మైనారిటీ వాదం మత వాదమా ?

 

-పి. విక్టర్  విజయ్ కుమార్

~

‘ చమ్కీ పూల కథ ‘ అని నేను ‘ చమ్కీ  పూల గుర్రం ‘ కథ పై రివ్యూ రాసాక, కొంత మంది మితృలు నాతో ఒక ప్రశ్న లేవనెత్తారు ‘ ముస్లిములను సపోర్ట్ చేయడం అంటే ( ముస్లిం ) మతాన్ని సపోర్ట్ చేసినట్టు ఉండదా ? ‘  అని. ‘ మైనారిటీ మత ప్రజలను సపోర్ట్ చేయడమంటే , వాళ్ళ మతాన్ని కూడా సపోర్ట్ చేయడం అవ్వదా ? ‘ అని. అటు తిరిగి, ఇటు తిరిగి – ఇది చాలా మంది బుర్రల్లోనే, పైగా మార్క్సిజం నమ్మిన వాళ్ళలో కూడా, ఉన్న ప్రశ్న అని చాలా ఆలస్యంగా గమనించాక, ఒక   detailed explanation    ఇచ్చి చర్చిస్తే ,   probably   ఈ చర్చలకు ఒక లంగరు దొరుకుతుందేమోనని ఉద్దేశ్యం తో ఈ వ్యాసం.

వంద ఏళ్లకు పైగా మార్క్సిస్టు చరిత్ర ఉన్న దేశం మనది. అంత అనుభవం ముందు –  ఇది నిజానికి చాలా చిన్న ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే  preliminary question  . ఐతే ఇప్పుడిప్పుడే ప్రగతి వాద రాజకీయాలు నేర్చుకుంటున్న వారికి, సిన్సియర్ కమిట్ మెంట్ ఉండి  progressive dilemma   ఉన్న వాళ్లకు ఈ వ్యాసం ఉపయోగ పడవచ్చని సాధ్యమైనంత సాధారణ భాషలోనే ఇది రాయడం అయినది.

మతం  superstructure  అని మార్క్సిజం చెప్తుంది. ఆర్థిక ప్రాతిపదిక   base   గా ఉండడం వలన , మతం ఇప్పుడున్న ఆర్థిక అసమానతలు కొన సాగినంత కాలం మతం కొన సాగుతుంది అన్నది   dialectical interpretation  . మరి అంత వరకు మతం మాయమయ్యేంత వరకు, మెజారిటీ మత వాదులు మైనారిటీ మతస్తులపైన చూపించే   prejudices   ను   hostility   ని ఎలా ఎదుర్కోవాలి ? ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోదల్చుకోవాల్సిందేమంటే – ఇది    prejudices    ను రూపు మాపే పోరాటం. అణగారిన వరుసల్లో ఉన్న మైనారిటీల సాంస్కృతిక సమస్యను ఎదుర్కోవడం. మైనారిటీ హక్కుల కోసం పోరాడ్డం , లెదా అందుకు సంబంధించి రచనలు చేయడం అంటే ఆయా   prejudices  ను వ్యతిరేకించడం. అంతేకాని  మైనారిటీ హక్కుల కోసం పోరాడ్డం అంటే – మైనారిటీ మతం   Vs  మెజారిటీ మతం అని అర్థం కాదు. అంతే కాక సెక్యులరిస్ట్ ఉద్యమాలు  మత పరమైన యుద్ధాలు కాదు, లేదా కేవలం మత విశ్వాసాల గొప్ప తనానికి సంబంధించిన పోటీ కూడా  కాదు.

మన దేశం లో మైనారిటీ మతస్తులు – ప్రధానంగా కార్మికులు,   unskilled workers , నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళెవరూ అధికారం లో భాగస్తులుగా లేరు. అక్కడక్కడ  tokenism  కనిపిస్తుంది గాని ( సినిమా స్టార్స్, పఠాన్, రాజ వంశస్తులు )  , అత్యధిక పేద వర్గానికి చెందిన వాళ్ళు కూడా వీళ్ళే.  నిజానికి  75 శాతం   death row convicts   ముస్లిములే మరి !   ఇక దళిత క్రిస్టియన్స్ సంగతి తెలియంది కాదు. వీల్లందరు సమస్యలున్నా ఇంకా అంతో ఇంతో మనశ్శాంతిగా, కొంత  జీవితం పట్ల confidence  తో  బతుకుతున్నారు అంటే – దానికి కారణం వారి మత విశ్వాసం. బ్రాహ్మినిజానికి వ్యతిరేకంగా వీరిని , పెట్టుబడి దారీ ఫ్యూడల్ వాదులకు, రాజ్యానికి వ్యతిరేకంగా కూడగట్టాలనుకున్నప్పుడు , నాస్తిక వాదం ను ముందు పెట్టి పోరాటం చేయడం మొదలు పెడితే – ఇక్కడో   friction   అనివార్యం అవుతుంది.  ఐతే   marxism   అన్నది   scientific socialism  ను చెప్తుంది . మతాన్ని నిర్ద్వందంగా  వ్యతిరేకిస్తుంది. అలాంటి సమయం లో – మైనారిటీ మత విశ్వాసాన్ని , తమ నాస్తిక వాదం తో దూషిస్తూ పోతే – శ్రామిక వర్గం లో పాతుకుపోయిన (మూఢ ) విశ్వాసాలను   hurt  చేయడం జరుగుతుంది. అందువలన , వాళ్ళు ప్రగతి వాదం , సెక్యులరిజం వేపు మొగ్గడం పోయి, తిరిగి మత వాద పార్టీల చేతిలో కీలు బొమ్మలై , కుల , వర్గ పాలన చట్రం లోనే ఇరుక్కుపోతారు. మరెలా ? వీరి సంస్కృతిని , వీరిని విస్మరించాలా ?   Communal violence   తో పాటు, వారిని ఆర్థికంగా, సాంఘిక, సాంస్కృతికంగా  అణగదొక్కే పరిస్థితి తో ఇలా గడపవలసిందేనా ?

ఇంతకు ముందు మనం అనుకున్నట్టు – మైనారిటీ హక్కుల పోరాటం –  institutional and individual prejudices   కు వ్యతిరేకంగా జరిగే పోరాటం. అంతే కాని మత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదు. మరి మత విశ్వాసాలను అలాగే అంగీకరించి మిన్నకుండి పోవాలా ? అందుకే   dialectics   చూస్తే క్లియర్ గా , వర్గ పోరాటాలను ( సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలు కూడా భాగమే ) ఉధృతం చేసి ఆ క్రమం లో, మైనారిటీలను కూడా గట్టుకోవాలి తప్ప వారి విశ్వాసాల పై పోరాటాన్ని   prioritise   చేస్తే, మొత్తంగా వర్గ పోరాటాన్ని పక్కకు పట్టించాల్సి వస్తుంది అని అర్థమౌతుంది.

