మాట‌ల్ని మింగేస్తున్నాను 

 

-నామాడి శ్రీధర్

~

namadi sridhar

 

 

 

 

 

ఎవ‌రేమి చెబుతున్నా
బుద్ధిమంతుడి వ‌లె ఊకొడుతున్నాను
భ‌య‌మో సంశ‌య‌మో
అవును కాద‌నే గురిని మింగేస్తున్నాను

ఎక్క‌డేమి జ‌రుగుతున్నా
ప్రేక్ష‌కుడి మ‌ల్లే తేరిపార చూస్తున్నాను
ఉపేక్షా నిర్ల‌క్ష్య‌మా
నిజం అబ‌ద్ధ‌మ‌నే రుజువుని చ‌ప్ప‌రిస్తున్నాను

శ‌తాబ్దాల త‌ర‌బ‌డి
నెత్తురోడ్చే ఊరుల పేర్ల‌నీ
సాటి మ‌నుషులు హ‌త‌మారిన చిరునామాల్నీ
ఉచ్చ‌రించ‌కుండానే గ‌మ్మున గుట‌క‌లేస్తున్నాను

ఆ చిల్ల‌ర‌దొంగ వెంట‌బ‌డి
ఓ వీధికుక్క మొరుగుతుంది
ఖూనీకోరుల మ‌ధ్య నిల‌బ‌డిన నేను
ఒక్క పెనుకేక‌ని పుక్కిలించ‌లేక‌పోతున్నాను

విష‌గుళిక‌ల ప‌లుకుల్ని మింగీ మింగీ
చేదుబారిన గుండెలో జాగా మిగ‌ల‌లేదు
ఇప్పుడిక దాద్రి క‌ల‌బుర్గి నామధేయాలు
నిప్పు ముద్ద‌లై ఈ గొంతుక దిగ‌డం లేదు

*

మీ మాటలు

  1. చాలా బాగుంది సర్

  2. badugu baskar jogesh says:

    Hindu Mata chandasula vishapu gulikalaku chedubarina gunde
    vedanabharita agraha anuvadam adbhutamga aviskarincharu congratulations sir

  3. ఒక్క పెనుకేక‌ని పుక్కిలించ‌లేక‌పోతున్నాను,..వావ్

  4. గొరుసు says:

    అందరిదీ “మీ” పరిస్థితే శ్రీధర్ – ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ అని పెదవుల కడ్డంగా చూపుడు వేలు నిలబెట్టి గుడ్లు తేలేస్తున్నాం.

Leave a Reply to గొరుసు Cancel reply

*