాళ్ళకి తల్ల క్రిందులుగా తపస్సు చేసినా అలాంటి అవకాశం ఇవ్వదు. వాడు పెట్టె బేడా సర్దుకుని దేశం వదిలి వెళ్ళాల్సిందే. అలాంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించకుండా ఆయన పేరు పెట్టుకుని తన చదువు కి కేటాయించాల్సిన సమయాన్ని దేశ ద్రోహులుల కోసం వినియోగించటం వలన అంబేద్కర్ కి ఏ విధం గా న్యాయం చేసాడు ఇతను? ఈ ఆవేశం చలికి వణుకుతూ మిమ్మల్ని కాపాడే ఆ సైనికుల కోసం వినియోగించండి. దేశం లో చాలా మార్పు వస్తుంది.

   • హలో చంద్రిక గారు,

    ఇక్కడే మీ అహంకారం బయటపడుతోంది. రోహిత్ కి మెరిట్ తో UOH Ph . D . అడ్మిషన్ వచ్చింది. రిజర్వేషన్ తో కాదు. “అంబేద్కర్ భిక్ష “తోనో, మీ భిక్ష తో నో రాలేదు.

    విషయం తెలుసుకోకుండా నోరు పారేసుకోతానికి రెడీ.

   • అపర్ణ says:

    “అంబేద్కర్ కి గారు పెట్టిన బిక్ష..” :) :) :) మీకు రోహిత్ బంధువని మాకసలు తెలీనే తెలీదే. అతని స్కోర్ ఏంటో తెలుసా మీకు?

    “భారతదేశం లో ఏ ‘ఇజం’ వంద కి 70 మార్కులు వచ్చే general category వాళ్ళకి తల్ల క్రిందులుగా తపస్సు చేసినా అలాంటి అవకాశం ఇవ్వదు. ” ఇదేనా మీ బాధ? ఐతే సరైనదే లెండి. అక్కడితో ఆగితే మంచిదే!

    “అలాంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించకుండా..” సక్రమం అంటే ఏమిటో కాస్త సెలవిస్తారా? మేమంతా నేర్చుకుంటాము.

    “ఈ ఆవేశం చలికి వణుకుతూ మిమ్మల్ని కాపాడే ఆ సైనికుల కోసం వినియోగించండి. దేశం లో చాలా మార్పు వస్తుంది.” సైనికులపట్ల ప్రేమలేదన్నవారెవరు? ప్రాణం విలువ ఎక్కడైనా ఒకటే. రోహిత్ చనిపోవడం కన్నా, ఏ కారణం వలన చనిపోయాడో తెలుసుకుంటేనే బాధకలుగుతోంది. మనసు ఎంతో దుఖ్ఖపడితేగానీ ఇలాంటివి రాయలేము. అబద్ధపు రాతలు మిమ్మల్ని అలరినచడానికి రాయలేముగా..

    ఇంకో చిన్న రిక్వెస్ట్. దళితవాదానికి సంబంధించి కాని, అంబేద్కర్ కి సంబంధించి గానీ ఏమైనా చదివారా? మన దేశం లో సెన్సెక్స్ లెక్కలు దయుంచి ఒకసారి చూస్తారా? అందులో అట్టడుగు స్థాయిలో ఉన్న కులాల ఆర్ధిక స్థితి ఏంటో తెలుసా? సామాజికంగా వారు గురయ్యే వివక్షకు ఎదురైన వారిలో మీకెవరైనా స్నెహితులు ఉన్నారా? వారి అనుభావాలేప్పుడైనా సహానుభూతితో విన్నారా? ఎప్పుడైనా ఒకసారి వారితో మళ్ళీ మాట్లాడండి.

    రోహిత్ ఆర్ధిక బలం ఏంటో మీకు తెలుసా. పాతికవేల మెరిట్ స్టైపండ్ కాక అతనికి ఉన్న ఆస్తులెన్నో తెలుసా మీకు? యాకుబ్ మెమన్ ను ఎందుకు సపోర్ట్ చేసారో ఎప్పుడైనా అటు తిరిగి ఒక వ్యాసమైనా చదివారా?

    క్షమించండి. ఎదిగే దశలో నేనూ ఇలాగే అమాయకంగా మాట్లాడానేమో అని ఎన్నిసార్లు అనుకున్నా…ఆగలేకపోతున్నా..!

    .

   • అపర్ణ says:

    “ఎదిగే దశ” అంటే నేనిప్పుడు ఏదో పొడిచేసే స్టేజ్ కి వచ్చానని కాదు. కొన్ని పొరలు విడాయి. ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది. కానీ ఇప్పుడు తెఇసినదానికన్న తక్కువ తెలిసిన సమయమంటూ ఒకటైతే ఎప్పటికీ ఉంటుంది.

   • Wilson Sudhakar says:

    దేశం విడిచి వెళ్ళాలన్న పిరికివాళ్ళతో ఏమ్వాదిస్తాం? జనరల్ వారికీ రిజర్వేషన్ వాళ్ళకీ ఇప్పుడు కటాఫ్ మార్క్ 5 శాతమే. ప్రతిభ వంకన జనాభా మొతాన్నీ తోసేసి మొత్తం 100 శాతం ఉద్యోగాలు సీట్లు
    కొ న్నికులాలు కొట్టేయడం న్యాయమా. నీకు ప్రతిభ ఉంటే నీ ఇంట్లో ఉంచుకో. దొడ్లో పాతేసుకో.
    దేశం మీదపడి మొత్తం మాకే కావాలనడం దు ర్మార్గం.
    అవునూ ఎవరు దుర్మార్గులు? ఎవరు దేశద్రోహులు? వేల వత్సరాలు అంటరానితనం పాటించి దళితుల మానప్రాణాన్ని దోకున్న కులాలు దేశ ద్రోహులు..

 18. పీ సి నరసింహారెడ్డి గారితో యేకీభవిస్తున్నాను .
  అఫ్సర్ గారూ , సారంగ లో రచనలు మీతో చెప్పి సౌజన్యం తో అంటూ ప్రజాసాహితి లో ప్రచురించుకోవచ్చా?

  • రవి బాబు గారు, అలాగే…ప్రజాసాహితిలో ప్రచురించవచ్చు, రచయితలకి కూడా ఆ విషయం తెలియజేయండి.

 19. కె.కె. రామయ్య says:

  రోహిత్ కు అశ్రు నివాళి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మనస్తాపంతో ఈ నెల 17వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన దళిత విద్యార్థి వేముల రోహిత్ కి అశ్రు నివాళి.

  కుల రాజకీయాలతో విశ్వవిద్యాలయాలు భ్రష్టుపట్టిపోతున్నాయనే విమర్శల నేపధ్యంలో ( ఓ సామాజిక వర్గానికి చెందినవారు విశ్వవిద్యాలయాల్లోని ఉన్నత పదవుల్లో ఉండడం వల్ల దళితులకు అన్యాయం జరుగుతుందనే వాదన … అడ్మిషన్ల నుంచి వైస్ చాన్సలర్ వంటి ఉన్నత పదవుల వరకు రాజకీయ జోక్యం అడుగడుగునా విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తోందనే వాదన నేపధ్యంలో ) యూనివర్సిటీలు ఎలా ఉండాలో మేనిఫెస్టోలు రూపొందించ మని ప్రజా కవి గద్దర్ డిమాండ్ చేసారు.

  దళిత విద్యార్తి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో సంభవించిన పరిణామాలను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి చేతులు దాటిపోతుందని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించారు.

 20. sudheer balla says:

  రోహిత్ దళితుడు కాదు , వడ్డెర కులానికి చెందిన వాడు , ఒక రైస్ మిల్లు అధిపతి కుమారుడు , మా వూళ్ళో వున్న వంద వడ్డి కుటుంబాల జీవన విధానం , సంపద చూసిన తర్వాత నాకు అతని కులం కారణం గా జాలి చూపించడం తప్పు , పాపం , నీచం …. ఒక మనిషిగా అతనిమీద నాకు జాలి వుంది కానీ కులం కారణం గా కాదు ….. ఆటను ఒక యూనివర్సిటీ లో చదువుతున్నాడు , ఎఅదుఐ మంచో , ఎఅది చెడో తనకి తెలుసు …… మీరు వూరికే ఓవర్ ఆక్షన్ చెయ్యకండి

  • ఇప్పుడు ఈ “దేశభక్తుల” బాదంతా రోహిత్ నీలి రంగు వురితాడు హిందూమతొన్మాదానికి వేసిపోయిండనే. కులగజ్జిగాళ్ళ కుతికలకు బిగించిపోయిండనే. అది బిగుసుతావుంటే విషం రకరకాలుగ బయటకు కక్కుతావుంటరు. బ్రాహ్మనిజం అంటే ఏంటి అని అమాయకంగా అడిగారు కదా, ఇదే అది: అహంకారం, ఆదిపత్యం, అమానవీయం. పురోహితులు మంత్రాలు చదవాలి, రోహితులంతా ముక్కు పట్టుకొని “మమ” అంటూ బతికేయాలి. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తే, అది స్వామిభక్తి, దేశభక్తి. యాకూబ్ దేశద్రోహి అయితే దానిగురించి ఒక అఫ్సరే ఎందుకు రాయాలి? మీకు అంత ఆనందంగా వుంటె మీరే వాయొచ్చు. ఎవరైన ఎందుకు రాసావని అంటారా? అయినా ఎవరు ఏది రాయాలో, రాయకూడదో చెప్పే సాహసం చేయకండి. మా కలాలలో అణచబడ్డ బిడ్డల నెత్తురుంది. అది తడి ఆరకుండ కాపాడితేనే మా జాతులు బతికేది. సూత్రపాయంగా, ఉరిశిక్ష సరైనది కాదని, అది నేరాలను ఆపే సాదనం కాదని ప్రపంచంలో ఎంతో మంది నమ్ముతున్నారు. అందులో రోహిత్ ఒకడు మాత్రమే. కలాం గారు కూడా నమ్మారు. అయనను కూడా దేశద్రోహిని చేద్దామా? ఇప్పుడు చెయ్యాల్సింది ఈ చౌకబారు చర్చ కాదు. రోహిత్ ఒక చారిత్రిక సంఘటన మాత్రమే. చర్చ లక్షలాది రోహితుల గురుంచి. వేల సంవత్సరాలుగా సాగుతున్న కుల ఆదిపత్యం గురుంచి. అగ్రహార దురహంకారం గురుంచి. అందుకే ఈ కవిత కేవలం “రోహిత్ కోసం (మాత్రమే) కాదు.” కాస్త మనుషులుగా ఆలోచించండి.

  • kothapalli ravibabu says:

   రోహిత్ తల్లి దళితకులం .తండ్రి వడ్డెర. రోహిత్ తల్లి కులం స్వీకరించాడు. రోహిత్ తమ్ముడు వడ్డెర కులం స్వీకరించాడు. చట్టం ప్రకారం ఇది న్యాయేమే.

 21. Sreekanth sodum says:

  హంతక స్వభావమున్న రాజ్యం …నేరం బాధితునిపై మోపడాని ఎన్ని కుట్రల్ని పన్నుతందో ఇప్పుడు లైవ్ గా చూడొచ్చు.