రష్యా అనుభవం చూస్తే – లెనిన్ అధికారం లో వచ్చిన వెంటనే మతం వ్యక్తిగత వ్యవహారం అందుకు ఎటువంటి    state support   ఉండదు అని ప్రకటించాడు. అంతే కాక ఆయా వ్యక్తిగత విశ్వాసాలను ప్రకటించుకోడానికి పూర్తి స్వేచ్చ ఉందని కూడా ప్రకటించాడు. ఇది ఇక్కడ   paradox  . శ్రామిక వర్గ ప్రగతి నిరోధకమైన మత విశ్వాసాల ప్రచారం కొనసాగించడం దేనికి ? ( కేంద్రీయ) నియంతృత్వ విధానాన్ని అనుసరించి ఒకే వేటులో దీనిని ఎందుకు తొక్కేయలేదు ?  ఇంకొక అడుగు ముందుకేసి – పార్టీలో ఏ వ్యక్తిగత విశ్వాసం ఉన్న వారైనా చేరవచ్చు ఐతే వాళ్ళు పార్టీలో ఉన్న   collective opinion  కు కట్టుబడి ఉండాలి అనే విధానం ప్రకటించాడు. ఇంకా పరిశీలిస్తే – చర్చ్ ఫాదర్స్ ను కూడా సోషలిస్ట్ పార్టీలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఇదంతా చూస్తే – సైంటిఫిక్ సోషలిజం, మతాన్ని మత్తు మందుగా ప్రకటించిన మార్క్సిజం, మతం మీద ఒక   lenient view    తీసుకుందని అనిపిస్తుంది. ఐతే, నిజమైన ప్రజాస్వామిక దృక్పథం తో పరిశీలిస్తే   pluralism   మరియు  multiculturalism  తో సోషలిస్ట్ దృక్పథాని ఎలా ముందు తీసుకెళ్ళాలో లెనిన్ ఒక అద్భుత ఉదాహరణ ముందుంచాడని చెప్పుకోవచ్చు. సోషలిస్ట్ పార్టీ ఇటువంటి  stand   తీసుకోవడం గురించి లెనిన్ మాటల్లోనే గమనించండి.

lenin

(  in his writing – The Attitude of Workers’ Party to Religion )

To draw a hard-and-fastline between the theoretical propaganda of atheism, i. e., the destruction of religious beliefs among certain sections of the proletariat, and the success, the progress and the conditions of the class struggle of these sections, is to reason undialectically, to transform a shifting and relative boundary into an absolute boundary; it is forcibly to disconnect what is indissolubly connected in real life. Let us take an example. The proletariat in a particular region and in a particular industry is divided, let us assume, into an advanced section of fairly class-conscious Social-Democrats, who are of course atheists, and rather backward workers who are still connected with the countryside and with the peasantry, and who believe in God, go to church, or are even under the direct influence of the local priest—who, let us suppose, is organising a Christian labour union. Let us assume furthermore that the economic struggle in this locality has resulted in a strike. It is the duty of a Marxist to place the success of the strike movement above everything else, vigorously to counteract the division of the workers in this struggle into atheists and Christians, vigorously to oppose any such division. Atheist propaganda in such circumstances may be both unnecessary and harmful—not from the philistine fear of scaring away the backward sections, of losing a seat in the elections, and so on, but out of consideration for the real progress of the class struggle, which in the conditions of modern capitalist society will convert Christian workers to Social-Democracy and to atheism a hundred times better than bald atheist propaganda.

So,    ప్రధానంగా ఈ కింది పాయింట్స్ మనం గమనించాలి :

(1) శ్రామిక వర్గాల్లో ఉన్న మత విశ్వాసాలను ధ్వంసం చేయడం అది   undialectical   అవుతుంది . ఇది సమస్యను   relative boundary   నుండి  absolute boundary   కి షిఫ్ట్ చేసి తప్పిదం చేసినట్టౌతుంది ( కింద పేరాల్లో దీని కంప్లీట్ మీనింగ్ దానితో పాటు దీన్ని  అంబేద్కర్ ఎలా డీల్ చేసాడో చూద్దాం )

(2)   Country side   శ్రామికులు తమకున్న విశ్వాసాలతో మనుగడ సాగిస్తూ  ( అంటే మనకు పీర్ల దేవుళ్ళు, బతుకమ్మలు, సమ్మక్క సారక్క లకు మల్లే ) ఏదన్నా ఒక ఆర్థిక పోరాటం చేస్తున్నప్పుడు , వాళ్ళను కూడగట్టుకుని పోరాటాన్ని ముందు తీసుకు పోవాలంటే నాస్తిక వాదాన్ని ఉపయోగించడం   వర్గ పోరాటానికి అనవసరం మరియు హాని కారకం  కూడా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ  ఉద్యమ లక్ష్యం పక్క దారి పట్ట రాదు మరియు ఉద్యమ లక్ష్యమే అన్నిటికన్నా ఉన్నతమైనది కాబట్టి.

(3) ఈ విధంగా చేయడం వలన శ్రామికులు మత విశ్వాసం నుండి   social democracy   లోకి మారడం జరిగి తద్వారా క్రమేపీ నాస్తిక వాదం లోకి మారడం జరుగుతుంది. ఇది ప్రత్యక్ష నాస్తిక వాద  ప్రచారం కన్నా వంద రెట్లు మేలు.

లెనిన్ ఎంత క్లియర్ గా చెప్పాడు ఇందులో ? చెప్పడమే కాక, మతం మన జీవితాల్లో నుండి మాయమవ్వడం కోసం కొన్ని దశాబ్దాల కృషి కావాలని తెలిసాక,  మైనారిటీ మత విశ్వాసాలను అధికార వర్గ భావజాలమైన  majoritarianism  కు వ్యతిరేకంగా  organise  చేసి శ్రామిక వర్గాన్ని కూడగట్టమని చెబుతున్నాడు. అంతే కాక, ఈ మైనారిటీ విశ్వాసాలను పని గట్టుకుని దెబ్బ తీస్తూ ప్రవర్తిస్తే , ఈ వర్గాలు మరింతగా కుంచించుకుపోయి మరింతగా  rigid   అయిపోయి ప్రగతి వాద ఉద్యమాల వేపు ఆకర్షించబడకుండా , తమను మతం గోతిలో పాతి పెట్టే తమ శతృవు గుప్పిట్లోకే వెళ్ళిపోతారు. ఇదే అదను తీసుకుని అధికార వర్గం ( బ్రాహ్మిణిజం) , ఈ ఉద్యమాలను తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది అని స్పష్టంగా తెలియ జేసాడు. ఆపై ఏంగెల్స్ ఏ మతాన్ని అయినా పిడివాదం తో గుడ్డిగా వ్యతిరేకించడం గురించి ఏమన్నాడో చూడండి ” మతం పై ప్రత్యక్ష యుద్ధం చేయడం మూర్ఖత్వం. అటువంటి యుద్ధం మతాన్ని పునరుద్ధరిస్తుంది తప్ప ఫలితం ఉండదు.  నిజానికి ఈ యుద్ధం మతాన్ని మరణించకుండా నిరోధిస్తుంది తప్ప ఎటువంటి దోహదం చేయలేదు   ”

