కట్టు బానిస రగిల్చిన కాగడా!

-నిశీధి 

~

విరిగిన మనుష్యులని అతకబెట్టె మరమ్మత్తుల పనులకన్నా  ఒక  బలమయిన కొత్త తరాన్ని  నిర్మించుకోవడం సులభం అన్న విషయం  Ac రూముల్లో కూర్చొనో ఇరానీ చాయిల మధ్య సిగార్ ధూపాల్లో రాలిన ఆకుల్లో  పచ్చదనాన్ని వెతుక్కొనే కవిత్వపు కళ్ళ సాహిత్యానికెలా తెలుస్తుంది ?

బానిసత్వపు  సంకెళ్ళని  వదిలించడానికి కాఫీ టేబుల్ పోయెట్రీ కాకుండా సూర్యుడి మొహాన  వదలని నెత్తుటి మరకలని స్వయంగా  తుడిచే ధైర్యం తో పాటు అసలు మరకెంత మరణమో తెలిసుండాలి. ఒక కట్టు బానిసకేమిటీ అసలు తెలివితేటలు ఏమిటీ అని ముక్కు మీద వేలేసుకొని నవ్వే ప్రపంచం ముందు వెలుగుతున్న కాగడాగా నిలబడి స్లేవరీ నుండి సెలెక్టెడ్ రీడింగ్స్ వరకు మిగిలిన ఒకే ఒక ఉదాహరణ ఫ్రెడెరిక్ డాగ్లస్ . చీలమండలు చినిగి రక్తాలోడేలా ఒక తోటి మనిషికి సంకెళ్ళేసే వ్యక్తి ఆ సంకెళ్ళ తాలూకు మరో అంచు అతని మెడకి ఎప్పుడో చుట్టుకుంటుంది అన్న నిజం తెలియకుండా ఉండడు అని తెలిసి మనుష్యులని   జంతువులకన్నా  హీనంగా  చూసే అసహ్యాల గురించి ఆటను రాసుకున్న  మాటలు  ఎంత నిజం కదా .

పరిస్థితుల్లో మార్పు రావాలంటే వెలుగు కాదు ఇపుడు కావాల్సింది ఏకంగా  కార్చిచ్చు . గాయాలకి లేపనమయ్యే చిరు జల్లులు కాదు  అసలు గాయాల ఉనికే కొట్టుకుపోయే సునామీలు తుఫానులు హోరుగాలులు  అని పద్దెనిమిదో శతాబ్దపు మొదట్లోనే ఫ్రెడరిక్ రాసాడు  అంటే , ఇప్పటి అసహన దినాలు లేదా టార్చర్ సెల్స్ లా  మారి  నోక్కకనే నొక్కుతున్న మనసుల మధ్య నెమ్మదిగా హృదయాన్ని బాధించకుండా మృదువయిన మాటలలో విప్లవం గురించి మార్పుల గురించి చెప్పాలండి అనే మితవాదులు ఏ చీకటి గూట్లో తల దాచుకుంటారో ఒకోసారి చూడాలనిపిస్తుంది .

అంతేనా జనం వాళ్ళు కోరుకున్న ప్రతిది వాళ్ళ వాళ్ళ పనుల ద్వారా పొందలేకపోవచ్చు కాని వాళ్ళిప్పుడు ఉన్న స్తితికి గతికి కారణమయిన పని పట్ల గౌరవం ఉండాల్సిందే పని చేస్తూ బ్రతకాల్సిందే అన్నాడు కూడా బాబు అంటే సడెన్గా అది సాహిత్యం అయినా ప్రజా యుద్ధం అయినా మాకు కావలసినంత గుర్తింపు రాలేదు కాబట్టి పని చేసే  ఇంట్రస్ట్ లేదు అని చెప్పే బద్ధకపు పని దొంగల సాంబార్ బుడ్డి ఎక్కడ గప్చుప్ అవుతుందో కూడా మరో తరానికి తెలియాలి . ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయాలో లాగి పెట్టి కొట్టినట్లు చెప్పిన ఈ ఒక్క మాట చాలు ఫ్రెడరిక్ మిమ్మల్ని ప్రేమించడానికి అని చెప్పాలి అనిపించదా ఆ  పెద్దాయన కనిపిస్తే మాత్రం ?