 22. THIRUPALU says:

  //మరణంలో మాత్రమే
  నిన్నూ నన్నూ యెవరినైనా పలకరించే
  పరమ లౌక్య లౌకిక లౌల్యంలో వున్నవాళ్ళం కదా,
  నువ్వున్నంత కాలమూ ప్రతి క్షణమూ కన్పించని/ కన్పించనివ్వని
  తెలియని/ తెలియనివ్వని
  లెక్కలేనన్ని గోడలకి మాత్రమే చెప్పుకున్న కథలన్నీ
  నిస్సహాయ అంతః శోకంలో పంచుకున్న కేకలన్నీ\
  యిప్పుడే విన్పిస్తున్నాయా నాకూ నా లోకానికీ?//
  అద్బుతం సర్,
  ఆనాడు ‘అసుర’ అని పేరు పెట్టారు. ఈనాడు ‘ జాతి వ్యతిరేకి’ అంటున్నారు

 23. sudheer balla says:

  ఒక యూనివర్సిటీ విద్యార్థి కి తన బ్రతుకు మీద ఆస కోరిక , ఆశయం , భయం , భక్తీ వుంటే … ఇలాంటి పనులకు ఎందుకు దిగుతాడు , ఆటను యూనివర్సిటీ లో ఎం చేసాడు …… సరదాకి ఎవరు restogate చెయ్యరు కదా ….. ఒక బాద్యత గా నాణానికి రెండు వైపులా చూడండి ………… అతను దళితుడని తనని restogate చేసేస్తారా ….. మీరు జనాభాలో 16% వున్న దళితులగురించి ఆలోచిస్తూ మిగిలిన 84% గురించి మర్చిపోతున్నారు మేధావులారా …… ఆలోచించండి

 24. sudheer balla says:

  అఫ్సల్ గారికి అంత బాధ రావడానికి రోహిత్ చనిపోయింది …… యాకూబ్ మెమొన్ కోసం RESTOGATE అయినందుకా , అని నేను అనను …. కానీ నాతొ ఈ బ్లాగ్ చదివిన మిత్రుడు అన్నాడు ….. అతని పాయింట్ అఫ్ వ్యూ లో అది కరెక్ట్ కావచ్చు …….. …….

  • చందు తులసి says:

   సుధీర్ బల్లా గారూ.. మీ ఫ్రెండ్ ఉద్దేశమే… అని మీరు అంటూ మీరు ఇక్కడ ప్రస్తావించారంటే మీకు ఆ ఆరోపణ నిజమే… అనిపించిందన్నమాట. మీరు వ్యతిరేకించి వుంటే …లేదా తటస్థంగా వున్నా మీరే సమాధానం చెప్పేవారు.
   ఒక్కమాట చెప్పండి. మన కళ్లముందే… బంగారు భవిష్యత్ వున్న ఒక విద్యార్థి జీవితం అర్థాం తరం గా ముగిసింది. అయ్యో పాపం అనకుండా వుంటామా..? లేక రాజకీయ కారణాలు వెతుకుదామా.‌? మీకెలాగూ స్పందన లేదు.. స్పందింతే వాళ్లను స్పందించనివ్వండి…. అని నేను అనడం లేదు సుధీర్ గారూ. మా ఫ్రెండ్ అంటున్నాడు. నాకే సంబంధం లేదు.

  • అఫ్సర్ గారు, చనిపోయిన రోహిత్ పై కవిత్వం రాసి సానుభూతి చూపటం లో తప్పేమి లేదు. ఎమోషన్స్ ను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రదర్సిస్తారు. దానికి పెడర్థాలు పీకటం సరి కాదు. మీ మిత్రుడు అన్న మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి.

 25. Any what is bramhnism

 26. ఆనంద్ says:

  గురువారం (21 జనవరి) ఓ తెలుగు పత్రికలో ఓ వార్త చదివాను. ఇంగ్లాండ్ లోని ఓ స్కూల్లో టీచర్ పిల్లలకు మీ ఇంటి గురించి నోట్ రాసుకురమ్మని హోం వర్క్ ఇచ్చింది. ఓ 11 సంవత్సరాల చిన్నారి తన ఇంటి గురించి రాసుకొచ్చింది. ఆ పాప ముస్లిం. తన పుస్తకంలో “తన ఇంట్లోని టెర్రస్” అని రాయడానికి బదలు పొరపాటుగా “తన ఇంట్లోని టెర్రరిస్ట్” అని రాసింది. అదే పుస్తకం తర్వాత రోజు టీచర్ కి ఇచ్చింది. అది చదివిన ఆ టీచర్ వెంటనే పోలీసులకు ఇన్ఫాం చేసింది. వెంటనే పోలీసులు ఆ పాపతో పాటు ఆమె తల్లితండ్రులను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఇల్లంతా సోదా చేశారు. వాళ్లకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో వారి గురించి కూడా ఆరా తీశారు. మొత్తం అయిన తర్వాత పాప పొరపాటుగా రాసిందనీ తేల్చారు. ఈ తంతుని ఇంగ్లాండ్ మీడియా, ఇంగ్లాడ్ మేధావులు ఏమాత్రం తప్పుపట్టలేదు. పైగా విచారణ జరపడం ఏమాత్రం తప్పు కాదని పోలీసులను సమర్థించారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ పరిస్తితులు ఎలా ఉన్నాయో వాళ్లు అర్థం చేసుకున్నారు. ఎప్పుడు ఇస్లామిక్ స్టేట్ మూకలు ఎక్కడ విధ్వంసం సృష్టిస్తాయో… ఏ దేశాన్ని ఎప్పుడు టార్గెట్ చేస్తారో తెలీని పరిస్తితి… అందుకే ఏ చిన్న అనుమానం వచ్చినా ఏమాత్రం వదలడం లేదు. అందుకే ఇంగ్లాండ్ జనం, మీడియా, మేధావులు, సామాజిక కార్యకర్తలు, అక్కడి పార్టీల నేతలు.. ఈ ఘటనపై కామెంట్ చేయలేదు సరికదా.. పోలీసుల పనితీరుకి శభాష్ చెప్పారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఇదే పని మన పోలీసులు చేయగలరా. ఒకవేళ చేస్తే మన సోకాల్డ్ మేధావులు, ప్రజా సంఘాలు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ.. ఇలా అన్ని రంగుల పార్టీలు క్షణం ఆగుతారా. మైనార్టీలకు ఈ దేశంలో భధ్రత లేదంటూ నానాయాగీ చేయకుండా ఉంటారా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒకళ్లను మించి మరొకరు పోటీపడీ మరీ రోడ్డెక్కుతారు. నానారచ్చ చేస్తారు. ఓవైపు పఠాన్ కోట దాడి, ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులు ఊరికి ఒక్కడు పుట్టుకొస్తున్నా… ఆ సంస్థ వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తున్నా… ఎవ్వరినీ ప్రశ్నించకూడదు. ఈ సోకాల్డ్ నేతల్లో ఒక్కరైనా పఠాన్ కోట్ దాడిని ఎదుర్కోవడంలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులు అర్పించారా.. లేదు.
  అంతేకాదు వీరి మానసిక స్థితి ఏంటో అర్థం కావడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య… ఆ తర్వాత ఆందోళనలు… వారికి మద్దతుగా ఒక్కొక్క పార్టీ నేతలు, ప్రజా సంఘాలు పోటీపడి మద్దతు పలుకుతున్నాయి. కానీ వీరందరూ ఓ విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదు. ముంబై పేలుళ్లకు పాల్పడిన యాకూబ్ మెమన్ దేశద్రోహి. వాడిని దేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వాడిని ఉరి తీశారు. అలాంటి దేశద్రోహికి మద్దతుగా ర్యాలీ తీసి… ఒక్క యాకూబ్ మెమన్ చనిపోతే మరొక్కడు పుట్టుకొస్తాడు అంటూ ర్యాలీ తీసిని వాళ్లని ఏమనాలి. అంటే ఇలా ఒక్కొక్కడూ పుట్టుకొచ్చి బాంబులు పేల్చి అమాయకుల్ని చంపే వాళ్లకి వీరు జై కొడతారా. అంటే వీరిని దేశభక్తులు అనాలా, దేశద్రోహులు అనాలా. మన సోకాల్డ్ నేతలు, మేధావులూ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు. అదేమంటే భావ ప్రకటనా స్వేశ్చ అంటారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే మతం రంగు పులుముతారు. మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా మద్దతు పలకొచ్చంటూ అడ్డమైన కోతలు కోస్తారు. ఇవాళ దేశద్రోహికి మద్దతు పలికిన వాళ్లు రేపు ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రమూకలకు చేయూత ఇవ్వరని గ్యారెంటీ ఉందా. ఇలాంటి పనులు మన దేశంలో చెల్లింది కానీ మన పొరుగు దేశాల్లో చెల్లుబాటు అవుతుందా. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో వీళ్లకి తెలీదా. ఉగ్రవాదం వదిలి మంచిగా బతకమన్న కన్నతల్లిని నడిరోడ్డు మీద కాల్చి చంపించిన సిరియాలో జరగలేదా.
  ఇక నేతలు, మేధావులు, కొందరు సీనియర్ జర్నలిస్టులు (అలా చెప్పుకునే వాళ్లు గురించి మాత్రమే) సంగతికొస్తే.. వీరివి మరీ వింత పోకడలు. ఎప్పుడూ బాధితుల పక్షమే ఉంటామని చెప్పుకుంటారు. కానీ అలా ఉండరు. ఆ బాధితుల్లో కూడా వీరికి కొన్ని కేటగిరీలు, మరికొన్ని క్లాజులు ఉన్నాయి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లోని మాల్దా అల్లర్లపై ఒక్క నేత కూడా మాట్లాడలేదు. ఒక్క మేధావి కూడా నోరెత్తలేదు. ఒక్క సీనియర్ జర్నలిస్ట్ కూడా వ్యాసం రాయలేదు. అదేమంటే.. అదంతే.. ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే అక్కడ బాధితులు హిందువులు.. దాడులు చేసింది ముస్లింలు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కనీసం మమతా ప్రభుత్వాన్ని ఈ అంశంపై ఇరుకున పెట్టేందుకు కూడా అక్కడి ప్రతిపక్షమైన సీపీఎం.. బాధితులకు పక్షం నిలవలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చిన సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి మాల్దాలో ఎందుకు పర్యటించలేదు. ఇదెక్కడి కమ్యునిజం. ఇక ఢిల్లీలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. వాటిపై అక్కడి సీఎం కేజ్రీవాల్ నోరు మెదపరు. ఎవరైనా ప్రశిస్తే ఇంతెత్తున అరుస్తాడు. స్వయానా ఆయన పార్టీ నేతలే కేజ్రీవాల్ పై ఆరోపణలు చేస్తుంటే ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఆయనకు మాత్రం టార్గెట్ మోడీ. అందుకే సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చి విద్యార్థులకు మద్దతు పలికారు. మద్దతు పలకడం ఆయన ఇష్టం. కానీ ఇంటిని చక్కబెట్టలేని వాడు ఊరుని ఏల్తాడా.. ఏదిఏమైనా సెంట్రల్ యూనివర్శిటీలో దారుణమే జరిగింది. బాధితులకు న్యాయం జరగాల్సిందే. దాని కోసం పోరాడాని కానీ అన్ని విషయాలను ఒకే విధంగా పోల్చి.. వాటిని రాజకీయం చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకోవాలంటే… దేశ భద్రత చాలా ముఖ్యం. ముందు దాన్ని దృష్టిలో పెట్టుకుని నోరు తెరవండి. ఆ తర్వాత రోడ్డెక్కండి.
  ఆనంద్…

  • Chandrika says:

   ఆనంద్ గారు !!బాగా చెప్పారు. ఈ మేధావుల చౌక బారు రాజకీయ పధ్ధతి చాలా ఆశ్చర్యపరుస్తోంది. మొన్నటి కి మొన్న జరిగిన మాల్దా అల్లర్ల గురించి, మరాఠీ పత్రిక కార్యాలయాల దాడి మీద ఒక్కరు మాట్లాడలేదు. ఇంతటి తో ఈ గొడవ ఆపరు. అవార్డు వాపసీ లు నాటకం మొదలవుతుంది. ఇంకో సంఘటన వచ్చేవరకు నాటకం కొనసాగుతుంది. BJP అధిష్టానం కి రావడం బానే ఉంది ఒక విధం గా. లేకపోతే ఈ నాటకాలన్నీ చూసే అవకాశం లేదు కదా. ఫేస్బుక్, ట్విట్టర్, మీడియా ఎంత మందికి ఆహారం ఈ నాటకాలు ?

   • అమ్మా చంద్రిక గారు,

    మీది నోరా,లేకపోతే తాటిపట్టా? రోహిత్ మరణానికి కదిలిపోయి రాసుకొన్న కవితకి, పటాన్కోట్ కి, అబ్దుల్ కలాం కి సంబంధం ఏమిటి? అవును BJP అధిష్టానం కి రావడం వల్ల మీలాంటి వాళ్ళ disgusting , Insensitive , heartless కామెంట్స్ చూసే అవకాశం కలిగింది మాకు.

