అప్పు తీసివేత-చిన్నారి విన్నీ

gudem

 

గూడెంలో క్లాసులు మొదలుపెట్టిన తొలి రోజులు.

అప్పటికి రోజువారి దాదాపు ఒక ముప్ఫై మంది పిల్లలు క్లాసులకి వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం పిల్లలు అప్పుతీసుకునే తీసివేతలు చెప్పమని అడిగేరని బోర్డ్ మీద చెబుతున్నాను.

‘అప్పు తీసుకోవడం అంటే ఏంటి టీచర్ ?’ విన్నీ అడుగుతోంది.

‘అప్పు తీసుకోవడం అంటే నువ్వు పెన్సిలు కొనుక్కుందుకు నీ దగ్గర డబ్బులు లేవనుకో  ప్రక్కింటి వాళ్లనో , తెలిసున్న వాళ్లనో అడిగి తీసుకోవడం , ఆ తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తిరిగి వాళ్ల డబ్బులు వాళ్లకి ఇచ్చేయడం .’

‘ మరి, నాలుగు లోంచి ఐదు తియ్యలేనప్పుడు పక్కనున్న అంకె నుంచి ఒకటి అప్పు తీసుకోమన్నారు కదా. మళ్లీ ఆ ఒకటి అప్పుని ఎలా తీర్చాలి టీచర్?’ విన్నీ ముఖంలో సీరియస్ గా కనిపిస్తున్న ప్రశ్న.ఆ అమ్మాయి ప్రశ్నకి నవ్వొచ్చింది. నిజమే కదూ, అప్పు ఎలా తీర్చాలి?……………………….

‘ టీచరమ్మా!’ అన్న పిలుపుకి తలత్రిప్పేను.

నలుగురు పెద్దవాళ్లు, వాళ్ల వెనుక నలుగురు ఆడపిల్లలు నిలబడి ఉన్నారు. ‘చెప్పండి’

‘ టీచరమ్మా, మా పిల్లలకి ఇంగ్లీషు నేర్పుతావా? పదో క్లాసు పరీక్షకి వెళ్తున్నారు. ‘ వాళ్లని వివరంగా చూసాను. పదో క్లాసు పిల్లలంటే నమ్మబుధ్ధికాలేదు. స్కూల్లో చూసినట్లే అనిపించింది. అవును, కానీ వాళ్ల క్లాసుకి నేను వెళ్లను.

‘ అందరూ రావచ్చు ఇక్కడికి. రోజూ రండమ్మా.’ ఆ మాటలకి కృతజ్ఙతగా చూసి వెనక్కి తిరిగేరు.

పదో క్లాసు పిల్లలు నలుగురు కాస్తా ఏడెనిమిది మంది దాకా రావటం మొదలు పెట్టేరు . చదువుకోవాలనే ఆశ ఉన్న పిల్లలే. మంజూష క్రమం తప్పకుండా వస్తుంది. సన్నగా , బలహీనంగా కనిపిస్తుంది. కాని చదువులో చురుకైనదే . మనసు పెట్టి వింటుంది, చక్కగా అర్థం చేసుకుంటుంది.

ఆరోజు మంజు తనతో మరొక అమ్మాయిని తీసుకొచ్చింది,

‘టీచర్, మా మామయ్య కూతురు విద్య. తనకి చదువుకోవాలని చాలా ఇష్టం. పది దాకా చదివింది. కాని పరీక్షలు రాయలేదు. వాళ్లనాన్న అప్పులుపడి,  డబ్బుకి ఇబ్బందిగా ఉందని ఇక్కడ పచ్చళ్ల కంపెనీలో పనికి కుదిర్చేడు . పరీక్ష తర్వాత రాద్దువులే అన్నాడు . కానీ ఇబ్బందులు తీరక రెండేళ్లు అయినా ఇప్పటికీ పనిలోకి వెళ్తూనే ఉంది.  అయినా అప్పులు, వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయంటాడంట వాళ్ల నాన్న .

