అభివృద్ధి కుట్రపై అరుణాక్షర యుద్ధం!

 

 

-నిశీధి
~

కెహనా సఖు కిత్నా ప్యార్
సెహ నా సఖు ఇత్నా ప్యార్

అతనికింత ప్రేమెందుకు పుట్టిందో విస్మయం , మనలో ఏ లోపం ఆ సహజమయిన ప్రేమకి మనల్నింత దూరం చేసిందని విషాదం. ఎంత దుఃఖం ఎంతకని దుఃఖం , కన్నీళ్ళలో హోలీ డిప్స్ , ఎన్ని లక్షల టీఎంసీల విషాదంలో మునిగినా దొరకని పాప విముక్తి.

అది కవిత్వమా కాదు ప్రభో! మనసు కన్నీరయి కలంలో కరిగి , ముందు కాలం అంతా Development ది అని మనం స్వయంగా మన చేతులతో చేస్తున్న హత్యలపై నిరసన గళం . వెర్రి కేక, మైదానం కొరకు , వలన కాలరాయబడ్డ కఠిన నిజాల నినాదం.

అన్ అవేర్ ఆఫ్ ఆల్ దీజ్ థింగ్స్ అనబడు మన మర్డర్ సంతకాలలో నెమ్మదిగా ఆరిపోతున్న చిరునవ్వులు అవేర్ ఆఫ్ ఆల్ దీజ్ థింగ్స్ స్వయంగా మనకోసం మన జీవితాల్ని వెలిగించుకొంటున్నామనే వృద్ధి మంత్రంతో బ్రతుకంటే రేలా లయలని బ్రతకడమంటే శబరి నీడలో అమాయకంగా నవ్వడమే అని మాత్రమే తెలిసిన జీవితాల్ని ముంచి చంపేసే మనలోని కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్ ని మనసు కోర్టులో వేసే క్షణకాలపు ఉరిశిక్ష . నిజమే ఏడ్చుకోవడానికి మనకి తొక్కలో . కవిత్వం అన్నా ఉంది . వాళ్ళకేమి మిగిల్చాం ? అరుణ్ ప్రశ్నించడు, చాలా సింపుల్గా మనం కట్టుకుంటున్న కొత్త ఆశల ప్రాజెక్ట్ హైయెస్ట్ పాయింట్ నుండి వెల్లువవుతున్న రక్తపు మడుగుల తరంగాలపై ఉల్టా వ్రేళ్ళాడదీస్తాడు . వాక్యాల దిగ్బంధనంలో నిలేసి కలేసి నువ్వు మురుస్తున్న అభివృద్ధి నమూనాలో ఏదో ఒక రోజు నువ్వు నాశనం అవుతావురోయ్ అంటూ గోదాట్లో కలవమని శపిస్తాడు . Yes, dear we all deserve that ultimate curse.

ప్రియతమా

ఒక వాక్యం దాటి ఒకవాక్యంలోకి సాగే ప్రతి ప్రయాణంలో కరిగిపోతున్న ప్రతి క్షణం శబరి ఇసుకల్లో గుండెని అమాంతంగా తవ్వి పాతరేసినట్లు మేటలేసుకున్న దుఃఖంతో తడిపేసాక , ఎవరన్నా రిమూవ్డ్ ఫ్రం రికార్డ్స్ కాగితం చెమ్మలవ్వకుండా గుండెలో గాంభీర్యపు నిశబ్దాలు పెళ్ళుమన్న శబ్దంలో విరిగాక కనీసం ఈ ట్రిబ్యూట్ చదవడమయినా ముగించగలిగితే నిజంగా వాళ్ళు ఐరన్ మ్యానే అని చెప్పుకోవాలి ఖచ్చితంగా.

మనకి తెలియకుండానే లక్షల్లో మనుష్యులని , కొన్నయిన భాషల్ని కొన్ని కోట్ల గుండె చప్పుళ్ళని జలజీవసమాధి చేసిన రక్తసిక్తపు మరణవాంగ్మూలం ఈ మ్యూజిక్ డైస్ .. కొట్టుకొచ్చిన శవాలని సాముహిక దహనం చేసిన బూడిదల్లో కోరి తెచ్చుకున్న నాశనానికి రాసుకున్న ముందస్తు విలాపవాక్యం.