పైన చెప్పిన  relative boundary  మరియు   absolute boundary   అన్నవి చాలా  important concepts . అసలు దేవుడే లేదు అన్నది  absolute boundary .   ‘ దేవుడున్నాడా లేదు అన్నది ప్రధానం కాదు ప్రస్తుతానికి, ఆయా వర్గాల ప్రజలను ప్రజాస్వామికంగా కూడగడుతున్నామా లేదా ‘ అన్నది  relative boundary .  సమస్యను  absolute boundary   కి  షిఫ్ట్ చేసే మార్క్సిస్టులను లెనిన్   Anarchists  గా వర్ణించాడు ( మన యాంత్రిక పిడివాద ఇండియన్ మార్క్సిస్టులు చేస్తున్నదిదే. శ్రామిక వర్గ పక్షపాతం ఉండాల్సిన వాళ్ళకు మైనారిటీ పక్షపాతం ఎందుకుండదో అర్థమవ్వదు. ) . ( మరి ఇదే  anarchist  ల   analogy  ప్రకారం చూస్తే Uniform Civil Code  ను సమర్థించే బ్రాహ్మణియ వాదులు కరెక్ట్ అయిపోవాలన్న మాట )

అంబేద్కర్ , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా నాస్తిక వాదాన్ని ప్రోత్సాహించకుండా , బుద్దిజం ను ఎందుకు పుచ్చుకున్నట్టు ? అంబేద్కర్ ఎప్పుడూ దేవుడిని నమ్మ లేదు . తన దృష్టిలో మతం అంటే ”  no god, no dieties, no rituals and no customs  ” అని ప్రకటించాడు. అలాంటప్పుడు ఇక అసలు మతం దేనికి ? అంబేద్కర్ బ్రాహ్మిణిజానికి ఒక ప్రత్యమ్నాయ వ్యవస్థను సృష్టించాలనుకున్నాడు ( ఇదే   relative boundary   ) అంటే – సాపేక్ష విలువను ఒకటి సృష్టించి బ్రాహ్మిణిజం ను ఆ విలువతో  పోల్చి బ్రాహ్మిణిజం ఘాతుకాన్ని ఎండగట్టడం. దీనికి బదులు,  rationalism  మరియు  education  హీనంగా ఉన్న కాలం లో,  నాస్తిక వాదం ముందుకు తీసుకుపోయి ఉంటే  ఏం జరిగేది ? శూన్యం లో శతృవు పేరు చెప్పి కరవాలం తిప్పినట్టు ఉండేది. ఎందుకంటే అలా చేస్తే ఏ శతృవు తలలు ఎగరవు. కాని వట్టి కరవాలం మాత్రం తెగ వేగంగా కదుల్తూ ఉంటుంది !

ఒక బైబిల్ పిట్ట కథ ఒక ఉదాహరణగా చెప్తాను ఇక్కడ ( దయ చేసి ఇదో ఉదహరణగా మాత్రమే పరిగణించమని మనవి ).  యేసు క్రీస్తు ఒక వ్యక్తికి పట్టిన దెయ్యాన్ని( సాతాను) వదల గొట్టి ‘ అక్కడున్న పందులలోకి వెళ్ళిపో ‘ అని దెయ్యాన్ని ఆదేశిస్తాడు.  అప్పుడు ఆ దెయ్యము  అక్కడున్న పందుల లోకి వెళ్ళిన వెంటనే, ఆ పందులు అడ్డగోలుగా పరిగెట్టి దగ్గరున్న సముద్రం లో పడి చనిపోతాయి. ఇక్కడ చూడాల్సిందేమంటే – ఏం దెయ్యాన్ని ఉత్తిగా వెళ్ళిపొమ్మని చెప్పొచ్చుగా అని ? ఐతే దానికి ఆయనిచ్చిన వివరణ ” ఆ దెయ్యం ఎటువంటి వైపరీత్యాన్ని కలుగ జేస్తుందో , ఎటువంటి ఘాతుకానికి పూనుకుంటుందో , అది వెళ్ళిపోవడం వలన ఎంత మేలు జరిగిందో ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించాలి కాబట్టి “. ఇదో పిట్ట కథ అంతే. శూన్యం లోకి దెయ్యాన్ని వదలగొట్టడం అంటే – నాస్తిక వాదం తో మైనారిటి మత విశ్వాసాలను దెబ్బ తీయడం. పందుల్లోకి పంపి దెయ్యాన్ని నాశనం చేయడం అంటే – ఒక  relative bench mark   సృష్టించి  systematic  గా దెయ్యాన్ని  expose  చేసి, దెయ్యాన్ని తరిమి వేయడం. అంటే దెయ్యం వైపరీత్యాన్ని ప్రజాస్వామికంగా నిరూపిస్తూ ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఉద్యమ లక్ష్యం కోసం కూడా గట్టుకోవడం అన్న మాట.

కాబట్టి, సెక్యులరిజాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన ఎంతో అవసరమున్న ఈ కాలం లో, మతమనే దెయ్యాన్ని నాస్తిక వాదం తో మాత్రమే కాక, ప్రజాస్వామిక పోరాటాల్లో మైనారిటీ మత విశ్వాసాలను , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా కూడ గట్టి ఆయా పోరాట క్రమం లో మతం అనే దెయ్యాన్ని వదల గొట్టాలి. ఎందుకంటే మనకు మైనారిటీ మత విశ్వాసానికి మించిన సమస్య కంటే , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా సాంస్కృతికంగా , సాహితీ పరంగా కూడా గట్టడమే ప్రధాన లక్ష్యం కాబట్టి. అందునా అసహనం ఒక సిద్ధాంతంగా , ఒక తాత్వికతతో బల పడుతున్న ఈ రోజుల్లో – మెజారిటీ మత వాద బ్రాహ్మిణిజాన్ని ఓడించడం ప్రధాన లక్ష్యం కావాలి కాబట్టి.  ఈ క్రమం లో – మైనారిటిలను ప్రజాస్వామిక ఆలోచన విధానం వేపు, సెక్యులరిస్ట్ జీవన విధానం వేపు కూడగట్టుకుంటే , వారి మత విశ్వాసాలు క్రమేపీ నాస్తిక రూపం లోకి మారకుండా ఉండే   option  ఇంకా ఏం మిగిలుంటుంది ? ఉత్తి నాస్తిక వాదానికి ప్రజలను కూడగట్టే దమ్ముంటే , మనకు ఇక ఏ ప్రగతి వాద సిద్ధాంతాలైనా అవసరం ఎందుకు ఉండేది ?   లెనిన్, అంబేద్కర్ లు చూపిన మార్గాన్ని మించి, ఇంతకంటే ఉన్నతంగా ప్రజాస్వామిక బద్దంగా మతాన్ని కూలగొట్టడం ఎలా సాధ్య పడుతుంది ?