    ఇండియన్ PM నరేంద్ర మోడీ ” భారత మాత తన ప్రియపుత్రుడిని కోల్పోయింది. హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని” అన్నారు. ఆయన్ని చూసి నేర్చుకోండి. ఆయన మీతో ఎకిభావించటంలేదు.

    And Lastly , grow a heart. Have a little compassion.
    Know your facts before spewing venom.

  • ఇలా మనం భయం తో, అభద్రత తో తల్లడిల్లిపోవాలనీ… అప్పుడే పోలీసు జులుం ని నోరెత్తకుండా సహిస్తామనీ, మిలిటరీ పాలనకి కూడా తలొగ్గుతామనీ…ఎప్పుడో శతాబ్దాల కిందనే రుజువైంది పాలకులకు … ప్రపంచ వ్యాప్తంగా!

   ఏ దుర్మార్గానికైనా ‘దేశభద్రత’ రంగు పులమగలగడం వారికి కొత్త కాదు…నాలుగు వైపులా పరికిస్తున్న మనకూ కాదు.

   కాకపోతే ఇవాళో నిన్నోకళ్ళుతెరిచిన ‘ఆనంద్’ వంటి వారికి ఇది ఒక పెద్ద విడ్డూరం…అందుకే ఇలా …రాసి…ప్రజలను అదిలిస్తున్నారు. వాస్తవానికి ఇలాటి వారివల్ల పాలకుల పని చాలా సులువౌతుంది…

   • // * ఇలా మనం భయం తో, అభద్రత తో తల్లడిల్లిపోవాలనీ… అప్పుడే పోలీసు జులుం …. ప్రపంచ వ్యాప్తంగా!

    ప్రభుత్వానికి దేశభద్రత అన్నది సర్వోన్నతమైనది. దేశప్రజలకు బయటి శక్తుల నుండి రక్షణ కల్పించటమే రాజ్యం చేయవలసిన మొదటి పని. రాజ్యం ఆ భాద్యత నిర్వహించటం విఫలమైతే లేకపోతే పరిణామాలు ఇరాక్ లో,గల్ఫ్ దేశాలాలో జరిగినట్లు ఉంటాయి. ఇతర దేశపాలకులతో పోలిస్తే హిందూ పాలకుల ట్రాక్ రికార్డ్ ఎన్నో మెరుగైనది. చిన్న చిన్న అంశాలను లేవనెత్తి, పెద్దవి చేసి ప్రజలను భయపెట్టవలసిన అవసరం వారికి లేదు.

    కేపిటలిస్ట్, కమ్యునిస్ట్ పాలకుల ఘోరాలు, నేరాల చరిత్ర చదివిన కొంతమంది మేధావులకు గతంలో ని సంఘటనలు గుర్తుకు రావచ్చు.కారణం వాళ్లకి ప్రభుత్వం పై అపనమ్మకం. ఆ అపనమ్మకంతో భారత దేశ పాలకులను, ప్రపంచ పాలకులు చేసిన దుర్మాగాలతో పోలుస్తూ మాట్లాడటం సరి కాదు.

    నిజమైన భారతీయులు ఎప్పుడు ప్రభుత్వ పక్షమే నిలుస్తారు. ఆ ప్రభుత్వం కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా. వారికి ప్రపంచ వ్యాప్త పాలకుల చెత్త చరిత్ర గుర్తుంచుకొని, వర్తమానాన్ని ఆ కోణం లో చూస్తూ ప్రభుత్వాన్ని విమర్శించవలసిన అవసరం లేదు.కారణం హిందూ పాలకులు అనవసరంగా ఇతర దేశాలపై, ప్రజల పై యుద్దానికి దిగిన చరిత్ర లేదు.

 27. సుదీర్ బల్ల గారు,

  దురదృష్టవశాత్తూ మన దేశ ప్రధాని మీ అభిప్రాయాలతో ఏకీభావించటం లేదు. ఆయనిలా అన్నారు…

  ——-
  “భారత మాత తన ప్రియపుత్రుడిని కోల్పోయింది. హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకునేంత బలహీన పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. భారతదేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి…. బిడ్డను కోల్పోయిన తల్లి శోకాన్ని అర్ధం చేసుకోవాలన్నారు.”

  ఏ క్రింది లింకులు చూడండి…

  http://www.eenadu.net/Homeinner.aspx?item=బ్రేక్128

  http://www.andhrajyothy.com/Artical?SID=198475
  ———-

  మీరు మాత్రం ఇంకా ఇలానే అంటున్నారు…
  —————–
  రోహిత్ దళితుడు కాదు , వడ్డెర కులానికి చెందిన వాడు , ఒక రైస్ మిల్లు అధిపతి కుమారుడు , మా వూళ్ళో వున్న వంద వడ్డి కుటుంబాల జీవన విధానం , సంపద చూసిన తర్వాత నాకు అతని కులం కారణం గా జాలి చూపించడం తప్పు , పాపం , నీచం

  ఒక యూనివర్సిటీ విద్యార్థి కి తన బ్రతుకు మీద ఆస కోరిక , ఆశయం , భయం , భక్తీ వుంటే … ఇలాంటి పనులకు ఎందుకు దిగుతాడు , ఆటను యూనివర్సిటీ లో ఎం చేసాడు …… సరదాకి ఎవరు restogate చెయ్యరు కదా

  అఫ్సల్ గారికి అంత బాధ రావడానికి రోహిత్ చనిపోయింది …… యాకూబ్ మెమొన్ కోసం RESTOGATE అయినందుకా
  ——————-

 28. akella raviprakash says:

  అఫ్సర్

  At his best అగైన్

  All those crticising this poem

  Pl come out of ur sadism
  Show some kindness to
  An young bright boy
  We lost
  Lost due to same unkindness shown to him

  • Chandrika says:

   This poem is giving a very wrong message to the youth by pouring lot of pity. Do you know what is sadism? Writing sarcastic poems and articles on Bharat Ratna Dr.Kalam like a homage even before his funeral.

 29. c.v.suresh says:

  అద్భుతం….పాటకుడిని కవిత తన శైలి లోకి తీసుకెళ్తూ మోసుకెళ్తూ..మధ్య మధ్య లో …లోతైన సమాజపు ఎగుడుదగుడులను చవి చూపిస్తూ …వస్తుంది….! రోహిత్ మరణం ముందు…మరణం తర్వాత పరిస్థితులపై నిగూఢమైన వాస్థవాలను కవితాత్మకంగ చెపుతూ …ఏదేని ఒక బలవన్మరణం కవి ని ఎలా స్పందింప చేస్తుందో….అలాగే స్పందించిన కవిత…అందులోని గాఢత అద్వితీయం.! హాట్సాఫ్….అఫ్సర్ సార్!

 30. “నొప్పెడుతుందని చెప్పుకోలేని
  వొకలాంటి రాత్రిలోంచి యింకోలాంటి రాత్రిలోకి వెళ్లిపోయావే తప్ప”

  అఫ్సర్ గారు, ఈ రెండు వాక్యాలు చాలు.. గొప్ప ఆలోచింపజేసే నివాళి!!

 31. Dr.Pasunoori Ravinder says:

  అద్భుత‌మైన పోయెం. థ్యాంక్స్ ఏ లాట్ ఫ‌ర్ యువ‌ర్ స‌పోర్ట్ సార్‌..!!

 32. ఇప్పుడు ఈ “దేశభక్తుల” బాదంతా రోహిత్ నీలి రంగు వురితాడు హిందూమతొన్మాదానికి వేసిపోయిండనే. కులగజ్జిగాళ్ళ కుతికలకు బిగించిపోయిండనే. అది బిగుసుతావుంటే విషం రకరకాలుగ బయటకు కక్కుతావుంటరు. బ్రాహ్మనిజం అంటే ఏంటి అని అమాయకంగా అడిగారు కదా, ఇదే అది: అహంకారం, ఆదిపత్యం, అమానవీయం. పురోహితులు మంత్రాలు చదవాలి, రోహితులంతా ముక్కు పట్టుకొని “మమ” అంటూ బతికేయాలి. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తే, అది స్వామిభక్తి, దేశభక్తి. యాకూబ్ దేశద్రోహి అయితే దానిగురించి ఒక అఫ్సరే ఎందుకు రాయాలి? మీకు అంత ఆనందంగా వుంటె మీరే వాయొచ్చు. ఎవరైన ఎందుకు రాసావని అంటారా? అయినా ఎవరు ఏది రాయాలో, రాయకూడదో చెప్పే సాహసం చేయకండి. మా కలాలలో అణచబడ్డ బిడ్డల నెత్తురుంది. అది తడి ఆరకుండ కాపాడితేనే మా జాతులు బతికేది. సూత్రపాయంగా, ఉరిశిక్ష సరైనది కాదని, అది నేరాలను ఆపే సాదనం కాదని ప్రపంచంలో ఎంతో మంది నమ్ముతున్నారు. అందులో రోహిత్ ఒకడు మాత్రమే. కలాం గారు కూడా నమ్మారు. అయనను కూడా దేశద్రోహిని చేద్దామా? ఇప్పుడు చెయ్యాల్సింది ఈ చౌకబారు చర్చ కాదు. రోహిత్ ఒక చారిత్రిక సంఘటన మాత్రమే. చర్చ లక్షలాది రోహితుల గురుంచి. వేల సంవత్సరాలుగా సాగుతున్న కుల ఆదిపత్యం గురుంచి. అగ్రహార దురహంకారం గురుంచి. అందుకే ఈ కవిత కేవలం “రోహిత్ కోసం (మాత్రమే) కాదు.” కాస్త మనుషులుగా ఆలోచించండి.

 33. చొప్ప వీరభద్రప్ప says:

  అఫ్సర్ గారు మీరు వ్రాసిన హృదయ విదారక అక్షర దృశ్యాలు చూచి మనస్సు పిండినట్లైంది.చనిపోవాలని ఎవ్వరూ అనుకోరు.ఆ పరిస్థితుల కల్పనాప్రభావ మేమిటో ఊహంచ సాధ్యం కాదు.చనిపోకముందు పడిన మరణ వేదన ఎవరు భరించ లేరు. చనిపోకుండావుండాల్సింది.నిజంగా మనసున్న వారంరికీ శరీర మంతా వురితాడై సలిపినట్లే .

 34. G B Sastry says:

  సమస్యలకు సరైన పరిష్కారముచూపలేని మేధావులు ,సమస్యల చలిమంటలలో చలి కాచుకుని తమ పబ్బం గడుపుకున్దామను రాజకీయులు ఏమిజరిగినా సమస్యలన్నింటికీ ఏదో ఒక ఇజం రంగో,మతంరంగో,కులం రంగో రాసి ఆనందించేవారితో నిండిపోతున్న సమాజంలో రోహిత్ లు రితికేశ్వర్లు బతకలేరేమో అని భయమేస్తోంది.

 35. పెయిన్ ఫుల్ పోయెమ్ అఫ్సర్ జీ..!
  కొందరు రోహిత్ ఆత్మార్పణని అర్ధం చేసుకోలేని వారు, ఒక అంటబడని వాడి పెయిన్ అర్ధం కాని వారు ‘రాజకీయం చేస్తున్నారు’ అని బొంకుతున్నారు.. శతాబ్దాలుగా రాజకీయం చేస్తూనే మమ్మల్దంరినీ బానిసలుగా మార్చి వారి ఆధిపత్యం కొనసాగిస్తున్నవారు అలానే అంటారు. ఇప్పుడిప్పుడే రాజకీయాలు తెలుసుకుంటున్న వాళ్ళం.. ఇక రాజకీయాలే చేయాల్సి ఉంది.. రాజ్యాధికారానికొచ్చి మాపై కొనసాగుతున్న ఆదిపత్యాల్ని కూల్చేదాకా..!