ఈ గిల్టీ కన్ఫెషన్స్ లోకి మనల్ని అమాంతంగా తీసుకెళ్ళి , అక్కడ తప్పిపోయిన చంటిపిల్లలవడానికి బయటికి రాలేని బేలతనంలో బోరుబోరున ఏడ్చుకోవడానికి అరుణ్ వాక్యం కాకుండా వాడిన మరో అస్త్రం ప్రతి పేజ్లో అమాయకంగా ప్రశ్నల కళ్ళేసుకొని చూసే ఇమేజెస్ . పచ్చపూలతో చిరునవ్వులు చిందించే కోయ అడుగులు , దుఃఖంతో పూడుకుపోతున్న ముసురు గోదావరి , కూనవరం గిరిజన బాల్యంలో దిగులు , గొడుగుల కింద దాగి తొంగి చూస్తున్న విప్పసార , మూలబడ్డ భాస్కర్ టాకీస్ , నాచు గోడలు , గిరిజన బడులలో దడుల మధ్య దూరి ఆడుకుంటున్న పసితనాలు, భవిష్యత్తు అయోమయంలో నడిరోడ్డున పడ్డ యవ్వనాలు . ఎన్నని చెప్పడం ? ఒకో ఇమేజ్ అలా వాక్యాల్లో వొదిగి కవిత్వంగా మారిందా లేక కవిత్వాన్ని అల్లుకున్న ఆర్తి ఒక ఇమేజ్గా మారి మనల్ని కాలుస్తుందా చెప్పడం నిజానికి చాలా కష్టం.

అలాగే ఎన్ని కంటి చెమ్మలు ఒక పాటగా మారిందో చెప్పడమూ కష్టమే . అనుకుంటా ఇలా ..

ఇళ్ళు: ఇన్నిన్ని ముఖాలేసుకున్న ఇళ్ళు
ఆశలు కూలిన ఇళ్ళు
వంటరైపోయిన ఇళ్ళు
ఇళ్ళ కళ్ళ నిండా నీళ్ళు
భయం భయంగా
తమలోకి తాము
ముడుచుకుపోతున్న ఇళ్ళు

అన్న పదాల వెనక ఉన్న ఊళ్ళు ఇళ్ళు వదులుకొని మొదలు నరికిన పచ్చటి చెట్లని వదిలి ఎగరలేక కుప్పకూలిన రెక్కలపే దిగులు పడతామా

మైదానం కమ్మిన ఇనుప తివాచీ
ఆపాద సంస్కృతి అనగా సాంఘిక ఆటవికత
బ్రతుకు పృథక్కరణ చెందింది
ఒకనాటి రేల పాట పరీవాహకప్రాంతమీది
ఈ ఎడారిలో వనం కోసం అంజనం వేయాలి

అంటూ నిజాల్ని చిన్న పదాల్లో పెద్ద కోతల్లో ముందుకు తెచ్చినప్పుడు ముఖంలో అరచేతులు దాచుకోని సిగ్గుపడాలా ?

పాటలని చంపేసి , ప్రకృతిని చంపేసి , నిలబడడానికి నీడలేకుండా చేసుకుంటూ విస్తరిస్తున్న మైదానపు మోడరన్ మ్యాన్ ఎడారితనంపై పసితనాన్ని పచ్చదనాన్ని వదులుకోలేని అడవిబిడ్డల తరపున దుఃఖపు సూరీడు చిందించిన గోదారి రక్తం గురించి ఎంత చెప్తే సరిపోతుంది అని అసలు ఎంత హృదయానికి అద్దుకున్నా మనం అడ్డుకోలేని నయాకాలపు జల సమాధి లో మునిగిపోతున్న కుంట నాగరికత ముగిసిపోతున్న గదబ సవర లాంటి జాతులు . నిజమే ఇహ వాళ్ళంతా రామాపితికస్ గురించి చదువుకున్నట్లు అంత్రోపాలజీ పాఠాల్లో మాత్రమే మిగులుతారేమో అరుణ్ ప్రిడిక్ట్ చేసినట్లు . లేదా లుప్తమవుతున్న జీవజాతులనీ సంరక్షించుకున్నట్లు ల్యాబుల్లోనో లేక తర్వాత తరాల ఎజ్జిమిషన్టో రీల్లోనో మిగులుతారేమో