*

మీ మాటలు

  1. భాస్కరం కల్లూరి says:

    “ఉత్తి నాస్తిక వాదానికి ప్రజలను కూడగట్టే దమ్ముంటే , మనకు ఇక ఏ ప్రగతి వాద సిద్ధాంతాలైనా అవసరం ఎందుకు ఉండేది ? లెనిన్, అంబేద్కర్ లు చూపిన మార్గాన్ని మించి, ఇంతకంటే ఉన్నతంగా ప్రజాస్వామిక బద్దంగా మతాన్ని కూలగొట్టడం ఎలా సాధ్య పడుతుంది ?”
    ఆసక్తికరమైన చర్చను లేవదీశారు. ఫస్ట్ రీడింగ్ లో నాకు అర్థమైన మేరకు హడావుడిగా స్పందిస్తున్నాను. వ్యాసాన్ని అవగాహన చేసుకోవడంలో ఎక్కడైనా నా లోపం కనిపించి, రచయిత దానిని సహేతుకంగా ఎత్తిచూపితే సవరించుకోడానికి సిద్ధమే. ఇలాంటి చర్చలను బహిరంగ సంభాషణగా తీసుకుంటే ఎవరూ ఉద్రేకాలకూ, భేషజాలకూ పోనవసరం లేదు.
    1. మతాన్ని ప్రైవేట్ విషయంగా పరిగణించడం అన్న లెనిన్ చేసిందే భారత రాజ్యాంగం కూడా చేయలేదంటారా? మన రాజ్యాంగాన్నే మతగ్రంథంగా పరిగణించి లౌకికవాదాన్ని ఒక మతంగా(మామూలు మతాలను అంటిపెట్టుకుని ఉండే కొన్ని నెగిటివ్ లక్షణాలతో కాదు) అభివృద్ధి చేయాల్సిన అవసరం ఈరోజున ఉంది. ప్రైవేట్ గా ఎవరి మతవిశ్వాసాలను వారు పాటించుకోవచ్చు. నాస్తికత్వాన్నీ ప్రచారం చేసుకోవచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం రాజకీయ సహా అన్ని వ్యవస్థలూ పూర్తిగా లౌకికంగాగానే వ్యవహరించాలి.
    2. అంబేడ్కర్ బౌద్ధం వైపు మళ్లడానికి కారణం మీరు చెప్పినదేనా అన్నది పరిశీలించాలి. అది హిందూ వ్యతిరేక భావోద్వేగ చర్య తప్ప నిర్మాణాత్మక చర్య కాదేమో అనిపిస్తుంది. ఒక కచ్చితమైన దార్శనికతతో నిర్మాణాత్మక చర్యగా దానిని ఆయన చేపట్టి ఉంటే, ఈపాటికి బౌద్ధం దేశంలో ఒక పోటీ మతంగా వ్యాపించి ఉండేది, కానీ అలా జరగలేదు. దానికి బదులు అంబేడ్కర్ లౌకికవాదాన్నే ఒక మతంగా నొక్కి చెప్పి ఉంటే బాగుండేదా?
    3. బ్రాహ్మినిజం మొత్తాన్ని ఒక రాశిగానూ, ముస్లిం, క్రైస్తవం లాంటి మైనారిటీ మతాలను దానికి ప్రతిద్వంద్వి గానూ మీరు చూస్తున్నట్టు అనిపించింది. అయితే, బ్రాహ్మినిజం అనేది ఏకరాశి కాదు. అందులో మళ్ళీ కుల, వర్ణపరమైన చీలికలు, ఆరాధనా రూపాలు, విధానాలలో తేడాలు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవుల్లా సంఖ్యాపరంగా కాక; సంస్కృతి, భావజాలపరమైన మైనారిటీలు ఉన్నారు. అంటే అల్పసంఖ్యాకుల సంస్కృతి, భావజాలమూ మెజారిటీ సంస్కృతి, భావజాలంగా పరిణమించి అధికసంఖ్యాకుల సంస్కృతిని, భావజాలాన్ని మైనారిటీగా మార్చడం అన్నమాట. ఇందులోనే ఇంకొకటి కూడా జరుగుతోంది. ఈ సంస్కృతి, భావజాలపరమైన మైనారిటీలు నిరంతరం మెజారిటీ సంస్కృతి, భావజాలాల వైపు ఊర్ధ్వచలనం సాగించడం ఉంది. బ్రాహ్మినిజం విజయరహస్యం అదే. అది ఆ ఊర్ధ్వచలనంతో సమాధానపడుతూ, రాజకీయ అధికారాన్ని నిమ్న శ్రేణులకు విడిచిపెడుతూనే తన పట్టును, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇది ఈ దేశంలో వందల సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. బీసీగా చెప్పబడే నరేంద్ర మోడీయే ఉదాహరణ. ఆయన బ్రాహ్మినిజాన్ని, సాధు సంతులను గౌరవిస్తూ ఉన్నంతకాలం ఆయన ప్రధాని వంటి అత్యున్నత అధికారంలో ఉండడానికి బ్రాహ్మినిజానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఈ దేశంలో చిరకాలంగా చేసుకుంటూ వస్తున్న సర్దుబాటు. కనుక ఈ నిరంతర ఊర్ధ్వచలన ప్రక్రియ దృష్ట్యా బ్రాహ్మినిజమ్ పరిధిలో పోటీ మతాలు అడుగుపెట్టే అవకాశం కానీ, అడుగుపెట్టినా బౌద్ధ, జైనాలలా మనగలిగే అవకాశం కానీ తక్కువ. ఇలా చూసినప్పుడు మతానికి మతమే పోటీ అన్న మీ వాదం ఎంతవరకు ప్రయోజనకరమో? లౌకికవాదాన్ని మతంగా అభివృద్ధి చేయడమే బహుశా దీనికి ఏకైక పరిష్కారం.
    4. నాస్తికవాదం వైఫల్యానికి మీరు చెప్పిన కారణంతో కొంతవరకు ఏకీభవిస్తాను. ఎంత కాదన్నావిశ్వాసం మనిషి అస్తిత్వంలో భాగం. నాస్తికత్వం దానిని గుర్తించి కొంచెమైనా దానికి సందు వదలకుండా మొరటుగా దాడి చేయడం వల్లనే అది విజయవంతం కాలేకపోయింది.