  రోహిత్‌ దళిత్‌బహుజన్‌
  – – – – – – – – – – – – –
  రోహిత్‌ !
  నువ్వు మా కంటిలో స్వప్నానివి…
  నీ కోసం ఉబుకుతున్న కన్నీరు
  నెత్తురై సలసల కాగుతున్నది

  రోహిత్‌ వేముల !
  నువ్వు మా రక్తంలో రక్తానివి…
  నీ కోసం బిగుస్తున్న పిడికిలి
  వేళ్ళు – వేర్లుగా.. వేర్లు నరాలుగా
  నాడీమండలమంతా వ్యాపిస్తున్నది

  రోహిత్‌ !
  నువ్వు మా ఊపిరిలో ఊపిరివి…
  నీ కోసం పెగులుతున్న నినాదం
  దేహం దేశమవుతూ ఉవ్వెత్తున లేస్తున్నది
  ”బ్రాహ్మణిజం హటావో..!
  బహుజనిజం లావో…!!”
  – స్కైబాబ
  (22.01.2016న హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీలో రోహిత్ ‘హత్య’కు నిరసనగా- బాధ్యులను శిక్షించాలని- జరుగుతున్న విద్యార్ధుల ఆమరణ నిరాహార దీక్షా శిబిరం వేదిక మీద చదివిన పోయెమ్)

 36. G B Sastry says:

  అతి,మిత,మను,మత,కుల,వర్గ,ఆటంక,ప్రాంతీయ,భాషా,యాస వాదుల,
  అన్నిరకాలవాదులకన్న ప్రమాదకర అవకాశవాదులందరుచేరి దేశాన్నినాశనం
  చేసేందుకు ముందునిలిచి మరొకమారు పరాయిపాలకుల రాకకి రాజమార్గాన్ని
  వేస్తు చరిత్రపునరావృత్తమై బానిసబతుకు మనకుమరల రానుందనిపిస్తోందే
  ఓ గులుకు రాణి

  • పరాయిపాలకుల రాకకి రాజమార్గాన్నివేస్తు చరిత్రపునరావృత్తమై

   మీరు అనవసరం గా ఆందోళన చెందుతున్నారు. పరాయి దేశాల లో పాలన, మనదేశం కన్నా మిన్నగా ఎమి లేదు. ఫ్రాన్స్ లో ఆర్ధిక అత్యాయిక పరిస్థితి, బ్రిటన్, జర్మనిలో గల్ఫ్, పాకిస్థాన్ దేశాల నుంచి వెళ్ళిన వారితో దిగజారిన పరిస్థితి. మిగిలిన యురోప్ దేశాలలో ఆర్ధిక సమస్యలు. ఇలా ఏ దేశానికి తగ్గ తలనొప్పులు వారికి ఉన్నాయి :)

 37. Indra Prasad says:

  అసలు రోహిత్ మృతికి పఠాంకొట్ కి ఏమిటి సంబంధం ?

 38. Delhi Subrahmanyam says:

  పైన వ్యాఖ్యని రాసిన చంద్రిక అనే వ్యక్తికి చాల వివరాలు తెలియవు. అంతే కాకా చందలమయిన అరొపొఅనలు చేస్తున్నారు. పటాన్కోట లో జరిగిన దాడి కి రోహిత్ హత్యకీ అస్సలు సంబంధం లేదు. రోహిత్ కి స్కాలర్షిప్ దళితుడు గా కాకుండా కేవలం మెరిట్ తో వచ్చిందని ఈ అజ్జ్ఞాలుకి తెలియదు. అతను చేసినది తప్పని సస్పెండ్ చేసిన అ మూర్ఖ ఉపాధ్యపతి అప్పారావు ఇవ్వాళా 18 లక్షలు ఇస్తామని ఎలా ప్రకటించాడు. మోడీ కి అతను చనిపోవడం వాళ్ళ ఒక తల్లి బాధపడుతోందని దొంగ కబుర్లు చెప్పేకంటే ఆ తల్లి బాధకి కారణమయిన వారిని వాళ్ళ పదవుల్లోంచి తీసేయాలి కదా. యాకూబ్ మెమొన్ గురించి మాట్లాడుతున్న వీళ్ళకి సంజుక్త ఎక్ష్ప్రెస్స్ లో పెట్టిన బాబ్ముల వాళ్ళ చనిపోయిన ముస్లింల గురించి కానీ దానికి కారణమని అరెష్టయిన బాబాకి బెయిల్ ఇస్తే ప్రభుత్వం పై కోర్టులో అప్లై చేయలేదు. మరి ఆ బాబా కూడా టెర్రరిష్టే కదా. అలాగే మలేగోన్ దాడుల్లో వొందల మంది ముస్లింలు చచ్చ్పోతే జస్టిసే కృష్ణ కమిటీ రిపోర్ట్ ని అప్పటి శివసేన ప్రభుత్వం అనగాదోక్కితే ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఈ మూర్ఖులేవరూ ప్రస్నించలేదు. ఈ ద్వ్వండ నీతి పాటించడం లో వీళ్ళకి సిగ్గనిపించటం లేదు. అఫ్సర్ గారూ ఈ చెత్త కామెంట్లను ప్రజాస్వామికంగా ప్రచురించిన మీ గొప్ప హ్రిదయం వీళ్ళకి అర్ధం కాదు.

 39. Delhi Subrahmanyam says:

  పై వ్యాఖ్యని రాసిన చంద్రిక అనే వ్యక్తికి చాల వివరాలు తెలియవు. అంతే కాక చంఢాలమయిన ఆరోపణలు చేస్తున్నారు. పటాన్కోట లో జరిగిన దాడి కి రోహిత్ హత్యకీ అస్సలు సంబంధం లేదు. రోహిత్ కి స్కాలర్షిప్ దళితుడు గా కాకుండా కేవలం మెరిట్ తో వచ్చిందని ఈ అజ్జ్ఞాలుకి తెలియదు. అతను చేసినది తప్పని సస్పెండ్ చేసిన అ మూర్ఖ ఉపాధ్యపతి అప్పారావు ఇవ్వాళ 18 లక్షలు ఇస్తామని ఎలా ప్రకటించాడు. మోడీ కి అతను చనిపోవడం వాళ్ళ ఒక తల్లి బాధపడుతోందని దొంగ కబుర్లు చెప్పేకంటే ఆ తల్లి బాధకి కారణమయిన వారిని వాళ్ళ పదవుల్లోంచి తీసేయాలి కదా. యాకూబ్ మెమొన్ గురించి మాట్లాడుతున్న వీళ్ళకి సంజుక్త ఎక్ష్ప్రెస్స్ లో పెట్టిన బాంబుల వల్ల చనిపోయిన ముస్లింల గురించి కానీ దానికి కారణమని అరెష్టయిన బాబాకి బెయిల్ ఇస్తే ఈప్పటి ప్రభుత్వం పై కోర్టులో అప్లై చేయలేదనీ తెలుసా. మరి ఆ బాబా కూడా టెర్రరిష్టే కదా .అలాగే malegaon దాడుల్లో వొందల మంది ముస్లింలు చచ్చిపోయినప్పుడు జస్టిసే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ని అప్పటి శివసేన ప్రభుత్వం అనగదోక్కితే ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఈ మూర్ఖులేవరూ ఆ చర్యని ప్రస్నించలేదు. ఇలా ద్వంద నీతి పాటించడం లో వీళ్ళకి సిగ్గనిపించటం లేదు. అఫ్సర్ గారూ ఈ చెత్త కామెంట్లను ప్రజాస్వామికంగా ప్రచురించిన మీ గొప్ప హృదయం వీళ్ళకి అర్ధం కాదు ఎందుకంటే మత రాజకీయంలో వీళ్ళు ప్రజస్వామ్యం అంటే ఏమిటో కూడా మరిచిపోయారు .

 40. Delhi Subrahmanyam says:

  ఇక్కడ యాకూబ్ మెమెన్ ఉరి తప్పన్న వాళ్ళందరూ అసలు ఉరిని తప్పుపట్టేవాళ్ళు. పాపం రామన్ గారికి మాలేగంలో కనీ సంజుక్త ఎక్ష్ప్రెస్స్ లో చాచిన ముస్లింలు కానీ గుర్తుకి రారు. బలమయిన సైన్యం ఉన్నా సరిహద్దు దాటి దుండగులు దడి చేస్తే అక్కడ అసలు జరిగిన తప్పేమిటి తెలుసోకుండా, దానికీ రోహిత్ హత్యకు ముడిపెట్టే మూర్ఖత్వం గురించి ఎమనగలుగుతాం. పాపం రోహిత్ తన కృషితో స్కాలర్షిప్ తెచ్చుకున్నా ఇక్కడి జనం దాన్ని అతని కులానికి ముడిపెట్టి చెత్త మాట్లాడుతుంటే వాళ్ళ మూర్ఖత్వానికి జాలిపడాలి.

  • డియర్ సర్,

   Malegaon బ్లాస్ట్స్ లో చనిపోయన వారికీ, గోకుల్ chat బ్లాస్ట్ లో చనిపోయిన variki కి తేడా లేదు.
   వాళ్ళని వురి తియ్యండి. For me they terrorists and fact that they are hindu and victims are muslims doesn’t change my stand. Trust me If you do any agitation for getting them punished, Every one would come with you. They need to punished just like Ksab for they are no different than him.
   దాని కోసం పోరాడండి.

  • What you are saying and what happened in the campus are different.
   You can oppose the death penalty in General but they are saying ” If you kill one Yakub, There would one from every family” which is highly condemnable. In any other country that would amount to treason. Do you agree with it or not ?
   He is audacious enough to say that I will tear anything in Saffron colour and say all nasty things about hindu religion but the moment someone criticizes you can go offence. What are these guys? beyond criticism ? If you don’t have decency to take criticism, Please don’t indulge in politics. BTW if you look at his facebook posts, you get a feeling that he is doing anything but research.It is not fair to comment on anyone after his demise but there is no choice as this over the top reactions from this so called intellectuals.

 41. చందు తులసి says:

  రోహిత్ ది ఆత్మహత్య భయంతోనో, పోరాడలేక చేసుకున్న పిరికి చర్య కాదు. ఐతే అతన్ని వేధించింది‌ నిజం. మానసిక చిత్రవధ పెట్టింది నిజం‌.
  దళిత, బహుజన మైనారిటీ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న మనువాద కుట్రపై రోహిత్ బలిదానం నిరసన.
  అది ఆత్మహత్య కాదు హెచ్చరిక.

 42. An article in a website about this issue. Sharing it as it points out about other side of the coin.

  అతను ఎఎస్‌ఏ సభ్యుడిగా వుంటూ హిందూత్వ భావజాలాన్ని, వివేకానందుడి బోధనలను, వామపక్షాల ద్వంద్వప్రమాణాలను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు. వాటి కారణంగా అతనిపై దాడులేమీ జరగనప్పుడు అతను అణచివేతకు గురయ్యాడని ఎలా అనగలం? పైగా అతనే ఈనాడు అతి బలమైన స్టూడెంటు యూనియన్‌ అయిన ఎబివిపికి వాళ్ల బ్యానర్లు చింపివేసి, ‘కాషాయరంగు కనబడింది, కోపమొచ్చింది, చింపా’ అని వాళ్ల ప్రత్యక్షంలోనే హుంకరించ గలిగాడు. వాళ్ల నాయకుడిపై దాడి చేయగల లెవెలుకి చేరాడు. తనకు శిక్ష పడితే వైస్‌ ఛాన్సెలర్‌ ఎపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్లి బతిమాలుకోలేదు. ఆయనకు డిసెంబరులో దళిత విద్యార్థులకు ఉరితాళ్లు, విషం, కారుణ్యమరణం యిమ్మనమని వెక్కిరిస్తూ వుత్తరం రాశాడు. నాలుగు నెలల క్రితం యూనివర్శిటీలో డిప్రెషన్‌లో వున్న విద్యార్థుల కోసం కౌన్సిలర్‌ను పెట్టారు. 20 మంది ఆయన వద్దకు వెళ్లారు కూడా. రోహిత్‌ అటువైపు తొంగి చూడలేదు. ఇలా షంషేర్‌గా బతికినవాడు పీడనకు గురయ్యాడంటే ఒప్పుతుందా?