వాళ్ల అమ్మని అడిగితే ఇప్పుడు వాళ్ల అక్క ప్రసవానికి వచ్చింది కనుక ఇంకొక్క ఆరు నెలలు పనికి వెళ్లమని, చేతిలో పైసలు అస్సలే లేవని  చెప్పిందంట. ఆ తర్వాత మాత్రం విద్య  ప్రైవేటుగా చదువుకుంటుందంట. మీరు చదువు చెబుతారా టీచర్ ?’

పెద్ద పెద్ద కళ్లతో విద్య ఆశగా చూస్తోంది నావైపు. ‘ తప్పకుండా విద్యా. నేను చెబుతాను’ నా మాటలకి ఆ అమ్మాయి కళ్లు తళుక్కుమన్నాయి .

మోటారు సైకిల్ విసురుగా వచ్చి మా దగ్గర ఆగింది.   ‘ఏమే విద్దే, నీకు సదువు పిచ్చి ఇంకా ఇన్నేళ్లైనా  తగ్గలేదే? ముందు మన అప్పులుతీరనీ. నీ బావనిచ్చి పెళ్లిసేసి పంపిస్తా, అప్పుడు సదూకుందువులే , పద’ తండ్రి కళ్లల్లో పడినందుకు ఆ పిల్ల వణికిపోయింది.

‘ టీచరమ్మా, నా కూతురు రెండేళ్లై సంపాయిస్తోంది. ఇప్పుడింక కొత్తగా సదివితే మాత్రం పెద్ద ఉజ్జోగాలు వస్తయ్యా?’ నాకు ఒక ప్రశ్న సంధించి కూతుర్ని తీసుకుని వెళ్లిపోయాడు. అప్పులు చెయ్యడం వరకే ఇంటి పెద్ద బాధ్యత కాబోలు.  వాటిని తీర్చడానికి పిల్లల జీవితాల్నేపణంగా పెడుతున్నారు.

పిల్లల జీవితాలమీద పెద్దవాళ్లకిలాటి హక్కు ఎవరిచ్చారు ? పిల్లలు ‘పనుల్లోకి వెళ్లం’ అని ఎదురు తిరిగితే ఈ అప్పులు ఎలా తీరుస్తారో ‘విన్ని’ అడిగినట్లు.

 

 

మీ మాటలు

  1. seshu chebolu says:

    “అప్పు తీసివేత” కధలో చిన్నారి విన్నిఅడిగిన ప్రశ్ననిజంగా మనని అలోచించేలగా చేసింది. ఇన్నాళ్ళు నాకు ఆ డౌట్ ఎందుకు రాలేదో??! పెద్దవాళ్ళు బాధ్యత రహితంగా అప్పులు చెయ్యడం పిల్లలు బలి అయి పోవడం ఈ కధలో ప్రత్యక్షంగా కనపడుతోంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఈ చిన్నారుల జీవితాలు బాగుపడడానికి?? అనురాధలాంటి వారు మరింత మంది ఈ సమాజంలో ఉంటె తొందరలోనే ఆ మంచి రోజులు చూడచ్చు.

  2. చిన్నసత్యాన్ని చందంగా చెప్పేరు అనురాధగారు . ఇలాంటి ఉత్తేజకర రచనలు మన సమాజానికి ఎంతైనా అవసరం .దానివల్ల ఎలాంటి మార్పువోచిన ఎంతైనా ఆనందమే .

  3. seshu chebolu says:

    టీచరగా రిటైర్ అయిన నాకు ఈ గూడెం కధలు, ఆ పిల్లల వాతావరణం ప్రాణం పోస్తున్నాయి. అనురాధగారు పెద్ద కధలు రాస్తే బావుండు. ఇట్టే అయిపోతున్నాయి ఆ కధలు!! మళ్ళి ఆ పిల్లల ప్రపంచంలోకి వెళ్ళాలని ఉంది. ఆమె నన్నొక సేవ కార్యం చెయ్యమని చెప్తున్నట్టు ఉంది.

