స్టాండింగ్ టాల్

 

 

 

-అరుణ్ సాగర్

 

arun

 

 

 

 

 

తడిసిపోయినది

నానిపోయినది

నాచుపట్టి పాచిపట్టి

వక్షస్థలమంతా పచ్చిపచ్చగా

 

ఊరు ఒదిలిపెట్టి

-రానని మొరాయించే నాన్న వలె

ఎర్రెర్రని తడి ఇటుకలకింద

ఏళ్లకేళ్ల బతుకుపొరలను

గుండె బరువున అదిమిపెట్టి

 

బీటలువారిన రొమ్ము విరుచుకుని

-మహా మొండిగోడ ఒకటి

మునిగిపోయిన ఊరి నడుమ

పిడికిలి వలె శిరసునెత్తి

నలుదిశల వెతుకుతున్నది

ఆఖరి శ్వాసలోనూ

ఓటమినొల్లని మల్లుని వలె!

*

 

 

మీ మాటలు

  1. బ్రెయిన్ డెడ్ says:

    ముందు బోల్డు హాశ్చర్యం , అప్లోడ్ చేసేప్పుడు పేజ్తీసి ఏమన్నా మిగిలిన చాల మిస్సింగ్ ఏమో అని . కాసేపు మళ్ళీ వెతికొచ్చాను , ఎందుకయినా మంచిదని ఒళ్ళు దగ్గరెట్టుకొని చదివాక అర్ధం అయింది , పద్యం అంతా కలిపి ఆ నాలుగు లైన్లే అని కాకపోతే జీవితభారాన్ని మోస్తున్నాయని , మునిగిపోయిన బ్రతుకుల మధ్యలో నిలబడటానికి చచ్చేవరకు ప్రయత్నిస్తున్నాయని . బాగుంది అన్నది చిన్నమాట . కుడోస్

  2. Parupalli Sreedhar says:

    అరుణ్ పొయిటిక్ ‘శాగా’. అరుణ్ శాగార్. మనసు మీద ముద్రవేసుకున్న జ్ఞాపకాలను కాలంతో, పరిణామాలతో అద్ది అక్షరాసులు పోస్తారు. బాగుంది.

మీ మాటలు

*