  ఒప్పించడానికి అతనిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యకు ‘సాంఘిక బహిష్కారం’ అని పేరు పెట్టారు సీతారాం ఏచూరి నుంచి జగన్‌ వరకు. అలాటి శిక్షలు ఆ యూనివర్శిటీలో 15 ఏళ్లలో 30 మందిపై విధించారు. అప్పుడెప్పుడూ సాంఘిక బహిష్కారం అనలేదే! దీక్షా శిబిరానికి ‘వెలివాడ’ అని పేరు పెట్టుకున్నారు సస్పెన్షన్‌కు గురైనవాళ్లు. కాలేజీకి రానిస్తామంటే, సాటి విద్యార్థులతో కలిపి కూర్చోబెట్టి పాఠాలు చెపుతానంటే వెలి వేసినట్లు ఎలా అయింది? హాస్టలుకు రావద్దు అన్నారు. అన్నా వీళ్లు ఆగారా? రోహిత్‌ హాస్టలు గదిలోనే కదా ఆత్మహత్య చేసుకున్నది! ఆ గదిలోకి వెళుతూంటే ఎవరైనా వెళ్లి అడ్డుపడి, వెలివేశాం, రాకూడదు అన్నారా? ఇతరుల హాస్టలు గదిలోకి వెళ్లి అవతలివాళ్లను ఉతికినందుకు ఒక సెమిస్టర్‌ (ఆర్నెల్ల) పాటు హాస్టలు నుంచి పంపించివేశారు. విద్యార్థులు సాధారణంగా గుమిగూడే లైబ్రరీ, మెస్‌లకు కూడా రావద్ద్దన్నారు. ఆ పాటి శిక్ష కూడా వేయలేకపోతే యూనివర్శిటీ యాజమాన్యం వున్నదెందుకు? చేతకానిది అనరా? దానికి సాంఘిక బహిష్కారం, వెలి పేరు పెట్టడమేమిటి వీళ్లు? పెట్టాలి, ఎందుకంటే దానికి దళిత కలర్‌ యివ్వాలి కదా! ఇంత కలరు యిచ్చి, అవతలివాళ్లు కులం గురించి విచారించబోతే కులం ప్రస్తావన ఎందుకు అని అడుగుతున్నారు జగన్‌. ఎందుకు కాదు? దళిత బ్రాండ్‌ కాకపోతే దేశమంతా అగ్గి రగిలేదా?

  జగన్‌ చేతిలో పేపరుంది, టీవీ వుంది, కప్పేసిన నిజాలు తవ్విపోసే వందలాది రిపోర్టర్లు వున్నారు, తలచుకుంటే రోహిత్‌ తండ్రి ఏ కులమో తెలుసుకోలేరా? కానీ ఆయన ‘మీసేవ’లో యిచ్చిన కులధృవీకరణ పత్రం మీదే ఆధారపడుతున్నారు. ఇక్కడో చిన్న సమాచారం వుంది. రోహిత్‌ అసలు పేరు మల్లిక్‌ చక్రవర్తి అనీ, 2005లో తల్లీ తండ్రీ విడిపోయాక అతను క్రైస్తవం తీసుకుని తన పేరును రోహిత్‌ చక్రవర్తిగా మార్చుకున్నాడని అతని పితామహుడు అంటున్నాడట. ఆ లెక్కన చూస్తే రోహిత్‌ క్రైస్తవ మైనారిటీ అవుతాడు. ఆ విషయం ప్రస్తావిస్తే సాటి క్రైస్తవుడు కదాని జగన్‌ రంగంలోకి దిగాడన్న ఆలోచన వస్తుంది. అందువలననే కాబోలు ఆయన ‘మనిషి చనిపోయాక కులం పేరుతో రాద్ధాంతం ఎందుకు?’ అని కొట్టి పారేయాలని చూస్తున్నాడు. టిడిపి నాయకుడు జూపూడి ప్రభాకరరావు కూడా ‘సామాజిక మాధ్యమాల్లో రోహిత్‌ దళితుడే కాదని కులరాద్ధాంతం చేస్తున్నారని’ దుయ్యబట్టారు. రోహిత్‌ ఆత్మహత్య లేఖలోనే రాశాడు – ‘మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారు’ అంటూ. నిజానికి రిజర్వేషన్‌ సౌకర్యం దక్కని అగ్రవర్ణాలవారూ అదే మాట చెప్పి వాపోతారు. చనిపోయాక అయితే మాత్రం కులప్రస్తావన ఆగుతోందా? అగ్రవర్ణుడు ఆత్మహత్య చేసుకుంటే యూనివర్శిటీలో స్మారకస్తంభాలు వెలుస్తున్నాయా? రూ. 5 కోట్ల పరిహారం అడుగుతారా?

  దళిత కోణం లేకపోతే నిన్న యూనివర్శిటీలోని 13 మంది దళిత ప్రొఫెసర్లు తమ కార్యనిర్వాహక పదవుల నుంచి ఎందుకు తప్పుకోవాలి? నిజానికి వీళ్లు అయిదుగురు విద్యార్థుల సస్పెన్షన్‌కు మౌలికంగా వ్యతిరేకమా? వ్యతిరేకమైతే అప్పుడే నిరసన తెలపాలిగా! దీక్ష చేసే విద్యార్థులు తాము 15 రోజుల పాటు ”వెలివాడ’ నిర్వహించినప్పుడు యూనివర్శిటీలోని 60 మంది దళిత ప్రొఫెసర్లతో సహా ఏ ప్రొఫెసరూ, ఏ రాజకీయనాయకుడూ తమవైపు తొంగి చూడలేదని, క్లాస్‌మేట్స్‌ కూడా పట్టించుకోలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయనాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముసురుతున్నారు. దళితులై వుండి యిప్పటికైనా సానుభూతి వ్యక్తం చేయరా అని దళిత సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చి వుంటాయి కాబట్టే యిప్పుడు యీ 13 మంది రాజీనామాలు చేశారనుకోవాలి. ఇలాటి ఒత్తిళ్ల వలననే, రాజకీయంగా ప్రమాదకరమౌతుందనే భయంతోనే యిప్పుడు సస్పెన్షన్‌ ఎత్తివేయాలని యాజమాన్యం నిర్ణయించి వుంటుంది. రోహిత్‌ దళితుడు కాదు, మైనారిటీ అనే కోణం బయటకు వస్తే దేశవ్యాప్తంగా సానుభూతి తగ్గే ప్రమాదం వుంది.

  దీనితో బాటు వివాదానికి మూలకారణమైన యాకూబ్‌ మేమన్‌ ఉరితీత సంబంధిత ప్రస్తావన అంశాన్ని పక్కకు తప్పిస్తున్నారు కొందరు కాలమిస్టులు. ముజఫర్‌పూర్‌ అల్లర్ల గురించి వచ్చిన ”ముజఫర్‌ నగర్‌ బాకీ హై’ డాక్యుమెంటరీ ప్రదర్శనను ఢిల్లీలో అడ్డుకున్న ఎబివిపికి వ్యతిరేకంగా ఏఎస్‌ఏ ప్రదర్శన చేస్తే ఎబివిపి గొడవ చేసిందని రాస్తున్నారు. అది జరిగినది ఆగస్టు 3న. కానీ ఎబివిపి జులై 30 న జరిగిన యాకూబ్‌ ప్రదర్శన గురించే గొడవ వచ్చిందంటోంది. ఎందుకంటే యాకూబ్‌్‌ ఉరితీతకు వ్యతిరేకంగా చేసిన ప్రదర్శనలో రోహిత్‌ తదితరులు చేసిన నినాదాలు దేశంలో అత్యధికులకు సమర్థనీయంగా లేవు. యాకూబ్‌నే కాదు, మనిషనేవాణ్ని ఎవర్నీ ఉరి తీయకూడదు అని వాదించే వారు కొందరున్నారు. వారి వాదన వినిపించే హక్కు వారి కుంది. కొందరిని ఉరి తీయవచ్చు కానీ మేమన్‌ నిర్దోషి, అసలువాణ్ని వదిలివేసి కొసరు మనిషైన యాకూబ్‌ను ఉరితీయడం తప్పు అని వాదించినవారున్నారు. వారికీ ఆ హక్కు వుంది. యాకూబ్‌ మరణించినందుకు అతని అంత్యక్రియల్లో భాగంగా నమాజ్‌ చేసినా సరే కానీలే అనుకోవచ్చు. ‘ఒక యాకూబ్‌ను ఉరితీస్తే యింటింటికి ఒక్కో యాకూబ్‌ పుట్టుకొస్తాడు’ అనే నినాదం మాత్రం మింగుడు పడని వాళ్లం చాలామంది వున్నాం. ఆ విషయం ప్రస్తావించిన కొద్దీ రోహిత్‌పై జాలి తగ్గిపోతుంది. అందుకని దాన్ని అండర్‌ప్లే చేస్తున్నారు వ్యాఖ్యాతలు. వ్యాఖ్యలు నచ్చని వారిలో సుశీల్‌ కుమార్‌ ఒకడు. అతని అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు అతనికి వుంది. లేదని ఎవరైనా అనగలరా? భావప్రకటన చేసే హక్కు వుందని ఒప్పుకుంటే అతనిపై దాడిని ఖండించాలి. రోహిత్‌ గురించి యింత మాట్లాడేవారు సుశీల్‌ కుమార్‌ గురించి ఎందుకు ఆలోచించటం లేదు?

  ఏఎస్‌ఏవారు తమ కార్యక్రమం గురించి ఫేస్‌బుక్‌లో పెట్టుకోగా లేనిది, హిందూత్వ భావజాలాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వివేకానందుణ్ని తిరస్కరిస్తూ రోహిత్‌ ఫేస్‌బుక్‌లో పెట్టుకోగా లేనిది, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో ఎవరికి కావలసిన కామెంట్స్‌ వాళ్లు పెట్టేసుకుంటున్నారు యీ రోజుల్లో సుశీల్‌ కుమార్‌ వీళ్ల గురించి ‘ఐయస్‌ఐ గూన్స్‌’ అనడంలో ఆక్షేపణ ఏముంది? కానీ ఏఎస్‌ఏ వాళ్లకు యిది నచ్చలేదు. ఓకే, వెళ్లి చెప్పవచ్చు, వాదించవచ్చు. 30 మంది అర్ధరాత్రి సుశీల్‌ హాస్టల్‌ రూముకి అతని చావగొట్టడమేమిటి? ‘అతను క్షమాపణ చెప్పాడు’ అని ఏఎస్‌ఏ వాళ్లు అంటున్నారు. అంతటి ఎబివిపి నాయకుడు ఊరికే చెప్తాడా? తన్ని మరీ చెప్పించి వుంటారని సులభంగా వూహించవచ్చు. ‘గూన్స్‌’ అనే పదం వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నాను అని సుశీల్‌ అంటున్నాడు. గూన్స్‌ అనే పదం అంత బాధిస్తే మరి యిప్పుడు ఏఎస్‌ఏ వారు తనను ‘మనుస్మృతి ఇరానీ’ అనడాన్ని స్మృతి ఇరానీ ఎలా తీసుకోవాలి? ఆమె మనుస్మృతిని అవలంబిస్తోందా? ఆమె నటీమణి. మనువు ఆడవాళ్లకు ఆ స్వేచ్ఛ నిచ్చాడా? నీకు నచ్చకపోతే మనువాది, బ్రాహ్మణవాది అనేస్తావు. అలాగే అవతలివాళ్లు వాళ్ల భాష వాళ్లు వుపయోగిస్తారు. విద్యార్థుల మధ్య యిలాటి కొట్లాటలు సహజం. కానీ అర్ధరాత్రి అంతమంది వెళ్లడం దేన్ని సూచిస్తోంది? గూండాగిరీని కాదా? (సశేషం)

 43. Another article about the same issue.

  This is also a good time to look at where Dalit campus politics is headed. On the Hyderabad campus and also more recently at IIT, Madras, Dalit associations have been busy trying to provoke Hindus with deliberate pretences of loving beef (which is fine, they are free to do so), with intellectuals like Kancha Ilaiah loudly seeking the demise of Hinduism itself. This is also the logic of the Ambedkar-Periyar association, with modern-day Dalits reducing the fight against casteism to a fight against Hinduism.