  4. చొప్ప వీరభధ్రప్ప says:

    అప్పుతీసివేత…అనూరాధ నా దెళ్ళ గారి కథ చిన్న దిగా కనబడినా అది చిన్నది కాదు. నేటి సంఘంలో వేళ్ళూని విస్తరించి పిల్లల విద్యా హక్కులను కాలరాస్తూ పసిపిల్లల్ని మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసినారు.నిజమే ఎందరో నేటికీబలిపశువులుగా వున్నారు. అన్నం పెట్టే తల్లి దండ్రులకు సాయపడు చున్నట్లు సంఘం తలంచవచ్చు.అది తప్పుడు స్వార్థపూరిత ఆలోచన. శ్రవణకుమారుడు తల్లి దండ్రులకు అన్నీ వదలి సేవచేయడం ఆదర్శమందామా.కథగాబాగుంటుంది.ఇద్దర్ని కావడిలో పెట్టుకొని మోయడం ఎంతటి శ్రమో .అంతటి కష్టం అది అవసరమందామా.అనాదినుండి సేవపేరున జరిగే అణచివేత .అతనికి కీర్తి కిరీటం బెట్టారు…. తండ్రి చేసిన అప్పుకు అమ్మాయి ఆశలు ఆశయాలు భూస్తాపితమయ్యాయి..రచయిత్రి సమాజానికి ప్రశ్న వేసింది.పిల్లల్ని ఇలా అణచి వేసే హక్కు ఎవరిచ్చారని.నేడు ఇది జవాబు చెప్పే ధైర్యం లేని ప్రశ్న.ఎవరు ఇవ్వలేదు హక్కు ఆదర్శంపేరున అణచి లాగేసు కున్నారు. దీనికి బాధ్యత పొదలోని ఒకతీగను లాగితే పొద కదలినట్లే.? నిర్బంధ విద్య అమలైతే ఏమైనా??? కొన్ని దేశాల్లో ఒకటి రెండు రోజులువిద్యార్థి తరగతికి గైర్ హాజరైతే ఆ విద్యార్థి తల్లి దండ్రులు శిక్షార్హులు ఇది అమలు లో వుంది. నిరక్షరాస్యులున్న దేశం బాగుపడదు.చట్టాలు చేస్తేకాదు అమలుకావాలి..,అందరిలో మార్పు రావాలి కథ బాగుంది. విషయం బింధువుగా చూపారు.విస్తృత ంగావుంది రచయిత్రి గారి కలం శక్తివంతమైన ది.

  5. Seshulakshmi says:

    కథ బాగుంది Kani సమస్యకి parishkaram చూపిస్తే ఇంకా బాగుండేది పేదరికం, అవగాహనా లేకుండా చేసే అప్పులు కింద వర్గాల్లో తర్వతితరాలను Ela ఇబ్బంది పెడుతున్నాయో చెప్పిన విధానం బాగుందికానీకధలన్నీ ఒకే moos lo పోసినట్టు కాకుండా రచయిత్రి జాగ్రత్తపడాలి

  6. SM Lakshmi says:

    ఒక్కక్క సంచికలో ఒక్కక్క సత్యాన్ని తెలియబరుస్తున్నాయి గూడెం కధలు. మన సమాజం లో మార్పు రావాలంటే చదువు ఒకే మార్గం. వీరభద్ర గారు చ్చేప్పినట్టు అందరిలో మార్పు రావాలి. గూడెం పిల్లలకి ఉచితం గా విద్య దానం చేస్తూ వారి సమస్యలని మనకి చేప్తున్న రచయిత్రి గారికి అభినందనలు .

  7. ‘అప్పు తీసి వెత – చిన్నారి విన్నీ’ అంటే చిన్నారి విన్నీ అప్పు తీర్చిందేమో అనిపించింది. పాపం చిన్నారి విన్నీ అప్పు తీసుకోవడం నేర్చుకుంది అన్నమాట. వీరభద్ర గారు రాసిన ఉదాహరణ కొంచెం మనస్తాపం తెచింది. శ్రవణ కుమారుడు ఎంతో ప్రేమతో తల్లి దండ్రుల కి సేవ చేసేడు. దాన్ని ఉదాహరణ గా తీసుకుని ఇప్పటి తల్లి దండ్రులు అబ్యూస్ చెయ్యడం అన్నిది చాల ఘోరం. ఈ కధలో దైనందిన సమాజిక సమస్యని చూపించేరు. కానీ ఇలాంటి అబ్యూస్ మగ పిల్లల మీద చూడం, ఇలాంటి అరాచకాలు ఆడ పిల్లల మీదనే చూస్తాము. పరిష్కారం ఏమిటి అన్నిది కూడా సమాస్యే. వీటిని ఇలా కధల రూపం లో సమాజానికి అందించడం ఒక రకమైన పరిష్కారమే ..