    • p v vijay kumar says:

      మీ సందేహాలకు నా సాధ్యమైనంత మేరకు సమాధానం ఇస్తాను

      (1) మన రాజ్యాంగం మతాన్ని వ్యక్తిగత స్వేచ్ఛగ పరిగానిస్తుంది. సందేహం లేదు. అంబేద్కర్ చెప్పినట్టు proclamation of rights ఒకటే సరిపోదు. Executive and legislative bodies కూడా ఆ spirit తో ఉండాలి. సో, verbal support మాత్రమే మనం ప్రభుత్వం నుండి చూస్తాము. Therefore, actually brahminical state inplicitly institutionalised the support to majorrity రిలీజియన్

      (2) 1900 ల్లో నాస్తికవాద సెక్యులరిజం repel అవడం తప్ప , బ్రాహ్మిణిజనికి దీటైన ప్రత్యమ్న్యాయాన్ని , మతం ను పరమావధి చేసుకున్న ప్రజలకు ఇవ్వగలిగేది కాదు. మీకు లెనిన్ ప్రతిపాదించిన absolute boundary, relative boundary concepts గురించి ఇంకాస్త ఆలోచిస్తే మీ disconnect resolve అవుతుంది అనుకుంటున్నా

      (3) మతానికి మతం సమాధానం కాడు. మతానికి నాస్తికవాదం తో కూడిన లౌకికత్వం కూడా సమాధానం కాదు. మతానికి సెక్యులర్ ప్రజాస్వామిక రచనలుఁ , ఉద్యమాలు సమాధానం . మైనారిటీ సంస్కృతిని గౌరవిస్తూ ప్రజాస్వామిక వాదాన్ని ముందుకు తీసుకెళ్లడం సమాధానం.

      (4) i agree wit ur observation on Atheism

      • భాస్కరం కల్లూరి says:

        1 అవును. రాజ్యాంగం హక్కులిస్తే సరిపోదు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడీషియరీలలో ఆ స్పిరిట్ కూడా ఉండాలి. ఆ స్పిరిట్ కోసం నిరంతరం ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. సెక్యులర్ ప్రజాస్వామిక రచనలు, ఉద్యమాలు అందుకు కూడా అవసరమే. మన దేశంలో సెక్యులర్, ప్రజాస్వామిక వ్యవస్థలు బలంగా లేవు. ఎన్నికల్లో మతాన్ని విశృంఖలంగా వాడుకోడాన్ని ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. అయితే, ఈ స్పిరిట్ సమస్య ఏ వ్యవస్థలోనైనా ఉంటుంది. మతం ప్రైవేట్ అని లెనిన్ చెప్పిందాన్నే మన రాజ్యాంగం కూడా ప్రతిబింబించింది. “… actually brahminical state inplicitly institutionalised the support to majorrity రిలీజియన్” అన్నప్పుడు రాజ్యాంగం దారుణంగా విఫలమైందని అర్థం. ఇది చాలా తీవ్రమైన విషయం.
        2 లౌకికవాదులందరూ నాస్తికులు కానవసరంలేదని మనకు తెలుసు. మతాన్ని, విశ్వాసాన్ని వ్యక్తిగతం చేసి, ప్రజాక్షేత్రంలో మతాతీతంగా, లేదా మతనిరపేక్షంగా వ్యవహరించడమే లౌకికవాదం. ఇందులో ‘సూడో సెక్యులరిజం’ అంటూ కొంతమంది లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు. మన నిత్యజీవితంలో పని ప్రదేశాలలో, ప్రయాణాలలో, జాతీయ పండగలలో, సైన్యంలో ఇంకా అనేక రంగాలలో మనలో చాలామందిమి అప్రయత్నంగానే ఈ లౌకికతత్వాన్ని పాటిస్తున్నాం. లెనిన్ ప్రతిపాదించిన absolute boundary, relative boundary concepts కు, స్థూలంగా మనదేశంలో ఇప్పుడు అమలు జరుగుతున్నదానికీ నాకు తేడా ఏమీ కనిపించడంలేదు.
        3 మతాన్ని పరమావధి చేసుకున్న ప్రజలకు ‘నాస్తికవాద సెక్యులరిజం’ బ్రాహ్మినిజానికి దీటైన ప్రత్యామ్నాయం ఇవ్వలేదన్నారు. “మతమనే దెయ్యాన్ని నాస్తిక వాదం తో మాత్రమే కాక, ప్రజాస్వామిక పోరాటాల్లో మైనారిటీ మత విశ్వాసాలను , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా కూడ గట్టి ఆయా పోరాట క్రమం లో మతం అనే దెయ్యాన్ని వదల గొట్టాలి. ఎందుకంటే మనకు మైనారిటీ మత విశ్వాసానికి మించిన సమస్య కంటే , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా సాంస్కృతికంగా , సాహితీ పరంగా కూడా గట్టడమే ప్రధాన లక్ష్యం కాబట్టి” అని వ్యాసంలో అన్నారు. బ్రాహ్మినిజానికి దీటైన ప్రత్యామ్నాయాన్ని ఎవరితో నిర్మిస్తారన్నది స్పష్టం కావాలి. ‘మైనారిటీ మత విశ్వాసాలను బ్రాహ్మినిజానికి వ్యతిరేకంగా కూడగట్టా’ లనడంలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను మాత్రమే ఉద్దేశిస్తున్నారా? అలాంటప్పుడు బ్రాహ్మినిజమ్ పరిధిలో ఉన్న దాదాపు 80 శాతం జనాభాకు, మిగిలిన 20 శాతం జనాభాకు మధ్య పోరాటం అసమపోరాటం అవుతుంది. లేదా, బ్రాహ్మినిజమ్ లోనే ఉన్న; సాంస్కృతిక, భావజాల, మత పరమైన మైనారిటీలైన పీడిత కులాలను కూడా అందులో కలిపి చెబుతున్నారా? అదే మీ ఉద్దేశమైతే నేను ఇంతకుముందు పేర్కొన్న ఊర్ధ్వచలన సూత్రం అడ్డువస్తుంది. అలాగే, మీ వాదంలో నాకు ఇంకొక వైరుధ్యం కూడా కనిపించింది. నాస్తికవాదం మతాన్ని నిర్వీర్యం చేయడంలో విఫలమైందని అంటూనే, మతమనే దెయ్యాన్ని వదలగొట్టాలంటున్నారు. అది మతవిశ్వాసులను బెదరగొట్టి నాస్తికవాదం ఇచ్చిన ఫలితాన్నే ఇస్తుంది.
        4 లౌకికవాద వ్యవస్థలో ప్రజాస్వామిక పోరాటాలు శత్రుపూరిత పోరాటాలు కానవసరం లేదు. మతమూ, విశ్వాసమూ, సంస్కృతీ వ్యక్తిగతమై, ప్రజాక్షేత్రం పూర్తిగా లౌకికం అయినప్పుడు అది అందరూ కలసి పనిచేయగలిగిన ఉమ్మడి వేదిక అవుతుంది. ఆ వేదిక బలోపేతం అవుతున్నకొద్దీ పూర్తిగా వ్యక్తిగతం అవుతున్న మతం, విశ్వాసం ఆయా వ్యక్తుల విచక్షణను బట్టి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ప్రజాక్షేత్రాన్ని కమ్మేసి దానిని అతలాకుతలం చేసే శక్తి దానికి క్షీణించిపోతుంది. ప్రజాస్వామిక లౌకిక వ్యవస్థలో మనం దేనినీ పనిగట్టుకుని అంతమొందించాల్సిన అవసరంలేదు. భిన్న మతాలు, కులాలు, తెగలు, భాషలు ఉమ్మడిగా కలిసి పనిచేయగలిగిన వేదికలను బలోపేతం చేసుకుంటూ వెడితే చాలు, అక్కర్లేనివి సహజమరణం చెందుతూ పోతాయి. ఆ ఉమ్మడి వేదికను బలోపేతం చేసే దిశగా రచనలు, ఉద్యమాలు జరుగుతూనే ఉండాలి.