  Ambedkar, despite his own bitter experiences with upper caste oppression, was for the “annihilation of caste” and not the annihilation of Hinduism. But modern-day hate-mongers like Ilaiah think the two are one and the same thing. This is like saying that since virulent jihadism is a major offshoot of radical Islam, Islam itself must be shut down.

  It is unfortunate the Dalits have reduced Ambedkar – whose real place in history should be as one of India’s greatest public intellectuals, humanists and social emancipators – to a private property of Dalits.

  The deliberate erection of the Dalit identity in today’s social discourse as inviolable and non-critiquable is no different from the creation of the Brahmin identity in ancient times. Dalits are the new Brahminists of modern day India. Ambedkar, a humanist, would not have approved of the direction in which Dalitism is heading – a new kind of exclusivism and chauvinism that is beyond criticism. Any criticism makes you a casteist.

  http://swarajyamag.com/commentary/the-double-tragedy-in-rohith-vemulas-suicide-dalitism-has-become-the-new-brahminism/

 44. Nageswara Rao says:

  అఫ్సర్ గారికి సూటి ప్రశ్న :
  కులం వదిలెయ్యండి- చనిపోయింది ఒక విద్యార్థి – అటువంటి విద్యార్థులు ఎందరో ప్రతిరోజూ ఆత్మహత్య చేసుకుంటున్నారు చదువు- తలిదండ్రులు_టీచర్లు పెట్టే ఒత్తిడులకి- కెరియర్ భయాలకి – వేధింపులకి- ఎన్నెన్నో కారణాలతో – మరి ఒక్కటంటే ఒక్క పోయెం కూడా, లేదంటే కనీసం ఒక వ్యాసం, లేదంటే ఇలా చెయ్యకండి అనో- పరిష్కారం చూపించే విధంగా (పరిష్కారం చూపించగల వాళ్లతోనే రాయించో) నాలుగు ముక్కలు రాయలేకపోయారు. రాయలేక పోతున్నారు- “సాఫ్రన్ కలర్ నాకు పడదు కనబడితే చించేస్తా- హిందూ మతం పేరు చెపితే ఎవ్వరూ మిగలరు” అంటూ ద్వేషం వెళ్లగక్కిన (అది మెజారిటీవాదుల పైనే కావచ్చుగాక- ద్వేషం ద్వేషమే కదా!) వాళ్లని గొప్ప జాతీయ నాయకుడిలా ఎలిజీలు, కవితలు రాసి ఆకాశానికెత్తుతున్నారు – ఏమిటండీ ఇది? ఇది పక్షపాతం కాదా? మీరు దేన్నయితే వివక్ష అంటున్నారో అదే మరొక రకంగా మీరు చెయ్యడం లేదా? మీరు గొంతు చించుకుని ఖండిస్తున్న మనువాదులకీ మీకూ తేడా ఏమిటి? వాళ్ళది కాషాయం మీది నీలం-ఆకుపచ్చ- లేదంటే మరొకటి అంతేగా?

 45. Nageswara Rao says:

  రాఘవ గారి విశ్లేషణ చాలా బాగుంది.. ఎంతో నిష్పక్షపాతంగా ఉంది.. దయచేసి ప్రతిదీ రాజకీయం చేయద్దు.. అనవసరంగా కులం కార్డులు తేవద్దు

 46. Aranya Krishna says:

  మంచి కవిత. నిజంగా రోహిత్ విషయంలో మన స్పందన శకలాలుగా మాత్రమే ఉండగలదు. ఐదు దుఖశకలాల్ని మన ముందుంచాడుఅఫ్సర్. (మరీ నివాళి మీద కూడా దాడి చేయటం దారుణం. “దేశభక్తి” మన కన్నీళ్ళని కూడా కంటోల్ చేస్తున్నది.)

 47. Aranya Krishna says:

  కొంతమంది స్పందన చూస్తే దేశభక్తి ఇంత అమానుషంగా ఉంటుందా అనిపిస్తుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగొట్టిన వాళ్ళది దేశద్రోహం. సైనికులది ప్రాణత్యాగం కాదు. వాళ్ళు జీతాలకి చేస్తున్న ఉద్యోగం అది. జీతాలు ఇవ్వం అంటే ఒక్కరు కూడా ఉద్యోగం చేయరు. వాళ్ళల్లో ఒక్కరు చనిపోయినా రకరకాల చక్రాలు దొర్లుకుంటూ వస్తాయి. లక్షలు, కోట్లు బాంకు ఖాతాల్లో జమవుతాయి. వారసులకు వుద్యోగాలు వస్తాయి. 15 ఏళ్ళు వుద్యొగం చేసి పించన్లు, మళ్ళీ ఉద్యోగాలు. ఈ బెనిఫిట్లు ఆశించకుండానే సైనికులు ఉద్యోగాలు చేస్తున్నారా? ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. లక్షల మంది సైనికుల్లో సంవత్సరానికో గుప్పెడు మంది చనిపోతారు. అంతకంటే ఎక్కువగా రైతులు చనిపోతున్నారు. అంతకంటే ఎక్కువగా దళితులు హత్యలవల్లో, ఆత్మహత్యలవల్లో చనిపోతున్నారు. బహుళ అంతస్తులకి పెయింటింగ్ వేయటం చూసారా ఎప్పుడైనా? ఎంత రిస్కో తెలుసా అది? కేవలం 500 రూపాయులకు అది చేస్తాడు ఆ కార్మికుడు. మన సమాజానికి అదీ అవసరమే. సమాజంలో రిస్కు ఎక్కువగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. కానీ సైనికులకుండే భరోసా ఎవరికుండదు. మనం మిధ్యల్లో బతుకుతుంటాం. సైనికుడి ప్రాణత్యాగం, కాషయపు దేశభక్తి అత్యంత పెద్ద మిధ్యలు. దేశభక్తులారా! మతం కళ్ళద్దాలు పెట్టుకొని మనుషుల్లో దేశభక్తిని వెతక్కండి. ఈ దేశంలో దేశభక్తికన్న ఉచితంగా దొరికేది మరొకటి లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేదు. రిస్కు లేదు. పాకిస్తాన్ని తిడితే చాలు. ఇక్కడ ముస్లీము వంక అనుమానంగా చూస్తే చాలు. మీరు దేశభక్తులే. ముస్లీములకు తోడుగా ఇప్పుడు మీరు దళితుల్ని కూడా దేశద్రోహుల జాబితలో చేర్చారు. ఇంకేం హిందువులు, అందునా అగ్రవర్ణాలవారే దేశభక్తులు కాగలరు. అప్పుడు మీ దేశభక్తి మరింత ఆధ్యాత్మికమైంది, పవిత్రమైంది కూడా కాగలదు ఆ విధంగా. “మై బర్త్ ఈజ్ అ ఫేటల్ యాక్సిడెంట్” అన్న రోహిత్ మాటలు మీకెప్పటికీ అర్ధం కావు. వనరుల మీద, సంపదల మీద ఆధిపత్యం అట్టేపెట్టుకొని కాసిన్ని రిజర్వేషన్లు, స్కాలర్షిప్పుల మీద పడి రోదించే దేశభక్తులారా! మనచేత ఆలోచింప చేయటానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రోహిత్ చేసినది ప్రాణత్యాగం. అతని స్టైపండ్ కూడా మెరిట్లో వచ్చినదే.

 48. ఓరి నాయనో, చెత్త కొంచమే వుంది పొరకతో ఊడ్చేయొచ్చులే అని బ్రమపడ్డ. కాని ఇది జీవిత కాల పని అర్థమవుతుంది. అసలు నిజమైన గుండాగిరి అంటే ఇదే. మాకు నచ్చింది మీము రాస్తాము. మీరెవరండి బాబు, అది రాయరు ఇది రాయరు అని అడగడానికి. దేశం నిండా అడ్డం, పొడువు మీరే కదా, ఏమి వుద్దరించాలనుకుంటుండ్రో వుద్దరించండి. అంతేకాని ఈ బెదిరింపులు ఏంటి? చంపినోన్ని చచ్చినోన్ని ఒకే తీరుగ చూసుడె అమానవీయం. కులం పేరుతో చంపేస్తే కులం కార్డ్ తేవద్దు అంటారేంటి. నిజమే, ఇప్పుడే హంతకుల పట్టుకుంటే ముందు ముందు మరిన్ని హత్యలు చేయడం కష్టం. అందుకే, హంతకులు గుర్తుతెలియని శక్తులని ప్రకటించేద్దాం. లేదంటే, మా చావులకు మీమే కారణం అని ఒప్పేసుకుంటం. సరేనా? అదే కదా రోహిత్ చేసింది. ఏ పిర్యాదు చేయలేదు. ఏ కులం కార్డ్ చూపలేదు. మనిషిని మనిషి గా చూడమన్నాడు. అయినా, మా ఇంట్లో మనిషి చస్తే గట్టిగా ఏడ్వకండి అంటూ మీ శాపానర్దాలు ఏంటండి అసహ్యంగ. మనుషులం కదా, అది మర్చిపోతే ఎట్ల.

 49. ప్రసాద్ బోలిమేరు says:

  జీవితం యింకాస్త అందంగా–యింకాస్త ప్రశాంతంగా–యింకా కాస్త నిర్మలంగా వుంటే బాగుణ్ణు–కాని నిజం యింకోలా వురితాడై సలుపుతోంది.——
  రోహిత్ సూటిగా ఖచ్చితంగా అడిగిన ప్రశ్న ఒకటే. అందరూ మనుషులే , ఆ మనుషుల్ని సాంఘికం గా అంతస్తుల పొరల్లో ఇరికించిన , ఇరికిస్తున్న మతాన్ని (హిందుత్వ ) ధ్వంసం ఎందుకు చేయకూడదనే … మను (హిందుత్వ ) ధర్మం దళితుల్ని , మూలవాసుల్ని ఎందుకు అణిచి పెడుతుందని ,తాము జీవించేహక్కు తమ చేతుల్లో, చేతల్లో ఎందుకు ఉండకూడదని …
  మతాన్ని spiritual గా చూస్తే వ్యక్తిగతంగా చూసుకోండి. ఆచరించుకోండి. కాని వర్ణాల , కులాల పొరల్లో ఇమిడి బతకమంటే ఎలా , ఎందుకు ఒప్పుకోవాలి? కాషాయ వాదులే , ఆటవికంగా రాజకీయ లబ్దికోసం విషయాని గందరగోళం చేస్తున్నారు . కులం దాని దుర్మార్గమైన ముఖాన్ని వాళ్ళ ఎత్తుగడ లే బయట పెడ్తున్నాయి. ఇలాటి “హిందూ వాదులతోనే సమస్య. దేశభక్తి కి వీళ్ళిచ్చే నిర్వచనాలే దుర్మార్గం .
  బాధితులు, దోపిడీకి గురవుతున్నవాళ్ళు తమ సమస్యల మీద కారకాల మీద తప్పకుండా పోరాడాలి , తమ విముక్తి కోసం (హిందుత్వ ఇనుప కౌగిలి నుండి ) పోరాడే దళితుల మీద అక్కసు పడనక్కర లేదు. పోల్చుకోనక్కర లేదు. .
  రోహిత్ ఇక ఒక పేరు కాదు .. ఒక లక్ష్యానికి కొనసాగింపు. రోహిత్ ఇప్పుడు ఒక నదీ సంగమం ..
  రోహిత్ మరణాన్ని , ఇతర సంఘటనలతో పోల్చడమెందుకు ?
  చేతనైతే అర్ధం చేసుకోండి .. కాకుంటే సూటిగా వ్యతిరేకించండి .. ముసుగులొద్దు—

  రెండు వర్గాల నడుమ , ఘర్షణ జరిగి తీర్పు న్యాయస్థానాల తీర్పు కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఒక వర్గం వారినే ఎందుకు శిక్షించి (వెలివేసి) నట్టు ?అదికూడా హిందుత్వ ఆదిపత్యానికి కొమ్ముకాసే సంఘం కోరిక మీదట మంత్రిగారి ఒత్తిడితో నిర్ణయం తీసుకోవడాన్ని మత (మద) రాజకీయమనక ఏమనాలి ?
  ఇప్పుడు నాలుకలు మదతేయ డాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?