కవిత ఆచరణకి సాటిరాదు అయితే గియితే ఒక సహానుభూతి ఒక మద్దత్తు ప్రకటన ఒక నినాదరచన నీ జనం నేల కోసం పోరాడుతున్నచోట కనీసం గొంతయినా కలపకపోవడం నేరం అని డిక్లేర్ చేసిన అరుణ్ వాయిస్కి ఇదంతా ఒక పిచ్చుక తోడు మాత్రమే ఆకరున మాత్రం ఈ మాట చెప్పకుండా ముగించలేను . మీరు నడిచొచ్చిన మట్టికే కాదు అరుణ్ , ప్రపంచానికి ముఖ్యంగా కవిత్వానికి ఒక అద్భుతమయిన మెలాంకలీ అందించారు . చచ్చిపోయిన పాటకి మీదయిన గొంతునిచ్చారు . Kudos, Arun Sagar!  you nailed all those culprit souls with your heart reckoning poetry.

పోడుకోసం గూడుకోసం తునికాకురేటు కోసం అడవిహక్కుల కోసం జెండాలై ఎగిరిన ప్రతిప్రాణానికి మీ సెల్యూట్ పాటు మీ ఆర్తిగీతానికి మాదో సెల్యూట్ .

*

మీ మాటలు

 1. c.v.suresh says:

  ఒక బడబానలపు హోరు….విరిగిపడుతున్న కొండచరియ…!కవిత్వపు అగ్ని కీలల కు సమాంతరపు జ్వాల…! సమీక్ష పైన మరో సమీక్ష రాసేంతటి ఉద్వేగాన్ని అందించింది…! కవికెంతటి కమిట్మెంట్ ఉందో ..అంతకు రెట్టింపు మీ సమీక్ష లో …..! కుడోస్!!

  • బ్రెయిన్ డెడ్ says:

   నిజంగా కదిలించిన కవిత్వం . థాంక్స్ సర్

 2. Jhansi Papudesi says:

  అరుణ్ సాగర్ పోయెట్రీ అర్థం చేసుకోడానికి ఎంత స్ట్రగుల్ అవుతానో ..మీ సమీక్ష కోసం కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సి వొచ్చింది. అద్భుతంగా వ్యక్తీకరించారు. మైదానాలుగా మారడంలో జీవితాల్ని కోల్పోతున్న వారికోసం అరుణ్ గారు చేస్తున్న అక్షరోద్యమం. హాట్సాఫ్!!

  • బ్రెయిన్ డెడ్ says:

   అయ్యూ అప్పటికి చాలా కుదురుగా రాసాను అండి . థాంక్స్ కొంతః ధైర్యం వచ్చింది సమీక్ష రాయడానికి

 3. విలాసాగరం రవీందర్ says:

  అరుణ్ సాగర్ పోయట్రి అర్థం కావడం కష్టమే. ఆయన సాంద్రత అలాటిది. పూసగుచ్చినట్లు విశ్లేషణ రాసిన మీకు సెల్యూట్ లు

  • బ్రెయిన్ డెడ్ says:

   కవిత్వం గొప్పదనమే రవీందర్ గారు అది

  • బ్రెయిన్ డెడ్ says:

   నిజం రవీందర్ గారు . వాక్యాల్లో కొట్టుకుపోవడమే

 4. అరుణ్ నిరసన గీతానికి కుదురిన బాణీ కట్టినట్లుంది సమీక్ష.