  8. గూడెం చెప్పిన కథ చాల బాగుంది కానీ సొల్యూషన్ ఎక్కడ? సమాజంలో ఇంకో కోణం ఇది.టైటిల్ బాగా సరిపొఇన్ది.

  9. ఈ సమస్యలన్నీ మనం పుట్టినప్పటి నుండి వింటున్నవే అని రచయత్రి పరిష్కారం రాయలేదని అన్న కామెంట్స్ ఎక్కువ వింటాము మనం. కాని రచయత్రి అలా ఆలోచించలేదు. మన దేశానికీ స్వతంత్రమ వచ్చి 70 ఏళ్ళు అవుతోంది అయినా ఇలాంటి సమస్యలు చూడడం భావ్యం కాదని ఆవిడా ఆవేదన. కనీసం ఆవిడా సమాజం ముందుకు తెస్తున్నారు. వీరభద్ర గారు ఎంతో ఆవేశంతో బాగా కామెంట్ ఇచెరు కాని స్రవనకుమార్ example కటువుగా ఉంది.

  10. ఈ కధలో రెండు ప్రశ్నలు చూసేను, విన్నీ అప్పు ఎలా తీర్చడం అని అడిగినపుడు బాగా చదువుకుని మంచి ఉద్యగం చేసుకుంటే అప్పులు తీసుకోవక్కరలేదు అని టీచర్ గా చెప్పిఉన్దచు..అది ఎంత వరకు సాధ్యం అనేది కాకుండా పిల్లలకి మంచి స్పూర్తిని ఇచినత్తుగా.ఇంక మోటార్ సైకిల్ మనిషి కొత్తగా సదివితే మాత్రం పెద్ద ఉజ్జోగాలు వస్తయ్యా అన్న ప్రశ్నకి టీచర్ గా ఎందుకు గట్టిగా మాట్లాడలేక పోయేరో మనకి తెలుసు పరిష్కారం & మర్యాద రెండూ ఉండవు. చిన్నపిలల్లకి చెప్పినట్టు పెద్ద వాళ్ళకి చెప్పలేము కదా. టీచర్ వృతిని సున్నితం గా తీసుకుంటే ఇలాంటి మధన ఉంటుంది మరి. క్లాసు కి వచ్చిన పిల్లలకి పాటలు చెప్పి జీతం తెసుకోవడం వరకు ఉంటె ఈ మాత్రం గ్రహింపు సమాజానికి అందిచడం జరగదు అని నా అభిప్రాయం. రచయత్రి గా ఆమె మధన ప్రపంచానికి అందించేరు.

  11. sreedevi canada says:

    కధ లో రచయత్రి చేసిన ఛాలెంజ్ మంచి ఆలోచన ఇస్తోంది ‘పిల్లల జీవితాలమీద పెద్దవాళ్లకిలాటి హక్కు ఎవరిచ్చారు ? పిల్లలు ‘పనుల్లోకి వెళ్లం’ అని ఎదురు తిరిగితే ఈ అప్పులు ఎలా తీరుస్తారో ‘విన్ని’ అడిగినట్లు’. హాయిగా ఆట పాటలతో చదుకునే వయసులో అప్పులు తీర్చే బాధ్యత ఆడ పిల్లల మీద పెడుతున్నారు. విన్నీ ఎంత అమాయకం గా ‘మళ్లీ ఆ ఒకటి అప్పుని ఎలా తీర్చాలి టీచర్?’ , అది పదుల సంఖ్య అయితే ఒక్క పక్క ఇంటిని, వందల సంఖ్య అయితే మరో పక్క ఇంటిని, వెయ్యిల సంఖ్య అయితే ఆ మరో పక్క ఇంటికి …ఇలా అప్పు తో పాటు అప్పు చేసే ఇళ్ళ సంఖ్య కూడా పెరుగు తుంది అని వాళ్లకి అర్ధం ఆయె లోపు అప్పు & వయసు పెరిగి పోతుంది. భాను గారు రాసినట్టు ఇలాంటి రచనలు ఎంతో అవసరం మరియు reminders to సమాజం.