, రచయిత , వక్త , పరిపాలనకర్త . అన్నిటిని మించి కాపిటల్ పనిష్మెంట్ కింద అప్పట్లో బ్రతుకుకాలం పాటు బానిసగా బ్రతకమనే శిక్షని అబాలిష్ చేసిన వ్యక్తిగా Frederick Douglass ( 1818 – 1895) బానిస జీవితాల దుర్భారత్వాలని వివరిస్తూ రాసిన కొన్ని వాక్యాలు చదివితే గుడ్నే తడవ్వదా ? “ ఓపెన్ సీక్రెట్ ఏమిటంటే మా యజమానే నా తండ్రి అన్న విషయంలో రహస్యమెంతొ నిజమెంతో నాకెప్పుడు తెలియలేదు కాని రాత్రి చీకట్లో మాత్రమే నన్ను జోకొట్టి ఉదయం వెలుగుకల్లా మాయమయ్యే అమ్మతో గడిపిన జ్ఞాపకం బహుశ ఆ కొన్ని క్షణాలేనేమో “

పోనీ ఇది చదివితే అన్న ఏమన్నా కదలిక ఉంటుందా మనలో  , మనది కాని జీవితాల పట్ల మనకుండాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూస్తయినా పెరుగుతుందా ?

f2

స్వేచ్చ

 

ఈ అందమయిన భీభత్సపు  స్వేచ్చ

పీల్చే గాలంత అవసరం అయిన స్వేచ్చ

ఉపయోగపడే పచ్చని భూమంత స్వేచ్చ

పూర్తిగామనదైనప్పుడు

రాజకీయనాయకుల టక్కుటమార శుష్క వచనాల్లా కాకుండా

సంకోచవ్యాకోచాలు  అసంకల్పిత చర్యలంత సహజంగా

ఆలోచనలని ఆపలేని మెదడంత స్వేచ్చ మనం గెలిచినప్పుడు

ఈ మనిషి, ఈ డగ్లస్, ఈ పూర్వ బానిస,

మోకాళ్ళ విరిగేలా కొట్టబడ్డ  ఈ నీగ్రో

ఏ మనిషి గ్రహాంతరవాసికాని

ఎవరూ వేటాడబడని

వంటరవ్వని

ఒక కొత్త ప్రపంచాన్ని వీక్షించాలని కోరిక

ప్రేమ తారకం నిండిన ఈ మనిషి జ్ఞాపకాలు

గొప్ప వాక్పటిమ నిండిన కావ్యాల్లో

మూలమలుపుల్లో వంటరిగా నిలబడిన కంచి విగ్రహాలలో కాకుండా

తన బ్రతుకునుండి బ్రతుకై నిలిచే

తన కలలని రక్తమాంసాలలో అదుముకొనే

ముందు తరాలుగా చూడాలన్న కోరిక

*ఇది రాస్తున్నపుడు ఎందుకో ఒక్క క్షణం అంబేద్కర్ జ్ఞాపకం , ఒక వేళ బాబా సాహెబ్ ఈ కవిత రాసి ఉంటే ఇదే రాసేవారేమో కదా ? పూలుపళ్ళలో పలుకు చివర దండాలలో కాకుండా నన్ను నా భావజాలాన్ని  గుండెలలో నింపుకొండి అనేగా చెప్పేవారు ?

ఫ్రెడరిక్ రాసిన ఒరిజినల్ పోయెం

When it is finally ours, this freedom, this liberty, this beautiful

and terrible thing, needful to man as air,

usable as earth; when it belongs at last to all,

when it is truly instinct, brain matter, diastole, systole,

reflex action; when it is finally won; when it is more

than the gaudy mumbo jumbo of politicians:

this man, this Douglass, this former slave, this Negro

beaten to his knees, exiled, visioning a world

where none is lonely, none hunted, alien,

this man, superb in love and logic, this man

shall be remembered. Oh, not with statues’ rhetoric,

not with legends and poems and wreaths of bronze alone,

but with the lives grown out of his life, the lives

fleshing his dream of the beautiful, needful thing.