 5. Rama Krishna says:

  టీచర్.. మీ విశ్లేషణ అద్భుతం
  ఈ బుక్ ఖచ్చితంగా చదవాలనిపిస్తుంది కాదు కాదు చదివేలా చేస్తుంది మీ రివ్యూ
  Than q very much teacher

 6. అరుణ్‌సాగర్ గారి కవిత్వమొక సునామీలా విరుచుకుపడుతుంది ఎపుడూ…ఆ తాకిడి ఎంతటి బలమైనదనే సంగతి మీ వాక్యాలనుంచి అంతే శక్తివంతంగా చదవగలగడం ఇపుడే పూర్తిచేశాను.

 7. Mohan.ravipati says:

  మీ సమీక్ష అధ్బుతంగా ఉంది, అరుణ్ సాగర్ కవిత్వం చదవటమంటే అరచేతిలొ అగ్నికణాన్ని ఉంచుకొని పిడికిట్లో పెట్రోలు ఉంచుకున్నట్లే . అత్మ విస్ఫొటనం ఉంటుంది, మీరు ఆ అగ్నికణానికి ఎక్కడైనా బూడిద అంటిందేమో సరిగా మండటం లేదు అని ఊది వదిలారు, ఇక ఆ మంట మామూలుగా దహించదు, దహించి దహించి మనలొ ఉన్న భ్రమలన్నీ తొలిగిపోయి కొత్త మనిషి వచ్చేంతవరకు దహిస్తాయి, ఖుద్దోస్ !!

  • బ్రెయిన్ డెడ్ says:

   మీ కామెంట్ కి నిజంగా చాల స్పందన వచ్చింది . థాంక్స్ సర్

 8. Shrutha Keerthi says:

  అరుణ్ సాగర్ గారి కవిత్వం ఇపటివరకూ ఒక జలపాతం…ఈ పరిచయంలో వంద జలపాతాల హోరు కనిపిస్తుంది..అర్జంట్ గా చదవాలిక..!!

 9. Sudheer kumar says:

  __/\__ అద్భుత సమీక్ష

 10. వాసుదేవ్ says:

  వైయక్తికతనుంచి బయటపడి పూర్తిగా సామాజికాంశం ప్రధానంగా ఓ దీర్ఘ కవిత చాలా అరుదు. అరుణ్ వాక్యంలోని పదునైన విరుపు, పాయింట్ బ్లాంక్ రేంజ్‌లోనుంచి పాఠకుడికి తగిలేలా మాటని బుల్లెట్‌‌లా వాడటం అరుణ్ ప్రత్యేకత. అతని వాక్యం తెల్సిన పాఠకుడిగా తప్పకుండా ఈ కవిత చదవాల్సినదే అనుకుంటూన్నా …నా అంచనా తప్పుకాదని మీ సమీక్ష మరోసారి ఋజువుచేసినట్లే. ఈ కవితకి మీరు మాత్రమే సమీక్ష రాయటానికి అర్హులు అన్నది ప్రూవ్ అయింది. కుడోస్

  • బ్రెయిన్ డెడ్ says:

   నిజం , ఎక్కడో పర్సనల్ అంశాల మేలి లేని కవిత్వం అరుదే .

 11. noor ahamed says:

  నయా కుహనా అభివృద్ధి వాదులను నిక్కచ్చిగా కడిగి పారేసిన ఓ అరునారుణ కిరణం… మనిషి తత్వాన్ని తట్టి లేపిన కవిత్వానికి నిఖార్సు అయిన సమీక్ష…

 12. నిత్యా వి says:

  ఈ గిల్టీ కన్ఫెషన్స్ లోకి మనల్ని అమాంతంగా తీసుకెళ్ళి , అక్కడ తప్పిపోయిన చంటిపిల్లలవడానికి బయటికి రాలేని బేలతనంలో బోరుబోరున ఏడ్చుకోవడానికి అరుణ్ వాక్యం కాకుండా వాడిన మరో అస్త్రం ప్రతి పేజ్లో అమాయకంగా ప్రశ్నల కళ్ళేసుకొని చూసే ఇమేజెస్ .
  ఇటువంటి అద్భుతమైన కవిత్వాన్ని ఇటువంటి పదాలతో పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. మీ విశ్లేషణ వల్ల కాస్త ధైర్యమూ వచ్చింది …క్లిష్టమైనవి చదవడానికి.