  12. lakshmi y says:

    బాగా సమాజసేవ చేయాలి అని అనుకున్న వారి కి ఈలాంటి సమస్యలు చాలాచాలా కనిపిస్తాయి .చాలామంది కి కూడా సమాజ సేవ చేయాలి అని వుంటుంది . అనూరాధా గారి లాగా ముందుకి వచ్చి మనవంతు సేవ ప్రతి వక్కరు చేయాలి అప్పుడే ఈ కధ కు ఒక్క అర్ధం. అనురాధ గారు ఇంక మీ దగరనుంది ఈలాంటి కధ లు ఇంకా ఇంకా కావాలి మాకు.
    .

  13. venkat sastry. yanamandra says:

    అప్పు గురుంచి బాగానే చెప్పారు గానీ సమాధానం ఏమని ఇచ్హారు? కధ ని ఇంకా వివరం గా కావాలి. ప్రొబ్లెమ్స్ అంతా ఈ అప్పు తోనే వుంది . వాళ్ళ నాన్న ఆ విద్య ని బాగా చదివించితే బాగుండును ఈలాంటి విద్య లు ఎంతమంది వున్నారో ….. నేను సైతం అంటూ ముందు కు వచ్చిన రచయత అనురాధ గారి కి చాలా చాలా కృతజ్ఞతలు.

  14. thanikella radha krishna says:

    అప్పు తీస వెత – చిన్నారి విన్నీ కథ సమాధానాల కన్నా ప్రస్న్నలే మిగిల్చింది . కానీ ఈ ప్రశ్నలు మన సమాజంలో ఉన్నాయని తెలుయే చెప్పే ప్రయత్యనం అభినందనీయం . అలాగే లెక్కలో అప్పులు అందరకి దొరుకుతాయి కానీ నిజ జీవితంలో ఎందరికి దొరుకుతాయి ? లెక్కలో అప్పు తీర్త్చడం కాన్సెప్ట్ ఉండదేమో కానీ నిజ జివితమలో ఉంటుంది . ఇది చిన్నారి విన్నీ కి తెలుయే
    చెప్పే ప్రయత్యనం రచయిత్రి చేసినట్టు ఎక్కడ కనిపించ లేదు . ఇక విద్య విషయాని కి వస్తే , తల్లి తండ్రులు చేసిన అప్పులు కి పిల్లలను భాద్యత చెయ్యడం సమాజంలో ఉన్న వాస్థవికతకి దర్పణం . ఏది ఎమైన, కథ , కథనాలు మరియు సైలె బాగున్నాయి . అభినందనీయం.

  15. చైల్డ్ లేబర్ ప్రాబ్లం ఉన్న మన దేశంలో రోజు ఎలాంటివి ఎన్ని కథలో?! సమాజం గురించి ఆలోచించేలా చేసే ప్రశ్నలు వేసి అండర్ డాగ్స్ అయిన ఇలాంటి మరో ప్రపంచం మన మధ్యే వుందని చుపిస్తున్నందుకు క్రుతగ్యతలు. – రచన

  16. ఈ సమస్యకి పరిష్కారం చాల కష్టం.. దీనికి definite పరిష్కారం ఇది అని లేదు.. ఎన్నో ఏళ్ళ నుంచి India లో మనం చూస్తున్నాం ..ఇది ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ Aina మల్లి కొత్తగా ప్రెసెంట్ చేసినందుకు థాంక్స్.. సం పేరెంట్స్ టేక్ థెఇర్ కిడ్స్ ఫర్ గ్రంతెద్.. చాల బాధ గ ఉంటుంది పేరెంట్స్ చేసిన పనులకి పిల్లలు consequences పేస్ cheyatam.. When we don’t have a way out, we just get used to .. విద్య లాంటి ఎంతో మంది కి ఆ పరిస్తితి రాకముందు ఏదైన పరిష్కారం దొరకాలి..