 

మరోసారి మరో ఉత్తేజంతో

బ్రెయిన్ డెడ్ !

 

 

 

 

మీ మాటలు

  1. వాసుదేవ్ says:

    “ఒక కట్టు బానిసకేమిటీ అసలు తెలివితేటలు ఏమిటీ అని ముక్కు మీద వేలేసుకొని నవ్వే ప్రపంచం ముందు వెలుగుతున్న కాగడాగా నిలబడి స్లేవరీ నుండి సెలెక్టెడ్ రీడింగ్స్ వరకు మిగిలిన ఒకే ఒక ఉదాహరణ ఫ్రెడెరిక్ డాగ్లస్” ఇతని పద్యాల్ని బయోగ్రఫీని పదేళ్లపాటు బోధించిన అనుభవంతో మీ వ్యాసం ఆసాంతం చదవకుండానే అతని కవితదగ్గరే ఆగిపోయాను.
    “నా యజమానే నా తండ్రి అని తెల్సి ‘స్కూల్లో అందరూ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మరి నా బర్త్ డె ఎప్పుడు’ అని అడగాలని చాలా బలంగా అనిపించేది కానీ ఆ ప్రశ్నకి జవాబు దొరక్కపోగా నా కున్న ఆ ఆశ్రయం కూడా పోతుందని అందరూ చెప్పటంతో అది ఆశగానె మిగిలిఫోయింది” అని రాసుకున్నాడు డగ్లస్.
    “స్వేచ్చ” బానిసలకి మాత్రమే తెల్సిన ఏకైక పదం. జీవితంలో ఏడేళ్లకే తల్లిని పోగొట్టుకున్న డగ్లస్ ఏనాడు తన తల్లిని పగలు చూళ్ళేదంటే పద్దెనిమిదీ , పంతొమ్మిది శతాబ్దాలలో వీరి పరిస్థీతి అర్దం చేసుకోవచ్చు.
    “మూలమలుపుల్లో వంటరిగా నిలబడిన కంచి విగ్రహాలలో కాకుండా

    తన బ్రతుకునుండి బ్రతుకై నిలిచే

    తన కలలని రక్తమాంసాలలో అదుముకొనే

    ముందు తరాలుగా చూడాలన్న కోరిక”

    • బ్రెయిన్ డెడ్ says:

      హమ్మయ్య మొత్తానికి మంచి మార్కులతో పాస్ అయినట్టే . సబ్జెక్ట్ తెలిసినవాళ్ల నుండి మంచి కామెంట్స్ వస్తే ఆ కిక్కే వేరు కదా ? థాంక్స్ వాసుదేవ్ గారు

  2. చాలా బాగుంది

    మనది కాని జీవితాల పట్ల మనకుండాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూస్తయినా పెరుగుతుందా ?

    జవాబేంటి?

    • బ్రెయిన్ డెడ్ says:

      హ అదే బిలియన్ డాలర్ ప్రశ్న పెరుగుతుందనే అనిపిస్తుంది ఆశాజీవులం కదా

  3. bhanu prakash says:

    ఈ అందమయిన భీభత్సపు స్వేచ్చ

    పీల్చే గాలంత అవసరం అయిన స్వేచ్చ

    ఉపయోగపడే పచ్చని భూమంత స్వేచ్చ

    పూర్తిగామనదైనప్పుడు…………తను ఉన్న ప్రపంచం లోని పంచభూతాలు కేవలం తన యజమాని ఎంత ఇస్తే అంతవరకు మాత్రమే వాడుకునే బానిసకి ప్రేమ స్వేశ్చ అన్ని వాటంతే కావాలి,మీ వల్లా ఇలాంతి విషయాలన్ని తెల్స్తున్నాయి,థ్యాంక్యు సోమచ్

    • బ్రెయిన్ డెడ్ says:

      థాంక్స్ భాను . నిజానికి ఈ పరిచయాల వెనక కొత్తగా రాస్తున్న కవులకి ఇవన్నీ తెలిస్తే , మీలా పదునుగా రాసే కలాలు ఇంకా పదునెక్కాలన్న ఆశ

  4. shrutha keerthi says:

    డగ్లస్ లాంటి గొప్ప వ్యక్తి పోయంని పరిచయం చేసినందుకు థ్యాంక్స్ నిశీధి గారు.roots,tom uncle’s cabin లో చదివిన వన్నీ కళ్ళముందు మెదుల్తున్నాయి.స్వేచ్ఛ కు నిజమైన అర్థం యివి చదివే తెలిసింది.వారి విగ్రహాలను కాకుండా స్ఫూర్తిని నిలుపుకోవాలని చెప్పడం గొప్పగా వుంది

    • బ్రెయిన్ డెడ్ says:

      కరెక్ట్ బుక్స్ గుర్తు చేసారు . నిజం అన్ని పుస్తకాల్లో అదే వేదన కదా

  5. Vinodkumr.Matam says:

    సంకొచవ్యాకొచాల అసంకల్పిత చర్యలంతా సహజం

    • బ్రెయిన్ డెడ్ says:

      కదా ! మీరు చదవడమే కాదు జి+ లో షేర్ చేయడం నిజంగా బాగుంది థాంక్స్ సర్

  6. మనది కాని జీవితాల పట్ల మనకుండాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూస్తయినా పెరుగుతుందా ?
    ఇలా ఫెడెల్మని కొట్టినపుడైన ధీర్ఘకోమా నుంచి బయటపడాలిగా…

    సంకోచవ్యాకోచాలు అసంకల్పిత చర్యలంత సహజంగా
    ఆలోచనలని ఆపలేని మెదడంత స్వేచ్చ మనం గెలిచినప్పుడు
    ఈ వాక్యాల్లో కొట్టుమిట్టాడినంత అసంకల్పిత చర్య, స్వేచ్ఛ ఇంకెక్కడా దొరకదేమో… అనువాదానికి అద్దంలాంటి మీ అక్షరానికి బోల్డు కృతజ్ఞతలు

    • బ్రెయిన్ డెడ్ says:

      థాంక్స్ సత్య ! ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంచుకొనే దిశగానే ఈ అడుగులన్నీ

  7. కెక్యూబ్ వర్మ says:

    రచయితకు సామాజిక నిబద్ధత అవసరం లేదన్న కాలమిది. పోస్ట్ మాడర్న్ కాలంలో ఇలాంటి అణచబడ్డ గొంతుల్ని మరిన్ని మీరు పరిచయం చేయాల్సిన అవసరముంది. రాజకీయాలతో నిత్యం మమేకమై బతికే మనిషిని ఆ రాజకీయాలు అంటకుండా రాయమంటున్న కాలం కూడాను. కవిఐనా రచయితైనా నేడు తలచుట్టూ కళ్ళతో నిశితంగా పరికించి మేల్కొలపాల్సిన తరుణమిదే. డగ్లస్ వారసులు కోట్టాదిమంది మగ్గుతున్న దేశమిది. మీకు అభినందనలతో ..

    • బ్రెయిన్ డెడ్ says:

      ఫిజికల్ బానిసత్వాలు వదిలించుకొని మానసిక బానిసత్వాలలో కొట్టు మిట్టులాడుతున్న ప్రతి దేశపు వారసుల కి ఇలాంటి కవిత్వాలు జీవిత గాధలు ఇన్స్పిరేషన్ ఇస్తాయనే అనుకుంటున్నాను సర్ జీ మీరన్నది నిజం ఇంకా ఇంకా ఇలాంటి కవితలు మాటలు బయటికి రావాల్సిన అవసరం ఉంది .

  8. శ్రీనివాస్.. says:

    మీ విజన్.. మీరు పడుతున్న శ్రమ అభినందనీయం నిశీధిగారూ..
    మీ ప్రయత్నం జయించాలి..
    మీరు కలలుకనే మనిషితనం జనించాలి..

Leave a Reply to bhanu prakash Cancel reply

*