 50. rani siva sankara sarma says:

  రోహిత్ తప్పే చేశాడనుకొందాం. కొన్ని అబద్ధాలు చెప్పాడనుకొందాం. అయినా మొత్తం అబద్ధపు జీవితం జీవిస్తూ కోట్ల ఆస్తులు కూడబెట్టుకొంటూ సర్వరంగాలని శాసిస్తున్న మనబోటి అగ్రవర్ణాలకి నోరు తెరిచి ప్రశ్నిచే హక్కు వుందా? దొంగ వ్యవస్తకి సీ ఈ వో లు ఎవరిని ప్రస్నించ గలరు ?

 51. చివరిగా అఫ్సర్ కు నాదో విన్నపము. ఒక కులాన్నో ఒక మతాన్నో దూషిస్తే వాడిని హీరో చెయ్యటానికి కవిత్వము రాసి ప్రజల మెదల్ల లో విష బీజాలు నాట వద్దని సవినయంగా విన్నవించు కుంటున్నాను. మీరు ఇండియా లో పుట్టి ఇండియా సమాజాన్ని ఏదో విదంగా మీ కవిత్వాల తోటి అగ్ని కి ఆజ్యము పొయ్య వద్దని మానవులంత ఒక్కటే అని అందరము కలిసి సమ సమాజాన్ని నిర్మించుకునే విదంగా మీ కవితలు వుండాలని కోరుకుంటున్నాను.
  మీరు మంచి కవిత లు రాస్తారు కాబట్టి సమాజానికి పనికి వచ్చే విదంగా రాసి ప్రజలను ఈ comptetive Yuga ము లో వారి బవిశ్యత్తు కు ఉపయోగ పడే విదంగా మీ రచనలు వుండాలని కోరు కుంటున్నాను.

 52. కె.కె. రామయ్య + రాజనాల వేంకట రమణ says:

  “నక్షత్రధూళిలో అతను (రోహిత్) వెలుగుతూనే ఉంటాడు”

  మనుషులను మరోలా గుర్తించలేని లోకంతో అతను విసిగిపోయాడు. వాడ నుంచి బడుల నుంచి ఉన్నత విద్యాలయాలకు చేరినా ఉనికి వెంటాడుతూనే ఉన్నది. అస్పృశ్యత ఆధునికమై వెంటాడుతున్నది. అగ్రహారం అకడమిక్‌గా రూపు సవరించుకున్నది.

  రోహిత్ నిస్పృహతో చేశాడా, నిరసనగా చేశాడా ప్రశ్నలనేకం వేసుకోవచ్చు. కానీ ఆ మరణం ఒక నైతిక ప్రకటన చేసింది. తన పుట్టుకే పెద్ద మరణమని చెప్పి, సమాజాన్నే బోనులో నిలబెట్టిన మనిషి నైతిక నిర్వేదం నుంచి, ఎంత నిబ్బరాన్ని అభినయించి మాత్రం తప్పించుకోగలరు?

  ప్రత్యక్షంగా కనిపిస్తున్న దోషులు సరే, దళిత ఉద్యమాల నేతలు, అభ్యుదయవాదులు, సంస్కరణశీలురు, ప్రగతిశీల విద్యావేత్తలు, ప్రజాఉద్యమాలు అన్నిటినీ రోహిత మరణం ఆత్మరక్షణలో పడవేసింది. హృదయం సరైన స్థానంలో ఉంటే ఆత్మవిమర్శలోనూ పడవేస్తుంది.

  బడులలో వెలివాడలు వెలియకుండా, స్వేచ్ఛాలోచనలు వెల్లివిరిసేలా ఏం చేయగలమో చేద్దాం. రేపటి కోసం, రోహిత లాంటి మన పిల్లల కోసం, మానవీయ సమాజాన్ని సృష్టించుకునే స్వప్నాన్ని కొనసాగించడం కోసం..

  ~ కె . శ్రీనివాస్, ఎడిటర్, ఆంధ్రజ్యోతి
  http://www.andhrajyothy.com/Artical?SID=198707

 53. telangana reddy says:

  ఎంత మంది మొరిగినా — కరిచినా —who..cares..??
  అఫ్సర్ గారు —super..గా ఉంది sir..
  ————————————
  reddy

 54. శ్రీనివాసుడు says:

  ఈ వివక్ష, పీడన, అసమానతలకు సమస్యకు పరిష్కారంగా దళిత ప్రొఫెసర్లు, దళిత ఉద్యోగులు, దళిత సిబ్బంది, దళితవాద పాఠ్యప్రణాళికలతో దళిత విద్యార్థుల కొరకే ప్రత్యేకంగా ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తే వారు తమ కలలని సాకారం చేసుకోగలుగుతారా?

  బహుశా, ఇలా అగ్రవర్ణాలతో కలిపి దళితులకు కూడా ఒకే విద్యాలయంలో అవకాశమిస్తే, అలా ఎంతకాలం గడచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా పరిస్థితిలో మార్పు రాదేమో.

  శ్రీనివాసుడు.

  • @శ్రీనివాసుడు,

   Apartheid గురించి విన్నారా? మీరు చెప్తోంది అలా ఉంది.

   • శ్రీనివాసుడు says:

    @నీలిమ
    Apartheid అంటే, జాతి వివక్ష లేదా, జాతి విచక్షణ అనే అర్థంలోనే మీరు ఆ పదాన్ని ఉయోగించారనుకుంటున్నాను. అలా వివక్షగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి అది పుట్టుకతోనే కులాన్నిబట్టి, దానికి మూలమైన మనువాదాన్నిబట్టి వచ్చిందేమో ఆలోచించండి. దీనికి పరిష్కారం పీడితులు అలా ప్రవర్తిస్తున్న మనువాదులకి, జాత్యహంకారులకి దూరంగా (కనీసం విద్యార్జన చేసే ప్రదేశాలలో) వుండడమేననుకుంటున్నాను. అదిగాక ఇంకేదైనా పరిష్కారాన్ని మీరు సూచిస్తే బాగుంటుందేమో.

 55. @రామ్,

  అన్ని నిజాలు బయటికి. వస్తాయి. సుశీల్ కుమార్, బండారు దత్తాత్రేయ, స్మ్రితి ఇరానీ, అప్పారావు లని, వాళ్ళ actions ని investigate చేస్తున్నారు. సుశీల్ కుమార్ అబద్దాలు కూడా బయటికి వస్తున్నాయి. వెయిట్ అండ్ see . ఈ విషయం తేలేసరికి BJP కూడా సుశీల్ కుమార్ ని dump చేస్తుంది. He is a liability now.

 56. rani siva sankara sarma says:

  అంబేద్కర్ ని పూజిస్తూ రిజర్వేషన్ లని వ్యతిరేకించడం పెద్ద మోసం. ఈనాటి హిందూ వాదులలో వాళ్ల మాజీ మిత్రుడు అరుణ్ సౌరీ లోని నిజాయితీ కూడా లేదు. ఆయన డై రెక్టుగా అంబేద్కర్ ని వ్యతిరేకించాడు ఫాల్స్ గాడ్ అన్నాడు. ఇప్పటి హిమ్దూ వాదులు అంబేడ్కర్ని నోటితో మెచ్చుకొంటూ నొసటి తో వె క్కిరిస్తున్నారు.

 57. p v vijay kumar says:

  Gud one…well made poem

 58. అరణ్య కృష్ణ జి..
  గొప్పగా చెప్పారు..

 59. కె.కె. రామయ్య says:

  ” వనరుల మీద, సంపదల మీద ఆధిపత్యం అట్టేపెట్టుకొని కాసిన్ని రిజర్వేషన్లు, స్కాలర్షిప్పుల మీద పడి రోదించే దేశభక్తులారా! మనచేత ఆలోచింప చేయటానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రోహిత్ చేసినది ప్రాణత్యాగం ” హాట్స్ ఆఫ్ అరణ్య కృష్ణ గారు.

 60. వృద్ధుల కల్యాణ రామారావు says:

  రాణీ శివశంకర శర్మ , అరణ్యకృష్ణ గార్ల వ్యాఖ్యలతో స్థూలంగా ఏకీభవిస్తున్నాను

 61. రాఘవ గారి అసహానం చూస్తుంటే ఎబివిపి వాళ్ళే కాస్త నయం అన్నట్టుంది. అయ్యా ! మీరు చదువుకున్న వారు అయితే మరింతగా పరిశోదించండి , నిజా నిజాలు తెలుసుకోండి. రోహిత్ ఈ కుల సమాజం కుళ్ళు భరించలేక ఆత్మహత్య చేసుకోబడ్డాడు. దీనిని మేము ఖచ్చితంగా హత్య గానే భావిస్తున్నాం . నిజాలు వక్రీకరించొద్దు. ఈ దేశం లో కల్బుర్గి , పంసారే, దబోల్కర్ హత్యలు , బీఫ్ తిన్నాడనే నెపం తో అఖ్లాక్ ని బహిరంగంగా హత్య గావిన్చబడడం గురించి మాట్లాడ లేని వాళ్ళు రోహిత్ గురించి మాట్లాడొద్దు దయచేసి. మీరు అనర్హులు మా దృష్టిలో . జస్టిస్ సురేష్ కమిట్ అద్వర్యం లో నిజ నిర్ధారణ కమిటి జరిగింది . అందులో నేను సభ్యురాలిని . వారు వెలివాడ వేసిన దగ్గరనుండి ఉన్న దానిని. రోహిత్ చనిపోయిన రోజు అక్కడే ఉన్న. సుషీల్ కుమార్ ని 30 మంది కలిసి కొడితే పాపం ఈ పాటికి పరమ పాడించి ఉండే వాడు. వాళ్ళు బెదిరించారు నిజమే , అప్పటికే సదరు సుషీల్ కుమార్ గారు పోలిస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు . ఇద్దరు కానిస్టేబుల్స్ , వార్డెన్ కుడా ఉన్నారు. ఆయనకి దెబ్బలు లేవు అని డాక్టర్ గారు చెప్పడం వాళ్ళనే మొదటి సారి వేసిన శిక్ష నుండి విద్యార్తులని అనుమతించారు . పోలిస్ వారి రిపోర్ట్ కూడా చూడండి. రెండోది, నేను ఒక యునివర్సిటి లో ఉపాధ్యాయురాలినే. ఇద్దరు విద్యార్థి సంఘాలు గొడవ పెట్టుకున్నప్పుడు బుద్ధి ఉన్న ఎ మూడో వ్యక్తీ దూరకూడదు. అందునా స్వయం ప్రతిపత్తి గలిగిన విశ్వవిద్యాలయాలలో, ఇక్కడ అధికారం ఉంది కాదా అని , ఎం ఎల్ సి లు, మినిస్టర్ లు , బిజెపి నాయకులు పోలో మని దిగి ఒక ప్రాణం తీసినారు. కమ్మ వెంకయ్య నాయుడు , ఒక ముప్పై మంది సినియర్లని కాదని మరొక కమ్మ అప్పారావు ని వి సి చేసిన విషయం బహుశ మీకు తెలిసే అవకాసం లేదు. యూనివర్సిటిలో ఏది జరిగినా ఒక కమిటి వేసి నిజా నిజాలు విచారిస్తారు. ఇక్కడ ఈ అంబేద్కర్ విద్యార్తుల పై వేసిన కమిటి కి తలా తోక లేదని పాత విసి గారు వాటి ని కాదని కొత్త కమిటి వేయమని సలహా ఇచ్చి వెళ్ళాడు. అది అప్పారావు కళ్ళకి కనపడలేదు. కేంద్ర మంత్రి వర్గం వేసిన కమిటి నే యునివర్సిటి తప్పని అభిప్రాయం వెలిబుచ్చింది. ఎవరికన్నా అనుమానాలు ఉంటె వచ్చి తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కులం గురించి అర్థం చేసుకోకుండా కోతలు , కూతలు కుయ్యోద్దని , రాయొద్దని మనవి . అక్కడి ఉపాద్యాయులు , ఒక్క హిందూ మతాచార్యులు తప్పితే , అన్ని కులాల వారు , విరి మిద సస్పెన్షన్ నిర్ణయం తప్పని చెపితే వినలేదు విసి . కనీసం వారు నిరసన చేస్తుంటే కూడా పట్టించుకోలేదు. అది కూడా ఉద్యోగ ధర్మానికి విరుద్ధం. తన కాంపస్ లో ఏమి జరుగుతుంది , ఎందుకు అని తెలుసుకోవాలి అందుకే ఆయనకి జీతం ఇస్తున్నారు. రోహిత్ మృత దేహాన్ని విద్యార్థులకి, ఇతరులకి చూపించ కుండా దొంగ చాటున దహనం చేయడం కుడా ఒక నేరం. పెద్ద పెద్ద నాయకులని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా శవాన్ని కుటుంబానికి అప్పగిస్తారు . ఇక్కడ దొంగిలించారు . ఇదొక్కటి చాలు వాళ్ళ తప్పు కప్పి పుచ్చుకోవడానికి ప్రబుత్వాన్ని వాడుకుంటున్నారని. ఇంకా వాళ్ళ అమ్మ , నాన్న చరిత్ర తీసి మరి హింసిస్తున్నారు. రోజు వాళ్ళ నాన్నా కి తాగిపించడం , టివి లలో కూర్చోబెట్టి మాట్లాడించడం , పాపం అయన ఏమి మాట్లాడుతున్నాడో , ఆయనకే తెలియక పోవడం. రోహిత్ శరీరానికి కాదు , అతని జీవితాన్ని కూడా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు . అవును దళిత జీవితాలంటే అంత చులకన . తన చెమట రక్తం తో పెంచిన కొడుకు చేతికి వస్తాడు అనుకుంటే అర్థాంతరంగా జీవితాన్ని , తనని వదిలి వేశాడని కుమిలి పోతున్న తల్లి మీదా రకరకాల వాదనలు , వివాదాలు . రోహిత్ చనిపోక ముందు ఆంధ్రా జ్యోతి లో వ్యాసం రాసిన . వీలయితే చదవండి . రోహిత్ ని ఎవరు చంపారని కూడా రాసిన . http://roundtableindia.co.in/index.php?option=com_content&view=article&id=8456%3Awho-killed-rohith-vemula&catid=119&Itemid=132. ఇక రోహిత్ తల్లి రాధిక మిద కూడా నేను రాసిన ఈ వ్యాసం చదవండి . హృదయం ఉంటె స్పందించండి . మీ బిడ్డ కూడా రేపు పెద్ద చదువులు చదవడానికి దూరంగా పోవచ్చు . ఏదో ఒక వివక్ష ఎదుర్కోవచ్చు .అధికారం , కులం , డబ్బు , పరపతి ఉన్న వారికి ఎటువంటి వివక్షత లేకపోవచ్చు . కాని రోహిత్ గురించి మాట్లాడడం అంటే వివక్షత లేని సమాజం గురించి మాట్లాడడమే . http://www.huffingtonpost.in/sujatha-surepally/the-persecution-of-radhik_b_9087080.హ్త్మ్ల్. ఇందు మూలంగా , చేతులెత్తి నమస్కరించి తెలియ చేయునది ఏమనగా , చనిపోయిన బిడ్డ వివక్షతకి , నిర్లక్షతకి నిలువెత్తు సాక్షం. మీడియా , బిజెపి , మత చాందస , అగ్రకుల భావజాలాన్ని పక్కన పెట్టి, నిజ నిర్ధారణ రిపోర్టులు చూసి , చదివి లేదా స్వయంగా విద్యార్తులని చూసి , మాట్లాడి ఆ తరువాత తమ అభిప్రాయాలని వెళ్ళబుచ్చాలని కోరుతున్న. జైభీం కామ్రేడ్ !