  17. N.Suryanarayana says:

    “అప్పు తీసివేత – చిన్నారి విన్నీ” కధ మన గూడెం ప్రజల పిల్లల యొక్క చదువు మీద ఆసక్తి , వాళ్ళకి అందని అవకాశం స్పష్టం గా రచయిత్రి తెలియజేసారు. నేటికి పిల్లలు పెద్దలు చేసిన అప్పులకి భాద్యత వహించడం భాధాకరం. ప్రభుత్వం పేదవారి కుటుంబాలకి ఆర్ధికంగా ఎన్ని విధాలు గా అదుకొంటున్న కుటుంభ పెద్దలు వారి పిల్లల హక్కులని కాలరాసే ఇటువంటి తల్లి తండ్రులు నేటికి మన సమాజం లో వున్నందుకు భాద గా వుంది.

  18. Lakshmi ramesh dasika says:

    మన సమాజంలో బీదరికం వలన చాల కుటుంబాలు , పిల్లల సంపాదన మిధ ఆధారపడుతున్నాయి .వారి భవిష్యతు గురించి ఆలోచన చేసే జ్ఞానము వారి తల్లి తండ్రాలకు లేకపోవడంవలన వచ్చిన ఈ పరిస్థితులను writer బాగా వర్ణించారు . Moreover parents do not see an immediate benefit if they send their children to school.so they prefer them to work to supplement household income.

  19. N.Lakshmi Padmini says:

    అనురాధగారి కధ లో గూడెం పిల్లల సమస్యలు కళ్ళకు కట్టినట్లు చెప్పారు. టీచర్ యొక్క భావాలూ, పిల్లలోని విద్య మీద ఆసక్తి వాళ్ళ పేదరికం స్పష్టంగా కనిపించింది. ప్రజలకోసం ఎన్ని చట్టాలు వచ్చిన విన్నీలాంటి పిల్లకు చదువు అందటం లేదు. ఇటువంటి పిల్లలు తమ స్వేఛ్చ ను పొందడానికి వాళ్ళ పెద్దలలో అవగాహనా రావాలి.

  20. అనూరాధ నాదెళ్ల says:

    నా చిన్నారి విన్నీ కథ చదివి మిత్రులెందరో స్పందించారు. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు.
    ఈ కథలు చదివేసి ఇవన్నీ మనకు తెల్సినవే కదా అని ఊర్కోకుండా నాతో పాటు గూడెంలోకి తొంగిచూసి, అనుభూతించి మీ concern ను, మీ ఆర్ద్రతను పంచుకోవటం చూస్తే ధైర్యం వస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు పిల్లలు, స్కూలు ప్రస్తావన వస్తే దానిలోఎంతగా మమేకం అవుతారో శేషుగారి లేఖ చూస్తే తెలుస్తుంది.
    నాతో బి.ఎడ్ చేసిన ఒక స్నేహితుడు చెబుతుండేవాడు, ‘ మా ఇంట్లో ఎవరూ చదువుకోలేదు.మా నాన్నకి అక్షరాలు రావు. నన్ను చదివించాలనే ఆలోచన మా నాన్నకి వచ్చినందుకు నేను ఆయనని చూసి గర్వపడతాను.’‘ అని. ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి.ఇప్పుడు చదువు విలువ తెలిసున్నవాళ్ల నిష్పత్తి చాలా పెరిగింది. మార్పు నెమ్మదిగా వస్తోంది, మరింతగా వస్తుంది.
    నిజమే, అప్పు తీసివేత నేర్పేటప్పుడు లెక్క వరకే చెప్పాను. ఎందుకంటే విన్నీ ఒక ఆరేళ్ల పాప. నిజ జీవితంలో అప్పులేమిటో అర్థం చేసుకునే వయసు లేదు. ‘లెక్కలో అప్పుని ఎలా తీర్చాలి టీచర్’ అని అడిగిన విన్నీమెరుపు కళ్లతోపాఠం వింటుంది. చదువుకోవటం ఇష్టం అంటుంది.ఒక రోజు సాయంత్రం క్లాసు జరుగుతుంటే విన్నీ వాళ్ల అమ్మ వచ్చి,’ విన్నీ, కొట్టుకాడికి పోయి టీ పొట్లమట్రా’అంది. పుస్తకం లోంచి తలెత్తి ‘ నేను పోను,చదువుకోవాలి ‘ అంటూ తన పనిలో నిమగ్నమైంది. విన్నీ వాళ్లమ్మ ఒక్కక్షణం నిలబడి , నన్ను చూసి నవ్వి వెళ్లిపోయింది. విన్నీ తన హక్కు గెలుచుకుంది ఆ క్షణాన.
    వాస్తవానికి చాలామంది పిల్లలు అప్పుతీసుకునే లెక్కలు మాకు రావు టీచర్, అప్పుతీసుకోవటం మాకు రాదు అనిచెబుతుంటారు. నిజంగా వాళ్ళు అప్పు తీసుకునే పరిస్థితి రాకూడదని కోరుకుంటాను.
    చంటి గారు తమ అభిప్రాయంలో చెప్పినట్టు కాకుండా ఇక్కడ ఆడపిల్లలు, మగపిల్లలు అని తేడా ఏమీ లేదు.అందరూ తల్లిదండ్రుల అప్పులని తీర్చే క్రమంలో పనులకి వెళ్తూనే ఉన్నారు. లక్ష్మి గారు అన్నట్టు చదివించటం అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్.అన్ని సంవత్సరాలు వాళ్లు ఎదురుచూడలేరు. ’ఇంట్లో ఉన్న నలుగురం తలో కాస్తా సంపాదించుకోకపోతే మాకు ఎలా మేడమ్ అంటారు. ‘ పిల్లల్ని పనికి పంపటం పెద్దవాళ్ల హక్కు అన్నట్టే చెబుతారు.
    కథలోని విద్య వాస్తవంలోఅలాగే ఉంది. ఇప్పుడు నేను ఎదురైతే చదువు మాట ఎత్తదు, గబగబా నన్ను తప్పుకు వెళ్లిపోతుంది. ఆమె తండ్రి అప్పు ఇంకా తీరినట్టు లేదు.వెంకట శాస్త్రిగారు కోరుకున్నట్టు విద్యని ఎవరూ చదివించటం లేదు.
    రాధాకృష్ణగారు లెక్కలో అప్పు తీర్చకపోయినా నిజజీవితంలో అప్పుతీర్చాల్సిందే అని చెప్పారు.ఒప్పుకు తీరాలి కదా. చాలా కఠినమైన వాస్తవం.తమ బాధ్యత లేని వ్యవహారమైనా అప్పు తీర్చే బాధ్యత పిల్లలదవుతోంది. శ్రీదేవిగారు చెప్పినట్టు అప్పుతో పాటు మరింత అప్పు,అప్పు తీసుకునే ఇళ్ళు, పిల్లల వయసు పెరుగుతూనే ఉంటాయి.
    ఎందరో పిల్లలు స్కూలుకి వెళ్లకుండా రోడ్లమీద తిరుగుతూ కనిపిస్తూనే ఉన్నారు. వీరభద్రప్పగారు చెప్పినట్టు ప్రభుత్వం నిర్బంధ విద్యను మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తే పరిస్థితి మారుతుంది. దానికి తోడుగా తల్లిదండ్రుల ఆలోచన మారాలి.అదే పరిష్కారం అనుకుంటా.

  21. D.G. Sekhar says:

    మంచి టాపిక్ ఎంచుకున్నారు . చైల్డ్ లబౌర్ మిద ఎన్ని laws వున్నా implementation లో govt పర్తిగా ఫెయిల్ అయ్యింది. ఇటువంటి కధవల్ల కొద్దిగా govt లో అండ్ ఇన్ సొసైటీ లో కదలిక వస్తుందేమో చూద్దాం. గుడ్ వర్క్ కీప్ డూయింగ్.

Leave a Reply to venkat sastry. yanamandra Cancel reply

*