 13. బ్రెయిన్ డెడ్ says:

  మీకు బాగా నచ్చుతుంది . నిజానికి క్లిష్టత ఏమి లేదు . భావోద్వేగాల ప్రవాహం

 14. విధ్వంసకర అభివృద్ధి నమూనాలను నెత్తికెత్తుకున్న పాలక వర్గాల కుట్రను అరుణ్ కవిత్వం ప్రశ్నించడం ఆహ్వానించదగ్గ ఒక అత్యవసర రచన. ఈ జల సమాధిలో అంతరించిపోతున్న తెగలు ఆదిమ సంస్కృతులు భాషా మూలాలు ఎవరికీ పట్టేవి కావు ఈ కాలంలో, అందుకే వాట్సప్ కాలంలో ఆ పోరగాల్లు మరల బన్దూకులెత్తుకున్నది. కానీ అది నేరంగా రాజ్యంతో పాటు సమకాలీన మధ్యతరగతి మేధావి వర్గము విరుచుకుపడింది. ఈ సందిగ్ధ సంక్షుభిత కాలంలో ఇలాంటి కవిత్వం రావడము దానికి మీ పరిచయం చాల అవసరం. ప్రచురణ కర్తలకు అభినందనలు. మీరిలా మరిన్ని నేలవంకలను అద్దంలో చూపాలని ఆసిస్తూ…

  • బ్రెయిన్ డెడ్ says:

   అందుకే వాట్సప్ కాలంలో ఆ పోరగాల్లు మరల బన్దూకులెత్తుకున్నది. అది నేరంగా రాజ్యంతో పాటు సమకాలీన మధ్యతరగతి మేధావి వర్గము విరుచుకుపడింది. సత్య వచనం థాంక్స్ సర్ జీ మీ వాక్యమో ధైర్యం . తిని కూర్చునే వర్గాలకేం తెలుసు మట్టి బాధ అని మరి మధ్య తరగతేగా పల్లకీ మోసేది . ఆ కాస్త ఉద్యోగమూ నోటి దగ్గర కూడు పోతుంది అన్న బాధ పాపం వాళ్ళకి .

 15. Sharada Sivapurapu says:

  సమీక్ష రాసినా కవిత రాసిన మీ వాక్యాలకో స్పెశాలిటీ ఉంది నిశిజి. అరున్సాగర్ గారి వాక్యాల కెంత స్పీడూ పదునూ ఉందొ అంతకంటే పదునుగా చెప్పాయి మీ వాక్యాలు. జలపాతం మీంచి జారి పడ్డట్టే ఉంది చదువుతుంటే.

 16. సాయి.గోరంట్ల says:

  నిజంగా బాధాకరం
  లక్షల గోంతుకలకు నినాదమైన అరుణ్ పేదల,పీడితుల పక్షాన తన అక్షరాయుధాలను ఎక్కుపెట్టి సమాజపు కుళ్ళును తూర్పారపట్టిన మిత్రునికి మీ అక్షర నివాళి……👌👌👌

 17. థాంక్యూ బ్రెయిన్ జీ… గొప్ప సమీక్ష …
  అరుణ్ సాగర్ జీ 💧🌼..

 18. lasya priya says:

  అరుణకిరణాలని మళ్ళీ చూడలేమా …మళ్ళీ మళ్ళీ చదివించే ఆ సాగర ఘోష ఎందుకిలా మూగవోయిది … ఆయన కవిత్వాన్ని మీదైన పదాలతో అందించారు ..అద్భుతంగా ఉంది మీ సమీక్ష . ఏమో మళ్ళీ ఇలాగైనా ఆ అరుణసాగరుణ్ణి అప్పుడప్పుడు మీ సమీక్షలతో అందించండి మేడమ్. ఎంత బాధగా ఉందో …/\…..

మీ మాటలు

*