    • suvarchala chintalacheruvu achyutuni says:

      భాస్కరం గారూ! మీరు తెలియచేసిన విధానం బాగుంది.

  2. విక్టర్ విజయ కుమార్ గారు మైనారిటీ మత విశ్వాసాలను బ్రాహ్మణిజం కు వ్యతిరేకంగా కూడగట్టి పోరాటం చేసి బ్రాహ్మణిజాన్ని ఓడించాలంటున్నారు .
    ఆలా చేసినందువల్ల ప్రజల మధ్య విద్వేషాలు పెరగడం మినహా జరిగేదేముండదు . ఆర్థిక అసమానతలు పోయినప్పుడే కులాలు , మతాలు అంతరిస్తాయి. అందుకు ప్రజా పోరాటాలు జరగాలి !

    • p v vijay kumar says:

      మీ ఆందోళన అర్థమౌతుంది. హిందుత్వం ప్రపంచం లో ఎక్కడున్నా దాని హ్రదఎమైనా బ్రహ్మణీయట గర్హనీయమయినది. ఐతే ఇదే వ్యాసం పా కిస్తాన్ లో రాయాల్సి వచ్చొన్దనుకోండి. ఖఛ్చితంగా మెజారిటీ మతానికి వ్యతిరేకంగా హిందూ మయినరిటీలను కూడగట్టాల్సి వచ్ఛేది. ఆ విషయం అంబేద్కర్ పాకిస్తాన్ మీద రాసిన తన అభిప్రాయం లో చెప్పాడు . మె జరిటే రియనిజం మరో రూపం బ్రాహ్మిణిజం ఇక్కడ. అడుగువర్గాల సాంస్కృతిక భావజాలం మీద పనిగట్టుకుని దాడి చేస్తే , వర్గ పోరాట కుల నిర్ములన పోరాట లక్ష్యాలు సాధించలేరు.

  3. లెనిన్ భిన్న మతాలవారిని కూడగట్టుకొని [ వారి నమ్మకాల్ని ప్రశ్నించకుండా ] పోరాటాలు చేయమన్నాడు.
    ఏంగెల్స్ మతం పై ప్రత్యక్ష యుధ్ధం చేయడంవల్ల మతాన్ని పునరుధ్ధరిస్తుంది తప్ప ఫలితం వుండదన్నాడు.
    మీరేమో ముందుగా మతనమ్మకాలపై పోరాటం జరగాలంటున్నారు.ఇలా చేయడం వల్ల ప్రజలలో అనైక్యత పెరిగి పోరాటాలకు కలిసిరావడం జరగదని నా అభిప్రాయం. అందువల్ల పరిస్థితిలో మార్పు వుండక పోవచ్చుగదా !

  4. bhaskaram garoo,
    your clarity of thought is pretty remarkable.
    It made me think in the right direction.Thanks sir.

    • భాస్కరం కల్లూరి says:

      అవునా? చాలా థాంక్స్ మోహన్ గారూ…అలాగే ఈ చర్చకు అవకాశమిచ్చిన విజయకుమార్ గారికి కూడా.

  5. వృద్ధుల కల్యాణ రామారావు says:

    విక్టర్ విజయ కుమార్ గారూ, మెజారిటీ మతంలోని 80శాతం పేద వర్గాలను కూడా brahminism కరుడు కట్టుకొని ఉన్న వర్గాలుగా భావించి, వారిపై కూడా పోరాడి, మైనారిటీ మతస్తులను వారికికూడా శత్రువులుగా చేసి మార్క్సిస్ట్ వ్యవస్థను స్థాపించడం సాధ్యమా? మీకు మార్క్సిజంపై అభిమానం కంటే బ్రాహ్మణులపై వ్యతిరేకత ముఖ్యంలా ఉంది. కారణాలు సులువుగానే ఊహించవచ్చు. కల్లూరి భాస్కరం, జయప్రకాష్ రాజు గార్లతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    • p v vijay kumar says:

      ఈ వ్యాసం – మైనారిటీ సంస్కృతిని, వారి మాట విశ్వాసాలను ఖండించడం ద్వారా మాత్రం , వర్గ కుల పోరాటాలు సాధ్య పడదు అనిచెప్తుంది. ప్రధానంగా యాంత్రిక మార్క్సిస్ట్ వాదనను వ్యతిరేకిస్తుంది.
      ఇక బ్రాహ్మనీ య వ్యతితేకత గురించి చెప్పాలంటే , నిజానికి బ్రహ్మణీయత మయినరీటీ ని శత్రువు గ చూస్తోంది. కొత్తగ దూరమవ్వడం లేదు. ఆవు ను గౌరవిచ్చే విధానం బ్రహ్మణ్యం తప్ప వేరే ఈ కులం డి కాదు. బ్రహ్మణీయత ఒక ఫిలాసఫీ. అభివృద్ధి నిరోధక ఫిలాసఫీ. మీరు కొంత అధ్యయనం చేసి వస్తే డీ టెయిల్డ్ గ చర్చించవచ్చుఁ.

      • Aranya Krishna says:

        ఒక ధ్యేయంగా మైనారిటీ మతాలే కాదు ఏ మత సెంటిమెంట్ల అదేపనిగా మీదనైనా దాడి చేస్తే వర్గచైతన్యమ్ సాధ్యపడదు. మతాన్ని ఉపరితలామ్శంగా భావించిన లెనిన్ కూడా అదే దృశ్ఠితో మతం జోలికి ఎక్కువ వెళ్ళొద్దన్నాడు. కానీ మీరు అంతర్లీనంగా ఆశిస్తున్న విషయం వేరే వుంది విజయ్ కుమార్ గారూ! మీరు మైనారిటీ మత సెంటిమెంట్లను గౌరవించాలని కూడా డిమాండు చేస్తున్నారు. మైనారిటీ మత సెంటిమెంట్ల ద్వారా మెజారిటీ మత దౌష్ట్యాన్ని ఎదుర్కోవాలని కుడా చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే మీరు మార్క్సిస్టులను నాస్తికులుగా మాత్రమే చూస్తున్నారు. మార్క్సిస్టులు నాస్తిక భావాలతో మాత్రమే మతాన్ని వ్యతిరేకిస్తారని చెబుతున్నారు. “మతం ఒక మత్తు మందు” అన్న గొప్ప వ్యాఖ్య కేవలం నాస్తిక వాద దృక్పధమ్తో చేసింది కాదు. ” ప్రజాస్వామిక పోరాటాల్లో మైనారిటీ మత విశ్వాసాలను , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా కూడ గట్టి ఆయా పోరాట క్రమం లో మతం అనే దెయ్యాన్ని వదల గొట్టాలి. “అన్నవ్యూహం వర్కవుట్ అయ్యేది కాదు.