 62. rani siva sankara sarma says:

  ప్రతిభ అగ్రవర్ణాల నుండి వలస పోయింది. ఈవిషయం రోహిత్ లేఖ ద్వారా స్పష్టమయింది. దళితులకి అగ్రవర్ణాలు అవరోధాలు కల్పించకపోతే వారు వున్నతస్తాయికి ఎదిగి ప్రతిభ లేని అగ్రవర్ణాల వారికి రిజర్వేశన్లని కల్పిస్తారు. ముందు వాళ్ల మార్గంలో మన అగ్రవర్ణాలు ముళ్లుగా మారకపోతే చాలు.

  • శర్మ గారు,
   మీరు చెప్పిన దాని లో వాస్తవం ఉంది.ఐతే రిసర్వేషన్స్ అంశం రాజకీయం చేయటం వలన అటువంటి ప్రతిపాదన చేసిన వారిని బడుగు వర్గాల వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూంటారు. తమిళనాడు లో మెడికల్ అడ్మిషన్ డేటా ను పరిసీలిస్తే వెనుకబడిన వారికి రిసెర్వేషన్ అనేది అవసరం లేదనిపిస్తుంది. 2004 సంవత్సరం టాప్ 400 రాంకులలో ఫార్వర్డ్ కేస్ట్ కు వచ్చిన రాంకులు 41. మిగతా రాంకులన్ని అగ్రవర్ణేతరులవి. In the top 100 rank-holders, only 6 are from an FC, 79 from a BC and 13 from an MBC (The Hindu dated 23-08-2004). ఇప్పుడు కూడ పరిస్థితి లో పెద్దమార్పు వచ్చి ఉండకపోవచ్చు.

   రిసెర్వేషన్స్ ఫలితాల పై డేటాను పరిశీలించి దాని లో మార్పులు తీసుకు రావలసిన అవసరం ఉంది.

 63. rani siva sankara sarma says:

  అగ్ర వర్ణాలు వారి దారిలో ముళ్లుగా మారనప్పుడు అనే క్లాజు ముఖ్యమైనది. ఆ స్వర్ణయుగం వచ్చినప్పుడు చూద్దాం.
  [మీరు యిచ్చిన సమాచారం అలా వుంచి ] సీట్ల అమ్మకాలూ యింకా కనబడని సామాజిక అంశాలలో అగ్రవర్ణాల ఆధిక్యత ప్రధానమైనది. అదే కీ లకం కూడా. అందులోను ప్రయివయిటైజేశన్ యుగంలో. బయిటికి కనబడని అగ్రవర్ణ మాయని చేదించి చూస్తేనే నిజం బయట పడుతుంది.శ్రీరాం గారూ .అగ్ర వర్ణాల కు చెందిన సవాలక్ష రిజర్వేషనులు పైకి కనబడవు

 64. కె.కె. రామయ్య says:

  ” రోహిత్ గురించి మాట్లాడడం అంటే వివక్షత లేని సమాజం గురించి మాట్లాడడమే”. వివక్షతలు లేని సమాజాన్ని ఆకాంక్షించడమే అన్న Suajtha Surepally గారికి కృతజ్ఞతలు.

  “My birth is my fatal accident. I can never recover from my childhood loneliness. The unappreciated child from my past….I am not hurt at this moment. I am not sad. I am just empty. Unconcerned about myself. That’s pathetic. And that’s why I am doing this,” Rohit wrote.

  When Rajeev Ramachandran, Coordinating Editor at MediaoneTV, wrote to Ann Druyan, the wife of Carl Sagan, telling her of Vemula’s suicide note that mentioned her husband, this is what she wrote back.

  Dear Rajeev Ramachandran,

  Deeply grateful to you for writing to me about Rohit Vimula, whose death and lost promise I mourn.

  To read his suicide note and to learn the details of his predicament is to get a vivid inkling of the actual cost of bias to our civilization. If we could somehow quantify the totality of lost contributions and innovations as a result of prejudice, I believe we would find it staggering.

  You tell me, Rajeev: Is it possible that the attention paid to Rohit’s story will lessen its chronic repetition? I am trying to find something hopeful in an otherwise heartbreaking example of needless suffering and squandered potential.

  Truly,
  Ann

 65. ఎంతో ప్రజాస్వామిక స్పూర్తిని పాటించి తన దృక్పధాన్ని ప్రకటించిన రాణీ శివశంకర శర్మ గారికి ధన్యవాదాలు.
  -శశాంక

 66. కె.కె. రామయ్య says:

  ” It is a casteist mind that sees Rohith’s actions as casteist. Rohith was a patriot because he held a mirror to society, because he reminded it of its promise of assuring the dignity of the individual. This is the highest obligation of any intellectual: to tell the nation what is right. ”

  ” no substantive discussion in a University can be anti-national as long as protocols of discussion are maintained. Dissent must be heard. No one would want to be called anti-national for it brings in its wake the primordial passions of hate and anger onto oneself. It produces self and social censorship. This is what Rohith experienced. ”

  In addition to the fear of censorship must be debated the question of patriotism. I believe Rohith was a patriot because he held a mirror to society,

  ~ Article by Peter Ronald deSouza, Professor at the Centre for the Study of Developing Societies and holds the Dr. S. Radhakrishnan Chair of the Rajya Sabha for 2015-17

  http://www.thehindu.com/opinion/lead/on-rohith-vemulas-suicide-and-the-govts-response/article8179928.ece

 67. కె.కె. రామయ్య says:

  ” రోహిత్ నాకు ఆదర్శం ” ~ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్.

  ” హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పాలకవర్గం వివక్షత వల్ల ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి విద్యార్థి రోహిత్ వేముల నాకు ఆదర్శం ” ~ రాజద్రోహం కేసులో అరెస్టయి గురువారం బెయిలుపై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య..

 68. chandolu chandrasekhar says:

  అప్సర్ గారు కవిత ద్వార రోహిత్ కి నివాళి శ్లాఘ నీయం,ఒక సారి అందరం శ్రీశ్రీ గారి ‘ఆకాశ దీపమ్ ‘ చదివితే బావుటుంది .రోహిత్ తన చావు ద్వార బతకటం నేర్పేడు .చావును ఆయుధం మలిచాడు ఇది అందరు గుర్తుంచుకో వలసిన విషయం .మల్లి ఒక సారి శ్రీశ్రీ గారి ఆకాశ దీపం కవిత చదవండి

 69. డా.జి.వి.రత్నాకర్ says:

  గుడ్ పోయెమ్ అఫ్సర్ గారు.

 70. K.WILSON RAO says:

  మా…వాడివే..!
  —————–

  పాలపుంతల ఒడిలో
  సేదదీరుతున్న నిత్యాన్వేషకుడా…!
  తూరుపు దిక్కున పొడిచిన
  పొద్దుపొడుపువయ్యా నీవు…!

  అక్షరాలకు ప్రాణాలుపోసే ప్రాంగణాల్లో
  కుతూహలాల్ని ఎదగనీయని
  జ్ఞానదేవుళ్ళుంటారని
  నీ నిష్క్రమణ తరువాతే తెలిసింది

  కళ్ళుమూసిన ఆకాశానికి
  “కార్ల్ సాగన్” ను పరిచయం చేసిన
  నిత్య నిరీక్షకుడా…!
  ‘వెలి ‘ వాడల్లో చూపుడువేలును ఆవిష్కరించి
  గద్దెపై కూర్చుండబెట్టి
  ఇంద్ర ధనుస్సులో
  ఎనిమిదో రంగువైన జ్ఞానివయ్యా నీవు..!

  నువ్వు ఇతరుడవో
  ఇవతలివాడివో
  అసలు సమస్యే కాదు
  నువ్వు “వెలివాడ “లకు భరోసావు

  వృత్తులన్నీ సమానమేనని
  కులమతాలు కల్లలేననీ
  పిడికెళ్ళెత్తి వాదించిన “జైభీం”జెండాను
  ఎగరేసిన నీవు
  ‘మాలోని వాడివే – మావాడివే’
  (రోహిత్ స్మ్రుతిలో)
  కె.విల్సన్ రావు
  8985435515

 71. నీ గుర్తులన్నీటికి మకిలి పట్టించాక
  నువ్వేదో అంతుపట్టవు యీ కళ్ళల్లో!
  ఆ మకిలిని దాటి వచ్చే వెలుగురేఖ కోసం తెరిచి చూడకుండా మూసుకునే ఉన్నాయి కళ్ళు …ఇంతకాలమైనా . A memorable tribute

Leave a Reply to Chandrika Cancel reply

*