    • భాస్కరం కల్లూరి says:

      రామారావుగారూ…నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నానన్నారు కనుక ఈ వివరణ ఇవ్వాల్సిన అవసరం కనిపించింది. “మెజారిటీ మతంలోని 80 శాతం పేదవర్గాలు” అన్నారు. ఇక్కడ ‘పేదవర్గాలు’ అనే మాటకన్నా ‘నిమ్న కులాలు’ అనడం సముచితం. బ్రాహ్మినిజం నుంచి మీరు నిమ్నకులాలను విడదీయలేరు. వారు బ్రాహ్మినిజానికి ఫుట్ సోల్జర్లు. ఇందుకు అతి ప్రముఖ ఉదాహరణగా నరేంద్ర మోడీని ప్రస్తావించాను కూడా. కనుక కొత్తగా వారిని మైనారిటీలకు శత్రువులుగా ఎవరూ మార్చనవసరం లేదు. అందుకే బ్రాహ్మినిజమ్ పరిధిలో 80 శాతం జనాభా ఉన్నారని అన్నాను. ఇంతటి బలవత్తరమైన బ్రాహ్మినిజానికి ప్రత్యామ్నాయమతాన్ని అభివృద్ధి చేయడం ఎంతవరకు సాధ్యమన్నదే నా ప్రశ్న. లౌకికవాదాన్నే మతస్థాయిలో బలోపేతం చేయడం ఒక్కటే ప్రత్యామ్నాయమని అనుకుంటున్నాను. “ఆవును గౌరవించే విధానం బ్రహ్మణ్యం తప్ప వేరే ఏ కులం ది కా”దన్న విజయకుమార్ గారి వ్యాఖ్య కూడా బ్రాహ్మినిజమ్ నుంచి నిమ్న కులాలను విడదీస్తున్నట్టు ఉంది. ఆ కులాలు బ్రాహ్మినిజానికి ఫుట్ సోల్జర్లు అయినప్పుడు బ్రాహ్మినిజమ్ తాలూకు అన్నింటికీ వారు కాపలా కాస్తారు.

  6. మంచి చర్చ జరుగుతుంది. మంచి ఇంటలెక్చువల్ వ్యాసం వ్రాసారు విజయకుమార్ గారు. కల్లూరి భాస్కరం గారి ఆలోచనలతో ఏకీభవిస్తాను. హిందూ మతాన్ని బోయీలుగా మోస్తున్నది, పోషిస్తున్నది బహుజనులే. ఈ విషయాన్ని గుళ్ళల్లో, జాతరల్లో స్పష్టంగా గమనించవచ్చు. ఉన్నత, నిమ్న వర్ణాలలో మతాంతీకరణ పట్ల పెద్దగా పట్టింపులు లేకపోయినా, బహుజనులలో మాత్రం {హిందూ}మతం రక్తంలోకి చొచ్చుకుపోయింది అనిపిస్తుంది. బ్రాహ్మనిజాన్ని పోషించేది కూడా ఎక్కువగా ఈ వర్గమే.

    a great discussion with no sarcasm/attacks. wonderful i liked this and makeup my thoughts focussed. thank you all

  7. suvarchala chintalacheruvu achyutuni says:

    విజయ్ కుమార్ గారూ! మొన్నటి వ్యాసంలో మీరు సరిద్దుకుంటాను అన్నారు కదా నా కామెంట్ కి స్పందించి! అందుకే చెప్తున్నాను నేను కూడా. పాత వ్యవస్థ ఇప్పుడు అంతరించిపోయింది. ప్రస్తుతం ముందుకు వెళ్లగలిగే దారి సులువైంది. ఇక శత్రుత్వానికి తావేలేదు. సంస్కృతీపరంగా,భావజాలం పరంగా ఏకమయ్యే వేదికను తయారుచేసే రచనలు చేయండి మీరు. అలా ఏకంకావటానికి బ్రాహ్మణిజానికి నేడు అభ్యంతరాలు లేవు. ఇప్పుడు పూర్వపు సమస్యలతో మైనారిటీలు బాధపడుతూనే ఉండాలనే అనుకోవటమూ లేదు. ఆత్మీయ వాతావరణమే కావల్సింది ఐనప్పుడు, అనవసరపు, అసందర్భపు వాదనలు ముందుకు తీసుకువెళ్లలేదన్నది వాస్తవం! లేదా మతపరమైన విధానాల గురించి చెప్పదలుచుకుంటే బ్రాహ్మణిజం అని వాడకుండా హిందూయిజం అని వాడండి. ఎవరి మత విశ్వాసల్నూ ఎవరూ వదిలిరాలేరు. అయినా కలిసిఉండేందుకు అవసరమయ్యే భావజాలాన్ని అన్ని మతాల మనసుల్లోకి నింపవచ్చు. నాస్తికవాదమంటారా అది ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు. అన్ని మతాలలోనూ ఈ వాదాన్ని అనుసరించేవారున్నారు.

    • Raghavendra says:

      సువర్చల గారూ, శత్రుత్వానికి తావే లేదూ అని మనమెంత ప్రాధేయపడినా వినరు. మృతప్రాయమైన బ్రాహ్మణాధిక్యతకు పనిగట్టుకుని ఊపిరూదుతుంటారు.వీరినమ్మకాలకు పునాది హేతు పరమైన దృక్పధం కాదు.ఒకవర్గంపై అకారణమూ,అనంతమూ ఐన ద్వేషమే. ఆలోచనరాహిత్యమూ,నాయకత్వ లోపమూ ఉన్నవారికి మనుషుల్ని భయపెట్టటానికి ఏదో ఒక పెద్ద బూచి లేకపోతే సాగదు. అందుచేతనే “ముందుహిందువులను ద్వేషించడం నేర్చుకోండి.ఇప్పటికింత జ్ఞానం చాలు. తరువాతెప్పుడో మిగతాఅసలువిషయం చెపుతాము” అనడానికి సంకోచించరు.మతపరమైన ఆగడాలు మాయమైపోతే ముందుగాహతాశులయ్యేది వీరే.

      • suvarchala chintalacheruvu achyutuni says:

        ధన్యవాదాలు రాఘవేంద్ర గారూ! మీరన్నది నిజమే . కానీ..ఎమ్తకాలమీ ధోరణి? ముందు తరాల మనసులు మరింత సంక్లిష్టతకు లోనవవా? అనేదే నా బెంగ.

    • p v vijaykumar says:

      మీకు ‘బ్రా హ్మణ్యానికి ‘ ‘బ్రాహ్మణీయానికి’ తేడా తెలియాలి. బ్రాహ్మణీయం అన్నది ఒక ఫిలాసఫీ. ఇది నేను కాయిమ్ చేసిన వర్డ్ కాదిది. సోషియాలిజిస్టులు కుల వ్యవస్థ ధో రణులను వివరించడానికి వాడుతారు . దీన్ని మొత్తం వివరించాలంటే స్థలాభావం. మరియు non-contextual కూడా. మెయిల్ చేయండి లేదా…ఇంకో వ్యాసం కోసం వేచి చూడవచ్చుఁ.

  8. వృద్ధుల కల్యాణ రామారావు says:

    పి వి విజయకుమార్ రాసిన, కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యాసం ఉన్నా, కల్లూరి భాస్కరం గారు, ఆరణ్య కృష్ణ గారి వాళ్ళ చక్కని కామెంట్లు కూడా ఉండడం వాళ్ళ మొత్తం మీద చదవడానికి చాలా ఇంట్రస్ట్ గా వుంది.

    • p v vijay kumar says:

      సర్! నమస్తేనండి !….:)…..బ్రాహ్మిణిజం బిహేవియర్ ఎలా ఉంటుందో కష్టపడి ఉదాహరించే ప్రయత్నం నే చేసే లోపు …. మనుష్యులను , ఏదో ఒక ప్రాతిపదికన విడదీసి, మనుగడ సాగించే తత్వం బ్రాహ్మిణిజం కు ఉంటుందని ప్రాక్టికల్ గా చూపారు . ధన్య వాదాలు !

  9. Nageswara Rao says:

    భాస్కరం గారి ఆలోచనలు చాలా చక్కని చర్చకు తెర తీసాయి. ఒక మంచి ధోరణికి ఈ వ్యాసం నాంది పలికే దిశగా ఉంది. (తమ ఆలోచనలను సమర్థించని వారిపై విషం కక్కే వేరే వ్యాసాలలా-వాటి జవాబుల్లా కాకుండా!) విజయకుమార్ గారికి అలాగే భాస్కరం గారికి ధన్యవాదాలు– వారి శైలి చాలా చక్కగా చర్చావిషయం పై వెలుగు ప్రసరించింది.
    నేను కూడా భాస్కరం గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. (ఈ సంస్కృతి, భావజాలపరమైన మైనారిటీలు నిరంతరం మెజారిటీ సంస్కృతి, భావజాలాల వైపు ఊర్ధ్వచలనం సాగించడం ఉంది. బ్రాహ్మినిజం విజయరహస్యం అదే. అది ఆ ఊర్ధ్వచలనంతో సమాధానపడుతూ, రాజకీయ అధికారాన్ని నిమ్న శ్రేణులకు విడిచిపెడుతూనే తన పట్టును, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇది ఈ దేశంలో వందల సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ.)
    నా అనుభవం –
    నాకు తెలిసిన ఒక బ్రాహ్మణ స్నేహితుడు వ్యసనాలకు గురయితే ఊళ్ళోని బ్రాహ్మణెతరుల కులస్తులు ఏవగించుకుని “సమాజానికి నువ్వేదో ఆదర్శంగా ఉంటావని నిన్ను మేమంతా నెత్తిన పెట్టుకుని చూసుకుంటూ ఉంటే నువ్విలా తయారయ్యావా! అని నాలుగు తగిలించడం” చూసాను. ఈ ఉదాహరణలో బ్రాహ్మినిజాన్ని నిజంగా ఎవరు మోస్తున్నారో – ఎవరివలన హిందూ మతం ఉన్నదో ప్రత్యక్షంగా నాకు అర్థమయింది. ఆధ్యాత్మిక రంగానికి బ్రాహ్మణుడు పనికిరాడని నిజంగా బ్రాహ్మణెతర సమాజం భావిస్తే అది క్రమంగా బ్రాహ్మణీయపు అడుగుజాడల్లో నడిచే ఇతర కులస్తులను సైతం ప్రోత్సహించుతుందని కూడా నెమ్మదిగా అర్థమైంది! గత 10-15 ఏళ్లలో ఆధ్యాత్మిక రంగంలో- జ్యోతిష ప్రవచనాది విషయాలలో స్వాములు – బాబాలు- మఠ నిర్వహణల వంటి విషయాలలో మార్పును స్పష్టంగా గమనించుతో భాస్కరం గారు చెప్పిన విషయాన్ని చదివితే విషయం ఇంకా సులువవుతుంది.

  10. వృద్ధుల కల్యాణ రామారావు says:

    పి వి విజయ కుమార్ గారు నా వ్యాఖ్యను బ్రాహ్మిణీయం కు ఉదాహరణ గా అభివర్ణించేరు. సత్యం పలకడం కూడా బ్రాహ్మీణీయం లో భాగం గానే నేను భావిస్తాను. నా ఇంతకుముందు వ్యాఖ్యకు నేను కట్టుబడి ఉన్నాను. భాస్కరం గారూ, అరణ్యకృష్ణ గారూ చాలా బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేసేరు. విజయకుమార్ గారి వ్యాసం చాలా ప్రమాదకరమైనది. భూస్వాములకు, పెట్టుబడిదారులకు విజయకుమార్ లాంటి మేథావులంటే చాలా ఇష్టంగా వుంటుంది. పీడితులకి పీడకులు ఎవరో స్పష్టంగా తెలియనంత కాలం పీడకులు, పీడకవ్యవస్థ చాలా చాలా క్షేమంగా ఉంటుంది. పీడితులకి అసలు శత్రువులు గురించి స్పష్టత వస్తే ఆ వ్యవస్థా, వ్యక్తులూ కూడ ప్రమాదంలో పడతారు. రావిశాస్త్రి గారి ‘ పిపీలకం’ కథలో చీమ కి వచ్చినంత స్పష్టత పీడితులకు వచ్చినపుడు సమాజం లో అసలు సిసలైన మార్పులు మొదలవుతాయి. ఆలా స్పష్టత రాకుండా బ్రాహ్మిణీయం మీద వ్యతిరేకత కాపాడుతుంది. పీడక వ్యవస్థ కు విజయకుమార్ లాంటి మేధావులు నచ్చినంతగా, భాస్కరం గారో, అరణ్యకృష్ణ గారొ నచ్చరు.

Leave a Reply to Nageswara Rao Cancel reply

*